Match
-
ఆ జట్టులో నితీశ్ రెడ్డి లేడు కారణం అదేనా
-
రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన రోహిత్...
-
IND vs AUS:పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం
-
పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్
-
ఉప్పల్ మ్యాచ్ పై VHP కీలక వార్నింగ్
-
భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్ నెలకొంది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరో వైపు, మ్యాచ్‌ను అడ్డుకుంటామంటూ వీహెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో స్టేడియం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ వెల్లడించారు.ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుభారత్– బంగ్లాదేశ్‌ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.ఇదీ చదవండి: ఉప్పల్‌లో గెలుపెవరిదో!వరంగల్ వైపు నుంచి ఎల్బీనగర్ వెళ్లాల్సిన వారు ఉప్పల్ ఏషియన్ ధియేటర్ ఎదురుగా భగాయత్ రోడ్డు నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి ఏషియన్ ధియేటర్ మీదుగా బోడుప్పల్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. రామంపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్ 972 వద్ద యూ టర్న్ తీసుకుని ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు చేరుకోవాలి. -
అనంతపూర్ లో క్రికెట్ సందడి
-
వింబుల్డన్ మ్యాచ్‌లో సందడి చేసిన గేమ్ ఛేంజర్ భామ.. ఫోటోలు
-
India vs Bangladesh Photos : 50 పరుగులతో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
పాక్‌పై విజయం: ‘వన్ విత్ నేచర్’ అంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (ఫొటోలు)
-
తెలుగు కుర్రాడు అరుదైన ఘనత.. నితీష్ రెడ్డి టీమిండియాలోకి ఎంట్రీ ..!
-
అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు..!
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ గేమ్‌లో అర్జున్ 45 ఎత్తుల్లో ఎల్తాజ్ సఫారిల్ (అజర్బైజాన్)పై గెలిచాడు.రెండో రౌండ్ గేమ్‌లో అర్జున్ 28 ఎత్తుల్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ తొలి గేమ్‌లో 28 ఎత్తుల్లో అభినవ్ మిశ్రా (అమెరికా) చేతిలో ఓడిపోయి... లియోన్ మెండోకా (భారత్)తో జరిగిన రెండో గేమ్‌ను 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట! -
Anchor Sreemukhi: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
-
చెపాక్‌లోనూ లక్నో చేతిలో చెన్నైకి భంగపాటు!
-
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
-
గుజరాత్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ ఘన విజయం (ఫొటోలు)
-
లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్!
‘ఎక్స్’యూజర్ పృథ్వీ తన చిన్నారి మేనకోడలు వర్క్‌బుక్ నుంచి పోస్ట్ చేసిన స్నాప్‌చాట్ నెట్‌లోకంలో నవ్వులు పూయిస్తోంది. ఈ వర్క్‌బుక్‌లో‘మ్యాచ్ ది ఫాలోయింగ్’ శీర్షిక కింద ఎడమవైపు ప్రముఖుల పేరు, కుడివైపు ఆయా రంగాలకు సంబంధించిన బొమ్మలు ఇచ్చారు. ఏ వ్యక్తి ఏ రంగానికి చెందిన వారో జత చేయాలి. విరాట్ కోహ్లీ–క్రికెటర్, లతా మంగేష్కర్–సింగర్... ఇలా అన్నిటికీ కరెక్ట్‌గానే జత చేసింది ఆరు సంవత్సరాల చిన్నారి. అయితే లియాండర్ పేస్ దగ్గరే వచ్చింది పేచీ. ప్రభుదేవాతో పాటు లియాండర్ పేస్‌ను కూడా డ్యాన్సర్‌ని చేసింది. ఇది చూసి సరదాకారులు ఊరుకుంటారా ఏమిటి? మీమ్సే మీమ్స్! -
నాలుగేళ్ల క్రితం మ్యాచ్ కు ఇప్పుడు ఇంత క్రేజా..?
-
ఈనెల 25న భారత్ Vs ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం
-
ఐపీఎల్ మినీ వేలం 2023
-
భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ!
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య పోరు ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. యూపీలోని అమేథీకి చెందిన ఒక చిరు తినుబండారాల వ్యాపారి ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే తాను స్థానికులకు చాట్ ఉచితంగా పంచుతానని ప్రకటించాడు. దీనిని సంబంధించిన ప్రకటనను కూడా దుకాణం వద్ద అతికించాడు. అమేథీలోని గౌరీగంజ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర గుప్తాకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. క్రికెట్లో రాణిస్తూ జిల్లా స్థాయిలో వివిధ టోర్నమెంట్లలో కూడా ఆడాడు. సురేంద్ర తన దుకాణం వద్ద ఒక పోస్టర్ అతికించాడు. భారత్ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచిన తర్వాత సోమవారం ఉదయం 10 గంటల నుంచి తన వద్ద సరుకు ఉన్నంతవరకు, కస్టమర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చాట్ ఉచితంగా పంపిణీ చేస్తానని ప్రకటించాడు. ఇది కూడా చదవండి: పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది? -
మ్యాచ్ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో..
ఈరోజు (ఆదివారం) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు పబ్‌లు, రెస్టారెంట్లలో క్రీడాప్రియులు మ్యాచ్‌ను మరింత ఉత్సాహంతో తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేయడం మొదలుకొని ప్రత్యేక పానీయాలు అందించడం వరకు అన్నింటినీ అందుబాటులో ఉంచారు. ప్రపంచ కప్ ఫైనల్‌ను క్యాష్ చేసుకునేందుకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని పలు పబ్‌లు, రెస్టారెంట్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన టీమ్ఇండియా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ‘ఎస్ మినిస్టర్ - పబ్ అండ్ కిచెన్’ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇది బిగ్ మ్యాచ్ కావడంతో ‘కవర్ ఛార్జీ’గా మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నాం. సాధారణ రోజుల్లో, మేము దీనిని వసూలు చేయం. ఫైనల్ మ్యాచ్ అయినందున ఇంత రేటును వసూలు చేస్తున్నాం. దీనిని ఆహారానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది’ అని అన్నారు. కాగా బ్లూ జెర్సీ ధరించి వచ్చే వారి కోసం ‘బీర్ కేఫ్’లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీర్ కేఫ్ వ్యవస్థాపకుడు రాహుల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరడంతో ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న మా అవుట్లెట్లలో అభిమానులను స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెద్ద స్క్రీన్లపై మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. టీమ్ ఇండియా జెర్సీ ధరించి వచ్చిన వారికి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాం’ అని అన్నారు. హర్యానాలోని సైబర్ సిటీ ఆఫ్ గురుగ్రామ్‌లోని ‘సోయి 7 పబ్’, ‘బ్రూవరీ’లలో క్రీడాభిమానులు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘సోయి 7 పబ్’కి చెందిన లలిత్ అహ్లావత్ మాట్లాడుతూ ‘మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి మూడు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశాం. సైబర్ సిటీలో అతిపెద్ద వేదిక ఏర్పాటు చేశాం. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్‌కు అనుష్క శర్మ -
మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్‌కు అనుష్క శర్మ
బాలీవుడ్నటి అనుష్క శర్మ మరోమారు గర్భం దాల్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో అనుష్కశర్మ బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. అనుష్కకు సంబంధించి తాజా వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆమె గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆమెతో పాటు కుమార్తె వామికా కోహ్లీ కూడా ఉంది. ఒక అభిమాని షేర్ చేసిన ఈ వీడియోలో మొదట వామికా కోహ్లీ, తరువాత అనుష్క శర్మ ప్రైవేట్ విమానం నుంచి తెల్లటి సూట్లో బయటకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్..‘ఫైనల్ మ్యాచ్ కోసం అనుష్క శర్మ కుమార్తె వామికాతోపాటు అహ్మదాబాద్ చేరుకున్నారు’ అని రాశారు. కాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిది? అనేది స్పష్టం కా లేదు. నవంబర్ 19న భారత్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది కూడా చూడండి: భారత్-ఆసీస్ ఫైనల్ పోరు.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే? Anushka Sharma has arrived at Ahmedabad for the finals with Vamika #INDvsAUS #WorldcupFinal#AUSvsSA #SAvsAUS #CWC23#ViratKohli𓃵 #RohithSharma#NarendraModiStadium#anushkasharmapic.twitter.com/U0FsYm6TDs — 𝑴𝑺 𝑭𝑶𝑶𝑻𝑪𝑹𝑰𝑪 ⚽🏏 (@IFootcric68275) November 18, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ
అహ్మదాబాద్: క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వైదికైంది. ఈ మ్యాచ్‌ను చూడటానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరు కానున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు రానున్న నేపథ్యంంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మ్యాచ్ నిర్వహణకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. మ్యాచ్ సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. మ్యాచ్ సందర్భంగా మొత్తం 4,500 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభిమానులకు ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోదీ స్టేడియం వైపు మెట్రో రైళ్ల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం మ్యాచ్‌కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోను నిర్వహించనున్నారు. మిడ్-ఇన్నింగ్స్‌లో కంపోజర్ ప్రీతమ్ ప్రదర్శనతో సహా అనేక ఈవెంట్లు నిర్వహించనున్నారు. వింగ్ కమాండర్ సిదేశ్ కార్తిక్ నేతృత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తొమ్మిది విమానాలు వైమానిక ప్రదర్శన నిర్వహిస్తాయి. మ్యాచ్ టాస్ వేసిన తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం పైన ఎయిర్ షో ప్రదర్శిస్తాయి. ఇప్పటివరకు ప్రపంచ వరల్డ్‌కప్‌లలో విజయం సాధించిన జట్ల కెప్టెన్లందర్ని బీసీసీఐ సత్కరించనుంది. సంగీత స్వరకర్త ప్రీతమ్ లైవ్ షో నిర్వహించనున్నారు. 500 కంటే ఎక్కువ మంది డ్యాన్సర్లతో ఈ ప్రదర్శన జరగనుంది. మ్యాచ్ సందర్భంగా స్డేడియం విద్యుత్ వెలుగులతో మెరిసిపోనుంది. ఇందుకోసం యూకే నుంచి ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇదీ చదవండి: జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం.. -
ఉదయనిధికి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తప్పుబట్టడంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధిని విషాన్నిచిమ్మే దోమగా బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ క్రికెటర్ రిజ్వాన్ ముందు అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ చర్యను సహించరానిదిగా పేర్కొన్నారు ఉదయనిధి. క్రీడా వేదికగా ద్వేషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఆటలు దేశాల మధ్య సోదరభావాన్ని పెంచాలని కోరారు. India is renowned for its sportsmanship and hospitality. However, the treatment meted out to Pakistan players at Narendra Modi Stadium in Ahmedabad is unacceptable and a new low. Sports should be a unifying force between countries, fostering true brotherhood. Using it as a tool… pic.twitter.com/MJnPJsERyK — Udhay (@Udhaystalin) October 14, 2023 ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవని మండిపడ్డారు. మైదానంలో నమాజ్ చేయడానికి ఆటను కాసేపు ఆపినప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం లేదా..? అంటూ ఉదయనిధిని ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా దుయ్యబట్టారు. రాముడు విశ్వంలో ప్రతి అణువునా ఉంటాడని పేర్కొన్న గౌరవ్ భాటియా.. జై శ్రీ రాం అనాలని ఉదయనిధికి హితువు పలికారు. नफ़रती डेंगू मलेरिया मच्छर फिर निकला है विष घोलने जब मैच रुकवा कर फील्ड पर नमाज़ पड़ी जाती है तो तुम्हें साँप सूँघ जाता है सृष्टि के हर कन कन मे हमारे प्रभु श्री राम बसते है, तो बोलो जय श्री राम 🙏#IndiavsPak pic.twitter.com/Tm7Ikxbtqw — Gaurav Bhatia गौरव भाटिया 🇮🇳 (@gauravbhatiabjp) October 15, 2023 పాక్ క్రికెటర్ల సమక్షంలో జై శ్రీరాం నినాదాలకు సంబంధించిన వీడియోలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. అభిమానుల చర్య క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని, క్రికెటర్‌పై వేధింపులుగా కొందరు భావించారు. అదే క్రమంలో యుద్ధంలో గాజాకు సంఘీభావం తెలుపుతూ మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేశాడని మరికొందరు స్పందించారు. మైదానంలోకి మతాన్ని తీసుకురావడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇదీ చదవండి పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి