ఉత్తర ప్రదేశ్‌లోని మధుర నగరంలో ప్లాట్‌ల వేలంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మధుర బృందావన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MVDA) నిర్వహించిన రెసిడెన్షియల్ ప్లాట్‌ల ఆన్‌లైన్ వేలంలో బేస్ ధరలను మించి భారీ మొత్తానికి బిడ్ రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
గురువారం ప్రారంభమైన వేలంలో మొత్తం ఎనిమిది ప్లాట్లు బిడ్డింగ్‌కు వచ్చాయి. వాటిలో బృందావన్‌లోని రుక్మణి విహార్‌లో ఉన్న 300 చదరపు గజాల స్థలం అసలు ధర రూ. 60 లక్షలు. అయితే, ఈ-వేలంలో బిడ్‌లు అనూహ్యంగా పెరిగాయి. ఆశ్చర్యపరిచే విధంగా ఈ ప్లాటు రూ.30 కోట్లు పలికింది.
వేలం ముగింపును పరిశీలించగా రూ. 60 లక్షల విలువైన ప్లాట్‌కు రూ. 30 కోట్లతో పాటు, మరో 288 చదరపు మీటర్ల ప్లాట్ రూ. 19.11 కోట్లు పలికింది. ఈ అసారణ బిడ్‌లు ఎంవీడీఏ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బిడ్డింగ్‌లు ఎవరు వేశారు.. ఎంత పెద్ద మొత్తంలో బిడ్ వేయడానికి కారణాలేంటి అనే వివరాలను ఆరా తీస్తున్నారు అధికారులు. సహేతుకమైన స్థాయిలకు మించి ధరలను పెంచడం ద్వారా నిజమైన కొనుగోలుదారులను ప్లాట్లను కొనుగోలు చేయకుండా వేలం ప్రక్రియకు అంతరాయం కలిగించడానికి ఈ అధిక బిడ్‌లను వేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment