ప్రకాశం: పసికందును బలిగొన్న వానరం | Infant dies in monkey attack in Prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో ఘోరం: నిద్రిస్తున్న పసికందును బలిగొన్న వానరం

Published Fri, Dec 2 2022 7:20 PM | Last Updated on Fri, Dec 2 2022 7:25 PM

Infant dies in monkey attack in Prakasam district - Sakshi

సాక్షి, ప్రకాశం: జిల్లాలో శుక్రవారం ఘోరం జరిగింది.  పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరుబయట నిద్రపోతున్న ఓ చిన్నారిని ఈడ్చుకెళ్లి కిందపడేసింది వానరం. ఈ క్రమంలో తలకు తీవ్రగాయం కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. 

పెదచర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర-సుమతీ దంపతులు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు. రెండు నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చింది సుమతీ. ఈ క్రమంలో ఎప్పటిలాగే.. పసికందును ఆరుబయట మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కోతి.. పసికందును మంచం మీద నుంచి ఈడ్చుకెళ్లింది. 

గట్టిగా కిందపడేయడం.. అదే సమయంలో అక్కడే ఉన్న వ్యవసాయ సామాగ్రి ఆ పసికందుపై పడడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. అలికిడికి అక్కడికి వచ్చిన తల్లి.. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరు అయ్యింది. పసికందు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement