Batsman
-
75వ వసంతంలోకి టీమిండియా దిగ్గజం.. హ్యాపీ బర్త్‌డే సన్నీ! (ఫొటోలు)
-
ఐపీఎల్లో స్పాన్స్‌ర్డ్ కార్కి బాల్ తగిలితే ఏమవుతుందో తెలుసా..!
ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే స్టేడియంలోని డిస్ప్లేలో స్పాన్సర్డ్ కార్లు ఉంటాయి. అక్కడ మనకు పెద్ద బ్రాండ్ల కార్లు వినబడవు కేవలం సామాన్యుడి అవసరానికి అనుగుణంగా కార్లను డిజైన్ చేసే టాటా బ్రాండ్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఐపీఎల్ స్టేడియం డిస్ప్లేలో టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి. ఈ కార్లకు గనుక బ్యాట్స్‌మ్యాన్ కొట్టే సిక్స్ షార్ట్‌లో బంతి ఈ స్పాన్సర్డ్ కార్లకు తగిలితే ఏం జరుగుతుందో తెలుసా..!బ్యాట్స్‌మ్యాన్ విధ్వంసకర బ్యాటింగ్‌లో డిస్ప్లేలో ఉన్న స్పాన్సర్డ్ కారు విండో పగిలేలా సిక్స్ కొడితే..ఆ ఆటగాడు పేద ప్రజలకు సాయం చేసినట్లే. ఇదేంటదీ.. కారు విండో పగిలిపోయేలా.. బంతి కొడితే పేద ప్రజలకు సాయం ఎలా అందుతుంది..?.అనుకోకండి ఎందుకంటే?..స్టేడియంలో ప్రదర్శించే టాటా టియాగో ఎలక్రిక్ కార్లను బంతిని తాకిన ప్రతిసారి టాటా కంపెనీ పేదప్రజలకు రూ.5 లక్షల విరాళం అందిస్తామని ప్రకటించింది.అయితే ఇలాంటి ఘటన 2019లో ప్రారంభ ఐపీఎల్ మహిళ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విమెన్స్కి యూపీ వారియర్స్ విమెన్స్కి మధ్య మ్యాచ్ సందర్భరంగా ఈ ఘటన జరిగింది. రాయల్ ఛాలెంజర్స్‌కి చెందిన ఎల్లీస్ పెర్రీ డీప్ మిడ్‌వికెట్ బౌండరీ సిక్స్ కొట్టింది. ఆ క్రమంలో బంతి వెళ్లి డిస్ప్లేలో ఉన్న టాటా ఎలక్ట్రిక్ కారుకి తగిలింది. అంతే ఒక్కసారిగా స్టేడియం దద్ధరిల్లేలా హర్షధ్వానాలు వచ్చాయి. వెంటనే టాటా తాను అన్నమాటను నిలబెట్టుకుంటూ..టాటా మెమోరియల్ హాస్పిటల్స్‌లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ. 5 లక్షల విరాళం అందజేసింది. ఇలా క్రీడాకారుడు బంతిని ఎలక్ట్రిక్ కారుకి తగిలేలా చేసిన ప్రతిసారి ఇస్తామని టాటా కంపెనీ పేర్కొంది. ఇలా బ్యాటింగ్ చేసిన వ్యక్తులు ఎవరంటే..చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మధ్య జరిగిన మ్యాచ్‌లో టియాగో ఎలక్రికట్ కారుని మొదటగా రుతురాజ్ గైక్వాడ్ సిక్స్ కొట్టే షార్ట్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో నెహాల్ వధేరా ఎలక్ట్రిక్ కారును బంతితో కొట్టాడు.ఇదిలా ఉండగా, టాటా 2019 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లలో తన ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శిస్తుంది. 2022 నుంచి, టాటా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా మారింది. ఐతే అంతకుమునుపు ఏడాదిలో ఐపీఎల్ మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) టైటిల్‌కి స్పాన్సర్‌గా ఉంది. ఇలా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే మొత్తం 12 స్టేడియంలలో టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్లు ప్రదర్శనకు ఉంచుతుంది టాటా కంపెనీ. ఈ క్రికెట్ గేమ్‌ని ఫ్లాట్‌ఫాంగా చేసుకుని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహంచడమే టాటా ప్రధాన లక్ష్యం. అందుకే ఇలాంటి కార్యక్రమాను చేపడుతోంది టాటా కంపెనీ. అంతేగాదు భారతదేశంలో అత్యంత వేగంగా బుక్ చేయబడిన ఎలక్ట్రిక్ కారుగా ఈ బ్రాండే నిలిచింది కూడా. Ellyse Perry breaks the window of the Tata Punch.ev in the WPL pic.twitter.com/FnnOAYQ8d0— MotorOctane (@MotorOctane) March 4, 2024 (చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..) -
'అయ్యో శివుడా ఏమాయే'.. ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడితే!
భారత్‌లో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఏ గల్లీ చూసినా చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా బ్యాట్ పట్టుడు.. బంతి కొట్టుడు అన్న తరహాలో ఉంటారు. ఇక చిన్న ఖాళీ ప్రదేశం కనబడితే చాలు ఆరోజుకు అది మాదే అనేలా జెండా పాతేస్తారు. ఇక అది ఏ గ్రౌండ్ అయినా కానీయండి క్రికెట్ మా కింకర్తవ్యం అన్నట్లుగా ఆడేస్తుంటారు. మరి ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి. విషయంలోకి వెళితే.. ఎక్కడో తెలియదు కానీ కొంతమంది గ్రూప్ కలిసి ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడారు. బౌలర్ వేసిన బంతిని షాట్ ఆడి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని మాత్రమే గమనించిన బ్యాటర్ ఎదురుగా ఉన్న గోల్‌పోస్ట్‌ను గమనించలేదు. ఇంకేముంది నేరుగా వెళ్లి గోల్‌పోస్ట్‌కు గుద్దుకున్నాడు. పాపం దెబ్బ గట్టిగా తగలడంతో అక్కడే పడిపోయాడు. తోటివాళ్లు వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లారు. అయితే దెబ్బ తాకిన వ్యక్తి నొప్పితో విలవిల్లాలాడుతుంటే మిగతావాళ్లు నవ్వుకోవడం కనిపించింది. ఎంతైనా ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడడమే తప్పు.. పైగా గోల్‌పోస్ట్ పక్కనుంచి వికెట్ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఏదైనా ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వు రాకుండా మాత్రం ఉండదు. వీలైతే ఒక లుక్కేయండి. pic.twitter.com/x6nZCTyulh — Out Of Context Cricket (@GemsOfCricket) June 24, 2023 చదవండి: డేంజర్ జోన్లో విండీస్.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా? అధికారుల కన్నెర్ర.. నెయ్మర్కు దెబ్బ మీద దెబ్బ -
బౌండరీ కొట్టాలని చూశాడు.. దురదృష్టం వెంటాడింది
Batsman Bizzare Dismissal Became Viral In ECS T10 league.. క్రికెట్లో బ్యాట్స్‌మెన్ ఫన్నీవేలో ఔటవ్వడం చాలానే చూసుంటాం. కొన్నిసార్లు నవ్వొస్తో.. మరికొన్ని సార్లు జాలిపడ్డాం. తాజాగా యూరోపియన్ క్రికెట్ సిరీస్ టి10లీగ్‌లోనూ ఇలాంటిదే చోటుచేసుకుంది. మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ ఫైన్‌లెగ్ దిశగా బౌండరీ కొట్టాలని చూశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. టైమ్‌లైన్ మిస్ కావడంతో బ్యాట్ ఎడ్జ్ తగిలిన బంతి కీపర్ హెల్మెట్‌కు తాకి థర్డ్‌మన్ దిశగా వెళ్లింది. అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో బ్యాట్స్‌మన్ ఔటయ్యాడు. రూల్స్ ప్రకారం బంతి నేలను తాకక ముందు ఎక్కడ తగిలినప్పటికి ఫీల్డర్ క్యాచ్ పడితే అది ఔట్‌గా పరిగణిస్తారు. దీంతో చేసేదేంలేక బ్యాట్స్‌మన్ భారంగా వెనుదిరిగాడు. అయితే అంపైర్లు మాత్రం మొదట బ్యాటర్ ఔట్ కాదనుకున్నారు. కానీ రిప్లైలో చూస్తే ఔట్ అని స్పష్టంగా కనిపించింది. అయితే ఇలాంటి విచిత్రమైన ఔట్ ఎప్పుడు చూడలేదని మ్యాచ్ అనంతరం అంపైర్లు పేర్కొనడం ఫన్నీగా అనిపించంది. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The @EuropeanCricket League is the gift that just keeps on giving! 😂pic.twitter.com/XW70ldMMjS — That’s so Village (@ThatsSoVillage) November 25, 2021 -
ఇక ‘బ్యాట్స్‌మన్’ కాదు.. బ్యాటర్!
Batter Instead Of Batsman: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిబంధనలను రూపొందించే మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఒక కీలక మార్పు చేసింది. కేవలం పురుష ఆటగాడినే గుర్తు చేసే ‘బ్యాట్స్‌మన్’కు బదులుగా ఇకపై మహిళలకు కూడా ఉపయోగించే విధంగా ‘బ్యాటర్’ పదాన్ని చేర్చాలని నిర్ణయించింది. క్రీడల్లో లింగ వివక్ష ఉండరాదని, సాంకేతిక పదాల్లో కూడా అది కనిపించరాదనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్లు ఎంసీసీ ప్రకటించింది. ఇదే తరహాలో ‘బ్యాట్స్‌మెన్’ స్థానంలో ‘బ్యాటర్స్’ అని వ్యవహరిస్తారు. చదవండి: సంపాదనలో మెస్సీని దాటేశాడు.. ఏడాదికి 922 కోట్లు అర్జిస్తున్నాడు -
క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పు.. ఇకపై వారిని అలా పిలువరాదు
లండన్: క్రికెట్లో లింగభేదానికి తావు లేకుండా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పురుష క్రికెటర్లను మాత్రమే సంబోధించే బ్యాట్స్‌మన్ అన్న పదాన్ని తొలగించి మహిళలు, పురుషులకు కామన్‌గా వర్తించేలా బ్యాటర్ అన్న పదాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బుధవారం ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ ప్రతిపాదన ఎంసీసీ పరిశీలనలో ఉండగా.. తాజాగా ఆమోదించబడింది. లింగభేదం లేని పదాన్ని ఉపయోగించడం వల్ల క్రికెట్ అందరి క్రీడ అని మరోసారి నిరూపించబడుతుందని ఎంసీసీ విశ్వసిస్తోంది. లింగభేదం లేని పదాలు వాడటం వల్ల మరింత మంది మహిళలు క్రికెట్ పట్ల ఆకర్షితులవుతారని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, క్రికెట్‌కు సంబంధించి లింగభేదానికి ఆస్కారముండే థర్డ్ మ్యాన్, నైట్ వాచ్‌మన్, జెంటిల్మెన్ వంటి పదాలపై ఎంసీసీ ఎలాంటి కామెంట్లు చేయకపోవడం విశేషం. చదవండి: కెప్టెన్సీ విషయంలో వారిద్దరికీ పట్టిన గతే కోహ్లికి కూడా పట్టవచ్చు..! -
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా బ్యాట్స్‌మెన్ రికార్డులు
-
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. దుమ్మురేపిన పంత్
దుబాయ్: ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. తాజాగా ప్రకటించిన బ్యాట్స్‌మన్ ర్యాంకుల్లో పంత్ 7వ స్థానానికి చేరుకున్నాడు. తన మెరుపు శతకంతో పంత్ ఏడు స్ధానాలు మెరుగుపర్చుకోవడం విశేషం. 747 రేటింగ్ పాయింట్లతో ఇదే స్థానంలో ఉన్న రోహిత్ శర్మ, హెన్రీ నికోల్స్‌లతో పంత్ సమంగా నిలిచాడు. ఐసీసీ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో ఒక భారత వికెట్ కీపర్ టాప్–10లో నిలవడం ఇదే మొదటిసారి కాగా... అత్యుత్తమ రేటింగ్ (747) కూడా ఇదే కావడం మరో విశేషం. ఈ జాబితాలో విలియమ్సన్ (919) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా...విరాట్ కోహ్లి (5వ) తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో పోరులో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన అతను 850 రేటింగ్ పాయింట్లతో 2017 ఆగస్టు తర్వాత మొదటిసారి రెండో ర్యాంక్‌ను అందుకోగలిగాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి బుమ్రా 10వ స్థానంలో నిలవగా, ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ (353 పాయింట్లు) నాలుగో స్థానాన్ని అందుకోవడం విశేషం. టి20ల్లో రెండో ర్యాంక్‌కు... ఐసీసీ టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు (268 రేటింగ్) రెండో స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో అప్పటి వరకు రెండో స్ధానంలో ఉన్న ఆస్ట్రేలియా (267)...మూడుకు పడిపోగా భారత్ ముందంజ వేసింది. ఇంగ్లండ్ (275) నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. టి20 బ్యాట్స్‌మన్ టాప్–10 ర్యాంకుల్లో భారత్ నుంచి రాహుల్ (2), కోహ్లి (6) ఉండగా...బౌలర్, ఆల్‌రౌండర్ జాబితాలో ఎవరికీ చోటు దక్కలేదు. -
ఈ సారథ్యం నాకొద్దు
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ (డీకే) ఐపీఎల్–13 సీజన్ మధ్యలో అనూహ్యంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే అతనీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 2018 నుంచి కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కార్తీక్ కెప్టెన్సీకి బైబై చెబుతూనే నూతన సారథిగా ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్‌ను నియమించాలని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరాడు. అతను కోరినట్లే కోల్‌కతా ఫ్రాంచైజీ మోర్గాన్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో మోర్గాన్ సారథ్యంలోనే ఇంగ్లండ్ విశ్వవిజేత అయ్యింది. ‘బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు... జట్టుకు మరెంతో చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని కార్తీక్ చెప్పినట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. అతని నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని, అయినాసరే తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని టీమ్ సీఈఓ వెంకీ మైసూర్ తెలి పారు. ‘జట్టు గురించే ఆలోచించే కార్తీక్‌లాంటి నాయకుడు ఉండటం మా అదృష్టం. ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు ఎంతో ధైర్యం కావాలి. ఈ సీజన్లో కార్తీక్, మోర్గాన్ కలిసి అద్భుతంగా పనిచేస్తున్నారు. అలాగే మోర్గాన్ సారథిగానూ విజయవంతం కావాలి. ఈ తాజా మార్పువల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఆశిస్తున్నాం. రెండేళ్లుగా జట్టును నడిపించిన కార్తీక్‌కు అభినందనలు’ అని ఆయన తెలిపారు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇంగ్లండ్ క్రికెటర్ ఓ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడు కావడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఇంగ్లండ్‌కే చెందిన కెవిన్ పీటర్సన్ 17 మ్యాచ్‌ల్లో సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 2009లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆరు మ్యాచ్‌ల్లో... 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు 11 మ్యాచ్‌ల్లో పీటర్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
ఛీ.. క్రీడాస్పూర్తి మరిచిన బౌలర్!
లండన్ : ఇంగ్లండ్ లోకల్ క్రికెట్ లీగ్‌లో ఓ బౌలర్ క్రీడా స్పూర్తి మరిచి క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సదరు బౌలర్, లీగ్ నిర్వాహకులపై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. విజయానికి రెండు పరుగులు .. 98 పరుగులతో బ్యాట్స్‌మన్ కెరీర్లో తొలి సెంచరీకి చేరువగా ఉన్నాడు.. కానీ బౌలర్ మాత్రం క్రీడాస్పూర్తిని మరిచి, కావాలనే నోబాల్ వేసి బంతి బౌండరీకి వెళ్లేలా చేశాడు. దీంతో తొలి సెంచరీ చేయాలనుకున్న బ్యాట్స్‌మన్ నిరాశగా వెనుదిరిగాడు. సొమరెస్ట్ క్రికెట్ లీగ్‌లో భాగంగా మైన్‌హెడ్ క్రికెట్ క్లబ్, పర్నెల్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మైన్‌హెడ్ బ్యాట్స్‌మన్ జాయ్ డారెల్ సెంచరీకి దగ్గరగా ఉండగా.. పర్నెల్ జట్టు బౌలర్ అమానుషంగా ప్రవర్తించి నోబాల్‌తో సెంచరీ అడ్డుకున్నాడు. ఈ ఘటనపై మైన్‌హెడ్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితంలో క్రికెట్లోనే ఇదో అత్యంత చెత్త ఘటనగా అభివర్ణిస్తూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఇక పర్నెల్ జట్టు కెప్టెన్ మాత్రం బ్యాట్స్‌మన్‌కు క్షమాపణలు తెలిపినట్లు మైన్‌హెడ్ క్రికెట్ క్లబ్ పేర్కొంది. క్రికెట్ జెంటిల్ మెన్ గేమ్ అని ఆటగాళ్లు క్రీడాస్పూర్తిని మరచి ప్రవర్తించకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ క్రికెట్‌లోను చోటుచేసుకున్నాయి. 2010లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీని అడ్డుకోని శ్రీలంక బౌలర్ సురజ్ రన్దీవ్ క్రీడాస్పూర్తిని మరిచి విమర్శల పాలయ్యాడు. 99 పరుగుల వద్ద ఉన్న సెహ్వాగ్‌ను పరుగుతీయనివ్వకుండా నోబాల్ వేసి అడ్డుకున్నాడు. దీంతో ఓ మ్యాచ్ నిషేదం కూడా ఎదుర్కొన్నాడు. కరేబియన్ ప్రిమీయర్ లీగ్‌లో కీరన్ పోలార్డ్, ఎవిన్ లూయిస్ శతకాన్ని అడ్డుకోని ఇలానే విమర్శల పాలయ్యాడు. -
భారత్ ‘ఎ’ తడబాటు
వర్సెస్టర్: బ్యాట్స్‌మెన్ వైఫ్యలంతో భారత్ ‘ఎ’ కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ‘ఎ’తో ఇక్కడ జరుగుతోన్న అనధికారిక నాలుగు రోజుల టెస్టులో మంగళవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. యువ సంచలనం పృథ్వీ షా (82 బంతుల్లో 62; 8 ఫోర్లు) చక్కటి అర్ధశతకం సాధించినా... మురళీ విజయ్ (8), మయాంక్ అగర్వాల్ (0), కెప్టెన్ కరుణ్ నాయర్ (4) కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అజింక్య రహానే (26 బ్యాటింగ్; 3 ఫోర్లు), రిషభ్ పంత్ (37 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించి పోరాడుతున్నారు. అంతకుముందు 310/2 తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 128.5 ఓవర్లలో 423 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజే భారీ శతకం చేసిన అలిస్టర్ కుక్... వ్యక్తిగత స్కోరు 180 వద్ద ఔటయ్యాడు. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (4/79)తో పాటు స్పిన్నర్ షాబాజ్ నదీమ్ (3/46) రాణించారు. -
సిక్సర్ వయా బౌలర్ హెడ్!
ఆక్లాండ్: క్రికెట్లో ఇకపై బౌలర్లు కూడా హెల్మెట్ పెట్టుకొని బంతులు వేయాల్సిన సమయం వచ్చిందేమో! న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో జరిగిన తాజా సంఘటన అలాంటి ఆందోళనకు కారణంగా మారింది. బ్యాట్స్‌మన్ ఆడిన బంతి నేరుగా బౌలర్ తలకు తగిలి ఆ తర్వాత సిక్సర్‌గా మారిన అనూహ్య ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఫోర్డ్ వన్డే ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్, కాంటర్బరీ జట్ల మధ్య జరిగిన మూడో ప్రిలిమినరీ ఫైనల్లో ఇది జరిగింది. ఆక్లాండ్ బ్యాట్స్‌మన్ జీత్ రావల్ క్రీజ్‌లో ఉన్న సమయంలో కాంటర్బరీ కెప్టెన్ ఆండ్రూ ఎలిస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. మూడో బంతిని భారీ సిక్సర్ బాదిన రావల్, తర్వాతి బంతిని లాఫ్టెడ్ డ్రైవ్ ఆడాడు. అది నేరుగా బౌలర్ తల ముందు భాగంలో తగిలి బౌండరీ దాటింది. అంపైర్ దానిని ముందు ఫోర్‌గా ప్రకటించినా... ఆ తర్వాత అది సిక్స్‌గా తేలింది! ఆ వెంటనే ఎలిస్ ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షల కోసం మైదానం వీడాడు. ప్రమాదం లేదని తేలడంతో తిరిగొచ్చి ఆ తర్వాత మరో ఆరు ఓవర్లు బౌల్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో 25 బంతులు ఎదుర్కొని 14 పరుగులు కూడా చేశాడు. ఎలిస్‌కు పెద్ద ప్రమాదం జరగకపోవడంతో బ్యాట్స్‌మన్ రావల్ ఊపిరి పీల్చుకున్నాడు. ‘ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను మ్యాచ్‌లో కొనసాగడం నా బెంగ తీర్చింది. అయితే ఇలాంటి గాయం తగిలిన సందర్భాల్లో కాస్త ఆలస్యంగా తలకు సంబంధించిన సమస్యలు బయటపడతాయి. అయితే అది కూడా జరగకూడదని ప్రార్థిస్తున్నా’ అని అతను చెప్పాడు. జీత్ రావల్ 149 పరుగుల సహాయంతో ఈ మ్యాచ్‌లో ఆక్లాండ్ 107 పరుగుల తేడాతో కాంటర్బరీపై విజయం సాధించింది. -
ఎవరీ యువ కెరటం..?
శుభ్‌మాన్ గిల్.. యువ టీమిండియాలో ఈ పేరు మార్మోగుతోంది. నిలకడగా రాణిస్తున్న ఈ యువ బ్యాట్స్‌మన్ తాజాగా అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో జట్టును టైటిల్‌కు చేరువ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్తాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని సెంచరీ బాదాడు. 94 బంతుల్లో 7 ఫోర్లతో 102 పరుగులు సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు(341) కూడా అతడివే. ఈ కుడిచేతి వాటం టాపార్డర్ బ్యాట్స్‌మన్ అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో గిల్ మరింత రాటు దేలుతున్నాడు. దేశీయ మ్యాచుల్లో పంజాబ్ తరుపున ఆడుతున్న అతడు 2017, నవంబర్‌లో బెంగాల్‌తో తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన గిల్.. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. పంజాబ్‌లోని ఫాజిల్కా పట్టణంలో 1999, సెప్టెంబర్ 8న శుభ్‌మాన్ గిల్ జన్మించాడు. అతడి తండ్రి రైతు. క్రికెటర్ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు తండ్రిని ఒప్పించి కుటుంబంతో సహా మొహాలి తరలివెళ్లాడు. కఠోర సాధన, క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నాడు. 2014లో జరిగిన అండర్-16 పంజాబ్ అంతర్ జిల్లా టోర్నమెంట్లో 351 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. నిర్మల్ సింగ్‌తో కలిసి మొదటి వికెట్‌కు 587 భాగస్వామ్యం నమోదు చేశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫిలో పంజాబ్ తరపున అరంగ్రేటం చేసిన అండర్-16 మ్యాచ్‌లోనే అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. 2013-14, 2014-15లో వరుసగా రెండుసార్లు బెస్ట్ జూనియర్ క్రికెటర్‌గా బీసీసీఐ అవార్డు అందుకున్నాడు. తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా 2014లో అవార్డు అందుకుని మురిసిపోయాడు. తాజాగా నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రూ.1.8 కోట్లకు గిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. -
అటువంటి రోజు రాకూడదు... ఎవరికైనా
విద్య - విలువలు ఒక బ్యాట్స్‌మన్ చాలా గొప్పవాడు కావాలంటే-కేవలం చాలా బాగా ఆడగలడు కాబట్టి గొప్ప బ్యాట్స్‌మన్ కాడు. అతన్ని అందరికీ మార్గదర్శకుడిగా ఎప్పుడు చెబుతారంటే అతనికి-ఏ బాలు కొట్టాలో దాన్ని మాత్రమే కొట్టడం, ఏది కొట్టకూడదో దాన్ని వదిలివెయ్యడం తెలిసి ఉండాలి. అలా ఆడినప్పుడే అతను గొప్పవాడవుతాడు. సునీల్ గవాస్కర్ నిజానికి పొట్టివాడైనా, క్రీజులో నిలుచున్నప్పుడు ఇమ్రాన్‌ఖాన్ వేసిన బౌన్సర్‌ను కూడా వదిలివేస్తాడు తప్ప సరదాగా బ్యాట్‌తో ముట్టుకోడు. ఏది వదిలిపెట్టాలో తెలియాలి. ఏది ముట్టుకోవాలో తెలిసుండాలి. ఏది ముట్టుకోవాలో తెలిసున్నప్పుడు ఆ బాల్‌ను కొట్టకుండా వదలకూడదు. ఏ బాల్‌ను కొడితే ప్రమాదమో దాన్ని ముట్టుకోవడానికి ఉత్సాహం ప్రదర్శించకూడదు. హిత శక్తి ఎటువంటిదంటే... మనిషిని ఆ క్షణంలో ఆకర్షిస్తుంది. సమాజంలో చాలామంది విద్యార్థులు కానీ, మరెవరైనా కానీ లక్ష్యసిద్ధిలో హిత శత్రువు చేత పాడవుతారు. ఈ రాత్రికి ఇది నేను చదువుకుంటాను... అని నిర్ణయించుకుంటాడు. ఈలోగా క్రికెట్ మొదలౌతుంది. ఈ ఒక్క ఓవర్ చూస్తానంటాడు. 50 ఓవర్లు చూస్తాడు. అయిపోయింది. అది హిత శత్రువు. ఆ క్షణంలో దాని జోలికి వెళ్లకూడదు. అప్పటికి బాగున్నట్టుంటుంది. అది ముట్టుకున్నాడు. అంతే పోయింది పరీక్ష. నాకు బాగా తెలిసున్న విద్యార్థి ఒకడు నా దగ్గరికి ఓ రోజు ఏడుస్తూ వచ్చాడు. ‘‘సార్ ! ఎంసెట్ పరీక్ష రాస్తున్నాను. దూరంగా నాకు బాగా ఇష్టమైన పాత పాటలు వేశారండీ. నేనింట్లో ఎంత సాధన చేశానో అంత వేగంగా పరీక్ష రాయలేకపోయాను. దానితో చాలా బిట్లు మిగిలిపోయాయి. పది బిట్లు చాలు కదండీ... మెడిసిన్‌లో రావలిసిన సీటు రాకుండా పోవడానికి. అదే జరిగింది’’ అన్నాడు. దూరం నుంచీ వచ్చిన ఒక పాట ఒక విద్యార్థి జీవితాన్ని బలి తీసేసుకుంది. అప్పటికి చాలా బాగున్నట్లు అనిపించినా ఆ క్షణంలో వినకూడనిది విన్నాడు. అంతే! పాడయిపోయాడు. మధుమేహం ఉన్నవాడు మామిడిపండు తిన్నట్లు. అప్పటికి బాగుంటుంది, మామిడిపండు. తర్వాత లేనిపోని ప్రమాదానికి కారణమౌతుంది. ఎక్కడైనా సరే, ఆకర్షణీయమైనవి ఏవి ఉంటాయో అవి మనిషిని ప్రలోభంలోకి లాగేస్తాయి. ఇది మనమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దాన్ని నిగ్రహించగలిగిననాడే విజయం సాధించగలరు. కానీ ఇప్పుడు మనకున్న భయంకర వాతావరణమంతా ఎక్కడుందీ అంటే... అందరం వేదాంతం దగ్గర్నుంచీ సమాజం వరకు ఒక్క మాటే చెబుతుంటాం. వేదాంతం గురించి చెప్పమంటే... కామ క్రోధాదులను విడిచిపెట్టండి అని మొదపెడతారు ఎవరైనా. వాటిని విడిచిపెట్టడానికి నేను పట్టుకుంటే కదా వాటిని! నేను పట్టుకోలేదు. అవే నన్ను పట్టుకున్నాయి. ‘పిల్లలు బాగా చదువుకోవాలి. మంచి శీలంతో ఉండాలి. ప్రతివాడూ దేశానికి గర్వకారణమైన విద్వాంసుడు కావాలి’... ఇవే కదా అందరం ఒకే కంఠంతో చెప్పే మాట. కానీ అలా కావడానికి అవసరమైన వాతావరణం మనం ఇస్తున్నామా? వాడు కన్ను విప్పితే ఏది చూడకూడదో చూడకుండా నిగ్రహించగలుగుతున్నామా? వాడి చెవితో ఏది వినకూడదో అది వినిపించకుండా చేయతగిన నియమాలేవయినా మనకున్నాయా? ఆపడానికి ఏమైనా అధికారాలున్నాయా? ఎక్కడైనా దానికి సంబంధించి మనకు ప్రత్యేక మార్గదర్శకాలేమైనా ఉన్నాయా? లేవు. ఎవరు ఏదైనా చూడొచ్చు, ఏదైనా వినొచ్చు, తినొచ్చు, ముట్టుకోవచ్చు. మరి అందరూ ఎలా బాగుపడగలరు? ఎవడో... ఎక్కడో... ఒక్కడికి ఉంటుంది ఆ నిగ్రహ శక్తి. సమాజంలో విచక్షణా జ్ఞానమనేది శూన్యమైపోతున్నది. చదువు కాదు, చదువు కన్నా ముఖ్యం ఏమైపోయిందంటే... అసలు దేన్ని ముట్టుకోవాలి, దేన్ని ముట్టుకోకూడదో తెలియని స్థితిలో, అమాయకత్వంతో చాలా మంది పాడైపోతున్నారు. ఉద్యోగులు కానివ్వండి, విద్యార్థులు, పెద్దలు, పిల్లలు, చదువుకున్నవారు... ఇలా ఎవరిని తీసుకున్నా, ఎక్కడికెళ్లినా వారికి లక్ష్యసిద్ధికి సంబంధించి వివేకాన్ని నేర్పగల విషయాలు లేవు. ఏవి నేర్వగలిగిన సమర్థత కలిగి ఉన్నాయో వాటిని పాఠ్యాంశాలలో పొందుపరచడం లేదు. మరి ఆ విచక్షణ ఎలా అందుతుంది? మరి అందనప్పుడు వాడు దేశానికి పనికివచ్చేవాడెలా అవుతాడు? సంకల్పం అనేది ఒకటి ఏర్పడినా, ప్రలోభ కారకమైనవి సమాజంలో ప్రతిక్షణం కనబడుతున్నప్పుడు దాన్ని నిలబెట్టుకుని సాధించగల శక్తి ఎలా పొందుతాడు? పూర్వం రైతు ఆరుగాలం శ్రమించి పంట ఇంటికి తీసుకొచ్చి అప్పుడు సుఖపడేవాడు. ఈవేళ పొద్దున మొదలుపెడితే సాయంకాలానికి డబ్బులు కనబడాలి. ఎలా సంపాదించావన్న దానికన్నా ఎంత సంపాదించవన్నది ప్రధానమైపోయిన నాడు విచక్షణ ఎలా ఉంటుంది? ఉద్యోగంలో కానీ, విద్యార్జనలో కానీ తేలికగా పాడు చేసేది ఏదంటే - అడ్డదారి అని ఒకంటుంది. అడ్డదారిలో కాదు, సంకల్ప శుద్ధి, సిద్ధి కలగాలంటే లోభకారకమైన విషయాలకు దూరంగా జరుగుతూ రహదారిలో వెళ్లు. సంపాదించిందేదయినా ధార్మికంగా సంపాదించు, ధార్మికంగానే ఖర్చుపెట్టు. అంతే తప్ప నీవు చేసేది నీకే నచ్చని రోజు, నీవు చేసేదానిని గురించి నీవే ధైర్యంగా నిలబడి మాట్లాడలేని రోజు, నీ పిల్లల దగ్గరకెళ్లి నీవిలా ఉండకూడదు’ అని చెప్పే అధికారం పోయిన రోజు... అటువంటి రోజు రాకుండా బతుకు. నీ కొడుక్కి చెప్పడానికి, నీ అల్లుడికి, నీ మనవలకు చెప్పడానికి నీ అధికారం ఎప్పుడూ నిలబడాలి. ‘మీరెవరండీ మాకు చెప్పడానికి’ అని అన్పించుకునే రోజు రాకూడదు. ఆ రోజున... ఆఖరి రోజున... ఆ భగవంతుడు తీర్పిచ్చే రోజున... ‘‘నీవు శరీరం ఇచ్చావు, శాస్త్రాన్ని పట్టుకుని చెయ్యగలిగిన మంచి పనులన్నీ చేశాను. ఎన్నడూ నేను చెడు చెయ్యలేదు’’ అని పరమ ధైర్యంతో గుండెల మీద చెయ్యి వేసుకుని వెళ్లిపోగలగాలి. మీరు ఏ పని మీద బయల్దేరినా, ఏ లక్ష్యం మనలో పెట్టుకున్నా మీకు ఎదురయ్యేవి, మిమ్మల్ని అడ్డుకునేవి, మిమ్మల్ని పాడుచేసేవి రెండుంటాయి-ఒకటి హిత శత్రువు, రెండవది అహిత శత్రువు. హిత శత్రువంటే చాలా బాగున్నట్టుగా ఉంటుంది. కానీ అది శత్రువు. పాడు చేసేస్తుంది. అహిత శత్రువు. అది కూడా శత్రువే. అదికూడ పాడు చేసేస్తుంది. ఒకటి తెలియకుండా, మరొకటి తెలిసి పాడు చేసేస్తాయి. అంటే ఇది పట్టుకుంటే నేను పాడయిపోతానని తెలుస్తుంటుంది. కానీ పట్టుకోకుండా ఉండలేని మన బలహీనతను ఆసరాగా చేసుకుని వశపరచుకుంటుంది. -
ఆంధ్ర పరాజయం
ఒంగోలు: బ్యాట్స్‌మెన్ తడబాటుతో... ఉత్తరప్రదేశ్ (యూపీ)తో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 56 పరుగుల తేడాతో ఓడిపోయింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో ఆంధ్ర జట్టుకిదే తొలి పరాజయం కావడం గమనార్హం. అంతకుముందు ఆడిన తొలి మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతోపాటు ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆట నాలుగోరోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 26/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టును బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ (5/35) హడలెత్తించాడు. దాంతో ఆంధ్ర జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలోనే ఆలౌటైంది. ఈ గెలుపుతో ఉత్తరప్రదేశ్‌కు ఆరు పాయింట్లు లభించాయి. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 30నుంచి పాటియాలాలో పంజాబ్‌తో ఆడుతుంది. సంక్షిప్త స్కోర్లు ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 170; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 297; ఉత్తరప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: 309; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: 126 (47.3 ఓవర్లలో) (భరత్ 16, రికీ భుయ్ 12, శివ కుమార్ 15, ప్రదీప్ 10, అయ్యప్ప 17, విజయ్ కుమార్ 28, అంకిత్ రాజ్‌పుత్ 5/35, అమిత్ మిశ్రా 2/21, కుల్దీప్ యాదవ్ 2/15). -
‘వీరూ’ వీడ్కోలు
* రిటైర్ కానున్న వీరేంద్ర సెహ్వాగ్ * రెండున్నరేళ్ల క్రితం ఆఖరి టెస్టు న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర బ్యాట్స్మన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మంగళవారం 37 ఏళ్లు పూర్తిచేసుకోనున్న సెహ్వాగ్, దుబాయ్‌లో మాస్టర్స్ లీగ్ కు సంబంధించి మీడియా సమావేశంలో రిటైర్ కాను న్నట్లు చూచాయగా వెల్లడిం చాడు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం 2013 మార్చిలో తన ఆఖరి టెస్టు ఆడిన సెహ్వాగ్, అదే ఏడాది జనవరిలో చివరిసారిగా వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆదివారం ముగిసిన హరియాణా, ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కూడా వీరూ బరిలోకి దిగాడు. టెస్టు క్రికెట్లో రెండు ‘ట్రిపుల్ సెంచరీలు’ చేసిన ఏకైక భారత ఆటగాడైన సెహ్వాగ్, వన్డేల్లో ‘డబుల్ సెంచరీ’ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు. 2007లో టి20, 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడైన సెహ్వాగ్ టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. పేసర్ జహీర్ ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించిన నాలుగు రోజులకే మరో భారత దిగ్గజం వీడ్కోలు పలకడం విశేషం. -
బ్యాట్‌మెన్ 3
బయోగ్రఫీ బ్యాట్మన్ ఓ సూపర్ హీరో... కలలో మాత్రమే సాధ్యమయ్యే వాటిని క్షణాల్లో చేసి చూపిస్తాడు. భారత క్రికెట్‌కు అలాంటి బ్యాట్‌మెన్ ముగ్గురున్నారు. ఆడినంతకాలం ప్రపంచ క్రికెట్‌ను శాసించిన దిగ్గజ త్రయం సచిన్, గంగూలీ, లక్ష్మణ్... ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్‌ను బంగారుబాట పట్టించేందుకు కంకణం కట్టుకున్నారు. మైదానంలో ఎదురుగా ధోని, కోహ్లిల వంటి హేమాహేమీల్లాంటి ఆటగాళ్లు... వారిని ఎలా నిలువరించాలా అనేది ప్రత్యర్థి జట్ల ఆలోచన. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైనట్లుగా... మరికొందరు దిగ్గజాలు ఆటగాళ్ల వెన్నంటి నిలిచి వ్యూహాలకు పదును పెడితే... ఇక వారి కోసం కూడా అవతలి జట్లు ప్రతివ్యూహం పన్నాల్సి వస్తుందేమో. భారత క్రికెట్ భవిష్యత్తును దూరదృష్టితో చూస్తే ఇదే దృశ్యం ఇప్పుడు మన ముందు కనిపించనుంది. ఎందుకంటే ఇకపై భారత జట్టుకు దశ, దిశను ఇచ్చేందుకు నాటి స్టార్ క్రికెటర్లు దిగుతున్నారు. పుష్కర కాలానికి పైగా కలిసి ఆడిన తమ సమష్టి అనుభవంతో త్రిమూర్తులు... ఇప్పుడు మార్గదర్శనం అందించేందుకు సిద్ధమయ్యారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు ఇకపై సలహాదారులుగా జట్టుకు అండగా నిలవనున్నారు. భారత క్రికెట్ జట్టుకి అనుభవం లేదు... అంతా కుర్రాళ్లే... సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత క్రికెట్ ప్రపంచంలో ఉన్న అభిప్రాయం ఇది. ఇది వాస్తవమే. కానీ మాస్టర్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కూడా గత ఏడాదిన్నరగా మనోళ్లు చాలా చోట్ల మెరుపులు మెరిపించారు. అయితే కొన్ని చోట్ల మోకరిల్లారు. ఫలితాల్లో తేడాలు ఉన్నా, అనుభవం లేకపోయినా కొత్త కుర్రాళ్లు సాన పెట్టిన వజ్రంలా రాటుదేలుతూ పోయారు. అయితే విజయాలు ఒక్కటే కాదు... ఇంకేదో కావాలి. అలనాటి విండీస్ లాగానో, ఆ తర్వాతి ఆస్ట్రేలియాలానో భారత్ కూడా అజేయ శక్తిలా నిలవాలి. సరిగ్గా చెప్పాలంటే ఐసీసీలో కాదు ఆటలో కూడా సూపర్ పవర్ కావాలి. అదిగో... దానికోసమే బీసీసీఐ త్రిమూర్తులను ముందుకు తెచ్చింది. ఈ ముగ్గురినీ ఆటలో మళ్లీ భాగం చేసింది. తమ అనుభవాన్ని నవ తరానికి అందించమని కోరింది. మైదానం బయట కూడా తమదైన ముద్ర వేసేందుకు మరో అవకాశం కల్పించింది. వీరంతా తమ 1308 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవాన్నంతా రంగరించి కుర్రాళ్లలో స్ఫూర్తి నింపితే, మార్గదర్శనం అందిస్తే ఇక తిరుగేముంది. ఈ ముగ్గురిలో ఎవరి పాత్ర ఏమిటనే విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోయినా... సంవత్సరాల పాటు భారత క్రికెట్‌కు మూల స్తంభాలుగా నిలిచినన ఈ త్రయం తెర వెనుక నుంచి కూడా మరో చరిత్రకు అంకురార్పణ చేయగలదనే నమ్మకం ఉంది. సచిన్: వివాద రహితంగా మెలగడం మాస్టర్ బ్లాస్టర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తన 24 ఏళ్ల కెరీర్లో ఎక్కడా ఒక్క వివాదం కూడా లేదు. మైదానం లోపల, బయట కూడా మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇకపై భారత బ్యాట్స్‌మెన్ తమ ఆటతీరు గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ చిన్న తప్పులు చేస్తున్నా నెట్స్‌లో సరిదిద్దడానికి సచిన్ ఉంటాడు. నిజానికి సచిన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటమే ఓ పాఠం. తన అనుభవాలు చెప్తే చాలు స్ఫూర్తి పెరుగుతుంది. ఫలానా మ్యాచ్‌లో ఇలాంటి ఒత్తిడిలో నేను ఇలా ఆడా అని మాస్టర్ చెప్పినా అదే కొండంత ధైర్యాన్నిస్తుంది. 2003 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన సచిన్ ఆ టోర్నీలో తాను ఒక్కసారి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదని చెబితే ఆశ్చర్యం కలగడమే కాదు... మరో రకమైన సన్నాహకం దాని వెనక ఉందనే విషయం తెలిస్తే యువ ఆటగాళ్లు అదో పెద్ద పాఠం. ఇటీవల కాలంలో ఆటతీరు ఎలా ఉన్నా మైదానం లోపల, బయట కూడా భారత క్రికెటర్లు పదే పదే వివాదాల్లోకి వెళుతున్నారు. ముఖ్యంగా టెస్టు కెప్టెన్ కోహ్లి ఇందులో ముందుంటున్నాడు. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పే బాధ్యత ఇకపై సచిన్ తీసుకోవచ్చు. గంగూలీ: సమపాళ్లలో దూకుడు భారత జట్టు కెప్టెన్‌గా ప్రత్యర్థులతో దూకుడు ఎలా వ్యవహరించాలో తొలుత నేర్పినవాడు గంగూలీ. అయితే తను ఏనాడూ శృతి మించలేదు. గీత దాటి వేటు పడేదాకా పరిస్థితిని తెచ్చుకోలేదు. అలాగే వ్యూహాల విషయంలో తనకు తనే సాటి. ఆట కంటే మిగిలిన విషయాలలో గంగూలీ అనుభవం యువ జట్టుకు ఎక్కువగా ఉపయోగపడొచ్చు. ఇక గంగూలీలో మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు. బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య వారధిగా తను ఉపయోగపడతాడు. తను కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో యువ క్రికెటర్లను వెనకేసుకొచ్చి సెహ్వాగ్, హర్భజన్ లాంటి వాళ్లు నిలదొక్కుకునేలా చేసిన ఘనత తనది. మరోసారి ఇప్పటితరం క్రికెటర్లు కూడా గంగూలీని నమ్ముకోవచ్చు. నైపుణ్యం ఉన్న క్రికెటర్‌ను గుర్తించి, తనకు అండగా నిలవడంలో దాదా ఎప్పుడూ ముందుంటాడు. లక్ష్మణ్: విదేశాల్లో బాగా ఆడటం ప్రస్తుత క్రికెటర్లు లక్ష్మణ్ నుంచి నేర్చుకోవాల్సిన తొలి పాఠం విదేశీ గడ్డపై ఎలా ఆడాలో తెలుసుకోవడమే. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై మన రికార్డు అత్యంత పేలవంగా ఉంది. ప్రస్తుత టి20 తరంలో బ్యాట్స్‌మెన్ టెక్నిక్‌ను బాగా మెరుగుపరిస్తే ఈ రికార్డును సరిజేయొచ్చు. ఈ బాధ్యతను లక్ష్మణ్ సమర్థంగా నిర్వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే సన్‌రైజర్స్ జట్టు మెంటర్‌గా, బెంగాల్లో యువ బ్యాట్స్‌మెన్‌కు శిక్షకుడిగా కొంత అనుభవం కూడా తను గడించాడు. నిజానికి తమ తరంలో ఎక్కువగా అన్యాయం జరిగిన క్రికెటర్ లక్ష్మణ్. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా వన్డే ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక కాలేదు. అయినా ఏనాడూ బయటకు ఒక్క మాట అనలేదు. వివాదాలను తెచ్చుకోలేదు. ఈ ముగ్గురూ తమ తొలి ఇన్నింగ్స్‌లో క్రికెట్ ఆడుతూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. తాము ఆడినంత కాలం భారత క్రికెట్‌ను శిఖరాన నిలబెట్టారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తమ అనుభవంతో యువ జట్టును కూడా అదే స్థాయికి చేరుస్తారా..? చూద్దాం... త్వరలోనే దీనికి సమాధానం దొరకొచ్చు. - బత్తినేని జయప్రకాష్ భవిష్యత్ కోసం ద్రవిడ్ సలహా కమిటీలో త్రిమూర్తులు మాత్రమే ఉండి ద్రవిడ్ లేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిజానికి బీసీసీఐ ద్రవిడ్‌ను కూడా ఈ కమిటీలో ఉండాలని కోరింది. అయితే తాను భారత క్రికెట్ భవిష్యత్ కోసం పని చేస్తానని ‘వాల్’ స్పష్టం చేశాడు. దీంతో భారత్ ఎ, అండర్-19 జట్లకు తనని కోచ్‌గా నియమించారు. భారత్ జట్టు తరఫున క్రికెట్ ఆడే వాళ్లంతా ఈ రెండు జట్లలో ఏదో ఒక దశలో ఆడి రావాల్సిందే. కాబట్టి క్షేత్రస్తాయిలోనే ఆటగాళ్లను సాన బెట్టాలనే ఆలోచన తనది. త్రిమూర్తులతో పోలిస్తే ద్రవిడ్‌దే కఠినమైన పని. క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో జట్టు భారాన్ని అనేకసార్లు ఒంటిచేత్తో మోసిన రాహుల్ ద్రవిడ్‌కు ఇలాంటి సవాళ్లంటేనే ఇష్టం.