అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు టీమిండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు జట్టుతో పాటు వెళ్లనున్నట్లు సమాచారం. టి20 ప్రపంచకప్ ఆడేందుకు టీమిండియా బృందం అక్టోబర్ 6న ఆస్ట్రేలియాకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. కాగా జట్టుతో పాటు వీరిద్దరు కూడా వెళ్లనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
''బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అప్పటివరకు వేరే బౌలర్లు కూడా గాయపడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకే బ్యాకప్ ప్లేయర్స్, నెట్ బౌలర్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే సిరాజ్,ఉమ్రాన్ మాలిక్‌లను ఆస్ట్రేలియాకు పంపిస్తున్నాం'' అని పేర్కొన్నారు.
అయితే బుమ్రా గాయం విషయంపై బీసీసీఐ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. సౌతాఫ్రికాతో మిగతా రెండు టి20లకు బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా పేర్కొన్న సంగతి తెలిసిందే. బుమ్రా గాయంపై స్పష్టత వచ్చాకే అతను టి20 ప్రపంచకప్ ఆడేది లేనిది తెలుస్తుందని బీసీసీఐ తెలిపింది.
చదవండి: T20 World Cup 2022: బుమ్రా దూరం కాలేదు : గంగూలీ
'తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'.. దిమ్మతిరిగే కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment