సాక్షి,ముంబై: అమూల్ బ్రాండ్‌తో తమ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రూపిందర్ సింగ్ సోధి సోధి సోమవారం రాజీనామా చేశారు. గతంలో గుజరాత్‌లో మాత్రమే పరిమితమైన అమూల్ సోధి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , రాజస్థాన్ నుండి పాల సహకార సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చారు. అమూల్ కోసం 50కి పైగా కొత్త ఉత్పత్తులను పరిచయం చేసిన విజయవంతమయ్యారు.
సోమవారం (జనవరి 9) జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల సర్వీసు తర్వాత ఆయన ఈ పదవిని వీడారు. గత రెండేళ్లుగా ఎక్స్‌టెన్షన్ మీద ఉన్నాననీ, తన రాజీనామాను బోర్డు ఆమోదించిందని సోధి ప్రకటించారు. ప్రస్తుత ఆపరేటింగ్ ఆఫీసర్ జయన్ మెహతాకు తాత్కాలికంగా బాధ్యతలను నిర్వహించనున్నారు.
ఇండియన్ డారీ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన సోధి 2010. జూన్ నుండి అమూల్ ఎండీగా పని చేస్తున్నారు. 1982లో అమూల్‌లో సీనియర్ సేల్స్ ఆఫీసర్‌గా చేరాడు. 2000 నుండి 2004 మధ్య, అమూల్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)గా పనిచేసిన , ఆతరువాత జూన్ 2010లో ఎండీగా ప్రమోట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment