public holiday
-
శ్రీరామ నవమి ఇకపై ప్రభుత్వ సెలవుదినం!
పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇటువంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ, కాళీపూజ, సరస్వతీ పూజలను ఘనంగా జరుపుకుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో శ్రీ రామ నవమికి నేటి వరకూ సెలవు లేదు. గత ఏడాది శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ పలు విమర్శలు గుప్పించింది. శ్రీరామనవమి రోజున జనం ఊరేగింపులు నిర్వహించే హక్కులను కాలరాయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ గతంలో వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే రానున్న శ్రీరామ నవమికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తృణమూల్ ప్రభుత్వం హిందువులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
స్ఫూర్తిదాయక పని కోసం సెలవు
నైరోబీ: కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కోసం జాతీయ సెలవు దినాన్ని ప్రకటించి కెన్యా తన సామాజిక స్పృహను చాటుకుంది. దేశంలోని వారంతా మొక్కలు నాటే కార్యక్రమంలో విధిగా పాల్గొనేందుకు వీలుగా నవంబర్ 13(సోమవారం) రోజున దేశవ్యాప్త సెలవు ప్రకటిస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే పది సంవత్సరాల్లో 1,500 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, వాయు కాలుష్యం సమస్యలతో సతమతమవుతున్న కెన్యాను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం దేశ విస్తీర్ణంలో కేవలం ఏడు శాతంగా ఉన్న అడవులను 10 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. సోమవారం నాటి కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా 15 కోట్లకుపైగా మొక్కలను ప్రభుత్వ నర్సరీల్లో పౌరుల కోసం అందుబాటులో ఉంచింది. వీటిని ప్రభుత్వ ఏజెన్సీ నిర్దేశించిన చోట్ల నాటాలి. ఇవిగాక ‘ప్రతి కెన్యా పౌరుడు కనీసం రెండు మొక్కలు కొని నాటండి’ అని పర్యావరణ మంత్రి సోపాన్ తుయా పిలుపునిచ్చారు. -
ఇది తెలుసా? పబ్లిక్ హాలిడే అయినా జీతం పడుతుంది
ఒకటో తారీఖున ఆదివారామో, సెలవు రోజో వస్తే వేతన జీవులకు గండమే. సెలవు కావడంతో బ్యాంకులు జీతాలు జమ చేయవు. మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇకపై ఈ ఇక్కట్లకు చెల్లు చీటి రాసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సండేలతో పాటు ఇతర పబ్లిక్ హాలిడేస్‌లో కూడా బల్క్ పేమెంట్ చేసేందుకు, ఖాతాదారులు చేసే కీలక చెల్లింపులు స్వీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఎన్ఏసీహెచ్చ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (NACH) పథకాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారం ఇకపై ఆదివారాలు, అధికారిక సెలవు రోజుల్లో కూడా శాలరీస్, డివిడెండ్లు, పెన్షన్లు తదితర చెల్లింపులు జరుగుతాయి. చెల్లింపులకు ఓకే వేతనాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు కరెంటు, గ్యాస్, టెలిఫోన్, వాటర్ బిల్లులు, ఈఎంఐ, ప్రీమియం వంటి చెల్లింపులను బ్యాంకులు తీసుకుంటాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న మరికొన్ని మార్పులు - భారత తపాల శాఖ ఆధీనంలోని పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటి వరకు ఉచితంగా అందించిన డోర్ స్టెప్ సర్వీసెస్‌ని నిలిపేసింది. ఇకపై ఇంటి వద్దకు వచ్చి పోస్టల్ బ్యాంక్ సర్వీసెస్ అందిస్తే రూ. 20 ప్లస్ జీఎస్టీని వసూలు చేయనుంది. - పరిమితి మించిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఇప్పటి వరకు రూ. 15 సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తుండగా ఇప్పుడా మొత్తాన్ని రూ. 17కి పెంచారు. -
అనుమతి లేనిదే జిల్లాను వదిలి వెళ్లొద్దు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో అన్ని శాఖల అధికారులు సాధారణ సెలవులు, ప్రభుత్వ సెలవుదినాల్లో అనుమతి తీసుకున్న తర్వాతనే జిల్లా దాటి వెళ్లాలని కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు పనిచేసే ప్రదేశంలో నివాసం ఉండకుండా విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి ప్రతి రోజు జిల్లాకు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. జిల్లాలో ఏదైనా అనుకోని ప్రమాద సంఘటన జరిగినప్పుడు సంబంధిత శాఖాధికారులు అందుబాటులో లేకుంటే పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారన్నారు. ఇ–ఆఫీస్‌లో జిల్లా అధికారులు సెలవులు పెట్టి తన అనుమతి లేనిదే వెళ్లకూడదని కలెక్టర్ చెప్పారు. చంద్రన్న బీమా క్లెయిమ్‌ల మీద సమీక్షిస్తూ పోలీస్ శాఖ దగ్గర ఎఫ్ఐఆర్లు 10 పెండింగ్‌లో ఉన్నాయని వాటన్నింటినీ 48 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. మీ కోసం ద్వారా వచ్చిన, మీ సేవలో వచ్చిన అర్జీలు సెల్ఫీ లేదా వీడియోలో చిత్రీకరించి నమోదు చేయాలని ఆదేశించినా కొన్నిశాఖలు నమోదు చేయడం లేదన్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్ సూచించారు. నూరు శాతం టీకాలు వేయించాల్సిందే పొంగు, తట్టు వ్యాధి నిరోధక టీకాలు జిల్లాలో 100శాతం పిల్లలకు వేయించాలని జిల్లా వైద్యాధికారి, ఇమ్యునైజేషన్ అధికారులను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన 3వ జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లాలో పల్స్ సర్వే ప్రకారంగా 8లక్షల 36వేల మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ సెప్టెంబరు 8వ తారీకు లోపల వైద్యాధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బాధ్యత వహించి అందరికీ తట్టు, పొంగు నివారణ టీకాలు వేయించాలని, వారి వివరాలన్నీ ఆన్లైన్ యాప్‌లో నిర్ణయించిన ప్రొఫార్మాలో పొందు పరచాలని ఆదేశించారు. గతంలో చేసిన నిర్లక్ష్యం ప్రస్తుతం చేయొద్దని సూచించారు. టీకాలు వేయించడంలో విద్యాశాఖ, శిశు సంక్షేమశాఖ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ, మైనార్టీ శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటింటా సర్వే నిర్వహించండి స్వచ్ఛభారత్ మిషన్ పథకం ద్వారా జిల్లాను బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా గుర్తించేందుకు ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకూ నివేదిక సమర్పించకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలను గుర్తించి నివేదికను త్వరితగతిన ఎంపీడీఓలు పంపాలని ఆదేశించారు. జిల్లాకు నూతనంగా వచ్చి నివాసం ఉంటున్న కుటుంబాల వివరాలు సేకరించి వారి గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించేందుకు స్త్రీశిశు సంక్షేమశాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో స్త్రీశిశు సంక్షేమశాఖ సీడీపీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి నెలా 31వ తేదీ నాటికి ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యావతిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, డీఆర్ఓ కె.హైమావతి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఇ.శ్రీనివాస్, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసు, డీఈఓ ఆర్ఎస్ గంగాభవాని, డీఎస్ఓ షరీఫ్, డీఎం పీ.కొండయ్య, డీఎంఅండ్‌హెచ్‌ఓ కె.కోటేశ్వరి జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మార్కెట్లకు నేడు సెలవు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు నేడు సెలవు. మే 1, సోమవారం మహారాష్ట్ర డే సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పని చేయవు. మళ్లీ ట్రేడింగ్ 2వతేదీ మంగళవారం ఉదయం యథావిధిగా మొదలవుతుంది. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం. గత వారం సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయి అధిగమించగా, నిఫ్టీ సైతం మొట్టమొదటిసారి 9,350 అధిగమించి ఆల్ టైం హైని రికార్డ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గరిష్ట స్థాయిలను నమోదు చేయడం విశేషం. శుక్రవారం సెన్సెక్స్ 29,918 వద్ద, నిఫ్టీ 9,304 వద్ద ముగిశాయి. డాలర్ మారకంలో రుపీ కూడా చాలా బలంగా కొనసాగుతోంది. ఒకదశలో 64 స్థాయిని బ్రేక్ చేసిన రుపాయి గత సెషన్ లో రూ.64.24వద్ద స్థిరపడింది. కాగా గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ప్రతికూల సంకేతాలతో లాభాలతో ముగిశాయి. ప్రధానంగా ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో సెంట్రిస్ట్ అభ్యర్థి ఇమాన్యుయేల్ మాక్రన్ ముందున్నట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బూస్ట్ లభించిన సంగతి విదితమే. -
ఏపీలో జులై 7న రంజాన్ ప్రభుత్వ సెలవు
హైదరాబాద్: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని జులై 7 (గురువారం) నాడు ప్రభుత్వ సెలవుగా ఏపీ ప్రభుత్వం అధికారకంగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. -
బ్రెజిల్లో బెంబేలెత్తిపోయేలా..