Milk price hike
-
మళ్ళీ పెరిగిన అమూల్ పాల ధరలు: ఈ సారి ఎంతంటే?
రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడి పాలిట భారంగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో అమూల్ పాల ధరలు మళ్ళీ పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత ఉంది? అమూల్ పాల ధరలు ఎక్కడ పెరిగాయనే.. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. నివేదికల ప్రకారం, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) 'అమూల్' పేరుతో విక్రయిస్తున్న పాల ధరలను శనివారం ఏకంగా రెండు రూపాయలను పెంచింది. ఈ ధరలు గుజరాతీ నగరాలైన సౌరాష్ట్ర, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో అమలులోకి వచ్చాయి. ధరల పెరుగుదల తరువాత 500 మీ.లీ పాలు రూ. 32, అమూల్ స్టాండర్డ్ ధర రూ. 29, అమూల్ తాజా ధర రూ. 26, అమూల్ టి-స్పెషల్ ధర రూ. 30కి చేరింది. డిసెంబర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తరువాత పాల ధరలను పెంచడం ఇదే మొదటిసారి. గత ఆగష్టు నెలలో GCMMF పాల ధరలు 2 రూపాయలు పెంచింది. (ఇదీ చదవండి: రెండు సార్లు ఓటమి.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధించాడిలా..) జిసిఎమ్ఎమ్ఎఫ్ సభ్య సంఘాలు గుజరాత్ రాష్ట్రంలోని 18,154 గ్రామాలలో ఉన్న మొత్తం 36 లక్షల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి ప్రతి రోజు సగటున 264 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తోంది. గత ఫిబ్రవరిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో అమూల్ ధరలు పెరిగిన తరువాత మదర్ డెయిరీ కూడా పాల ధరలను రూ. 2 వరకు పెంచింది. ముడిసరుకు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో మదర్ డెయిరీ ప్రతినిధి తెలిపారు. -
పాక్‌లో కొండెక్కిన ధరలు.. చుక్కలు చూపిస్తున్న పాలు, పెట్రోల్, డీజిల్
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీ ఎత్తున పెరిగాయి. లీటర్ పాల ధర 210 రూపాయలకు పెరిగింది. పాడి ఉత్పత్తులతోపాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీ కనీవినీ ఎరగనంతగా పెరిగి జనానికి చుక్కలు చూపుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు పాక్‌లో పెట్రోల్ ధరలు కూడా చారిత్రలో తొలిసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది. అంతేగాక డీజిల్‌పై 17.20 రూపాయలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.280కి పెరిగింది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగంపేర్కొంది. కాగా ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న పౌరులపై మరింత భారాన్ని మోపింది. రికార్డు స్థాయిలో చికెన్ ధరలు పాకిస్తాన్లో కిలో కోడి మాంసం ఏకంగా 780 రూపాయలైంది! బోన్‌లెస్ అయితే రూ.1,100కు చేరుకుంది. కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది. దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. కొన్నాళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కి శ్రీలంకను తలపిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. చదవండి: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు -
‘పెట్రోల్‌తో పాలు పోటీపడుతున్నాయి.. ఇక్కడితో ఆగదు’
