kenya
-
తీవ్రమైన కరువు కోరల్లో కెన్యా
కెన్యా నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువుతో కొట్టుమిట్టాడుతోంది. లక్షలాది మంది ప్రజలు తగినంత ఆహారం, నీరు లేకుండా అల్లాడిపోతున్నారు. వాతావరణ మార్పులతో తీవ్రమైన కరువు దేశ వ్యవసాయం, పశుసంపదపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో కెన్యా ప్రజల జీవనోపాధి కష్టమవుతోంది. తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు కూడా లేక లక్షలాది మంది ప్రజలు అంటు వ్యాధులబారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. ఎండిపోతున్న జలాశయాలు కెన్యాలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన కరువు తాండవిస్తోంది. నదులు, సరస్సులు, జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. చిన్నపాటి చెరువులు ఎండిపోతున్నాయి. ఐక్యరాజ్యసమితి నీటి అభివృద్ధి నివేదిక ప్రకారం భూగర్భ జల మట్టాలు సైతం పడిపోతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు దేశాన్ని తీవ్రమైన కరువులోకి నెట్టేశాయి. 15 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ దీర్ఘకాలిక కరువు ధాటికి దాణా దొరక్క ఏకంగా 70 శాతం పశువులు ప్రాణాలు కోల్పోయాయి. పాడి ఆవులపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవనం ఇప్పుడు ఆదాయం లేక దుర్భరమైంది. ఆహార వనరులు కూడా తగ్గిపోయాయి. కరువు దెబ్బకు ఉన్న కాస్తంత ప్రధాన ఆహారాల ధరలు అమాంతం పైకిఎగశాయి. బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు ఐదేళ్ల సగటు కంటే 10 నుంచి 90 శాతం అధికంగా ఉన్నాయి. ఎంత లోతు తవ్వినా.. 2023లో కొన్ని ప్రాంతాల్లో దశాబ్దం కిందటి కంటే రెట్టింపు లోతులో బావులు తవ్వాల్సి వచ్చింది. తీవ్రమైన కరువు కారణంగా, చాలా మంది భూగర్భం నుంచి తీసుకువచ్చిన నీటిని తాగవలసి వస్తోంది. ఇది కూడా పరిశుభ్రంగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో నీటి విక్రయాలు పెరిగాయి. ఆ నీరు సైతం పరిశుభ్రంగా ఉండకపోవడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు, కెన్యా కరువు ప్రతిస్పందన పథకం కింద సుమారు 30 లక్షల మంది ప్రజలు ఏదో ఒక రకమైన కరువు సహాయాన్ని పొందారు.ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి తక్కువ పారిశ్రామికీకరణతో ఇక్కడ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు తక్కువే. అయినా తక్కువ వర్షపాతం, గ్లోబల్ వార్మింగ్ కరువుకు కారణమవుతున్నాయి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా, భవిష్యత్తులో కరువు ప్రభావాలను తగ్గించడానికి దేశానికి ఆర్థిక మద్దతును పెంచాలని కెన్యా ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని ఈ ఏడాది అజర్ బైజాన్‌లోని బాకు నగరంలో జరిగిన 2024 ఐక్యరాజ్యసమితి కాన్ఫెరెన్స్ ఆఫ్ పారీ్టస్(కాప్29) సదస్సు పునరుద్ఘాటించింది. ఇలాంటి క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి దేశానికి సహాయపడటానికి అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింత ఆర్థిక మద్దతు అవసరమని నొక్కి చెప్పింది. – సాక్షి నేషనల్ డెస్క్ -
అముర్ ఫాల్కన్ సూపర్ర్...బర్డ్..
సాక్షి, అమరావతి: అలుపెరుగని బాటసారిలా... వేలాది కిలోమీటర్లు ఎగురుతూ అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే అముర్ ఫాల్కన్ వలస పక్షుల్లో ఓ పక్షి తాజా పయనం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. భారత్ నుంచి బయలుదేరిన అముర్ ఫాల్కన్ 5 రోజుల 17 గంటల్లో సోమాలియా చేరుకుని, అక్కడ నుంచి కెన్యాలోకి ప్రవేశించింది. మధ్యలో ఎక్కడా ఆగకుండా పలు దేశాలతో పాటు, ఏకంగా అరేబియా సముద్రాన్ని కూడా దాటుకుని తన గమ్యస్థానం చేరుకుంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, స్థానిక వలంటీర్లు సైబీరియా నుంచి వచి్చన రెండు పక్షులను మణిపూర్‌లో పట్టుకుని వాటికి స్థానిక గ్రామాలైన చిలువాన్, గ్యాంగ్‌రామ్ పేర్లు పెట్టారు. ఈనెల 8వ తేదీన చిలువాన్–2 పక్షికి శాటిలైట్ రేడియో ట్యాగ్ అమర్చారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న గుహగర్ నుంచి 10వ తేదీన నాన్‌స్టాప్ జర్నీ మొదలుపెట్టిన చిలువాన్–2, 15వ తేదీ నాటికి సోమాలియాలోని మొదటి గమ్యానికి చేరుకున్నట్లు రేడియో ట్యాగ్ ద్వారా పక్షి గమనాన్ని పర్యవేక్షించిన సైంటిస్టు సురేశ్ కుమార్ తెలిపారు. అయితే గ్వాంగ్రామ్ పేరు పెట్టిన మరో పక్షి మాత్రం తమెంగ్‌లాంగ్‌లోని చిలువాన్ రూస్టింగ్ సైట్లోనే ఉన్నట్లు గుర్తించారు. చిలువాన్–2 గ్రేట్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని స్కోటోరా ద్వీపం సమీపంలోని ఓ విమాన మార్గంలో ఉందని తెలిపారు. లక్షల సంఖ్యలో పక్షులు ‘ఆర్కిటిక్ టర్న్’ అనే పక్షి తర్వాత అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే పక్షులుగా అముర్ ఫాల్కన్కు పేరుంది. 2018 నుంచి మణిపూర్‌లో ఈ పక్షుల వలస ప్రయాణాలు, మార్గాలను తెలుసుకునేందుకు రేడియో ట్యాగింగ్ చేసి అధ్యయనం చేస్తున్నారు. రేడియో ట్యాగ్లు అమర్చిన అన్ని పక్షులు గమ్యాలను చేరుకోలేకపోవడంతో వాటి గురించి పూర్తి వివరాలు తెలియలేదు. లక్షల సంఖ్యలో వెళ్లే పక్షుల్లో కేవలం రెండు, మూడు పక్షులకు మాత్రమే రేడియో ట్యాగ్లు అమర్చడం వల్ల వాటికి ఏమైనా హాని జరిగితే వాటి వలసల గురించి పూర్తి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. 2019లో ఒక అముర్ ఫాల్కన్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించి 26 వేల కిలోమీటర్లు వెళ్లడాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మళ్లీ చిలువాన్–2 ద్వారా కొన్ని వివరాలు సేకరించగలిగారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే పక్షుల వలస మార్గాన్ని అధ్యయనం చేయడం ఈ పరిశోధన లక్ష్యమని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) సైంటిస్టు సురేశ్‌కుమార్ తెలిపారు. వాతావరణంలో జరిగే మార్పులను తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పక్షులు పొలంలోని పురుగులు, క్రిములు, కీటకాలను తినడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తాయని, అవి రాకపోతే పంట దిగుబడులు కూడా అనూహ్యంగా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.సైబీరియా టు ఆఫ్రికా... వయా ఇండియా ఫాల్కన్ కుటుంబానికి చెందిన పక్షుల్లో చిన్నవైన అముర్ ఫాల్కన్ పక్షులు ఆగ్నేయ సైబీరియా, ఉత్తర చైనాలో సంతానోత్పత్తి చేస్తాయి. వేసవికాలం అక్కడే ఉండే ఈ పక్షులు తీవ్రమైన శీతాకాలం నుంచి తప్పించుకోవడానికి ఆఫ్రికా తీర ప్రాంతాల్లోని శీతాకాలపు మైదానాలకు వెళతాయి. ఈ క్రమంలో 15 నుంచి 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. సైబీరియా నుంచి ఆఫ్రికాకు వెళ్లే మార్గ మధ్యంలో నాగాలాండ్, మణిపూర్ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో ఆగిపోతాయి. వీటిని నాగాలాండ్, మణిపూర్‌లో ‘అఖుయిపుయినా’ అని పిలుస్తారు. సగటున 45 రోజులు అవి ఇక్కడే ఉండి ఆహారాన్ని సమకూర్చుకుని సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా సన్నద్ధమవుతాయి. నిరంతరాయంగా ఎగిరేందుకు వీలుగా బరువును తగ్గించుకుంటాయి. ఆఫ్రికాలో శీతాకాలం ముగిశాక ఏప్రిల్, మే నెలల్లో ఇవి తిరుగు ప్రయాణమై మళ్లీ సైబీరియా వెళతాయి. తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఇవి మన దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఆగుతాయి. -
జుంబారే మొంబాసా!
కార్నివాల్ అంటే బ్రెజిల్లో జరిగే రియో కార్నివాల్ ఎక్కువమందికి గుర్తుకొస్తుంది. ఆఫ్రికా దేశమైన కెన్యాలో కూడా దాదాపుగా అదే స్థాయి కార్నివాల్ ఏటా జరుగుతుంది. కెన్యా తీర నగరమైన మొంబాసాలో ఏటా నవంబర్ నెలలో నెల పొడవునా కార్నివాల్ సందడిగా జరుగుతుంది. ఈ నెల్లాళ్లూ మొంబాసా నగరంలోని వీథులన్నీ రకరకాల ఊరేగింపులతో, సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలతో కోలాహలంగా కనిపిస్తాయి. తూర్పు ఆఫ్రికాలో జరిగే అతిపెద్ద సాంస్కృతిక వేడుక ఇది. తూర్పు ఆఫ్రికాలోని సాంస్కృతిక భిన్నత్వాన్ని ఏకతాటిపైకి తెచ్చే వేడుకగా సాగే ఈ కార్నివాల్లో ప్రతిరోజూ సంప్రదాయ వేషధారణలతో నృత్య సంగీతాలతో జరిగే ఊరేగింపులు ఉంటాయి. బహిరంగ వేదికల మీద నృత్య, సంగీత ప్రదర్శనలు ఉంటాయి. కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు జరుగుతాయి. తూర్పు ఆఫ్రికా సంప్రదాయ సంగీత రీతులైన ‘బెంగా’, ‘తారబ్’, సంప్రదాయ నృత్యరీతులైన ‘చకాచా’, ‘గిరియామా’ ప్రదర్శనలతో పాటు, స్థానిక మత్స్యకారులు చేసే వివిధ సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వాహిలి, మిజికెందా, తైటా తెగల ప్రజలు ఎక్కువగా ఈ ప్రదర్శనలు చేస్తారు. ఈ కార్నివాల్లో కొత్తతరం యువతీ యువకులు హిప్ హాప్, ఆఫ్రో ఫ్యూజన్ వంటి ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు చేస్తారు. మొంబాసా కార్నివాల్ స్థానిక చేతివృత్తుల వారికి ప్రధాన వేదికగా నిలుస్తుంది. హస్తకళా నైపుణ్యంతో వారు తయారు చేసిన సంప్రదాయ వస్తువుల అమ్మకాల కోసం ప్రధాన కూడళ్లలోను, ప్రత్యేక మైదానాల్లోను తాత్కాలికంగా దుకాణాలతో ప్రదర్శనశాలలు ఏర్పాటవుతాయి. దేశ విదేశాల నుంచి ఈ కార్నివాల్‌ను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఇక్కడి చేతివృత్తుల వారు తయారు చేసిన వస్తువులను జ్ఞాపికలుగా కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు. ఈ ప్రదర్శనశాలలోనే ఆఫ్రికన్ సంప్రదాయ వంటకాలు, విదేశీ వంటకాలతో ఆహారశాలలు కూడా ఏర్పాటవుతాయి. కార్నివాల్ జరిగే నెల్లాళ్లూ విందు వినోదాలు, కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు, శిక్షణ శిబిరాలు, సాంస్కృతిక పరిరక్షణపై చర్చా కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి. -
అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?
అదానీ గ్రూప్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃపరిశీలిస్తామని కెన్యా ప్రకటించింది. కెన్యాలో విమానాశ్రయ అభివృద్ధితోపాటు ఎనర్జీ ప్రాజెక్ట్‌ల విస్తరణ కోసం అదానీ గ్రూప్ గతంలో ఒప్పందం చేసుకుంది. ఇటీవల అదానీ సంస్థలపై చెలరేగుతున్న నేరాభియోగాల వల్ల కెన్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఉదంతం నుంచి కోలుకుని, క్రమంగా పుంజుకున్న అదానీ గ్రూప్‌నకు మళ్లీ షాక్ తగిలింది. భారత్‌లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు పొందేందుకు దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి.ఇదీ చదవండి: సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి: ఐఎస్ఏ నివేదికఈ నేపథ్యంలో కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ప్రకటన విడుదల చేశారు. కెన్యాలో విమానాశ్రయాలు, పవర్ ట్రాన్స్మిషన్లైన్ల విస్తరణకు అదానీ గ్రూప్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు చెప్పారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాక దీనిపై పునరాలోచిస్తామన్నారు. ఈ డీల్ విలువ 736 మిలియన్ డాలర్లు(రూ.6216 కోట్లు). ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు. -
లొకేషన్ వేటలో రాజమౌళి..!
కెన్యాలో లొకేషన్ వేట ఆరంభించారు రాజమౌళి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసిన రాజమౌళి లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో రాజమౌళి ఉన్నారు. కెన్యా, ఆఫ్రికా లొకేషన్స్‌లో కొన్ని లొకేషన్స్‌ని ఎంపిక చేసి, తొలి షెడ్యూల్‌ని అక్కడే ఆరంభిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
అడవుల్లో రాజమౌళి హంటింగ్.. ఆ సినిమా కోసమేనా?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం వేకేషన్లో చిల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ ఎక్కువగా రావడంతో ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కెన్యాలోని అడవుల్లో వన్య ప్రాణలను చూస్తూ సేద తీరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. అడవుల్లో తిరుగుతున్న ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు దర్శకధీరుడు. (ఇది చదవండి: ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్)మరోవైపు ప్రిన్స్ మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ సినిమాను ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో కథ ఉంటుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చారు. అందువల్లే ఆఫ్రికాలోని దట్టమైన అడవుల లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. #TFNReels: Maverick Director @ssrajamouli is currently scouting locations in Kenya, Africa for #SSMB29!!🌎🔥#MaheshBabu #SSRajamouli #TeluguFilmNagar pic.twitter.com/ABq6DxfVOg— Telugu FilmNagar (@telugufilmnagar) October 29, 2024 View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
ఓ పచ్చని నీడ! గ్రీన్ వారియర్..పద్నాలుగేళ్లకే..!
పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఏం చేయగలం!’ అని ఎవరైనా నిట్టూరిస్తే... ‘ఎంతో చేయగలం’ అని చెప్పడానికి కెన్యాకు చెందిన ఎల్లియానే బలమైన ఉదాహరణ. పచ్చని చెట్టు నీడలో, చల్లటి వెన్నెల నీడలో ఆమె విన్న కథల్లో పర్యావరణ ఉద్యమకారిణి ప్రొఫెసర్ మాథాయ్ ఉంది. మాథాయ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా వేలాది మొక్కలు నాటింది ఎల్లియానే. ‘చిల్డ్రన్స్ విత్ నేచర్’ స్వచ్ఛంద సంస్థ స్థాపించి మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా మార్చింది. స్ఫూర్తి అనేది ఎంత గొప్పదో చెప్పడానికి బలమైన ఉదాహరణ ఎల్లియానే వాంజీ క్లిస్టన్. చిన్నప్పుడు తాను విన్న కథల్లో కథానాయిక వంగరి మాథాయ్. నోబెల్ బహుమతి గ్రహీత వంగరి మాథాయ్ చెట్ల రక్షణ, మొక్కల పెంపకం గురించి చేసిన కృషి, ఉద్యమం అంతా ఇంతా కాదు. ఆమె ప్రారంభించిన ‘గ్రీన్ బెల్ట్ మూమెంట్’ గురించి కథల రూపంలో విన్నది ఎల్లియానే. వంగరి మాథాయ్ స్ఫూర్తితోనే గ్రీన్ వారియర్‌గా మారింది.మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఫ్లోరెన్స్ నైటింగేల్ లాంటి ప్రపంచ ప్రసిద్ధుల గురించి వినడం ద్వారా ‘మార్పు’ గొప్పదనం ఏమిటో తెలుసుకుంది. ‘మన భూగోళాన్ని రక్షించడానికి నేను సైతం’ అంటూ ప్రయాణం ప్రారంభించింది. పర్యావరణ కార్యక్రమాలలో భాగంగా కింగ్ చార్లెస్లాంటి వారిని కలుసుకోవడం, గ్రామీ అవార్డ్ గ్రహీత మెజీ అలాబీ, మాజీ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్‌తో కలిసి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొనడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది.‘నేను ప్రొఫెసర్ మాథాయ్ కావాలనుకుంటున్నాను’ అని చిన్నప్పుడు ఎల్లియానే తల్లితో అన్నప్పుడు ఆ తల్లి నుంచి తక్షణ స్పందనగా రావాల్సిన మాట... వెరీ గుడ్! అయితే కూతురు నుంచి వచ్చిన మాట విని తల్లి భయపడింది. మాథాయ్ను మానసికంగా ఎలా గాయపరిచారో, కొట్టారో, జైల్లో పెట్టారో వివరంగా చెప్పింది. ‘నువ్వు డాక్టర్ లేదా లాయర్ కావడం మంచిది’ అని కూతురికి సలహా కూడా ఇచ్చింది ఆ తల్లి. తల్లి చెప్పింది విని ఎల్లియానే భయపడి ఉండాలి. కానీ అలా జరగలేదు. పైగా ప్రొఫెసర్ మాథాయ్పై మరింత గౌరవం పెరిగింది.తొలిసారిగా ఒక విత్తనాన్ని నాటింది. అది మొలకెత్తిన అద్భుతాన్ని చూసింది. ఇక అప్పటినుంచి చెట్ల వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుంటూనే ఉంది. కెన్యా ఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర జేన్ జుగునా ద్వారా మొక్కల పెంపకానికి సంబంధించి పనిముట్ల నుంచి సరైన మట్టి వరకు ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘చిల్డ్రన్ విత్ నేచర్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పింది. ‘మీరు తలచుకుంటే మీ ప్రాంతంలో మార్పు తీసుకు రావచ్చు’ అని ధైర్యాన్ని ఇచ్చింది.‘2020 నాటికి వేలాది మొక్కలను నాటాను. కెన్యాలోనే కాకుండా విదేశాలలో కూడా ట్రీ లవర్స్ కమ్యూనిటీలను ఏర్పాటు చేశాను’ అంటున్న ఎల్లియానే మొరాకో నుంచి జాంబియా వరకు తాను వెళ్లిన ఎన్నో దేశాలలో మొక్కలు నాటింది. అయితే వాతావరణ మార్పుల గురించి ప్రపంచ వ్యాప్తంగా వివిధ సదస్సులలో పాల్గొనడం వల్ల ‘గతంతో పోల్చితే మొక్కల పెంపకంలో వెనక పడ్డాను’ అనే బాధ ఎల్లియానేలో కనిపిస్తుంది.చెట్ల పెంపకం సంగతి సరే, మరి చదువు సంగతి ఏమిటి?చదువులో ఎప్పుడూ ముందే ఉంటుంది ఎల్లియానే. పిల్లల తోపాటు జంతువులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని గురించి వివరించే ‘సేవ్ అవర్ వైల్డ్‌లైఫ్’ అనే డాక్యుమెంటరీలో కనిపించింది. ఈ డాక్యుమెంటరీలో తనకు ఇష్టమైన జంతువు ఏనుగు గురించి చెప్పింది. వేట కంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వాటికి కలుగుతున్న ముప్పు గురించి వివరంగా మాట్లాడింది. ‘ఆఫ్రికాలోని గ్రీన్‌బెల్ట్‌లో మొక్కలు నాటాలి అనేది నా కల’ అంటుంది ఎల్లియానే. ‘ఏదీ అసాధ్యం కాదు’ అనేది ఎల్లియానే నోటినుంచి ఎప్పుడూ వినిపించే మాట. (చదవండి: ‘బ్రిటిష్ హైకమిషనర్’గా 19 ఏళ్ల అమ్మాయి..!) -
భారత మాజీ క్రికెటర్‌కు షాక్.. నెల రోజులకే హెడ్‌కోచ్ పోస్ట్ ఊస్ట్?
కెన్యా క్రికెట్ బోర్డు గత నెలలో తమ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ దొడ్డా గణేష్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే నెలల రోజుల తిరిగకముందే కెన్యా క్రికెట్ దొడ్డా గణేష్‌కు ఊహించని షాకిచ్చింది. గణేష్‌తో చేసుకున్న ఒప్పందాన్ని కెన్యా క్రికెట్ బోర్డు రద్దు చేసింది.ఈ నెల ఆఖరిలో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2027 ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో కెన్యా జట్టు హెడ్కోచ్లగా లామెక్ ఒన్యాంగో, జోసెఫ్ అంగారా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా దొడ్డా గణేష్ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే గణేష్ కాంట్రాక్ట్ రద్దు చేయాలని క్రికెట్ కెన్యా తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో నైరోబీలోని సిక్కు యూనియన్ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో దొడ్డా గణేష్‌తో ఏడాది పాటు తమ జట్టు హెడ్‌కోచ్‌గా కెన్యా క్రికెట్ ఒప్పందం కుదుర్చుకుంది. వన్డే ప్రపంచకప్‌లో కెన్యా మళ్లీ భాగమయ్యేలా కృష్టి చేస్తానని గణేష్ హామీ ఇచ్చాడు. కానీ అంతలోనే అతడి కాంట్రాక్‌ను కెన్యా క్రికెట్ రద్దు చేసింది.ఎవరీ దొడ్డ గణేష్..?కాగా కర్ణాటకకు చెందిన దొడ్డ గణేష్ 1997లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అదే ఏడాది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడేశాడు. భారత్ తరఫున మొత్తంగా నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 25, వన్డేలో నాలుగు పరుగులు చేశాడు.అదే విధంగా టెస్టుల్లో ఐదు, వన్డేలో ఒక వికెట్ తీశాడు. అయితే, దొడ్డ గణేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. మొత్తంగా 193 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన గణేశ్ 493 వికెట్లు తీయడంతో పాటు 2548 పరుగులు సాధించాడు.చదవండి: #Shreyas Iyer: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ' -
బడిలో మంటలు.. చిన్నారుల సజీవదహనం
తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రైమరీ స్కూల్లో మంటలు చెలరేగి చిన్నారులు సజీవ దహనం అయ్యారు. మరణించవాళ్లంతా 5 నుంచి 12 ఏళ్లలోపువాళ్లే కావడం గమనార్హం. ప్రమాద తీవ్రతను మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.కెన్యాలో తూర్పు ఆఫ్రికా వెంట పాఠశాలల్లో గత కొంతకాలంగా అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాజధాని నైరోబీకి 170కిలోమీటర్ల దూరంలో.. మధ్య కెన్యా నైయేరీ కౌంటీలో ఘోరం చోటు చేసుకుంది.హిల్‌సైడ్ ఎండారషా ప్రైమరీ పాఠశాల వసతి గృహంలో గత అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు చిన్నారులు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు.తీవ్రంగా గాయపడిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అధికారులు ఇంకా ఓ అంచనాకి రాలేదు. #BREAKINGTragic news from Kenya as at least 17 children have lost their lives in a devastating fire at Hillside Endarasha Academy in Kieni, Nyeri.Bodies were burned beyond recognition.#Kenya #SchoolFire #HillsideEndarasha #Tragedy #BreakingNewspic.twitter.com/sDskxUYBxQ— Mr. Shaz (@Wh_So_Serious) September 6, 2024 మృతదేహాలు గుర్తుపట్టలేనంతంగా కాలిపోయాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఘటనపై అధ్యక్షుడు విలియమ్ రుటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ స్కూల్లో సుమారు 800 చిన్నారులు వసతి పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 17 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల తొలగింపు తర్వాత మరిన్ని మృతుల సంఖ్యపై స్పష్టత రావొచ్చని అధికారులు అంటున్నారు. గతంలో.. 2016లో నైరోబీలోని ఓ బాలికల పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మరణించారు. 1994లో టాంజానియాలోని కిలిమంజారో రీజియన్‌లో ఓ స్కూల్లో మంటలు చెలరేగి 40 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. -
కెన్యా క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
కెన్యా పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ నియమితుడయ్యాడు. కెన్యా క్రికెట్ బుధవారం ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్ సమీపిస్తున్న తరుణంలో కొత్త కోచ్‌ను నియమించుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా దొడ్డ గణేశ్ మాట్లాడుతూ.. కెన్యా జట్టును ప్రపంచకప్ పోటీలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు.చాంపియన్లు ఉన్నారుగతంలో ఏం జరిగిందన్న విషయంతో తనకు సంబంధం లేదని.. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారని గణేశ్ అన్నాడు. కెన్యాలో చాంపియన్లకు కొదవలేదని.. వారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ 1997లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అదే ఏడాది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడేశాడు.భారత్ తరఫున మొత్తంగా నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 25, వన్డేలో నాలుగు పరుగులు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో ఐదు, వన్డేలో ఒక వికెట్ తీశాడు. అయితే, దొడ్డ గణేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. మొత్తంగా 193 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన గణేశ్ 493 వికెట్లు తీయడంతో పాటు 2548 పరుగులు సాధించాడు.ప్రపంచకప్‌నకు అర్హత సాధించడమే లక్ష్యంగాటీ20 ప్రపంచకప్-2026కు అర్హత సాధించే క్రమంలో కెన్యా తొలుత ఆఫ్రికన్ దేశాల జట్లతో పోటీపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో జరుగనున్న ఐసీసీ డివిజన్ 2 చాలెంజ్ లీగ్ సందర్భంగా కెన్యా హెడ్‌కోచ్‌గా దొడ్డ గణేశ్ ప్రయాణం మొదలుకానుంది. ఇక అక్టోబరులో తొలుత పపువా న్యూగినియా, ఖతార్, డెన్మార్క్ జట్లతో ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో తలపడనున్న కెన్యా జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు.గతంలోనూకాగా గతంలోనూ భారత క్రికెటర్లు విదేశీ జట్లకు కోచ్‌లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా మనోజ్ ప్రభాకర్, ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్, ఒమన్ కోచ్‌గా సునిల్ జోషి తదితరులు పనిచేశారు. ఇక టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్‌గా మరో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టును గైడ్ చేసిన రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ ఆ పగ్గాలను చేపట్టాడు.చదవండి: పదిహేడేళ్ల వయసులో తొలి శతకం.. సచిన్‌కు సాటెవ్వరు!Cricket Kenya unveil former aindian International cricketer Dodda Ganesh as the new men's National Team head coach. Kenya will face Papua New Guinea, Qatar, Denmark and Jersey in the ICC Division 2 Challenge League in September and T20 World Cup Africa Qualifiers in October. pic.twitter.com/om0jahHMIy— Nami Nation (@namination254) August 13, 2024 -
మన స్టార్టప్ వ్యవస్థే ప్రపంచానికి దిక్సూచి..
దేశంలో స్టార్టప్‌ల వ్యవస్థను అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియా దేశాల నుంచి అంతర్జాయ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. కెన్యా నేషనల్ ఇన్నోవేషన్ ఏజెన్సీ (కెనియా), టాంజానియా సమాచార, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ఇక్కడికి చేరుకుంది.జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) నిధులు సమకూర్చిన రెండు ప్రాజెక్టులను, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC) ద్వారా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్, ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లను ప్రతినిధి బృందం సందర్శించింది.రెండు రోజుల సైట్ సందర్శనలో ప్రతినిధి బృందం సభ్యులు కీలకమైన వాటాదారులతో సంభాషించారు. స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన వినూత్న పరిష్కారాలను అన్వేషించారు. క్షేత్ర స్థాయిలో ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ పాత్ర గురించి తెలుసుకున్నారు.అలాగే, ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంగ్థనింగ్ ప్రాజెక్ట్ ద్వారా మద్దతిచ్చే టి-హబ్, టి-వర్క్స్, వీ-హబ్ వంటి ఇన్నోవేషన్ ప్రాంగణాలను సందర్శించింది. పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నేతృత్వంలోని భారతదేశపు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌లు స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎలా మద్దతు ఇస్తున్నాయో తెలుసుకుంది. -
కెన్యా నిరసనల్లో మృతుల సంఖ్య 39
ఆఫ్రికన్ దేశం కెన్యాలో పన్నుల పెంపునకు వ్యతిరేకంగా జనం చేపట్టిన నిరసనల్లో 39 మంది మృతి చెందారని జాతీయ హక్కుల పర్యవేక్షణ సంస్థ ప్రకటించింది. ఈ విషయంలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు సరికావని పేర్కొంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం జూన్ 18 నుండి జూలై ఒకటి వరకు జరిగిన నిరసనల్లో 627 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు జాతీయ హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది. నిరసనకారులు పార్లమెంట్ కాంప్లెక్స్‌ను ధ్వంసం చేసిన సందర్భంగా వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాగా ప్రెసిడెంట్ విలియం రూటో సెప్టెంబరు 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఏదో ఒక పేరుతో నిరసనలు కొనసాగుతున్నాయి.ప్రెసిడెంట్ రూటో ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ నిరసనల్లో 19 మంది మృతి చెందారన్నారు. ఈ మరణాలపై దర్యాప్తు చేపడతామన్నారు. కాగా నిరసనకారులు, వైద్య సిబ్బంది, న్యాయవాదులు, జర్నలిస్టులపై చేపడుతున్న బలవంతపు చర్యలపై మానవ హక్కుల సంఘం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Kenya: భారతీయులకు అలర్ట్
న్యూఢిల్లీ: భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ కెన్యాలో ఉంటున్న భారతీయులకు అలర్ట్జారీ చేసింది. పన్నుల పెంపును నిరసిస్తూ అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.‘‘ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. పరిస్థితి సద్దుమణిగే వరకు.. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దు’’ అని కెన్యాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఎక్స్ ద్వారా సూచించింది. మరింత సమాచారం కోసం స్థానిక వార్త ఛానెల్స్‌ను, అలాగే.. దౌత్య సంబంధిత వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించింది.ADVISORY FOR INDIAN NATIONALS IN KENYA In view of the prevailing tense situation, all Indians in Kenya are advised to exercise utmost caution, restrict non-essential movement and avoid the areas affected by the protests and violence till the situation clears up.— India in Kenya (@IndiainKenya) June 25, 2024ఇదిలా ఉంటే.. కెన్యాలో పన్నుల పెంపు చట్టానికి ఆ దేశ పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సరిగ్గా అదే సమయంలోనే పార్లమెంట్ భవనం బయట నిరసనలు కొనసాగాయి. ‘‘కెన్యా ఇంకా వలస పాలనలోనే మగ్గిపోతోందని.. తమ దేశాన్ని తాము రక్షించుకుని తీరతామని’’ నినాదాలు చేస్తూ వేల మంది యువత ఒక్కసారిగా చట్టసభలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, 20 మంది దాకా గాయపడ్డారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ఇచ్చింది. అయితే ఈ సంఖ్యే ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం.ఆందోళనలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి, కెన్యా ఉద్యమకారిణి అవుమా ఒబామా కూడా ఉన్నారు. టియర్‌గ్యాస్ దాడిలో ఆమె సైతం అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. ఏమిటీ బిల్లు..కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు మొదటి నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం మనీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లును ఆమోదించవద్దని చట్టసభ్యుల్ని కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఈ ఆందోళనలు ఇప్పుడు ఉధృత రూపం దాల్చి.. దేశమంతటా విస్తరించాయి. -
కెన్యాలో కూలిన డ్యామ్
నైరోబీ(కెన్యా): ఆఫ్రికా దేశం కెన్యాలో జలాశయం ధ్వంసమై నివాసప్రాంతాలను ముంచెత్తడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది గల్లంతయ్యారు. సుమారు 109 మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. తరచూ ఆకస్మిక వరదలు సంభవించే గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మయి మహియులో ఇటీవలి వర్షాలకు పొంగి పొర్లుతున్న పాత కిజాబె డ్యాం ఆనకట్ట కొట్టుకుపోయింది. దీంతో వరద ఒక్కసారిగా నివాస ప్రాంతాలను ముంచెత్తిందని, ప్రధాన రహదారి కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో వరద పోటెత్తడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. -
24 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు విజేత దుర్మరణం.. కోచ్ కూడా!
Kelvin Kiptum: కెన్యా అథ్లెట్, మారథాన్ ప్రపంచ రికార్డు విజేత కెల్విన్ కిప్టం దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో 24 ఏళ్ల ఈ యువ అథ్లెట్ మరణించాడు. ఆ సమయంలో కెల్విన్‌తో పాటే కారులో ఉన్న అతడి కోచ్ గెర్వాస్ హాకిజిమనా కూడా కన్నుమూశాడు. ఈ ఘటన క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నింపింది. కెల్విన్, గెర్వాస్ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. వారి ఆత్మలకు శాంతి కలగాలంటూ వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కోయే విచారం వ్యక్తం చేశాడు. కాగా పురుషుల మారథాన్ ఈవెంట్లో కెల్విన్ కిప్టం ప్రపంచ రికార్డు సాధించాడు. అక్టోబరు 8, 2023లో చికాగో మారథాన్‌లో పాల్గొన్న అతడు రెండు గంటల 35 సెకండ్లలోనే పరుగు పూర్తి చేశాడు. తద్వారా రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన ఎల్యూడ్ కిచోగ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఎల్యూడ్ కంటే 34 సెకండ్ల ముందే లక్ష్యాన్ని చేరుకుని ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో... రెండు గంటల ఒక నిమిషానికి ముందే మారథాన్ పూర్తి చేసిన పురుష అథ్లెట్‌గా కెల్విన్ చరిత్రకెక్కాడు. పారిస్ ఒలింపిక్స్-2024 లక్ష్యంగా ముందుకు సాగుతున్న అతడు ఇలా హఠాన్మరణం చెందాడు. కోచ్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కెల్విన్ కిప్టం కారు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కెల్విన్, కోచ్ గెర్వాస్ అక్కడిక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.కాగా కెల్విన్ కిప్టంకు భార్య అసెనాథ్ రోటిచ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: Devon Conway - Kim Watson: ‘గర్భస్రావం.. మా బిడ్డను కోల్పోయాం’ -
కెన్యాలో భారీ పేలుడు: ఇద్దరు మృతి, 300 మందికి గాయాలు
కెన్యా రాజధాని నైరోబీలో గురువారం రాత్రి భారీ పేలుడు జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నైరోబీలోని ఎంబాకాసిలోని స్కైలైన్ ఎస్టేట్ సమీపంలోని కంటైనర్ కంపెనీలో పేలుడు జరిగినట్లు కెన్యా రెడ్‌క్రాస్ వెల్లడించింది. ఆ ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకొని చుట్టుపక్కల ప్రదేశాలకు వ్యాపించినట్లు తెలిపింది. News: Gas explosion in Nairobi, Kenya. Casualties undisclosed yet. The image is terrifying. pic.twitter.com/dFPYinmw3E — Olu 🕊️ (@empror24) February 2, 2024 ఒక్కసారిగా పేలుళ్ల శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదం తీవ్రతకు కంపెనీకి చెందిన రెండు భవనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అనేక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న వాహనాలు, వ్యాపార సముదాయాలు, ఇళ్లు కాలిబూడిదయ్యాయి. Nairobi, Kenya - Massive explosion. Death toll could be huge as hundreds in the building 🇰🇪 pic.twitter.com/lULFLJI2HU — 🇬🇧RonEnglish🇬🇧🏴 (@RonEng1ish) February 2, 2024 పెద్ద సంఖ్యలో ప్రజలు పరిసర భవనాల్లో చిక్కుకుపోయారని అక్కడి అధికారులు తెలిపారు ఈ క్రమంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
స్ఫూర్తిదాయక పని కోసం సెలవు
నైరోబీ: కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కోసం జాతీయ సెలవు దినాన్ని ప్రకటించి కెన్యా తన సామాజిక స్పృహను చాటుకుంది. దేశంలోని వారంతా మొక్కలు నాటే కార్యక్రమంలో విధిగా పాల్గొనేందుకు వీలుగా నవంబర్ 13(సోమవారం) రోజున దేశవ్యాప్త సెలవు ప్రకటిస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే పది సంవత్సరాల్లో 1,500 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, వాయు కాలుష్యం సమస్యలతో సతమతమవుతున్న కెన్యాను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం దేశ విస్తీర్ణంలో కేవలం ఏడు శాతంగా ఉన్న అడవులను 10 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. సోమవారం నాటి కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా 15 కోట్లకుపైగా మొక్కలను ప్రభుత్వ నర్సరీల్లో పౌరుల కోసం అందుబాటులో ఉంచింది. వీటిని ప్రభుత్వ ఏజెన్సీ నిర్దేశించిన చోట్ల నాటాలి. ఇవిగాక ‘ప్రతి కెన్యా పౌరుడు కనీసం రెండు మొక్కలు కొని నాటండి’ అని పర్యావరణ మంత్రి సోపాన్ తుయా పిలుపునిచ్చారు. -
నకిలీ న్యాయవాది విజయగాథ.. 26 కేసులు గెలిచి..
వ్యక్తి సామర్ధ్యం అనేది అతని విద్య, లేదా నైపుణ్యాల ద్వారా వెలుగులోకి వస్తుంది. అలాగే మనిషి ఎంత విద్యావంతుడైతే అతను తన వృత్తిలో అంత మెరుగ్గా ఉంటాడని అంటుంటారు. అయితే ఇటువంటి బలమైన నమ్మకాలను సైతం వమ్ము చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. వృత్తిపరమైన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన నకిలీ న్యాయవాది ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ కథ కెన్యాకు చెందిన ఒక వ్యక్తిది. అతను ఒక ఉన్నత న్యాయవాద సంస్థలో లాయర్‌గా తన పేరు నమోదు చేసుకోవడమే కాకుండా తన క్లయింట్ల తరపున వాదించి 26 కేసులలో విజయం సాధించాడు. ఈ నకిలీ లాయర్ పేరు బ్రియాన్ మ్వెండా న్జాగి. అతను నిజమైన న్యాయవాది కాదని న్యాయమూర్తులు కూడా గుర్తించలేకపోవడం విశేషం. లా కోర్సు చేయకుండానే బ్రియాన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కెన్యా లా సొసైటీ అతనిని అనుమానించిన నేపధ్యంలో అతని మోసపూరిత చర్యలు వెలుగు చూశాయి. బ్రియాన్ అనే నిజమైన న్యాయవాది తాను ప్రాక్టీస్ చేయకపోయినా తన ఖాతా యాక్టివ్‌గా ఉండటాన్ని చూసి, అతను కెన్యా లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుదారు అటార్నీ జనరల్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అందుకే అతనికి ప్రాక్టీస్ సర్టిఫికెట్ అవసరం లేకపోవడంతో అతను తన ఖాతాను ఎప్పుడూ ఉపయోగించలేదు. అయితే ఒకరోజు అతను తన ఖాతా లాగిన్ చేసినప్పుడు, అతనికి అనుమానం వచ్చింది. దీంతో అతను లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అతని పేరు మీద మరొకరు లాయర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో నకిలీ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో అతని వృత్తి నైపుణ్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... -
Hyderabad: హిందీ నేర్చుకుంటూ.. ఆదాయం అందుకుంటూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలోని రిసెప్షన్లో ఉన్న వ్యక్తుల్ని ‘‘కిత్నా రూపియా టెస్ట్ కే లియే? (పరీక్షలకు ఎంత ఖర్చవుతుంది?)’’అని ఆఫ్రికాకు చెందిన కవాంగు(25) అడుగుతోంది. కెన్యా నుంచి న్యూరో సర్జన్‌ను సంప్రదించడానికి నగరానికి వచ్చిన ముగ్గురు రోగులు తనకు కస్టమర్లుగా ఉన్నారు. వారికి అవసరమైన సంప్రదింపులు, పరీక్షల ఏర్పాట్ల నుంచి రెస్టారెంట్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం దాకా అన్నీ కవాంగు బాధ్యతలే. విదేశీయులకు అత్యున్నత వైద్యసేవల్ని మాత్రమే కాదు ఆదాయమార్గాలను కూడా నగర వైద్యం అందిస్తున్న తీరుకు కువాంగు ఒక ఉదాహరణ. తన కుటుంబంతో నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి అలాంటి ఫెసిలిటేటర్ సహాయంతో సంక్లిష్టమైన కాలేయ సమస్యకు కవాంగు చికిత్స పొందింది. ఆ తర్వాత తానే ఫెసిలిటేటర్‌గా మారితే రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చని అర్థమయ్యాక కవాంగు మూడేళ్లుగా అదే పనిచేస్తూ నగరంలోనే ఉంటున్నారు. ఆ వృత్తి కోసం కొంచెం హిందీ కూడా నేర్చుకుందామె. ‘హిందీ భాష నేర్చుకోవడం కోసం కోర్సులో చేరడంతోపాటు బాలీవుడ్ సినిమాలు చూడటం ప్రారంభించాను‘అని ఆమె చెప్పారు. టోలీచౌకి కేంద్రంగా... ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తున్నవారికి కేంద్రంగా నగరంలోని టోలీచౌకి మారిందని ఓ ఆసుపత్రికి చెందిన మార్కెటింగ్ విభాగ ప్రతినిధి తెలిపారు. ఈ ఏరియాలోని ప్రీమియర్ అపార్ట్మెంట్లో అద్దెకుండేవారిలో అత్యధికులు ఈ తరహా సేవల్లో నిమగ్నమవుతున్నారన్నారు. చాలామంది ఇక్కడ ట్రావెల్ లేదా స్టడీ వీసాపై మాత్రమే ఉన్నారు. కాబట్టి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌కి సంబంధించిన సమస్యల గురించి భయపడివారు తమపేరు తదితర వ్యక్తిగత వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు, ‘‘మాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు నైరోబీలోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు మాకు సహాయం చేస్తారు’’అని నైరోబీకి చెందిన మార్గరెట్ కారీ చెప్పారు. కొన్ని ఆసుపత్రులు దేశీయ రోగులతో పోలిస్తే అంతర్జాతీయ రోగులకు ట్రీట్మెంట్ రేట్లు అమాంతం 50 శాతం మేర పెంచేసి వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఫెసిలిటేటర్లకు బిల్లును బట్టి 15 నుంచి 20 శాతం కూడా ఇస్తున్నారని సమాచారం. ‘సోమాలియాలో ఆరోగ్య సంరక్షణకు సరైన మౌలిక సదుపాయాలు లేవు. దాంతో చికిత్స కోసం థాయ్‌లాండ్, మలేషియా, చైనాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు చాలామంది భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్‌కు వస్తున్నారు, అందువల్ల నేనిక్కడ ఉంటూ బంధువులు, స్నేహితులకు సహాయం చేయడం ప్రారంభించాను. అలా చాలామంది నాతో కనెక్ట్ అయ్యారు’అని 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన సోమాలియా జాతీయుడైన జువేద్ అన్నారు. ఏజెన్సీలూ ఉన్నాయి... మెడికల్ టూరిజమ్ సేవలు అందించే కొన్ని అంతర్జాతీయ కంపెనీలు చట్టప్రకారం కొందరిని ఫెసిలిటేటర్లుగా నియమించుకుని రోగులకు సహాయకులుగా వినియోగిస్తాయి. ఇలాంటి సంస్థలు ఢిల్లీ, ముంబై, బెంగుళూర్లలో ఎక్కువ. వాటి సేవలు హైదరాబాద్‌కు ఇంకా విస్తృతంగా వ్యాపించలేదు. దాంతో ఇక్కడ వ్యక్తిగతంగా సేవలు అందించే ఫెసిలిటేటర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటున్న విదేశీ విద్యార్థులు నగరంలోని హైదరాబాద్, ఉస్మానియా వంటి యూనివర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. పదేళ్లు, పన్నెండేళ్ల పాటు నర్సింగ్ స్టాఫ్, ఫిజియోథెరపీ స్టాఫ్‌గా సేవలు అందించినవాళ్లు కూడా జోర్డాన్, ఇరాక్, సిరియా తదితర మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చి అక్కడి పరిచయాలను, అరబిక్ భాష మీద పట్టు లాంటి సానుకూల అంశాలతో ఫెసిలిటేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ఉభయ కుశలోపరి విధానం మా ఆసుపత్రికి నైజీరియా, కెన్యా, సుడాన్, సోమాలియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరి కోసం మేం అధికారికంగా ఉన్న సంస్థల నుంచి ఫెసిలిటేటర్ల సేవలు అందుకుంటాం. అరుదుగా మాత్రం తెలిసిన, పరిచయస్తులను ఉపయోగించుకుంటాం. రోగులకు ఎదురయ్యే భాషా పరమైన ఇతర అవరోధాలకు పరిష్కారంగానూ, మరోవైపు ఇక్కడ విద్యార్జన తదితర పనులపై వచ్చేవారికి ఆదాయమార్గంగానూ ఈ విధానం ఉపకరిస్తోంది. –డా.కిషోర్‌రెడ్డి, అమోర్ ఆసుపత్రి -
51 మందిని బలి తీసుకున్న మృత్యు శకటం
నైరోబీ: మృత్యు శకటంలా మారిన ఓ ట్రక్కు 51 నిండు ప్రాణాలను కబళించింది. కెన్యాలోని లొండియాని పట్టణంలో శుక్రవారం సాయంత్రం హైవేపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. అనంతరం రహదారి పక్కనే ఉన్న మార్కెట్లో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం 51 మంది మృతి చెందారు. మరో 32 మంది క్షతగాత్రులయ్యారు. మరికొందరు వాహనాల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. 🔔 — A road accident in Londiani, western Kenya has claimed at least 48 lives after a lorry carrying a shipping container veered off the road and collided with multiple vehicles. pic.twitter.com/FLOf3dJjGf — OFF-AIR ™ 🔔 (@OffAirNewsRoom) July 1, 2023 ఇది కూడా చదవండి: అర్ధరాత్రి రన్నింగ్ బస్సులో మంటలు.. 25 మంది సజీవదహనం -
పర్ఫెక్ట్ టైమింగ్: కెమెరాకు చిక్కిన మూడు తలల చీతా!
అత్యంత వేగవంతమైన పరుగుకు చీతా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. అది పరిగెడున్నప్పుడు చూస్తే అది గాలితో పోటీ పడుతున్నదేమో అని అనిపిస్తుంది. ఇంతటి వేగం కలిగిన చీతాకు అడ్డుపడే ఏ జీవి అయినా ప్రాణాలతో మిగలదని చెబుతుంటారు. ప్రపంచంలో చీతాల జాతి మెల్లమెల్లగా అంతరించిపోతున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో చీతాలు విరివిగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు పైనున్న ఫొటోలో చీతాకు సంబంధించిన అద్భుతమైన ఫొటోను చూశారు. దీనిని ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో క్యాప్చర్ చేశారు. ఈ ఫొటోను చూసిన వారంతా ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకోవడంతోపాటు, అతను ఎంతో ధైర్యవంతుడైన క్రియేటర్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫొటో కోసం 7 గంటల శ్రమ ఈ అద్భుతమైన ఫొటోను విబుల్డన్కు చెందిన వరల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డ్‌స్టీన్ తన కెమెరాలో బంధించారు. ఈ చీతా కెన్యాలోని మాసై మారా నేషనల్ పార్కులో కనిపించింది. పాల్ గోల్డ్ ఈ ఫొటో గురించి ఒక మీడియా హౌస్‌లో మాట్లాడుతూ తాను ఈ ఫొటో తీసేందుకు 7 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దయ్యానని తెలిపారు. ఈ ఫొటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ‘ఆ క్షణంలో మంత్రముగ్ధుడనయ్యాను. అవును.. ఇందుకోసం ఏడు గంటలు వర్షంలో తడిశాను’ అనే కాప్షన్ రాశారు. ‘వారేవాహ్.. ఏం టైమింగ్‌రా బాబూ’ ఈ పొటోను పరీక్షగా చూస్తే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నాయని, అవి వేర్వేరు దిశల్లో చూస్తున్నాయని అనిపిస్తుంది. పొటోగ్రాఫర్ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోను చూసినవారంతా ‘వారేవాహ్.. ఏం టైమింగ్‌రా బాబూ’ అని ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకుంటున్నారు. నిజానికి అవి మూడు చీతాలు. అవి ఒక దగ్గరే వేర్వేరు యాంగిల్స్‌లో కూర్చున్నాయి. అది ఫొటోగ్రాఫర్ కంటపడింది. ఇది కూడా చదవండి: ఇదేమిటో తెలుసా? 90ల నాటి పిల్లలైతే ఇట్టే చెబుతారు! -
ముగ్గురు అమ్మాయిలను పెళ్లాడిన వ్యక్తి!: వీడియో వైరల్
ఇటీవల భారత్‌లో ఇద్దరు కవలలను పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి బహు భార్యత్వం కేసు కింద అరెస్టు అయ్యాడు. ఆ ఘటన మరువక మునుపే అలాంటి ఘటనే కెన్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కేట్, ఈవ్, మేరీ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు స్టీవ్ అనే వ్యక్తిని పెళ్లాడారు. తొలుత ఆ కవలల్లో కేట్ అనే అమ్మాయి స్టీవ్ అనే వ్యక్తిని కలిసింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక పెళ్లి విషయమై మాట్లాడేందుకు వాళ్ల చెల్లెళ్లను కలిసేందుకు వెళ్లాడు స్టీవ్. అనుహ్యంగా స్టీవ్‌కి అక్కడకు వెళ్లేంత వరకు తెలియదు ముగ్గుర్ని చేసుకోవాల్సి వస్తుందని. తాను ఒకరిని వివాహం చేసుకునేందుకు మాట్లాడటానికి వెళ్లితే ముగ్గుర్ని పెళ్లి చేసుకుంటానని అస్సలు అనుకోలేదని చెబుతున్నాడు. ఐతే వారు తాము ముగ్గురు తననే ఇష్టపడుతున్నామని చెప్పటంతో ఆశ్చర్యపోయానని చెబుతున్నాడు స్టీవ్. ఆ తర్వాత కాసేపు ఆలోచించి ముగ్గుర్ని పెళ్లాడేందుకు అంగీకరించినట్లు వివరించాడు. ఐతే ఆ ముగ్గరికి ఒకరిని వదిలి ఒకరు ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే ఇలా ఒక్క వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఐతే తమను పెళ్లి చేసుకునేందుకు స్టీవ్ ఒక కండిషన్ కూడా పెట్టాడని చెబుతున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. అలాగే ఏ సమస్య రాకుండా తాము ఎవరికీ కేటాయించిన సమయంలో వారు స్టీవ్‌తో గడిపేలా గట్టి టైం షెడ్యూల్ కూడా కేటాయించుకున్నట్లు ఆ కవలలు చెబుతున్నారు. (చదవండి: చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు) -
అదానీ షేర్ల బ్లడ్ బాత్: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన పరిశోధన నివేదిక సునామీతో అదానీ గ్రూప్ షేర్లన్నీ పతనం వరుసగా కొనసాగుతోంది. కంపెనీకి చెందిన 10 స్టాక్‌లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దీంతో ఆసియా కుబేరుడుగా నిలిచిన అదానీ చైర్మన్ గౌతం అదానీ, ప్రపంచ బిలియనీర్ల ర్యాంకు నుంచి 16 స్థానానికి పడిపోయారు. అదానీ నికర విలువ ఒక వారంలో దాదాపు సగానికి పడిపోయింది. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్ల వ్యవధిలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 8.76 లక్షల కోట్లు (107 బిలియన్ డాలర్లు) నష్టపోయాయి. ఇది (రూపాయి-డాలర్ మార్పిడి రేటు 81.80 వద్ద) ఇథియోపియా లేదా కెన్యా జీడీపీతో సమానమట. వీటి వార్షిక జీడీపీ 110-111 బిలియన్ల డాలర్లు (ప్రపంచ బ్యాంకు). అదానీ టోటల్ గ్యాస్ 6 రోజుల రూట్లో 29 బిలియన్ల డాలర్లు పైగా నష్టపోయింది. మార్కెట్ విలువలో 26.17బిలియన్ల డాలర్లను కోల్పోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం,గత సంవత్సరం సెప్టెంబర్‌లో గరిష్టంగా 150 బిలియన్ల డాలర్లున్న అదానీ వ్యక్తిగత సంపద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తరువాత ( జనవరి 24 నాటికి) 119 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. కాగా ఫోర్బ్స్ అదానీ సంపదను 64.6 బిలియన్ డాలర్లుగా గురువారం అంచనా వేసింది. దీని ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద 85 బిలియన్ డాలర్లు పతనం. ఇది బల్గేరియా వార్షిక జీడీపీకి సమానం! అదానీ పోర్ట్స్ మార్కెట్ క్యాప్ రూ. 65,000 కోట్లకు పైగా క్షీణించగా, అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ. 2.1 లక్షల కోట్లు హుష్ కాకి అయిపోయాయి. గత సంవత్సరం అదానీ కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, దాని m-క్యాప్ దాదాపు రూ. 29,000 కోట్లు పడిపోయింది, ఇది 29శాతం పతనం. అదానీ గ్రీన్ ఎనర్జీ (16.95 బిలియన్ డాలర్లు క్షీణత) అదానీ ట్రాన్స్మిషన్ (16.36 బిలియన్ డాలర్లు కోల్పోయింది) విలువపరంగా భారీ పెట్టుబడిదారుల సంపదను కోల్పోయిన అదానీ గ్రూప్ స్టాక్‌లు. ఇంకా అదానీ పోర్ట్స్ & SEZ (7.89 బిలియన్ డాలర్లు), అంబుజా సిమెంట్స్ (3.55 బిలియన్ డాలర్లు ) అదానీ విల్మార్ (2.4బిలియన్ డాలర్లు ) ఏసీసీ (1.13 బిలియన్ డాలర్లు) కోల్పోయాయి. ఇక ఎఫ్‌పీవో ఉపహసంహరణ తరువాత అదానీ షేర్లను కొనేవాళ్లకు లేక చాలా వరకు లోయర్ సర్క్యూట్ కావడం గమనార్హం. గురువారం అదానీ షేర్ల తీరు ఇలా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత ఈ స్టాక్ గురువారం రెండవ వరుస సెషన్లో 30శాతం క్రాష్ అయ్యింది. 1,494.75 వద్ద కొత్త 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం పడి, రూ. 1,707లోయర్ సర్క్యూట్ అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం కుప్పకూలి కొత్త 52 వారాల కనిష్టాన్ని తాకింది. అదానీ ట్రాన్స్మిషన్ కొత్త 52 వారాల కనిష్ట స్థాయి, 10శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 14.35 కుప్పకూలి , 52 వారాల కనిష్ట స్థాయి అదానీ పవర్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ అదానీ విల్మార్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. -
అమెజాన్ ఉద్యోగంకోసం ఇల్లు,కార్లు అమ్మేశా, మీరు ఈ తప్పులు చేయకండి!
సాక్షి,ముంబై: టెక్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కలకలం రేపుతోంది. గ్లోబల్ ఆర్థికమాంద్యం ముప్పు, ఖర్చుల నియంత్రణలో భాగంగా దిగ్గజాల నుంచి స్టార్టప్లదాకా వందలాది ఉద్యోగులను ఇంటికి పంపిస్తుండటం ఆయా కుటుంబాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. తాజాగా కెన్యాకు చెందిన టెకీ టామ్ ఎంబోయా ఒపియో సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. మరో నాలుగు రోజుల్లో యూరప్‌కు మకాం మార్చాల్సి ఉండగా అమెజాన్ ఉద్యోగాన్ని కోల్పోయిన వైనాన్ని ఒపియో లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. అంతేకాదు కొన్ని గ్లోబల్ ఐటీ ఉద్యోగాలకు సంబంధించి చిట్కాలను షేర్ చేయడం విశేషంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే అమెజాన్ భారీ తొలగింపుల వల్ల ప్రభావితమైన 18వేల ఉద్యోగుల్లో తానూ ఒకడినని, ఐరోపా వెళ్లడానికి నాలుగు రోజుల ముందు తాను ఉద్యోగాన్ని కోల్పోయానంటూ కెన్యా టెకీ ఒపియో తెలిపారు. కుటుంబంతో సహా వెళ్లేందుకు, ఉన్న ఇల్లును, కార్లను అమ్మేశా. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉండి ఉంటే ఈ సోమవారం (జనవరి16) అమెజాన్‌లో ఉద్యోగంలో చేరేవాడిని. కానీ పరిస్థితి తారుమారైంది. తర్జన భర్జన పడి, 6 నెలల నుంచి ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకొని, ప్రయాణానికి సిద్ధమవుతుండగా, ఇంతలోనే ఉద్యోగాన్ని కోల్పోడంతో తన ఫ్యామిలీ కుప్పకూలి పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారీ షాక్‌నుంచి తేరుకుని మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సి ఉందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా టెకీలకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. (రెండు దశాబ్దాల ప్రయాణం.. ఇండియన్ టెకీ భావోద్వేగం) ‘‘వేరే దేశానికి ఉద్యోగ నిమిత్తం వెళ్లాలనుకుంటే..ముందు మీరు వెళ్లి..ఆ తరువాత ఫ్యామిలీని తీసుకెళ్లడం గురించి ఆలోచించండి...వీసా వచ్చే వరకు తమ ప్రస్తుత జాబ్‌కు రాజీనామా చేయకండి’’ (మాకు వీసా రావడానికి 5 నెలలకు పైగా పట్టింది. ఫ్యామిలీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్, కొత్త పాస్‌పోర్ట్‌లు, EU వర్క్ ఆథరైజేషన్ అప్రూవల్స్, డాక్యుమెంట్ల నోటరైజేషన్ పొందడానికి చాలా సమయం పట్టింది). కరీయర్లో ఈ టైంలో ఇంతటి కష్టమైన పరిస్థితి వస్తుందని మాత్రం అస్సలు ఊహించ లేదు. కానీ జీవితం అంటే అదేకదా? మనకెదురైన అనుభవాలు, పరిస్థితులు, ఇతరులకు ఉదాహరణలుగా, పాఠాలుగా నిలుస్తాయంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా గత కొన్ని నెలల్లో ఉద్యోగాల కోతలను ప్రకటించిన పలు దిగ్గజ కంపెనీలలో అమెజాన్ కూడా ఒకటి. ట్విటర్, మెటా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. -
మెటాకు భారీ షాక్..మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. ఆఫ్రికన్లను ద్వేషపూరిత ప్రసంగాలతో పాటు హింసను ప్రేరేపించేలా వ్యవహరించిందంటూ మెటాపై పిటిషనర్లు పరువు నష్టం దావా వేశారు. అందుకు పరిహారంగా మెటా తమకు 2 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి డిమాండ్ చేశారు. ఆ పిటిషన్‌ను ఇథియోపియన్ పరిశోధకులు అబ్రమ్ మీరెగ్,ఫిస్సెహా టెక్లే, కెన్యా మానవ హక్కుల సభ్యులు, కటిబా ఇన్స్టిట్యూట్తో పాటు చట్టపరమైన లాభాపేక్షలేని ఫాక్స్‌గ్లోవ్ సహకారంతో కెన్యా హైకోర్టులో దాఖలు చేశారు. గత నవంబర్‌లో మీరెగ్ తండ్రి, కెమిస్ట్రీ ప్రొఫెసర్ మీరెగ్ అమరేను’పై దాడికి చేసేలా ప్రోత్సహించేలా మెటాలో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఆ పోస్టులు షేరింగ్ తర్వాత గుర్తుతెలియని దుండగులు అమరేను ఇంట్లోకి వెళ్లి కాల్చిచంపినట్లు కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..మెటా "తన ప్లాట్‌ఫారమ్‌లో హింసను పరిష్కరించడంలో వైఫల్యం, ద్వేషపూరిత, రెచ్చగొట్టేలా ప్రమాదకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించేలా ప్రాధాన్యతనిచ్చే మెటా నుంచి ప్రజలకు రక్షణ అవసరమని పిటిషనర్లు ఈ సందర్భంగా వాదించినట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. అంతేకాదు 2021లో 117.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన మెటా సిఫార్సు అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. ఈ సాంకేతిక ఆధారంగా ప్రజలు ఏ కంటెంట్ కోసం ఎక్కువగా వెతుకుతున్నారో.. అందుకు అనుగుణంగా ఆ కంటెంట్‌ను ప్రచారం చేస్తోంది. దీంతో వ్యాపారస్తులు యాడ్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని ప్రచారం చేసుకుంటున్నారు. అలా మెటా తన ఆదాయాన్ని పెంచుంటున్నట్లు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నివేదించారు. ఈ సందర్భంగా మెటా ఈ తరహా కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నందుకు కోర్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించుకున్నారు. తమకు జరిగిన నష్టం కింద సదరు సోషల్ మీడియా సంస్థ 2 బిలియన్ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
'తృటిలో తప్పించుకున్నా.. ఆలస్యమయ్యుంటే గాల్లో ప్రాణాలు'
కెన్యాకు చెందిన అథ్లెట్ డేవిడ్ రుడిషా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కెన్యాలోని కిమానా వైల్డ్‌లైఫ్ సాంచురీలో జరిగిన మసాయి ఒలింపిక్స్ కాంపిటీషన్‌కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో అతను ప్రయాణిస్తున్న విమానం క్రాష్‌కు గురైంది. ఈ సమయంలో రుడిషాతో పాటు మరో ఐదుగురు ఉన్నారు. ల్యాండింగ్ చేసే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ విమానం టేకాఫ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో విమానంకు చెందిన రెక్క ఒకటి చెట్లకు తగిలి గుండ్రంగా తిరుగుతూ మట్టి పెళ్లపై పడిపోయింది. అప్పటికే డోరు తీసుకొని రుడిషా సహా మిగతా ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం రుడిషాతో పాటు మిగతావారు క్షేమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఇక ప్రమాదంపై రుడిషా స్పందించాడు. ''మరో ఏడు, ఎనిమిది నిమిషాల్లో విమానం టేకాఫ్ తీసుకుంటుందనగా ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. విమానం రెక్క ఒకటి చెట్లకు తగిలి కింద పడడం ప్రారంభమైంది. అప్పటికే మేము గాయాలతో బయట పడ్డాం.. కొద్దిగా ఆలస్యమైనా మా ప్రాణాలు పోయేవే.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక డేవిడ్ రుడిషా 800 మీటర్ల రేసులో రెండుసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్‌లో 800 మీటర్ల రేసులో వరుసగా రెండు స్వర్ణ పతకాలు అందుకున్నాడు. అంతేకాదు 2011, 2015 వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ 800 మీటర్ల రేసులో పతకాలు సాధించాడు. David Rudisha after surviving a crash landing in Amboseli pic.twitter.com/aFzB6exHAl — Kenyans.co.ke (@Kenyans) December 11, 2022 -
గేటెడ్ కమ్యూనిటీలో నివాసం.. పెరట్లో కూరగాయల సాగు, కోళ్లు, కుందేళ్ల పెంపకం! ఇంకా
ఆఫ్రికా దేశమైన కెన్యాలోనూ అర్బన్ ప్రజలు సేంద్రియ ఇంటిపంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. దేశ జాతీయోత్పత్తిలో 30% వ్యవసాయం నుంచి పొందుతున్న కెన్యాలో విష రసాయనాల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు కూరగాయలు, ఆకుకూరలు వీలైనంత వరకు ఇంటి దగ్గరే ఏదో విధంగా తిప్పలుపడి సేంద్రియంగా పండించుకుంటున్నారు. కోవిడ్ కాలంలో ఆహార కొరత, ధరల పెరుగుదలతో కొంతమంది కెన్యన్లు అర్బన్ ప్రాంతాల నుంచి తిరిగి గ్రామాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఆహారం చౌకగా ఉండటంతో పాటు సొంతంగా కూరగాయలు పండించుకోవడానికి పెరటి స్థలాలు చాలా గ్రామీణ కుటుంబాలకు అందుబాటులో ఉంటాయి. అయితే, కోవిడ్ మహమ్మారి అర్బన్ అగ్రికల్చర్ విస్తరణకూ ఊపునిచ్చింది. ఆహార సరఫరా తగ్గిపోవటంతో ఆరోగ్యదాయకమైన ఆహార భద్రత కోసం అర్బన్ ప్రాంతాల్లో సొంతంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వ్యాపకం ఇటీవల ఊపందుకుంది. ఇంటి స్థాయిలో ఆహార భద్రతను కల్పించడానికి కెన్యా ప్రభుత్వం ‘మిలియన్ కిచెన్ గార్డెన్స్ ప్రాజెక్ట్’లో భాగంగా రెండేళ్ల క్రితం కూరగాయల విత్తనాలు, వ్యవసాయ కిట్లను పంపిణీ చేసింది. అర్బన్ గార్డెనింగ్ చానల్ నగరంలో ఉంటున్నా ఇంటి దగ్గరే సొంత ఆహారాన్ని పెంచుకోగలుగుతున్న అదృష్టవంతుల్లో న్యాంబురా సిమియు ఒకరు. 35 ఏళ్ల శాస్త్రవేత్త అయిన ఆమె తన కుటుంబంతో పాటు కెన్యా రాజధాని నగరం నైరోబీ శివార్లలోని గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. తన ఇంటి వెనుక పెరట్లో తన నలుగురు కుటుంబానికి సరిపడా కూరగాయలను పండిస్తున్నారు. అంతేకాదు, 200 వరకు కోళ్లు, కుందేళ్లను సైతం పెరట్లో పెంచుతున్నారు. ఏడాది పొడవునా కూరగాయలు, గుడ్లు, మాంసాలతో కూడిన సేఫ్ ఫుడ్‌ను కుటుంబానికి సమకూర్చుతున్నారు. అర్బన్ రైతులకు శిక్షణ ఇస్తున్నారు. అందుకోసం తన పేరుతోనే యూట్యూబ్‌లో అర్బన్ గార్డెనింగ్ చానల్‌ను నిర్వహిస్తున్నారు. పురుగుమందులకు బదులు కుందేలు మూత్రం వాడుతున్నారు. తెగుళ్ళను అరికట్టడానికి ‘కంపానియన్ ప్లాంటింగ్’ వంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఉపాధి మార్గంగానూ.. యువ అర్బన్ ఫార్మింగ్ ఎంటర్ ప్రెన్యూర్స్లో నైరోబీ వాసి ఎల్జీ చెబెట్ ఒకరు. సృజనాత్మకంగా కిచెన్ గార్డెనింగ్ నమూనాలను నిర్మించటంలో ఆమె దిట్ట. కుటుంబం కోసం కూరగాయలు, ఆకుకూరలు పండించటం మాత్రమే కాదు, దాన్నే ఉపాధి మార్గంగానూ ఎంచుకున్నారామె. కెన్యా ఆర్గానిక్ కిచెన్ గార్డెన్స్ సంస్థను నెలకొల్పారు. పెరట్లో, మేడ మీద, గచ్చు మీద ఏ కొంచెం స్థలం వున్నా సరే గృహస్థుల అభిరుచి, అవసరాలకు తగినట్లుగా ఎడిబుల్ లాండ్స్కేప్ గార్డెన్స్‌ను అందంగా డిజైన్ చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆహార సరఫరాకు అంతరాయం కలిగిన తర్వాత పరిమిత స్థలంలోనే కొంతమంది నగరవాసులు తమ వంట గదుల్లో, బాల్కనీల్లో కూరగాయలను పెంచడం ప్రారంభించారని ఎల్జీ చెబెట్ చెప్పారు. రెండు చదరపు మీటర్లు చాలు.. ‘ఆహారోత్పత్తి అనేది ప్రభుత్వ విధాన స్థాయిలో, ఇంటి స్థాయిలోనూ ఒక ముఖ్యమైన పని’ అని ప్రజలు గ్రహించారని రూట్–టు–ఫుడ్ ఇనీషియేటివ్ సంస్థను నిర్వహిస్తున్న ఇమాన్యుయేల్ అటాంబా అన్నారు. ప్రజలు, వారు తినే ఆహారం, దాన్ని ఎలా పండిస్తారు అనే విషయాలపై అవగాహన లోపించింది అన్నారాయన. ‘నగరంలో కూరగాయలు పెంచడం మంచిది కాదని భావించే వ్యక్తులు ఉన్నారు. ఇది మురికి పని లేదా చేయవలసిన పని కాదని అనుకుంటున్న మహానుభావులు కూడా వున్నార’ని న్యాంబురా సిమియు చెప్పారు. ఒక వ్యక్తికి సరిపడా కూరగాయలు పెంచుకునే కిచెన్ గార్డెన్‌కు కేవలం రెండు చదరపు మీటర్ల భూమి చాలు. పట్టణ వ్యవసాయానికి నీరు, స్థలం అవసరం. వీటిని నగరంలో ఏర్పాటు చేసుకోవటం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. కెన్యా నగరాలూ, పట్టణాల్లో వుండే చాలా మందికి ఈ వనరులు అందుబాటులో లేవు. ముఖ్యంగా నగర జనాభాలో ఎక్కువ మంది నివసించే మురికివాడల్లో మరీ కొరతగా వుంది అంటున్నారు ఆటంబ. సంప్రదాయ వ్యవసాయానికి అవసరమైన నీరు, స్థలంలో నాలుగింట ఒకవంతు కంటే తక్కువ ఉపయోగించి ఆహారాన్ని పండించే హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. - పంతంగి రాంబాబు చదవండి: Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే -
బ్రిటానియా గూటికి కెన్యా బిస్కెట్ల తయారీ కంపెనీ
న్యూఢిల్లీ: బేకరీ ప్రొడక్టుల దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా కెన్యా కంపెనీ కెనాఫ్రిక్ బిస్కట్స్‌ను హస్తగతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ బీఏడీసీవో ద్వారా 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా 13.87 కెన్యన్ షిల్లింగ్స్(రూ. 9.2 కోట్లు) చెల్లించినట్లు వెల్లడించింది. తద్వారా ఆఫ్రికా మార్కెట్లలోనూ అమ్మకాలను విస్తరించే వీలు ఏర్పడినట్లు తెలియజేసింది. కెన్యాసహా ఆఫ్రికా మార్కెట్లలో బిస్కట్ల తయారీ, విక్రయాలు చేపట్టే లక్ష్యంతో కెనాఫ్రిక్ను సొంతం చేసుకున్నట్లు వివరించింది. ఈ నెల 3కల్లా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. వెరసి కెనాఫ్రిక్ బిస్కట్స్ అనుబంధ సంస్థగా మారినట్లు తెలియజేసింది. మిగిలిన 49% వాటా కెనాఫ్రిక్ గ్రూప్ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. -
బ్రిటానియా గూటికి కెనాఫ్రిక్
న్యూఢిల్లీ: బేకరీ ప్రొడక్టుల దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా కెన్యా కంపెనీ కెనాఫ్రిక్ బిస్కట్స్‌ను హస్తగతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ బీఏడీసీవో ద్వారా 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా 13.87 కెన్యన్ షిల్లింగ్స్(రూ. 9.2 కోట్లు) చెల్లించినట్లు వెల్లడించింది. తద్వారా ఆఫ్రికా మార్కెట్లలోనూ అమ్మకాలను విస్తరించే వీలు ఏర్పడినట్లు తెలియజేసింది. కెన్యాసహా ఆఫ్రికా మార్కెట్లలో బిస్కట్ల తయారీ, విక్రయాలు చేపట్టే లక్ష్యంతో కెనాఫ్రిక్ను సొంతం చేసుకున్నట్లు వివరించింది. ఈ నెల 3కల్లా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. వెరసి కెనాఫ్రిక్ బిస్కట్స్ అనుబంధ సంస్థగా మారినట్లు తెలియజేసింది. మిగిలిన 49% వాటా కెనాఫ్రిక్ గ్రూప్ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. -
పాపం.. తాగునీటి కోసం వెళ్లి మరణం అంచుదాకా!
నైరోబీ: జంతువులు ఆపదలో చిక్కుకోవడం.. వాటిని మంచి మనసుతో కొందరు కాపాడడం లాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటివి చూసినప్పుడల్లా మనసుకు ఒకరకమైన సంతోషం కలుగుతుంది. అలాంటి వీడియో గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. కెన్యాలో తాజాగా ఓ శాంక్చురీలో ఈ ఘటన జరిగింది. దాహంతో నీటి కోసం అన్నీచోట్ల తిరిగి తిరిగిన రెండు ఆడ ఏనుగులు.. ఓ నీటి మడుగులో దిగి బురదలో చిక్కుకుని పోయాయి. కాలు కదిపే వీలులేక.. అందులోనే కుప్పకూలి పడిపోయాయి. ఆ బురదలో పాపం అవి అలాగే రెండురోజులకు పైనే ఉన్నాయి. వాటిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు కొందరు. సమాచారం అందుకున్న షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్, కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్‌లు సంయుక్తంగా శ్రమించి.. ఆ రెండు ఏనుగులను బయటకు తీశాయి. అదృష్టవశాత్తూ అవి ప్రాణాలతో బయటపడడంతో.. కాపాడిన టీంలు సంబురాలు చేసుకున్నాయి. తీవ్ర కరువు నేపథ్యంలో ఏనుగులు ఇలా నీటి మడుగులలోకి వెళ్లి చిక్కుకుపోవడం సహజమేనని అధికారులు అంటున్నారు. View this post on Instagram A post shared by Sheldrick Wildlife Trust (@sheldricktrust) ఇదీ చదవండి: నచ్చినోడు.. తాళి కట్టేవేళ పట్టరాని సంతోషంతో.. -
ఏం టైమింగ్.. వెంటాడిన మృత్యువు నుంచి తప్పించుకుంది
వైరల్: ఆయుష్షు గట్టిదైతే.. ఎంతటి ప్రమాదం నుంచి అయినా బయటపడొచ్చు. అయితే దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. మృత్యువు వెంటాడినా.. సమయస్ఫూర్తితో వ్యవహరించి మృత్యువు ముఖం నుంచి తప్పించుకుంది ఓ సింహం ఇక్కడ. కెన్యా మసాయ్ మరా నేషనల్ రిజర్వ్ పార్క్‌లో మే 23వ తేదీన ఆంటోనీ పెసీ ఈ వీడియోను చిత్రీకరించాడు. నది మధ్యలో ఓ భారీ హిప్పో మృతదేహం కొట్టుకువచ్చింది. అయితే దాని మీద ఓ సింహం కూడా కనిపించింది. దీంతో పెసీ తన కెమెరాతో షూట్ చేయడం ప్రారంభించాడు. సుమారు నలభైకి పైగా మొసళ్లు.. హిప్పో మృతదేహం చుట్టూ చేరాయి. కాస్త ఉంటే.. పైన ఉన్న సింహం కూడా వాటికి బలి అవుతుందేమో అనుకున్నాడు పెసీ. అయితే ప్రాణ భయంతో హిప్పో మీదే ఉండిపోయిన ఆ సింహం.. సమయస్ఫూర్తితో వ్యవహరించింది. అదను చూసి నీళ్లలోకి ఒడ్డుకి చేరింది. బతుకు జీవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్!
ఏ అంశంలోనైనా అందరికంటే విభిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నవారే ‘ది బెస్ట్’గా నిలుస్తారు. ప్రపంచంలోనే ‘ది బెస్ట్’ అని అనిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన ఆలోచనా దృక్పథం, సామాజికాభివృద్ధిపై ఉన్న మక్కువతో ‘అన్నా ఖబాలే దుబా’ ప్రపంచంలోనే ‘బెస్ట్ నర్సు’గా నిలిచింది. గ్రామంలోని వారంతా తనలా ఎదగాలన్న ఆకాంక్షే ‘ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు’ను తెచ్చిపెట్టింది అన్నాకు. అన్నా ఖబాలే దుబా కెన్యాలోని తొర్బి అనే మారుమూల గ్రామంలో పుట్టింది. అక్కడ చదువుకున్నవారు చాలా తక్కువ. ఇక తన కుటుంబంలో అయితే ఒక్కరు కూడా అక్షరాస్యులు లేరు. ఇలాంటి వాతావరణంలో పుట్టిపెరిగిన అన్నా చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. ఒకసారి వింటే ఇట్టే పట్టేసే అన్నా గ్రామంలోనే తొలి గ్రాడ్యుయేట్‌గా ఎదిగింది. నర్సింగ్ చదువుతోన్న సమయంలో ‘మిస్ టూరిజం కెన్యా’ కిరీటాన్నీ గెలుచుకుంది. అందరూ తనలా చదవాలని... అన్నా స్వగ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడం వల్ల మూఢనమ్మకాలు అధికంగా ఉండేవి. వీటి కారణంగా ఆడపిల్లలకు చాలా చిన్నవయసులో పెళ్లిళ్లు చేసేవారు. ఆచారం పేరిట వారు చేసే అకృత్యాల మూలంగా అభం శుభం తెలియని ఆడపిల్లలు వైకల్యాల బారినపడేవారు. పద్నాలుగేళ్ల వయసులో బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకుంది అన్నా. వీటన్నింటిని చిన్నప్పటి నుంచి ప్రత్యక్షంగా చూసిన అన్నా ఈ మూఢాచారాలను ఎలాగైనా నిర్మూలించాలనుకునేది. నర్సింగ్ డిగ్రీ అయిన తరువాత ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ బాల్యవివాహాలతో సహా పలు మూఢాచారాలను తీవ్రంగా వ్యతిరేకించేది. చదువుకోవడం కలిగే ప్రయోజనాలు స్వయంగా రుచిచూసిన అన్నా గ్రామంలోని మిగతా పిల్లలు తనలా చదువుకోవాలని బలంగా కోరుకునేది. ఖబాలే దుబా ఫౌండేషన్.. మూఢాచారాలను వ్యతిరేకించడంతోనే అన్నా ఆగిపోలేదు. గ్రామంలో ఎక్కువమందిని అక్షరాస్యుల్ని చేస్తే మూఢాచారాలను ఆపవచ్చని ... తొర్బి గ్రామంలోని పిల్లలను విద్యావంతులుగా తీర్చిద్దాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ‘ఖబాలే దుబా’ పేరిట పౌండేషన్‌ను స్థాపించింది. కమ్యూనిటీ లిటరసీ కార్యక్రమం ద్వారా గ్రామంలోని పిల్లలు, పెద్దలకు చదువు చెబుతోంది. ఆసుపత్రిలో విధులు ముగించుకున్న తరువాత మిగతా సమయాన్ని.. ఇతర టీచర్లతో కలసి తరగతులు చెప్పడానికి కేటాయించి వందలాదిమంది విద్యకు కృషిచేస్తోంది. ప్రస్తుతం లిటరసీ కార్యక్రమంలో 150 మంది పిల్లలు, 100 మంది పెద్దవాళ్లు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. చదువుతోపాటు లైంగిక, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపైన కూడా అవగాహన కల్పిస్తోంది. గ్రామంలోని పిల్లలకేగాక తన కుటుంబానికి చెందిన 19 మందిని కూడా చదివిస్తోంది అన్నా. 31 ఏళ్ల అన్నా డ్యూటీ, సామాజిక సేవాకార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఎపిడిమియాలజీలో మాస్టర్స్ చేస్తోంది. బెస్ట్ నర్స్‌గా.. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ సంస్థ గ్లోబల్ బెస్ట్ నర్స్‌ను ఎంపికచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానాలు పంపగా.. 24 వేలమందికిపైగా పోటీపడ్డారు. వేల మందిని వెనక్కు నెట్టి గ్లోబల్ నర్సింగ్ అవార్డుని గెలుచుకుంది అన్నా. ఈ అవార్డుకింద రెండున్నర లక్షల డాలర్లను గెలుచుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘‘నేను ఈరోజు అవార్డును అందుకోవడానికి నా కుటుంబం, మా కమ్యునిటీల ప్రేరణే కారణం. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. మూఢాచారాలనుంచి భవిష్యత్ తరాలను కాపాడడమే నా లక్ష్యం. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదు కెన్యాలో మరిన్ని స్కూళ్ల ఏర్పాటుకు, విస్తరణకు ఉపయోగపడుతుంది’’ అని అన్నా ఆనందం వ్యక్తం చేసింది. -
‘భారతీయులు గర్వించేలా చేశారు’ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్ల స్పందన
ఇటీవల ఓ నెటిజన్ నువ్వు పంజాబీవా అడిగితే కాదు ఇండియన్ అంటూ సమాధానం ఇచ్చి భారతీయుల మనుసు గెలుచుకున్నారు ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌కి నెటిజన్లు మరోసారి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దేశీ కార్ల తయారీ కంపెనీల్లో అగ్రగామిగా ఉన్న మహీంద్ర మరో ఘనత సాధించింది. మహీంద్రా వాహనాల పనితీరు నచ్చడంతో కెన్యా ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది. వందకు పైగా సింగిల్ క్యాబ్ పికప్ స్కార్పియోలను కొనుగోలు చేసి వాటిని కెన్యా రాజధాని నైరోబీ పోలీసు విభాగానికి అప్పగించింది. కెన్యా పోలీసు డిపార్ట్మెంట్ మహీంద్రా వెహికల్స్‌ని ఉపయోగించడంపై ఆనంద్మహీంద్రా స్పందించారు. నైరోబీ పోలీసు శాఖలో ఓ భాగమైనందుకు ఆనందంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు స్కార్పియో వాహనం ఓ బీస్ట్ లాంటిదంటూ తమ ప్రొడక్టుని పొగిడారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు విదేశీ కార్లను ఇండియా దిగుమతి చేసుకుకేది. ఇప్పుడు మహీంద్రా బ్రాండ్ కింద మన కార్లు విదేశాల్లోకి వెళ్తున్నాయి. మహీంద్రా గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని కోరుకుంటున్నామని నెటిజన్లు అంటున్నారు. భారతీయులు గర్వించేలా చేశారు ఆనంద్ మహీంద్రా అంటూ ట్వీట్లతో హోరెత్తెస్తున్నారు. Nairobi, Kenya. We’re delighted to be a part of the Police Service team. The ‘Beast’ under the bonnet of the Scorpio is at their service! https://t.co/yrYlDwYhkw — anand mahindra (@anandmahindra) January 10, 2022 చదవండి: నెటిజన్ తలతిక్క ప్రశ్న..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రా -
ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఈ నెల 10వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతికి వచ్చిన 39 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ మహిళ శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపి పరీక్షించగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మహిళ కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్టు స్పష్టం చేశారు. ఒమిక్రాన్ సోకిన మహిళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు పేర్కొన్నారు. ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో వైద్యుల పర్యవేక్షణలో మహిళ ఉన్నట్టు తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం, ఇతర ఏ లక్షణాలు మహిళకు లేవన్నారు. గురువారంతో క్వారంటైన్ 10 రోజులు పూర్తవుతుందని, తిరిగి వైరస్ నిర్ధారణ పరీక్ష చేపడతామన్నారు. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన 45 మందికి, వారి సన్నిహితులు 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు చెప్పారు. వీరి నమూనాలన్నింటినీ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, భౌతిక దూరంతో పాటు ఇతర కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, చిత్తూరు జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రోజు నుంచే ఆమె నివాస పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. డోర్ టు డోర్ ఫీవర్ సర్వే నిర్వహించారు. గతంలో విజయనగం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ రాగా అతను వెంటనే కోలుకున్న విషయం తెలిసిందే. -
కెన్యా నుంచి సిటీకి.. ఒమిక్రాన్ రోగి కోసం ఉరుకులు పరుగులు
బంజారాహిల్స్ (హైదరాబాద్): కెన్యా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒమిక్రాన్ బాధితుడు కనిపించడం లేదంటూ వైద్య శాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. కెన్యాకు చెందిన అబ్దుల్లాహి యారో ఇబ్రహీం(44) ఈ నెల 14న నగరానికి వచ్చాడు. విమానాశ్రయంలో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈ నెల 16న అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో ఇబ్రహీం నివాసం ఉంటున్నట్లు తెలుసుకొని అధికారులు అక్కడికి వెళ్లగా ఆచూకీ తెలియలేదు. దీంతో వైద్య శాఖాధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పారామాంట్ కాలనీలో సోదాలు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతోపాటు గెస్ట్‌హౌజ్‌లు, హోటళ్లలో తనిఖీలు చేశారు. ఇబ్రహీం రాత్రి 8 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రి సమీపంలోని ఓ గెస్ట్‌హౌజ్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వైద్యశాఖ సిబ్బంది సాయంతో టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడితోపాటు గదిలో ఉన్న నూర్ అనే వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకి ఉండొచ్చనే అనుమానంతో అతడిని కూడా టిమ్స్‌కు తరలించారు. -
గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా..
Giraffe Death In Kenya: ఆరు జిరాఫీలు.. నీటి కోసం గట్లు, గుట్టలు, చెట్లు, పుట్టలు.. అడవంతా తిరిగాయి. ఒంట్లో సత్తువ నశిస్తున్నా, నిలబడటానికి కూడా ఓపిక లేకున్నా దాహం తట్టుకోలేక వెతికాయి. కాస్త దూరంలో ఏదో బురదలా కనిపించగానే నీళ్లుంటాయని పరుగున అక్కడికెళ్లాయి. అంతే.. ఆ బురదలోనే చిక్కుకుని నీరు లేక గొంతెండి.. తిండిలేక పేగులు మండి చనిపోయాయి. (చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు) గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న ఈ సంఘటన కెన్యాలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇటీవల జరిగింది. ఈ ఫొటోలను డిసెంబర్ 10న తీశారు. కొంతకాలంగా కెన్యా ఉత్తర ప్రాంతంలో వర్షాల్లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నీటి కోసం ఆ ప్రాంతంలోని ప్రాణులు అల్లాడుతున్నాయి. ఈ ఆరు జిరాఫీలు చనిపోయిన ప్రాంతానికి దగ్గర్లోని గరిస్సా కౌంటీలో 4 వేలకు పైగా జిరాఫీలున్నాయని, నీరు దొరక్కపోతే వీటికీ ప్రమాదం తప్పదని అక్కడి మీడియా చెబుతోంది. (చదవండి: అగ్ని పర్వతం బద్దలై.. బూడిదగా మారి‘నది’) -
T20 WC Aus Vs Ban: బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డు.. కెన్యా, అఫ్గన్ సరసన
Teams getting bowled out for below 100 in successive T20 WC matches: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. పొట్టి ఫార్మాట్ ప్రపంచక కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు వందలోపే ఆలౌట్ అయిన మూడో జట్టుగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 73 పరుగులకే కుప్పకూలి ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లకే 10 వికెట్లు కోల్పోయి.. చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఇక అంతకుముందు 2007 టీ20 ప్రపంచకప్‌లో కెన్యా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 73 పరుగులు, శ్రీలంకతో మ్యాచ్‌లో 88 పరుగులకే ఆలౌట్ అయింది. కెన్యా తర్వాతి స్థానంలో అఫ్గనిస్తాన్ ఉంది. 2012 పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 80 పరుగులు, 2014లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 72 పరుగులకే చాపచుట్టేసి అప్రదిష్టను మూటగట్టుకుంది. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా తొలుత దక్షిణాఫ్రికాతో 84 పరుగులు, ఆసీస్‌తో మ్యాచ్‌లో 73 పరుగులకే ఆలౌట్ అయి బంగ్లాదేశ్.. ఈ రెండు దేశాల సరసన చేరింది. అంతేగాక... టీ20 మ్యాచ్‌లలో ఒక క్యాలెండర్ ఇయర్లో మూడు సార్లు(దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో రెండుసార్లు) వంద పరుగుల లోపు ఆలౌటైన తొలి జట్టుగా మహ్మదుల్లా బృందం నిలిచిన సంగతి తెలిసిందే. కాగా బంగ్లాదేశ్- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆడం జంపా చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి బంగ్లా జట్టు పతనాన్ని శాసించి 8 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కోర్లు: బంగ్లాదేశ్- 73 (15) ఆస్ట్రేలియా- 78/2 (6.2) చదవండి: ICC Player Of The Month: షకీబ్, ఆసిఫ్, డేవిడ్.. టీమిండియా ఆటగాళ్లు ఒక్కరూ లేరు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సింహాన్ని పరుగులు పెట్టించిన చీతా..
నైరోబి: అడవికి రారాజు సింహం. అలాంటి సింహాన్ని సైతం పరుగులు పెట్టించిందో చీతా. విషయమేమిటంటే.. ఈ సింహానికి కొంతదూరంలో చీతా, దాని పిల్లలు కనిపించాయి. ఈ మధ్యాహ్నం భోజనం దొరికినట్లేననుకున్న సింహం... పిల్లల నుంచి తల్లిని వేరు చేసేందుకు ప్రయత్నించింది. తనకంటే మూడు రెట్లు పెద్దదైన సింహాన్ని చూసి భయపడి మొదట పారిపోయే ప్రయత్నం చేసిందీ చీతా. ఎప్పుడైతే సింహం... తన పిల్లలను తినడానికి ప్రయత్నించిందో.. ఆ అమ్మ ఆదిశక్తిగా మారింది.. తిరగబడింది.. ఊహించని పరిణామంతో సింహం వెనక్కి తగ్గింది. కాళ్లకు పనిచెప్పింది. కెన్యాలోని మాసై మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్టులోని ఈ దృశ్యాలను తన కెమెరాతో బంధించాడో ఫొటోగ్రాఫర్. చదవండి: ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే! -
కెన్యా అథ్లెట్ అగ్నెస్ అనుమానాస్పద మృతి
Kenya Athlete Agnes Tirop Death.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లలో (2017, 2019) పది వేల మీటర్ల విభాగంలో రెండు కాంస్య పతకాలు గెలిచిన కెన్యా మహిళా రన్నర్ అగ్నెస్ టిరోప్ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. 25 ఏళ్ల అగ్నెస్ ఇంట్లోనే మరణించిందని, ఆమె మృతికి గల కారణాలు తెలియలేదని కెన్యా ట్రాక్ సమాఖ్య తెలిపింది. ఇంట్లోనే విగతజీవిగా పడి ఉండటంతో ట్రాక్ సమాఖ్య... అగ్నెస్ భర్తపై అనుమానాలను వ్యక్తం చేసింది. గత ఆగస్టులో ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో 5000 మీటర్ల పరుగులో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: Uber Cup: ఐదేళ్ల తర్వాత... తొలిసారిగా.. -
Cheetah Brothers: భయం వీడాయి.. ఒక్కటై దూకాయి
2020 జనవరి.. కెన్యాలోని మాసాయ్ మారా నేషనల్ రిజర్వులో ఒకటే కుండపోత. తాలేక్ నది అయితే.. ఉగ్రరూపం దాల్చింది.. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో పోటెత్తింది.. అలాంటి టైంలో ఒడ్డుకు అటు వైపున ఐదు చీతాలు.. ఆదుర్దాగా అటూ ఇటూ తిరుగుతున్నాయి.. ఎందుకంటే.. ఈ నదిని దాటాలనుకుని ప్రయత్నించిన జంతువులను.. అయితే వరద మింగేస్తుంది.. లేదా నదిలోని భయంకరమైన మొసళ్లు మింగేస్తాయి.. కానీ ఎలాగైనా నదిని దాటాలి.. ఎందుకంటే.. ఒడ్డుకు ఆవల వాటి రాజ్యముంది.. ఆ ఐదుగురు స్నేహితులు పాలించే సామ్రాజ్యముంది.. భయం వీడాయి.. ఒక్కటై దూకాయి.. వరద ఉధృతిని తట్టుకున్నాయి.. కలిసికట్టుగా నదిని దాటాయి.. ► ఈ చీతాల సాహసకృత్యాన్ని బుద్దిలినీ డిసౌజా అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. ఈ చీతాలు లోకల్‌గా ఫేమస్ అని.. ప్రపంచంలో ఎక్కడా ఇలా ఐదు మగ చీతాలు ఫ్రెండ్స్‌గా లేదా గుంపుగా కలిసిలేవని డిసౌజా తెలిపారు. ‘గ్రేట్ స్విమ్’ పేరిట డిసౌజా తీసిన ఈ చిత్రం ప్రఖ్యాత ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ పోటీలో తుది జాబితాకు ఎంపికైంది.. విభాగాలవారీగా విజేతల వివరాలను ఆక్టోబర్ 12న ప్రకటిస్తారు. -
అదరగొట్టిన కిప్చోగెదే: మరోసారి స్వర్ణం అతడిదే
టోక్యో: పురుషుల మారథాన్ రేసులో తనకు తిరుగులేదని కెన్యా అథ్లెట్ ఎలూయిడ్ కిప్‌చోగె మరోసారి నిరూపించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన అతడు... ఐదేళ్ల తర్వాత జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆదివారం జరిగిన ఈ మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు) కిప్‌చోగె 2 గంటల 8 నిమిషాల 38 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించాడు. ఒలింపిక్స్‌లో కిప్చోగెకిది నాలుగో పతకం కాగా... ఇందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి. అంతేకాకుండా పురుషుల మారథాన్‌లో రెండు పసిడి పతకాలు సాధించిన మూడో అథ్లెట్‌గా కిప్‌చోగె నిలిచాడు. గతంలో అబెబె బికిలా (ఇథియోపియా–1960, 64), వాల్దెమర్ సిరి్పన్స్కి (జర్మనీ–1976, 80) కిప్‌చోగె కంటే ముందు ఈ ఘనతను సాధించారు. మొత్తం 106 మంది ఈ మారథాన్‌లో పాల్గొనగా... 30 మంది రేసును పూర్తి చేయకుండా మధ్యలోనే వైదొలిగారు. చదవండి: Tokyo Olympics: 37 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ తొలిసారిగా.. -
భారత జట్టులో శ్రీనివాస్, నందినికి చోటు
న్యూఢిల్లీ: ఈనెల 17 నుంచి 22 వరకు కెన్యాలోని నైరోబీలో జరిగే ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్, తెలంగాణకు చెందిన అగసార నందినిలకు భారత జట్టులో చోటు లభించింది. శ్రీనివాస్ 200 మీటర్ల విభాగంలో... నందిని 100 మీటర్ల హర్డిల్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తారు. దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీ మొత్తం 28 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. -
మనుషుల కంటే ఏనుగులే బెటర్.. వైరల్ వీడియో..
నైరోబి: సాధారణంగా వేసవి కాలంలో కొన్ని ఇళ్లలోని బోర్లు, బావులు ఇంకిపోవడం మనకు తెలిసిందే. దీని కోసం ఆయా ప్రాంతాల్లోని మున్సిపల్ అధికారులు నీటి ట్యాంకర్ల ద్వారా నీటి కోరత ఉన్న కాలనీల్లోకి నీటిని సరఫరా చేస్తుంటాయి. అయితే, ఇంటి ముందు నీళ్ల ట్రాక్టర్ రాగానే.. మహిళలు బిందేలతో నీటిని పట్టుకొవడానికి పొటీపడుతుంటారు. నాకంటే.. నాకు.. అని వాదులాడుకుంటుంటారు. ఈ క్రమంలో వారి మధ్య నీటి కోసం.. చిన్నపాటి ‘పానిపట్టు’ యుద్ధమే జరుగుతుంది. అయితే, ఇక్కడ వీడియోలో ఏనుగులు.. నీరు తాగటం కోసం ఏ మాత్రం.. పోటి పడకుండా.. తమ వంతు వచ్చే వరకు క్రమశిక్షణగా, వేచి చూస్తున్న వీడియో నెటిజన్లను ఏంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాలు.. ఈ సంఘటన కెన్యాలోని అడవిలో జరిగింది. ఇక్కడ రెండు ఏనుగులకు దాహం వేసినట్టుంది. నీటి కోసం వేతికాయి. కాసేపటికి, అడవికి దగ్గరలోని ఒక పార్క్‌లో నీటిని చిమ్ముతున్న స్ప్రింక్లర్ను చూశాయి. అవి రెండూ కూడా నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాయి. అయితే, మొదటి ఏనుగు ఆ స్ప్రింక్లర్ వద్ద నిలబడి తన తొండంతో నీళ్లను తాగి దాహన్ని తీర్చుకుంది. రెండొ ఏనుగు.. ఏమాత్రం తొందర పడకుండా.. తన వంతు కోసం ఓపిగ్గా ఎదురుచూస్తోంది. మొదటి ఏనుగు వెళ్లి పోయాక మెల్లగా.. స్ప్రింక్లర్ వద్ద వెళ్లి అది కూడా కడుపు నిండా నీటిని తాగింది. కాగా, నీటి కోసం ఆరెండు ఏనుగులు ఏమాత్రం పోటీపడలేదు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మనుషుల కంటె గజరాజులే నయం’, ‘వావ్.. ఏనుగు ఎంత ఓపిగ్గా వేచి చూస్తోంది..’, ‘వాటి క్రమశిక్షణకు హ్యట్సాఫ్..’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ అనే సంస్థ కెన్యాలోని వన్య ప్రాణుల రక్షణ, ఏనుగుల పునారవాస కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏనుగుల శరీర ఉష్ణోగ్రత చాలాఎక్కువ. అందుకే, అవి నీటిలో ఏక్కువగా గడపటానికి ఇష్టపడతాయి. అదే విధంగా, ఒక ఏనుగు రోజుకు 50 గ్యాలన్ల వరకు నీటిని తాగుతుంది. Nothing beats…a fresh and cooling drink from the tap (or sprinkler) pic.twitter.com/TBnorTJN8n — Sheldrick Wildlife (@SheldrickTrust) June 27, 2021 -
‘వరల్డ్‌ఫేమస్’ మృగరాజు, చైనా వరాహం.. ఇక లేవు
ముఖంపై గాటు, క్రూరమైన చూపులు, హుందాగా వ్యవహరించే తీరు.. వెరసి విలక్షణమైన లక్షణాలతో గుర్తింపు పొందిన ఆఫ్రికన్ సింహం ‘స్కార్ఫేస్’ ఇక లేదు. 14 ఏళ్ల మగ సింహం.. అనారోగ్యంతో చనిపోయినట్లు సఫారీ నిర్వాహకులు ధృవీకరించారు. కెన్యాలోని మసాయి మారా గేమ్ రిజర్వ్‌లో ఇది ఇంతకాలం బతికింది. కాగా, కుడికన్ను పక్కన గాటుతో ఉండే ఈ సింహాన్ని.. లయన్‌కింగ్ దుష్ట సింహం ‘స్కార్’ క్యారెక్టర్‌తో పోలుస్తుంటారు చాలా మంది. ఇదే టూరిస్టుల్లో ఈ సింహానికి గుర్తింపు తెచ్చిపెట్టింది. చనిపోయే ముందు అది తాను పుట్టిన ప్రాంతంవైపు నడిచిందని, దురదృష్టవశాత్తూ గమ్యానికి 15 కిలోమీటర్ల అది చనిపోయిందని సఫారీ నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో స్కార్ఫేస్ మీద బీబీసీ, నేషనల్ జియోగ్రఫిక్, హిస్టరీ లాంటి చానెల్స్ ఎన్నో డాక్యుమెంటరీలను తీశాయి కూడా. సెన్సేషన్ పిగ్ కూడా.. చైనా హీరో పిగ్ ఇక లేదు. జూన్ 14న అది చనిపోయినట్లు దాని సంరక్షకులు వైబో ద్వారా ప్రకటించారు. 2008లో చైనా భారీ భూకంపం తర్వాత ఓ భారీ పంది ఫేమస్ అయ్యింది. సిచువాన్ ప్రావిన్స్‌లో దాదాపు 36 రోజుల తర్వాత శకలాల నుంచి అది ప్రాణాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జు జియాంగియాంగ్ అనే పేరుతో జనాలు ముద్దుగా పిల్చుకునే ఆ పంది.. అన్నిరోజులపాటు వర్షం నీళ్లు, కాల్చిన బొగ్గు తిని అంతకాలం ప్రాణాల్ని నిలబెట్టుకోగలిగింది. విపత్కరకాలంలో ఎలా బతకాలో జియాంగియాంగ్‌ను చూసి నేర్చుకోవాలని పేర్కొంటూ చైనావాళ్లు దానిని ‘హీరోయిక్ పిగ్’గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత ఓ మ్యూజియం నిర్వాహకులు ఇంతకాలం దాని సంరక్షణ చూస్తూ వచ్చారు. చదవండి: గుంపుగా అడవి దున్నలు-సింగిల్‌గా సింహం, ఆ తర్వాత.. -
అమ్మ బాబోయ్.. కాపాడండయ్యా నన్ను!
అడవికి రారాజు సింహమే. కానీ, అవతలి నుంచి గుంపుగా వస్తే ఆ సింహాం కూడా తోక ముడవాల్సిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కెన్యా మసాయి మారా సఫారీలో జరిగింది. నాలుగు సింహాలు.. పక్కనే ఉన్న జింకలను వదిలి.. మందగా ఉన్న అడవి దున్నల మీద కన్నేశాయి. అయితే అది గమనించిన అడవి దున్నలు ఒక్కసారిగా వాటి మీదకు ఉరుకులు తీశాయి. మూడు సింహాలు పారిపోగా.. ఒకటి మాత్రం ఆ దున్నల మధ్య ఇరుక్కుపోయింది ప్రాణ భయంతో పరుగులు తీసిన ఆ మృగరాజు.. అక్కడే ఉన్న ఓ చెట్టు మీదకు ఎక్కేందుకు ప్రయత్నించింది చాలా సేపు ఇబ్బంది పడ్డాక ఎట్లాగోలా పైకి చేరుకుంది కానీ, 500 దాకా ఉన్న అడవి దున్నలు మాత్రం ఆ సింహం చుట్టూ రౌండప్ చేశాయి కొన్ని గంటలపాటు చెట్టుమీదే ఉన్న సింహం.. చీకటి పడ్డాక దున్నలు వెళ్లిపోవడంతో దిగింది నార్వేకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఓల్వ్ థోక్లే(54) ఈ రసవత్తరమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధించారు. -
వైరల్ వీడియో: తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యువకులు
-
Viral: చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, చివరికి ట్విస్ట్ ఏంటంటే?
నైరోబి: ఆ ముగ్గురు స్నేహితులకు అక్కడికి వెళితే ప్రాణం పోతుందని తెలుసు. అయినా వెళ్లారు. చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తృటిలో తప్పించుకున్నారు. అసలేం జరిగిందంటే.. కెన్యాలో విక్టోరియా సరస్సు ఉంది. ఆ సరస్సులో అత్యంత ప్రమాదకరమైన నీటి ఏనుగులు ఉన్నాయి. పొరపాటున సరస్సులో ప్రయాణిస్తుండగా వాటి కంటపడితే కనికరం లేకుండా వేటాడి ప్రాణాలు తీస్తాయి. అయితే డికెన్ ముచెనా అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి విక్టోరియా సరస్సులో నీటి ఏనుగుల్ని వీక్షించేందుకు వెళ్లారు. వెళ్లేముందు సరస్సులోని హిప్పోపొటామస్(నీటి ఏనుగులు) గురించి తెలుసుకున్నారు. సరస్సులోకి దిగిన ఆ ముగ్గరికి నీటి ఏనుగులు కనిపించలేదు. దీంతో వాటి కోసం అన్వేషణ ప్రారంభించారు. అంతలోనే ఓ నీటి ఏనుగు స్పీడ్ బోట్లో ప్రయాణిస్తున్న యువకులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నీటిలో మునిగి మెరుపు వేగంతో దాడి చేసేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ ఆ యువకులు స్పీడ్ బోట్ వేగాన్ని పెంచడంతో తృటిలో ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. ఈ ఘటన అనంతరం డికెన్ మాట్లాడుతూ.. నీటి ఏనుగుల గురించి, అవి తలపెట్టే ప్రమాదం తెలుసుకున్నాం. వాటిని చూసేందుకు స్పీడ్ బోట్ లో ప్రయాణించాం. కానీ అవి మాకు ఎక్కడా కనిపించలేదు. సరస్సులో మరికొంత దూరం వెళ్లాం. అదే సమయంలో ఓ నీటి ఏనుగు మాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దేవుడి దయవల్ల సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాం. చెప్పాలంటే చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లైందని తెలిపాడు. ఇక, ఈ ఘటన జరిగే సమయంలో డికెన్ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి : చిప్ దొబ్బినట్లుంది, పారాచుట్ లేకుండా విమానం నుంచి దూకాడు -
సింహం దండయాత్ర: దాక్కున్నా వదల్లేదు!
అటవీ ప్రాంతంలో జరుగుతున్న విన్యాసాలు, అద్భుతాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఆహారం కోసం జంతువులు చేసే పోరాటం అబ్బురపరుస్తుంటాయి. తాజాగా ఓ సింహం జూలు విదిల్చి ఏడు గంటల పాటు శ్రమించి చివరకు అడవి పందిని చేజిక్కించుకుని తన బొజ్జ నింపేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భూమిలో దాగి ఉన్న ఆఫ్రికన్ పందిని వెలికితీసి మరి సింహం చంపి తిన్నది. ఈ వీడియో చూస్తే నిజంగా సింహం సింహామే అని అంటారు. కెన్యా దేశ రాజధాని నైరూబీలోని మసాయి మరా జాతీయ పార్కులో సింహం ఆహారం కోసం వేట సాగిస్తోంది. సాధారణంగా ఆఫ్రికన్ పందులు భూమిలో దాగి ఉంటాయి. బురద ప్రాంతంలో దాగి ఉన్న వాటిని సింహం గుర్తించింది. దీంతో తీవ్ర ఆకలి మీద ఉన్న సింహం గుంత తవ్వడం మొదలుపెట్టింది. మనిషి మాదిరి తవ్వుతూ.. తవ్వుతూ దాదాపు ఏడు గంటలపాటు నిర్విరామంగా తవ్వేసింది. అనంతరం ఆ గుంతలో ఉన్న ఆఫ్రికన్ జాతి పందిని పట్టేసింది. సింహం బారి నుంచి కాపాడేందుకు ఆ పంది ఎంత ప్రయత్నం చేసినా సింహం పట్టు వదలలే. చివరకు పంది ఓడింది.. సింహం గెలిచింది. అడవి రాజు సింహం ఆకలి తీరింది. దీనికి సంబంధించిన వీడియోను సేల్స్ ఇంజనీర్ సుహేబ్ అల్వీ తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. -
8.2 ఓవర్లు, 6 మెయిడెన్, 7 పరుగులు, మరి వికెట్లు?
న్యూఢిల్లీ: 8.2 ఓవర్లు, 6 మెయిడెన్, ఇచ్చిన పరుగులు 7 మాత్రమే, కీలకమైన మూడు వికెట్లు. ఈ గణాంకాలు సాదాసీదా మ్యాచ్‌లో కాదు. 2003 వన్డే ప్రపంచకప్‌లో. ప్రత్యర్థి భీకర ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా. బౌలర్ కూడా ఏ పాపులర్ టీమ్ సభ్యుడో అనుకోకండి. క్రికెట్లో పసికూనగా పేరున్న కెన్యాకు చెందిన ఆసిఫ్ కరీం. ఈ రోజు కరీం పుట్టిన రోజు కావడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాటి విశేషాలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కెన్యా జట్టు బ్రెట్‌లీ, ఆండీ బిచెల్, డారెన్ లెహ్మాన్ దెబ్బతో 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. (చదవండి : 'విచారకరం.. నా ఇన్నింగ్స్ వారికే అంకితం') 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (43 బంతుల్లో 67; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాథ్యూ హెడెన్ (14 బంతుల్లో 20; 5 ఫోర్లు) మెరుగైన ఆరంభం ఇచ్చారు. ఈ ఇద్దరినీ ఒంగొండో పెవిలియన్ చేర్చాడు. తర్వాత కెప్టెన్ రికీ పాంటింగ్, ఆండ్రూ సిమండ్స్‌తో కలిసి జట్టును విజయం దిశగా తీసుకెళ్తుండగా.. ఆసిఫ్ కరీం విజృంభించడంతో ఒక్కసారిగా మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. కీలకమైన పాంటింగ్ (18) వికెట్ తీసిన కరీం.. తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. తక్కువ పరుగుల వ్యవధిలోనే డారెన్ లేహ్మాన్ (2), బ్రాడ్ హాగ్ (0) వికెట్లు తీసి ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. చివర్లో ఇయాన్ హార్వే (43 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో కలిసి సిమండ్స్ (49 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) కెన్యా ఆశలపై నీళ్లు చల్లాడు. దాంతో మరో 112 బంతులు ఉండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక 1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కరీం 34 వన్డేలు మాత్రమే ఆడి 27 వికెట్లు తీశాడు. 2003 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ అతనికి చివరిది కావడం గమనార్హం. (చదవండి: టెస్ట్ చాంపియన్ షిప్ : నెంబర్ 1 ఆసీస్) -
ప్రపంచంలోనే అరుదైన జిరాఫీ ఇది
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో శ్వేత వర్ణ జిరాఫీలు చాలా చాలా అరదు. అలా అరుదైన జాతికి చెందిన ఓ జింకను రక్షించడం కోసం ప్రపంచంలో తొలిసారిగా ఓ శ్వేత జిరాఫీకి జీపీఎస్ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చారు. కెన్యాలోని గరిస్సా అటవి ప్రాంతంలో గత మార్చి నెల వరకు ఓ మగ, ఆడ, వాటికి ఓ పిల్ల జిరాఫీ ఉండేదట. వేటగాళ్లు ఆడ, పిల్ల జింకను చంపేయడంతో ఇప్పుడు ఆ ఒక్క మగ జిరాఫీ మాత్రమే బ్రతికి ఉందట. అలాంటి జిరాఫీ అది ఒక్కటే ఉన్నప్పటికీ దానికి ఇంతవరకు ఏ పేరు పెట్టలేదని, అయితే దాని రక్షణార్థం అది ఎప్పుడు, ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వీలుగా దాని కొమ్ముల్లో ఒకదానికి జీపీఎస్ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చినట్లు ‘ఇషాక్బినీ హిరోలా కమ్యూనిటీ కన్సర్వెన్సీ’ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆ అరుదైన జిరాఫీకి ప్రత్యేక జన్యు లక్షణం వల్ల తెల్ల రంగు వచ్చిందని, జన్యు లక్షణాన్ని ‘లూసిజమ్’ అని వ్యవహరిస్తారని కన్సర్వెన్సీ వర్గాలు తెలిపాయి. సోమాలియా సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న ఈ జిరాఫీని దాని అరుదైన చర్మం కోసం మట్టుపెట్టడానికి వేటగాళ్లు పొంచి ఉన్నందున దానికి జీపీఎస్ ట్రాకర్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆ జిరాఫీకి ఏ ఆపద రాకుండా ‘కేన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్, నార్తర్న్ రేంజ్ ల్యాండ్స్ ట్రస్ట్, సేవ్ జిరాఫీస్’ సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి. -
వైరల్: రెండు ఏనుగులు ప్రేమతో సరదాగా..
-
వైరల్: రెండు ఏనుగులు ప్రేమతో సరదాగా..
రెండు భారీ ఏనుగులు సరదాగా పోట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ‘షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్’ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘జసిరి, ఫరాజా అనే రెండు అనాథ ఎనుగులు కెన్యాలోని అంబోసేలి ప్రాంతం నుంచి రక్షించబడ్డాయి. ఈ రెండు ఏనుగులు గుర్రపు ఆటను ఇష్టపడతాయి. మా సంరక్షణలో ఉన్న ఇతర ఏనుగుల వలే కాకుండా ముదురు బూడిద రంగు చర్మంతో ఉన్నాయి. ఈ రెండు ఏనుగులు తెలికపాటి చర్మంతో పాటు రాగి తోక జుట్టు, వెంట్రులు కలిగి ఉన్నాయి. ఇవి ఎప్పుడూ ఒకదాన్ని ఒకటి పోట్లాడుకుంటూ సరదాగా బురదలో ఆడుకుంటాయి’ అని కామెంట్ జతచేసింది. ఈ వీడియోను ట్విటర్లో 8 వేల మంది వీక్షించగా, 1500మంది లైక్ చేశారు. ఏనుగులు ఆడుకుంటున్న ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది ఆద్భుతమైన వీడియో’, ‘రెండు ఏనుగులను చూస్తే చాలా సరదా ఉంది’, ‘అవి ఒకదానిపై ఒకటి ప్రేమతో సరదాగా ఆడుకుంటున్నాయి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ కెన్యాలోని అనాధ ఏనుగుల రక్షణ, వన్యప్రాణుల పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. -
కోమేషా కరోనా
ఉహురు కెన్యాట్టా – కెన్యా అధ్యక్షుడు, మార్గరెట్ వాంజిరు గకువో – కెన్యా తొలి మహిళ, వాళ్ల ముందు భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి ప్రసంగించారు ఓ మహిళ. మన వివాహ వ్యవస్థను చప్పట్లతో అభినందిస్తూ మళ్లీ మళ్లీ విన్నారు వాళ్లు. కెన్యాలో ఉన్న హిందువుల పెళ్లిని నిర్ధారించాల్సిన బాధ్యత ఆమెకే అప్పగించారు. ఇప్పుడు... దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తున్నాయి... యుద్ధానికి దేశాన్ని సన్నద్ధం చేయాల్సిన బాధ్యతనూ ఆమె భుజాల మీదనే పెట్టింది కెన్యా. ఇప్పుడామె... ఆ దేశంలో వాళ్లకు మన నమస్కారాన్ని నేర్పిస్తున్నారు. చిలుక పచ్చ బోర్డరున్న నేవీ బ్లూ చేనేత చీర కట్టుకుని, చెవులకు బుట్ట జూకాలు ధరించిన ఓ అచ్చమైన తెలుగింటి మహిళ చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడి చివరగా స్వాహిలి భాషలో ‘కోమేషా కరోనా’ అంటూ నమస్కారంతో పూర్తి చేశారు. కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కెన్యా దేశ ప్రజలకు వివరించడానికి రూపొందించిన వీడియో అది. ఇరవై ఏడేళ్ల కిందట భర్త ఉద్యోగ రీత్యా ఆరు నెలలు మాత్రమే ఉండడానికి కెన్యాలో అడుగుపెట్టారు కోటంరాజు సుజాత. ‘ఇరవై ఏడు క్యాలెండర్లు మారినా నాకింకా ఆరు నెలలు పూర్తికాలేద’న్నారామె నవ్వుతూ. స్వాహిలి భాష నేర్చుకుని కెన్యా ప్రజలతో మమేకమైపోయారామె. కరోనాసంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కెన్యా తీసుకుంటున్న రక్షణ చర్యల్లో భాగంగా ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ సుజాత దగ్గరకు వచ్చింది. భౌతికదూరం పాటించడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం, షేక్‌హ్యాండ్‌కు బదులు నమస్కారం చేయడం ద్వారా కరోనాను దూరంగా ఉంచవచ్చనే సందేశాన్ని సుజాత మాటల్లో చెప్పించుకుంది కెన్యా. ఆ దేశ టీవీల్లో ఆమె సందేశమిచ్చిన వీడియో ప్రసారమవుతోంది. బందరమ్మాయి కోటంరాజు సుజాత పుట్టింది, పెరిగింది మచిలీపట్నంలో. పెళ్లి తరవాత హైదరాబాద్‌కి వచ్చి చైల్డ్ సైకాలజీలో కోర్సు చేశారు. భర్త కోటంరాజు రుద్రప్రసాద్ బరోడాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న రోజులవి. ఉద్యోగంలో భాగంగా కెన్యాకు వెళ్లాల్సి వచ్చింది. ఆ దేశం వెళ్లడానికి మొదట్లో ఏ మాత్రం ఇష్టపడని సుజాత... కొన్నాళ్ల తర్వాత అయిష్టంగానే కెన్యాలో అడుగుపెట్టారు. అది కూడా ఆరునెలల్లో వచ్చేయవచ్చనుకుంటూ విమానం ఎక్కారు. ఆ తర్వాత ఆమె ఇండియాకి వచ్చింది ప్రసవం కోసమే. ‘గృహిణిగా కెన్యాలో అడుగుపెట్టిన సుజాత... ఇప్పుడక్కడ కీలకమైన బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నారు. కెన్యా సమాజ నిర్మాణంలో కూడా ఆమె సేవలందిస్తున్నారు. జర్మనీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన అంతర్జాతీయ శాంతిసదస్సుకు కెన్యాప్రతినిధిగా హాజరయ్యారు. ‘ఆఫ్రికా ఉమెన్ ఫెయిత్ నెట్వర్క్’, కెన్యా హెల్త్‌కేర్, లేబర్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, యాంటీ కరప్షన్ స్టీరింగ్ కమిటీలలో మెంబరుగా విశేషంగా సేవలందిస్తున్నారు. కెన్యాలోని హిందూ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ, సత్యసాయి సేవా సమితి వైస్‌ప్రెసిడెంట్‌గా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కరోనా భూతాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో ఉపాధికి దూరమైన వాళ్లను ఆదుకోవడానికి కెన్యాలో ఉన్న హిందూ కౌన్సిల్ ప్రభుత్వానికి వంద మిలియన్ షిల్లింగులను (సుమారు ఏడు కోట్ల పదిలక్షల రూపాయలు) విరాళంగా ఇవ్వడంలో సుజాత చొరవ ప్రధానమైనది. ఇవి కాకుండా స్వయంగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, హెచ్ఐవి బాధితుల శరణాలయాలకు వెళ్లి విరాళాలను పంపిణీ చేశారామె. మనవాళ్లే స్ఫూర్తి ‘‘1992లో మా వారు కెన్యాలో కొంతకాలం పని చేయాలని చెప్పగానే ప్రపంచ పటం తీసుకుని కెన్యా ఎక్కడ ఉందోనని చూసుకున్నాను. అన్యమనస్కంగానే బయలుదేరాను. అప్పటికి కెరీర్ ప్లాన్లు కూడా ఏమీ లేవు. అక్కడికి వెళ్లిన తర్వాత నాలో మార్పు వచ్చింది. సమాజాన్ని చూసే దృక్కోణం మారిపోయింది. కెన్యాలో నూరుశాతం అక్షరాస్యత ఉంది. ఇళ్లలో పని చేయడానికి వచ్చిన వాళ్లు కూడా మంచి ఇంగ్లిష్ మాట్లాడతారు. రెండు–మూడు తరాల కిందట మనదేశం నుంచి వెళ్లిన అనేక కుటుంబాలు నాలో ఇండిపెండెంట్‌గా జీవించగలగాలనే కోరిక కలిగించాయి. ముఖ్యంగా గుజరాత్ వాళ్లయితే ముసలి వాళ్లు కూడా సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుని వస్తుంటారు. దాంతో నేను ఇండియాలో చదివిన మాంటిస్సోరీ చైల్డ్ సైకాలజీలోనే అడ్వాన్స్డ్ కోర్సు చేసి అదే విద్యాసంస్థలో టీచర్‌గా చేరాను. పిల్లలతోపాటు నేనూ స్కూలుకెళ్లేదాన్ని. కొన్నేళ్లకు మా వారు ఉద్యోగం మానేసి నైరోబీ (కెన్యా రాజధాని)లో సొంత వ్యాపారం మొదలు పెట్టారు. తరచూ మారిపోయే ఉద్యోగులతో ఆయనకు ఇబ్బంది ఎదురవుతుండేది. దాంతో నేను టీచర్ ఉద్యోగం మానేసి మా సంస్థలో హెచ్ఆర్, అకౌంట్స్ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టాను. సంస్థ నిర్వహణలో నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయమేమిటంటే... కరోనా లాక్డౌన్ కారణంగా పనులు ఆగిపోవడంతో అనేక కంపెనీలు ఉద్యోగాల కోత, జీతాల కోతను ఆశ్రయిస్తున్నాయి. కానీ నేను ఆ పని చేయలేదు. కెన్యా భాష స్వాహిలి నేను సరదాగా స్వాహిలి భాష నేర్చుకున్నాను. నేను మాట్లాడే స్వాహిలి విన్న వాళ్లు నేను కెన్యాలో పుట్టి పెరిగాననుకుంటారు. వాళ్ల భాష నేర్చుకోవడం వల్ల స్థానికంగా సామాజిక కార్యక్రమాల నిర్వహణలో వాళ్లతో సులభంగా కలిసిపోగలిగాను. ప్రస్తుతం కెన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి కరోనా నియంత్రణ, నివారణ కోసం పని చేస్తున్నాను. చాలా బాగా కట్టడి చేయగలిగామనే చెప్పాలి. మా దగ్గర కోవిడ్ కేసులు పదకొండు వందల దగ్గరే ఆగిపోయాయి. మరణాలు యాభై దాటలేదు’’ అన్నారు సుజాత. రెండూ సొంత దేశాలే మన భారతదేశంలో పుట్టి, కెన్యా గురించి మాట్లాడేటప్పుడు ‘మా దగ్గర’ అన్నారామె. అంతగా ఆ దేశంతో మమేకమైపోయారు సుజాత. ‘‘మరి ఈ దేశం (కెన్యా) మాకు పౌరసత్వం కూడా ఇచ్చింది. ‘మా’ అనుకోకుండా ఉండలేను. ఇండియా ఎంతో నాకు కెన్యా కూడా అంతే’’ అన్నారు సుజాత. కరోనా తగ్గిన తర్వాత ఫ్రాన్స్‌లో ఉన్న పెద్ద కొడుకు, యూఎస్‌లో ఉన్న చిన్న కొడుకుకీ సెలవు చూసుకుని అందరం ఒకసారి ఇండియాకి రావాలని ఉందన్నారామె. – వాకా మంజులారెడ్డి ‘కరోనాను కట్టడి చేద్దాం’ అని కెన్యా ప్రజలకు పిలుపునిస్తున్న కోటంరాజు సుజాత -
రాళ్లు అన్నం ముద్దల్లా ఉడికితే ఎంత బావుణ్ణు!
గర్భంతో ఉన్నప్పుడు తల్లికి ఒక కడుపే. బిడ్డ పుట్టాక రెండు కడుపులు! పిల్లలకు ఆకలైతే తల్లి ఆగలేకపోయేది అందుకే. ఏదో ఒకటి చేసి పెడుతుంది. ఎక్కడో ఒకచోట తెచ్చయినా పెడుతుంది. తల్లికీ బిడ్డలకు తెగనిబంధం.. ఆకలి పేగు! లాక్డౌన్లో ఇప్పుడు..తల్లుల కడుపుల్లోని పిల్లల పేగులు మాడిపోతున్నాయి. రాళ్లు అన్నం ముద్దల్లా ఉడికితే ఎంత బావుణ్ణు! చేసి పెట్టడానికి ఇంట్లో ఏమీ లేవు. తెచ్చి పెట్టడానికి బయట పనులేమీ లేవు. పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు. పెనీనాకు ఎనిమిది మంది పిల్లలు. పెద్దపిల్లలు కూడా ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పూటల పస్తు కాదు మరి. రోజుల పస్తు. పెనీనాకు ఏం చేయాలో తోచడం లేదు. భర్త లేడు. సాయుధులైన బందిపోట్లు ఏడాది క్రితమే అతడిని చంపేశారు. కెన్యాలో బందిపోటు ముఠాలు ఉండే హిందూ మహాసముద్రపు తీరప్రాంతం మోంబసాలో ఉంటోంది వీళ్ల కుటుంబం. భార్యని, బిడ్డల్నీ, ఇంట్లో ఉన్న కొద్దిపాటి గోధుమల్నీ రక్షించుకునే ప్రయత్నంలో బందిపోట్లతో పోరాడి వారి ఆయుధాలకు బలైపోయాడు పెనీనా భర్త. ఆయన ఉన్నప్పుడు కొంత వేరుగా ఉండేది. ఏడాదిగా పెనీనా నాలుగిళ్లలో పనిచేస్తూనే ఇంట్లో పిల్లల్నీ కనిపెట్టుకుని ఉండవలసి వస్తోంది. అటొక అడుగు. ఇటొక అడుగు. కంట్లో పిల్లల్ని పెట్టుకుని పనికి వెళుతుంది. ఇంటికి వచ్చేసరికి కడుపులో ఆకలిని పెట్టుకుని పిల్లలు ఉంటారు. ఎంత రాత్రయినా వంట చేసి పెడుతుంది. పిల్లలు నిద్రపోతుంటే లేపి తినిపిస్తుంది. కానీ కొన్నాళ్లుగా ఆమె.. పిల్లలు నిద్రపోవడం కోసమే వంట ‘చేస్తూ..’ ఉంటోంది. అది ఎంతకీ కాని వంట! లాక్‌డౌన్‌తో పెనీనా తన ఉపాధిని కోల్పోయింది. బట్టలు ఉతుకుతుంటుంది తను. ‘భౌతిక దూరం’ పాటించక తప్పదు కాబట్టి ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటున్నారు. తనను కొంతకాలం వరకు రావద్దని చెప్పారు. పెనీనా ఇంటికే పరిమితం అవాల్సి వచ్చింది. చేతిలో డబ్బుల్లేవు. ఇంట్లో తిండిగింజల నిల్వలు లేవు. పిల్లలు ఆకలి అంటున్నప్పుడు నీళ్లతో చేయగలిగిన ద్రవాహారమేదో చేసి గ్లాసులలో నింపి ఇస్తోంది. నీళ్లతో ప్రయోగాలు అయిపోయి, రాళ్లతో ఆమె వంట చేస్తుండగా పొరుగున ఉండే ప్రిస్కా అనే ఆమె కంట్లో పడింది. పెనీనా మిగతా పిల్లల్లో ఇద్దరు. పెనీనాను చూసి ప్రిస్కాకు కళ్ల నీళ్లు వచ్చాయి. అవును. పెనీనా రాళ్లతో వంట చేస్తోంది! ఒక బిడ్డ ఆమె చంకలో ఉంది. మిగతా పిల్లలు అమ్మ చేస్తున్న వంట పూర్తవడం కోసం నిద్రను ఆపుకుని ఉన్నారు. ‘ఇదిగో అయిపోతోంది. తిందురు గానీ’ అని పెనీనా అంటుండటమే కానీ, ఎంతకీ అయిపోతేనా! ఎలా అయిపోతుంది? అమ్మేదో తినడానికి చేస్తోందని పిల్లల్ని నమ్మించడానికి పెనీనా పొయ్యి రాజేసింది. పొయ్యి పైన కుండను పెట్టింది. కుండలో నీళ్లు పోసింది. పిల్లలు అదంతా చూస్తూనే ఉన్నారు. వారు చూడనిది, వాళ్లకు తెలియనిది ఒక్కటే. ఆ కుండలో ఉడుకుతున్నది అన్నం కాదు, రాళ్లు అని!! ‘‘ఎందుకిలా చేశావ్’’ అంది ప్రిస్కా, పెనీనాను పక్కకు తీసుకెళ్లి గట్టిగా హత్తుకుని. ‘‘పిల్లలు నిద్రపోయేవరకు ఏదో ఒకటి చెయ్యాలిగా’’ అంది కన్నీళ్లను ఆపుకుంటూ. అప్పటికే ప్రిస్కా పెట్టిన బిస్కెట్లు అవీ తింటున్నారు పిల్లలు. ‘‘నువ్వూ తిను’’ అంది ప్రిస్కా. ‘‘వాళ్లు తింటున్నారు కదా. నా ఆకలీ తీరుతోంది’’ అంది పెనీనా సంతృప్తిగా. ప్రిస్కా చదువుకున్న అమ్మాయి. అత్యవసరంగా పెనీనా పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచింది. మీడియాను అలెర్ట్ చేసింది. బిడ్డల ఆకలి తీర్చలేక వాళ్లను మాయచేసి నిద్రపుచ్చడానికి పెనీనా అనే ఒక తల్లి చేసిన రాళ్ల వంట గురించి తెలిసి ప్రపంచ నివ్వెరపోయింది. కెన్యాలో ఇప్పుడు ఎంతోమంది పెనీనాకు సహాయం చేసేందుకు వస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు’’ అంటోంది పెనీనా తన పిల్లలందర్నీ కడుపులోకి లాక్కుంటూ. మోంబసాలోని మిషోమొరోని ప్రాంతంలో పెనీనా ఇల్లు. ఆమె పిల్లలు. పెనీనాకు సాయం చేయడానికి వచ్చిన కెన్యన్లు. -
బిడ్డల కోసం రాళ్లు వండుతున్న తల్లి
నైరోబి: కరోనా ఏమో కానీ దానికన్నా ముందే కటిక దారిద్ర్యం పేదవారి ప్రాణాలు తీసేలా ఉంది. ఇంట్లో సరుకులు లేక, పిల్లల కడుపు నింపలేక పేద తల్లిదండ్రులు కళ్ల నుంచి రక్తం కారుస్తున్నారు. ఓవైపు ఆకలిమంట.. మరోవైపు కన్నబిడ్డలకు తిండిపెట్టలేక పేగుమంట.. వెరసి ఓ తల్లి, లేని అన్నం వండుతున్నట్లు పిల్లలను మాయ చేస్తూ నిద్ర పుచ్చుతోంది. వీరి దుస్థితికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కెన్యాకు చెందిన కిట్సావో అనే ఓ వితంతువు ఇరుగుపొరుగు ఇళ్లలో బట్టలు ఉతికే పని చేసేది. ఆ దేశంలో విధించిన లాక్డౌన్ వల్ల ఆమె పని కోల్పోయింది. దీంతో నీళ్లు, విద్యుత్ సదుపాయం కూడా సరిగా లేని తన ఇంటికే పరిమితమైంది. చూస్తుండగానే ఆమె ఇంట్లో ఉన్న సరుకులు నిండుకున్నాయి. ఇవేవీ అర్థం కాని పిల్లలు ఆకలంటూ అలమటించారు. (ఆ గిఫ్ట్ ఇవ్వగానే ఏడ్చేసిన వృద్ధుడు) ప్రపంచంలో ఇంత ప్రేముందా? వారికి ఆ తల్లి ఏమని చెప్పగలదు? చెప్పినా పిల్లలు ఏమని అర్థం చేసుకోగలరు? అలా అని ఎన్ని పూటలని వాళ్లు ఆకలిని చంపుకుని ఉండగలరు? వారి కన్నీళ్లు చూడలేక, కడుపున భోజనం పెట్టలేక ఆ తల్లి ఓ పరిష్కార మార్గాన్ని ఆలోచించింది. పొయ్యి వెలిగించి పసిపిల్లల కళ్లలో ఆశల జ్యోతులు నింపింది. అందులో రాళ్లు వేసి ఉడికిస్తూ అన్నం తయారవుతోందని చెప్పి పడుకోబెట్టింది. అది ఎన్నటికీ ఆహారంగా మారదని తెలీని చిన్నారులు అమాయకంగా అమ్మ చెప్పిన మాటలను నమ్మి నిద్రలోకి జారుకున్నారు. ఇది గమనించిన ఓ వ్యక్తి మీడియాకు సమాచారం అందించాడు. దీంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపిస్తూ ఎందరో వ్యక్తులు సాయం కోసం ముందుకొస్తున్నారు. నిత్యావసర సరుకులతోపాటు పెద్ద మొత్తంలో డబ్బును అందజేస్తున్నారు. ఇది చూసిన ఆ తల్లి ప్రపంచంలో ఇంత ప్రేమ ఉందని నమ్మలేకపోతున్నానని భావోద్వేగానికి లోనైంది. (నాన్నా.. అమ్మ ఏది?) -
మందు బాటిళ్లు పంపిన గవర్నర్.. ఎక్కడంటే..
నైరోబి : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలు.. ప్రజలకు నిత్యావసరాలు అందించడం మనం చూశాం. కానీ కెన్యాలో మాత్రం ఆహారపదార్థాలు వంటి నిత్యావసరాలతో పాటుగా మందు బాటిళ్లనూ అందిస్తున్నారు. అల్కహాల్ కాబట్టి శానిటైజర్స్లా వాడుతున్నారోమో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ మందుబాటిళ్లు చేతులు కడుక్కోవడానికి కాదు, తాగడానికే. వివిధ రకాల శానిటైజర్లు, సబ్బులు వాడి చేతులు శుభ్రం చేసుకున్నట్లే మందుతో గొంతును శానిటైజ్ చేసుకోవాలట. ఈ విషయం చెప్పింది సాక్షాత్తు ఆ రాష్ర్ట గవర్నర్ మైక్ సోంకో. (కరోనా మళ్లీ మళ్లీ రావచ్చు: డబ్ల్యూహెచ్ఓ) గతవారం జరిగిన మీడియా సమావేశంలో కోవిడ్-19 కేర్ ప్యాకేజీలు (ఆహారం లాంటి నిత్యవసరాలు) లలో మద్యం బాటిళ్లు కూడా పంపిస్తున్నట్లు ప్రకటించారు."ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ ), ఇతర ఆరోగ్య సంస్థలు జరిపిన పరిశోధనల్లో ఆల్కహాల్ వల్ల కరోనా నశిస్తుందని అంచనా వేశారు. నేను కూడా ఇదే విధానాన్ని నమ్ముతున్నాను. అందుకే ప్రజలకు ఇచ్చే ఫుడ్ ప్యాకెట్లలో కొన్ని చిన్న హెన్నెస్సీ (ఆల్కహాల్) బాటిళ్లను అందిస్తున్నాం. "అని గవర్నర్ మైక్ సోంకో పేర్కొన్నారు. (ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్‌కు ఏమైంది?) ఫుడ్ ప్యాకెట్లను ఓ వ్యక్తి ఫోటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ..ఓ ప్రకటన విడుదల చేసింది. ఆల్కహాల్ వల్ల కరోనా నశిస్తుందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఒకవేళ ఎవరికైనా కరోనా సోకిన వ్యక్తి ఆల్కహాల్ సేవిస్తే మరింత ప్రమాదకరమని హెచ్చరించింది. చైనాలోని వూహాన్లో మొట్టమొదటగా వెలుగుచూసిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 22,40,191 మందికి సోకగా, 1,53,822 మంది ప్రాణాలు కోల్పోయారు. This is wild🤦🏾♂️. The governor of Nairobi, Kenya @MikeSonko announced that are giving “small bottles of Hennessy” in food packs being distributed to the city’s poor families amid the coronavirus pandemic. Because Alcohol kills Covid19. Don’t believe me just watch 👇🏾 pic.twitter.com/8IzFWnjdTa — King of Leon. (@MightiJamie) April 16, 2020 -
ఈ జింక చాలా తెలివైనది గురూ...
అటు ఒక్కటి కాదు రెండు కాదు... ఐదు చీతాలు.. ఇటేమో ఒక్కటే జింక. మామూలుగా అయితే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ మొత్తం వచ్చి మీద పడింది. అయితే.. ఈ జింక కాస్త తెలివైనది లాగుంది. టైమ్ కోసం వేచి చూసింది. చాన్స్ రాగానే...వెనక్కాళ్లతో డిష్యూం డిష్యూం అంటూ ఒక్కోదానికి జింతాత చితాచితా చేసి... రయ్యిమంటూ అక్కడ నుంచి పరుగులు తీసింది. కెన్యాలోని సలాయ్షో పార్కులో జరిగిన ఈ సన్నివేశాల్ని బ్రిటన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ కెవిన్ క్లిక్ మనిపించారు. -
సింహం సింగిల్‌గా వస్తుంది.. ఆ వస్తే.. వస్తే ఏంటట..
ఓ సినిమాలో డైలాగ్..పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది అని..ఈ సింహం దాన్ని బాగా నమ్మేసినట్లు ఉంది..సింగిల్‌గానే వెళ్లింది..అప్పుడు ఏం జరిగిందంటే.. మొన్నీమధ్యే..కెన్యాలోని లేక్ నకురు నేషనల్ పార్కులోఊసుపోని సింహం ఒకటి ఊరి మీదకు బయల్దేరిందిఇలా ఇంటి మలుపు తిరిగిందో లేదో..అడవి గేదెల గుంపు ఒకటి ఎదురైంది.. అసలే సింహం.. ఆపై కామన్సెన్స్ తక్కువ..పైగా.. ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో తెలియదు..దాంతో ఏయ్ అన్నట్లు చూసింది..అవి పోపోవోయ్ అన్నాయి..ఇది గుర్రుమంది.. అంతే.. వాటికి కాలింది.. పాత కక్షలు ఏమైనా ఉన్నాయో ఏమో తెలియదుగానీ..ఒక్కసారిగా మీదకు ఉరికాయి.. సింహానికి తత్వం బోధపడింది..కస్సుమన్నది కాస్త.. కాలికి పనిచెప్పింది.. చేసేదిలేక ఇలా చెట్టెక్కి కూర్చుంది.. సింహం కళ్లలో భయం చూశాక.. గేదెల ఈగో శాటిస్ఫై అయినట్లుంది..దీంతో పోనీలే అని దాన్ని వదిలేసి.. వార్నింగులు గట్రా ఇచ్చేసి..ఇంటి దారి పట్టాయి.(ఈ చిత్రాలను ముంబైకి చెందిన ఫొటోగ్రాఫర్ నీలోత్పల్ బారువా క్లిక్‌మనిపించారు.) -
‘అమ్మ’ ప్రేమను చాటిన సింహం
బిడ్డలపై ప్రేమ లేని తల్లి ఉంటుందా అంటే.. సమాధానం చెప్పడం చాలా కష్టం. ఏ తల్లి అయినా తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తల్లిప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. దీనికి నిదర్శనం ఈ వీడియోనే. తన బిడ్డను నది దాటించే క్రమంలో ఓ ఆడసింహం చేసిన పని అందరిని ఆశ్చర్యపరిచింది. నదిలోని మొసళ్లు ఎక్కడ తన బిడ్డలను మింగేస్తాయోనని చూసుకుంటూ.. జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చింది ఆ ఆడ సింహం. నది దాటే క్రమంలో పిల్ల సింహం ఒక్క క్షణం నిటిలో మునిగితే చాలు.. వెంటనే నోటితోపైకి లాగుతోంది. తన బిడ్డను మొసలి మింగేసిదన్న భయంతో వెంటనే అప్రమత్తమై పిల్ల సింహాన్ని నోటితో పైకి లాగుతోంది. ఈ అసాధారణ దృశ్యం కెన్యాలోని ఎవాసో వద్దగల నైరో నది సమీపంలో చోటు చేసుకోగా.. లుకా బ్రాకాలి అనే ప్రముఖ ఫోటో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ‘తల్లి ప్రేమను మించింది లేదు’., ‘ సింహం అయినా కూడా ఓ బిడ్డకు తల్లియే కదా’ అని కామెంట్లు పెడుతున్నారు. -
‘అమ్మ’ ప్రేమను చాటిన సింహం
-
19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా..
దుబాయ్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే వరల్డ్ టీ20కి పపువా న్యూగినియా క్వాలిఫై అయ్యింది. గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో పవువా న్యూగినియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కెన్యాను 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూల్చి 45 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పవువా న్యూగినియా 19.3 ఓవర్లలో 113 పరుగులు చేసింది. 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పవువాను నార్మన్ వనువా(54) గట్టెక్కించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీతో మెరిశాడు. దాంతో పవువా గౌరవప్రదమైన స్కోరును సాధించింది.ఆపై 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కెన్యా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ చివరకు పరాజయం చెందింది. దాంతో గ్రూప్-ఎలో రన్‌రేట్ సాయంతో అగ్రస్థానంలో నిలిచిన పవువా వరల్డ్ టీ20కి అర్హత సాధించింది. ఇదే పవుమాకు తొలి వరల్డ్ టీ20 అర్హత. స్కాట్లాండ్-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆధారంగా పవువా క్వాలిఫై ఆశలు ఆధారపడి ఉన్నప్పటికీ ఆ జట్టు విశేషంగా రాణించడంతో నెట్ రన్‌రేట్ ఆధారంగా వరల్డ్ టీ20లో అడుగుపెట్టడం విశేషం. నెదర్లాండ్స్ 12.3 ఓవర్లలో 130 పరుగుల లక్ష్యాన్ని సాధించినా ఆ జట్టు కంటే పవుమా మెరుగైన్ రన్‌రేట్‌తో ముందంజ వేసింది. -
రూ. 200 అప్పు తీర్చడం కోసం 30 ఏళ్ల తర్వాత
ముంబై : వేల కోట్ల రూపాయలు అప్పు చేసి... ఆ తర్వాత ఎంచక్కా దేశం దాటి పోతున్న ఈ రోజుల్లో చేసిన అప్పు తీర్చడం కోసం ఓ వ్యక్తి ఏకంగా కెన్యా నుంచి 30 ఏళ్ల తర్వాత ఇండియా రావడం నిజంగా గ్రేటే. ఆ వచ్చిన వ్యక్తి ఎంపీ కావడం ఇక్కడ విశేషం. వివరాలు.. 79 ఏళ్ల కాశీనాథ్ గావ్లీ ఇంటికి రెండు రోజుల క్రితం ఓ అనుకోని అతిథి వచ్చాడు. తన పేరు రిచర్డ్ టోంగ్ అని.. కెన్యా దేశ ఎంపీనని చెప్పాడు. 30 ఏళ్ల క్రితం కాశీనాథ్ తనకు రూ. 200 సాయం చేశాడని.. ఆ సొమ్మును తిరిగి చెల్లించడానికి వచ్చానన్నాడు. ఆశ్చర్యపోవడం కాశీనాథ్ వంతయ్యింది. ఈ విషయం గురించి రిచర్డ్ మాట్లాడుతూ.. ‘1985-89 కాలంలో నేను మేనేజ్మెంట్ కోర్సు చడవడం కోసం ఇండియా వచ్చాను. అప్పుడు నేను వాంఖేడ్‌నగర్ ప్రాంతంలో ఉండేవాడిని. కాశీనాథ్ గారి కుటుంబం కూడా అదే ప్రాంతంలో కిరాణ షాపు నడుపుతుండేవారు. ఆ సమయంలో ఓ సారి డబ్బులు లేక నేను ఇబ్బంది పడుతుంటే కాశీనాథ్ గారు నాకు రూ. 200 సాయం చేశారు. అప్పుడు ఆ అప్పును తిరిగి చెల్లించే పరిస్థితిలో నేను లేను. కానీ ఆయన సాయాన్ని మాత్రం మర్చిపోలేకపోయాను. ఎప్పటికైనా కాశీనాథ్ గారి రుణాన్ని తీర్చుకోవాలని.. ఆయనకు కృతజ్ఞత తెలపాలని మనసులోనే అనుకునే వాడిని. ఇప్పటికి నాకు కుదిరింది’ అన్నారు రిచర్డ్. ‘నన్ను చూసి కాశీనాథ్ గారు చాలా ఆశ్చర్యపోయారు. నా రాక పట్ల ఎంతో సంతోషం వెలిబుచ్చారు. భోజనం నిమిత్తం నేను హోటల్‌కి వెళ్లాలని భావించాను. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. వారితో పాటు కలిసి భోంచేసేలా నన్ను బలవంతపెట్టారని తెలిపారు రిచర్డ్. ప్రస్తుతం తాను కెన్యాలో ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను’ అన్నారు రిచర్డ్. తిరిగి వెళ్లేటప్పుడు కాశీనాథ్‌ను తమ దేశం రావాల్సిందిగా ఆహ్వానించారు రిచర్డ్. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. -
విసిగిపోయిన కూలీ.. ఇప్పుడు హీరో!!
పాలకుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన ఓ వ్యక్తి ఊరి సమస్యను పరిష్కరించేందుకు తానే నడుం బిగించాడు. కిలోమీటరు మేర స్వయంగా రోడ్డు నిర్మించి అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు. కెన్యాలోని కగండా గ్రామానికి చెందిన రోజూవారీ కూలీ నికోలస్ ముచామి.. పొదలతో నిండిపోయిన రోడ్డును బాగు చేయాలంటూ ప్రభుత్వాధికారులకు ఎన్నోసార్లు అర్జీలు పెట్టాడు. కొండప్రాంతంలో ఉన్న తమ గ్రామం నుంచి బాహ్య ప్రపంచానికి వెళ్లడానికి మహిళలు, పిల్లలు, వృద్ధులు పడుతున్న అగచాట్ల గురించి వివరించాడు. కానీ అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించకుండా.. అసలు ఇదొక సమస్యే కాదన్నట్లు తేలిగ్గా తీసుకున్నారు. ఉదయం 6 గంటలకే మొదలు.. ఈ విషయం గురించి ముచామి మాట్లాడుతూ.. ‘ మట్టిరోడ్డు సరిగ్గా లేక ఎన్నో ఏళ్లుగా కష్టాలు పడ్డాం. స్థానిక నాయకులు, అధికారులకు లెక్కలేనన్ని వినతి పత్రాలు ఇచ్చాను. కానీ ఫలితం మాత్రం శూన్యం. అందుకే నేనే రంగంలోకి దిగాను. రోజూ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం ఆరింటి దాకా శ్రమించాను. నా దగ్గరున్న పనిముట్ల సాయంతో రోడ్డు నిర్మించా. దగ్గర్లోని షాపింగ్ సెంటర్, చర్చికి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసమే నేను ఈ పనికి పూనుకున్నా’ అని చెప్పుకొచ్చాడు. కష్టాల నుంచి తమకు విముక్తి కలిగించిన ముచామికి రుణపడి ఉంటామని కగండా గ్రామస్తులు అతడిని ప్రశంసిస్తున్నారు. -
దాతృత్వ మాస్టారుకు పట్టం
తనను వరించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్స్ అవార్డు పట్టుకుని విద్యార్థులతో కలసి సంతోషం పంచుకుంటున్న కెన్యా ఉపాధ్యాయుడు పీటర్ మొకాయా తాబిచి. దాదాపు పదేళ్లుగా ఆయన ప్రతీ నెలా తన ఆదాయంలో 80 శాతం మొత్తాన్ని పేద విద్యార్థుల అవసరాలు తీర్చేందుకే వెచ్చిస్తున్నారు. దీంతో వార్కే ఫౌండేషన్.. అవార్డుతో పాటు రూ.7 కోట్ల నగదు బహుమతిని అందజేసింది. -
ఆత్మాహుతి దాడి..15 మంది మృతి
నైరోబీ : కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హోటల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నైరోబీలోని వెస్ట్‌లాండ్స్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ‘డస్టిట్‌డీ2’ హోటల్ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి ముష్కరులు ప్రవేశించారు. పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనాలపైకి బాంబులు విసిరారు. అనంతరం ఓ దుండగుడు తనను తాను పేల్చుకున్నాడు. దాడి అనంతరం తుపాకులతో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15 మంది మృతి చెందినట్లు సమాచారం. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడి సమాచారం అందుకున్న వెంటనే హోటల్ కాంప్లెక్స్‌ను భద్రతాబలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనకు తామే బాధ్యులమని ‘అల్-షబాబ్’ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. -
మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు
బెర్లిన్ (జర్మనీ): పురుషుల అథ్లెటిక్స్‌లో అత్యంత క్లిష్టమైన రేసు మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన బెర్లిన్ మారథాన్‌లో కెన్యాకు చెందిన 33 ఏళ్ల ఎలియుడ్ కిప్‌చోగె ఈ ఘనత సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన కిప్‌చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల ఒక నిమిషం 39 సెకన్లలో పూర్తి చేసి... స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2014 బెర్లిన్ మారథాన్‌లోనే కెన్యాకు చెందిన డెన్నిస్ కిమెట్టో (2గం:02ని.57 సెకన్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిప్‌చోగె తెరమరుగు చేశాడు. -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ అథ్లెట్ మృతి
నైరోబి : కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్ నికోలస్ బెట్(28) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హర్డల్స్ చాంపియన్ షిప్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా నాంది కౌంటీలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బెట్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బెట్ ప్రమాద స్థలంలోనే మృతి చెందారని కౌంటీ అధికారులు తెలిపారు. ప్రపంచ చాంపియన్.. బెట్ 2015లో జరిగిన 400 మీటర్ల హర్డల్స్ పోటీల్లో బంగారు పతకం సాధించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. చైనాలో జరిగిన షార్ట్ డిస్టెన్స్ హర్డల్స్ రేస్ పోటీల్లో విజేతగా నిలిచి చైనాలో ఆ ఘనత సాధించిన మొదటి కెన్యా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు. రెండుసార్లు ఆఫ్రికా హర్డల్స్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకున్నారు. బెట్ సోదరుడు హరోన్ కోయిచ్ కూడా 400 మీటర్ల హర్డ్లర్ కావడం విశేషం. కాగా, 2016 లో బ్రెజిల్లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు బెట్ అర్హత సాధించలేదు. BREAKING: 28 year old Beijing World Championship gold medalist Nicholas Bett dies in car crash in Nandi. He had just returned from the Continental Championships 😢 pic.twitter.com/ypndezlslh — Mr waddis The Brand (@kipronoenock) August 8, 2018 -
ఒక్కడి ఆలోచన.. మృగరాజులకు వణుకు
నైరోబీ: అది ఆఫ్రికన్ దేశం కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్. ఆధునికతకు.. అటవీక జీవనానికి మధ్యగా నలిగిపోయే కిటెన్‌గెలా అనే ఓ చిన్ని గ్రామం. ఆ మధ్యలో ఓ చిన్న నదీపాయ. దీంతో పక్కనే ఉన్న సఫారీ నుంచి జంతువులు తరచూ ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న పచ్చిక బయళ్లకు వస్తుంటాయి. వాటిల్లో ఆవుల మందను వేటాడే సింహాలు కూడా ఉంటాయి. కానీ, అక్కడి ప్రజల విన్నూత ఆలోచనకు మృగరాజులు తోకి ముడిచి వెనక్కి చిత్తగిస్తుంటాయి. ఆ ఆలోచన వెనుక ఉన్న బుర్ర మాత్రం రిచర్డ్ టురెరె(18) కుర్ర కాపరిది. సూటిగా కథలోకి వెళ్తే... మాసయి తెగకు చెందిన రిచర్డ్ 9 ఏళ్ల వయసులో చదువుకు పుల్‌స్టాప్ పెట్టి తండ్రికి తోడుగా పశువులను మేపటం ప్రారంభించాడు. తన కళ్ల ముందే ఆవులను సింహాలు కబళిస్తున్న ఉదంతాలు అతనిలో భయాన్ని పొగొట్టేవి. ఇదిలా ఉంటే రిచర్డ్ 11 ఏట.. తమ మందలోని 9 ఆవులను వారం రోజుల్లో సింహాల మంద పొట్టనబెట్టుకున్నాయి. ఆర్థికంగా తీరని నష్టం కలగటంతో తల్లి కుంగిపోగా.. తన బుర్రకు పదును పెట్టడం రిచర్డ్ ఆరంభించాడు. సింహాలను తరిమేందుకు భయంకరంగా ఉన్న కాకి బొమ్మను తన వెంట తీసుకెళ్లేవాడు. కానీ, ఆ ఐడియా వర్కవుట్ కాలేదు. ఇదిలా ఉంటే ఓ రోజు రాత్రి టార్చ్ లైట్‌తో వెళ్తున్న సమయంలో సింహాలు ఎలాంటి దాడులకు పాల్పడపోగా.. ఆ వెలుతురికి భయంతో పరుగులు తీశాయి. అంతే వెంటనే అతని మెదడులో ఓ ఆలోచన మెరిసింది. తన తల్లి అపురూపంగా చూసుకునే రేడియోను బద్ధలు కొట్టి.. ఓ ఎల్ఈడీ బల్బు సాయంతో లైటింగ్ వ్యవస్థను రూపొందించాడు. సింహాలు దాడులకు వచ్చిన సమయంలో వాటిని వెలిగిలించటం.. అవి భయంతో పరుగులు తీయటం... మొత్తానికి ఈ ఐడియా బాగా వర్కవుట్ అయ్యింది. నాలుగేళ్ల తర్వాత అతని పరిశోధనకు పెటెంట్ హక్కులు దక్కాయి. కెన్యాలో యంగెస్ట్ పెటెంట్‌గా రిచర్డ్‌గా గుర్తింపు దక్కింది. అంతేకాదు 2013లో కాలిఫోర్నియాలో జరిగిన టెడ్ సదస్సులో ‘అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా’ లాంటి దిగ్గజాల మధ్య ప్రసంగించే అవకాశం రిచర్డ్‌కు లభించింది. దీంతోపాటే బ్రూక్ హౌస్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ కూడా ఇచ్చింది. అయితే లయన్ లైట్స్ పెటెంట్ ఉన్నప్పటికీ.. ఆ ఆలోచన చుట్టుపక్కల పాకటంతో మరికొందరు ఇదే పద్ధతిని అవలంభించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా రిచర్డ్‌ను పట్టించుకోవటం మానేశాయి. దీంతో అతని జీవితం మళ్లీ వెనక్కి వచ్చేసింది. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్లు. పశువులను మేపుకుంటూనే జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగని ప్రయోగాలకు అతను దూరం కాలేదు. ప్రస్తుతం ఏనుగులకు సంబంధించిన ఓ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడంట. ‘లయన్ లైట్స్ 2.0’ వ్యవస్థను ఇన్స్టాల్ చేయటానికి ఖరీదు రెండు వందల డాలర్లు ఖర్చు అవుతుంది. ఇందులో సగం ఓ ఎన్డీవో సంస్థ అందిస్తుండగా.. ఇంకా సగం కాపరులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 750 లయన్ లైట్ సిస్టమ్‌లు ఆ ఊరు చుట్టు పక్కల ఉన్నాయి. అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో వాటి అవసరం ఉందని రిచర్డ్ అంటున్నాడు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సాయం చేయాలని చాలా కాలం నుంచే అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. తన కొడుకు కంటే మేధావులు ఈ దేశంలో ఎందో ఉన్నారని, ప్రభుత్వాలు సరైన తోడ్పాటు-ప్రోత్సాహం అందిస్తే వారంతా అద్భుతాలు సృష్టిస్తారని రిచర్డ్ తల్లి వెరోనికచ్ చెబుతున్నారు. -
బేబి దియా
ఏ స్టార్‌కి ఎక్కడ ఫ్యాన్స్ ఉంటారో చెప్పలేం. వాళ్ల మాతృభాషలో ఉండొచ్చు.. పరాయి భాషల్లోనూ ఫ్యాన్స్ ఉండొచ్చు. అంతెందుకు? పరాయి దేశాల్లో కూడా ఫాలోయింగ్ ఉండి ఉండొచ్చు. ఒకవేళ అభిమానం ఎక్కువైతే ఆ స్టార్ పేరు తమ పిల్లలకో, అభిమానంగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులకో పెట్టుకుని ఫ్యాన్స్ మురిసిపోతారు. ఇప్పుడు దియా మీర్జా పేరు ఓ ఖడ్గమృగానికి సెట్ అయింది. ‘లగేరహో మున్నాభాయ్, దస్, సంజు’ సినిమాలతో బాలీవుడ్లో ఫేమ్ సంపాదించారు దియా. యుఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్‌విల్ అంబాసిడర్, భారతదేశపు వన్యప్రాణ సంరక్షణ ట్రస్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలను అందిస్తున్నారామె. కెన్యాలోని ఓఐపెజెటా సంరక్షణ సంస్థలోని ఓ ఖడ్గ మృగానికి దియా మిర్జా పేరుని పెట్టారు. ఈ విషయాన్ని దియా తెలియజేస్తూ –‘‘థ్యాంక్యూ ఓఐపెజెటా. నా పేరును ఓ బ్యూటిఫుల్ బేబీకు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ టీమ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. కెన్యాలోని ఈ ప్లేస్‌ని ఎవరైనా విజిట్ చేసినప్పుడు దియాతో ఫొటో దిగి నాకు షేర్ చేయండి’’ అని పేర్కొన్నారు. -
ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్..
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపుకెళ్లి తొడ కొట్టిందట.. ఇదో సినిమాలోని డైలాగు.. సపోజ్.. ఫర్ సపోజ్.. కోడి నిజంగానే తొడకొడితే ఏమవుతుంది.. సాయంత్రానికి చికెన్ పకోడి అవుతుంది! ఇదిగో ఈ కొంగబావ కూడా ఆ కోడి టైపే.. అందుకే ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్న తెలివిడి లేకుండా.. మొసలితోనే పరాచికాలాడింది.. అయినా.. ఫ్లూటు జింక ముందు ఊదాలి.. సింహం ముందు కాదు.. ఊదితే ఏమవుతుంది.. ఇలా అవుతుంది. పరాచికాలకు దిగిన కొంగ మరు క్షణంలోనే మొసలికి పలహారమైపోయింది. ఈ ఫొటోలను కెన్యాలోని మారా నది వద్ద తీశారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీ పీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగాలకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ..శక్తిని ప్రసాదించే తిరుమల క్షేత్రంలో అనేక అవకతవకలు, ఆరోపణలు రావడం చాలా బాధాకరమన్నారు. అధికారులు, అర్చకులు, పాలక వర్గాల మధ్య సమన్వయ లోపమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. వెంటనే టీటీడీపై వస్తోన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. లేకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగా మాట్లాడుతూ..హిందూమతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన బాగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. తనకు సరైన ఆతిధ్యం ఇచ్చినందుకు భారతదేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రైలా ఓడింగా 2008 నుంచి 2013 మధ్య కెన్యా ప్రధానిగా పనిచేశారు. -
మెస్సీ సరసన సునీల్ చెత్రీ...
ముంబై: స్వదేశంలో అద్భుత ఫామ్ కొనసాగించిన భారత ఫుట్‌బాల్ జట్టు ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కెన్యాతో ఆదివారం జరిగిన ఫైనల్లో కెప్టెన్ సునీల్ చెత్రీ డబుల్ గోల్స్ సాయంతో భారత్ 2–0తో విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో చెత్రీ అర్జెంటీనా స్టార్ మెస్సీ సరసన చేరాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీతో జత కట్టాడు. మెస్సీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్ చేయగా... చెత్రీ 102 మ్యాచ్‌ల్లోనే 64 గోల్స్ సాధించాడు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ రొనాల్డో (150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. విజయం అభిమానానికి అంకితం.. కెన్యాతో ఫైనల్లో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకోవడంతో సునీల్ చెత్రీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విజయం అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. విశేషమైన అభిమానం తమపై చూపెట్టడంతో దక్కిన విజయంగా అభివర్ణించాడు. ఈ మేరకు తమ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ఆదరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ అభిమానం ఎప్పటికీ ఇలానే ఉండాలనే విన్నవించాడు. ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని తొలి మ్యాచ్ తర్వాత చెత్రీ ఆవేదన ఇది. చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌కు ముంబైలోని ఎరీనా స్టేడియం బోసిపోవడంతో చెత్రీ తన ఆవేదనతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చెత్రి ఆవేదనను అటు సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా అర్ధం చేసుకోవడంతో భారత ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు భారీ మద్దతు దక్కింది. ఈ క్రమంలోనే కప్‌ను గెలవడం భారత్ ఫుట్‌బాల్‌లో మరింత జోష్‌ను నింపింది. -
విజేత భారత్
ముంబై: స్వదేశంలో అద్భుత ఫామ్ కొనసాగించిన భారత ఫుట్‌బాల్ జట్టు ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను చేజిక్కించుకుంది. కెన్యాతో ఆదివారం జరిగిన ఫైనల్లో కెప్టెన్ సునీల్ చెత్రీ డబుల్ గోల్స్ సాయంతో భారత్ 2–0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్ (8వ, 29వ నిమిషాల్లో) చెత్రీనే చేయడం విశేషం. ఈ టోర్నీలో భారత్ తరఫున మొత్తం 11 గోల్స్ నమోదు కాగా... వాటిలో చెత్రీ ఒక్కడే 8 గోల్స్ కొట్టాడు. మెస్సీ సరసన చెత్రీ... ఈ మ్యాచ్‌తో చెత్రీ అర్జెంటీనా స్టార్ మెస్సీ సరసన చేరాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీతో జత కట్టాడు. మెస్సీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్ చేయగా... చెత్రీ 102 మ్యాచ్‌ల్లోనే 64 గోల్స్ సాధించాడు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ రొనాల్డో (150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. -
చెత్రీ గ్యాంగ్ సాధించేనా?
ముంబై: స్వదేశంలో మరో టైటిల్ చేజిక్కించు కోవడానికి భారత ఫుట్‌బాల్ జట్టు విజయం దూరంలో ఉంది. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా నేడు జరిగే ఫైనల్లో కెన్యాతో భారత్ తలపడనుంది. ఆరంభంలో వరుస విజయాలతో జోరు ప్రదర్శించి... చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య పరాజయం పాలైన భారత జట్టు ఫైనల్లో మాత్రం నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకుండా ఆడాలని పట్టుదలతో ఉంది. లీగ్ దశలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క గోల్ కొట్టే అవకాశం కూడా ఇవ్వకుండా చెలరేగిన భారత్ 3–0తో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ సునీల్ చెత్రి రెండు గోల్స్‌తో సత్తాచాటాడు. అదే ప్రదర్శనను తిరిగి పునరావృతం చేయాలని భారత జట్టు భావిస్తుండగా... లీగ్ దశలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని కెన్యా చూస్తోంది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 6 గోల్స్‌తో తిరుగులేని ఫామ్‌లో ఉన్న కెప్టెన్ చెత్రితో పాటు మరో స్ట్రయికర్ జెజే లాల్పెక్లువా ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నారు. చివరి లీగ్ మ్యాచ్‌లో కెన్యా 4–0తో చైనీస్ తైపీపై విజయం సాధించి... న్యూజిలాండ్‌ను వెనక్కు నెట్టి ఫైనల్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సమరం ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో మాత్రమే భారత్ ఓటమి పాలవగా... కెన్యా 2–1తో న్యూజిలాండ్‌పై నెగ్గింది. -
ఆట హిట్... అభిమానం సూపర్ హిట్
ముంబై: ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండో విజయంతో ఫైనల్ చేరింది. నాలుగు దేశాల ఈ టోర్నీలో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 3–0తో కెన్యాపై జయభేరి మోగించింది. వందో మ్యాచ్ ఆడుతున్న భారత కెప్టెన్ సునీల్ చెత్రికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకులు ఇచ్చిన మద్దతుతో అతను చెలరేగాడు. మ్యాచ్‌లో రెండు గోల్స్ (68వ ని., 90+1వ ని.లో; ఇంజూరీ టైమ్) చేశాడు. మరో గోల్‌ను స్ట్రయికర్ జెజె లాల్‌పెఖువా (71వ ని.) సాధించాడు. తొలి అర్ధభాగం ముగిసేదాకా ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ద్వితీయార్ధంలో భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదునుపెట్టారు. ‘డి’ ఏరియాలో చెత్రిని ప్రత్యర్థి ఆటగాడు మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ భారత్‌కు పెనాల్టీ ఇచ్చాడు. దీన్ని చెత్రి 68వ నిమిషంలో విజయవంతంగా సాధించడంతో స్టేడియం ఒక్కసారిగా చెత్రి చెత్రి... కెప్టెన్ కెప్టెన్ అంటూ ఊగిపోయింది. తర్వాత నిమిషాల వ్యవధిలోనే గోల్స్ నమోదు కావడంతో భారత్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. నిండింది... అభిమానంతో: చెత్రి భావోద్వేగ వీడియో ప్రకటనతో మ్యాచ్‌కు ముందు రోజు సెలబ్రిటీలు స్పందిస్తే... మ్యాచ్ రోజు అభిమానులు హోరెత్తించారు. దీంతో ముంబై ఫుట్‌బాల్ ఎరెనా స్టేడియం సాకర్ ప్రియులతో నిండిపోయింది. కేవలం ముంబై నగరవాసులే కాదు... 70 కి.మీ. దూరంలో ఉన్న బద్లాపూర్ (థానే జిల్లా) పట్టణం నుంచి కూడా ప్రేక్షకులు రావడం విశేషం. -
ఫుట్ బాల్ మ్యాచ్: టికెట్లన్నీ సోల్డ్ ఔట్!
ముంబై : భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ సోషల్ మీడియా వేదికగా ఆవేదనతో చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. ఈ విన్నపంపై స్పందిస్తూ క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలు మైదానాలకు వెళ్లి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు వీక్షించాలని అభిమానులను కోరారు. ఈ పిలుపుతో నేడు(సోమవారం) ముంబై ఎరీనా ఫుట్‌బాల్ మైదానంలో జరిగే మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా కెన్యాతో భారత్ ఈ మ్యాచ్ ఆడనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ సునీల్ చెత్రి కెరీర్లో 100 వ మ్యాచ్ కావడం విశేషం. సుమారు 15వేల సీటింగ్ కెపాసిటీ గల ఈ మైదానంలో టికెట్లన్నీ అమ్ముడయ్యాయని నిర్వాహకులు తెలిపారు. చైనీస్ తైపీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్ సునీల్ చెత్రి హ్యాట్రిక్ గోల్ సాధించడంతో భారత్ 5-0తో సునాయస విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు కేవలం 2500 మంది మాత్రమే హాజరుకావడంతో భారత కెప్టెన్ సునీల్ చెత్రీ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. నేటి మ్యాచ్ అనంతరం భారత్ జూన్ 7న న్యూజిలాండ్‌తో ఇదే మైదానంలో ఆడనుంది. This is nothing but a small plea from me to you. Take out a little time and give me a listen. pic.twitter.com/fcOA3qPH8i — Sunil Chhetri (@chetrisunil11) June 2, 2018 Please take notice of my good friend and Indian football skipper @chetrisunil11's post and please make an effort. pic.twitter.com/DpvW6yDq1n — Virat Kohli (@imVkohli) June 2, 2018 C'mon India... Let's fill in the stadiums and support our teams wherever and whenever they are playing. @chetrisunil11 @IndianFootball pic.twitter.com/xoHsTXEkYp — Sachin Tendulkar (@sachin_rt) June 3, 2018 -
వరదలతో విలవిలలాడుతున్న కెన్యా
-
ప్రకృతి విలయం..215 మంది మృతి
కెన్యా : గత కొద్ది నెలలుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కెన్యా ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. వరదల వల్ల ఇప్పటి వరకు దాదాపు 215 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 2లక్షల మంది ఇళ్లను కోల్పోగా దాదాపు 20 వేల మూగజీవాలు ప్రాణాలు విడిచినట్లు వారు తెలిపారు. మృతులలో ఎక్కువ మంది పసిపిల్లలు ఉండటం హృదయాలను కదిలించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాజాగా నైరోబిలోని ఓ డ్యాం పగలడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా మరి కొన్ని డ్యాంలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని తమను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మగపిల్లల చేత ప్రతిజ్ఞ
‘అమ్మాయిల్ని గౌరవిస్తాం, మంచి పనికి మేము ఎప్పుడూ ముందుంటాం, అమ్మాయిల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా నడుచుకుంటాం’ అని మగపిల్లల చేత నైరోబీ ప్రతిజ్ఞ చేయించడం నాలుగేళ్ల క్రితమే మొదలైంది. కెన్యా.. ఆఫ్రికా ఖండంలో ఓ దేశం. నైరోబీ.. కెన్యా దేశానికి రాజధాని నగరం. ఇప్పుడీ నగరం ప్రపంచదేశాలకు ఓ మార్గాన్ని నిర్దేశిస్తోంది. ఇప్పటి వరకు మహిళల వైపు ప్రపంచం మొత్తం వేలెత్తి చూపిన పరిస్థితులను సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చేస్తోంది. నైరోబీలో ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరు అత్యాచారానికి గురైన వాళ్లేనని ఒక సర్వే నిర్ధారించింది. ఇది జరిగి నాలుగేళ్లవుతోంది. అప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. అక్కడి మహిళల హక్కుల ఉద్యమకారులు ఉవ్వెత్తున లేచారు. తమ దేహం మీద హక్కు తమదేనంటూ నినదించారు. వాటన్నింటి ఫలితంగా నైరోబీలోని కొన్ని స్కూళ్లలో మగపిల్లల్లో మార్పు తెచ్చే పాఠాలు మొదలయ్యాయి. వాటికి సమాంతరంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ తరగతులు కూడా. రేపటి సమాజం నైతికవిలువలతో జీవించాలంటే అందుకు అనుగుణంగా ఈ తరం పిల్లల మెదళ్లను మలుచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రాథమిక స్కూళ్లలో మహిళలను గౌరవించాలనే పాఠాలను బోధిస్తున్నారు. ‘మహిళలను గౌరవిస్తాం, మంచి పనికి మేము ఎప్పుడూ ముందుంటాం, మహిళల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా నడుచుకుంటాం’ అని మగపిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అమ్మాయిలకూ.. తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడటం ఎలాగో నేర్పిస్తున్నారు. కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలలో శిక్షణనిస్తున్నారు. ‘నన్ను తాక వద్దు, నన్ను నేను కాపాడుకోగలను’ అని వారి చేత ఒకటికి పదిసార్లు వల్లె వేయిస్తున్నారు. ఇదంతా అమ్మాయిలను, అబ్బాయిలను వేరు చేసి నేర్పించడం లేదు. ఒకరి ప్రతిజ్ఞలను, నినాదాలను మరొకరు వినేలా ఒకే తరగతి గదిలో చేయిస్తున్నారు. ఈ నాలుగేళ్ల తర్వాత ఫలితం ఏంటంటే.. నైరోబీలో అత్యాచారాలు సగానికి సగం తగ్గడం! ఇంట్లోనూ వల్లెవేస్తున్నారు! నైతిక విలువలను నేర్పించే తరగతులు మంచి ఫలితాలనిస్తున్నాయని అక్కడి సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఈ క్లాసుల వల్ల నేరుగా చైతన్యవంతమయ్యేది పిల్లలే, అయినా పెద్దవారిలో కూడా ఆలోచన రేకెత్తించగలిగారు. పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వెళ్లి ఊరుకోరు కదా! అమ్మాయిలైతే ‘హూ... హా’ అని కరాటే ఫీట్లు చేస్తూ మనతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఇలా పంచ్ ఇవ్వాలని... స్కూల్లో నేర్చుకున్న కొత్త విద్యను అమ్మానాన్నల ముందు ప్రదర్శిస్తారు. ‘మహిళ వస్త్రధారణను కామెంట్ చేయకూడదు. ఒంటరిగా వెళ్తుంటే ఆమెకు దారి ఇచ్చి మనం పక్కకు తప్పుకోవాలి తప్ప ఆమెను ఇబ్బంది పెట్టకూడదు. ఆమె చాయిస్‌ని గౌరవించాలి’ అనే చిలుక పలుకులను మగపిల్లలు వల్లిస్తున్నారు. దాంతో సమాజంలో మార్పు మొదలైందని, ఇది ఇక విస్తరించాల్సి ఉందని నైరోబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మన దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టు ప్రకారం 2012లో 24,923, 2013లో (‘నిర్భయ’ చట్టం వచ్చిన ఏడాది) 33,707, 2014లో 36,735, 2015లో 34,210, 2016లో 38,947 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సరాసరిన వందకు పైగానే! చట్టాలెన్ని ఉన్నా, మహిళల మీద అఘాయిత్యాలు ఆగాలంటే మగవాళ్ల మనస్తత్వం మారాలి. -
భూ మధ్యరేఖ వద్ద అద్భుతం
సాక్షి, వెబ్ డెస్క్ : భూ మధ్యరేఖ వెళ్తున్న కెన్యా దేశంలో చేసిన ఓ ప్రయోగం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కెన్యా పర్యటనకు వచ్చిన ఓ విదేశీయుడికి స్థానికులు ఈ ప్రయోగాన్ని చేసి చూపించారు. భూ మధ్యరేఖకు ఉత్తరాన తొలుత ఈ ప్రయోగాన్ని నిర్వహించగా నీటిలో వేసిన పువ్వు కుడి వైపు నుంచి తిరగడం(క్లాక్ వైజ్ డైరెక్షన్) ప్రారంభించింది. అదే భూ మధ్యరేఖకు దక్షిణాన ఈ ప్రయోగాన్ని నిర్వహించగా నీటిలో వేసిన పువ్వు ఎడమ వైపు నుంచి(యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్) తిరిగింది. అదే సమయంలో కచ్చితంగా భూ మధ్యరేఖ వద్ద ప్రయోగం చేయగా.. పువ్వు కదలకుండా ఉండిపోయింది. దీన్ని చూసిన విదేశీయులు మీరేమైనా మేజిక్ చేశారా? అంటూ నిర్వహికులను ప్రశ్నించగా అదేం లేదని సమాధానమిచ్చారు. పువ్వు అలా ఎందుకు తిరిగింది? మూడు సందర్భాల్లో పువ్వులో మార్పులు కనిపించడానికి కారణం భూమికి ఉన్న అయస్కాంత శక్తి. భూ మధ్యరేఖ నుంచి దూరం వెళ్లే కొద్దీ(అంటే ధ్రువాల వైపు ప్రయాణించే కొద్దీ) భూమి అయస్కాంతత్వం పెరుగుతుంది. ధ్రువాల వద్ద దీని విలువ అత్యధికంగా ఉంటుంది. అదే సమయంలో భూ మధ్యరేఖ వద్ద దీని విలువ అతి తక్కువ. ఈ సూత్రాలనే పైన ప్రయోగానికి అప్లై చేస్తే భూ మధ్య రేఖకు ఉత్తరానికి వెళ్లినప్పుడు భూ అయస్కాంత రేఖలు ఎటువైపు ప్రయాణిస్తున్నాన్నాయో అటువైపే పువ్వు తిరిగింది. అలానే భూ మధ్యరేఖ దక్షిణ ప్రాంతంలో కూడా. ఇదే సమయంలో కచ్చితంగా భూ మధ్యరేఖపై ప్రయోగం చేయడం వల్ల ఎలాంటి బలాలు పువ్వుపై పని చేయకపోవడంతో అది ఎటూ కదల లేదు.