టీ20 వరల్డ్‌కప్-2024 మరో నెల రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్‌లో భాగమయ్యే ఆయా క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల వివరాలను వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత డెయిరీ దిగ్గజం అమూల్ అమెరికా, దక్షిణాఫ్రికా జట్ల ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ మెరకు గురువారం న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులతో అమూల్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ విషయాన్ని ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ధ్రువీకరించాయి. కాగా గతంలో కూడా దక్షిణాఫ్రికాకు స్పాన్సర్‌గా అమూల్ వ్యవహరించింది. దక్షిణాఫ్రికాతో పాటు నెదర్లాండ్స్, అఫ్గానిస్తాన్ జట్లకు సైతం అమూల్ స్పాన్సర్ చేసింది. కాగా ఈ మెగా ఈవెంట్‌లో బాగా రాణించాలని అమెరికా, దక్షిణాఫ్రికా జట్లకు అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా శుభాకాంక్షలు తెలియజేశారు.
అదే విధంగా అమెరికా, ప్రోటీస్ క్రికెట్ బోర్డులతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ పొట్టి వరల్డ్‌కప్‌లో అమెరికా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 1న కెనడాతో తలపడగా.. దక్షిణాఫ్రికా జూన్ 3న శ్రీలంకను ఢీకొట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment