రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడి పాలిట భారంగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో అమూల్ పాల ధరలు మళ్ళీ పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత ఉంది? అమూల్ పాల ధరలు ఎక్కడ పెరిగాయనే.. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
నివేదికల ప్రకారం, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) 'అమూల్' పేరుతో విక్రయిస్తున్న పాల ధరలను శనివారం ఏకంగా రెండు రూపాయలను పెంచింది. ఈ ధరలు గుజరాతీ నగరాలైన సౌరాష్ట్ర, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో అమలులోకి వచ్చాయి.
ధరల పెరుగుదల తరువాత 500 మీ.లీ పాలు రూ. 32, అమూల్ స్టాండర్డ్ ధర రూ. 29, అమూల్ తాజా ధర రూ. 26, అమూల్ టి-స్పెషల్ ధర రూ. 30కి చేరింది. డిసెంబర్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తరువాత పాల ధరలను పెంచడం ఇదే మొదటిసారి. గత ఆగష్టు నెలలో GCMMF పాల ధరలు 2 రూపాయలు పెంచింది.
(ఇదీ చదవండి: రెండు సార్లు ఓటమి.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధించాడిలా..)
జిసిఎమ్ఎమ్ఎఫ్ సభ్య సంఘాలు గుజరాత్ రాష్ట్రంలోని 18,154 గ్రామాలలో ఉన్న మొత్తం 36 లక్షల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి ప్రతి రోజు సగటున 264 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తోంది. గత ఫిబ్రవరిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో అమూల్ ధరలు పెరిగిన తరువాత మదర్ డెయిరీ కూడా పాల ధరలను రూ. 2 వరకు పెంచింది. ముడిసరుకు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో మదర్ డెయిరీ ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment