ఐపీఎల్‌లో స్పాన్స్‌ర్డ్‌ కార్‌కి బాల్‌ తగిలితే ఏమవుతుందో తెలుసా..! | Has A Batsman Ever Hit The Sponsors Car During An IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో స్పాన్స్‌ర్డ్‌ కార్‌కి బాల్‌ తగిలితే ఏమవుతుందో తెలుసా..!

Published Sun, Jun 2 2024 6:10 PM | Last Updated on Sun, Jun 2 2024 6:15 PM

Has A Batsman Ever Hit The Sponsors Car During An IPL

ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించే స్టేడియంలోని డిస్‌ప్లేలో స్పాన్సర్డ్‌ కార్లు ఉంటాయి. అక్కడ మనకు పెద్ద బ్రాండ్ల కార్లు వినబడవు కేవలం సామాన్యుడి అవసరానికి అనుగుణంగా  కార్లను డిజైన్‌ చేసే టాటా బ్రాండ్‌ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఐపీఎల్‌ స్టేడియం డిస్‌ప్లేలో టాటా టియాగో ఎలక్ట్రిక్‌ కార్లు‌ ఉంటాయి. ఈ కార్లకు గనుక బ్యాట్స్‌మ్యాన్‌ కొట్టే సిక్స్‌ షార్ట్‌లో బంతి ఈ స్పాన్సర్డ్‌ కార్లకు తగిలితే ఏం జరుగుతుందో తెలుసా..!

బ్యాట్స్‌మ్యాన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌లో డిస్‌ప్లేలో ఉన్న స్పాన్సర్డ్‌ కారు విండో పగిలేలా సిక్స్‌ కొడితే..ఆ ఆటగాడు పేద ప్రజలకు సాయం చేసినట్లే. ఇదేంటదీ.. కారు విండో పగిలిపోయేలా.. బంతి కొడితే పేద ప్రజలకు సాయం ఎలా అందుతుంది..?.అనుకోకండి ఎందుకంటే?..స్టేడియంలో ప్రదర్శించే టాటా టియాగో ఎలక్రిక్‌ కార్లను బంతిని తాకిన ప్రతిసారి టాటా కంపెనీ పేదప్రజలకు రూ.5 లక్షల విరాళం అందిస్తామని ప్రకటించింది.

అయితే ఇలాంటి ఘటన 2019లో ప్రారంభ ఐపీఎల్‌ మహిళ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌)లో చోటు చేసుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విమెన్స్‌కి యూపీ వారియర్స్‌ విమెన్స్‌కి మధ్య మ్యాచ్‌ సందర్భరంగా ఈ ఘటన జరిగింది. రాయల్‌ ఛాలెంజర్స్‌కి చెందిన ఎల్లీస్‌ పెర్రీ డీప్‌ మిడ్‌వికెట్‌ బౌండరీ సిక్స్‌ కొట్టింది. ఆ క్రమంలో బంతి వెళ్లి డిస్‌ప్లేలో ఉన్న టాటా ఎలక్ట్రిక్‌ కారుకి తగిలింది. 

అంతే ఒక్కసారిగా స్టేడియం దద్ధరిల్లేలా హర్షధ్వానాలు వచ్చాయి. వెంటనే టాటా తాను అన్నమాటను నిలబెట్టుకుంటూ..టాటా మెమోరియల్‌ హాస్పిటల్స్‌లో సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ. 5 లక్షల విరాళం అందజేసింది. ఇలా క్రీడాకారుడు బంతిని ఎలక్ట్రిక్‌ కారుకి తగిలేలా చేసిన ప్రతిసారి ఇస్తామని టాటా కంపెనీ పేర్కొంది. 

ఇలా బ్యాటింగ్‌ చేసిన వ్యక్తులు ఎవరంటే..
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మధ్య జరిగిన మ్యాచ్‌లో టియాగో ఎలక్రికట్‌ కారుని  మొదటగా రుతురాజ్ గైక్వాడ్ సిక్స్‌ కొట్టే షార్ట్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో నెహాల్ వధేరా ఎలక్ట్రిక్ కారును బంతితో కొట్టాడు.

ఇదిలా ఉండగా, టాటా 2019 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లలో తన ఎలక్ట్రిక్‌ కార్లను ప్రదర్శిస్తుంది. 2022 నుంచి, టాటా ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌గా మారింది. ఐతే అంతకుమునుపు ఏడాదిలో  ఐపీఎల్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) టైటిల్‌కి స్పాన్సర్‌గా ఉంది. ఇలా ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించే మొత్తం 12 స్టేడియంలలో టాటా టియాగో ఎలక్ట్రిక్‌ కార్లు ప్రదర్శనకు ఉంచుతుంది టాటా కంపెనీ. ఈ క్రికెట్‌ గేమ్‌ని ఫ్లాట్‌ఫాంగా చేసుకుని ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహంచడమే టాటా ప్రధాన లక్ష్యం. అందుకే ఇలాంటి కార్యక్రమాను చేపడుతోంది టాటా కంపెనీ. అంతేగాదు భారతదేశంలో అత్యంత వేగంగా బుక్‌ చేయబడిన ఎలక్ట్రిక్‌ కారుగా ఈ బ్రాండే నిలిచింది కూడా. 

 (చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్‌!..కిచెన్‌ ఒక దేశంలో ఉంటే..బెడ్‌రూం ఏకంగా..)
 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement