నైరోబీ: కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కోసం జాతీయ సెలవు దినాన్ని ప్రకటించి కెన్యా తన సామాజిక స్పృహను చాటుకుంది. దేశంలోని వారంతా మొక్కలు నాటే కార్యక్రమంలో విధిగా పాల్గొనేందుకు వీలుగా నవంబర్ 13(సోమవారం) రోజున దేశవ్యాప్త సెలవు ప్రకటిస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే పది సంవత్సరాల్లో 1,500 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, వాయు కాలుష్యం సమస్యలతో సతమతమవుతున్న కెన్యాను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం దేశ విస్తీర్ణంలో కేవలం ఏడు శాతంగా ఉన్న అడవులను 10 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. సోమవారం నాటి కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా 15 కోట్లకుపైగా మొక్కలను ప్రభుత్వ నర్సరీల్లో పౌరుల కోసం అందుబాటులో ఉంచింది. వీటిని ప్రభుత్వ ఏజెన్సీ నిర్దేశించిన చోట్ల నాటాలి. ఇవిగాక ‘ప్రతి కెన్యా పౌరుడు కనీసం రెండు మొక్కలు కొని నాటండి’ అని పర్యావరణ మంత్రి సోపాన్ తుయా పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment