jai shri ram slogans
-
బ్రిటీష్ సింగర్ నోట ‘జై శ్రీరామ్’.. వీడియో వైరల్
బ్రిటిష్ సింగర్ క్రిస్ మార్టిన్ నోట ‘‘జై శ్రీరాం’’ అనే పదం వినిపించింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తన బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఫిక్స్ యూ, ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్‌తో యువతను ఉర్రుతలూగించారు. ఈ క్రమంలో.. ప్రదర్శన ముగించే సమయానికి క్రిస్ మార్టిన్(Chris Martin) అక్కడున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై చూపించిన అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పట్టుకున్న ఫ్లకార్డుపై జై శ్రీరాం అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. అది చూసి ఆయన ‘‘జై శ్రీరామ్’’(Jai Shreeram) అనడంతో స్టేడియం మారుమోగిపోయింది. ఆపై ఆ పదం అర్థం ఏంటని? అక్కడున్నవాళ్లను అడిగి తెలుసుకున్నారు. When Chris Martin said ‘Jai Shri Ram’ at Mumbai concert... the crowd went wild!#ChrisMartin #MumbaiConcert #ColdplayInIndia #JaiShriRam pic.twitter.com/yNeB6FcMOF— India Today NE (@IndiaTodayNE) January 19, 2025బూమ్ బూమ్ బుమ్రా పేరు కూడా.. ప్రదర్శన ఇచ్చే టైంలో ఉన్నట్లుండి మార్టిన్ నోట జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘ఆగండి.. ప్రదర్శన అయిపోలేదు. చివరగా జస్ప్రీత్ బుమ్రా వచ్చి పాల్గొంటాడట’’ అని మార్టిన్ మైకులో చెప్పాడు. దీంతో అభిమానులు బుమ్రా నినాదాలతో హోరెత్తిపోయారు. అయితే అలాంటిదేం అదేం జరగకపోయినా.. క్రిస్ మార్టిన్ నోట బుమ్రా పేరు రావడంతో క్రికెట్ అభిమానులు మాత్రం ఖుషీ అయ్యారు.Coldplay's Mumbai concert on Saturday was unforgettable for music lovers and cricket fans. During the performance, Chris Martin surprised the audience by mentioning India's star bowler, Jasprit Bumrah.#ColdplayMumbai #Coldplay #JaspritBumrah #ChrisMartin #MusicConcert pic.twitter.com/TMz2wscdkm— Mid Day (@mid_day) January 19, 2025ఇదిలా ఉంటే.. హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్(Dakota Johnson), క్రిస్ మార్టిన్ ప్రియురాలు. ఈ ఇద్దరూ భారత్ సందర్శనకు వచ్చారు. తాజాగా.. ముంబైలోని ప్రసిద్ధ శ్రీ భూల్‌నాథ్ ఆలయాన్ని ఈ జంట దర్శించుకుంది. ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించారు. క్రిస్ బ్లూ కుర్తాలో మెడపై రుద్రాక్ష మాలతో కనిపించాడు. Dakota Johnson telling her wishes in ear of Shri Nandi Maharaj. Amazing how foreign nationals come to India and try following our culture and traditions! #Coldplay #ChrisMartin #DakotaJohnson pic.twitter.com/0Dz19yXg5c— Priyanshi Bhargava (@PriyanshiBharg7) January 18, 2025 ఆలయంలో నంది చెవిలో మార్టిన్ తన మనసులోని కోరికను వినిపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు.. మార్టిన్, జాన్సన్‌లు ముంబైలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. -
పైలట్ నోట జై శ్రీరాం
న్యూఢిల్లీ: అయోధ్యలో శనివారం మొదలైన ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి తొలి విమానం బయల్దేరి వెళ్లింది. ఇండిగో విమానయాన సంస్థ తమ తొలి ఢిల్లీ–అయోధ్య విమానాన్ని శనివారం మధ్యాహ్నం ప్రారంభించింది. ఈ విమానంలోకి అడుగుపెడుతున్న ప్రయాణికులకు పైలట్ అశుతోష్ శేఖర్ .. ‘జై శ్రీరామ్’ అంటూ స్వాగతం పలికారు. ‘అయోధ్యకు బయల్దేరుతున్న తొలి విమానానికి సారథ్యం వహించే బాధ్యతలు నాకు అప్పగించడం నిజంగా నా అదృష్టం. మీ ప్రయాణం సాఫీగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్’ అని ఆయన విమానంలో అనౌన్స్ చేశారు. తమ తమ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రయాణ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. -
ఉదయనిధికి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తప్పుబట్టడంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధిని విషాన్నిచిమ్మే దోమగా బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ క్రికెటర్ రిజ్వాన్ ముందు అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ చర్యను సహించరానిదిగా పేర్కొన్నారు ఉదయనిధి. క్రీడా వేదికగా ద్వేషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఆటలు దేశాల మధ్య సోదరభావాన్ని పెంచాలని కోరారు. India is renowned for its sportsmanship and hospitality. However, the treatment meted out to Pakistan players at Narendra Modi Stadium in Ahmedabad is unacceptable and a new low. Sports should be a unifying force between countries, fostering true brotherhood. Using it as a tool… pic.twitter.com/MJnPJsERyK — Udhay (@Udhaystalin) October 14, 2023 ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవని మండిపడ్డారు. మైదానంలో నమాజ్ చేయడానికి ఆటను కాసేపు ఆపినప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం లేదా..? అంటూ ఉదయనిధిని ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా దుయ్యబట్టారు. రాముడు విశ్వంలో ప్రతి అణువునా ఉంటాడని పేర్కొన్న గౌరవ్ భాటియా.. జై శ్రీ రాం అనాలని ఉదయనిధికి హితువు పలికారు. नफ़रती डेंगू मलेरिया मच्छर फिर निकला है विष घोलने जब मैच रुकवा कर फील्ड पर नमाज़ पड़ी जाती है तो तुम्हें साँप सूँघ जाता है सृष्टि के हर कन कन मे हमारे प्रभु श्री राम बसते है, तो बोलो जय श्री राम 🙏#IndiavsPak pic.twitter.com/Tm7Ikxbtqw — Gaurav Bhatia गौरव भाटिया 🇮🇳 (@gauravbhatiabjp) October 15, 2023 పాక్ క్రికెటర్ల సమక్షంలో జై శ్రీరాం నినాదాలకు సంబంధించిన వీడియోలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. అభిమానుల చర్య క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని, క్రికెటర్‌పై వేధింపులుగా కొందరు భావించారు. అదే క్రమంలో యుద్ధంలో గాజాకు సంఘీభావం తెలుపుతూ మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేశాడని మరికొందరు స్పందించారు. మైదానంలోకి మతాన్ని తీసుకురావడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇదీ చదవండి పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి -
లోక్‌సభలో 'జై శ్రీరాం' నినాదాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మలివిడత ప్రస్తుతం జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం నాడు సభ సమావేశం అయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలోకి అడుగు పెడుతుండగా.. ఒక్కసారిగా బీజేపీ సభ్యులు ఆయనను 'జై శ్రీరాం', 'మోదీ.. మోదీ' అంటూ స్వాగతించారు. సాధారణంగా ప్రధానమంత్రి, ఇతర సీనియర్ నాయకులు ఎవరైనా సభలోకి వస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడటం, నమస్కారం పెట్టడం లాంటివి కనిపిస్తాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రెండు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించి, మరో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా ఏర్పాటుచేసిన నేపథ్యంలో.. మోదీని అభినందించేందుకు బీజేపీ ఎంపీలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. బుధవారం నాడు లోక్‌సభ సమావేశమైన వెంటనే ముందుగా లోక్‌సభ మాజీ సభ్యుడు భూమా నాగిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అవుతుండగా మోదీ సభలోకి వచ్చారు. ఆయనతోపాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్ఇర అనంతకుమార్, బీజేపీ చీఫ్ విప్ రాకేష్ సింగ్ కూడా వచ్చారు. దాంతో బీజేపీ సభ్యులంతా ఒక్కసారిగా బల్లలు చరుస్తూ, 'జై శ్రీరాం' అంటూ ఆయనకు స్వాగతం పలికారు. అలా దాదాపు రెండు నిమిషాల పాటు మోదీ.. మోదీ అనే నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంత ఘన స్వాగతం అందుకున్న మోదీ.. సభలో మాత్రం కొద్దిసేపే ఉన్నారు.