new zeland
-
న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. టీ20 వరల్డ్‌కప్ తర్వాత?
న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత కివీస్ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగనట్లు డివైన్ ప్రకటించింది. వన్డేల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు సోఫీ తెలిపింది.తన వర్క్‌లోడ్‌ను తగ్గించుకునేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. కాగా డివైన్ ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండువ మహిళ క్రికెటర్‌గా ఆమె కొనసాగుతోంది. డివైన్ ఇప్పటివరకు 135 టీ20లు ఆడి 3268 పరుగులు చేసింది. అయితే కెప్టెన్సీ మాత్రంలో తన మార్క్‌ను డివైన్ చూపించలేకపోయింది. తన సారథ్యంలో ఇప్పటివరకు 56 టీ20లు న్యూజిలాండ్.. 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 28 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది."రెండు ఫార్మాట్లలో వైట్ ఫెర్న్ల(న్యూజిలాండ్ మహిళల జట్టు)కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కెప్టెన్సీతో అదనపు పనిభారం పడుతోంది. దాన్ని నేను ఆస్వాదించాను. కానీ కొన్ని సార్లు ఛాలెంజింగ్ గా ఉంటుంది. కెప్టెన్సీ కారణంగా నా వ్యక్తిగత ప్రదర్శనలో ఒత్తిడి ఎదుర్కొంటున్నాను. రెండూ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. దీంతో టీ20 కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత నా ఆటపై మరింత దృష్టి సారిస్తాను.కొత్తగా ఎవరు జట్టు బాధ్యతలను చేపట్టిన వారికి అన్నిరకాలగా సపోర్ట్‌గా ఉంటాను. అయితే వన్డేల్లో మాత్రం సారథిగా కొనసాగుతున్నాను. వన్డే కెప్టెన్సీ వదులుకోవడానికి మరి కొంత సమయం పడుతోందని" ఓ ప్రకటలో డివైన్ పేర్కొంది. -
సడెన్‌గా విమాన ప్రయాణం క్యాన్సిల్ : పాపం ఆ జంట!
ఓ జంట సరదాగా గడిపేందుకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అనుకోని విధంగా భయానక వ్యాధి బారినపడటం సడెన్‌గా తిరిగొచ్చాయల్సిన పరిస్థితి ఎదురయ్యింది. అయితే సదరు విమానయాన సంస్థ ఆ జంట నుంచి నిర్థాక్షిణ్యంగా లక్షల్లో చార్జీలు వసూలు చేసింది. వారి పరిస్థితి ఇది అని వేడుకున్న ససేమిరా అంది విమానాయన సంస్థ. పాపం ఆ దంపతులుకు ఆ వ్యాధి వచ్చినందుకు బాధపడాలో లేక ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడు అయ్యినందుకు బాధపడాలో తెలియని స్థితి ఎదురయ్యింది. ఈ చేదు ఘటన న్యూయార్క్ దంపతులకు ఎదురయ్యింది. జనవరిలో టోడ్(60) ప్యాట్రిసియా కెరెక్స్(70) దంపతులు జనరిలో న్యూయార్క్ నుంచి ఆక్లాండ్ వెళ్లేందుకు ఎయిర్ న్యూజలాండ్లో బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ వరకు అక్కడే ఆక్లాండ్‌లోనే గడపాలని అనుకున్నారు. అయితే ఆరువారాలకే ప్యాట్రిసియా అనారోగ్యం బారిన పడింది. ఆమెకు పిత్తాశయం క్యాన్సర్ ఉందని నిర్థారణ అయ్యింది. నాలుగు నెలల కంటే ఎక్కువ బతకదన్నా విషాదవార్త ఆ దంపతులను నిలువున కుంగదీసింది. పైగా వెంటనే ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేయాలని ఫ్యామిలీ డాక్టర్ కూడా సూచించడంతో తిరిగి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది ఆ జంట. అందుకోసమని తాము ముందుగా బుక్ చేసిన విమాన టికెట్లను క్యాన్సిల్ చేసి రీ షెడ్యూల్ చేయామని సదరు విమానయాన సంస్థను కోరారు. అయితే సదరు విమానాయన సంస్థ రిటర్న్ టికెట్లు ధర ఏకంగా రూ. 18 లక్షలు దాక అవుతుందని స్పష్టం చేసింది. షాక్‌కి గురయ్యిన ఆ దంపతులు తమ పరిస్థితిని వివరించి వేడుకున్నారు. టోడ్ తన భార్య అనారోగ్య పరిస్థితి కారణంగా తమ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నామని విమానాయన అధికారులకు తెలిపారు. ఇంతటి విషాదంలో ఇంతలా ఆర్థిక భారం మోపొద్దని ఎంతలా అభ్యర్థించినా సదరు విమానయాన అధికారులు అంగీకరించ లేదు. అయినా ఒక కస్టమర్ అనారోగ్య రీత్యా లేదా అనుకోని పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చేయాల్సి వస్తే ఉండే కస్టమర్ ఎమర్జెన్సీ పాలసీని వర్తింపచేయొచ్చు. అయితే అధికారులు ఆ పాలసీని ఫాలో అవ్వకపోగా వేరే విమాన టికెట్లు బుక్ చేయాలంటే కనీసం రూ. 6.5 లక్షలు చెల్లించక తప్పదని తెగేసి చెప్పేసింది ఎయిర్ న్యూజిలాండ్. పాపం ఆ దంపతులు హెల్త్ ఎమర్జెన్సీ దృష్ట్యా అంతమొత్తం చెల్లించి వెనక్కి వచ్చేశారు. అసలు న్యూజిలాండ్ వాసులు ఇంత కఠినంగా వ్యవహిరస్తారని మాకు తెలియదు అన్నారు ఆ దంపతులు. ఇది న్యూజిలాండ్ స్థాయికి తగని పని అని ఆవేదనగా చెప్పారు ఆ దంపతులు. ఇలాంటి విపత్కర స్థితిలో ఇంతలా వసూలు చేయడం అనేది ఏవిధంగా చూసిన సరైనది కాదన్నారు. ఆ దంపతులు ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తెలుసుకున్న ఎయిర్ న్యూజిలాండ్ వెంటనే స్పందించి వారికి క్షమాపణలు చెప్పింది. వేరే విమాన టిక్కెట్లు బుక్ చేసేందుకు అయ్యిన అదనుపు టిక్కెట్లు ఖర్చులను కూడా వాససు ఇస్తామని స్పష్టం చేసింది. నిజానికి ఒక కస్టమర్‌కి ఏదైన విపత్కర పరిస్థితి ఎదురయ్యితే చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసి మరోక విమానంలో ప్రయాణించేలా చేసే వెసులబాటు ఉందని చెప్పడమే గాక ఆ దంపతులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాని పేర్కొంది. పైగా మరోసారి క్షమాపణలు చెప్పింది ఎయిర్ న్యూజిలాండ్. బస్, ట్రెయిన్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని డబ్బులు పోయినా అంత భయం అనిపించదు కానీ విమాన టికెట్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం లక్షల్లో డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెసులుబాటు ఉంటుందిగానీ లేదంటే ఖర్చులు తడిసిమోపడవ్వడం గ్యారంటీ. (చదవండి: బట్టతలపై జుట్టు పెరిగెలా చెయ్యొచ్చు! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
వ్యవసాయం చేస్తూ మోడలింగ్ చేస్తున్న మహిళ!
వ్యవసాయం చేసే రైతులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అది మగవాళ్లైనా, మహిళలైన వ్యవసాయం చేస్తే వాళ్లు చూడటానికి కష్టజీవుల్లా కనిపిస్తారు. వ్యవసాయం మాటలు కాదు. చెమటోడ్చి కష్టపడినా పంట పండుతుందని చెప్పలేం, ఒకవేళ పండినా గిట్టుబాటు ధర లేదంటే.. చేతికొస్తుందనేది కూడా డౌటే. అలాంటి వ్యవసాయాన్ని సునాయాసంగా చేస్తూ స్టైయిలిష్‌గా ఫోటోలు తీసుకుంటుంది. పైగా ఆమె చూడటానికి చాలా స్టైలిష్ లుక్‌లో ఉండే మోడల్లా కనిపిస్తుంది. అంతేగాదు ఆమెను చూస్తే ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా! అని షాకవ్వుతారు!. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్‌కి చెందిన 29 ఏళ్ల బ్రిట్నీ వుడ్స్ అనే మహిళ వ్యవసాయం చేస్తోంది. నిజానికి ఎంత చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేసిన వెంటనే ఆహర్యం మారిపోతుంది. ఎందుకంటే మట్టిలో చేసేపని కాబట్టి అందుకుతగ్గా వస్త్రాధారణ లేకపోతే వర్క్అవుట్ అవ్వద్దు. కానీ ఈ మహిళ మోడ్రన్ దుస్తుల్లోనే వ్యవసాయం చేస్తూ ఆకర్షిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఆమె స్వయంగా ఆవుల్ని గేదెల్ని మేపుతుంది, పాలు పితుకుతుంది కూడా. అలాగే వ్యవసాయం పనుల్లో విత్తనాలు విత్తడం దగ్గర నుంచి ట్రాక్టర్ నడపడం వరకు అన్ని ఆమే చేస్తుంది. అందుకోసం తన శైలిని మార్చుకోలేదు. ఆధునిక అమ్మాయి మాదిరిగా డ్రస్సింగ్ స్టైల్లోనే వ్యవసాయం చేస్తూ ప్రేరణ ఇస్తుంది. తాను ఆవుల్ని,గేదెల్ని మేపుతున్న ఫోటోలను, వ్యవసాయం చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది. ఆ ఫోటోలకు అచ్చం మోడలింగ్ చేసే గర్ల్‌లా డ్రస్‌లు వేసుకుని ఫోజులిస్తుంది. పైగా ఆన్లైన్లో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా ఇచ్చేస్తోంది. మరోవైపు ఆన్లైన్లో కంటంట్ క్రియటర్గా డబ్బులు కూడా సంపాదిస్తోంది. వ్యవసాయం చేయడాన్ని ఇలా మోడలింగ్‌గా కూడా వాడుకోవచ్చా అనేలా వెరైటీగా వ్యవసాయం చేస్తోంది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలకు ప్రజలు అట్రాక్ట్ అవ్వడమే గాక ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రాంలోనూ టిక్‌టాక్‌లోనూ వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇక బ్రిట్నీ హైస్కూల్ విద్య పూర్తి అయ్యిన వెంటనే బిజినెస్‌లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత అటువైపుకి వెళ్లి ఉద్యోగం చేసే ఆసక్తి లేకపోవడంతో వ్యవసాయం చెయ్యాలని గట్టిగా డిసైడ్ అయిపోయింది. ఏదో ఒకరోజుకు తాను సొంతంగా పొలాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. అయితే బ్రిట్నీ అందరిలా మాములు దుస్తులు కాకుండా ట్రెండీ దుస్తులు వేసుకుంటూనే వ్యవసాయం చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. మోడల్ మాదిరిగా దుస్తులు ధరించి, హుందాగా చెయ్యొచ్చు అనే ట్రెండ్ సెట్ చేసింది బ్రిట్నీ. అంతేగాదు నెటిజన్లు ఆమెను మోడల్ రైతుగా పిలుస్తారు. ఈ వ్యవసాయం కూడా పురుషాధిక్య ప్రపంచం కావడంతో ఆమె పలు విమర్శలు ఎదుర్కొనక తప్పలేదు. ముఖ్యంగా ఆమె అలా మోడ్రన్ దుస్తులు ధరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శులు వస్తున్నాయని బ్రిట్నీ చెబుతోంది. అయితే వాటిని తాను పట్టించుకోనని, తన లక్ష్యం వైపుగానే సాగిపోతానని ధీమాగా చెబుతోంది. అదేసయంలో తనకు తోటి పురుష రైతుల నుంచి కొంత మద్దతు కూడా లభించడం విశేషం. అయితే ఎవ్వరూ ఎన్ని కామెంట్లు చేసినా సంప్రదాయ దుస్తుల్లో వ్యవసాయం చేసేది లేదని తేగేసి చెబుతుంది. బ్రిట్నీ తాను కొన్నిసార్లు అన్నింటినీ వదులుకుని పూర్తి సమయం వ్యవసాయం చేయడానికే కేటాయిస్తాను, అయితే డబ్బు సంపాదించడానికి కంటెంట్‌ను కూడా సృష్టిస్తున్నాని చెప్పుకొచ్చింది. ఐతే పొలం పనుల్లో ఆమెకు సహాయం చేసే మగవాళ్లు కూడా ఆమె పనిని చూసి మెచ్చుకుంటారట. (చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..) -
ఎవరీమె? ఆమె స్పీచ్‌కి..పార్లమెంటే దద్దరిల్లింది!
పార్లమెంట్లో ఒక మహిళా రాజకీయవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచేలా శక్తిమంతంగా తన గళం వినిపించింది. అదికూడా స్థానిక భాషల కోసం పార్లమెంట్లో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడటం సంచలనంగా మారింది. చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికవ్వడమే గాక మాతృ భాషలో పార్లమెంటే దద్దరిల్లేలా మాట్లాడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె? దేని గురించి అంతలా శివంగిలా మాట్లాడింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసకుంది. ఆక్లాండ్, హామిల్టన్ మధ్య ఉన్న హంట్లీ అనే చిన్న పట్టణానికి చెందిన ఆమె పేరు హనా-రౌహితీ మైపి-క్లార్క్. కేవలం 21 ఏళ్ల వయసులోనే పార్లమెంట్‌కి ఎన్నికై రికార్డు సృష్టించింది. ఏకంగా 170 ఏళ్ల న్యూజిలాండ్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీగా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు. ఆమె న్యూజిలాండ్‌లోని మావోరి కమ్యూనిటీల హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేగాదు ఆ మావోరిల కమ్యునిటీ గార్డెన్‌ను కూడా మైపీ క్లార్క్ నడుపుతోంది ఏం మాట్లాడారంటే.. ఆ ఉద్వేగభరిత ప్రసంగంలో..తాను ఓటర్లకు "మీ కోసమే బతుకుతాను", "మీ గురించే చనిపోతానని" వాగ్దానం చేశాను. మా మావోరి తెగ తరతరాలుగా చాలా వెనుకబడి ఉంది. వారంతా తమ మాతృభాష నేర్చుకోవడం కోసం ఆర్రులు చాచి చూస్తోన్నారు. కనీసం తమ గుర్తింపుని కూడా చెప్పుకోలేని దీన స్థితిలో ఉంది. ఇప్పటికీ తాము వెనకబడిపోయే ఉన్నాం. అంతేగాదు నన్ను నేను ఎప్పటికీ రాజకీయ నాయకురాలి చూడనని. కేవలం మావోరి భాష సంరక్షకురాలిగా భావిస్తాను ఎందుకంటే రాబోయే తరాలకు ఈ స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైన ఉంది. నిజానికి ఈ పార్లమెంట్లో ప్రవేశించే ముందు కొన్ని సలహాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా దేన్ని తీసుకోకూడదన్నారు. కానీ నేను ఈ ఛాంబర్లో చెప్పిన ప్రతిదాన్ని వ్యక్తిగతం తీసుకోకుండా ఉండలేను. జస్ట్ రెండు వారాల్లో ఈ ప్రభుత్వం నా ప్రపంచం(మావోరి) మొత్తంపై దాడి చేసింది. ఎంతలా అంటే ఆరోగ్యం, పర్యావరణం, నీరు, వెన్యువా, సహజవనరులు, మావోరి వార్డులు, వారి భాష, ఉనికి అన్నింటిని లాగేసుకుంది. ఈ దేశంలో మాకైనా, మీకైనా ఒక దేశ పౌరులుగా అన్ని హక్కులను సద్వినియోగించుకునే హక్కు ఉంది కదా! అంటూ తన మాతృ భాషలో పార్లమెంట్‌ని గడగడలాడించేలా మాట్లాడింది. దీంతో ఆమె ప్రసంగం వీడియో ఓ సంచలనంగా మారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, ఆమె తాతా తైతిము మైపి కూడా మావోరి కార్యకర్తే. New Zealand natives' speech in parliament pic.twitter.com/OkmYNm58Ke — Enez Özen | Enezator (@Enezator) January 4, 2024 (చదవండి: మహిళా భద్రతలో టాప్.... చెన్నై!! హైదరాబాద్ స్థానం...??) -
అత్యంత అరుదైన పక్షి! సగం ఆడ సగం మగ..!
గత వందేళ్లలో రెండోసారి అత్యంత అరుదైన పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతులను కనుగొన్నారు. ఆ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొకవైపు సగం నీలం అంటే మరోవైపు మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. ఇది ఆడ, మగ లక్షణాను ప్రదర్శిస్తుంది. అటువంటి పక్షుల్లో ఒకవైపు మగ ఈకలు ఉండి అందుకు అనుగుణంగా పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు స్త్రీ ఈకలు ఉండి స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అంతేగాదు ఈ పక్షిలో కణాలు ఆడ, మగ కణాలుగా విభజింపబడ్డాయట కూడా. ఇలా దాని జీవితాంతం కణాలు అలానే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫ్(ఆడ, మగ లక్షణాలు)ను చూడలేరన్నారు. ఈవిధంగా పక్షుల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లో ఇలాంటి పక్షిని తానింత వరకు చూడలేదని ఇది చాలా అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆప్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. వందేళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
వైఎస్సార్ 14వ వర్థంతి: న్యూజిలాండ్‌లో రక్తదాన శిబిరం
సెప్టెంబర్ 2, రోజులానే తెల్లారింది ఎవరి పనుల్లో వాళ్ళు నిమిత్తం అయ్యి ఉన్నారు. కొద్దిసేపటికే వైయస్సార్ గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయ్యిందని వార్తలు. జనాల్లో ఆందోళన ఎక్కడో ఒక చోట వాతావరణం అనుకూలించక ల్యాండ్ అయ్యి ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారికి ఏమి కాదు ఇంత మంది జనహృదయాల్లో నిలిచిన రాజశేఖర్ రెడ్డికి ఏమి కాదన్న భరోసా ఒకవైపు. నల్లమల కొండల్లో వెతుకులాట కోసం వేలాది జనాలు మంది వెళ్లారు. చివరికి నేవి హెలికాప్టర్ల గాలింపులో సెప్టెంబర్ 3న ఆచూకీ తెల్సింది కానీ.. అభిమానుల గుండె పగిలింది. చరిత్రలో సెప్టెంబర్ 2, 3 అలా చెరగని గుర్తు వేశాయి. పెద్దాయన అంత్యక్రియలకు దారులన్ని మూసుకుపోయాయి. అభిమానం పోటెత్తింది. కడసారి చూపు కోసం రోదించింది. గొంతు మూగబోయింది, మాకు దిక్కెవరని కన్నీరు పెట్టనివారు లేరు. అందుకే దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారు.. ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటారు. ఆ మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం నివాళులు అర్పించింది. శనివారం సెప్టెంబర్ 2వ తేదీన ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు బుజ్జిబాబు(కన్వీనర్), ఆనంద్ ఎద్దుల(రీజినల్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌లోని వెస్టీ కమ్యూనిటీ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ ఎద్దుల, సుస్మిత చిన్నమల్రెడ్డి, సమంత్ డేగపూడి, ప్రభాకర్ వాసిపల్లి, విజయ్ అల్లా, పవన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ అన్నమరాజు, ఆరోన్ శామ్యూల్ తదితర ఎన్నారైలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యుల కృషిని ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ బాబు, శ్రీకాహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఏపీ ఎన్నారై సొసైటీ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి, తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, ఏపీ ప్రెస్ అకాడమీ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ తదితరులంతా అభినందించారు. ఒక మనిషి మరణం ఎంతో మందిని చీకట్లోకి నెట్టివేసింది. బహుశా ఇవాళ్టికి కూడా చాలా మంది ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే అది ఆయన చేసిన పరిపాలన, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం. డబ్బు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం అని చేతల్లో నిరూపించిన నాయకుడు వైఎస్సార్. ఇంకో 100 ఏళ్ళు అయిన రాజశేఖర్ రెడ్డి మాత్రం మరువలేరేమో. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం) -
ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, ఇప్పుడు సూపర్ మార్కెట్లో
క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్లు ఏదో ఒకరోజు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. అయితే రిటైర్మెంట్కు ముందే భవిష్యత్తులో ఏం చేయాలనేది ముందే నిర్ణయించుకోవడం చూస్తుంటాం. కొంతమంది క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత బిజినెస్ ప్లాన్ చేయడం.. కామెంటేటర్లుగా మారడం చూస్తుంటాం. క్రికెట్ బాగా పాపులర్ ఉన్న మన దేశంలో ఎక్కువమంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత కామెంటేటరీ ఫీల్డ్‌లోకి వస్తున్నారు. అయితే మరికొంత మంది క్రికెటర్లు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఉదాహరణకు దిగ్గజం కపిల్ దేవ్ వ్యాపారంలో రాణిస్తుండడంతో పాటు అప్పుడప్పుడు కామెంటేటరీ బాక్స్‌లో కనిపిస్తుంటాడు. ఇంకొంతమంది క్రికెటర్లు మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతుంటారు. షోయబ్ అక్తర్ లాంటి పాక్ క్రికెటర్లు ఎక్కువగా యూట్యూబ్ చానెళ్లు నడుపుతూ మరింత ఫేమస్ అయిపోతున్నారు. కొందరు మాత్రం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లగ్జరీ జీవితానికి దూరంగా బతకాలని ఆశపడతారు. ఆ కోవకు చెందిన వాడే న్యూజిలాండ్ మాజీ బౌలర్ క్రిస్ మార్టిన్. క్రిస్ మార్టిన్ న్యూజిలాండ్ తరపున 2000వ సంవత్సరం నుంచి 2013 వరకు 71 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 71 టెస్టుల్లో 233 వికెట్లు తీశాడు. ఒక దశలో న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్ మార్టిన్ కంటే ముందు టెస్టుల్లో రిచర్డ్ హడ్లీ, డానియెల్ వెటోరిలు మాత్రమే ఉన్నారు. మరో విషయమేంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్‌గా క్రిస్ మార్టిన్ నిలిచాడు. చాలా సందర్భాల్లో ధోనిని ఔట్ చేసిన ఘనత క్రిస్ మార్టిన్ సొంతం. ఇక 40 ఏళ్ల వయసు దాకా క్రిస్ మార్టిన్ క్రికెట్లో కొనసాగాడు. అయితే 35 ఏళ్ల వయసుకు చేరుకోగానే క్రిస్ మార్టిన్ తన పోస్ట్ రిటైర్మెంట్పై ఆలోచనలో పడ్డాడు. అప్పటినుంచే తన వ్యాపార రంగాన్ని విస్తృతం చేయాలని భావించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చేలోపే న్యూజిలాండ్‌లోని ఈస్ట్‌బోర్న్‌లో ''Four Square'' పేరుతో సూపర్‌మార్కెట్‌ను నెలకొల్పాడు. మొదట చిన్న స్టోర్‌గా ప్రారంభించినప్పటికి 2019లో దానిని బిగ్స్టోర్గా మార్చాడు. ఫుడ్‌స్టఫ్ సహా మార్కెట్లో అవసరమైన అన్ని రకాల రిటైల్ వస్తువులను అందుబాటులో ఉంచాడు. అనతికాలంలోనే కస్టమర్స్ దగ్గర మంచి పేరు సంపాదించాడు. He took 233 Test wickets for New Zealand - the third highest of all-time for the Blackcaps, but only scored 123 runs in 71 matches! Happy Birthday to Chris Martin! pic.twitter.com/WAzVuktrNO — ICC (@ICC) December 10, 2017 చదవండి: రాత్రి 7:45కు ముహూర్తం.. దాయాదుల మ్యాచ్ సెప్టెంబర్ 2న! SL Vs PAK 1st Test: లంక కీపర్‌ను ముప్పతిప్పలు పెట్టిన పాక్ బౌలర్ -
టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్‌లు..
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023 మెగా సమరానికి మరో 99 రోజుల కౌంట్‌డౌన్ మిగిలి ఉంది. నాలుగోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న టీమిండియా పెవరెట్‌గా కనిపిస్తోంది. పుష్కరకాలం కిందట ధోని సేన స్వదేశంలో ప్రపంచకప్‌ను కొట్టి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. తాజాగా మరోసారి వరల్డ్‌కప్‌కు మన దేశం ఆతిథ్యం ఇస్తుండడంతో రోహిత్ సేన ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మంగళవారం ఐసీసీ.. వరల్డ్‌కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం పది వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో 48 లీగ్ మ్యాచ్‌లు సహా రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ జరగనుంది. మొదటి సెమీఫైనల్‌కు ముంబై.. రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా.. ఇక ప్రతిష్టాత్మక ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక టీమిండియా తొమ్మిది వేదికల్లో(హైదరాబాద్ మినహా) వివిధ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు ఆడేందుకు దేశం మొత్తం మీద ప్రధాన నగరాల్లో దాదాపు పదివేల కిలోమీటర్లు(9700 కిమీ) ప్రయాణం చేయనుంది. ఇందులో చిన్నజట్లతో మ్యాచ్‌లు మినహాయిస్తే భారత్ ఎదుర్కొనే ఐదు ప్రధాన ప్రత్యర్థులు, ఎక్కడ మ్యాచ్ ఆడుతుందనేది ఒకసారి పరిశీలిద్దాం. ఐదు ప్రధాన జట్లతో ఆడబోతున్న మ్యాచ్‌ల్లో పిచ్‌లు టీమిండియాకు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నారు. అదే సమయంలో ఒక్కో జట్టుకు ఒక్కో పిచ్‌ను రూపొందించనుండడం విశేషం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(అక్టోబర్ 8, చెన్నై వేదికగా) ఈ మెగా సమరంలో టీమిండియా ఆడబోయే తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిగా బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. అప్పటికి చలికాలం సీజన్ ప్రారంభం అవుతుంది. రెండో బ్యాటింగ్ సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే చాన్స్ ఉండడంతో ఇక్కడ ఏ జట్టైనా తొలి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపుతుంది. దీన్నిబట్టి చెన్నై పిచ్ కాస్త స్లగిష్గా ఉండే అవకాశముంది. ఇక 1987 నుంచి టీమిండియా చిదంబరం స్టేడియంలో 14 మ్యాచ్‌లాడి ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇందులో నాలుగు విజయాలు ఈ దశాబ్దంలో వచ్చినవే. గతేడాది ఇక్కడ జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. ఇక స్టేడియంలో పలు మార్పులు చేస్తున్నారు. స్టేడియం ఫ్లడ్‌లైట్స్‌ను ఎల్ఈడీ వెలుగులతో నింపుతున్నారు. ఇక మ్యాచ్‌కు రెండు ఎర్రమట్టి పిచ్‌లను తయారు చేస్తున్నారు. తుది దశ పనులు జరుగుతున్నాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్(అక్టోబర్ 15, అహ్మదాబాద్) వరల్డ్‌కప్‌లో అన్ని మ్యాచ్‌లు ఒక ఎత్తయితే.. ఈ ఒక్క మ్యాచ్ మరొక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. లక్షా 30వేల మంది కెపాసిటీ కలిగిన ఈ స్టేడియంలో భారత్, పాక్ జరిగే రోజున స్టేడియం సామర్థ్యానికి మించి జనం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు టీఆర్పీ రేటింగ్‌లు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరుదేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిదనేది ఆసక్తిగా మారింది. ఇక పిచ్‌ను ప్లాట్‌గా రూపొందిచే ప్రక్రియలో ఉన్నారు. ఎందుకంటే మ్యాచ్‌లో పరుగుల వర్షం రావాలని.. బ్యాటింగ్‌కు అనుకూలించేలా పిచ్‌ను తయారు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్రమోదీ స్టేడియం స్పిన్నర్లకు అనువుగా ఉంటుంది. అయితే ఈసారి ఎర్రమట్టి బదులు నల్లమట్టిని పిచ్‌కు వాడనున్నారు. దీంతో కాస్త లోబౌన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఎక్కువమేరకు ప్లాట్‌గానే రూపొందించనున్నారు. అంటే చిరకాల ప్రత్యర్థుల పోరులో పరుగుల సునామీని చూసే అవకాశం ఉంటుంది. 1984 నుంచి టీమిండియా ఇక్కడ 18 మ్యాచ్‌లు ఆడితే 10 విజయాలు సాధించింది. 2021లో ఈ స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు మార్చారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(అక్టోబర్ 22, ధర్మశాల) దేశంలో అతిచిన్న స్టేడియాల్లో ధర్మశాల ఒకటిగా ఉంది. ఇక్కడి బౌండరీ లైన్ చాలా దగ్గర్లో ఉంటుంది. ఇక్కడి పిచ్ పేసర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే న్యూజిలాండ్‌తో ఆడబోయే మ్యాచ్‌కు నల్లమట్టిని ఉపయోగించి పిచ్‌ను రూపొందించనున్నారు. బ్యాటింగ్ ట్రాక్‌కు అనుకూలమైనప్పటికి మ్యాచ్ రోజు ఎండ ఉంటే పరుగులు బాగానే వస్తాయి. ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే మాత్రం రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవు. అందుకే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం. మన దేశంలో కొత్త స్టేడియాల్లో ఒకటిగా ఉన్న ధర్మశాలలో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడితే రెండు గెలిచి.. రెండింట ఓడింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్(అక్టోబర్ 29, లక్నో) ఐపీఎల్ సమయంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో పెద్దగా పరుగుల వరద పారింది లేదు. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్పిన్ ట్రాక్నే కంటిన్యూ చేయనున్నారు. ఇక్కడ టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించారు. మ్యాచ్‌లో ప్రొటీస్ ఓడిపోయింది. ఇక్కడి పిచ్ ప్రభావం కారణంగా జట్లు స్కోర్లు 250 నుంచి 270 మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పిచ్‌పై నల్లమట్టిని ఉపయోగించనున్నారు. ఎక్కువగా స్పిన్నర్లు ప్రభావం చూపించే మ్యాచ్‌లో పేసర్లకు అనువైన బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా(నవంబర్ 5, కోల్‌కతా) అహ్మదాబాద్ తర్వాత కెపాసిటీలో, స్టేడియం సామర్థ్యంలో రెండో అతిపెద్ద స్టేడియం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మెగాటోర్నీలు ఎప్పుడు జరిగినా నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ. పైగా ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు సూపర్ రికార్డు ఉంది. ఆడిన 22 మ్యాచ్‌ల్లో 13 మ్యాచ్‌లు గెలిచింది. 2011 నుంచి 2017 వరకు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఆరుసార్లు గెలుపొందితే.. రెండో బ్యాటింగ్ చేసిన జట్లు ఐదుసార్లు గెలుపొందాయి. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై అటు పేసర్లకు.. ఇటు స్పిన్నర్లకు సమానపాత్ర ఉంటుంది. ఇక్కడ మంచు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. చదవండి: వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే..? ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్న ప్రపంచంలోనే తొలి పక్షి ఏంటో తెలుసా!
పక్షులకు, జంతువులకు ఏదైన సమస్య వస్తే మనుషుల మాదిరి ఆస్పత్రులకు వెళ్లడం, చికిత్స చేయించుకోవడం వంటివి ఉండవు. ప్రత్యేకంగా పెంచుకుంటేనో లేక పార్క్‌లో ఉంటేనో వాటి సంరక్షకులు వాటి బాగోగులు గమనించి వెటర్నరీ ఆస్పత్రులకు తీసుకువెళ్లడం జరుగుతోంది. వాటికి మహా అయితే ట్రీట్మెంట్ చేసి పంపిచేస్తారు గానీ స్కానింగ్‌లు వంటి ఉండవు. కానీ తొలిసారిగా ఒక పక్షి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంది. ఇలాంటి స్కానింగ్ చేయించుకున్న తొలి పక్షిగా కూడా నిలిచింది. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లోని అడ్వెంచర్ పార్క్‌లో ఉంటున్న చకా అనే పెంగ్విన్ పక్షి నిలబడటం, కదలికలకు సంబదించిన సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు వెటర్నరీ డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించారు. ఐతే ఎందువల్ల ఈ సమస్యను ఎదర్కొంటుందనేది తెయకపోవడంతో దానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని నిర్ణయించారు వైద్యులు. అందులో భాగంగా ఈ చకా అనే పెంగ్విన్‌కి ఎంఆర్ఐ స్కాన్ చేయగా..అది ఏ మాత్రం భయపడకుండా ఏం జరుగుతుందా అని నిశితంగా గమనించింది. ఈ పరీక్షల తదనంతరం నెమ్మదిగా బ్యాలెన్స్ అవ్వడం, మిగతా పెంగ్విన్ పక్షుల మాదిరి చకచక నడవడం వంటివి చేయగలుగుతోంది. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని అడ్వెంచర్ పార్క్ పేర్కొంది. దీంతో ప్రపంచంలోనే తొలిసారిగా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్న తొలిపక్షి. ఈ స్కానింగ్ ప్రక్రియ అనేది సముద్ర జాతికి చెందిన పక్షులు, జంతువుల తోపాటు అభయరణ్యాలు, పార్క్‌ల్లో పెరిగే జంతువులు వంటి వాటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు వైద్యులు. (చదవండి: అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు) -
చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్లో కొత్త శకం
అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో సరికొత్త శకం మొదలైంది. తొలిసారి ఒక మెన్స్ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఒక మహిళ ఫీల్డ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌కు చెందిన మహిళా అంపైర్ కిమ్ కాటన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. బుధవారం న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టి20లో కిమ్ కాటన్.. మరో అంపైర్ వేన్ నైట్స్‌తో కలిసి ఫీల్డ్ అంపైరింగ్ చేసింది. అయితే కిమ్ కాటన్ గతంలో న్యూజిలాండ్, భారత్‌ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు థర్డ్ అంపైర్ పాత్ర పోషించింది. తాజాగా మాత్రం పురుషుల క్రికెట్లో తొలిసారి ఫీల్డ్ అంపైరింగ్ చేసిన కిమ్ కాటన్ తన పేరును క్రికెట్ పుస్తకాల్లో లిఖించుకుంది. కాగా మహిళా అంపైర్‌గా కిమ్ కాటన్ పేరిట చాలా రికార్డులున్నాయి. 2020లో మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ వుమెన్స్ టి20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళా అంపైర్‌గా కిమ్ కాటన్ నిలిచింది. అంతేకాదు మూడు మహిళల టి20 వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే వరల్డ్‌కప్‌లోనూ అంపైర్‌గా పనిచేసింది. ఇక 2020, 2022, 2023 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించి ఎవరికి దక్కని రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇక ఓవరాల్‌గా 2018 నుంచి కిమ్ కాటన్ 54 టి20 మ్యాచ్‌లతో పాటు 24 వన్డేల్లో అంపైర్‌గా విధులు నిర్వర్తించింది. ఇక రెండో టి20 విషయానికి వస్తే న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. History today for umpire Kim Cotton who becomes the first female umpire to stand in a men’s international match between two @ICC full member countries 🤝#NZvSL #CricketNation pic.twitter.com/EI8C1RJt4d — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 చదవండి: NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే -
సిరీస్ ఓటమి.. వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించని లంక
న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో శ్రీలంక ఓటమి పాలయ్యింది. హామిల్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలో న్యూజిలాండ్ గెలవగా.. రెండో వన్డే వర్షార్పణం అయింది. ఇక కీలకమైన మూడో వన్డేలో ఓడిన లంక సిరీస్ కోల్పోవడంతో పాటు ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఈ ఓటమితో లంక నేరుగా వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశం చేజార్చుకుంది. ఇక జూన్‌లో జింబాబ్వే వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో లంక పాల్గొంటుంది. అక్కడ గెలిచే మ్యాచ్‌ల ఫలితాలను బట్టి వరల్డ్‌కప్ అర్హతకు అవకాశం ఉంటుంది. పొరపాటున క్వాలిఫయర్స్‌లో గనుక ఓడిపోతే లంక వన్డే వరల్డ్‌కప్ కథ ముగిసినట్లే. ఇక వన్డే వరల్డ్‌కప్ ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ సహా న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. ఇక శ్రీలంక రేసు నుంచి అవుట్ అయింది. దీంతో జూన్‌లో వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. ఇందులో టాప్-3లో నిలిచిన జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కివీస్ బౌలర్ల ధాటికి 41.3 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. పాతుమ్ నిస్సాంక(64 బంతుల్లో 57 పరుగులు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. చివర్లో కెప్టెన్ షనక(31 పరుగులు), కరుణరత్నే(24 పరుగులు) చేయడంతో లంక కనీసం 150 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో డారిల్ మిచెల్, షిప్లే, మాట్ హెన్రీలు తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ చేధించింది. 32.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. విల్ యంగ్(113 బంతుల్లో 86 నాటౌట్, 11 ఫోర్లు), హెన్రీ నికోల్స్(52 బంతుల్లో 44 నాటౌట్, 5 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. లంక బౌలర్లలో లాహిరు కుమారా రెండు వికెట్లు తీయగా.. దాసున్ షనక, కాసున్ రజితలు చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 2-0తో గెలుచుకుంది. విల్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకోగా.. హెన్రీ షిప్లేను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వరించింది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఏప్రిల్ 2 నుంచి 8 వరకు జరగనుంది. తొలి టి20 మ్యాచ్‌ను కివీస్, లంకలు ఏప్రిల్ 2న ఆక్లాండ్ వేదికగా ఆడనున్నాయి. Henry Nicholls seals the win and a 2-0 series victory! Catch up on all scores at https://t.co/3YsfR1YBHU or the NZC app 📲 #NZvSL #CricketNation pic.twitter.com/URvebSkaBl — BLACKCAPS (@BLACKCAPS) March 31, 2023 చదవండి: IPL 2023 GT Vs CSK: అహ్మదాబాద్‌లో భారీ వర్షం.. మ్యాచ్ జరుగుతుందా? -
టెస్టు చరిత్రలో లంక తరపున అత్యంత చెత్త రికార్డు
శ్రీలంక బౌలర్ లాహిరు కుమారా టెస్టు క్రికెట్లో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. లంక తరపున టెస్టు క్రికెట్లో చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జాబితాలో లాహిరు కుమారా తొలిస్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఎకానమి పరంగా అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో లాహిరు కుమారా 25 ఓవర్లు బౌలింగ్ వేసి 164 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇంతకముందు కాసున్ రజిత ఇదే న్యూజిలాండ్‌పై 34 ఓవర్లలో 144 పరుగలిచ్చి ఒక్క వికెట్ తీయకపోవడం అనేది అత్యంత చెత్త రికార్డుగా ఉంది. తాజాగా లాహిరు కుమారా దానిని సవరించాడు. లాహిరు, కాసున్ రజిత తర్వాత ఆశోక డిసల్వా 56 ఓవర్లలో 141 పరుగులు(1991, న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్ వేదికగా), మురళీధరన్ 46 ఓవర్లలో 137 పరుగులు(1997లో భారత్‌పై నాగ్‌పూర్ వేదికగా) ఉన్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే ► ఖాన్ మొహమ్మద్-(54-5-259-0) వర్సెస్ వెస్టిండీస్, 1958 ► నిక్కీ బోజే-(65-5-221-0) వర్సెస్ శ్రీలంక, 2006 ► యాసిర్ షా-(32-1-197-0) వర్సెస్ ఆస్ట్రేలియా, 2019 ► రే ప్రైస్-(42-2-192-0) వర్సెస్ సౌతాఫ్రికా, 2001 ► ప్రసన్న-(59-8-187-0) వర్సెస్ ఇంగ్లండ్ , 1967 ► రే ప్రైస్-(36-5-187-0) వర్సెస్ ఆస్ట్రేలియా , 2003 ఎకానమీ పరంగా టెస్టు క్రికెట్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు ► జాహిద్ మహ్మద్( 33-1-235-4, ఎకానమీ 7.12) వర్సెస్ ఇంగ్లండ్, 2022 ► లాహిరు కుమారా(25-1-164-0, ఎకానమీ 6.56) వర్సెస్ న్యూజిలాండ్, 2023 ► యాసిర్ షా(32-1-197-0, ఎకానమీ 6.15) వర్సెస్ ఆస్ట్రేలియా, 2019 చదవండి: క్లబ్ మేనేజర్‌తో గొడవ.. పీఎస్జీని వీడనున్నాడా? వయసు పెరిగినా వన్నె తగ్గలేదు.. -
పట్టు బిగించిన కివీస్.. ఫాలోఆన్ గండం తప్పేదెలా?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. కివీస్ బౌలర్ల దాటికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. తద్వారా కివీస్‌కు 416 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో లంకను ఫాలోఆన్ ఆడించడానికే కివీస్ మొగ్గుచూపింది. లంక ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే. ఫాలోఆన్ ఆడుతున్న లంక ప్రస్తుతం వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. కరుణరత్నే 21, కుషాల్ మెండిస్ క్రీజులో ఉన్నారు. రెండు వికెట్ల నష్టానికి 26 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన లంక ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా సమయం పట్టలేదు. 66.5 ఓవర్ల పాటు ఆడిన లంక 164 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కరుణరత్నే 89 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చండిమల్ 37 పరుగులు మినహా మిగతావారంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, మైకెల్ బ్రాస్‌వెల్ చెరో మూడు వికెట్లు తీయగా.. సౌథీ, టింక్నర్, బ్రాస్‌వెల్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 580 పరుగులు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. కేన్ విలియమ్సన్(215 పరుగులు), హెన్రీ నికోల్స్(200 పరుగులు) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేసింది. నాలుగో రోజు ఉదయం సెషన్‌లోగా మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. చదవండి: విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్ ‘డబుల్’ సెంచరీలు -
రీల్‌లైఫ్‌లో హీరో నాని.. రియల్ లైఫ్‌లో కేన్ మామ
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు అసలు సిసలు టెస్టు మజాను రుచి చూపించింది. సంప్రదాయ క్రికెట్లో మ్యాచ్ గెలవాలనే తపనతో ఇరుజట్లు ఆడిన తీరు టెస్టు చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న శ్రీలంక.. సొంతగడ్డపై ప్రత్యర్థికి అవకాశమివ్వకూడదన్న పంతంతో న్యూజిలాండ్.. గెలవాలంటే ఐదు బంతుల్లో 7 పరుగులు కావాలి.. 70వ ఓవర్.. క్రీజులో కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ.. చేతిలో మూడు వికెట్లు.. అంతలోనే సమన్వయలోపం కారణంగా రనౌట్.. బౌలర్ అషిత ఫెర్నాండో చురుగ్గా కదిలి డైవ్ చేసి మరీ బంతిని వికెట్లకు గిరాటేయడంతో హెన్రీ అవుట్. క్రీజులోకి నీల్ వాగ్నర్.. చేతిలో రెండు వికెట్లు.. గెలవాలంటే ఆరు పరుగులు కావాలి.. ఇక విలియమ్సన్ ఆలస్యం చేయలేదు.. ఫెర్నాండో బౌలింగ్‌లో అద్భుత బౌండరీతో నాలుగు పరుగులు రాబట్టాడు.. న్యూజిలాండ్ గెలుపు సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగు.. వెంటనే డాట్‌బాల్.. ఇరు జట్ల స్కోర్లు సమం.. గెలవాలంటే మిగిలిన ఒక్క బంతికి ఒక్క పరుగు కావాలి.. శ్రీలంకతో పాటు టీమిండియా అభిమానుల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ.. బైస్.. షాట్ ఆడేందుకు కేన్ విలియమ్సన్ ప్రయత్నం.. వాగ్నర్‌కు కాల్.. సింగిల్ తీసేందుకు కేన్ మామ క్రీజు వీడాడు. ఆలోపే బంతిని అందుకున్న వికెట్ కీపర్ డిక్విల్లా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫెర్నాండో వైపు విసరగా.. బాల్ అందుకున్న ఫెర్నాండో వెంటనే వికెట్లకు గిరాటేశాడు.. మరి కేన్ మామ అప్పటికే పరుగు పూర్తి చేశాడా లేదోనన్న సందేహం! కివీస్‌కు అనుకూలంగా థర్డ్ ఎంపైర్ నుంచి స్పందన.. లంక ఆశలపై నీళ్లు.. ఆఖరి బంతికి కివీస్‌ను గెలిపించిన కేన్ విలియమ్సన్‌పై ప్రశంసల జల్లు. మొత్తానికి రనౌట్ నుంచి తప్పించుకొని కేన్ మామ హీరోగా నిలిచాడు. ఇదంతా రియల్ లైఫ్ మ్యాచ్‌లో జరిగింది. అయితే ఇది సీన్ ఒక సినిమాలో కూడా జరిగిందంటే మీరు నమ్ముతారా.. అది కూడా ఒక తెలుగు సినిమాలో. ఆశ్చర్యపోయినా ఇది నిజం. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. అయితే సినిమా క్లైమాక్స్‌లో నాని తన జట్టును గెలిపించడానికి పడే తపన అచ్చం కేన్ మామ ఇన్నింగ్స్‌ను తలపించింది. రియల్ లైఫ్ మ్యాచ్ లాగానే సినిమాలోనూ నాని ఆఖరి బంతికి రనౌట్ నుంచి తప్పించుకొని జట్టును గెలిపిస్తాడు. ఆ తర్వాత నాని పైకి లేచి బ్యాట్‌ను పైకెత్తి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా విలియమ్సన్ తన బ్యాట్‌ను పైకెత్తి గెలుపును సెలబ్రేట్ చేసుకోవడం కనిపిస్తుంది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన వీడియోలను పక్కపక్కన ఉంచి ఒక అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by TwEETA PORADU (@tweetaporadu) చదవండి: 'నా స్థానాన్ని ఆక్రమించావు.. అందుకే కృతజ్ఞతగా' NZ Vs SL: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! -
NZ Vs SL: డ్రా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్
New Zealand vs Sri Lanka, 1st Test క్రైస్ట్‌చర్చి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండో సెషన్ సమయానికి 18 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 373 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను డారిల్ మిచెల్ 102 పరుగులతో వీరోచిత శతకంతో నిలబెట్టాడు. అనంతరం లోయర్ ఆర్డర్లో మాట్ హెన్రీ (72 పరుగులు) టెయింలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి కివీస్ ఆధిక్యం సాధించడంలో ముఖ్యపాత్ర వహించాడు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న లంక మూడో రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ 20, ప్రభాత్ జయసూర్య రెండు పరుగులతో ఆడుతున్నారు. శనివారం నాటి ముగిసే సరికి లంక 65 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడటం టీమిండియాకు కాస్త ఊరటనిచ్చే అంశం. ఒకవేళ కివీస్, లంక మ్యాచ్ డ్రాగా ముగిసినా.. లేక లంక రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు పరిమితమై కివీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉంచి.. వారి చేతిలో ఓడిపోయినా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టేది టీమిండియానే. అప్పుడు టీమిండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ టీమిండియా ఓడిపోతే మాత్రం పరిస్థితి కాస్త క్లిష్టంగా మారుతుంది. అలా జరగకుండా ఉండాలంటే కివీస్, లంక మ్యాచ్ డ్రా అయినా కావాలి లేదా లంక ఓడిపోవాలి. అదే సమయంలో టీమిండియా ఆసీస్‌తో మ్యాచ్‌ను డ్రా లేదంటే గెలవడం చేయాలి. చదవండి: Virat Kohli: రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్ -
సర్జరీ విజయవంతం.. బుమ్రా రీఎంట్రీ అప్పుడే!
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవలే బీసీసీఐ వెన్నునొప్పికి సంబంధించిన శస్త్ర చికిత్స కోసం బుమ్రాను న్యూజిలాండ్‌కు పంపిచింది. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్), షేన్ బాండ్ల(న్యూజిలాండ్)కు సర్జరీ చేసిన డాక్టర్ రోవన్ షౌటెన్.. బుమ్రాకు చికిత్స అందించాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు సర్జరీ విజయంవంతం అయినట్లు సమాచారం అందింది. సర్జరీ సక్సెస్ అయినప్పటికి బుమ్రా పూర్తిగా కోలుకొని గ్రౌండ్ లోకి అడుగుపెట్టడానికి దాదాపు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్ లకు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే అక్టోబర్, నవంబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కొచ్చు. ఇక గత ఆగస్టులో గాయపడ్డ బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్-2022, టి20 వరల్డ్ కప్.. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలకు కూడా బుమ్రా దూరమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీకి కూడా అందుబాటులో ఉండటం లేదు. బుమ్రా దూరమవడం ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. సర్జరీ పూర్తైన బుమ్రా కనీసం 24 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే స్వదేశంలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ వరకు అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది. చదవండి: మాస్టర్‌మైండ్.. తెలివిగా తప్పించుకున్న ధోని -
76 పరుగులకే ఆలౌట్.. న్యూజిలాండ్‌పై ఆసీస్ ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం పార్ల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 76 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డనర్ 5 వికెట్లతో చెలరేగగా.. స్కాట్ రెండు, బ్రౌన్, పెర్రీ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కెర్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో హీలీ (55), లానింగ్(41), పెర్రీ(40) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తాహు, అమేలియా కెర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. జెస్ కెర్, జానెసన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఆస్ట్రేలియా తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం బంగ్లాదేశ్ తలపడనుండగా.. న్యూజిలాండ్ సోమవారం దక్షిణాఫ్రికాతో ఆడనుంది. చదవండి: T20 World Cup: పాక్‌తో పోరుకు భారత్ ‘సై’ -
మహిళల టి20 వరల్డ్‌కప్: కివీస్‌పై గెలుపు.. ఫైనల్లో భారత్
ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(10) విఫలమైనప్పటికి మరో ఓపెనర్ స్వేతా సెహ్రావత్(45 బంతుల్లో 61 పరుగులు నాటౌట్), సౌమ్య తివారీ(22 పరుగులు) రాణించడంతో భారత్ సులువుగానే విజయాన్ని అందుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్లిమ్మర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసాబెల్లా గేజ్ 26 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరశ్వీ చోప్రా మూడు వికెట్లు తీయగా.. తిటాస్ సాదు, మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, అర్జనా దేవీలు తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ వుమెన్స్, ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో జనవరి 29న(ఆదివారం) భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. A dominant performance sends India through to the #U19T20WorldCup final! 📝 Scorecard: https://t.co/nO40lpkR7A Watch the action live and for FREE on https://t.co/5AuGFN3l1C (in select regions) 📺 pic.twitter.com/0Ik8ET7Zbi — T20 World Cup (@T20WorldCup) January 27, 2023 -
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్
న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్ గురువారం అనుహ్యంగా తర పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి ప్రధాని వారసుడిగా విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్కిన్స్ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్నారు. ఆమె తర్వాత పార్టీ సభ్యుల్లో కొత్త ప్రధానిగా హిప్కిన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 44 ఏళ్ల రాజకీయ నాయకుడు పార్లమెంటు సభ్యుల సమావేశంలో పాలక లేబర్ పార్టీకి నాయకత్వం వహించే ఏకైక వ్యక్తిగా జెసిండా స్థానంలో ఉన్నారు. ఆయన ఒక్కరే పోటీలో ఉండటం వల్ల దీనికోసం తొలుత పార్టీ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంది. పైగా ఆ స్థానానికి పోటీపడేందుకు పార్టీలో సరైన సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో చట్ట సభ సభ్యులంతా ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిప్కిన్స్ ఆదివారం లాంఛనంగా జరిగే తన సహచరుల ఆమోదం కోసం వేచి ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ దేశ 41వ ప్రధాన మంత్రిగా హిప్కిన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఐతే ఆమె వారసుడిగా కేవలం 48 గంటల్లో ఎన్నుకున్నందున తాను ఫిబ్రవరి 7నాటికి పదవీవిరమణ చేస్తానని జెసిండా ఆర్డర్న్ తెలిపారు. ఈ క్రమంలో హిప్కిన్స్ మాట్లాడుతూ తాను చాలా నిర్ణయాత్మకంగా ఉన్నానని, పనులు వేగవంతంగా పూర్తి చేయగలనని ధీమాగా చెప్పారు. అదీగాక హిప్కిన్స్కి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. పైగా తాను ఈ ఎన్నికలలో విజయం సాధించగలనని నమ్మకంగా చెప్పారు. అలాగే మాజీ ప్రధాని జెసిండాను అవసరమైన సమయంలో కీలక బాధ్యతలను నిర్వర్తించిన అత్యవసరమైన నాయకురాలిగా ప్రశంసించారు. ఆమె ఇక ఈ బాధ్యతలను మోయలేని స్థితిలో ఉందని అన్నారు. ఆమె ప్రకృతి వైపరిత్యాలు, కోవిడ్ మహమ్మారీ, అత్యంత ఘోరమైన ఉగ్రదాడి సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించిన ధైర్యవంతురాలైన నాయకురాలని కొనియాడారు. కాగా, తాను ఈ కొత్త పదవిని శక్తిమంతమైనదే గాక తనకొక కొత్త ఉత్సాహన్ని తీసుకొచ్చేదిగా భావిస్తున్నానని హిప్కిన్స్ చెప్పుకొచ్చారు. అలాగే న్యాయ మంత్రి కిరీ అల్లన్ హిప్కిన్స్ అద్భుతమైన బలమైన ప్రధాని అవుతాడని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అదీగాక కరోనా ఉధృత సమంయంలో సమర్ధవంతంగా పనిచేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా పార్టీలో సమస్య వచ్చినప్పుడూ చాకచక్యంగా పరిష్కరించి గ్రేట్ ట్రబుల్ షూటర్‌గా కూడా హిప్కిన్స్కు పేరుంది. ఐతే వచ్చే ఎన్నికల్లో దేశంలోని ఆర్థిక వ్యవస్థ పెద్ద సవాలుగా మారునుంది. ఆయన ఓటర్లను ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలనని చెప్పి ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇదిలా ఉండగా, జెసిండా పదవీవిరమణ ప్రకటన విషాదంగా అనిపించినా, ఈ ప్రకటన అనంతరం చాలాకాలం తర్వాత తొలిసారి బాగా నిద్రపోయానని ఆమె చెప్పడం విశేషం. (చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. గాల్లో ఉండగానే..) -
కల చెదిరింది.. ప్రాణం తీసిన గుర్రపు పందెం
న్యూజిలాండ్‌కు చెందిన 26 ఏళ్ల మేఘన్ టేలర్ గుర్రపు పందెంలో ప్రాణాలు కోల్పోయింది. యంగ్ జాకీ రైడర్‌గా పేరు పొందిన మేఘన్ టేలర్ కాంటర్బరిలోని యాష్బర్టన్ రేస్‌వే వద్ద గురువారం జరిగిన హార్స్ రేసులో పాల్గొంది. రేసు మధ్యలో దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో ఆమె మరణించింది. రేస్ జరుగుతున్న సమయంలో మరొక జాకీ రైడర్‌తో జరిగిన క్లాష్‌లో మేఘన్ టేలర్ కిందపడిపోయింది. అయితే వేగంగా పరిగెత్తుతున్న గుర్రంపై నుంచి కిందపడడంతో ఆమె తలకు బలమైన గాయం అయింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించేలోపే మేఘన్ టేలర్ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు మేఘన్ టేలర్ రెడ్ ఆర్కిడ్ హార్స్‌తో రెండో స్థానంలో ఉంది. అయితే ఆమె వెనకాలే మరో ముగ్గరు జాకీ రైడర్స్ ఒకే పార్శ్వంలో రావడమే ప్రమాదానికి కారణమైంది. మేఘన్‌తో పాటు మిగతా ముగ్గురు కూడా కింద పడినప్పటికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక మేఘన్ టేలర్ జాకీ రైడర్‌గా 2019లో తన కెరీర్‌ను ప్రారంభించింది. యూరోప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత న్యూజిలాండ్‌లో పలుమార్లు హార్స్ రేసింగ్‌లో పాల్గొంది. -
ఫైనల్ దారిలో రికార్డులు బద్దలు కొట్టిన పాక్
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. తాజాగా బుధవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాక్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఫైనల్‌కు చేరుకున్న పాకిస్తాన్ రెండోసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. ఇక ఫైనల్‌కు చేరుకున్న పాకిస్తాన్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► టి20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు కివీస్‌ను పాకిస్తాన్ 18 సార్లు(తాజా మ్యాచ్‌తో కలిపి) ఓడించింది. ఆ తర్వాత వరుసగా ఇండియా వెస్టిండీస్‌ను 17సార్లు, ఇండియా శ్రీలంకను 17 సార్లు, ఇంగ్లండ్ పాకిస్తాన్‌ను 17సార్లు మట్టికరిపించాయి. ► 2009 నుంచి టి20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు సెమీఫైనల్లో ఇదే తొలి విజయం. ఓవరాల్‌గా మూడోసారి(ఇంతకముందు 2007, 2009) కాగా.. 13 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టడం విశేషం. ► ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ సెమీస్‌లో ఓడించడం ఇది నాలుగోసారి. ఇంతకముందు 1992, 1999 వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు 2007, 2022 టి20 ప్రపంచకప్‌లలోనూ కివీస్‌ను సెమీస్‌లో ఓడించింది. ► 2021 వరల్డ్‌కప్ తర్వాత ఆడిన టి20 మ్యాచ్‌ల్లో సౌథీ వికెట్ తీయకపోవడం ఇది రెండో సారి మాత్రమే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 152 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ చేయగా.. కేన్ విలియమ్సన్ 46 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. పాక్‌కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం అదిరిపోయే ఆరంభం అందించారు. బాబర్ ఆజం 42 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఇక రిజ్వాన్ 57 పరుగులతో అదరగొట్టాడు. మహ్మద్ హారీస్ 30 పరుగులతో రాణించాడు. చదవండి: NZ Vs PAK: ఆడింది కివీసేనా.. పేలవ ఫీల్డింగ్, నాసిరకం బ్యాటింగ్ -
NZ Vs PAK: ఆడింది కివీసేనా.. పేలవ ఫీల్డింగ్, నాసిరకం బ్యాటింగ్
న్యూజిలాండ్ జట్టు టాప్ క్లాస్ ఆటకు పెట్టింది పేరు. వాళ్లు మ్యాచ్ ఆడుతున్నారంటే ప్రత్యర్థి జట్టుకు బౌండరీలు, సిక్సర్లు రావడం చాలా కష్టం. ఎందుకంటే అంత పకడ్బందీగా ఉంటుంది వారి ఫీల్డింగ్. గుడ్ ఫీల్డింగ్‌తో పాటు మంచి జట్టు అని పేరు పొందిన న్యూజిలాండ్ తాజాగా టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం నాసిరకమైన ఆటను ప్రదర్శించింది. అసలు సెమీస్ ఆడుతుంది కివీసేనా లేక మరో జట్టా అన్న సందేహం కూడా కలిగింది. ఇక ఇవాళ పాక్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటతీరు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 59 పరుగులే చేసింది. డెత్ ఓవర్లలో అయితే పరిస్థితి మరీ దారుణం. భీకరమైన బౌలింగ్ లైనఫ్ ఉన్న పాకిస్తాన్ బౌలర్ల ముందు కివీస్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. చెప్పాలంటే బౌండరీలు బాదడానికి తెగ ఇబ్బంది పడ్డారు. 16 నుంచి 20 ఓవర్ల మధ్య న్యూజిలాండ్ బ్యాటర్లు కొట్టింది కేవలం రెండంటే రెండు ఫోర్లు... ఈ ఐదు ఓవర్లలో 46 పరుగులు మాత్రమే వచ్చాయి. భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుటైనా పెద్ద ఇబ్బందేమీ ఉండేది కాదు. కానీ జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కూడా సింగిల్స్, డబుల్స్ తీయడం ఆశ్చర్యం కలిగించింది. డారిల్ మిచెల్ కాస్తో కూస్తో పర్వాలేదనిపించినా.. ముఖ్యంగా విలియమ్సన్ మాత్రం టెస్టు బ్యాటింగ్ చేయడం అభిమానులను విసిగించింది. 42 బంతులెదుర్కొన్న విలియమ్సన్ 45 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో కేవలం ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతని బ్యాటింగ్ ఎంత జిడ్డుగా సాగిందో. బ్యాటింగ్ నీరసంగా చేశారనుకుంటే.. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మరింత దారుణ ప్రదర్శన కనబరిచారు. సాధారణంగా తమ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్లకు పరుగులు పెద్దగా ఇవ్వదు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు నేలపాలు చేస్తే .. ఈజీ రనౌట్ చాన్స్‌లను మిస్ చేశారు. మొత్తానికి మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ప్రదర్శన చూస్తుంటే... 2021లో టీమిండియా పర్ఫామెన్స్ గుర్తుకురావడం ఖాయం. న్యూజిలాండ్‌కి ఫైనల్ ఫోబియా చాలా ఎక్కువ. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తప్పితే 2015 వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీల్లో ఫైనల్ మ్యాచుల్లో ఇలాంటి నాసిరకమైన ప్రదర్శననే కనబరిచింది. ఐసీసీ టోర్నీల్లో సౌతాఫ్రికాని బ్యాడ్ లక్ వెంటాడుతుంది. న్యూజిలాండ్ కథ మాత్రం పూర్తిగా వేరు.ఫైనల్ వరకు చేరుకున్నప్పటికి ఆఖరి మెట్టుని ఎలా దాటాలో మాత్రం ఆ జట్టుకు తెలిసి రావడం లేదు. తమ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ గెలిచిన ఐకైక ఐసీసీ టైటిల్ ఏదైనా ఉందంటే అదీ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ మాత్రమే. ఇది కూడా వాతావరణం కలిసి రావడం.. టీమిండియాను బ్యాడ్‌లక్ వెంటాడడం వల్లేనని ఈ ఓటమితో రుజువు చేసుకుంది న్యూజిలాండ్. చదవండి: ఇది నాలుగోసారి.. పాక్ అంటే వణికిపోతున్న కివీస్! 'బ్లాక్‌క్యాప్స్' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం -
ఇది నాలుగోసారి.. పాక్ అంటే వణికిపోతున్న కివీస్!
క్రికెట్లో న్యూజిలాండ్ జట్టుకు పాకిస్తాన్ ఫోబియా ఇప్పట్లో వదిలేలా లేదు. ఐసీసీ మెగా టోర్నీల్లో(పరిమిత ఓవర్లు) పాక్‌తో సెమీస్ అనగానే న్యూజిలాండ్ వణికిపోతుంది. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన మొదటి సెమీఫైనల్లో కివీస్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం మూటగట్టుకొని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు పాకిస్తాన్‌తో ఆడిన నాలుగు సెమీఫైనల్స్‌లో(తాజా దానితో కలిపి) ఓడిపోయిన న్యూజిలాండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్‌లు నాలుగుసార్లు సెమీస్‌లో తలపడ్డాయి. ఇందులో రెండు వన్డే వరల్డ్‌కప్‌లు, రెండు టి20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. 1992, 1999 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన కివీస్.. మళ్లీ 2007, 2022 టి20 ప్రపంచకప్‌లోనూ సెమీస్‌లో పరాజయాలనే మూటగట్టుకుంది. మరి సెమీస్‌లో పాక్‌తో మ్యాచ్ అనగానే న్యూజిలాండ్‌కు అంత భయమెందుకు వేస్తుందనేది సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు. లీగ్ దశలో ఏ జట్టునైనా మట్టి కరిపించే సత్తా ఉన్న న్యూజిలాండ్ నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఎక్కడలేని ఒత్తిడిని కొనితెచ్చుకుంటుంది. ముఖ్యంగా పాక్‌తో సెమీస్ అనగానే ఆ ఒత్తిడి మరింత ఎక్కువైపోయి మ్యాచ్ మొదట్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌లో హిట్టింగ్‌లు పెద్దగా కనిపించలేదు. కేన్ విలియమ్సన్ చేసింది 45 పరుగులైనా.. అతను ఆడింది టెస్టు ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్‌లు పూర్తిగా నిరాశపరిచారు. అనుభవజ్ఞుడైన మార్టిన్ గప్టిల్‌ను కీలక మ్యాచ్‌లో పక్కనబెట్టడం కివీస్‌ను మరింత ఒత్తిడిలో పడేశాయి. దీనికి తోడు పాక్ బ్యాటింగ్ సమయంలో ఫేలవ ఫీల్డింగ్, క్యాచ్‌లు జారవిడవడం.. బౌలింగ్‌లో పస లేకపోవడం అన్నీ ఒక్కసారిగా మీదపడ్డాయి. చూస్తుంటే పాక్‌తో మ్యాచ్‌లోనే ఇవన్నీ జరుగుతాయని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మూడు సందర్భాల్లోనూ కివీస్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది, కనీసం ఈసారైనా పాక్‌తో సెమీస్ గండం దాటుతుందనకుంటే కథ మళ్లీ మొదటికే వచ్చింది. చదవండి: నక్కతోక తొక్కిన పాక్.. 13 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. వాళ్లిద్దరి వల్లే ఇలా: విలియమ్సన్ -
నక్కతోక తొక్కిన పాక్.. 13 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు
టి20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్ నక్కతోక తొక్కింది. ఒక దశలో సూపర్-12లోనే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిన దశలో అనూహ్యంగా ఫుంజుకున్న పాకిస్తాన్ సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఆపై దురదృష్టానికి కేరాఫ్ అయిన ప్రొటిస్ జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓడి పాక్ సెమీస్ వెళ్లేందుకు బాటలు పరిచింది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్‌పై సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కే పరిమితమైన పాకిస్తాన్ ఈసారి మాత్రం వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టలేదు. మొదట బౌలింగ్.. ఆపై బ్యాటింగ్‌లో సమిష్టి ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 2009 తర్వాత టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టడం మళ్లీ ఇదే. అలా 13 ఏళ్ల తర్వాత మరోసారి కప్ కొట్టడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇక 2007లో ఫైనల్ చేరినప్పటికి టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. 2009లో మాత్రం ఫైనల్లో లంకను చిత్తుచేసి విశ్వవిజేతగా నిలిచింది. అయితే దాయాది పాకిస్తాన్ ఫైనల్‌కు చేరడంతో.. ఇప్పుడందరి కళ్లు టీమిండియాపై పడ్డాయి. గురువారం(నవంబర్ 10న) ఇంగ్లండ్‌తో జరగనున్న సెమీఫైనల్లో టీమిండియా గెలవాలని.. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడితే చూడాలని అభిమానులు దేవుడికి ప్రార్థిస్తున్నారు. వారి కోరిక నెరవేరుతుందేమో చూడాలి. ఇక సెమీఫైనల్ మ్యాచ్ ముందు వరకు ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌ల ఫామ్‌పై పాక్ జట్టు మేనేజ్మెంట్ ఆందోళనలో ఉంది. కానీ కీలకమైన సెమీస్‌లో ఈ ఇద్దరు ఫామ్‌లోకి రావడం పాకిస్తాన్‌కు శుభపరిణామం అని చెప్పొచ్చు. ముఖ్యంగా టోర్నీల్లో దారుణంగా విఫలమైన బాబర్ ఆజంను న్యూజిలాండ్ దగ్గరుండి ఫామ్‌లోకి తీసుకొచ్చినట్లు అనిపించింది. ఇద్దరు ఓపెనర్లు అర్థశతకాలతో మెరవడంతో పాకిస్తాన్ విజయం సులువుగా జరిగిపోయింది. ఏది ఏమైనా పాకిస్తాన్ ఈసారి నక్క తోక గట్టిగా తొక్కిందని.. కానీ టీమిండియా ఫైనల్‌కు వస్తే మాత్రం పాక్ తోక ముడవడం ఖాయమని భారత అభిమానులు కామెంట్ చేశారు. చదవండి: 'బ్లాక్‌క్యాప్స్' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం ఫామ్ కోల్పోయిన బాబర్‌తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్ ప్రత్యేకత -
'బ్లాక్‌క్యాప్స్' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం
న్యూజిలాండ్ జట్టును ఇష్టపడని వారు ఉండరు. వివాదరహిత జట్టుగా పేరున్న కివీస్‌కు మంచి జట్టు అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ ట్యాగ్‌లైన్ ఒక్కటే ఉంటే సరిపోదు.. దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. కానీ కివీస్ విషయంలో అలా పిలవచ్చో లేదో అనే డైలమా నెలకొనేలా చేశారు. క్రికెట్లో సౌతాఫ్రికాకు 'చోకర్స్' అనే ముద్ర ఉంది. కానీ కివీస్‌ను అలా పిలవాలన్న మనసొప్పదు. కారణం వారి ఆటతీరు. సౌతాఫ్రికాకు దురదృష్టం ఎక్కువగా ఉంటే.. కివీస్ విషయంలో మాత్రం కొంత దురదృష్టం.. కొంత స్వయంకృతం తోడవుతాయి. అందుకే వారికి బ్లాక్‌క్యాప్స్ అని ముద్ర పడింది. సైన్స్‌ను నమ్మేవాళ్లకు వింత అనిపించినా.. న్యూజిలాండ్ జట్టు ధరించే బ్లాక్ జెర్సీని మారిస్తేనైనా కప్ కొడుతుందేమోనన్న నమ్మకం ఈరోజుతో మరింత బలంగా తయారైంది. బ్లాక్ క్యాప్స్ అని ఊరికే అనలేదన్న విషయాన్ని కివీస్ జట్టు మరోసారి నిరూపించుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో జరిగే ఐసీసీ మెగా టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టు మరోసారి తేలిపోయింది. ఈసారి కప్ కచ్చితంగా కొడుతుంది అన్న తరహాలో వారి ప్రదర్శన కొనసాగడం.. తీరా నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్ 2022లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. సూపర్-12 దశలో ఇంగ్లండ్ చేతిలో ఓటమి మినహా టాప్ ప్రదర్శన కనబరిచిన కివీస్ అందరూ ఊహించినట్లుగానే సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో మాత్రం మళ్లీ పాత కథే. గ్రూప్-1 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్.. కీలకమైన నాకౌట్(సెమీస్)లో తమకు అలవాటైన రీతిలోనే పాకిస్తాన్ చేతిలో చిత్తైంది. అందునా పాకిస్తాన్‌తో సెమీఫైనల్ అంటేనే చెత్త రికార్డు కలిగి ఉన్న న్యూజిలాండ్ దానిని విజయవంతంగా నిలబెట్టుకుంది. ఇప్పటివరకు ఐసీసీ మెగాటోర్నీల్లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ నాలుగుసార్లు ఓడించింది. ఇందులో రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్‌లో(1992, 1999).. రెండుసార్లు (2007, 2022) టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ ఉన్నాయి. అంతేకాదు 2015 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఐసీసీ మెగా టోర్నీల్లో(ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ మినహా) కనీసం సెమీస్ చేరిన జట్టుగా నిలిచింది న్యూజిలాండ్. అయితే నాకౌట్ ఫోబియా మాత్రం ఆ జట్టును వీడడం లేదు. ఇక వచ్చే ఏడాది 2023లో వన్డే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో అప్పుడైనా తమపై ఉన్న బ్లాక్‌క్యాప్స్ ముద్ర తొలగించుకుంటారేమో చూడాలి. అయితే క్రికెట్ అభిమానులు మాత్రం న్యూజిలాండ్ ఆటతీరు విషయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. మంచి జట్టుగా పేరున్న కివీస్‌కు ఈ నాకౌట్ ఫోబియా ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. ఎందరు కెప్టెన్లు మారినా జట్టు తలరాత మారడం లేదని.. తాను కెప్టెన్సీ చేపట్టిన ఆరేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో కివీస్‌ను మూడుసార్లు కనీసం సెమీస్ చేర్చిన కేన్ విలియమ్సన్ కల కూడా నెరవేరేలా కనిపించడం లేదని అంటున్నారు. 2019లో న్యూజిలాండ్ టైటిల్ కొట్టబోతుందంటూ ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మార్టిన్ క్రో జోస్యం చెప్పారు. కానీ ఆ కల తీరకుండానే ఆయన కన్నుమూయడం సగటు అభిమానిని బాధపడేలా చేసింది. కనీసం ఈసారైనా టైటిల్ కొట్టి తామేంటో నిరూపించుకోవాలనుకున్న కివీస్‌కు మరోసారి భంగపాటే ఎదురైంది. ఇక కివీస్ ఓటమికి కొన్ని కారణాలున్నాయి. అందులో మార్టిన్ గప్టిల్ లాంటి సీనియర్ ప్లేయర్‌ను పక్కనబెట్టడం జట్టు సమతుల్యం దెబ్బతీసిందని చెప్పొచ్చు. అతను ఫామ్‌లో ఉన్నాడో లేదో తెలియదు కానీ జట్టుకు ఒక సీనియర్ ఆటగాడి సేవలు చాలా అవసరం. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్స్‌తో పాటు 2021 టి20 ప్రపంచకప్‌ల్లో కివీస్ ఫైనల్ చేరడంలో మార్టిన్ గప్టిల్‌ది కీలకపాత్ర. అతనికి ఒక అవకాశం ఇచ్చి ఉండాల్సిందని క్రీడా ఫ్యాన్స్ వాపోయారు. ఏమో గప్టిల్ ఉండి ఉంటే.. సెమీఫైనల్లో బాగా స్కోరు సాధించి జట్టును ఫైనల్ చేర్చేవాడేమో అని పేర్కొన్నారు. అయినా న్యూజిలాండ్ కథ ముగిసింది.. ఇక ఇప్పుడు ఎన్ని మాట్లాడి ఏం ప్రయోజనం. ఈ ప్రపంచకప్‌లో కివీస్‌కు సెమీస్ వరకే రాసిపెట్టి ఉన్నట్లుంది. చదవండి: NZ Vs Pak: న్యూజిలాండ్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్ ఫామ్ కోల్పోయిన బాబర్‌తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్ ప్రత్యేకత