ఉదయనిధికి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ | BJP Responds On DMK Leader Udhayanidhi Stalin Comments On Jai Shri Ram Slogans In IND Vs PAK, Creates Controversy - Sakshi
Sakshi News home page

జై శ్రీరాం నినాదాలపై ఉదయనిధి వ్యాఖ్యలు.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్

Published Mon, Oct 16 2023 4:27 PM | Last Updated on Mon, Oct 16 2023 5:03 PM

BJP Responds On DMK Leader Slams Jai Shri Ram Slogans  - Sakshi

ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తప్పుబట్టడంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధిని విషాన్నిచిమ్మే దోమగా బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. 

గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-పాక్ మ్యాచ్‌ సందర్భంగా పాక్ క్రికెటర్ రిజ్వాన్ ముందు అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ చర్యను సహించరానిదిగా పేర్కొన్నారు ఉదయనిధి. క్రీడా వేదికగా ద్వేషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఆటలు దేశాల మధ్య సోదరభావాన్ని పెంచాలని కోరారు. 

ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవని మండిపడ్డారు. మైదానంలో నమాజ్ చేయడానికి ఆటను కాసేపు ఆపినప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం లేదా..? అంటూ ఉదయనిధిని ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా దుయ్యబట్టారు. రాముడు విశ్వంలో ప్రతి అణువునా ఉంటాడని పేర్కొన్న గౌరవ్ భాటియా.. జై శ్రీ రాం అనాలని ఉదయనిధికి హితువు పలికారు.

పాక్ క్రికెటర్ల సమక్షంలో జై శ్రీరాం నినాదాలకు సంబంధించిన వీడియోలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. అభిమానుల చర్య క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని, క్రికెటర్‌పై వేధింపులుగా కొందరు భావించారు. అదే క్రమంలో యుద్ధంలో గాజాకు సంఘీభావం తెలుపుతూ మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేశాడని మరికొందరు స్పందించారు. మైదానంలోకి మతాన్ని తీసుకురావడంపై నెటిజన్లు మండిపడ్డారు.  

ఇదీ చదవండి పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement