
New Zeland May Not Become No1 In T20s After Winning T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో నవంబర్ 14న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ సూపర్ ఫామ్‌లో ఉంది. ఎంతలా అంటే అటు వన్డేల్లో.. ఇటు టెస్టుల్లో నెంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇక టి20ల్లో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ టి20ల్లోనూ నెంబర్ వన్ అయితే అన్ని ఫార్మాట్లలోనూ ఏకకాలంలో అగ్రస్థానంలో ఉన్న జట్టుగా కొత్త రికార్డు సృష్టిస్తుంది. అయితే పాపం న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ కొట్టినప్పటికీ నెంబర్‌వన్ స్థానానికి చేరుకోవడం కష్టమే.
చదవండి: Daryl Mitchell-Marcus Stoinis: 12 ఏళ్ల క్రితం కలిసి ఆడారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు
ప్రస్తుతం ఇంగ్లండ్ 278 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 264 పాయింట్లతో టీమిండియా రెండో స్థానం.. 263 పాయింట్లతో పాకిస్తాన్ మూడోస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ 258 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ ఫైనల్లో ఓడించినప్పటికి 20 పాయింట్లు రావడం కష్టమే. కివీస్ కంటే ముందు టీమిండియా, పాకిస్తాన్‌లు ఉన్నాయి. ఒకవేళ విశ్వవిజేతగా నిలిస్తే కివీస్ వాటిని అధిగమించి రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. అయితే కివీస్ టి20ల్లో నెంబర్‌వన్ కావాలంటే టీమిండియాతో జరగనున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ గెలవాలని ఆశిస్తున్న భారత అభిమానులు.. టీమిండియాతో జరిగే టి20 సిరీస్‌లో మాత్రం కివీస్ ఓడిపోవాలని కోరుకోవడం విశేషం. ఇక నవంబర్ 17 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ జరగనుంది.
చదవండి: Virender Sehwag: హసన్ అలీని తప్పుబడుతున్నారు.. మరి అఫ్రిది చేసిందేంటి
Comments
Please login to add a commentAdd a comment