గాంధీనగర్: పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు అమూల్ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో పాల ధరలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ధరల పెరుగుదల విషయంలో పెట్రోల్‌తో పాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా. ధరలపై ఉదాసీనత ప్రదర్శించే ప్రభుత్వ తప్పులతో దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాయని విమర్శించారు. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త ధరలు అమలవుతాయని వెల్లడించింది. దీనిపై ఆప్ ఎంపీ రాఘవచద్దా ట్వీట్ చేశారు. ‘మీకు చెప్పాను కదా..! ధరల విషయంలో పాలు, పెట్రోల్ పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. ఈ రోజు అమూల్ పాల ధరలు లీటర్‌కు రూ.2 చొప్పున పెరిగాయి. ఉదాసీనంగా వ్యహరిస్తోన్న ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. పాల ధరలు మళ్లీ పెరుగనున్నాయి? కారణాలు.. పశుగ్రాసం ధరల విపరీతంగా పెరగటం, లంపీ వైరస్ వ్యాప్తి’ అని భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశుగ్రాసం ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, దాంతో రైతులు ఇతర పంటలను పశువులకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు రాఘవ్ చద్ధా. పశుగ్రాసం ధరలు 9 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఒక్క గుజరాత్‌లోనే గత రెండేళ్లలో 1.36 లక్షల హెక్టార్ల పశుగ్రాసం సాగు తగ్గిపోయిందన్నారు. పశుగ్రాసానికి కొరత ఏర్పడిన క్రమంలో 2020లో 100 ఎఫ్పీఓలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటి వరకు ఒక్కటి సైతం ఏర్పాటు చేయలేకపోయిందని ఆరోపించారు. ఇదీ చదవండి: రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. కాంగ్రెస్ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై -
పండుగ వేళ సామాన్యుడి నెత్తిన మరో పిడుగు
సాక్షి,ముంబై: ద్రవ్యోల్బణం, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఆహార ధరలతో కష్టాలు పడుతున్న సామాన్య జనానికి పండుగ సీజన్లో మరో షాక్ తగిలింది. అమూల్ పాల ధర లీటరుకు 2 రూపాయలు పెరిగింది. అకస్మాత్తుంగా శనివారం ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటరుకు రూ.61 నుంచి రూ.63కి పెరిగడంతో షాకవ్వడం వినియోగదారుల వంతైంది. ఈ మేరకు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ధరల పెంపును నిర్ణయించినట్టు తెలుస్తోంది. పశువుల పెంపకంలో రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పశుగ్రాసం, ఇతర ఖర్చులతో ఉత్పత్తి వ్యయం నిరంతరం పెరుగుతూ వస్తోంది. అయితే అమూల్‌ను మరో ఐదు సహకార సంఘాలతో విలీనం చేసి బహుళ-రాష్ట్ర సహకార సంఘం (ఎంఎస్‌సిఎస్) ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి, సహకార మంత్రి అమిత్ షా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. మరోవైపు శుక్రవారం విడుదలైన టోకు ద్రవ్యోల్బణం డేటా ప్రకారం పశుగ్రాసం ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. టోకు ద్రవ్యోల్బణం పశుగ్రాస ద్రవ్యోల్బణం రేటు 25 శాతానికి పైగానే ఉంది. కాగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అమూల్ బ్రాండ్‌తో మార్కెట్ చేస్తుంది. సేకరణ ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో అమూల్, మదర్ డెయిరీలు ఆగస్టులో 2 రూపాయలు చొప్పున పాలధరను పెంచిన సంగతి తెలిసిందే. మార్చిలో కూడా పాల ధరలు పెరిగాయి. -
సామాన్యుడిపై మరో పిడుగు, పాల ధర పెంపు
ముంబై: అమూల్ లేదా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తాజాగా పాల ధరలను పెంచేసింది. లీటరుకు రెండు రూపాయల చొప్పున ధరలను పెంచింది. మదర్ డెయిరీ కూడా పాల ధరను లీటరుకు రూ.2 పెంచింది. రెండు కంపెనీల సవరించిన ధరలు రేపటి నుంచి (బుధవారం, ఆగస్టు 17) అమలులోకి రానున్నాయి. పలితంగా ఇప్పటికే కూరగాయలు, ఇంధనధరలతో అష్టకష్టాలుపడుతున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగుపడినట్టైంది. పాల ధరను రూ. 2 పెంచడం వల్ల ఎంఆర్‌పిలో 4 శాతం పెంపు ఉంటుందని అమూల్ తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ,సౌరాష్ట్ర మార్కెట్స్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, పశ్చిమ బెంగాల్, ముంబైతోపాటు అమూల్ తాజా పాలను విక్రయించే అన్ని ఇతర మార్కెట్లలో ఈ సవరించిన ధరలు అమల్లో ఉంటాయని అమూల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా అమూల్ గోల్డ్ ధర 500 మి.లీ రూ. 31, అమూల్ తాజా 500 మి.లీ రూ. 25, అమూల్ శక్తి 500 మి.లీ ధర రూ. 28లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మదర్ డెయిరీకి సంబంధించి, ఫుల్క్రీమ్ మిల్క్‌పై లీటరుకు రూ.59 ఉండగా, బుధవారం నుంచి రూ.61కి చేరింది. టోన్డ్ మిల్క్ ధరలు రూ.51కిపెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.45గా ఉండనుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.53 కి పెరిగింది. మొత్తం నిర్వహణ వ్యయం , ఉత్పత్తి ఖర్చులు పెరుగుదల కారణంగా ఈ ధరల పెంపు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతానికి పెరిగింది. ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, తబ సభ్య సంఘాలు కూడా గత ఏడాది కంటే రైతుల ధరలను 8-9 శాతం వరకు పెంచాయని అమూల్ తెలిపింది. -
పాల ధర పెంచేసిన మదర్ డెయిరీ
మదర్ డెయిరీ పాల ధరలను లీటర్‌కు రూ.2 పెంచింది.మదర్ డెయిరీ పెంచిన ధరలు 25 మే 2019 నుంచి అమలులోకి రానున్నాయి. లీటర్‌కు రూ.2, అరలీటర్‌కు రూ.1 రూపాయి చొప్పు పెరగనుంది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ధరలు పెంచుతున్నట్టు మదర్ డెయిరీ తెలిపింది. పాలు సేకరణ ధరలు గత 3-4 నెలల పెరుగుదలపై నిరంతరాయంగా పెరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా పశుగ్రాసం వ్యయం 15-20 శాతం పెరగడం,లేబర్ కాస్ట్ పెరగడం వంటి కారణాలతో పాల ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే టోకెన్ మిల్క్ లేదా బల్క్ వెండర్ మిల్క్ ధరలను పెంచడం లేదు. కేవలం పోలీ ప్యాక్ మిల్క్ వేరియంట్స్‌కు ఇది వర్తిస్తుంది. కొత్త రేటు ప్రకారం,వెన్న శాతం అధికంగా ఉండే పాల ధర లీటరు, 53 రూపాయలుగాను, అర లీటరు ధర రూ. 27 గాను వుంటుంది. పూర్తిస్థాయి క్రీమ్ (ప్రీమియమ్) పాలు లీటరుకు 55 రూపాయలు, అర లీటరు రూ.28 గాను వుంటుంది. డబుల్ టోన్ మిల్క్ (లైవ్ లైట్) ధరను 34 రూపాయల నుంచి లీటరుకు 36 రూపాయలకు పెరిగింది. అరలీటరు ధర 18 నుంచి 19 రూపాయలకు పెరిగింది. స్కిమ్డ్ అరలీటరు పాల ధరను కూడా ఒక రూపాయి( రూ.20 నుంచి 21 రూపాయలకు) పెంచింది. అయితే అరలీటరు ఆవు పాల ధరను ఒక రూపాయి పెంచింది. కానీ, లీటరు ధరలో లాంటి మార్పు లేదు. కాగా ఇప్పటికే అమూల్ పాల ధరలను పెంచింది. నాలుగు రోజుల క్రితం లీటర్‌కు రూ.2 పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఇక పాలు మరింత ప్రియం..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు ముగిశాయో లేదో పెట్రో ధరల బాదుడు షురూ కాగా, తాజాగా నిత్యావసరమైన పాల ధరలు చుక్కలు చూస్తున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో మంగళవారం నుంచి పాల ధరలు లీటర్‌కు రూ 2 మేర పెరుగుతాయని డైరీ దిగ్గజం అమూల్ ప్రకటించింది. ఢిల్లీ, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. మార్చి 2017లో పాల ధరలు పెంచిన తర్వాత మళ్లీ ఇప్పుడు ధరలను సవరించామని అమూల్ బ్రాండ్‌పై పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా ధరలు మే 21 నుంచి వర్తిస్తాయని తెలిపింది. పాల ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో పాల ధరల పెంపు అనివార్యమైందని జీసీఎంఎంఎఫ్ తెలిపింది. -
మూడు రోజులే
నేటి నుంచి శీతాకాల సమావేశాలు పది రోజులకు ప్రతిపక్షాల పట్టు స్పీకర్ నిరాకరణ సాక్షి, చెన్నై: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్ని కేవలం మూడు రోజు లకే పరిమితం చేశారు. గురువారం సంతాపాలతో సరిపెట్టేందుకు నిర్ణయించారు. మిగిలిన రెండు రోజుల్లో సభను మమా... అనిపించేందుకు సీఎం ఓ పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. అయితే, సభను పది రోజులైనా నిర్వహించాలని డీఎంకేతో పాటుగా ప్రతి పక్షాలన్నీ పట్టుబట్టినా, స్పీకర్ ధనపాల్ నిరాకరించారు. మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడడంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. జయలలిత అడుగు జాడల్లో నడుస్తున్న సీఎం ఓ పన్నీరు సెల్వం తన నేతృత్వంలో తొలి సమావేశాన్ని మమా అనిపించే దిశగా వ్యూహ రచన చే శారు. రాష్ర్టంలో ప్రజా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఎక్కడి పథకాలు అక్కడే అన్న చం దంగా మారాయి. పాలన అధ్వానంగా మారిందన్న ఆరోపణ లు వస్తున్నాయి. పాల స్కాం, గ్రానైట్ స్కాం, గుడ్డు స్కాం ఇలా రోజుకో స్కాం వెలుగులోకి వస్తున్నాయి. పాల ధర పెంపు, విద్యుత్ చార్జీల వడ్డన ఇలా అనేకానే క రకాలుగా ప్రజ ల నడ్డి విరిగే విధంగా ధరల మోత మోగుతోంది. వీటన్నింటి పై చర్చకు ప్రతిపక్షాలు వ్యూహ రచనల్లో పడ్డాయి. ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. వీరి చర్యల్ని సీఎం పన్నీరు సెల్వం ఎలా ఎదుర్కొంటారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, ప్రతిపక్షాల వ్యూహాలకు కళ్లెం వేసే దిశ గా సభను కేవలం మూడు రోజులకు పరిమితం చేస్తూ సీఎం పన్నీరు సెల్వం నిర్ణయించడం ప్రతి పక్షాల్ని విస్మయంలో పడేసింది. మూడు రోజులే : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో తేదీ నుంచి ఆరంభమవుతాయని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడికి అస్త్రాలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అయితే, వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం పన్నీరు సెల్వం సభను మూడు రోజులకు పరిమితం చేశారు. ఇందులో ఓ రోజు సంతాపానికి సరిపోతుంది. బుధవారం అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం అయింది. మంత్రి నత్తం విశ్వనాథన్, డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి విజయరామన్, విప్ మనోహరన్, డీఎంకే తరపున ఎమ్మెల్యే చక్రపాణి, డీఎండీకే తరపున చంద్రకుమార్, సీపీఎం తరపున సౌందరరాజన్, ఎంఎంకే తరపున జవహరుల్లా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో సభను కనీసం పది రోజులు నిర్వహించాలని డీఎంకేతోపాటుగా ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టాయి. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం సభా వ్యవహారాల కమిటీ చర్చించి సభను మూడు రోజులు నిర్వహించేందుకు నిర్ణయించింది. గురువారం ఉదయం 10 గంటలకు సభను ప్రారంభిస్తూ, సంతాప తీర్మానాలకు పరిమితం చేశారు. శుక్రవారం 2014-15కు గాను ఆదాయ, వ్యయాలకు సంబంధించి అనుబంధ బడ్జెట్‌ను దాఖలు చేస్తారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సభ సోమవారం పునః ప్రారంభం అవుతుంది. ఆ రోజున అనుబంధ బడ్జెట్‌పై చర్చ, వివిధ ముసాయిదాలకు ఆమోదంతో సభను మమా అనిపించేందుకు నిర్ణయించారు. ఆగ్రహం: ప్రభుత్వ తీరుపై డీఎంకే, డీఎండీకేలు తీవ్ర ఆగ్రహా న్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాలన కుంటు పడిందని, బినామీ ప్రభుత్వం పుణ్యమా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని డీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. డీఎండీకే సభ్యులైతే, సభకు రావాలా..? వద్దా..? అన్న మీమాంసలో పడ్డారు. మూడు రోజులకు సభను పరిమితం చేసిన దృష్ట్యా, తమ అధ్యక్షుడు విజయకాంత్‌తో చర్చించినానంతరం సభకు వచ్చేది లేనిది ప్రకటిస్తామని పేర్కొనడం గమనార్హం. ఇక, పీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, ఎంఎంకే, సీపీఐలు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టాయి. సభను మమా అనిపించడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వ్యూహం : సభను మూడు రోజులకు పరిమితం చేసినా, ఈ సమయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు డీఎంకే వ్యూహా లను రచించింది. పన్నీరు సెల్వం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కార్యాచరణను కరుణానిధి రచించారు. ఉదయం అన్నా అరివాలయంలో కరుణానిధి నేతృత్వంలో డీఎంకే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఇందులో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన విధానాలు, లేవనెత్తాల్సిన అంశాలు, ప్రజా పక్షాన నిలబడే రీతిలో ప్రభుత్వాన్ని ఢీ కొట్టే అస్త్రాలను ఎంపిక చేసుకున్నారు. -
కోర్టుకు ‘పాల’ మోత
* అవినీతి ఆస్తుల జప్తుకు వినతి * ఆవిన్‌కు హైకోర్టు సూచన * ఎనిమిది వారాల గడువు సాక్షి, చెన్నై: పాల ధరల పెంపు వ్యవహారం మంగళవారం కోర్టుకు చేరింది. ఆవిన్ కల్తీలో అవినీతిపరుల ఆస్తుల్ని జప్తు చేసి నష్టాన్ని భర్తీ చేసుకోవాలన్న పిటిషనర్ సూచనను మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. ఆ దిశగా పరిశీలనకు చర్యలు తీసుకోవాలని ఆవిన్ సంస్థకు ఎనిమిది వారాల గడువు విధించింది. రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగిన ఆవిన్ పాలలో నీళ్ల కల్తీ గుట్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కల్తీ వెనుక ప్రధాన సూత్రధారుడితో పాటుగా పలువురిని అరెస్టు చేశారు. సీబీసీఐడీ నేతృత్వంలో విచారణ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆవిన్ సంస్థ నష్టాల్లో ఉందన్న సాకును చూపిస్తూ పాల ధరను ప్రభుత్వం పెంచింది. మునుపెన్నడూ లేని రీతిలో లీటరకు రూ.10 పెంచారు. ఇది ఇతర పాల ఉత్పత్తుల ధరల పెంపునకు కారణమైంది. ప్రైవేటు పాల సంస్థలు సైతం ధరల్ని పెంచడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పాల ధర మోత వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం నాయకుడు సూర్య ప్రకాష్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల జప్తుతో భర్తీ : ఆవిన్‌పాల కల్తీ గుట్టురట్టు వ్యవహారాన్ని తన పిటిషన్లో వివరించారు. నష్టాల్లో ఉన్న ఆవిన్ సంస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ధరల పెంపు అనివార్యాన్ని వివరిస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనను పొందు పరిచారు. ఆవిన్ నష్టాన్ని ఎత్తి చూపుతూ ధరల మోత మోగించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఆవిన్ క ల్తీ ముఠాలో కీలక నిందితుల గురించి వివరిస్తూ, ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు వారి ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయడం లేని ప్రశ్నించారు. ఆవిన్ సంస్థ రూ. 300 కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నట్టు అధికారులు ప్రకటించారని, అలాంటప్పుడు పదేళ్ల పాటుగా వేల కోట్లను ఆర్జించిన కల్తీ ముఠా ఆస్తుల్ని జప్తు చేయడానికి అధికారులు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కల్తీ వ్యవహారంలో పట్టుబడిన ప్రతి ఒక్కరి ఆస్తుల్ని జప్తు చేయడం ద్వారా ఆవిన్ సంస్థ నష్టాల నుంచి పూర్తి స్థాయిలో గట్టెక్కడం ఖాయం అని వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుని వారి ఆస్తుల జప్తుతో పాటుగా పెంచిన పాల ధరను తగ్గించే విధంగా ఆవిన్ సంస్థను, ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. 8 వారాల గడవు : ఈ పిటిషన్ విచారణకు మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ పిటిషనర్ సూచనల్ని పరిగణనలోకి తీసుకుంది. ఎందుకు వారి ఆస్తుల్ని జప్తు చేసి నష్టాల్ని భర్తీ చేసుకోలేదన్న వాదనను తెర మీదకు తెచ్చింది. ఇందుకు తగ్గ పరిశీలన ప్రకియను ఎనిమిది వారాల్లోపు తీసుకుని, తదుపరి విచారణ తేదీన నివేదిక రూపంలో సమర్పించాలని ఆవిన్ సంస్థను ఆదేశిస్తూ ఉత్తర్వుల్ని ప్రధాన బెంచ్ జారీ చేసింది. ఆవిన్ కేసులో నిందితులుగా ఉన్న ఓ పాలకోవా తయారీ సంస్థ ప్రతినిధులు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో పడ్డారు. అయితే, వారి పిటిషన్‌ను విల్లుపురం న్యాయస్థానం తోసిపుచ్చింది. -
పాలూ మండుతున్నాయ్
- లీటర్‌పై రూ.2 పెంచిన ప్రైవేటు డెయిరీలు - ఆర్నెల్లలో మూడో సారి - రెండు రోజుల్లో విజయ డెయిరీ వంతు కొడవలూరు : కొండెక్కి కూర్చున్న నిత్యావసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ తదితర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరోసారి పాలపిడుగు పడింది. ప్రైవేటు డెయిరీలు బుధవారం నుంచి లీటర్‌కు రూ.2 పెంచాయి. పాల ధర పెరగడం ఆర్నెల్లలో ఇది మూడోసారి. ఈ ఏడాదిలో జనవరి 13న లీటరుకి రూ.2 పెంచగా, మార్చి 10న రూ.2 పెంచగా తాజాగా మరోసారి భారం వేశారు. ఈ మేరకు ఇప్పటికే ప్రైవేటు డెయిరీలు ప్రకటించి అమలు చేస్తుండగా, విజయ డెయిరీ శుక్ర, లేదా శనివారాల్లో ధరల పెంపును ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. ధరల పెంపుతో పాల వినియోగదారులపై నెలకు అదనంగా రూ.42 లక్షల భారం పడుతుంది. జిల్లాలో సుమారు 15 వరకు పాల డెయిరీలు ఉండగా విజయ డెయిరీ మాత్రమే సహకార రంగంలో నడుస్తోంది. మిగిలినవన్నీ ప్రైవేటు డెయిరీలే. అయితే పాలు, పాల ఉత్పత్తుల అమ్మకంలో విజయ డెయిరీదే సింహభాగం. మొత్తం మీద రోజుకు 70 వేల లీటర్లు పాలు విక్రయిస్తుండగా అందులో విజయ డెయిరీ వాటా 18 వేల లీటర్లు. గతంలో పాల ధర పెంపును విజయ డెయిరీ మొదట ప్రకటించగా ఈ సారి ప్రైవేటు డెయిరీలు ముందు నిలిచాయి. దీంతో రూ.46గా ఉన్న లీటరు పాల ధర రూ.48కి చేరుకుంది. కుంటి సాకులు : పాల ధర పెంపునకు ఖర్చుల పెరుగుదల, సేకరణ ధర పెంపే కారణాలని డెయిరీ వర్గాలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి చూస్తే అవి కుంటి సాకులేనని తెలుస్తోంది. పాల సేకరణ ధర పెంచింది ఒకసారి మాత్రమే. పది శాతం వెన్న ఉంటే లీటరుకు రూ.48 చెల్లిస్తామని ప్రకటించారు. రైతులు తెచ్చే పాలలో ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే వెన్న ఉంటుంది. లీటర్‌కు రూ.35 నుంచి రూ.37 వరకు చెల్లిస్తున్నారు. పాల రవాణాకు మాత్రమే డీజిల్‌ను వినియోగిస్తున్నారు. వీటిని సాకుగా చూపి తరచూ పాల ధరను పెంచడం సబబా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. -
పాల ధర పెంపు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రభుత్వ, పార్టీ రాజకీయ కార్యకలాపాలతో అలసి సొలసిపోయిన అమ్మ పాడి రైతులకు వరం ప్రకటించి కొడనాడుకు విశ్రాంతికి వెళ్లిపోయారు. ఆవు, గేదె పాల సేకరణ ధర మూడు రూపాయలు పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా నడుస్తున్న ఆవిన్తోపాటూ రాష్ట్రంలో అనేక ప్రయివేటు, సహకార పాడిరైతుల సంఘాలు ఉన్నాయి. పశువుల దాణా ధర పెరగడం, సిబ్బంది జీతాలు పెంచక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం చెల్లిస్తున్న సేకరణ ధర గిట్టుబాటు కావడం లేదని కొన్ని నెలలుగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. వీరి విజ్ఞప్తులపై అధికారులతో ఇటీవల సమీక్షించిన సీఎం సేకరణ ధర పెంచడం న్యాయ సమ్మతమని నిర్ణయానికి వచ్చారు. ఆవుపాలకు ఇప్పటి వరకు లీటరుకు రూ.20 చెల్లిస్తుండగా రూ.23 చెల్లించాలని తీర్మానించారు. అలాగే గేదె పాలకు రూ.28 చెల్లిస్తుండగా ఆ ధరను రూ.31కి పెంచేందుకు ఆమె సమ్మతించారు. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి తెస్తున్నట్లు మంగళవారం ఆమె ప్రకటించారు. రాష్ట్రంలోని 22.50 లక్షల సహకార పాల అమ్మకం దారులు పెంచిన ధరలతో లబ్ధిపొందుతారు. పాలసేకరణ ధర పెంపుకారణంగా ప్రభుత్వంపై ఏడాదికి రూ.273 కోట్ల 75 లక్షల అదనపు భారం పడుతుంది. పాల సేకరణ ధర పెంపుపై పాడిరైతుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పాలసీ వల్ల ప్రభుత్వానికి రూ.420 కోట్ల రాబడి వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ మంగళవారం ప్రకటించారు.