New Zealand Bowler Turns Super Market Owner Who Troubles MS Dhoni Out Many Times - Sakshi
Sakshi News home page

#ChrisMartin: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్‌ టాప్‌-3 బౌలర్‌, కట్‌చేస్తే.. ఇప్పుడు సూపర్‌ మార్కెట్లో

Published Wed, Jul 19 2023 3:34 PM | Last Updated on Wed, Jul 19 2023 6:22 PM

NZ Bowler-Turns-Super Market Owner-Who Troubles MS Dhoni Out-Many Times - Sakshi

క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్లు ఏదో ఒకరోజు ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాల్సిందే. అయితే రిటైర్మెంట్‌కు ముందే భవిష్యత్తులో ఏం చేయాలనేది ముందే నిర్ణయించుకోవడం చూస్తుంటాం. కొంతమంది క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత బిజినెస్‌ ప్లాన్‌ చేయడం.. కామెంటేటర్లుగా మారడం చూస్తుంటాం. క్రికెట్‌ బాగా పాపులర్‌ ఉన్న మన దేశంలో ఎక్కువమంది క్రికెటర్లు రిటైర్మెంట్‌ తర్వాత కామెంటేటరీ ఫీల్డ్‌లోకి వస్తున్నారు.

అయితే మరికొంత మంది క్రికెటర్లు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఉదాహరణకు దిగ్గజం కపిల్‌ దేవ్ వ్యాపారంలో రాణిస్తుండడంతో పాటు అప్పుడప్పుడు కామెంటేటరీ బాక్స్‌లో కనిపిస్తుంటాడు. ఇంకొంతమంది క్రికెటర్లు మాత్రం సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిపోతుంటారు. షోయబ్‌ అక్తర్‌ లాంటి పాక్‌ క్రికెటర్లు ఎక్కువగా యూట్యూబ్‌ చానెళ్లు నడుపుతూ మరింత ఫేమస్‌ అయిపోతున్నారు. కొందరు మాత్రం ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత లగ్జరీ జీవితానికి దూరంగా బతకాలని ఆశపడతారు. ఆ కోవకు చెందిన వాడే న్యూజిలాండ్‌ మాజీ బౌలర్‌ క్రిస్‌ మార్టిన్‌.

క్రిస్‌ మార్టిన్‌ న్యూజిలాండ్‌ తరపున 2000వ సంవత్సరం నుంచి 2013 వరకు 71 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 71 టెస్టుల్లో 233 వికెట్లు తీశాడు. ఒక దశలో న్యూజిలాండ్‌ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్‌ మార్టిన్‌ కంటే ముందు టెస్టుల్లో రిచర్డ్‌ హడ్లీ, డానియెల్‌ వెటోరిలు మాత్రమే ఉన్నారు. మరో విషయమేంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్‌గా క్రిస్‌ మార్టిన్‌ నిలిచాడు. చాలా సందర్భాల్లో ధోనిని ఔట్‌ చేసిన ఘనత క్రిస్‌ మార్టిన్‌ సొంతం.

ఇక 40 ఏళ్ల వయసు దాకా క్రిస్‌ మార్టిన్‌ క్రికెట్‌లో కొనసాగాడు. అయితే 35 ఏళ్ల వయసుకు చేరుకోగానే క్రిస్‌ మార్టిన్‌ తన పోస్ట్‌ రిటైర్మెంట్‌పై ఆలోచనలో పడ్డాడు. అప్పటినుంచే తన వ్యాపార రంగాన్ని విస్తృతం చేయాలని భావించాడు. ఆటకు రిటైర్మెంట్‌ ఇచ్చేలోపే న్యూజిలాండ్‌లోని ఈస్ట్‌బోర్న్‌లో ''Four Square'' పేరుతో సూపర్‌మార్కెట్‌ను నెలకొల్పాడు. మొదట చిన్న స్టోర్‌గా ప్రారంభించినప్పటికి 2019లో దానిని బిగ్‌స్టోర్‌గా మార్చాడు. ఫుడ్‌స్టఫ్‌ సహా మార్కెట్‌లో అవసరమైన అన్ని రకాల రిటైల్‌ వస్తువులను అందుబాటులో ఉంచాడు. అనతికాలంలోనే కస్టమర్స్‌ దగ్గర మంచి పేరు సంపాదించాడు.

చదవండి:  రాత్రి 7:45కు ముహూర్తం.. దాయాదుల మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న!

SL Vs PAK 1st Test: లంక కీపర్‌ను ముప్పతిప్పలు పెట్టిన పాక్‌ బౌలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement