madhura
-
రూ. 60 లక్షల ప్లాట్‌కు రూ.30 కోట్ల బిడ్!
ఉత్తర ప్రదేశ్‌లోని మధుర నగరంలో ప్లాట్ల వేలంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మధుర బృందావన్ డెవలప్మెంట్ అథారిటీ (MVDA) నిర్వహించిన రెసిడెన్షియల్ ప్లాట్ల ఆన్లైన్ వేలంలో బేస్ ధరలను మించి భారీ మొత్తానికి బిడ్ రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.గురువారం ప్రారంభమైన వేలంలో మొత్తం ఎనిమిది ప్లాట్లు బిడ్డింగ్‌కు వచ్చాయి. వాటిలో బృందావన్‌లోని రుక్మణి విహార్‌లో ఉన్న 300 చదరపు గజాల స్థలం అసలు ధర రూ. 60 లక్షలు. అయితే, ఈ-వేలంలో బిడ్లు అనూహ్యంగా పెరిగాయి. ఆశ్చర్యపరిచే విధంగా ఈ ప్లాటు రూ.30 కోట్లు పలికింది.వేలం ముగింపును పరిశీలించగా రూ. 60 లక్షల విలువైన ప్లాట్‌కు రూ. 30 కోట్లతో పాటు, మరో 288 చదరపు మీటర్ల ప్లాట్ రూ. 19.11 కోట్లు పలికింది. ఈ అసారణ బిడ్లు ఎంవీడీఏ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బిడ్డింగ్‌లు ఎవరు వేశారు.. ఎంత పెద్ద మొత్తంలో బిడ్ వేయడానికి కారణాలేంటి అనే వివరాలను ఆరా తీస్తున్నారు అధికారులు. సహేతుకమైన స్థాయిలకు మించి ధరలను పెంచడం ద్వారా నిజమైన కొనుగోలుదారులను ప్లాట్లను కొనుగోలు చేయకుండా వేలం ప్రక్రియకు అంతరాయం కలిగించడానికి ఈ అధిక బిడ్లను వేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. -
ఎన్నికల సిత్రాలు : మండుటెండలో హేమమాలిని జోరు
ప్రముఖ నటి బీజేపీ ఎంపీ హేమమాలిని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మథురలో ఎన్నికల ప్రచారంలో రైతులను కలిసిన హేమమాలిని గోధుమ పొలంలో గడ్డికోసి సందడి చేశారు. పొలాల్లో పని చేసే మహిళలతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఈ పదేళ్లుగా తాను క్రమం తప్పకుండా కలుస్తున్న రైతులతో మరోసారి మమేకమయ్యేందుకు వారిని కలిసానని, వారి మధ్యలో ఉండటం వారికి కూడా సంతోషాన్నిచ్చిందని, రైతు మహిళలతో కలిసి ఫోటోలకు పోజులివ్వాలని పట్టుబట్టారంటూ ఆమె రాసుకొచ్చింది. మథుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ వరుసగా మూడోసారి హేమమాలిని బరిలోకి దిగింది. 1991 నుండి 1999 వరకు, మధుర నాలుగు సార్లు బీజేపీకి కంచుకోటగా ఉంది. అయితే 2004లో మధుర కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 2009లో ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి మధుర నుంచి ఎంపీ అయ్యారు. ఇక ఆ తరువాత 2014లో హేమమాలినిని బీజేపీ రంగంలోకి దించింది. 2019 ఎన్నికల్లో, హేమ భర్త, నటుడు ధర్మేంద్ర కూడా ఆమె కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k — Hema Malini (@dreamgirlhema) April 11, 2024 తిరిగి ఇదే స్థానం బీజేపీ తరఫున 2024 ఎన్నికల్లో హేమమాలిని నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 80 మంది పార్లమెంటు స్థానాలున్న యూపీలో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 19, 26 మే 7, మే 13, మే 20, మే 23 , జూన్ 1 ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. -
హోలీ, రంగుల కేళి : ఇక్కడ పండుగ సంబరాల లెవలే వేరు!
#Holi2024హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. చెడుపై మంచి విజయానికి సూచిక. ఈ ఏడాది మార్చి 25, సోమవారం హోలీ జరుపుకుంటాం. అసలు హోలీ అంటే ఇలా ఉండాలి అనేలా జరుపుకునే ప్రదేశాల గురించి మీకు తెలుసా? హోలి అంటే వివిధ రకాల రంగులు, చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. ప్రతీ రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్లు నిండిపోతాయి. రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. మన దేశంలోని కొన్ని చోట్ల అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఉత్తర్ ప్రదేశ్: యూపీ,మథురలోని బర్సానా లత్మార్ హోలీకి ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ఈ హోలీ వేడుకలు ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటారు. స్త్రీలు సంప్రదాయబద్ధంగా గోపికల వేషధారణతోనూ, పురుషులు గో పురుషులుగానూ మారి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. మథురలోని రాధా కృష్ణుల ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతారు. భజనలు, సంకీర్తనలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. స్థానికులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా హోలీ వేడుకలతో సందడి చేయడం విశేషం. బృందావన్: ఇక్కడ హోలీ వేడుక వారం రోజుల పాటు సాగుతుంది. పువ్వులు, రంగులతో హోలీని ఆడతారు. బృందావన్‌లోని బాంకీ బిహారీ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హోలీ అనేది ఒకరోజు కార్యక్రమం కాదు. రంగుల్లో మునిగి తేలడంతోపాటు,పురాణ ఇతిహాసాలు, స్థానిక జానపద కథల ప్రస్తావనలతో వారం పాటు వేడుక కొనసాగుతుంది. శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్, బోల్పూర్లో ఉన్న శాంతినికేతన్ హోలీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక్కడ దీనిని బసంత ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. రవీద్ర భారతి యూనివర్శిటీలో నోబెల్ గ్రహీత రవీద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను నిర్వహించడం మొదలెట్టారట. ఈ ప్రేరణతోనే సాధారణ వేడుకలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. పంజాబ్: పంజాబ్‌లో హోలీ పండుగను హోలా మొహల్లాగా జరుపుకుంటారు. 'హోలా-మొహల్లా' అంటే 'యుద్ధ-నైపుణ్యాల సాధన' అని అర్థం. అందుకే హోలీ వేడుకలో కత్తులతో విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నిహాంగ్ సిక్కులు ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీని పౌరుషానికి ప్రతీకగా, ధైర్యవంతుల హోలీగా వేడుక చేసుకుంటారు. ఉదయపూర్, రాజస్థాన్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనూ హోలీ వేడుకలకు పెట్టింది పేరు. అక్కడ ఉండే మేవార్ రాజ వంశస్థులు ఈ పండుగను హోలికా దహన్ కార్యక్రమంతో ప్రారంభిస్తారు. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కూడా హోలీ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఉత్సాహంగా హోలిని జరుపుకుంటారు. కాగా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై నగరాల్లో కూడా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణాలో చిన్నా, పెద్ద అంతా,ముఖ్యంగా యువత ఈ రంగుల హోలీని బాగా ఎంజాయ్ చేస్తారు. -
షాహీ ఈద్గా కాంప్లెక్స్ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆమోదం
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 'షాహీ ఈద్గా మసీదును అడ్వకేట్ కమిషనర్‌తో సర్వే చేయించాలనే మా అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. మసీదు లోపలి భాగంలో హిందూ దేవాలయాల చిహ్నాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి అడ్వకేట్ జనరల్ అవసరం. ఇది చరిత్రాత్మక తీర్పు.' అని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ -
హమాస్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న బుల్లితెర నటి వీడియో!
హమాస్ తీవ్రవాదుల దాడితో ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య భీకర యుద్ధ జరుగుతోంది. ఇప్పటికే వందలమందిని బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ తీవ్రవాదులు అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి షేర్ చేసిన వీడియో కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ దాడుల్లో తన కజిన్ సోదరి, బావను అత్యంత దారుణంగా చంపేశారని మధురా నాయక్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. వారి పిల్లల కళ్లముందే భార్య, భర్తను హతమార్చారని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సంచలనంగా మారింది. అంతే కాకుండా ఇజ్రాయెల్‌లో మహిళలు, పిల్లలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దారుణంగా హత్యలు చేస్తున్నారని మధుర వాపోయింది. మధుర మాట్లాడుతూ..' నా సోదరి, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాదులు వారి పిల్లల ముందే దారుణంగా హత్య చేశారు. ఈరోజు శవమై కనిపించారు. ఉగ్రదాడిలో మా బంధువును కోల్పోయినందుకు చాలా బాధపడ్డా. వారి ఆప్యాయత, దయ, ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా ప్రార్థనలు బాధితులందరికీ అండగా ఉంటాయి. ఓం శాంతి. ఈ కష్టకాలంలో దయచేసి ఇజ్రాయెల్ ప్రజలకు అండగా నిలవండి. ఉగ్రవాదుల అరాచకాలు ఎంత అమానవీయంగా ఉంటాయో ప్రజలు ప్రత్యక్షంగా చూసే సమయం ఇదే,' అని తెలిపింది. తాను ఎలాంటి హింసను సమర్థించనని.. ఇజ్రాయెల్‌లోని ప్రజల కోసం, బాధిత కుటుంబాల కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆమె కోరారు. కాగా.. మధుర నాగిన్, కసౌతి జిందగీ కే, ఉత్తరన్, ప్యార్ కీ యే ఏక్ కహానీ, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్ అనే సీరియల్స్‌లో నటించింది. View this post on Instagram A post shared by Madhura Naik 🧿 (@madhura.naik) -
మసీదు కాంప్లెక్స్‌లో సర్వే
మథుర: వివాదాస్పద కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా వివాదంలో మథుర జిల్లా కోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలని జిల్లా సీనియర్ డివిజన్(3) సివిల్ జడ్జీ సోనికా వర్మ ఉత్తర్వులిచ్చారు. జనవరి 20వ తేదీలోగా సర్వే నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇక్కడి ఖాత్రా కేశవ్ దేవ్ ఆలయాన్ని ఔరంగజేబు నేలమట్టంచేసి ఈద్గాను నిర్మించారంటూ పిటిషనర్లు ఈ దావా వేశారు. శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్టు అధీనంలోని 13.37 ఎకరాల స్థలంలోనే ఈ ఈద్గాను నిర్మించారని దీనిని వేరే చోటుకు తరలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే, ఈ వివాదంపై శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ మసీద్ ఈద్గాల మధ్య 1968 ఏడాదిలో కుదిరిన రాజీ ఒప్పందాన్నీ వారు సవాల్‌చేస్తున్నట్లు వారి లాయర్ శైలేశ్ దూబే చెప్పారు. -
ఛాతీలో నొప్పి! గ్యాస్ వల్ల కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ! ఇప్పుడిలా!
Sunita Meena: ఎన్నాళ్లుగానో వేచి చూస్తోన్న చిన్ననాటి కల.. ఏళ్ల తరువాత మధ్యవయసులో నిజం కాబోతుందన్న ఆనందంలో ఉన్న ఆమెను క్యాన్సర్ వ్యాధి కమ్ముకున్నది. అయినా ఏమాత్రం బెదరలేదు. మరింత ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతూనే, తన కలను నిజం చేసుకునేందుకు రన్నింగ్ చేస్తోంది సునీతా మీనా. ఒకపక్క కీమో థెరపీ తీసుకుంటూనే మరోపక్క రన్నర్‌గా రాణిస్తోన్న సునీత పరుగుల ప్రయాణం ఆమె మాటల్లోనే.... ‘నేను మధురలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. రన్నింగ్ రేసుల్లో పాల్గొని విజేతగా నిలవాలని అనుకునేదాన్ని. కానీ ఇంటర్మీడియట్ పాస్ అవగానే రైల్వేలో పనిచేస్తోన్న దినేష్ కుమార్‌తో నాకు వివాహం అయ్యింది. పెళ్లి అయిన ఏడాదికే బాబు పుట్టాడు. ఇంటిపనులు, బాబుతో బిజీగా ఉన్నప్పటికీ చదువుకుంటానని మా వారిని అడిగాను. ఆయన పెద్దమనసుతో ఒప్పుకోవడంతో డిగ్రీ పూర్తిచేశాను. ఆయన కూడా రన్నర్ కావడంతో... స్కూల్లో ఉన్నప్పుడు క్రీడల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. కానీ పెద్దయ్యాక రన్నింగ్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మా ఆయన అంతర్జాతీయ అథ్లెట్ కావడంతోపాటు, రైల్వే టీమ్‌కు కోచ్‌గా పనిచేసేవారు. రోజూ ఆయన రన్నింగ్‌కు వెళ్తూ రన్నింగ్ గ్రూప్‌తో బిజీగా ఉండేవారు. నన్ను కూడా ‘‘రన్నింగ్ చెయ్యి, ఆరోగ్యంగా ఉంటావు’’ అని చెబుతుండేవారు. నా చిన్ననాటి కోరికే అయినప్పటికీ, పిల్లలు చిన్నవాళ్లు కావడంతో అప్పుడు వీలుపడలేదు. నా ఎత్తుకంటే, బరువు అధికంగా ఉండడం వల్ల ఎప్పుడూ నీరసంగా ఉండేది. దీనికితోడు తలనొప్పిగా అనిపించేది. ఇలా ఇబ్బంది పడుతోన్న నాకు ‘‘ఈ సమస్యలన్నింటికి రన్నింగ్ చక్కటి పరిష్కార మార్గం’’ అని ఆయన పదేపదే చెబుతుండేవారు. పిల్లలు కూడా పెద్దవాళ్లు అవడంతో 43 ఏళ్ల వయసులో 2018లో రన్నింగ్ ప్రారంభించాను. ఒకపక్క రన్నింగ్ చేస్తూ బరువు పెంచని పోషకాహారం తీసుకుంటూ ఫిట్‌గా తయారయ్యాను. ఆరునెలల్లో మారథాన్ రన్నర్‌గా.. తెల్లవారుజామున నాలుగంటలకే నిద్రలేచి రన్నింగ్ సాధన చేసేదాన్ని. ఇలా అక్కడక్కడ జరిగే మారథాన్లలో పాల్గొనేదాన్ని. ఇలా పాల్గొంటూ తొలిసారి ఢిల్లీ స్టేట్ మారథాన్‌లో పాల్గొని రెండోస్థానంలో నిలిచాను. ఈ ఉత్సాహంతో ప్రతి మారథాన్‌లో పాల్గొనేదాన్ని. రేస్‌లో ఉన్నప్పుడు నా ఛాతీలో విపరీతంగా నొప్పి వస్తుండేది. గ్యాస్ వల్ల వచ్చే నొప్పి కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ కొన్నిరోజులకు స్తనంలో వాపు కూడా రావడంతో మావారి బలవంతం మీద ఆసుపత్రిలో చూపించుకున్నాను. డాక్టర్లు పరీక్షించి క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పి, వెంటనే సర్జరీ చేస్తామన్నారు. అప్పటికి సరిగ్గా వారం తరువాత రష్యాలో రన్నింగ్ రేస్‌లో పాల్గొనాల్సి ఉందని, తర్వాత చేయించుకుంటానని డాక్టర్‌కు చెప్పాను. ‘‘సర్జరీ వెంటనే చేయాలి, సర్జరీ తరువాత మీరు రన్నింగ్ రేస్‌లో పాల్గొన వచ్చు’’ అని అభయం ఇచ్చారు. సర్జరీ తరువాత కొంచం విశ్రాంతి తీసుకుని ఆయనతో కలిసి రష్యావెళ్లి రన్నింగ్‌లో పాల్గొన్నాను. రష్యా నుంచి వచ్చిన తరవాత కీమో తీసుకుంటూనే రన్నింగ్ కూడా చేసేదాన్ని. అలా ఏడు కీమోలు చేశారు. తొలి కీమో చేసిన తరువాత నా జుట్టు ఊడడం మొదలైంది. దీంతో నాకేదో అయిపోతోందని కుంగిపోయేదాన్ని. మా ఆయన, పిల్లలు... ‘‘ఇది శాశ్వతం కాదు కొన్నిరోజులే... తరువాత మళ్లీ జుట్టు వస్తుంది’’ అని ధైర్యం చెప్పడంతో కొంచెం కుదురుకున్నాను. భవిష్యత్‌లో మరిన్ని కిలోమీటర్లు.. ‘‘రన్నింగ్తోపోలిస్తే కీమోథెరపీ వల్ల కలిగే బాధ తక్కువే. అందుకే నువ్వు నీ రన్నింగ్‌ను ఆపాల్సిన పనిఏమీ లేదు. నువ్వు చక్కగా పరిగెత్తవచ్చు’’ అని డాక్టర్లు ధైర్యం నూరిపోశారు. దాంతో రెట్టింపు ∙ఉత్సాహంతో కీమోథెరపీ చేసిన కొద్దిరోజుల తరువాత ఢిల్లీలో జరిగిన పది కిలోమీటర్ల మారథాన్ ను గంటా తొమ్మిది నిమిషాల్లో పూర్తిచేశాను. ఆ తరువాత లద్ధాఖ్‌లో జరిగిన ఏడు కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్నాను. ఈ ఏడాది జూన్‌లో వడోదరలో జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెట్ చాంపియన్ షిప్లో పాల్గొని ఆరోస్థానంలో నిలిచాను. ఇప్పటికీ నేను కేవలం పదికిలోమీటర్ల రేసుల్లోనే పాల్గొంటున్నాను. భవిష్యత్ లో 21 కిలోమీటర్లు దూరం కూడా ప్రాక్టీస్ చేస్తాను. శరీరంలో క్యాన్సర్ మహమ్మారి ఆనవాళ్లు ఉన్నాయంటేనే జీవితం అయిపోయిందనిపిస్తుంది. అలాంటిది తన శరీరంలో క్యాన్సర్ ఉన్నప్పటికీ ‘‘... అయితే ఏంటి ..నా పరుగుని అది ఏం చేయలేదు’’ అని 47 ఏళ్ల వయసులో ధైర్యంతో ముందుకు సాగుతూ ఎంతోమంది క్యాన్సర్ రోగులకు స్ఫూర్తిగా నిలుస్తోంది సునీతామీనా. చదవండి: Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు నవ్విన జనమే నీరాజనం పట్టారు! మొక్కల నుంచి పర్యావరణానికి మేలు చేసే పదార్థం! -
రూ.20 కోసం 22 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం!
మనలో చాలామంది ఏ చిన్న సమస్య వచ్చిన కోర్టు మెట్లెక్కడానికి ఇష్టపడం. మనకు ఏదైనా పని అవ్వడమే ముఖ్యం. జేబు చమురు వదిలించుకుని మరీ పని జరిపించుకుంటాం గానీ. ఎందుకు డబ్బులివ్వాలి అనడగం. పోతే పోనీలే అని సర్దుకుపోతాం. ఇక్కడో వ్యక్తి అలా కాదు. టిక్కెట్ ధర కంటే అదనంగా రూ.20 ఎక్కువ తీసుకున్నాడంటూ కోర్టు మెట్లెక్కాడు. 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి మరీ గెలిచాడు. ఏం జరిగిందంటే....మధురకు చెందిన ఉత్తర ప్రదేశ్ వ్యక్తి తుంగనాథ్ చతుర్వేది అనే న్యాయవాది 1999 డిసెంబర్లో మొరాదాబాద్‌కు రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టిక్కెట్ ధర రూ.70 కాగా టిక్కెట్ గుమస్తా అతని దగ్గర నుంచి రూ.90లు వసూలు చేశాడు. చతుర్వేది గమస్తాకి రూ.100 ఇస్తే తనకు రూ.30లు తిరిగి వస్తుంది కదా అనుకున్నారు. తీరా చూస్తే రూ. 10 చేతిలో పెట్టి అంతే వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. ఈ ఘటన డిసెంబర్ 25, 1999న చోటు చేసుకుంది. చతుర్వేది అతనిని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై స్టేషన్ మాస్టర్ని కూడా కలిశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయన న్యాయం కోసం భారత రైల్వేకి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడూ ఏం చేయాలో అతనికి తెలుసు. పైగా అతను లాయరు, న్యాయ పరిజ్ఞానం మీద అవగాహన కలిగిన వ్యక్తి కావడం చేత ఈ విషయమై కోర్టులో కేసు వేశారు. ఆయన ఈ కేసు విషయమై సుమారు 22 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఎట్టకేలకు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాకుండా తక్షణమే రైల్వే శాఖ రూ.15,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఒక నెలలోపు చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను కోర్టు ఆదేశించింది. చెల్లించాల్సిన మొత్తం పై 15 శాతం వడ్డీని అదనంగా చెల్లించమని భారత రైల్వేకి స్పష్టం చేసింది. ఈ పోరాటంలో చాలా కష్టాలు అనుభవించానని చతుర్వేది చెప్పారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కేసు వదిలేయమని చెప్పారని అన్నారు. ఒకానొక దశలో ఈ కేసును కొట్టేయడానికి చాలామంది అధికారులు ప్రయత్నించారు. ఈ కేసులో వందకు పైగా విచారణలు జరిగిన తర్వాత న్యాయం గెలిచిందని తెలిపారు. అయితే ఈ పోరాటంలో తాను కోల్పోయిన సమయం, శక్తికి వెలకట్ట లేనివని అవేదనగా చెప్పారు. (చదవండి: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య) -
పోలీస్ ఎగ్జామ్ రాసి వస్తున్న యువతిపై....ఫేస్బుక్ స్నేహితుడే అత్యాచారం
Mathura Woman Raped In Moving Car: ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ అత్యాచారాలకు అంతే లేదన్నట్లుగా రోజుకో కేసు వెలుగు చూస్తూనే ఉంటుంది. తాజాగా పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న 21 ఏళ్ల యువతిపై కదులుతున్న కారులో అత్యాచారం జరిగింది. పైగా ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీంతో సదరు మహిళ ఎలుకలు మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం) అయితే నిందుతుడి ఆ మహిళకు ఫేస్బుక్లో స్నేహితుడిగా పరిచయమైన వ్యక్తే ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు . అంతేకాదు నిందుతుడు హర్యానా వాసి ఆర్మీ వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ నిందుతుడు వివాహితుడని లడఖ్‌లో పనిచేస్తున్నాడని చెప్పారు. పైగా తాము అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...మేము ఆ కారుని కూడా స్వాధీనం చేసుకున్నాం. అయితే ఆ డ్రైవర్ ఆ నిందితుడి బంధువే. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు అని చెప్పారు. ఈ క్రమంతో యూపీ యుపి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ నేరం గురించి ఆరా తీయడమే కాక మధుర పోలీసుల నివేదిక ఇమ్మని కోరింది. (చదవండి: 13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన) -
షాకింగ్ వీడియో: మైనర్ బాలికపై దారుణం.. రెండో అంతస్తు పైనుంచి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అంతేగాక 17 ఏళ్ల మైనర్ బాలికను రెండో అంతస్తు నుంచి అత్యంత పాశవికంగా కిందకు తోసేశారు. ఈ షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్ర గాయాలైన బాలికనను ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. మధురలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన బాధితురాలి సోదరుడు దినేష్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. బాలిక సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం. కొంతమంది యువకులు ఏడాది కాలంగా మా చెల్లిని వేధిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మా నాన్నకు ఫోన్ కాల్ వచ్చింది. కొద్దిగా మాట్లేడే పని ఉందని చెప్పడంతో.. తాము మధురలో నివాస్తున్నామని నాన్న సమాధానం చెప్పాడు. కొంత సమయం తరువాత ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి మా ఇంట్లోకి చొరబడి.. నాపై అమ్మా, నాన్నపై దాడి చేశారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు గదిలో ఉన్న మా చెల్లిని బలవంతంగా రెండో అంతస్తు మీదకు తీసుకెళ్లి బాల్కనీ నుంచి కిందకు తోసేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని వెల్లడించాడు. ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజీలో బాలిక ఒక్కసారిగా పై నుంచి కింద పడటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె పడిపోవడంతో స్థానికంగా ఉన్న జనాలు పరుగెత్తుకొచ్చి సాయం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలైన బాలికను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వెన్నుముక, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని మధుర రూరల్ ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. A 17-year-old girl #thrown down from the terrace of her second floor house in #Mathura by 3 youths who had been harassing her for the past one year. The victim in the hospital with fractured spinal cord. @mathurapolice @Uppolice @adgzoneagra pic.twitter.com/gtJTjClEbq — Anuja Jaiswal (@AnujaJaiswalTOI) June 23, 2021 -
భార్యను రక్షించడం కోసం పోలీసులకే కట్టుకథ
మథురై : ఉత్తరప్రదేశ్‌లోని మధుర జనపథ్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు సోమవారం రాత్రి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. మా బస్సు హైజాక్‌కు గురైందని.. వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడాలంటూ సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అక్కడికి చేరుకొని బస్సును ఆపారు. అయితే అసలు విషయం తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాలు.. మథురై నుంచి బస్సులో వెళ్తున్న మహిళా ప్రయాణికురాలు నౌహ్జీల్ పరిధిలోని బజ్నాకు చేరుకునేసరికి ఒక ప్రయాణికునిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన భర్తకు ఫోను చేసింది. తనను అనుమానంగా చూస్తున్నాడని.. భయమేస్తుందని భర్తకు చెప్పింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫోను చేసి, బస్సు హైజాక్ అయిందంటూ కట్టుకథ అల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తన భార్యను రక్షించుకోవడం కోసం బస్సు హైజాక్ అయిందంటూ నాటకమాడిన సదరు వ్యక్తిని చట్ట నియమాలను ఉల్లఘించినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(చదవండి : ప్రకాశం బ్యారేజీలో దూకి యువకుడు ఆత్మహత్య) -
నడిరోడ్డు మీద గాల్లోకి కాల్పులు జరుపుతూ..
లక్నో: ఓ వ్యక్తి సడెన్‌గా కారు నుంచి దిగి.. దానికి నిప్పంటించాడు.. ఆపడానికి ప్రయత్నించిన జనాలను తుపాకీతో బెదిరించడంతో పోలీసులు అతడిని, అతనితో పాటు ఉన్న యువతిని అరెస్ట్ చేశారు. మధురలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. శుభం చౌదరి అనే యువకుడు, ఓ యువతితో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు ఉన్నట్టుండి ఆ యువకుడు కారు నుంచి దిగి.. దానికి నిప్పంటించాడు. అదుపు చేయడానికి వచ్చిన వారిని గన్నుతో బెదిరిస్తూ.. గాల్లోకి కాల్పులు జరిపి వీరంగం సృష్టించాడు. అతడి చర్యల వల్ల ట్రాఫిక్ జాం అయ్యి.. జనాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేయడమే కాక.. కాసేపు అవినీతి గురించి ఉపన్యసించాడు. ఈ లోపు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శుభం చౌదరిని, అతడితో పాటు ఉన్న యువతిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కారును ఎందుకు తగలబెట్టావని శుభం చౌదరిని ప్రశ్నించగా అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అంతేకాక తనతో పాటు ఉన్న యువతిని కాసేపు తన చెల్లెలు అని, కాసేపు బిజినేస్ పార్టనర్ అని, కాసేపు ఫ్రెండ్ అన్నాడు. శుభం చౌదరి మాటలు విన్న పోలీసులు అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని భావిస్తున్నారు. మరో సమాచారం ఏంటంటే శుభం చౌదరికి వేరే మహిళతో వివాహం నిశ్చయమైందని.. కానీ కారులో ఉన్న యువతితో అతనికి సంబంధం ఉండటం మూలానా ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని... దాంతో శుభం చౌదరి డిప్రెషన్లోకి వెళ్లాడని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని తెలిసింది. దీని గురించి పోలీసులను ప్రశ్నించగా.. పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
ఆలయనగరిలో... ఎవరిపైనో దేవుడి దయ
శ్రీకృష్ణుడి జన్మస్థలంగా హిందువులు భావించే, ‘టెంపుల్ టౌన్’గా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లోని మథుర పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మథురలో ఈసారి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తుంటే, ఆర్ఎల్డీ నుంచి కున్వర్ నరేంద్రసింగ్, కాంగ్రెస్ నుంచి మహేష్ పట్నాయక్ బరిలోకి దిగారు. జాట్ ఓటర్లకు బాగా పట్టున్న ఈ స్థానంలో రెండోసారి ఎంపీ సీటు దక్కించుకోవడానికి సినీ నటి హేమమాలిని గత ఎన్నికల్లో ‘జాట్ బహూ’గా ఈ నియోజకవర్గం ప్రజల మనసు గెలుచుకున్నారు. ఈసారి సైతం గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో 2014 మోదీ వేవ్‌లో బీజేపీ నుంచి మథుర లోక్‌సభకు పోటీ చేసి, అప్పటి ఆర్ఎల్డీ సిట్టింగ్ అభ్యర్థి జయంత్ చౌధరిని ఓడించి హేమమాలిని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడి గెలుపు ఓటములను ప్రభావితం చేయగల జాట్ సామాజిక వర్గం సెంటిమెంట్‌ని గత ఎన్నికల్లో హేమమాలిని వాడుకున్నారు. ‘జాట్ బహూ’ (జాట్ సామాజికవర్గం కోడలు)గా మీ ముందుకొస్తున్నాను. ఆదరించండం’టూ జోరుగా ప్రచారం చేసి విజయాన్ని సాధించగలిగినా ఇప్పుడా సెంటిమెంటు ఓట్లు రాలుస్తుందా లేదా అన్నది అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది. గెలుపు అంత ఈజీ కాదు.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యావత్ దేశాన్నీ బీజేపీ స్వీప్ చేసిన సందర్భంలో హేమమాలిని గెలుపు సులువైంది. కానీ ఈసారి ఈ స్థానంలో విజయాన్ని చేజిక్కించుకోవడం నల్లేరు మీద నడక మాత్రం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో బీజేపీపై జాట్ సామాజిక వర్గంలో నెలకొన్న వ్యతిరేక ప్రవాహానికి ఎదురీదడం అంత తేలికేం కాదన్నది స్థానిక పరిశీలకుల అభిప్రాయం. అందుకే హేమమాలిని ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మథురలో జాట్ ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానంలో గెలుపును ప్రభావితం చేయగలిగిన ఈ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకే అన్ని పార్టీలూ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 20 శాతం మందిగా ఉన్న జాట్ సామాజిక వర్గం ఇక్కడి గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉంది. మథుర పార్లమెంటు పరిధిలో 70 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే. ఠాకూర్లు, బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ కులాలు ప్రధాన సామాజిక వర్గాలు. కొంత వరకు ముస్లింలు, వైశ్యులు కూడా ఉన్నారు. ప్రముఖ జాట్ నాయకుడు చౌధరీ చరణ్‌సింగ్ ఈ ప్రాంతం వారే కావడం విశేషం. చౌధరి చరణ్‌సింగ్ భార్య గాయత్రీదేవి 1984 ఎన్నికల్లో మథురలో ఓడిపోయారు. ఆయన కుమార్తె గ్యానవతి 2004లో ఓటమి పాలయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి మన్వీర్సింగ్ ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం చరణ్‌సింగ్ మనవడు జయంత్ చౌధరి మథుర నుంచి పార్లమెంటుకి సారథ్యం వహించారు. 2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ జయంత్ చౌధరీని ఓడించి హేమమాలిని గెలిచారు. ఆమె గెలుపునకు అనేక కారణాలున్నాయనీ, ‘జాట్ బహూ’ సెంటిమెంట్‌తో హేమమాలిని ఎమోషన్ అందుకు బాగా ఉపయోగపడిందనీ జాట్ సామాజిక వర్గానికే చెందిన స్థానికుడు ముఖేష్ చౌధరి అన్నారు. దీనికి తోడు మోదీ ఛరిష్మాకంటే «భర్త ధర్మేంద్రతో బంధం కూడా గత ఎన్నికల్లో పని చేసిందనీ, అయితే ఈసారి అది పనిచేస్తుందో లేదో దేవుడికే తెలియాలని గోవర్ధన్‌లో నివసించే జాట్ సామాజిక వర్గానికి చెందిన ప్రతిమా సింగ్ అభిప్రాయపడ్డారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా 2014లో మథురలోని రావాల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ ఆ గ్రామానికి హేమమాలిని ఒరగబెట్టిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఆ గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉంటాయనీ, హేమమాలిని ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పని చేయడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మహ్మద్ ఘోరి V/S ఫక్కర్ రామాయని@17..
సాక్షి, ఉత్తరప్రదేశ్: అతని పేరు.. ఫక్కర్ రామాయని. వయసు 73 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ మధురలోని గాల్టేశ్వర్ ఆలయ ప్రధాన పూజారి అయిన ఈయన 17వ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇంతవరకు ఎనిమిది లోక్‌సభ, ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ స్వామీజీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పుడు మరోసారి మథుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు ప్రారంభం రోజునే ఆయన భక్తులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇన్ని ఎన్నికల్లో ఓడిపోయినా తాను నిరాశ పడటం లేదని, ఓటర్లు ఎప్పటికైనా తనను గుర్తిస్తారన్న నమ్మకం ఉందని అంటున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రామాయని రెండు అంశాల మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఒకటయితే, యమునా నదిని కాలుష్యరహితం చేయడం రెండోది. రామాయణాన్ని కంఠతా పట్టేసిన ఈయనకు పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, అందువల్ల ప్రచారానికి కారు ఉపయోగిస్తున్నానని ఆయన చెబుతున్నారు. కారు, ఎన్నికల ఖర్చు కూడా ఆయన భక్తులే భరిస్తున్నారట. ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా రామాయని ముందుగా యమునా నదికి హారతి పట్టి ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 18న మధురలో పోలింగు జరగనుంది. -
సీఎం అవ్వడం నాకు చిటికెలో పని అంటున్న నటి
‘ముఖ్యమంత్రి అవ్వడం అనేది నాకు నిమిషాల మీద పని. నేను తల్చుకుంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కాగలను’ అంటున్నారు బాలీవుడ్ ‘డ్రీమ్ గర్ల్’ హేమ మాలిని. బుధవారం రాజస్థాన్ బన్స్వారాలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి హాజయరయ్యారు హేమ మాలిని. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో విలేకరులు ‘ఒక వేళ అవకాశం వస్తే మీరు యూపీ సీఎం అవుతారా’ అని అడగ్గా.. అందుకు హేమ మాలిని ‘నేను తల్చుకుంటే సీఎం అవ్వడం పెద్ద విషయమేం కాదు. కానీ నాకు అది ఇష్టం లేదు. సీఎం అయితే నేను నా వ్యక్తిగత జీవితాన్ని, సమయాన్ని కోల్పొవాల్సి వస్తుందంటూ’ బదులిచ్చారు. అంతేకాక ‘నేను మంత్రిని అవ్వడానికి కారణం నా సినీ జీవితం. ప్రజలు నన్ను హేమ మాలిని, ‘డ్రీమ్ గర్ల్’ అని పిలుస్తారు. నేను బాలీవుడ్లో పనిచేశాను. అందువల్లే నన్ను అందరూ గుర్తించగల్గుతారని’ తెలిపారు. అంతేకాక ‘పార్లమెంట్లో ప్రవేశించకముందే నేను బీజేపీ కోసం చాలా పని చేశాను. ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ నాలుగేళ్లలో నా నియోజకవర్గం మధురలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ముఖ్యంగా ఇక్కడ రహదారుల అభివృద్ధికి అధికంగా కృషి చేశానని’ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని అభినందనలతో ముంచెత్తారు. ‘మోదీ లాంటి ప్రధాని లభించడం చాలా అరుదు. ప్రతిపక్షాలు ఆయన గురించి ఏవేవో మాట్లాడుతుంటాయి. కానీ దేశం కోసం పని చేస్తున్నదేవరో ప్రత్యక్షంగా చుస్తూనే ఉన్నాం కదా’ అని తెలిపారు. -
యూపీ రోడ్డు ప్రమాదంలో 11మంది దుర్మరణం
మధుర : ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. మధురలోని బృందావన్ రోడ్డు సమీపంలో ఈరోజు ఉదయం ఓ బస్సును టెంపో వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిమంది అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మరొకరు చనిపోయారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మధుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ సతీష్ యాదవ్ తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితులంతా మధురను సందర్శించేందుకు వస్తున్న భక్తులుగా పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు స్తంభించిన ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. కాగా ఉత్తరాఖండ్ లో జరిగిన మరో ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. జీపు అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌తో సహా అయిదుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
నీలమేఘశ్యాముని నాల్గు నగరాలు
శ్రీకృష్ణుని లీలలు ఎన్ని చెప్పిన తరగవు. కన్నయ్య నడయాడిన ప్రదేశాల గురించి ఎంత చెప్పినా తరగదు. గోపబాలుడుగా జన్మించిన మధుర... గానామృతాలు పంచిన బృందావనం... రాజసంగా కొలువుదీరిన ద్వారక...సర్వవ్యాప్తుడైన ఆయన సంచరించిన ప్రదేశాలెన్నో! కృష్ణాష్టమి సందర్భంగా ఆ మురారికి ప్రీతిపాత్రమైనపట్టణాల గురించి, ఆలయవైభవాలగురించి తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్లితీరాల్సిందే! ద్వారక, మధుర ఉత్తరభారతదేశంలో ఉన్నాయి. గురువాయూర్, ఉడిపి దక్షిణభారతదేశంలో ఉన్నాయి. ద్వారకాధీశుడు శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైనది ద్వారక. గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో సముద్రమట్టానికి సమానంగా ఉంటుంది. ద్వార్ అంటే సంస్కృతంలో వాకిలి, ద్వారం వంటి అర్థాలు ఉన్నాయి. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్లలో ద్వారకాపురి ఒకటి. జరాసంధుని బారి నుండి తప్పించుకునేందుకు కృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ద్వారకాధీశుని మందిరం అతి పురాతమైంది. శ్రీకృష్ణుని మునిమనమడు వజ్రనాభుడు క్రీస్తు పూర్వం 2వేల సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని నిర్మించినట్టు పురాణాలలో ప్రస్థావన ఉంది. ఆ తర్వాత క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మొత్తం 5 అంతస్తులతో, 72 స్తంభాలతో అలరారుతుంటుంది. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు, రుసుములు లేవు. ఎక్కువ మెట్లు లేవు. అందువల్ల వయోవృద్ధులు కూడా దర్శనం చేసుకోవచ్చు. పక్కనే గోమతి నది పరవళ్లు తొక్కుతుంటుంది. గోమతి నది సముద్రంలో కలసే చోటే ద్వారక ఉంది. ఈ ఆలయం నుంచే ఆ సంగమ ప్రదేశాన్ని చూడవచ్చు. బేట్ ద్వారక: శ్రీకృష్ణుడు తన రాణులను కలిసిన చోటు గా ఈ ప్రాంతానికి పేరుంది. ఇది రేవు పట్టణం. శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లిన తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెబుతుంటారు. ద్వారక నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేదారిలో రుక్మిణీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి. ద్వారకాపురిలో ఇంకా వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, జాంబవతి, సత్యభామ ఆలయాలు కూడా ఉన్నాయి. చూడలవసినవి: గాయత్రి మందిరం, గీతా మందిరం. 20 కి.మీ దూరంలో గల నాగనాథ్ (జ్యోతిర్లింగం), ద్వారక నుండి 250 కి.మీ. దూరంలో గల సోమనాథ దేవాలయం (జ్యోతిర్లింగం), అక్కడి నుంచి 10 కి.మీ దూరంలో శ్రీకృష్ణుని నిర్యాణ స్థలం. రైలు మార్గం: హైదరాబాద్ నుంచి రామేశ్వరం-ఓఖా ఎక్స్‌ప్రెస్ బయల్దేరుతుంది. ప్రయాణ సమయం 36 గంటలు. ద్వారకలో భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయి. ఉడిపి చిన్నికన్నయ్య కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు 58 కి.మీ దూరంలో ఉంది ఉడిపి. ప్రపంచంలోని అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయంగా దీనికి పేరుంది. స్వామి దర్శనం నవరంధ్రా లున్న కిటికీగుండా చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలోని కృష్ణుని విగ్రహం చిన్ని బాలుడి రూపంలో ఉంటుంది. 12వ శతాబ్దంలో మధ్వాచార్యులు శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ఠ జరిపి, ఎనిమిదిమంది బ్రహ్మచారి శిష్యులతో పూజలు జరిపించారట. ఇక్కడి తీర్థం మధ్యభాగంలో మనోహరమైన మండపమొకటి ఉంది. ఇందులోనే శ్రీ మధ్వాచార్యుల దివ్యప్రతిమ ఉంది. ఉత్సవాలు, పండగలపుడు ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి త్రిశూర్ 150 కి.మీ. ఉంటుంది. ఉడిపిలో కృష్ణమందిరం దర్శంచుకొని త్రిశూర్‌కు రైలులో చేరుకోవచ్చు. అక్కడ నుంచి గురువాయూర్ చేరుకోవాలి. రోడ్డు మార్గం: ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మంగళూరుకు నేరుగా వెళ్లి, అక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. ఉడిపిలో అన్ని వసతులు ఉన్నాయి. దక్షణాది నవభోజనాలు ఆలయానికి దగ్గరలోనే లభిస్తాయి. గురువాయూర్ బాలగోపాలుడు కేరళ రాష్ట్రంలో త్రిశూర్ పట్టణానికి 30 కి.మీ. దూరంలో గురువాయూర్ ఉంది. కేరళ సంప్రదాయ పద్ధతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. పాతాళ జలశిలతో కృష్ణుని విగ్రహం మలచినట్టుగా, శంకరాచార్యులవారు దీన్ని ప్రతిష్ఠాపన చేసినట్టుగా చెబుతారు. నాలుగు చేతులలో పాంచజన్యం, శంఖం, చక్రం, కౌమోదకం పద్మాలను ధరించి ముగ్ధమనోహర రూపంలో అలరించే బాలగోపాలుడు గురువాయూర్. అతి ప్రాచీనమైన ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి భక్తులు దర్శనార్ధం చేరుకుంటుంటారు. అయ్యప్పకు వెళ్లే భక్తజనావళి గురువాయూర్ను దర్శించుకొని వెళతారు. ఇక్కడ స్వామిని ఉన్నికృష్ణన్, కన్నన్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు తన అవతార పరిసమాప్తి కాలంలో సహచరుడైన ఉద్దీపునికి కృష్ణవిగ్రహం ఇచ్చాడట. లోక కళ్యాణార్థం జలప్రళయ అనంతరం విగ్రహాన్ని వాయువు కాపాడి దేవగురువు బృహస్పతికి ఇచ్చాడట. గురువు వాయువుతో కలిసి ఈ విగ్రహం ప్రతిష్ఠించారు కాబట్టి గురువాయూర్ అని పేరొచ్చిందని పెద్దలు చెబుతుంటారు. రైలుమార్గం: హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో త్రిశూర్ చేరుకొని, అక్కడ నుంచి బస్సుమార్గం ద్వారా గురువాయూర్ చేరుకోవచ్చు. మధుర హృదయవల్లభుడు మానవ హృదయంతో మధురను పోల్చుతారు. ప్రేమకు, భక్తి భావనకు, ఆనందాతిశయాలకు నెలవుగా ఈ ప్రాంతాన్ని కొనియాడుతారు. ఆగ్రా నుండి ఢిల్లీ వెళ్లే తోవలో 50 కి.మీ. దూరంలో ఉంది మధుర. యమునానదికి ఆనుకొని ఉంటుంది. ఢిల్లీ సందర్శనకు వెళ్లినప్పుడు మధుర చూసి రావచ్చు. కృష్ణుని జన్మస్థానమైన ఈ నగరం అతి ప్రాచీనమైనది. ఇక్కడ కృష్ణుని ఆలయాన్ని నాలుగు పర్యాయాలు నిర్మించినట్టు కథనాలు ఉన్నాయి. 1965లో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఆలయభాగమే శ్రీకృష్ణుని జన్మస్థానం. చూడలవసినవి: కృష్ణమందిరం, దేవకీ వసుదేవుల జైలు, కంసరాఖిల్లా, బలిదేవ్, కంసవిఖండన మందిరాలు ఉన్నాయి. ఇంకా గోకులం, మహావనం, బృందావనం చూడదగినవి. ఇక్కడ కృష్ణాష్టమి, దీపావళి, ఆషాఢపౌర్ణమి, శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాలలో ఇక్కడ పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి. మధురలో అన్ని ప్రాంతాలను దర్శించాలనుకునేవారు గైడ్ సాయం తీసుకోవడం మంచిది. - ఎస్.వి. సత్యభగవానులు, విశ్రాంత డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒంగోలు -
‘షో’ సినిమాలా అవార్డులు, ‘మిస్సమ్మ’లా డబ్బులు రావాలి
‘‘నీలకంఠ సినిమాలు కొత్త తరహాలో ఉంటాయి. ఈ సినిమా కథాంశం కూడా కొత్తగానే ఉంటుందని చెప్పొచ్చు. నీలకంఠ దర్శకత్వం వహించిన ‘షో’ సినిమాలా అవార్డులు, ‘మిస్సమ్మ’లా డబ్బులు ఈ చిత్రం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న సినిమా ఆడియోలకు అండగా నిలబడుతున్న ‘మధుర’ సంస్థ అధినేత శ్రీధర్ అంటే నాకు అభిమానం’’ అని దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. నీలకంఠ దర్శకత్వంలో షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై డా. ఏమ్వీకే రెడ్డి, ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘మాయ’. శేఖర్‌చంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హీరో ‘అల్లరి’ నరేశ్ ఆవిష్కరించి, మల్టీ డైమన్షన్ సంస్థకు చెందిన వాసుకు ఇచ్చారు. మరో అతిథి తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘నీలకంఠలానే ఆయన సినిమాలు కొద్దిగా స్లోగా ఉంటాయి. కానీ, ఈ చిత్రం ట్రైలర్ స్పీడ్‌గా ఉంది కాబట్టి, ట్రెండ్ మార్చాడనిపిస్తోంది. ఎప్పుడూ కొత్త కథలతోనే ఆయన సినిమాలు చేస్తాడు’’ అన్నారు. ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. నేను ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ తీసిన తర్వాత, మంచి కాన్సెప్ట్‌తో సినిమా తీయాలనుకుంటున్న తరుణంలో నీలకంఠ ‘మాయ’ కథ చెప్పారు. నా బలం, నీలకంఠ దర్శకత్వం తోడైతే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లొచ్చనే నమ్మకంతో చేశాం’’ అని చెప్పారు. వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇదని, ఇది కొత్త తరహా సినిమా అని, అనుకున్నట్లుగా సినిమా బాగా రావడానికి చిత్రబృందం అందించిన సహకారమేనని చెప్పారు నీలకంఠ. ఇంకా ఈ వేడుకలో లగడపాటి శ్రీధర్, బెక్కం వేణుగోపాల్, సిరాశ్రీ, సందీప్ కిషన్, రఘు కుంచె, శేఖర్‌చంద్ర, హర్షవర్ధన్ రాణె, అవంతిక తదితరులు పాల్గొన్నారు. -
నేడే పురపోరు
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది....కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలలో ఆదివారం పోలింగ్ జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 97 వార్డుల్లో 143 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే రెండుమున్సిపాలిటీలు, రెండు నగరపంచాయతీలలో మొత్తం 97 వార్డుల్లో 523 మంది బరిలో నిలవడంతో అన్నిచోట్ల పోటీ తీవ్రంగానే ఉంది. నాలుగు చోట్ల 1,35,235 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 66,176 మంది, మహిళలు 69,053 మంది ఉన్నారు. కొత్తగూడెంలో అధికంగా 61,266 మంది, మధిరలో తక్కువగా 20,367 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగూడెంలో 33 వార్డులకు 190 మంది, ఇల్లెందులో 24 వార్డులకు 173 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఇక్కడ గెలుపును అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి 166 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తరలించిన ఈవీఎంలు మొరాయిస్తే ప్రత్యామ్నాయంగా మరికొన్ని ఈవీఎంలను అందుబాటులో ఉంచుతూ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిఘా నీడలో.. పోలీస్ భారీ బందోబస్తు నడుమ ఈ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు గతంలో కన్నా ఈసారి భద్రతను పెంచారు. నాలుగు కేంద్రాల్లో మొత్తం 108 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో అన్నీ సమస్యాత్మక ప్రాంతాలే. వీటిలో 34 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అలాగే ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 17 పోలింగ్ కేంద్రాలు, మధిర నగర పంచాయతీ పరిధిలో 8, సత్తుపల్లి నగర పంచాయతీలో 17 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి కట్టుదిట్టంగా భద్రతను నిర్వహిస్తున్నారు. 53 కేంద్రాల్లో వెబ్, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 41 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. పోలింగ్ ప్రక్రియలో 796 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శనివారమే ఆయా మున్సిపాలిటీల పరిధిలో రిపోర్టు చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఓటరు తీర్పుపైనే ఆశలు.. వరుస ఎన్నికల నేపథ్యంలో ముందుగా జరుగుతున్న మున్సిపల్ తీర్పుపై రాజకీయపార్టీలన్నీ ఆశలుపెట్టుకున్నాయి. అభ్యర్థులు సైతం విజయం కోసం చివరి క్షణం వరకూ అన్ని యత్నాలూ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గీత దాటకుండా.. పోలింగ్ కేంద్రానికి దూరంలో అభ్యర్థుల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ‘గుర్తు.. గుర్తుంచుకోండి..’ అంటూ చివరి అస్త్రాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ ఎన్నికల రణ రంగంలో ఓటరన్న చివరకు ఎవరికి పట్టం కడతారో ఫలితాల తర్వాతే తేలనుంది. -
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
న్యూఢిల్లీ : శ్రావణ బహుళ అష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణుడి ఆలయాలన్నీ శ్రీకృష్ణ నామంతో మార్మోగాయి. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో భక్తజన సంద్రం ఉప్పొంగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పాలు, పెరుగు, వెన్నతో చిన్నికృష్ణయ్యకు భక్తులు అభిషేకం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది గురువారం కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. అష్ట అంటే ఎనిమిది. ఈ అంకెతో శ్రీ కృష్ణుడికి చాలా సంబంధం ఉంది. దశావతారాల్లో ఎనిమిదవ అవతారం ఆయనది. ఓం నమో నారాయణా య.. అని శ్రీకృష్ణుడిని ధ్యానిస్తారు. ఇది ఎనిమిది అక్షరాల మంత్రం కావడం విశేషం. దేవకీదేవికి శ్రీకృష్ణుడు ఎనిమిదవ సంతానం. ఆయనకు ఎనిమిది మంది ధర్మపత్నులున్నారు. శ్రీకృష్ణభగవానుడు దేవకీ గర్భం నుంచి ఉదయించిన పవిత్రదినాన్ని శ్రీ కృష్ణ జ న్మాష్టమిగా జరుపుకోవడం ఆనవాయితీ. కృష్ణాష్టమి రోజు జనులు అభ్యంగ స్నానమారించి, నూతన వస్త్రాలు ధరించి ఉపాసనం సంకల్పిస్తారు. తమ ఇళ్లను తోరణాలతో అలంకరించి, ఇళ్ల ముంగిళ్లలో బాలకృష్ణడి పాదముద్రలను బయటి నుంచి ఇంటిలో ఉన్న దేవిని గృహం వరకు వేయడం వల్ల బాలకృష్ణుడు బుడిబుడి అడుగులతో తమ గృహాలను విచ్చేస్తాని విశ్వాసం. చెలిమికి, ప్రేమకు, దుష్టశిక్షణకు శ్రీకష్ణుడు ప్రతీక. శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. ఢిల్లీ, ముంబై, లక్నో, ఛండీగఢ్, కోల్‌కతా, జమ్మూ, హర్యానా, హైదరాబాద్.. తదితర ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్న పిల్లలు శ్రీకృష్ణ వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ ఇస్కాన్ మందిరంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. భజనలు చేస్తూ తన్మయులయ్యారు.