Vrindavan
-
రూ. 60 లక్షల ప్లాట్‌కు రూ.30 కోట్ల బిడ్!
ఉత్తర ప్రదేశ్‌లోని మధుర నగరంలో ప్లాట్ల వేలంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మధుర బృందావన్ డెవలప్మెంట్ అథారిటీ (MVDA) నిర్వహించిన రెసిడెన్షియల్ ప్లాట్ల ఆన్లైన్ వేలంలో బేస్ ధరలను మించి భారీ మొత్తానికి బిడ్ రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.గురువారం ప్రారంభమైన వేలంలో మొత్తం ఎనిమిది ప్లాట్లు బిడ్డింగ్‌కు వచ్చాయి. వాటిలో బృందావన్‌లోని రుక్మణి విహార్‌లో ఉన్న 300 చదరపు గజాల స్థలం అసలు ధర రూ. 60 లక్షలు. అయితే, ఈ-వేలంలో బిడ్లు అనూహ్యంగా పెరిగాయి. ఆశ్చర్యపరిచే విధంగా ఈ ప్లాటు రూ.30 కోట్లు పలికింది.వేలం ముగింపును పరిశీలించగా రూ. 60 లక్షల విలువైన ప్లాట్‌కు రూ. 30 కోట్లతో పాటు, మరో 288 చదరపు మీటర్ల ప్లాట్ రూ. 19.11 కోట్లు పలికింది. ఈ అసారణ బిడ్లు ఎంవీడీఏ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బిడ్డింగ్‌లు ఎవరు వేశారు.. ఎంత పెద్ద మొత్తంలో బిడ్ వేయడానికి కారణాలేంటి అనే వివరాలను ఆరా తీస్తున్నారు అధికారులు. సహేతుకమైన స్థాయిలకు మించి ధరలను పెంచడం ద్వారా నిజమైన కొనుగోలుదారులను ప్లాట్లను కొనుగోలు చేయకుండా వేలం ప్రక్రియకు అంతరాయం కలిగించడానికి ఈ అధిక బిడ్లను వేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. -
అక్కడ సామాజిక కట్టుబాట్లపై సాధించిన విజయానికి గుర్తుగా హోలీ!
మన భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ పలు పండుగలను జరుపుకోనివ్వకుండా నిషేధాలు ఉండేవి. వారు నలుగురుతో కలిసి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. కనీసం చూడటానికి కూడా ఉండేది కాదు. చెప్పాలంటే నాలుగు గోడల మధ్యనే బంధించేసేవారు. వారికి కావాల్సినవి తీసుకొచ్చి వారి గది బయటపెడితే తీసుకోవాలి అంతే. ఎవ్వరికీ కనిపించను కూడా కనిపంచకూడదు. అంత దారుణమైన గడ్డు పరిస్థితుల్లో జీవించేవారు నాటి వితంతువులు. ఇప్పుడిప్పుడే కొంచె వారిని మంచిగానే చూస్తున్నా..కొన్ని విషయాల్లో వారి పట్ల అమానుషంగానే ప్రవర్తిస్తున్నారు. వాళ్లు ఇలాంటి హోలీ పర్వదినం రోజున బయటకు అస్సలు రాకూడదు, రంగులు జల్లుకోకూడదట. వారికోసం ఓ ఎన్జీవో ముందుకోచ్చి సుప్రీం కోర్టులో పోరాడి మరీ వారు కూడా సెలబ్రేట్ చేసుకునేలా చేసింది. ఈ కథ ఎక్కడ జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోlr వింతతు స్త్రీలను మాత్రం రంగుల హోలీలో పాల్గొనిచ్చేవారు కాదు. అస్సలు వారు సెలబ్రేట్ చేసుకోకూడదని నిషేధం విధించారు అక్కడి పెద్దలు. తెల్లటి చీరతో ఉండేవారికి సంతోషానికి ప్రతీకలైన రంగులను ముట్టకూదని కట్టుదిట్టమైన ఆంక్షాలు ఉండేవి. పితృస్వామ్య నిబంధనలు గట్టిగా రాజ్యమేలుతున్న ఆ బృందావన్‌లో వారి స్థితి అత్యంత కడు దయనీయంగా ఉండేది. వారి జీవితాలలో వెలుగు నింపేందుకు ఎన్జీవ్ సులభ్ ఇంటర్నేషన్ల అనే స్వచ్ఛంద సంస్థ మార్పుకు నాంది పలికింది. ఆ ఎన్జీవో మహిళా సాధికారత, సామాజిక సమ్మేళనం వంటి వాటికి ప్రసిద్ధి చెందింది. ఆ స్వచ్ఛంద సంస్థ ఇలాంటి నిబంధనలను తొలగించి వారుకూడా అందరిలా పండుగలను చేసుకునేలా చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించి మరీ వారికి సామాజిక కట్టుబాట్ల నుంచి విముక్తి కలిగించింది. అయినప్పటికీ ఆ వితంతువులు పండుగ చేసుకోవడం చాలా సవాలుగా ఉండేది. సరిగ్గా 2012 నుంచి వారంతా కూడా ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచే ప్రతి ఏటా ఈ హోలీ రోజున వారంతా కృష్ణుని సమక్షంలో ఆడి పాడి వేడుకగా చేసుకుంటున్నారు. అంతేగాదు ఈ ఒక్క పండుగే గాక దీపావళి వంటి ఇతర అన్ని పండుగలు చేసుకునేలా స్వేచ్ఛను పొందారు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పండుగలకు దూరమై ఉన్న ఆ వితంతువులను ధైర్యంగా అడుగు వేసి, తాము సాటి మనుషులమే ఇది తమ హక్కు అని వారికి గుర్తు చేసింది ఆ స్వచ్ఛంద సంస్థ. ఆ వితంతువులు ఈ హోలీని స్త్రీ ద్వేషం, పితృస్వామ్య నిబంధనలపై విజయం సాధించి, పొందిన స్వేచ్ఛకు గుర్తుగా సంతోషభరితంగా చేసుకుంటారు ఆ వితంతువులు. చెప్పాలంటే ఇది అసలైన హోలీ వేడుక అని చెప్పొచ్చు కథ! (చదవండి: రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?) -
కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్ యువతి
లక్నో: దేవుడంటే ఆమెకు అమిత భక్తి. నిత్యం శ్రీకృష్ణుని నామస్మరణలో మునిగి తేలే ఆమె తన ఆరాధ్య దైవాన్ని ఓ సారి దర్శించాలనుకుంది. అందుకోసం ఆత్మహత్య చేసుకుని ఆ దేవుడి చెంతకు చేరేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రష్యన్ యువతి తత్యానా హెలోవ్స్కయ గతేడాది ఫిబ్రవరి నుంచి యూపీలోని వృందావన్ ధామ్ అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో తను ఉంటున్న భవనంలో ఆరో అంతస్థు నుంచి దూకి అర్ధాంతరంగా తనువు చాలించింది. (చదవండి: చేపల కూర విషయమై గొడవ, హత్య) అయితే ఆమెకు కృష్ణుడిని కలవాలన్న కోరిక ఉండేదని, అందుకోసమే ఇలా ప్రాణత్యాగం చేసి ఉండవచ్చని అదే భవనంలో నివసిస్తున్న స్నేహితురాలు పోలీసులకు తెలిపారు. కాగా ఆత్మహత్య చేసుకున్న యువతి రష్యాలోని రోస్తవ్ నగరానికి చెందినదని, ప్రయాణికురాలి వీసా కింద ఇక్కడకు వచ్చిందని పోలీసులు నిర్ధారణ చేశారు. ఆమె మరణ విషయాన్ని రష్యన్ ఎంబసీకి చేరవేశారు. (చదవండి: వెండి సింహాల చోరుడి అరెస్ట్) -
అవి పవిత్ర స్థలాలు : మద్యం, మాంసం నిషేధం
లక్నో : మధుర జిల్లాలోని బృందావన్ నగర్ పాలిక్ పరిషత్తు, బార్సానా నగర్ పంచాయత్‌లను పవిత్ర తీర్థ ప్రాంతాలకు ప్రకటిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల్లో మాంసం, లిక్కర్ అమ్మకాలను జరుపకూడదని, వీటిని నిషేధిస్తున్నట్టు శుక్రవారం పేర్కొంది. బృందావన్ ప్రాంతం కృష్ణ భగవానుడి, ఆయన పెద్ద సోదరుడు బలరామ్ జన్మస్థలం కాగ, బార్సానాలో రాధ జన్మించినట్టు ఆధారాలున్నాయి. బృందావన్ కృష్ణుడి జన్మించిన స్థలం కావడంతో, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఈ ప్రాంతాలను లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని, టూరిజంను మరింత అభివృద్ధి చేయడం కోసం వీటిని పవిత్ర యాత్రికుల స్థలాలుగా యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు, స్థానికులకు మంచి వసతులను కల్పించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో మాంసం, మద్యం అమ్మకాలను జరుపకూడదంటూ టూరిజం, మతపరమైన వ్యవహారాల చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తి చెప్పారు. -
స్వామీజీ దర్శనానికి వెళ్లిన మహిళపై దారుణం
మథుర: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఆధ్యాత్మిక గురువు దర్శనం కోసం ఆయన ఆశ్రమానికి వెళ్లిన వివాహితపై ఆశ్రమ నిర్వాహకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. జూలై 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన భార్యాభర్తలు.. విపిన్ మహారాజ్ గురు దర్శనం కోసం బృందావనంలోని రాస్ బెహరి ట్రస్ట్ ఛారిటబుల్ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఆశ్రమ బాధ్యతలు చూసే నిర్వాహకుడు సామాగ్రి తీసుకురావాల్సిందిగా ఢిల్లీకి చెందిన వ్యక్తి చెప్పాడు. ఆయన మార్కెట్‌కు వెళ్లగా ఒంటరిగా ఉన్న వివాహితపై ఆశ్రమ నిర్వాహకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. బాధితురాలు భర్తతో కలసి వెళ్లి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని, కేసును యూపీలోని బృందావనం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బుర్జ్ ఖలీపా కన్నా మన ఆలయానికే..
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం 'చంద్రోదయ మందిరం' మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కట్టడమైన బూర్జ్ ఖలీఫా కన్నా లోతైన పునాదితో ఈ ఆలయాన్ని నిర్మిస్తుండటం గమనార్హం. బూర్జ్ ఖలీఫా పునాదికి 50 మీటర్ల లోతు ఉండగా.. అంతకన్నా ఐదు మీటర్ల ఎక్కువ లోతు పునాదితో ఉత్తరప్రదేశ్ బృందావన్ లో 'చంద్రోదయ మందిరం' నిర్మాణమవుతోంది. ఈ ఆలయానికి 55 మీటర్ల లోతు పునాది ఉంటుందని, వచ్చే ఏడాది మార్చిలోగా పునాది నిర్మాణం పూర్తి అవుతుందని ఆలయ ప్రాజెక్టు డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహా దాస్ తెలిపారు. ఎత్తుపరంగానే కాకుండా ఇందులోని అటవీప్రాంతం, థీమ్ పార్కుల విషయంలోనూ ఎన్నో విశిష్టతలు ఈ ఆలయం కలిగి ఉంది. ఆ ఆలయం పరిసరాల్లో ఏర్పాటుచేస్తున్న థీమ్ పార్కులో డార్క్ రైడ్స్, లైటింగ్, సౌండింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్, శ్రీకృష్ణుని జీవితాన్ని ప్రతిబింబించేలా లేజర్ షోలు వంటివి ఉంటాయని నరసింహ దాస్ వివరించారు. ఏడు వందల అడుగుల ఎత్తుతో, రూ. 700 కోట్ల వ్యయంతో 2022 నాటికి ప్రపంచంలోనే ఎత్తైన ఈ ఆలయం నిర్మాణం పూర్తికానుంది. బెంగళూరు ఇస్కాన్ భక్తుల ఆలోచనకు అనుగుణంగా నిర్మితమవుతున్న ఈ ఆలయంలో 12 అటవీ ప్రాంత నమూనాలు ఉంటాయి. మధువనం, తాలవనం, కుముదవనం, బహుళవనం, కామ్యవనం, ఖదిరవనం, బృందావనం, భద్రావనం, బిల్వవనం, లోహవనం, భాందిరవనం, మహావనం పేరిట ఈ అటవీ నమూనాలు నిర్మాణం కానున్నాయి. ఇక రాధాకృష్ణులు, కృష్ణాబలరాములు, చైతన్య మహాప్రభు, స్వామి ప్రభుపాద తదితరులు నలుగురి ఆలయాలు కూడా ఇందులో ఉంటాయి. మ్యూజిక్ ఫౌంటెయిన్లు, గార్డెన్లు వంటివెన్నో అద్భుతమైన చూడదగ్గ ప్రదేశాలతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. -
బృందావనంలో అశ్లీల చిత్రాల కలకలం
ప్రముఖ ఆథ్యాత్మిక పట్టణం, ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో కాలేజీ విద్యార్థినుల అశ్లీల చిత్రాలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న 50 మందికి పైగా అమ్మాయిల ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో ఉంచారు. వారిని కాల్ గర్ల్స్ గా పేర్కొంటూ వాట్సాప్ ద్వారా మార్ఫ్డ్ ఫొటోలు, అమ్మాయిల పేర్లు, చిరునామా తదితర వివరాలు పొందుపర్చారు. దీంతో బాధిత యువతుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, గత ఏడాది నవంబర్ లోనూ బృందావనంలో ఇదే తరహాలో పదుల సంఖ్యలో అమ్మాయిల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఉదంతం సంచలనం రేపింది. తాజా వ్యవహారంపై బాధితురాళ్లలో కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై నగర ఎస్సీ అలోక్ ప్రియదర్శిని స్పందిస్తూ ఈ ఉదంతాన్ని సైబర్ క్రైమ్ కేసుగా నమోదుచేసి నిందితులకోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా, గతంలో చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వల్లే బృందావనంలో మళ్లీ ఇలాంటి ఘోరాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
112 కోట్లకు చేరిన ఆలయ ఆదాయం!
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన బక్నే బీహారీ దేవాలయ ఆదాయం వంద కోట్ల మార్కును దాటేసింది. వ్రిందావన్ లో ఉన్న ఈ కృష్ణుడి దేవాలయ ఆదాయం గత మూడేళ్లలో రెండు రెట్లు పెరిగింది. 1864లో స్థాపించిన ఈ ప్రాచీన అపురూప దేవాలయానికి 2015-16 ఆర్ధిక సంవత్సరంలో రూ.112కోట్ల ఆదాయం వచ్చింది. ప్రధానంగా విరాళాలు, దేవాలయం పేరు మీద ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీల నుంచి అధిక ఆదాయం సమకూరినట్లు సమాచారం. దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ టూరిజం అధికారి తెలిపిన వివరాల ప్రకారం 2015లో మొత్తం 1.26 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శింకున్నారు. కాగా, ఆలయ ఆదాయంపై ఆలయ కమిటీ ఎలాంటి అధికారికి ప్రకటనా చేయలేదు. -
రూ. 500 నోట్లతో డబ్బుల వాన!
ఆగ్రా(యూపీ): బృందావనంలో డబ్బుల వాన కురిసింది. పైనుంచి పడుతున్న రూ. 500 నోట్లను ఒడిసి పట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. డబున్న మహరాజు ఎవరో వీటిని విసిరేశాడనుకుంటే పప్పులో కాలేసినట్టే. పైనుంచి పైకం విసిరేసింది ఒక కోతి. దానికి అంత డబ్బు ఎక్కడి వచ్చిందా అని అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. బాంకీ విహారి ఆలయంలో శనివారం ఈ ఆసక్తికర ఘటన చోటుకుంది. అసలేం జరిగిందంటే... ముంబైలోని బొరివలీ ప్రాంతానికి చెందిన హేమవతి సోంకర్(50) తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి శనివారం బృందావనంకు వచ్చారు. బాంకీ విహారి ఆలయంలో పూజలు చేసిన తర్వాత రోడ్డు పక్కనున్న దుకాణాల్లో షాషింగ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోతి హఠాత్తుగా కిందికి దూకి హేమవతి చేతిలోని బ్యాగ్ లాక్కుపోయింది. దుకాణం పైకి ఎక్కి అందులోని నోట్ల కట్లను బయటకు లాగి పైనుంచి విసిరేసింది. డబ్బులు ఏరుకునేందుకు అక్కడున్నవారంతా పోటీ పడ్డారు. తమ దొరికిన నోట్లను చాలా మంది హేమవతికి తిరిగిచ్చేసి తమ నిజాయితీ చాటుకున్నారు. కొంతమంది మాత్రం చేతివాటం ప్రదర్శించారు. తన బ్యాగులో రూ. లక్షన్నర ఉందని, వీటిలో 100 నుంచి 500 నోట్లు ఉన్నాయని హేమవతి వెల్లడించారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కాగా, బృందావనంలో కోతులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తరచుగా వచ్చే భక్తులతో పాటు, స్థానికులు వాపోతున్నారు. -
సాధువు లైంగిక వేధింపులపై ఫిర్యాదు
ఒక సాధువు తనను వేధిస్తున్నాడంటూ ఇటలీకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం నాడు విచారణ ప్రారంభించారు. తనను చూసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నితాయీ దాస్ అనే సదరు సాధువు తనపై యాసిడ్‌తో దాడి చేస్తానని కూడా బెదిరించినట్లు బ్రిజ్ బాసి దేవి దాసి తెలిపారు. ఆమె గత 40 ఏళ్లుగా బృందావనంలోనే ఉంటున్నారు. బ్రిజ్ బాసి దేవి ఫిర్యాదుపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు మథుర సీనియర్ ఎస్పీ మంజిల్ సైనే తెలిపారు. -
బృందావన్‌లో వితంతువుల వసంత కేళీ
బృందావన్(యూపీ): వారంతా పసుపు-కుంకుమలకు దూరమైన వితంతువులు. వసంతాలు వెలిసిపోయిన వారి జీవితాల్లో హోలీ మళ్లీ రంగులు పూయించింది. మోడు వారిన వింతువుల జీవితాల్లో వసంత కేళి ఆనందోత్సాహాలు నింపింది. దాదాపు వెయ్యి మంది వితంతువులు హోలీ ఆడుతూ మళ్లీ రంగుల లోకంలో విహరించారు. ఈ అపూర్వ ఘట్టం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో జరిగింది. మీరా సహభాగిని ఆశ్రమం వేదికగా నిలిచింది. కృష్ణుడి భక్తులు, పర్యాటకుల సమక్షంలో ఒకరిపై ఒకరు రకరకాల రంగులు చల్లుకుంటూ వసంత కేళి ఆడారు. నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. బృందావన్ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో వితంతువులు హోలీ వేడుకల్లో ఇది మొదటిసారి. హోలీ వేడుకల కోసం 500 కిలోలకు పైగా రంగులు, గ్యాలన్లకొద్దీ నీరు వినియోగించారు. మహిళల సాధికారత కృషి చేస్తున్న సులభ్ ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బృందావన్‌లో ఉన్న ఆశ్రమాల్లో వేలాది మంది వితంతువులు ఉంటున్నారు. వీరందరి కోసం సాంప్రదాయ రాసలీల న్యత్యం, ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. గతేడాది పూలు చల్లుకుని వితంతువులు ఇక్కడ హోలీ వేడుకలు జరుపుకున్నారు.