ప్రతిష్టాత్మక ఐసీసీ టి20 వరల్డ్‌కప్ 2022 టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని జట్లకు ప్రాక్టీస్ కోసం వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించడం ఆనవాయితీ. కాగా వార్మప్ మ్యాచ్‌లకు చెందిన షెడ్యూల్‌ను ఐసీసీ గురువారం రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 16 జట్లు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇక టీమిండియా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.
అక్టోబర్ 17వ తేదీన ఆస్ట్రేలియాతో, 19వ తేదీన కివీస్‌తో భారత్ తలపడనుంది. వార్మప్ మ్యాచ్‌లను అధికారిక మ్యాచ్‌లుగా గుర్తించరన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టి20 వరల్డ్‌కప్ అక్టోబర్ 16వ తేదీన ప్రారంభం అవుతోంది. తొలి మ్యాచ్ శ్రీలంక, నమీబియా మధ్య జరగనుంది. ఇక గ్రూఫ్-2లో ఉన్న టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్ 24న ఆడనుంది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలతో పాటు మరో రెండు జట్లను ఎదుర్కోనుంది.
Comments
Please login to add a commentAdd a comment