వర్సెస్టర్: బ్యాట్స్‌మెన్ వైఫ్యలంతో భారత్ ‘ఎ’ కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ‘ఎ’తో ఇక్కడ జరుగుతోన్న అనధికారిక నాలుగు రోజుల టెస్టులో మంగళవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. యువ సంచలనం పృథ్వీ షా (82 బంతుల్లో 62; 8 ఫోర్లు) చక్కటి అర్ధశతకం సాధించినా... మురళీ విజయ్ (8), మయాంక్ అగర్వాల్ (0), కెప్టెన్ కరుణ్ నాయర్ (4) కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
అజింక్య రహానే (26 బ్యాటింగ్; 3 ఫోర్లు), రిషభ్ పంత్ (37 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించి పోరాడుతున్నారు. అంతకుముందు 310/2 తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 128.5 ఓవర్లలో 423 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజే భారీ శతకం చేసిన అలిస్టర్ కుక్... వ్యక్తిగత స్కోరు 180 వద్ద ఔటయ్యాడు. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (4/79)తో పాటు స్పిన్నర్ షాబాజ్ నదీమ్ (3/46) రాణించారు.
భారత్ ‘ఎ’ తడబాటు
Published Wed, Jul 18 2018 1:35 AM | Last Updated on Wed, Jul 18 2018 1:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment