
Teams getting bowled out for below 100 in successive T20 WC matches: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. పొట్టి ఫార్మాట్ ప్రపంచక కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు వందలోపే ఆలౌట్ అయిన మూడో జట్టుగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 73 పరుగులకే కుప్పకూలి ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లకే 10 వికెట్లు కోల్పోయి.. చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది.
ఇక అంతకుముందు 2007 టీ20 ప్రపంచకప్‌లో కెన్యా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 73 పరుగులు, శ్రీలంకతో మ్యాచ్‌లో 88 పరుగులకే ఆలౌట్ అయింది. కెన్యా తర్వాతి స్థానంలో అఫ్గనిస్తాన్ ఉంది. 2012 పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 80 పరుగులు, 2014లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 72 పరుగులకే చాపచుట్టేసి అప్రదిష్టను మూటగట్టుకుంది.
ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా తొలుత దక్షిణాఫ్రికాతో 84 పరుగులు, ఆసీస్‌తో మ్యాచ్‌లో 73 పరుగులకే ఆలౌట్ అయి బంగ్లాదేశ్.. ఈ రెండు దేశాల సరసన చేరింది. అంతేగాక... టీ20 మ్యాచ్‌లలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు సార్లు(దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో రెండుసార్లు) వంద పరుగుల లోపు ఆలౌటైన తొలి జట్టుగా మహ్మదుల్లా బృందం నిలిచిన సంగతి తెలిసిందే.
కాగా బంగ్లాదేశ్- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆడం జంపా చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి బంగ్లా జట్టు పతనాన్ని శాసించి 8 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
స్కోర్లు:
బంగ్లాదేశ్- 73 (15)
ఆస్ట్రేలియా- 78/2 (6.2)
చదవండి: ICC Player Of The Month: షకీబ్, ఆసిఫ్, డేవిడ్.. టీమిండియా ఆటగాళ్లు ఒక్కరూ లేరు
Comments
Please login to add a commentAdd a comment