ఆంధ్ర పరాజయం | Ranji Trophy, Group B: Uttar Pradesh stun Andhra by 56 runs | Sakshi
Sakshi News home page

ఆంధ్ర పరాజయం

Published Mon, Oct 26 2015 2:19 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

Ranji Trophy, Group B: Uttar Pradesh stun Andhra by 56 runs

ఒంగోలు: బ్యాట్స్‌మెన్ తడబాటుతో... ఉత్తరప్రదేశ్ (యూపీ)తో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 56 పరుగుల తేడాతో ఓడిపోయింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్‌లో ఆంధ్ర జట్టుకిదే తొలి పరాజయం కావడం గమనార్హం. అంతకుముందు ఆడిన తొలి మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతోపాటు ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది.

ఆట నాలుగోరోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 26/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టును బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ (5/35) హడలెత్తించాడు. దాంతో ఆంధ్ర జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలోనే ఆలౌటైంది. ఈ గెలుపుతో ఉత్తరప్రదేశ్‌కు ఆరు పాయింట్లు లభించాయి. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 30నుంచి పాటియాలాలో పంజాబ్‌తో ఆడుతుంది.
 
సంక్షిప్త స్కోర్లు
ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 170; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 297; ఉత్తరప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: 309; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: 126 (47.3 ఓవర్లలో) (భరత్ 16, రికీ భుయ్ 12, శివ కుమార్ 15, ప్రదీప్ 10, అయ్యప్ప 17, విజయ్ కుమార్ 28, అంకిత్ రాజ్‌పుత్ 5/35, అమిత్ మిశ్రా 2/21, కుల్‌దీప్ యాదవ్ 2/15).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement