amul
-
అమూల్.. రెండంకెల వృద్ధి
న్యూఢిల్లీ: అమూల్ బ్రాండ్ కింద పాలు, పాల పదార్థాల తయారీలో ఉన్న గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయంలో రెండంకెల వృద్ధి ఆశిస్తోంది. తమ ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఇందుకు కారణమని సంస్థ ఎండీ జయెన్ మెహతా తెలిపారు.జీసీఎంఎంఎఫ్ 2023–24లో రూ.59,445 కోట్ల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎని మిది నెలల్లో తాజా పాలు, చీజ్, ఐస్ క్రీం సహా అన్ని ఉత్పత్తుల విభాగాల్లో డిమాండ్ వృద్ధి చెందిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సగ టున రోజుకు 310 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేశామని మెహతా వెల్లడించారు. సంస్థ పాల ప్రాసెసింగ్ వార్షిక సామర్థ్యం దాదాపు 500 లక్షల లీటర్లు. యూఎస్ సహా దాదాపు 50 దేశాలకు పాల ఉత్పత్తులను ఈ సంస్థ ఎగుమతి చేస్తోంది. రూ.11,000 కోట్ల పెట్టుబడి.. నూతన ప్లాంట్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ఇతర కంపెనీల కొనుగోలు ద్వారా సంస్థ సామర్థ్యాన్ని విస్తరించడానికి రూ.11,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించినట్టు తెలిపారు. ఇందులో 80 శాతం ఖర్చు చేశామన్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారం మెరుగ్గా ఉందని, చాలా ప్రొడక్టులు విడుదల చేసినట్టు వివరించారు.జీసీఎంఎంఎఫ్ గుజరాత్‌లోని 18,600 గ్రామాలలో 36 లక్షల మంది రైతులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద రైతు యాజమాన్యంలోని పాడి పరిశ్రమ సహకార సంస్థ. 18 సభ్య సంఘాల ద్వారా రోజుకు 300 లక్షల లీటర్లకుపైగా పాలను సేకరిస్తోంది. ఇంటర్నేషనల్ ఫామ్ కంపారిజన్ నెట్వర్క్ ప్రకారం పాల ప్రాసెసింగ్ పరంగా ప్రపంచంలోని టాప్ 20 డెయిరీ కంపెనీలలో జీసీఎంఎంఎఫ్ 8వ స్థానంలో నిలిచింది. -
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా అమూల్...
టీ20 వరల్డ్‌కప్-2024 మరో నెల రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే ఆయా క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత డెయిరీ దిగ్గజం అమూల్ అమెరికా, దక్షిణాఫ్రికా జట్ల ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ మెరకు గురువారం న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులతో అమూల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ధ్రువీకరించాయి. కాగా గతంలో కూడా దక్షిణాఫ్రికాకు స్పాన్సర్‌గా అమూల్ వ్యవహరించింది. దక్షిణాఫ్రికాతో పాటు నెదర్లాండ్స్, అఫ్గానిస్తాన్ జట్లకు సైతం అమూల్ స్పాన్సర్ చేసింది. కాగా ఈ మెగా ఈవెంట్లో బాగా రాణించాలని అమెరికా, దక్షిణాఫ్రికా జట్లకు అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా అమెరికా, ప్రోటీస్ క్రికెట్ బోర్డులతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ పొట్టి వరల్డ్‌కప్‌లో అమెరికా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 1న కెనడాతో తలపడగా.. దక్షిణాఫ్రికా జూన్ 3న శ్రీలంకను ఢీకొట్టనుంది. -
అమూల్ బేబీనే టాప్..!
క్యూట్‌గా ఉన్న చిన్న పిల్లలను చూస్తే వెంటనే అమూల్ బేబీలా ఉన్నారు అంటాం. అంతలా అమూల్ బ్రాండ్ జనాల్లోకి వెళ్లింది. గుజరాత్‌కు చెందిన కంపెనీయే అయినా తెలుగు రాష్ట్రాల్లోను దీని పాల ఉత్పత్తులకు మంచి పేరే ఉంది. ఈ కంపెనీని పాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా నంబర్‌వన్ కంపెనీగా మార్చాలని ప్రధాని మోదీ కంపెనీ వాటాదారులను విజ్ఞప్తి చేశారు. 'అమూల్' బ్రాండ్‌ను కలిగి ఉన్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్)ని ప్రస్తుతం ఎనిమిదో స్థానం నుంచి ప్రపంచంలోనే నంబర్ వన్ డెయిరీ కంపెనీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం రైతులు, సహకార సంఘాలకు సంబంధించిన ఇతర వాటాదారులకు ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. జీసీఎంఎంఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని మోతెరా ప్రాంతంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాదాపు లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సహకార సంఘాలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించిందన్నారు. పదేళ్లలో భారతదేశ తలసరి పాల లభ్యత 40 శాతం పెరిగిందని చెప్పారు. ప్రపంచ పాడి పరిశ్రమ 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, భారత్ వృద్ధి రేటు 6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ.. భారత డెయిరీ రంగం మొత్తం టర్నోవర్ రూ.10 లక్షల కోట్లుగా ఉందన్నారు. వరి, గోధుమలు, చెరకు ఉత్పత్తి ఉమ్మడి టర్నోవర్ కంటే చాలా అది చాలా ఎక్కువ అన్నారు. డెయిరీ రంగంలో సేవలందిస్తున్న మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పారు. -
దేన్నీ వదలని ‘డీప్‌ఫేక్’ ముఠా..! ఫొటోలు వైరల్
ఓ ప్రముఖ నటి స్టెప్పులు వేసిన పాటకు మరో నటి స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో మార్ఫ్ చేసి చూపిస్తే వావ్ అని అబ్బురపడతాం. ఓ 30-40 ఏళ్ల తర్వాత మనం ఎలా కనిపిస్తామో ముందే తెలుసుకోగలిగితే సూపర్ టెక్నాలజీ అని సంబరపడుతాం. అదే టెక్నాలజీ మన ముఖంతో మోసాలకు తెగబడితే.. పరువును బజారులో నిలబెడితే..! సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. ఇటీవల ప్రముఖ హీరోయిన్ రష్మిక విషయంలో జరిగిందిదే. డీప్‌నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వేరే అమ్మాయి వీడియోను మార్ఫింగ్ చేసి రష్మికలా రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా అమూల్ బ్రాండ్ పై కూడా డీప్ ఫేక్ మరక పడింది. అమూల్ సంస్థ జున్నును శరం పేరుతో మార్కెట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి ఏఐ ద్వారా సృష్టించినవని.. అటువంటి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయలేదని అమూల్ సంస్థ స్పష్టం చేసింది. శరం పేరుతో అమూల్ కొత్త రకం చీజ్ విడుదల చేసినట్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్‌ల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దానికి కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని అమూల్ సంస్థ తేల్చి చెప్పింది. వినియోగదారులు ఫేక్ న్యూస్, ఫేక్ ఫొటోలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారు చేసినట్లు తెలిసింది. తమ బ్రాండ్ పేరు చెడగొట్టేందుకే ఇలాంటి డీప్ ఫేక్ చిత్రాలను వైరల్ చేస్తున్నారని సంస్థ పేర్కొంది. ఈ పోస్టుల ద్వారా తప్పుడు సమాచారం సృష్టించి వినియోగదారులను అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారని తెలిపింది. వైరల్ అవుతున్న ఫొటోలో అమూల్ లోగోతో లైట్ ఎల్లో కలర్ ప్యాకెట్, పెద్ద ఫాంట్లో శరం అనే పదాన్ని చిత్రీకరించారు. ఇదీ చదవండి: టోల్‌ప్లాజా తొలగింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు అముల్ బ్రాండ్‌పై ఇలాంటి వైరల్ న్యూస్, ఫొటోలు వైరల్ కావడం కొత్తేమి కాదు. గతంలో అమూల్ లస్సీ ప్యాకెట్లో ఫంగస్ ఉందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు ఫేక్ అని కేవలం వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని సంస్థ కొట్టిపారేసింది. -
పొంగిన సిరులు!
సాక్షి, అమరావతి: నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పుడు రోజుకు 2.85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ పాడి రైతన్నల ఇళ్లలో సిరులను పొంగిస్తోంది. మూడు జిల్లాలతో మొదలైన అమూల్ ప్రస్థానం ఇప్పటికే 19 జిల్లాలకు విస్తరించి గ్రామగ్రామాన క్షీరాభిషేకం చేస్తోంది. మూతపడ్డ డెయిరీల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో సహకార రంగంలో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం 2023 తీసుకొచ్చింది. అమూల్ వచ్చిన తర్వాత ఏడు సార్లు పాల సేకరణ ధరలను పెంచడంతో లీటర్‌కు రూ.4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా రూ.10 నుంచి రూ.20 వరకు పాడి రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవుపాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తుండడంతో అమూల్‌కు పాలు పోసే వారి ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు సైతం అనివార్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. దీనివల్ల పాడి రైతులకు అదనంగా మేలు జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ కృషి ఫలితంగా మూతపడిన చిత్తూరు డెయిరీతో సహా సహకార సంఘాలు జీవం పోసుకుంటున్నాయి. 33 నెలల్లో 11.37 కోట్ల లీటర్ల సేకరణ మూడు జిల్లాలలో 2020 డిసెంబర్లో ప్రారంభమైన జగనన్న పాలవెల్లువ (జేపీవీ) నేడు 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాలలో 14,845 మందితో మొదలైన ఈ ఉద్యమంలో నేడు 4,114 గ్రామాలలో 3,79,850 మంది భాగస్వాములయ్యారు. 33 నెలల్లో 11.37 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.512.83 కోట్లు చెల్లించారు. అమూల్‌కు ప్రస్తుతం రోజుకు సగటున 2,84,755 లీటర్ల చొప్పున పాలు పోస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ డెయిరీలు రోజుకు సగటున 6 లక్షల లీటర్ల చొప్పున పాలను సేకరిస్తున్నారు. నిండా 33 నెలలు కూడా నిండని అమూల్ సంస్థ ఇప్పటికే రోజుకు 2.85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందంటే పాడి రైతులకు ఎంతో మేలు చేస్తోందో ఊహించవచ్చు. పాలు పోసే రైతులకు ప్రతి 10 రోజులకోసారి నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. పాడి రైతులకు రూ.2,604.06 కోట్ల అదనపు లబ్ధి అమూల్ ప్రారంభంలో లీటర్‌కు 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో గేదె పాలకు రూ.71.47 చొప్పున చెల్లించగా 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ప్రస్తుతం గేదె పాలకు రూ.89.76, ఆవుపాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. అయితే రైతుకు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్‌ను బట్టి గేదెపాలకు లీటర్‌కు రూ.112, ఆవుపాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తోంది. 18 నెలల్లో పాల సేకరణ ధరను అమూల్ ఏడు దఫాలు పెంచింది. లీటర్ గేదె పాలకు రూ.16.09, ఆవుపాలకు రూ.8.36 చొప్పున అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారు. గతంలో రెండేళ్లకోసారి పాల సేకరణ ధరలు పెంచే ప్రైవేట్ డెయిరీలు అమూల్ రాకతో ఏటా అనివార్యంగా కనీసం రెండుసార్లు పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధర తప్పనిసరిగా పెంచాల్సి రావడంతో పాడి రైతులకు రూ.2,604.06 కోట్ల మేర అదనంగా ప్రయోజనం చేకూరడం గమనార్హం. అమూల్ ప్రతి సంవత్సరం చివరిలో పోసిన ప్రతి లీటరు పాలకు రూ.0.50 చొప్పున లాయల్టీ బోనస్ పాడి రైతులకు చెల్లిస్తోంది. మరోవైపు గత 18 నెలల్లో అమూల్ 2,235.45 మెట్రిక్ టన్నుల నాణ్యమైన ఫీడ్‌ను లాభాపేక్ష లేకుండా పంపిణీ చేసింది. గేదెలకు రూ.30 వేలు, ఆవులకు రూ.25 వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్‌గా అందిస్తున్న ప్రభుత్వం కొత్తగా పాడి పశువుల కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేలు చొప్పున రుణాలందిస్తోంది. ఏఎంసీయూ, బీఎంసీయూలు.. అమూల్ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మొదటి దశలో రూ.680 కోట్ల ఉపాధి నిధులతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూలను నిర్మిస్తున్నారు. చేయూత లబ్ధిదారులకు వారి ఇష్ట ప్రకారం పాడి పశువుల కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాస్తవాలు ఇలా ఉంటే అమూల్‌కు మేలు చేసేందుకు ప్రభుత్వం రూ.పది వేల కోట్లు ఖర్చు చేసిందని, విలువైన సహకార డెయిరీలను అప్పనంగా అప్పగిస్తోందంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడింది. హెరిటేజ్ కోసం.. సహకార డెయిరీల రంగం నిర్వీర్యమైంది చంద్రబాబు హయాంలోనే. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే ‘మాక్స్’ (మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలు)లోకి మార్చుకుని తర్వాత సొంత కంపెనీలుగా ప్రకటించుకున్నారు. ఇలా చంద్రబాబు హయాంలో విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లా మిల్క్ యూనియన్లు కంపెనీలుగా మారిపోయాయి. పులివెందుల, చిత్తూరుతో సహా 8 డెయిరీలు మూతపడ్డాయి. అన్నమయ్య జిల్లాలోని యూహెచ్‌టీ ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీసీతో పాటు 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. హెరిటేజ్ కోసం సహకార రంగాన్ని నిర్వీర్యం చేశారు. హెరిటేజ్ సేకరణ ధరలు పెంచాల్సి వస్తుందనే భయంతో పాడి రైతులకు ఎక్కడా ధరలు పెరగకుండా కట్టడి చేశారు. హెరిటేజ్ బాగుంటే చాలు పాడి రైతులు ఎలా పోయిన ఫర్వాలేదని చంద్రబాబు భావించారు. ‘చిత్తూరు’లో క్షీరధారలు.. మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని పునరుద్ధరించగా 2021 నుంచి అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం ఆ డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఇలా ఒకపక్క సహకార రంగాన్ని బలోపేతం చేస్తుంటే ఒంగోలు డెయిరీని ఆమూల్‌కు అప్పగిస్తే వదిలేసిందని, విలువైన ఆస్తులు కట్టబెడుతున్నారంటూ ఎల్లో మీడియా బురద చల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పాడి రైతులకు మేలు జరిగే చర్యలను సైతం అడ్డుకునే యత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను సేకరిస్తాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్ సంస్థ సిద్ధంగా ఉందని అమూల్ ఆర్గానిక్స్ బిజినెస్ హెడ్ నిమిత్ దోషి వెల్లడించారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కలిగిన రైతుల నుంచి మార్కెట్ ధరపై నిర్దేశించిన ప్రీమియం ధరతో వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తూ.. వారికి తగిన గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయ అనుబంధశాఖల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో అమూల్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. అమూల్ ఆర్గానిక్స్ ద్వారా ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు. నిమిత్ దోషి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం ఐదేళ్ల ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మ, శనగపిండి తదితర ఉత్పత్తులను ప్రీమియం ధరలకు రైతుల నుంచి సేకరించి, ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్లోకి తీసుకొస్తామన్నారు. భవిష్యత్‌లో విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. నేషనల్ కో–ఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్‌లో చేరితే విస్తృతస్థాయి మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చు కోవచ్చునన్నారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వీరు పండించిన ఉత్పత్తులకు సర్టిఫికేషన్ జారీ ప్రక్రియను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారిలో మహిళలే అత్యధికమని తెలిపారు. తొలి దశలో ఆర్గానిక్ సర్టిఫికెట్ కలిగిన గిరిజన ప్రాంతాలలోని రైతుల నుంచి రాజ్మ సేకరించాలని సూచించారు. మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, రైతు బజార్ సీఈవో నందకిషోర్, నాబార్డు ఏజీఎం ఎం.చావ్సాల్కర్ పాల్గొన్నారు. -
‘అమూల్’.. ఆర్గానిక్
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ సంస్థ తాజాగా రైతన్నలు పండించే ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు చేయూత అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పనపై వ్యవసాయ, ఉద్యాన, రైతు సాధికారత సంస్థ అధికారులతో అమూల్ ప్రతినిధులు బుధవారం సమావేశం కానున్నారు. విస్తృత మార్కెటింగ్ రాష్ట్రంలో ప్రస్తుతం 8.82 లక్షల ఎకరాల్లో 8 లక్షల మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్దఎత్తున మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది. రైతుబజార్లలో ప్రత్యేకంగా స్టాల్స్ కేటాయించడంతోపాటు కలెక్టరేట్ ప్రాంగణాలు.. సచివాలయాలు, ఆర్బీకేలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో వీక్లీ మార్కెట్లను ప్రోత్సహిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి విస్తృత స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చిన అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి అయ్యే పంట దిగుబడుల్లో 30 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మరో రూ.1,100 కోట్ల విలువైన 1.42 లక్షల టన్నుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్యను అధిగమించేందుకు మంత్ర, సహజ ఆహారం, రిలయన్స్ రిటైల్, బిగ్ బాస్కెట్ ఇతర కంపెనీల భాగస్వామ్యంతో రైతు సాధికార సంస్థ ముందుకెళ్తోంది. మరోవైపు టీటీడీ దేవస్థానానికి 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో కనీసం రూ.5 వేల కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 10 – 15 శాతం ప్రీమియం ధరకు సేకరణ ఈ ఏడాది 1,29,169 ఎకరాల్లో వరి, వేరుశనగ, జీడిమామిడి, మొక్కజొన్న, బెల్లం, కాఫీ, పసుపు సహా 12 రకాల ఉత్పత్తులు సాగవుతుండగా 2,03,640 టన్నుల దిగుబడి రావచ్చని అంచనా. రైతు సాధికార సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఎమ్మెస్పీకి మించి మార్కెట్లో పలికిన ధరలకు అదనంగా 15 శాతం, ఒకవేళ మార్కెట్ ధరలు ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉంటే ఎమ్మెస్పీకి అదనంగా 10 శాతం ప్రీమియం ధరతో రైతుల నుంచి టీటీడీ సేకరిస్తోంది. అదే రీతిలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందిన రైతులు ఉత్పత్తి చేసిన పంట ఉత్పత్తులను అమూల్ సంస్థ సేకరించి మార్కెటింగ్ చేయనుంది. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మా, శనగపిండి లాంటి వాటిని రైతుల నుంచి ప్రీమియం ధరలకు సేకరించి ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్లోకి తీసుకురానుంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అమూల్ ఆర్గానిక్స్ అధ్యయనం చేస్తోంది. గుజరాత్ నుంచి వచ్చిన అమూల్ బిజినెస్ హెడ్ దోషి, బ్రాండ్ మేనేజర్ స్నేహ కమ్లాని నేతృత్వంలోని అమూల్ ఆర్గానిక్స్ ప్రతినిధి బృందం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించింది. ప్రకృతి సాగు చేసే మహిళా రైతులతో సమావేశమైంది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాల్మిల్ కమ్ బల్క్ స్టోరేజ్ పాయింట్, ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించింది. ప్రకృతి, సేంద్రీయ సాగుకు ఊతం ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఇది చరిత్రాత్మక ముందడుగు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ అదే రీతిలో ప్రకృతి సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ముందుకు రావడం శుభ పరిణామం. ఇది రాష్ట్రంలో ప్రకృతి, సేంద్రీయ సాగుకు మరింత ఊతమిస్తుంది. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ మార్కెటింగ్‌కు తోడ్పాటు అందిస్తాం తెనాలి: పాడి పరిశ్రమ రంగంలో దేశంలో అగ్రగామిగా ఉన్న అమూల్ తాజాగా ఆర్గానిక్ రంగంలోకి ప్రవేశించిందని సంస్థ ఆర్గానిక్ హెడ్ నిమిత్ దోషి చెప్పారు. ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు తోడ్పాటునందిస్తామని తెలిపారు. అమూల్ సంస్థ మేనేజర్ స్నేహతో కలిసి మంగళవారం గుంటూరు జిల్లా కొల్లిపరలోని శ్రేష్ట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని నిమిత్ సందర్శించారు. కంపెనీ ఆధ్వర్యంలో పండించిన పంటలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను పరిశీలించారు. 100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు శ్రేష్ట డైరెక్టర్ ఉయ్యూరు సాంబిరెడ్డి తెలిపారు. ఎన్జీవోలు, ఇతర సంస్థలతో కలసి భూమి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పరిమిత వ్యయంతో సాగు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ విభాగం ప్రతినిధి ప్రభాకర్, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ రాజకుమారి, శ్రేష్ట డైరెక్టర్లు నెర్ల కుటుంబరెడ్డి, బొంతు గోపాలరెడ్డి, రైతు సాధికార సంస్థ రీజినల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెంకట్రావు, విజయ్, ప్రవల్లిక, భానుమతి తదితరులు పాల్గొన్నారు. -
చిత్తూరు పాలడెయిరీ పునరుద్ధరణ
-
అమూల్ గర్ల్ ప్రచార రూపకర్త ఇక లేరు
అమూల్ ప్రచారంలో కీలక పాత్ర పోషించేది.. విపరీతంగా ఆకట్టుకునేది ఆ ఉత్పత్తులపై ఉండే అమూల్ గర్ల్. ఒకరకంగా ఆ మస్కట్ వల్లే అమూల్ ఉత్పత్తులకు దేశవ్యాప్త ప్రచారం దక్కింది కూడా. దశాబ్దాలుగా అమూల్ సక్సెస్‌లో తన వంతు పోషిస్తోంది అమూల్ గర్ల్. అయితే ఈ ప్రచారం వెనుక ఉన్న మాస్టర్ మైండ్.. ఇక లేదు. అడ్వర్టయిజింగ్ రంగంలో దిగ్గజంగా పేరున్న సిల్వెస్టర్ డాకున్హా Sylvester daCunha కన్నుమూశారు. అమూల్ గర్ల్ ప్రచార రూపకర్త ఈయనే. 1960 నుంచి మొదలైన ఈ క్యాంపెయిన్ ఒకరకంగా అమూల్ ఉత్పత్తుల అమ్మకాల పెరగడానికి దోహదపడింది. ఈయన దగ్గర ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసిన యూస్టేస్ ఫెర్నాండెజ్ అమూల్ గర్ల్ మస్కట్‌ను తీర్చిదిద్దారు. అప్పటి నుంచి అమూల్ గర్ల్‌ను సందర్భోచితంగా(ఎలాంటి పరిణామం అయినా సరే!) తమ ప్రచారానికి అమూల్ వాడుకుంటూ వస్తోంది. సిల్వెస్టర్ డాకున్హా క్రియేటివ్ జీనియస్. ఆకర్షణీయమైన, జనరంజకమైన ఎన్నో యాడ్స్‌ను రూపొందించారాయన. చనిపోయేంతవరకూ డాకున్హా కమ్యూనికేషన్స్ కంపెనీకి చైర్మన్‌గా కొనసాగారు. మంగళవారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ జయెన్ మెహతా ప్రకటించారు. డాకున్హా మరణంతో ఆయన తనయుడు రాహుల్ ఇక నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1966లో అమూల్ గర్ల్ ప్రపంచానికి పరిచయం కాగా.. అట్టర్లీ బట్టర్లీ అనే ప్రచార నినాదాన్ని రూపొందించారాయన. అది ఇప్పటికీ కొనసాగుతోంది. సిల్వెస్టర్ డాకున్హా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. Very sorry to inform about the sad demise of Shri Sylvester daCunha, Chairman of daCunha Communications last night at Mumbai A doyen of Indian advertising industry who was associated with Amul since 1960s. The Amul family joins in mourning this sad loss @RahuldaCunha ॐ Shanti 🙏 pic.twitter.com/cuac1K6FSo — Jayen Mehta (@Jayen_Mehta) June 21, 2023 The man behind Amul's iconic Utterly Butterly Delicious ad campaign has just passed away. In his memoirs, Dr. V. Kurien had acknowledged the creative genius of Sylvester daCunha who was a legend of Indian advertising. His elder brother Gerson daCunha another legend of the Indian… — Jairam Ramesh (@Jairam_Ramesh) June 21, 2023 1966లో దేశంలోని ప్రతీ ఇంటికి చేరువయ్యేలా అమూల్ ఏదైనా కొత్త ప్రచారంతో ముందుకు రావాలనుకుంది. ఆ టైంలో అమూల్ యాడ్ ఏజెన్సీకి ఎండీగా ఉన్న సిల్వెస్టర్ డాకున్హా.. తన ఆర్ట్ డైరెక్టర్ యూస్టేస్ ఫెర్నాండెజ్ సహకారంతో అమూల్ గర్ల్ మస్కట్‌ను రూపొందించారు. ఆ టైంలో జీసీఎంఎంఎఫ్కు చైర్మన్‌గా ఉన్న డాక్టర్ వర్గీస్ కురియన్(క్షీరవిప్లవ పితామహుడు) వాళ్లకు సలహాలు కూడా ఇచ్చారట. అలా అమూల్ గర్ల్ పుట్టి.. ముంబైలోని రోడ్లపై హోర్డింగ్‌లుగా, బస్సులపైనా ఆ మస్కట్‌గా అమూల్‌కి సరికొత్త ప్రచారం కల్పించి.. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. అయితే అమూల్ గర్ల్‌కి 2021లో చిన్నమార్పు చేశారు. మిజోరాంకు చెందిన నాలుగేళ్ల గాయకురాలు ఎస్తర్ నమటేను అమూల్ గర్ల్‌గా గుర్తించారు. ఇదీ: ఫోన్లతో ఎక్కడపడితే అక్కడ స్కాన్ చేస్తాం.. మరి ఆ క్యూఆర్ కోడ్లు ఎలా పని చేస్తాయో తెలుసా? -
అమూల్ పాల సేకరణ ధరలు మరోసారి పెంపు
-
పాడి రైతులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తూ అమూల్ సంస్థ తాజాగా మరోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.4.51, ఆవు పాలపై రూ.1.84 చొప్పున.. కనిష్టంగా గేదె పాలపై రూ.2.26, ఆవు పాలపై రూ.0.11 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.32, ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది. ఈ పెంపు రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాలకు ఆదివారం నుంచి వర్తించనుంది. తద్వారా 65 వేల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్ తరఫున రాయలసీమలో కైరా యూనియన్, కోస్తాంధ్రలోని సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇటీవలే సబర్కాంత్ యూనియన్ పాల సేకరణ ధరలను పెంచింది. తాజాగా కైరా యూనియన్ పాల సేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా.. తాజా పెంపుతో కలిపి ఏడు దఫాలు పాల సేకరణ ధరలు పెరిగాయి. కైరా యూనియన్ ప్రస్తుతం లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.84.26, ఆవు పాలకు రూ.42.27 చొప్పున చెల్లిస్తోంది. తాజా పెంపుతో లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.87.77, ఆవు పాలకు రూ.42.38 చొప్పున రాయసీమ జిల్లాల పరిధిలోని పాడి రైతులకు కైరా యూనియన్ చెల్లించనుంది. 30 నెలల్లో 8.50 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాల వెల్లువ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 17 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించింది. 14,845 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో 2.96 లక్షల మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో మొదలై 3,549 గ్రామాలకు విస్తరించింది. 2116 ఆర్బీకేల పరిధిలోని 76వేల మంది నుంచి రోజూ సగటున 1.72 లక్షల లీటర్ల చొప్పున పాలు సేకరిస్తోంది. 8.50 కోట్ల లీటర్ల పాలను సేకరించగా.. పాడి రైతులకు రూ.378.26 కోట్లు చెల్లించారు. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా.. అంతకు మించి ప్రస్తుతం లీటర్‌కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవు పాలకు రూ.10 నుంచి 15 వరకు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు రూ.3,395.18 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. -
సహకార డెయిరీ రంగాన్ని చంపేసింది చంద్రబాబే
చంద్రబాబు ప్రభుత్వం హయాం.. రాష్ట్రంలో సహకార డెయిరీలను ప్రభుత్వమే చిదిమేసింది. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ ఎదుగుదల కోసం గ్రామ గ్రామాన వేళ్లూనుకొన్న సహకార డెయిరీలను ఆయన ప్రభుత్వమే నాశనం చేసేసింది. కొన్నింటిని తనకు అనుంగులుగా ఉండే వ్యక్తులకు అప్పజెప్పింది. చివరకు రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులు ఘోరంగా దెబ్బతిన్నారు. పాలకు కనీస ధర కూడా అందక అల్లాడిపోయారు. ‘ఈనాడు’ విషం.. విషపు రాతల ‘ఈనాడు’కు ఈ వాస్తవాలు పట్టవు. ప్రజల సంక్షేమం అసలే పట్టదు. ఎంతసేపూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యం. అందులో భాగంగానే ‘అమూల్ మాకొద్ద’ంటున్నారంటూ విషపు రాతలతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. మూతపడ్డ సహకార పాల డెయిరీలు పునరుద్ధరించి, పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ గ్రామాన మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేసి సహకార రంగాన్ని బలోపేతం చేసింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. లీటర్‌కు రూ. 4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం కింద లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి చేకూరుస్తోంది. పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన పాల సేకరణ, సరఫరాయే లక్ష్యంగా పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గిట్టుబాటు ధర వస్తోంది. అమూల్‌కు పాలు పోసే వారే కాదు.. అమూల్ రాకతో పాల సేకరణ ధరలు పెంచడం వలన ప్రైవేటు డెయిరీలకు పాలు పోస్తున్న పాడి రైతులూ లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీల రైతులకూ లబ్ధి అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకూ లబ్ధి చేకూరింది. అమూల్ పాల సేకరణ ధర పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా విధిలేని పరిస్థితుల్లో పాల సేకరణ ధరలు పెంచాయి. అమూల్ ఇచ్చే ధరతో పోలిస్తే తక్కువే అయినా, వాటికి పాలు పోసే పాడి రైతులకు ఈ 30 నెలల్లో రూ.3,312.46 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరింది. సహకార డెయిరీలకు చంద్రబాబు కాటు హెరిటేజ్ డెయిరీ కోసం రాష్ట్రంలో సహకార డెయిరీ రంగాన్ని ఓ పథకం ప్రకారం నిర్వీర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ పరిధిలోకి మార్చారు. ఆ తర్వాత వాటిని కంపెనీలుగా ప్రకటించుకున్నారు. విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద కంపెనీలుగా ప్రకటించుకున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు లాభాల్లో ఉన్న ప్రభుత్వ డెయిరీలన్నీ బాబు హయాంలో మూతపడ్డాయి. 2017 జనవరి 23న కడప జిల్లాలోని పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణాలోని మినీ డెయిరీ–కంకిపాడు, 2019 మార్చి 15న చిత్తూరు జిల్లాల్లోని మదనపల్లి డెయిరీ, మరో 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మిల్క్ చిల్లింగ్ సెంటర్ (ఎంసీసీ)తో పాటు 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూలు) మూతపడ్డాయి. రాష్ట్రంలోని పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. పాల సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారు. కోట్లాది రూపాయల విలువైన మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, చిల్లింగ్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లతో సహా ఇతర మౌలిక సదుపాయాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వీటిపై ఈనాడు పత్రిక ఏనాడూ చిన్న వార్తా రాయలేదు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం నుంచి పాలను సేకరించడమే నిలిపివేసింది. రూ.45 కోట్లకు పైగా బకాయిలను ఎగ్గొట్టారు. అయినా బాబు సర్కారు నోరు మెదపలేదు. సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాల సహకార సంఘాల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. గ్రామాల్లో మహిళా డెయిరీ సహకార సంఘాలు (ఎండీఎస్) ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుసంధానంగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పాలు సేకరిస్తున్నారు. మూడు జిల్లాలతో మొదలైన పాల సేకరణ ప్రస్తుతం 17 జిల్లాలకు విస్తరించింది. 20 – 30 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న ప్రైవేటు డెయిరీలు ప్రస్తుతం రోజుకు 5 – 6 లక్షల లీటర్లు సేకరిస్తుంటే, కేవలం 30 నెలల్లోనే అమూల్ సంస్థ రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. గతంలో ప్రైవేటు డెయిరీలు రెండేళ్లకోసారి పాలసేకరణ ధరలు పెంచేవి. అమూల్ మూడు నెలలకోసారి పాల సేకరణ ధరలను సవరిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. ఇలా 30 నెలల్లో ఏడు రెట్లు పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.88, ఆవు పాలకు రూ.43.69 చెల్లిస్తున్నారు. 30 నెలల్లో గేదె పాలపై రూ.16.53, ఆవు పాలపై రూ. 9.49 మేర ధరలు పెంచారు. ఒక్క రూపాయి తక్కువ కాకుండా 10 రోజులకోసారి నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు ఆర్బీకేల ద్వారా ఇన్పుట్స్ అందిస్తున్నారు. మధ్యవర్తులు, వాటాదారుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా ప్రోత్సాహకం, బోనస్ పంపిణీ చేస్తున్నారు. ఏటా 2 సార్లు లీటరుకు అర్ధ రూపాయి లాయల్టీ బోనస్ కూడా వస్తోంది. పాడి రైతుల సంరక్షణ, నిర్వహణ కోసం రూ.40 వేల వరకు ఎలాంటి హామీ లేకుండా స్వల్పకాలిక రుణాలందిస్తున్నారు. అమూల్ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే రూ.680 కోట్లతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూలు నిర్మిస్తున్నారు. – సాక్షి, అమరావతి -
కంపాకోలాతో కోకాకోలా,పెప్సికోకు గట్టి సవాల్ విసిరిన రిలయన్స్
-
మళ్ళీ పెరిగిన అమూల్ పాల ధరలు: ఈ సారి ఎంతంటే?
రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడి పాలిట భారంగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో అమూల్ పాల ధరలు మళ్ళీ పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత ఉంది? అమూల్ పాల ధరలు ఎక్కడ పెరిగాయనే.. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. నివేదికల ప్రకారం, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) 'అమూల్' పేరుతో విక్రయిస్తున్న పాల ధరలను శనివారం ఏకంగా రెండు రూపాయలను పెంచింది. ఈ ధరలు గుజరాతీ నగరాలైన సౌరాష్ట్ర, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో అమలులోకి వచ్చాయి. ధరల పెరుగుదల తరువాత 500 మీ.లీ పాలు రూ. 32, అమూల్ స్టాండర్డ్ ధర రూ. 29, అమూల్ తాజా ధర రూ. 26, అమూల్ టి-స్పెషల్ ధర రూ. 30కి చేరింది. డిసెంబర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తరువాత పాల ధరలను పెంచడం ఇదే మొదటిసారి. గత ఆగష్టు నెలలో GCMMF పాల ధరలు 2 రూపాయలు పెంచింది. (ఇదీ చదవండి: రెండు సార్లు ఓటమి.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధించాడిలా..) జిసిఎమ్ఎమ్ఎఫ్ సభ్య సంఘాలు గుజరాత్ రాష్ట్రంలోని 18,154 గ్రామాలలో ఉన్న మొత్తం 36 లక్షల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి ప్రతి రోజు సగటున 264 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తోంది. గత ఫిబ్రవరిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో అమూల్ ధరలు పెరిగిన తరువాత మదర్ డెయిరీ కూడా పాల ధరలను రూ. 2 వరకు పెంచింది. ముడిసరుకు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో మదర్ డెయిరీ ప్రతినిధి తెలిపారు. -
అమూల్ ఎండీగా సోధి రాజీనామా
సాక్షి,ముంబై: అమూల్ బ్రాండ్‌తో తమ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రూపిందర్ సింగ్ సోధి సోధి సోమవారం రాజీనామా చేశారు. గతంలో గుజరాత్లో మాత్రమే పరిమితమైన అమూల్ సోధి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , రాజస్థాన్ నుండి పాల సహకార సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చారు. అమూల్ కోసం 50కి పైగా కొత్త ఉత్పత్తులను పరిచయం చేసిన విజయవంతమయ్యారు. సోమవారం (జనవరి 9) జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల సర్వీసు తర్వాత ఆయన ఈ పదవిని వీడారు. గత రెండేళ్లుగా ఎక్స్టెన్షన్ మీద ఉన్నాననీ, తన రాజీనామాను బోర్డు ఆమోదించిందని సోధి ప్రకటించారు. ప్రస్తుత ఆపరేటింగ్ ఆఫీసర్ జయన్ మెహతాకు తాత్కాలికంగా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇండియన్ డారీ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన సోధి 2010. జూన్ నుండి అమూల్ ఎండీగా పని చేస్తున్నారు. 1982లో అమూల్‌లో సీనియర్ సేల్స్ ఆఫీసర్‌గా చేరాడు. 2000 నుండి 2004 మధ్య, అమూల్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)గా పనిచేసిన , ఆతరువాత జూన్ 2010లో ఎండీగా ప్రమోట్ అయ్యారు. -
Kurnool: అమూల్ ఆధ్వర్యంలో పాలసేకరణ.. పాడి రైతుకు పండగ
రైతు ఇంట పాడిని అభివృద్ధి చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ను రంగంలోకి దించుతోంది. సెప్టెంబర్ నుంచి జిల్లాలో పాలసేకరణ కొనసాగనుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దీంతో పోటీతత్వం పెరిగి పాడి రైతుకు మేలు చేకూరనుంది. పాలకు మెరుగైన ధర లభించనుంది. సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాల్లో పాడి గేదెలు 59,690, పాడి ఆవులు 68,120 ఉన్నాయి. పచ్చిమేత పుష్కలంగా ఉండే సమయంలో రోజుకు 5.5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం గేదెపాలకు వెన్న శాతాన్ని బట్టి లీటరుకు గరిష్టంగా రూ.67 వరకు ధర లభిస్తోంది. ఆవు పాలను గరిష్టంగా లీటరుకు రూ.32 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. పాల కొలతలు, వెన్నశాతం నిర్ధారణలో రైతులను దగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమూల్ వస్తే రైతులకు వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ.77.98 ధర లభించే అవకాశం ఉంది. ఆర్బీకేల పక్కనే బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు అమూల్ ద్వారా సెప్టెంబర్ నెల నుంచి పాల సేకరణ చేపట్టనున్నారు. రైతు భరోసా కేంద్రాల వారీగా 2000 లీటర్ల సామర్థ్యంతో బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పాల ఉత్పత్తి ఉన్న 199 ఆర్బీకేల సమీపంలోనే వీటి ఏర్పాటుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్థలాలు సేకరిస్తోంది. ఒక్కోదానికి ఐదు సెంట్ల స్థలం అవసరం కాగా, ఇప్పటికే 198 పాలశీతలీకరణ కేంద్రాలకు రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 47 భవనాలు కూడా నిర్మిస్తున్నారు. ఇవిగాక గ్రామాల్లో 200 లీటర్ల సామర్థ్యంతో 200కుపైగా పాల సేకరణ కేంద్రాలు(అటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు) కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటికి 3.50 సెంట్ల స్థలం అవసరం కాగా, 168 పాలసేకరణ కేంద్రాల కోసం రెవెన్యూ అధికారులు అవసరమైన స్థలాలను సేకరించారు. వీటిలో అమూల్ సిబ్బంది ఉండి, సేకరించిన పాలను బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా అమూల్ డెయిరీకి పాలు సరఫరా అవుతాయి. ట్యాంకర్లు వెళ్లడానికి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు రూట్లను కూడా సిద్ధం చేశారు. మహిళా సొసైటీల ఏర్పాటు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో 3.25 లక్షల మంది వరకు మహిళలు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది పాడిపై ఆధారపడి ఉన్నారు. పాలు ఉత్పత్తి చేసే మహిళలతో ఉమెన్ డెయిరీ డెవలప్మెంటు సొసైటీలు ఏర్పాటు కానున్నాయి. వీటిని కో–ఆపరేటివ్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేస్తారు. అమూల్ పాల సేకరణలో డీఆర్డీఏ, పశుసంవర్ధకశాఖ, సహకార శాఖ భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పటికే సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ అయిన వెంకటకృష్ణను ప్రభుత్వం జిల్లా డెయిరీ డెవలప్మెంట్ అధికారిగా నియమించింది. ఉమన్ డెయిరీ డెవలప్మెంట్ సహకార చట్టం కింద సొసైటీలను రిజిస్ట్రేషన్ చేస్తారు. రోజుకు ఎన్ని లీటర్లు ఉత్పత్తి అవుతున్నాయనే వాటిని పర్యవేక్షిస్తారు. ఎన్నో ప్రయోజనాలు మాకు పది పాడి గేదెలు ఉన్నాయి. పచ్చిమేత పుష్కలంగా లభించే సమయంలో రోజుకు 35 లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. గతంలో ఒక డెయిరీకి పాలుపోసే వాళ్లం. లీటరుకు గరిష్టంగా రూ.45 వరకే ధర లభించేది. ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో ప్రస్తుతం పిండిన పాలు పిండినట్లు హోటళ్లకు పోస్తున్నాం. లీటరుకు రూ. 55 ప్రకారం ధర ఇస్తున్నారు. అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణ చేపడితే పాడిరైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. మా గ్రామంలో కూడా బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. – రసూల్, టి.గోకులపాడు, కృష్ణగిరి మండలం పాడి రైతులకు మంచి రోజులు వస్తున్నాయి మాకు గ్రేడెడ్ ముర్రా గేదెలు4, ఆవులు మూడు ఉన్నాయి. రోజు సమతుల్యత కలిగినదాణా, పచ్చిమేత ఇస్తుంటాం. రోజుకు 45 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతాయి. పాడిమీద కష్టపడుతున్నా, తగిన గిట్టుబాటు ధర లభించడం లేదు. అమూల్ పాల సేకరణ మొదలైతేనే పాడిరైతుకు మంచి రోజులు వచ్చినట్లు అవుతుంది. గిట్టుబాటు ధరలు లభిస్తాయనే నమ్మకం ఉంది. – ఖాజావలి, గూడూరు గిట్టుబాటు ధర లభిస్తుంది సెప్టెంబరు నుంచి జిల్లాలో అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఉపాధి నిధులతో పాలశీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణ చేపడితే పోటీతత్వం పెరిగి రైతుకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. – డాక్టర్ రామచంద్రయ్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి -
ప్రధాని మోదీకి ‘అమూల్’ సంస్థ లేఖ.. ఎందుకో తెలుసా..?
ప్లాసిక్ట్ రహిత సమాజం కోసం ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ స్ట్రాలను బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. వివరాల ప్రకారం.. ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయాలని కోరుతూ అమూల్ సంస్థ ప్రధాని మోదీని కోరుతూ లేఖ రాసింది. ఈ మేరకు అమూల్ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధీ తన లేఖలో ప్రధాని మోదీని కోరారు. ఈ లేఖలో తక్షణమే స్ట్రాలను బ్యాన్ చేయడం వల్ల రైతులు, పాల వాడకంపై ప్రభావం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ స్ట్రాలపై నిషేధం విధిస్తే చిన్న జ్యూస్ ప్యాకులు, డెయిరీ ఉత్పత్తుల ప్యాక్‌లపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఇదే క్రమంలో కూల్ డ్రింక్ సంస్థలైన పెప్సీ, కోకాకోలా కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే ప్లాస్టిక్ స్ట్రాలను బ్యాన్ చేస్తే తీవ్రంగా నష్టపోనున్నట్టు తెలిపాయి. ఇక, అమూల్ సంస్థ తన ప్రొడక్ట్స్ అన్నింటికీ ప్లాస్టిక్ స్ట్రాలను వాడుతుంటుడం గమనార్హం. కాగా, ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో పేపర్ స్ట్రాలను వినియోగించాలని కేంద్రం ఇది వరకే సూచించింది. ఇది కూడా చదవండి: ఇకపై రేషన్ షాపుల్లో పండ్లు, కూరగాయలు -
గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థ బలోపేతం కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని, కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జగనన్న అమూల్ పాలవెల్లువ, మత్స్యశాఖపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని తెలిపారు. హెరిటేజ్‌కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని అన్నారు. అమూల్ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలకు తప్పక ధరలు పెంచాల్సి వచ్చిందని అన్నారు. అమూల్ వచ్చాక లీటరుకు రూ.5 నుంచి రూ.15ల వరకూ అదనపు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. చదవండి: Andhra Pradesh: తక్షణమే రూ.5 లక్షలు మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధికోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడిపశువులను కొనుగోలు చేశారని తెలిపారు. వారికి మరింత చేయూత నివ్వడానికి బీఎంసీయూలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. దానివల్ల మహిళలకు మరింత మేలు జరుగుతుందని, మహిళలకు మేలు కలిగే దిశగా ఈ చర్యలను చేపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థబలోపేతం కావాలని అన్నారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం- కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ-శిక్షణా కరదీపిక పుస్తకాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. మత్స్యశాఖపై సమీక్ష.. ప్రజలకు పౌష్టికాహారం అందించడమే కాదు, స్థానిక వినియోగాన్ని పెంచడంద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వాహబ్‌లు, రిటైల్ వ్యవస్థలను తీసుకు వస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇది జరక్కపోతే సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్ అయ్యి రేట్లు తగ్గిస్తున్నారని అన్నారు. ప్రాసెసింగ్ చేసేవాళ్లు, ఎక్స్పోర్ట్ చేసేవాళ్లు సిండికేట్ అవుతున్నారని పలు దఫాలుగా రైతులు ఆరోపిస్తున్నారని తెలిపారు. దీనికి పరిష్కారంగా ప్రీప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్‌రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని పేర్కొన్నారు. పౌష్టికాహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాదు, మత్స్య ఉత్పత్తులకు స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలని తెలిపారు. రైతులను ఆదిశగా ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఫీడ్, సీడ్లో నాణ్యత కోసం, రైతుల్ని దోచుకునే విధానాలను అడ్డుకోవడం కోసం కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్వారంగ సబ్సిడీలు– రైతులకు మేలు ఆక్వారంగానికి ఇచ్చే సబ్సిడీలు రైతులకు నేరుగా అందేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మరింత మేలు చేయడానికి తగిన ఆలోచనలు చేయాలని అధికారులకు తెలిపారు. ఆక్వా హబ్‌ల్లో భవిష్యత్తులో చిన్న సైజు రెస్టారెంట్ కూడా పెట్టే ఆలోచన చేయాలని అన్నారు. ఫిష్ ఆంధ్రా లోగోను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఆక్వాహబ్‌లు, అనుబంధిత రిటైల్ దుకాణాల ద్వారా దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. జనవరి 26 నాటికి దాదాపు 75–80 హబ్‌లను, 14వేల రిటైల్ అవుట్లెట్లు అందుబాటులోకి వస్తాయని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రి ప్రాసెసింగ్, ప్రాసెసింగ్ యూనిట్లను సిద్ధం చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 10 ప్రాసెసింగ్‌ప్లాంట్లు, 23 ప్రి ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల మార్కెట్లో సిండికేట్‌కు చెక్ పెట్టగలుగుతామని, రైతులకు మంచి ధరలు వస్తాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పనులు మొదలయ్యాని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలివిడతగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్–జులై నాటికి ఈ నాలుగు ప్రారంభానికి సిద్ధం చేస్తామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. మిగిలిన 5 ఫిషింగ్ హార్బర్ల పనులు ఈ డిసెంబర్లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశానికి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధకశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ బాబు, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్, అమూల్ ప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
అమూల్‌తో ఒప్పందం.. రైతులకు ఎంతో మేలు: సీఎం జగన్
-
అమూల్‌తో ఒప్పందం.. రైతులకు ఎంతో మేలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: డెయిరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అమూల్ ప్రాజెక్ట్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లాలో 'అమూల్ పాల వెల్లువ' ప్రాజెక్ట్‌ను వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. అమూల్ ద్వారా ఇప్పటికే 400 గ్రామాల్లో పాలసేకరణను చేపట్టామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 180 గ్రామాల్లో పాలసేకరణకు శ్రీకారం చుట్టామని.. చిత్తూరు జిల్లాలో మరో 170 గ్రామాల్లో పాలసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ‘‘అమూల్ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అమూల్ ఒక సహకార సంస్థ.. అక్కచెల్లెమ్మలే వాటాదారులు. అమూల్‌తో ఒప్పందం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. అమూల్ సంస్థ లాభాలను పాడి రైతులకే తిరిగి చెల్లిస్తున్నారని’’ సీఎం పేర్కొన్నారు. చదవండి: 104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్ జగన్ దేశంలోనే కడప బెటాలియన్‌కు ప్రత్యేక స్థానం -
ఏపీ-అమూల్ ప్రాజెక్ట్: వచ్చే లాభాలను అక్కచెల్లెమ్మకు ఇస్తాం
-
సీఎం జగన్‌తో అమూల్ సంస్థ ప్రతినిధులు భేటీ
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అమూల్ సంస్థ ప్రతినిధులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌తో గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) ఎండీ ఆర్ఎస్ పోధి, కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ భేటీ అయ్యారు. -
నిజం తెలీకపోతే నోరు మూస్కో
బాలీవుడ్ పెద్ద దిక్కు అమితాబ్ బచ్చన్ ఈ మధ్య తరచూ ట్రోలింగ్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడి ఆసుపత్రిని, తనకు సేవలందించిన వైద్యులు, నర్సులు అందించిన సేవలను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే ఓ మహిళ దీన్ని పూర్తిగా తప్పు పట్టారు. తన తండ్రికి కరోనా లేకపోయినా తప్పుడు రిపోర్టులతో ఆ ఆసుపత్రిలో చేర్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత వేరే ఆసుపత్రిలో చేర్పిస్తే అసలు కరోనా లేదన్న విషయం వెల్లడైందన్నారు. అలాంటి ఆసుపత్రికి బిగ్‌బీ పబ్లిసిటీ చేస్తున్నారని, దీంతో ఆయనపై ఉన్న ఇన్నాళ్ల గౌరవం పూర్తిగా పోయిందని రాసుకొచ్చారు. (కరోనా నుంచి కోలుకున్న అమితాబ్) దీనిపై స్పందించిన అమితాబ్.. "నేను ఆస్పత్రి కోసం పబ్లిసిటీ చేయడం లేదు. నన్ను సంరక్షించినందుకు, చికిత్స అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు నాపై గౌరవం కోల్పోయినప్పటికీ నేను మాత్రం వైద్యులను గౌరవిస్తాను" అని సున్నితంగా సమాధానమిచ్చారు. మరోవైపు బిగ్‌బీ కరోనా నుంచి కోలుకోవడంతో అమూల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ఇందులో అమితాబ్ ఫోన్ పట్టుకుని కూర్చుంటే పక్కన అమూల్ బేబీ నిల్చుని ఉంది. దీనికి "ఏబీ బీట్స్ సీ" అనే ట్యాగ్‌లైన్‌ను జోడించింది. ఏబీ అంటే అమితాబ్ బచ్చన్ సీ అంటే కరోనా వైరస్‌ను జయించారని అర్థం. ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీంతో ఈ విమర్శలతో అగ్గి మండిన బిగ్‌బీ.. 'నీకు నిజం తెలీకపోతే నోరు మూస్కొని ఉండు' అంటూ గట్టిగానే కౌంటరిచ్చారు. (ఓ అనామకుడా.. నీపై జాలి వేస్తోంది) -
ఏపీ: పరిశ్రమ రంగంలో మరో కీలక అడుగు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో కీలక అడుగు పడింది. అమూల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్హెడ్ రాజన్ సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్‌తో సీఎం మాట్లాడారు. (అమూల్‌తో ఒప్పందం మహిళా సాధికారతకు తోడ్పాటు) ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప అడుగు అన్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా కింద మహిళలకు రూ.11వేల కోట్లు సాయం చేశాం. ప్రభుత్వ సహాయం మహిళల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వచ్చాయని, దక్షిణాది రాష్ట్రాలకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అమూల్‌తో నేడు ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం