Chris Martin
-
ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, ఇప్పుడు సూపర్ మార్కెట్లో
క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్లు ఏదో ఒకరోజు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. అయితే రిటైర్మెంట్కు ముందే భవిష్యత్తులో ఏం చేయాలనేది ముందే నిర్ణయించుకోవడం చూస్తుంటాం. కొంతమంది క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత బిజినెస్ ప్లాన్ చేయడం.. కామెంటేటర్లుగా మారడం చూస్తుంటాం. క్రికెట్ బాగా పాపులర్ ఉన్న మన దేశంలో ఎక్కువమంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత కామెంటేటరీ ఫీల్డ్‌లోకి వస్తున్నారు. అయితే మరికొంత మంది క్రికెటర్లు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఉదాహరణకు దిగ్గజం కపిల్ దేవ్ వ్యాపారంలో రాణిస్తుండడంతో పాటు అప్పుడప్పుడు కామెంటేటరీ బాక్స్‌లో కనిపిస్తుంటాడు. ఇంకొంతమంది క్రికెటర్లు మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతుంటారు. షోయబ్ అక్తర్ లాంటి పాక్ క్రికెటర్లు ఎక్కువగా యూట్యూబ్ చానెళ్లు నడుపుతూ మరింత ఫేమస్ అయిపోతున్నారు. కొందరు మాత్రం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లగ్జరీ జీవితానికి దూరంగా బతకాలని ఆశపడతారు. ఆ కోవకు చెందిన వాడే న్యూజిలాండ్ మాజీ బౌలర్ క్రిస్ మార్టిన్. క్రిస్ మార్టిన్ న్యూజిలాండ్ తరపున 2000వ సంవత్సరం నుంచి 2013 వరకు 71 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 71 టెస్టుల్లో 233 వికెట్లు తీశాడు. ఒక దశలో న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్ మార్టిన్ కంటే ముందు టెస్టుల్లో రిచర్డ్ హడ్లీ, డానియెల్ వెటోరిలు మాత్రమే ఉన్నారు. మరో విషయమేంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్‌గా క్రిస్ మార్టిన్ నిలిచాడు. చాలా సందర్భాల్లో ధోనిని ఔట్ చేసిన ఘనత క్రిస్ మార్టిన్ సొంతం. ఇక 40 ఏళ్ల వయసు దాకా క్రిస్ మార్టిన్ క్రికెట్లో కొనసాగాడు. అయితే 35 ఏళ్ల వయసుకు చేరుకోగానే క్రిస్ మార్టిన్ తన పోస్ట్ రిటైర్మెంట్పై ఆలోచనలో పడ్డాడు. అప్పటినుంచే తన వ్యాపార రంగాన్ని విస్తృతం చేయాలని భావించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చేలోపే న్యూజిలాండ్‌లోని ఈస్ట్‌బోర్న్‌లో ''Four Square'' పేరుతో సూపర్‌మార్కెట్‌ను నెలకొల్పాడు. మొదట చిన్న స్టోర్‌గా ప్రారంభించినప్పటికి 2019లో దానిని బిగ్స్టోర్గా మార్చాడు. ఫుడ్‌స్టఫ్ సహా మార్కెట్లో అవసరమైన అన్ని రకాల రిటైల్ వస్తువులను అందుబాటులో ఉంచాడు. అనతికాలంలోనే కస్టమర్స్ దగ్గర మంచి పేరు సంపాదించాడు. He took 233 Test wickets for New Zealand - the third highest of all-time for the Blackcaps, but only scored 123 runs in 71 matches! Happy Birthday to Chris Martin! pic.twitter.com/WAzVuktrNO — ICC (@ICC) December 10, 2017 చదవండి: రాత్రి 7:45కు ముహూర్తం.. దాయాదుల మ్యాచ్ సెప్టెంబర్ 2న! SL Vs PAK 1st Test: లంక కీపర్‌ను ముప్పతిప్పలు పెట్టిన పాక్ బౌలర్ -
సారూ.. ఈమె కత్రిన.. ఆమె కరీన!
కత్రినా కైఫ్, కరీనా కపూర్ ఖాన్.. ఈ ఇద్దరూ బాలీవుడ్ హీరోయిన్లు. ఎన్నో సినిమాల్లో నటించిన వీరికి ప్రత్యేకంగా తమకంటూ ఓ గుర్తింపు ఉంది. కానీ, వీరి విషయంలో ‘కోల్డ్‌ప్లే’ సింగర్ క్రిస్ మార్టిన్ తికమక పడ్డాడు. కరీనాను, కత్రినాను వేర్వేరుగా కాకుండా కలిపి గుర్తుంచుకున్నట్టు ఉంది. అందుకే ఇద్దరి పేర్లను కలిపి కత్రినా ఖాన్ చేసేశాడు. నవంబర్ 19న గ్లోబల్ సిటిజెన్ కాన్సర్ట్ తొలిసారి భారత్‌లో జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని శనివారం న్యూయార్క్‌లో జరిగిన గ్లోబల్ సిటిజెన్ కాన్సర్ట్‌లో క్రిస్ మార్టిన్ ప్రకటించాడు. ముంబైలో జరగనున్న ఈ సంగీత విభావరిలో తనతోపాటు బాలీవుడ్ స్టార్లు ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తదితరులు వేదిక పంచుకోనున్నట్టు చెప్పాడు. ఈ మేరకు తన వద్ద ఉన్న ఓ జాబితాను కూడా చదివి వినిపించిన క్రిస్ కరీనా, కత్రినా పేర్లను మాత్రం విడివిడిగా చెప్పలేదు. కత్రినా ఖాన్ అంటూ ఇద్దరిని కలిపి చెప్పాడు. దీంతో వేదికపై ఆయన పక్కనే ఉన్న ప్రియాంక చోప్రా కంగుతింది. ’ఓహ్’ అంటూ విస్మయాన్ని వ్యక్తం చేసింది. అయితే, భారతీయ పేర్లను పలుకడంలో అంతబాగా రాదని క్రిస్ సర్దిచెప్పాడు. స్వచ్ఛంద సేవ కోసం ఉద్దేశించిన గ్లోబల్ సిటిజెన్ కాన్సర్ట్ కు ప్రియాంక బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరీన, కత్రిన పేర్ల విషయంలో క్రిస్ తికమక పడటాన్ని కావాలంటే మీరు కూడా ఈ కింది వీడియోలో 5.20 నిమిషాల వద్ద చూడొచ్చు. -
ఆ జంట మళ్లీ ఒక్కటైంది?
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్-మ్యుజీషియన్ క్రిస్ మార్టిన్ ల జంట మళ్లీ ఒక్కటైయ్యారు. చి న్నపాటి విభేదాల వల్ల విడిపోయిన ఈ జోడి తిరిగి డేటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరు బిజీగా ఉన్నా.. వారి మధ్య బంధాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు పీపుల్ డాట్ కమ్ పేర్కొంది. భార్య వైనీత్ కు మార్టిన్ దగ్గరగా ఉంటున్నాడని భావించిన జెన్నీఫర్ అతనితో బంధాన్ని అక్టోబర్ లో తెంచుకుంది. గత ఆగస్టులోడేటింగ్ ఆరంభించిన ఈ జోడీ రెండు నెలల్లోనే దూరమయ్యారు. అయితే ఆ జోడీ డిసెంబర్ 30 వ తేదీన మళ్లీ వారి బంధాన్నిబలపరస్తూ ఓ డిన్నర్ లో కలుసుకుంది. వారి మధ్య చోటు చేసుకున్న విభేదాలను ప్రక్కకు పెట్టిన జెన్నీఫర్-మార్టిన్ లు తిరిగి రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. అసలు వారిద్దరి మధ్య గొడవ రావడానికి మార్టిన్ పిల్లలే కారణమట. మార్టిన్ -వైనీత్ జంటకు కు ఇద్దరు పిల్లలు ఆపిల్(10), మోసెస్(8) లు ఉన్నారు. ఈ క్రమంలోనే మార్టిన్ తరచు వైనీత్ ఇంటికి వెళ్లడంతో జెన్నీఫర్ కాస్త అలిగింది. అయితే తిరిగి ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్న జెన్నీఫర్ తిరిగి మార్టిన్ తో తన రిలేషన్ ను కొనసాగిస్తోంది. -
నన్ను జోలీ దంపతులు కిడ్నాప్ చేశారు!
లాస్ ఏంజిల్స్: తనను హాలీవుడ్ నటి ఏంజిలీనా జోలీ మరియ ఆమె భర్త బ్రాడ్ పిట్ లు కిడ్నాప్ చేశారంటూ సింగర్ క్రిస్ మార్టిన్ తెలిపాడు. ఏంజిలీనా జోలీ దర్శకత్వం వహిస్తున్న 'అన్ బ్రోకెన్' సినిమాకు పిట్ రాస్తున్న పాట కోసం తనను కిడ్నాప్ చేశారని మార్టిన్ అన్నాడు. 'తొలుత ఆ సినిమాకు సంబంధించి ఒక సందేశాన్ని జోలీ-పిట్ లు పంపారు. ఆ పాట ఎలా వస్తుందో నన్ను చూడమంటూ ఆ మెస్సేజ్ సారాంశం. ఇందుకోసం వారు ముందు హెచ్చరించినట్లుగానే నన్ను కిడ్నాప్ చేశారు. తలపై కొట్టడమే కాకుండా ముఖంపై స్ప్రే చేశారు. తరువాత చూస్తే తాను ఒక ఆఫీస్ లో ఉన్నానన్నాడు. అక్కడ బ్రాడ్ పిట్ ఎక్సర్ సైజ్ లు చేస్తుండగా.. ఏంజిలీనా జోలి భర్త ముందు కూర్చుని ఉంది. అంతేకాకుండా ఓ వ్యక్తి తనపీకపై కత్తిపెట్టి కూర్చున్నాడన్నాడు. ప్రస్తుతం పాట రాస్తున్నామని.. అది విన్నాక అభిప్రాయం చెప్పమన్నారని వారు తనకు తెలిపారని మార్టిన్ అన్నాడు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండోయ్. ఇదంతా తమ వద్ద ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అంటూ మార్టిన్ జోక్ పేల్చాడు. -
బ్రేకై.. ఒక్కటై..!
వద్దనుకొని విడిపోయి... మళ్లీ ఒక్కటైపోయి... డేటింగ్ల్లో మునిగిపోతూ... మాంచి మసాలా సినిమాను తలపిస్తున్నారు హాలీవుడ్ సూపర్‌స్టార్ జెన్నీఫర్ లారెన్స్, మ్యుజీషియన్ క్రిస్ మార్టిన్. రియల్ లైఫ్‌లో చాలా కాలం రొమాన్స్ చేసిన ఇద్దరూ.. అలా బ్రేకపయ్యారో లేదో... అంతలోనే ఒకరికొకరు దగ్గరైపోయారు. వినేత్కు బాగా క్లోజైపోయి జెన్నీఫర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నాడని... దాని ఫలితమే ఈ బ్రేకప్ అని ఓ వెబ్సైట్ కథనం. అయితే రోజైనా గడవక ముందే మార్టిన్ ఇంట్లో రెండు గంటలకు పైగా ఈ ముద్దుగుమ్మ స్పెండ్ చేసిందని సమాచారం.