
మరోవైపు మహిళల ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న తొలి పోరులో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఆదివారం రెండో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌తో ఆడుతుంది. ఫలితాలతో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడమే తమ ముందున్న లక్ష్యమని భారత మహిళల హాకీ జట్టు సారథి సలీమా టెటె పేర్కొంది. మెరుగు పర్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందిన సలీమా వెల్లడించింది.
ఈ నెల 18, 19న స్పెయిన్‌తో... 21, 22న జర్మనీతో... 24, 25న నెదర్లాండ్స్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడుతుంది. ‘మా ఆటపైనే ప్రధానంగా దృష్టి పెడతాం. పలువురు ప్లేయర్లు తొలిసారి ప్రొ లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నారు. గెలుపోటములు ఆటలో భా గం. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
హరేంద్ర సింగ్ చీఫ్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి గేమ్‌ప్లాన్ మెరుగైంది. ప్లేయర్ల మధ్య అనుబంధం కూడా పెరిగింది. అదే మైదానంలో ప్రస్ఫుటమవుతోంది’ అని సలీమా వెల్లడించింది.

Comments
Please login to add a commentAdd a comment