రూ. 500 నోట్లతో డబ్బుల వాన! | 500-rupee notes rain down near Banke Bihari temple | Sakshi
Sakshi News home page

రూ. 500 నోట్లతో డబ్బుల వాన!

Published Mon, Jul 20 2015 9:17 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

రూ. 500 నోట్లతో డబ్బుల వాన! - Sakshi

రూ. 500 నోట్లతో డబ్బుల వాన!

ఆగ్రా(యూపీ): బృందావనంలో డబ్బుల వాన కురిసింది. పైనుంచి పడుతున్న రూ. 500 నోట్లను ఒడిసి పట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. డబున్న మహరాజు ఎవరో వీటిని విసిరేశాడనుకుంటే పప్పులో కాలేసినట్టే. పైనుంచి పైకం విసిరేసింది ఒక కోతి. దానికి అంత డబ్బు ఎక్కడి వచ్చిందా అని అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. బాంకీ విహారి ఆలయంలో శనివారం ఈ ఆసక్తికర ఘటన చోటుకుంది.

అసలేం జరిగిందంటే...
ముంబైలోని బొరివలీ ప్రాంతానికి చెందిన హేమవతి సోంకర్(50) తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి శనివారం బృందావనంకు వచ్చారు. బాంకీ విహారి ఆలయంలో పూజలు చేసిన తర్వాత రోడ్డు పక్కనున్న దుకాణాల్లో షాషింగ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోతి హఠాత్తుగా కిందికి దూకి హేమవతి చేతిలోని బ్యాగ్ లాక్కుపోయింది. దుకాణం పైకి ఎక్కి అందులోని నోట్ల కట్లను బయటకు లాగి పైనుంచి విసిరేసింది. డబ్బులు ఏరుకునేందుకు అక్కడున్నవారంతా పోటీ పడ్డారు.

తమ దొరికిన నోట్లను చాలా మంది హేమవతికి తిరిగిచ్చేసి తమ నిజాయితీ చాటుకున్నారు. కొంతమంది మాత్రం చేతివాటం ప్రదర్శించారు. తన బ్యాగులో  రూ. లక్షన్నర ఉందని, వీటిలో 100 నుంచి 500 నోట్లు ఉన్నాయని హేమవతి వెల్లడించారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కాగా, బృందావనంలో కోతులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తరచుగా వచ్చే భక్తులతో పాటు, స్థానికులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement