IND Vs AUS 4th Test: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్‌ | IND Vs AUS 4th Test Day 3 Live Score Updates, Highlights And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

IND Vs AUS 4th Test: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్‌

Published Sat, Dec 28 2024 6:57 AM | Last Updated on Sat, Dec 28 2024 1:03 PM

IND VS AUS 4th Test Day 3 Live Updates And Highlights

IND VS AUS 4th Test Day 3 Live Updates And Highlights:

మూడో రోజు ముగిసిన ఆట.. ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉన్న భారత్‌
వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట ముందుగానే ముగిసింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 116 పరుగులు వెనుకపడి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ 358/9గా ఉంది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (105), సిరాజ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. 

ఆసీస్‌ గడ్డపై సత్తా చాటిన తెలుగోడు.. నితీశ్‌ సూపర్‌ సెంచరీ
ఆసీస్‌ గడ్డపై తెలుగు ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి సత్తా చాటాడు. మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో నితీశ్‌ సూపర్‌ సెంచరీ చేశాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు బరిలోకి దిగిన నితీశ్‌ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. బోలాండ్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది నితీశ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11వ నంబర్‌ ఆటగాడు సిరాజ్‌ సహకారంతో నితీశ్‌ సెంచరీ పూర్తి చేశాడు.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. బుమ్రా డకౌట్‌

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. సుందర్‌ ఔట్‌
348 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. నాథన్‌ లయోన్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి సుందర్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్‌.. సెంచరీకి చేరువగా నితీశ్‌
లయోన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి వాషింగ్టన్‌ సుందర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుందర్‌ 146 బంతుల్లో సింగిల్‌ బౌండరీతో హాఫ్‌ సెంచరీ మార్కు తాకాడు. మరో ఎండ్‌లో నితీశ్‌కుమార్‌ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం నితీశ్‌ స్కోర్‌ 94 నాటౌట్‌గా ఉంది. భారత్‌ స్కోర్‌ 345/7. నితీశ్‌, సుందర్‌ ఇద్దరూ క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది. 

తిరిగి ప్రారంభమైన ఆట
10:30- వెలుతురు లేమి కారణంగా కాసేపు నిలిచిపోయిన ఆట తిరిగి ప్రారంభమైంది. 

వెలుతరు లేమి కారణంగా నిలిచిపోయిన ఆట.. సెంచరీకి చేరువగా నితీశ్‌
వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయింది. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి టీమిండియా స్కోర్‌ 326/7గా ఉంది. భారత్‌ను ఫాలో​ ఆన్‌ గండం నుంచి గట్టెక్కించిన నితీశ్‌ కుమార్‌ (85) సెంచరీకి చేరువగా ఉన్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (40) నితీశ్‌కు అండగా క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించారు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం నితీశ్‌కుమార్‌ రెడ్డి చేసుకున్న పుష్ప తరహా సెలబ్రేషన్స్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాయి.

లంచ్‌ విరామం.. ఎదురీదుతున్న టీమిండియా 
మూడో రోజు లంచ్‌ విరామం సమయానికి టీమిండియా ఎదురీదుతుంది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 230 పరుగులు వెనుకపడి ఉంది. నితీశ్‌కుమార్‌ రెడ్డి (40), సుందర్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ స్కోర్‌ 244/7గా ఉంది.

ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
221 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. లయోన్‌ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (17) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
191 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. బాగా సెట్‌ అయ్యాడనుకున్న తరుణంలో రిషబ్‌ పంత్‌ (28) బోలాండ్‌ బౌలింగ్‌లో లయోన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

మూడో రోజు మొదలైన ఆట
310 పరుగులు వెనుకపడి టీమిండియా మూడో రోజు ఆట ప్రారంభించింది. రవీంద్ర జడేజా (4), రిషబ్‌ పంత్ (5) క్రీజ్‌లో ఉన్నారు.

రెండో రోజు ముగిసిన ఆట
బాక్సింగ్‌ డే టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా 6 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 164/5గా ఉంది. రవీంద్ర జడేజా (4), రిషబ్‌ పంత్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 310 పరుగులు వెనుకపడి ఉంది. ‌

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 82, విరాట్‌ కోహ్లి 36, కేఎల్‌ రాహుల్‌ 24, రోహిత్‌ శర్మ 3, నైట్‌ వాచ్‌మన్‌ ఆకాశ్‌దీప్‌ 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, బోలాండ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్‌ కొన్‌స్టాస్‌ (60), ఖ్వాజా (57), లబూషేన్‌ (72), పాట్‌ కమిన్స్‌ (49), అలెక్స్‌ క్యారీ (31) రాణించారు. ట్రవిస్‌ హెడ్‌ (0), మిచెల్‌ మార్ష్‌ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్‌ 2, సుందర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా..
బాక్సింగ్‌ డే టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓ మార్పుతో బరిలోకి దిగింది. శుబ్‌మన్‌ గిల్‌ స్ధానంలో వాషింగ్టన్‌ సుందర్‌ తుది జట్టులోకి వచ్చాడు.

మరోవైపు ఆసీస్‌ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్‌ కొంటాస్‌ తుది జట్టులోకి రాగా.. గాయం కారణంగా దూరమైన హాజిల్‌వుడ్‌ స్ధానంలో స్కాట్‌ బోలాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు.

తుది జట్లు
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్‌ కొంటాస్, మార్నస్ లబుషేన్‌, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీప‌ర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్

భారత్‌: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement