sponsor
-
ఐపీఎల్లో స్పాన్స్‌ర్డ్ కార్కి బాల్ తగిలితే ఏమవుతుందో తెలుసా..!
ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే స్టేడియంలోని డిస్ప్లేలో స్పాన్సర్డ్ కార్లు ఉంటాయి. అక్కడ మనకు పెద్ద బ్రాండ్ల కార్లు వినబడవు కేవలం సామాన్యుడి అవసరానికి అనుగుణంగా కార్లను డిజైన్ చేసే టాటా బ్రాండ్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఐపీఎల్ స్టేడియం డిస్ప్లేలో టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి. ఈ కార్లకు గనుక బ్యాట్స్‌మ్యాన్ కొట్టే సిక్స్ షార్ట్‌లో బంతి ఈ స్పాన్సర్డ్ కార్లకు తగిలితే ఏం జరుగుతుందో తెలుసా..!బ్యాట్స్‌మ్యాన్ విధ్వంసకర బ్యాటింగ్‌లో డిస్ప్లేలో ఉన్న స్పాన్సర్డ్ కారు విండో పగిలేలా సిక్స్ కొడితే..ఆ ఆటగాడు పేద ప్రజలకు సాయం చేసినట్లే. ఇదేంటదీ.. కారు విండో పగిలిపోయేలా.. బంతి కొడితే పేద ప్రజలకు సాయం ఎలా అందుతుంది..?.అనుకోకండి ఎందుకంటే?..స్టేడియంలో ప్రదర్శించే టాటా టియాగో ఎలక్రిక్ కార్లను బంతిని తాకిన ప్రతిసారి టాటా కంపెనీ పేదప్రజలకు రూ.5 లక్షల విరాళం అందిస్తామని ప్రకటించింది.అయితే ఇలాంటి ఘటన 2019లో ప్రారంభ ఐపీఎల్ మహిళ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విమెన్స్కి యూపీ వారియర్స్ విమెన్స్కి మధ్య మ్యాచ్ సందర్భరంగా ఈ ఘటన జరిగింది. రాయల్ ఛాలెంజర్స్‌కి చెందిన ఎల్లీస్ పెర్రీ డీప్ మిడ్‌వికెట్ బౌండరీ సిక్స్ కొట్టింది. ఆ క్రమంలో బంతి వెళ్లి డిస్ప్లేలో ఉన్న టాటా ఎలక్ట్రిక్ కారుకి తగిలింది. అంతే ఒక్కసారిగా స్టేడియం దద్ధరిల్లేలా హర్షధ్వానాలు వచ్చాయి. వెంటనే టాటా తాను అన్నమాటను నిలబెట్టుకుంటూ..టాటా మెమోరియల్ హాస్పిటల్స్‌లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ. 5 లక్షల విరాళం అందజేసింది. ఇలా క్రీడాకారుడు బంతిని ఎలక్ట్రిక్ కారుకి తగిలేలా చేసిన ప్రతిసారి ఇస్తామని టాటా కంపెనీ పేర్కొంది. ఇలా బ్యాటింగ్ చేసిన వ్యక్తులు ఎవరంటే..చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మధ్య జరిగిన మ్యాచ్‌లో టియాగో ఎలక్రికట్ కారుని మొదటగా రుతురాజ్ గైక్వాడ్ సిక్స్ కొట్టే షార్ట్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో నెహాల్ వధేరా ఎలక్ట్రిక్ కారును బంతితో కొట్టాడు.ఇదిలా ఉండగా, టాటా 2019 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లలో తన ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శిస్తుంది. 2022 నుంచి, టాటా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా మారింది. ఐతే అంతకుమునుపు ఏడాదిలో ఐపీఎల్ మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) టైటిల్‌కి స్పాన్సర్‌గా ఉంది. ఇలా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే మొత్తం 12 స్టేడియంలలో టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్లు ప్రదర్శనకు ఉంచుతుంది టాటా కంపెనీ. ఈ క్రికెట్ గేమ్‌ని ఫ్లాట్‌ఫాంగా చేసుకుని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహంచడమే టాటా ప్రధాన లక్ష్యం. అందుకే ఇలాంటి కార్యక్రమాను చేపడుతోంది టాటా కంపెనీ. అంతేగాదు భారతదేశంలో అత్యంత వేగంగా బుక్ చేయబడిన ఎలక్ట్రిక్ కారుగా ఈ బ్రాండే నిలిచింది కూడా. Ellyse Perry breaks the window of the Tata Punch.ev in the WPL pic.twitter.com/FnnOAYQ8d0— MotorOctane (@MotorOctane) March 4, 2024 (చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..) -
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా అమూల్...
టీ20 వరల్డ్‌కప్-2024 మరో నెల రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే ఆయా క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత డెయిరీ దిగ్గజం అమూల్ అమెరికా, దక్షిణాఫ్రికా జట్ల ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ మెరకు గురువారం న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులతో అమూల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ధ్రువీకరించాయి. కాగా గతంలో కూడా దక్షిణాఫ్రికాకు స్పాన్సర్‌గా అమూల్ వ్యవహరించింది. దక్షిణాఫ్రికాతో పాటు నెదర్లాండ్స్, అఫ్గానిస్తాన్ జట్లకు సైతం అమూల్ స్పాన్సర్ చేసింది. కాగా ఈ మెగా ఈవెంట్లో బాగా రాణించాలని అమెరికా, దక్షిణాఫ్రికా జట్లకు అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా అమెరికా, ప్రోటీస్ క్రికెట్ బోర్డులతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ పొట్టి వరల్డ్‌కప్‌లో అమెరికా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 1న కెనడాతో తలపడగా.. దక్షిణాఫ్రికా జూన్ 3న శ్రీలంకను ఢీకొట్టనుంది. -
యూకేలో స్థిరపడాలనుకునే భారతీయులకు శుభవార్త!
యూకేలో స్థిరపడాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై బ్రిటన్‌లో నివసించేందుకు స్పాన్సర్, జాబ్స్‌తో సంబంధం లేకుండా ఉండేలా అక్కడి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. యూకే యంగ్ ప్రొఫెషన్ స్కీమ్ పేరుతో తెచ్చిన ఈ కొత్త పథకంలో 18ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య వయస్సు వారు రెండేళ్ల పాటు ఎలాంటి జాబ్స్, స్పాన్సర్స్ లేకపోయినా నివసించ వచ్చని తెలిపింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ట్వీట్లో పేర్కొంది. యూకే- ఇండియా యంగ్ ప్రొఫెషన్ స్కీంలో ప్రతి సంవత్సరం యూకేకి చెందిన 3వేల ప్రాంతాల్లో పైన పేర్కొన్న పరిమిత వయస్సు గల భారతీయులు ఉండేందుకు అర్హులు. యూకే ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా భారతీయులకు యూకేకు వెళ్లేందుకు అప్లికేషన్లను ఫిబ్రవరి 28 నుంచి మార్చి2 లోపు సబ్మిట్ చేయాలని భారత్‌లోని యూకే రాయిబారి కార్యాలయం ట్వీట్ చేసింది. మార్చి 2లోపు అభ్యర్ధులు సబ్మిట్ చేసిన అప్లికేషన్లలో నుంచి లక్కీ డ్రా రూపంలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేయనుంది. అక్కడ అర్హులైన అభ్యర్ధులు వీసాకు అప్లయి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అర్హతలు , దరఖాస్తు చేసే విధానం ►రాయబారి కార్యాలయం పేర్కొన్నట్లు ధరఖాస్తు చేయాలి ►ఆ ధరఖాస్తును నిర్ణీత గడువులో సబ్మిట్ చేయాలి. ►దరఖాస్తు తేదీకి 6 నెలల కంటే ముందు జారీ చేయబడిన స్థానిక పోలీసు సర్టిఫికేట్ లేదా పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను అందించాలి ► బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ కి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ విద్యా అర్హతను కలిగి ఉండాలి. ►విద్యా అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను జతచేయాలి ►దరఖాస్తుదారు అవసరమైన అర్హత కలిగి ఉన్నారనేలా కాలేజీ నుంచి లేదా యూనివర్సిటీ నుండి వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. -
కిల్లర్ సినిమా రేంజ్లో హత్య...గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్స్‌లో..
సాక్షి, హైదరాబాద్ : పనిచేసే చోట తరచూ యజమానికి ఫిర్యాదు చేస్తున్నాడని కక్ష పెంచుకున్నాడు.. స్పానర్‌తో తలపై మోది హత్య చేశాడు.. పోలీసులకు తెలిస్తే ఇబ్బందులొస్తాయని యజమానులూ జాగ్రత్త పడ్డారు.. గుండెపోటుతో మరణించాడని చిత్రీకరించి.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని సొంతూరికి సాగనంపారు. కిల్లర్ సినిమాను తలపించే హత్య కేసును పహాడీషరీఫ్ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ►రాజస్థాన్ పాలి జిల్లా, రాంపుర కాలా గ్రామానికి చెందిన ఓంప్రకాశ్, సునీల్ హైదరాబాద్‌లో ఉంటూ మీర్‌పేట శ్రీరామ్‌కాలనీలో శ్రీసాన్వి ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్నారు. ఇదే కంపెనీలో పాలి జిల్లా, జైతరణ్‌కు చెందిన మహేంద్రజీ చౌదరి (45), ఉత్తర్‌ప్రదేశ్ కౌశాంబి జిల్లా చందుపురంరాయన్‌కు చెందిన రోహిత్ కుమార్ పని చేసేవారు. అయితే రోహిత్ సరిగ్గా పని చేయడం లేదని తరుచూ అతనిపై యజమానికి మహేంద్రజీ ఫిర్యాదు చేసేవాడు. ►మహేంద్రపై కక్ష పెంచుకున్న రోహిత్ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.. పనిచేస్తున్న సమయంలో స్పానర్‌తో మహేంద్ర తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన మహేంద్రజీని కంపెనీ యజమానులు శివరాంపల్లిలోని చంద్రా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేంద్ర మృతి చెందాడు. గుండెపోటుగా చిత్రీకరించి.. అయితే హత్య విషయం బయటికి పొక్కితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన యజమానులు ఓం ప్రకాశ్, సునీల్ పథకం పన్నారు. గుండె పోటుతో మహేంద్ర మరణించాడని ఆసుపత్రి నుంచే రోహిత్ చేత మహేంద్ర మామ ప్రకాశ్‌కు అక్టోబర్ 4న ఫోన్ చేయించారు. ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. హత్య సమాచారం పోలీసులకు అందించకుండా, మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించకుండా ఆసుపత్రి యాజమాన్యాన్ని మేనేజ్ చేశారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగే వరకూ రోహిత్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు పంపించేశారు. గాయాలు కనిపించకుండా పార్సిల్.. హంతకుడి సూచన మేరకు శివరాంపల్లిలోని ఆసుపత్రికి వచ్చిన ప్రకాశ్ అంబులెన్స్‌లో పూర్తిగా ప్యాక్ చేసి ఉన్న మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అనంతరం మృతదేహాన్ని సొంతూరైన బాగియాడకు తీసుకెళ్లారు. చివరి చూపు కోసం మహేంద్రజీ మృతదేహాన్ని తెరిచి చూసిన అతడి కుమారుడు పాబురాంజీ జాఖర్ మృతుడి తల, శరీరంపై బలమైన గాయాలున్నట్లు గుర్తించాడు. దీంతో తమ తండ్రి గుండె పోటుతో మరణించలేదని, ఎవరో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 31న రాజస్థాన్‌లోని జైతారామ్ ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్.. రాజస్థాన్ పోలీసులు కేసును పహాడీషరీఫ్ ఠాణాకు బదిలీ చేయడంతో.. రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఫ్యాక్టరీని సందర్శించి, కార్మికులను విచారించారు. క్రైమ్ సీన్‌ను రీ–కన్స్ట్రక్షన్ చేశారు. రోహితే హంతకుడని తేల్చే కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. అయితే హత్య కేసు సద్దుమణిగిందని భావించిన రోహిత్ ఈనెల 14న యూపీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి యధావిధిగా పనిలో చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం రోహిత్‌ను అరెస్టు చేసి, విచారించగా.. మహేంద్రజీని తలపై స్పానర్‌తో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. ఫ్యాక్టరీ యజమానులు ఓంప్రకాశ్, సునీల్ వ్యవహారం కూడా వెలుగులోకి రావటంతో ముగ్గురిని అరెస్టు చేసి జ్యూడిషయల్ రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన స్పానర్ను స్వా«దీనం చేసుకున్నారు. (చదవండి: ప్రేమించింది బావనే కదా అని దగ్గరైంది.. ప్రైవసీ ఫొటోలు తీసి..) -
అంతర్జాతీయ వేదికపై బైజుస్..! ఫస్ట్ ఇండియన్ కంపెనీగా రికార్డు..!
అంతర్జాతీయ వేదికపై ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజుస్ తళుక్కున మెరవనుంది. క్రీడారంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఫిఫా వరల్డ్ కప్‌కు అధికారిక స్పాన్సర్‌గా ఎంపికైనట్లు బైజుస్ గురువారం ప్రకటించింది. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖతార్‌లో జరగనుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్‌ను స్పాన్సర్ చేస్తోన్న మొదటి ఎడ్టెక్ భారతీయ కంపెనీగా బైజుస్ అవతరించింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం బైజుస్ స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ వ్యూహంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని బైజుస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా భారత క్రికెట్ టీమ్‌కు కూడా అధికారిక స్పాన్సర్స్‌గా బైజుస్ వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ‘ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-స్పోర్ట్ ఈవెంట్ ఫిఫా వరల్డ్ కప్ -2022కి స్పాన్సర్ చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము.ఇటువంటి ప్రతిష్టాత్మకమైన వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం, విద్య , క్రీడల ఏకీకరణలో విజయం సాధించడం మాకు గర్వకారణమ’ని బైజుస్ వ్యవస్థాపకుడు అండ్ సీఈవో బైజు రవీంద్రన్ అన్నారు. బైజుస్‌తో జత కట్టినందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని ప్రపంచ సాకర్ గవర్నింగ్ బాడీ ఫిఫా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కే మదాతి పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంతో ప్రపంచంలోని యువతకు సాధికారితను కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని అభిప్రాయపడ్డారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18, 2022 వరకు ఫిఫా వరల్డ్ కప్ 2022 జరగనుంది. We are delighted to announce that BYJU’S would represent India at the biggest stage as an Official Sponsor of the FIFA World Cup Qatar 2022™️. This would make BYJU’S the first EdTech brand to sponsor this prestigious event globally. Stay tuned for more updates! #FIFAWorldCup pic.twitter.com/4M9cfHT5AN — BYJU'S (@BYJUS) March 24, 2022 చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..! -
ఐపీఎల్ 2021: ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే డబ్బు చెల్లించండి
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఒకవేళ లీగ్‌ను నిర్వహించలేకపోతే బీసీసీఐకి రూ.2,500 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. లీగ్ వాయిదా నిర్ణయాన్ని ఐపీఎల్ ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్ సమర్థించింది. ఈ టోర్నీ వాయిదా వల్ల స్టార్ స్పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని బీసీసీఐ కోల్పోతుంది. మరోవైపు స్పాన్సర్లు, అడ్వటైజర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్ స్పందించింది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లకు మాత్రమే డబ్బులు చెల్లించాలని స్పాన్సర్లు, ప్రకటనకర్తలను కోరింది. వాయిదా పడిన ఐపీఎల్ 2021ను బీసీసీఐ తిరిగి నిర్వహిస్తే ప్రకటనకర్తలు వారి ప్రకటన ఒప్పందాల నుంచి వైదొలిగే వెసులుబాటు కూడా ఉంటుంది. ఐపీఎల్ 2021 కోసం వివిధ కేటగిరీల్లో 18 స్పాన్సర్లు ఉండగా, మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌కు 14 మంది స్పాన్సర్లు ఉన్నారు. టోర్నీ నిరవధికంగా వాయిదా పడటంతో తాము తీవ్రంగా నష్టపోయినట్లు అడ్వటైజర్లు ప్రకటించాయి. ప్రస్తుత సీజన్లో మే 30 వరకు అంటే 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వాయిదా కారణంగా కేవలం 29 మ్యాచ్‌లు జరిగాయి. స్టార్‌స్పోర్ట్స్ 2018-2022 వరకు ఐపీఎల్ టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కులను రూ.16,348కోట్లకు దక్కించుకుంది. సీజన్లో మొత్తం 60 మ్యాచ్‌లు ఉండగా ఒక్కో మ్యాచ్‌కు 54.5కోట్లను బీసీసీఐకి చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 29 మ్యాచ్‌లకు స్టార్ స్పోర్ట్స్ దాదాపు రూ.1,580 కోట్లు చెల్లించాలి. చదవండి: ఐపీఎల్ నిర్వహణ ఇప్పట్లో కష్టమే: గంగూలీ -
టీమిండియా కిట్ కొత్త స్పాన్సర్ ఎంపీఎల్
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌ను తనే ఎంచుకుంది. టెండర్, ప్రాతిపాదికంటూ లేకుండా ఏకంగా ఒప్పందాన్ని ఖరారు కూడా చేసుకుంది. బెంగళూరుకు చెందిన ఈ–గేమింగ్ సంస్థ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) ఇప్పుడు భారత జట్లకు (పురుషులు, మహిళలు) కిట్స్, అపెరాల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. 2020 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఎంపీఎల్ భారత జట్లకు కిట్ స్పాన్సర్‌గా ఉండనుంది. ఒప్పందం విలువ మొత్తం రూ. 120 కోట్లు అని సమాచారం. ఒప్పందంలో భాగంగా భారత్ ఆడే ప్రతి మ్యాచ్‌కు ఎంపీఎల్ రూ. 65 లక్షలు బీసీసీఐకి చెల్లించనుంది. ► గాలక్టస్ ఫన్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఎంపీఎల్‌కు నిజానికి కిట్ స్సాన్సరయ్యే ప్రాథమిక అర్హతలేవీ లేవు. అయినా కూడా మూడేళ్ల ఒప్పందాన్ని ఖరారు చేస్తూ బీసీసీఐ సోమవారం సంతకాలు చేసింది. ఎన్నో ఏళ్ల పాటు భారత జట్లకు అంతర్జాతీయ బ్రాండింగ్ ‘నైకీ’ కిట్స్, అపెరాల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే ఈ ఏడాది ఒప్పంద గడువు ముగియడంతో ప్రముఖ సంస్థ నైకీ పునరుద్ధరించుకోలేదు. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ల వేటలో పడింది. టెండర్లను ఆహ్వానిస్తూ నోటీసు కూడా ఇచ్చింది. ► ధనవంతమైన బోర్డుతో ఏదో రకంగా జతకట్టేందుకు ఉవ్విళ్లూరే కార్పొరేట్ సంస్థలు ఈ కరోనా కాలంలో మాత్రం మొహం చాటేశాయి. దీంతో చిత్రంగా ఏ ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. అయితే మరోసారి టెండర్లకు వెళ్లకుండానే ఏకపక్షంగా అదికూడా చడీచప్పుడు లేకుండా ఒక సంస్థను ఎంచుకుని మరీ స్పాన్సర్షిప్ కట్టబెట్టింది. ఇది బీసీసీఐ వ్యవహారశైలికి ఏమాత్రం తగని పని. జవాబుదారీతనం, పారదర్శకత కోసం సుప్రీం కోర్టు క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. కొన్నేళ్ల పాటు కోర్టు నియమిత పరిపాలక కమిటీనే బీసీసీఐ రోజువారీ వ్యవహారాలు చూసుకుంది. తిరిగి ఎన్నికల్లయ్యాక భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత వినోద్ రాయ్ నేతృత్వంలోని కమిటీ బోర్డు పరిపాలన నుంచి తప్పుకుంది. ► కోర్టు ఆజమాయిషీలో నుంచి వచ్చి ఏడాది కాకముందే మళ్లీ బోర్డు పక్కదారి పట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన బోర్డు ఉన్నతాధికారి ఒకరు తాము ఏకపక్షంగా కిట్ స్పాన్సర్షిప్ ఇవ్వలేదని అందుబాటులో ఉన్న సంస్థలని సంప్రదించామని, సుమారు 20 సంస్థలతో సంప్రదింపులు జరిపినా కూడా ఎవరూ ఆసక్తి కనబరచకపోవడంతో ఎంపీఎల్ ఆసక్తిమేరకు అప్ప గించామని వివరించారు. -
ఆనంద్‌కు స్పాన్సర్‌గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
చెన్నై: గాన గంధర్వుడు, సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తన అనుబంధాన్ని ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గుర్తు చేసుకున్నాడు. 1983లో జాతీయ టీమ్ చాంపియన్‌షిప్ సందర్భంగా తమ జట్టు చెన్నై కోల్ట్స్‌కు బాలసుబ్రహ్మణ్యం స్పాన్సర్షిప్ అందజేశారని చెప్పాడు. 2002 ప్రపంచ కప్ అనంతరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను కలిసినట్లు ఆనంద్ వెల్లడించారు. ఆయనకు పెద్ద అభిమానినని పేర్కొన్న ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలో ఎస్పీకి నివాళి అర్పించారు. ‘నాకు 13 సంవత్సరాల వయస్సులో నేషనల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మా జట్టుకు ఆయన స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఆ ఈవెంట్ తర్వాతే నాకు పేరొచ్చింది. మేం ఆ టోర్నీ గెలుపొందాం. అప్పుడు ఆయనతో పరిచయం లేదు. కానీ 2002లో ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారి కలిసినపుడు స్పాన్సర్షిప్ గురించి మాట్లాడాను. ఆ విషయం తనకూ గుర్తున్నట్లు ఆయన చెప్పారు. ఆయనో గొప్ప వ్యక్తి’ అని 50 ఏళ్ల ఆనంద్ గుర్తు చేసుకున్నాడు. -
కిట్ స్పాన్సర్ బరిలో పూమా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్షిప్ రేసులో జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ పూమా నిలిచింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బిడ్‌లో పాల్గొనేందుకు అవసరమైన ఇన్విటేషన్ టు టెండర్ (ఐటీటీ) పత్రాన్ని పూమా సంస్థ ప్రతినిధులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. పూమాతో పాటు జర్మనీకే చెందిన మరో సంస్థ అడిడాస్ కూడా టీమిండియా కిట్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకొనేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా 14 ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తోన్న నైకీ కాంట్రాక్టు వచ్చే నెలతో ముగియనుంది. కరోనా నేపథ్యంలో బిడ్డింగ్ కనీస ధరను బీసీసీఐ భారీగా తగ్గించింది. గతంలో మ్యాచ్‌కు రూ. 88 లక్షలుగా ఉండగా... ప్రస్తుతం అది రూ. 61 లక్షలకు తగ్గింది. -
ఫెస్ట్ ఆఫ్ లైఫ్
-
దాతృత్వం చాటుకున్న బాలీవుడ్ నటుడు
ముంబై: 'రక్తచరిత్ర' సినిమాతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. మంచి నటుడిగానే కాక ఎన్నో సందర్భాల్లో ఒబెరాయ్ సమాజం కోసం తన వంతుగా సహాయాన్ని చేస్తూనే ఉన్నారు. జమ్మూ కశ్మీర్ లోని 10 మంది బాలికల చదువుకయ్యే ఖర్చు కోసం స్కాలర్ షిప్ అందించడానికి ఒబెరాయి స్థాపించిన ఎన్జీఓ 'దేవీ' ముందుకు వచ్చింది. జమ్ము కశ్మీర్‌లోని సెయింట్ లారెన్స్ పాఠశాలలోని 10 మంది విద్యార్థినులకు ఈ స్కాలర్షిప్ ఫలాలు అందనున్నాయి. విద్యార్థినుల ఉన్నత చదువులకు, హాస్టల్, వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును స్పాన్సర్ చేయనున్నారు. స్కాలర్షిప్ విషయమై వివేక్ ఒబెరాయ్ స్పందిస్తూ..చదువు వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లగలిగితే, వారి లక్ష్యాలను చేరకోవడానికి కావల్సిన రెక్కలను అందించడానికి తాను సిద్ధమని తెలిపారు. -
సాక్షి ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష మంది ఇంజినీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో మాక్ ఎంసెట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మాక్ ఎంసెట్ నిర్వహించనుంది. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) చిత్తూరు...ఈ మాక్ ఎంసెట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. మే నెలలో జరగనున్న ఎంసెట్‌కు సరిగ్గా నెల రోజుల ముందు సాక్షి నిర్వహించనున్న ఈ మాక్ ఎంసెట్ ద్వారా విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడమే కాకుండా...తమ ప్రతిభను పెంపొందించుకోవచ్చు. ప్రశ్న పత్రాలను తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగు పరుచుకునేందుకు వీలవుతుంది. దీంతో పాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెరుగైన ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్లకు నగదు బహుమతులుంటాయి. సాక్షి మాక్ ఎంసెట్‌కు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ రెండో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను మార్చి రెండో తేదీ నుంచి ఎంపిక చేసి సాక్షి కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు వెల రూ.75తో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకుని వచ్చి వెంటనే హాల్‌టికెట్ పొందవచ్చు. -
యువ క్రీడాకారిణులకు జీవీకే చేయూత
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ యువ టెన్నిస్ క్రీడాకారిణులు సామ సాత్విక, షేక్ జాఫ్రీన్లకు జీవీకే అకాడమీ స్పాన్సర్ చేయనుంది. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అకాడమీ డెరైక్టర్ జీవీ కృష్ణారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఈ ఇద్దరు క్రీడాకారిణులు ప్రస్తుతం మంచి ప్రతిభతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే షేక్ జాఫ్రీన్ 2013 బధిరుల ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. సాత్విక జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలను నమోదు చేసింది. అయితే ఇటువంటి క్రీడాకారిణులకు ప్రోత్సాహం ఎంతో అవసరం. గతేడాది మేము స్పాన్సర్ చేసిన అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ప్రస్తుతం జూనియర్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచినందుకు ఎంతో గర్విస్తున్నాము. ఆమెతో మా ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించాం. మన రాష్ట్రంలో ప్రతిభాశీలురు చాలా మంది ఉన్నా సరైన మార్గదర్శనం, ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారు. అలాంటి క్రీడాకారులకు చేయూతనిచ్చి వారిని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం’ అని జీవీకే రెడ్డి అన్నారు. -
టీమిండియాకు స్పాన్సర్ కరువు
-
కొడుకు దగ్గర కోట్లున్నా... తండ్రి మాత్రం కాఫీషాప్లోనే!
సాక్షి క్రీడావిభాగం: రికార్డుల రారాజు... ప్రపంచంలోనే అతి గొప్ప అథ్లెట్... కాలు కదిపితే కనకవర్షం... కోట్లు కుమ్మరిస్తున్న స్పాన్సర్లు... ఇదీ ప్రస్తుతం ఉసేన్ బోల్ట్ పరిస్థితి. కానీ చిన్నప్పుడు బోల్ట్ కూడా పేదరికాన్ని అనుభవించాడు. అతడి తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ దిగ్గజాన్ని పెంచారు. ఉసేన్ బోల్ట్ చరిత్ర ఆసక్తికరం... జమైకాలోని ట్రెలానీ అనే చిన్న గ్రామం... బోల్ట్ తండ్రి వెలస్లీ ట్రైలానీ సమీపంలోని ఒక పట్టణంలోని కాఫీ షాప్‌లో పనిచేసేవారు. తన జీతంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. కానీ వెలస్లీ తన బాధలను పిల్లలకు తెలియనీయలేదు. ఉన్న డబ్బునే సర్ది పిల్లల సరదాలు, కోరికలు తీర్చేవారు. అదే సమయంలో డబ్బు కోసం తప్పుడు మార్గాలు అన్వేషించకూడదంటూ పిల్లలకు చెప్పేవారు. ఆ ప్రాంతంలో దొంగలు ఎక్కువ. చిన్నప్పుడే పిల్లలు నేరాల బాట పట్టేవారు. చుట్టూ అలాంటి వాళ్లు చాలామంది ఉన్నా... తన పిల్లలు ముగ్గురినీ మాత్రం క్రమశిక్షణతో పెంచారు ఆయన. స్థానికంగా ఉండే రాజకీయాల ప్రభావం కూడా తన పిల్లలపై పడకుండా చూశారు. ‘చిన్నతనంలో మా దగ్గర ఎక్కువ డబ్బు ఉండేది కాదు. అయితే దాని కోసం ఎప్పుడూ బాధ పడలేదు. నువ్వు కూడా కష్టపడితేనే ఎవరి సహాయం లేకుండా బతకవచ్చు. డబ్బు కోసం ఎప్పుడూ తప్పుడు మార్గాల్లోకి వెళ్లకు... అని నాన్న చెప్పేవారు’ అని బోల్ట్ తన జీవిత చరిత్ర ‘ఉసేన్ బోల్ట్ - మైస్టోరీ’ పుస్తకంలో రాశాడు. చిన్ననాటినుంచి కుటుంబ విలువలు, క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం... ఇవన్నీ తనను తీర్చిదిద్దాయని అతను చెప్పుకున్నాడు. సాధారణ కుర్రాడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం ఏదో అదృష్టవశాత్తూ జరిగింది కాదని... తండ్రి పెంపకమే తన విజయాలను రచించిందని బోల్ట్ మనసులో మాట వెల్లడించాడు. అథ్లెటిక్స్ ఎందుకంటే... పాఠశాల విడిచిపెట్టగానే అందరికంటే ముందు ఇల్లు చేరేది ఎవరంటే మరో మాట లేకుండా బోల్ట్ అని సహచరులు చెబుతారు. స్కూల్లో అందరికంటే వేగంగా పరిగెడతాడని అతనికి పేరుండేది. అయితే ఆ కారణంగా తాను అథ్లెట్ కావాలనుకోలేదని బోల్ట్ అంటాడు. ‘టీమ్ గేమ్ అయితే రాజకీయాలు ఉంటాయి. బాగా ఆడినా అవకాశం దక్కకపోవచ్చు. అదే అథ్లెటిక్స్‌లో అయితే నువ్వు బెస్ట్ అవుతావు లేదా నీకు చేత కాదు. నీ సత్తా ఏమిటో గడియారం మాత్రమే చెప్పగలదు’ చిన్నప్పుడు తండ్రి బోల్ట్‌కు చేసిన మార్గనిర్దేశం ఇది. ఎందుకొచ్చిన పరుగు అంటూ తల్లి జెన్నీఫర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా... తండ్రి వెలస్లీ మాత్రం కొడుకు పరుగు కోసం తాను పరుగులు తీశారు. ఇప్పటికీ అదే పనిలో... బోల్ట్ ఇప్పుడు కోట్ల డాలర్లు సంపాదిస్తున్నాడు. కూర్చుని తిన్నా మూడు తరాలకు సరిపడా ఆస్తులు వచ్చేశాయి. కానీ ఇప్పటికీ బోల్ట్ తల్లిదండ్రులు జెన్నీఫర్, వెలస్లీ కొడుకు దగ్గరకు రాలేదు. తమ గ్రామంలోనే ఉంటున్నారు. అంతేకాదు... వెలస్లీ ఇప్పటికీ అదే కాఫీషాప్‌లో పని చేస్తున్నారు. ‘మా సొంత ఊరు ట్రెలానీ నుంచి, మా సమాజం నుంచి వారు ఎప్పుడూ బయటికి రావాలని భావించలేదు. చివరకు ఊర్లో ఇల్లు బాగు చేసుకోవడానికి మాత్ర మే నేను డబ్బు ఖర్చు చేశాను’ అని బోల్ట్ ఉద్వేగంగా అన్నాడు. ఇప్పటి వరకు తండ్రి తనని ఏమీ అడగలేదని, ఏదైనా ఇవ్వాలనుకున్నా వద్దంటాడని చెప్పాడు. ‘తన ఉద్యోగం చేసుకోవడం తప్ప నాన్న ఏమీ అడగలేదు. బహుశా అడగరు కూడా. అమ్మ కూడా అంతే. మహా అయితే నా దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి కింగ్స్టన్ నుంచి ట్రెలానీకి వెళ్లడానికి బస్ చార్జీలు మాత్రం అడుగుతుందేమో’ అని బోల్ట్ చెప్పాడు. జమైకా లాంటి దేశం నుంచి బోల్ట్ లాంటి పెద్ద అథ్లెట్ ఈరోజు ప్రపంచానికి లభించాడంటే కారణం అతడి తల్లిదండ్రుల ‘పెంపకమే’. వారికి హ్యాట్సాఫ్..!