కెన్యాకు కోతి పవర్ కట్ చేసిందట! | Kenya blames a monkey for 3-hour nationwide blackout | Sakshi
Sakshi News home page

కెన్యాకు కోతి పవర్ కట్ చేసిందట!

Published Wed, Jun 8 2016 1:48 PM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

కెన్యాకు కోతి పవర్ కట్ చేసిందట! - Sakshi

కెన్యాకు కోతి పవర్ కట్ చేసిందట!

నైరోబీ: కెన్యా కారు చీకట్లో వెళ్లడానికి కారణాన్ని కోతిపై నెట్టారు. దాదాపు మూడు గంటలపాటు కెన్యా చీకట్లోకి వెళ్లిపోవడానికి ఓ కోతి చేసిన తప్పే కారణం అని కుండబద్దలు కొట్టారు. కెన్యాలో మూడు గంటలపాటు కరెంటు పోయింది. అది ఎందుకనే విషయం తొలుత ఎవరికీ తెలియలేదు.

అయితే, దీనిపై కెన్యాకు చెందిన ఓ ఎలక్ట్రిక్ కంపెనీ వివరణ ఇచ్చింది. ఒక కోతి తమ కంపెనీ గిటారు పవర్ స్టేషన్ పైకప్పు మీదికి ఎక్కిందని, అక్కడినుంచి ట్రాన్స్ ఫార్మర్ మీద పడి పవర్ ట్రిప్ చేసిందని, ఈ కారణంతో ఈ సంస్థకు సంబంధిచిన అన్ని మెషిన్లు పనిచేయడం ఆగిపోయాయని చెప్పింది. ఈ కారణంగా మధ్య కెన్యాకు అవసరమయ్యే 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, అందుకే పవర్ కట్ అయిందని చెప్పింది. అయితే, ఆ కోతి బతికి ఉందా చనిపోయిందా.. అసలు నిజంగా కోతిని ఎవరైనా చూశారా అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement