బ్రిటీష్‌ సింగర్‌ నోట ‘జై శ్రీరామ్‌’.. వీడియో వైరల్‌ | This Is The Reason Chris Martin says Jai Shri Ram Video Viral | Sakshi
Sakshi News home page

బ్రిటీష్‌ సింగర్‌ నోట ‘జై శ్రీరామ్‌’.. వీడియో వైరల్‌

Published Sun, Jan 19 2025 1:58 PM | Last Updated on Sun, Jan 19 2025 2:44 PM

This Is The Reason Chris Martin says Jai Shri Ram Video Viral

బ్రిటిష్‌ సింగర్‌ క్రిస్‌ మార్టిన్‌ నోట ‘‘జై శ్రీరాం’’ అనే పదం వినిపించింది. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న ఆయన  శనివారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో తన బ్యాండ్‌ ‘కోల్డ్‌ప్లే’ బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఫిక్స్‌ యూ, ఏ స్కై ఫుల్‌ ఆఫ్‌ స్టార్స్‌తో యువతను ఉర్రుతలూగించారు. ఈ క్రమంలో..  

ప్రదర్శన ముగించే సమయానికి క్రిస్‌ మార్టిన్‌(Chris Martin) అక్కడున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై చూపించిన అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పట్టుకున్న ఫ్లకార్డుపై జై శ్రీరాం అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. అది చూసి ఆయన ‘‘జై శ్రీరామ్‌’’(Jai Shreeram) అనడంతో స్టేడియం మారుమోగిపోయింది. ఆపై ఆ పదం అర్థం ఏంటని? అక్కడున్నవాళ్లను అడిగి తెలుసుకున్నారు.    

బూమ్‌ బూమ్‌ బుమ్రా పేరు కూడా.. 
ప్రదర్శన ఇచ్చే టైంలో ఉన్నట్లుండి మార్టిన్‌ నోట జస్ప్రీత్‌ బుమ్రా పేరు ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘ఆగండి.. ప్రదర్శన అయిపోలేదు. చివరగా జస్ప్రీత్‌ బుమ్రా వచ్చి పాల్గొంటాడట’’ అని మార్టిన్‌ మైకులో చెప్పాడు. దీంతో అభిమానులు బుమ్రా నినాదాలతో హోరెత్తిపోయారు. అయితే అలాంటిదేం అదేం జరగకపోయినా.. క్రిస్‌ మార్టిన్‌ నోట బుమ్రా పేరు రావడంతో క్రికెట్‌ అభిమానులు మాత్రం ఖుషీ అయ్యారు.

ఇదిలా ఉంటే.. హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్(Dakota Johnson), క్రిస్‌ మార్టిన్‌ ప్రియురాలు. ఈ ఇద్దరూ భారత్ సందర్శనకు వచ్చారు. తాజాగా.. ముంబైలోని ప్రసిద్ధ శ్రీ భూల్‌నాథ్‌ ఆలయాన్ని ఈ జంట దర్శించుకుంది. ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించారు. క్రిస్ బ్లూ కుర్తాలో మెడపై రుద్రాక్ష మాలతో కనిపించాడు.  

 ఆలయంలో నంది చెవిలో మార్టిన్‌ తన మనసులోని కోరికను వినిపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు.. మార్టిన్‌, జాన్సన్‌లు ముంబైలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement