Daryl Mitchell Unbelievable Six Save Vs AFG.. న్యూజిలాండ్ అంటేనే ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. మ్యాచ్‌ల్లో ఎప్పుడు నిలకడగా ఫీల్డింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్టుకు పొదుపుగా పరుగులు ఇవ్వడంలో న్యూజిలాండ్ ముందు వరుసలో ఉంటుంది. తాజాగా డారిల్ మిచెల్ రూపంలో మరోసారి నిరూపితమైంది. టి20 ప్రపంచకప్ 2021లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ చేసిన అద్భుత ఫీట్ కొంతకాలం గుర్తుండిపోతుంది. అతను క్యాచ్ తీసుకొని ఉంటే మాత్రం క్రికెట్ చరిత్రలో మిగిలిపోయేది. అయినా సరే క్యాచ్ పట్టకపోయినప్పటికీ తన ఫీల్డింగ్‌తో జట్టుకు నాలుగు పరుగులు కాపాడాడు.
చదవండి: AFG Vs NZ: 81లోపు ఆలౌట్ చేస్తే అఫ్గాన్.. లేదంటే టీమిండియా
విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను జేమ్స్ నీషమ్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతిని రషీద్ ఖాన్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. బౌండరీలైన్ వద్ద ఉన్న డారిల్ మిచెల్ గాల్లోకి ఎగురుతూ బంతిని ఒంటిచేత్తో అందుకున్నాడు. అయితే పట్టుతప్పి బౌండరీ లైన్‌మీద పడే అవకాశం ఉండడంతో అతను కిందపడేలోపే బంతిని బౌండరీ ఇవతలకు విసిరాడు. దీంతో ఆరు పరుగులు వచ్చే చోట కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చేలా చేశాడు. దీంతో మిచెల్ ఫీల్డింగ్‌పై అభిమానులు కామెంట్స్ చేశారు. '' ఇది కదా ఫీల్డింగ్ అంటే.. క్యాచ్ పట్టకపోయినా హీరో అయ్యాడు'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: Najib Zadran: టి20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరపున తొలి బ్యాటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment