మూడు రోజులే | Three days | Sakshi
Sakshi News home page

మూడు రోజులే

Published Thu, Dec 4 2014 7:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

మూడు రోజులే

మూడు రోజులే

  • నేటి నుంచి శీతాకాల సమావేశాలు
  •   పది రోజులకు ప్రతిపక్షాల పట్టు
  •   స్పీకర్ నిరాకరణ
  • సాక్షి, చెన్నై: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్ని కేవలం మూడు రోజు లకే పరిమితం చేశారు. గురువారం సంతాపాలతో సరిపెట్టేందుకు నిర్ణయించారు. మిగిలిన రెండు రోజుల్లో సభను మమా... అనిపించేందుకు సీఎం ఓ పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. అయితే, సభను పది రోజులైనా నిర్వహించాలని డీఎంకేతో పాటుగా ప్రతి పక్షాలన్నీ పట్టుబట్టినా, స్పీకర్ ధనపాల్ నిరాకరించారు. మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడడంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది.

    జయలలిత అడుగు జాడల్లో నడుస్తున్న సీఎం ఓ పన్నీరు సెల్వం తన నేతృత్వంలో తొలి సమావేశాన్ని మమా అనిపించే దిశగా వ్యూహ రచన చే శారు. రాష్ర్టంలో ప్రజా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఎక్కడి పథకాలు అక్కడే అన్న చం దంగా మారాయి. పాలన అధ్వానంగా మారిందన్న ఆరోపణ లు వస్తున్నాయి. పాల స్కాం, గ్రానైట్ స్కాం, గుడ్డు స్కాం ఇలా రోజుకో స్కాం వెలుగులోకి వస్తున్నాయి.

    పాల ధర పెంపు, విద్యుత్ చార్జీల వడ్డన ఇలా అనేకానే క రకాలుగా ప్రజ ల నడ్డి విరిగే విధంగా ధరల మోత మోగుతోంది. వీటన్నింటి పై చర్చకు ప్రతిపక్షాలు వ్యూహ రచనల్లో పడ్డాయి. ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. వీరి చర్యల్ని సీఎం పన్నీరు సెల్వం ఎలా ఎదుర్కొంటారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, ప్రతిపక్షాల వ్యూహాలకు కళ్లెం వేసే దిశ గా సభను కేవలం మూడు రోజులకు పరిమితం చేస్తూ సీఎం పన్నీరు సెల్వం నిర్ణయించడం ప్రతి పక్షాల్ని విస్మయంలో పడేసింది.
     
    మూడు రోజులే : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో తేదీ నుంచి ఆరంభమవుతాయని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడికి అస్త్రాలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అయితే, వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం పన్నీరు సెల్వం సభను మూడు రోజులకు పరిమితం చేశారు. ఇందులో ఓ రోజు సంతాపానికి సరిపోతుంది. బుధవారం అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం అయింది. మంత్రి నత్తం విశ్వనాథన్, డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి విజయరామన్, విప్ మనోహరన్, డీఎంకే తరపున ఎమ్మెల్యే చక్రపాణి, డీఎండీకే తరపున చంద్రకుమార్, సీపీఎం తరపున సౌందరరాజన్, ఎంఎంకే తరపున జవహరుల్లా ఈ సమావేశానికి హాజరయ్యారు.

    ఇందులో సభను కనీసం పది రోజులు నిర్వహించాలని డీఎంకేతోపాటుగా ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టాయి. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం సభా వ్యవహారాల కమిటీ చర్చించి సభను మూడు రోజులు నిర్వహించేందుకు నిర్ణయించింది. గురువారం ఉదయం 10 గంటలకు సభను ప్రారంభిస్తూ, సంతాప తీర్మానాలకు పరిమితం చేశారు. శుక్రవారం 2014-15కు గాను ఆదాయ, వ్యయాలకు సంబంధించి అనుబంధ బడ్జెట్‌ను దాఖలు చేస్తారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సభ సోమవారం పునః ప్రారంభం అవుతుంది. ఆ రోజున అనుబంధ బడ్జెట్‌పై చర్చ, వివిధ ముసాయిదాలకు ఆమోదంతో సభను మమా అనిపించేందుకు నిర్ణయించారు.
     
    ఆగ్రహం: ప్రభుత్వ తీరుపై డీఎంకే, డీఎండీకేలు తీవ్ర ఆగ్రహా న్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాలన కుంటు పడిందని, బినామీ ప్రభుత్వం పుణ్యమా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని డీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.  డీఎండీకే సభ్యులైతే, సభకు రావాలా..? వద్దా..? అన్న మీమాంసలో పడ్డారు. మూడు రోజులకు సభను పరిమితం చేసిన దృష్ట్యా, తమ అధ్యక్షుడు విజయకాంత్‌తో చర్చించినానంతరం సభకు వచ్చేది లేనిది ప్రకటిస్తామని పేర్కొనడం గమనార్హం. ఇక, పీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, ఎంఎంకే, సీపీఐలు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టాయి. సభను మమా అనిపించడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
     
    వ్యూహం : సభను మూడు రోజులకు పరిమితం చేసినా, ఈ సమయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు డీఎంకే వ్యూహా లను రచించింది. పన్నీరు సెల్వం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కార్యాచరణను కరుణానిధి రచించారు. ఉదయం అన్నా అరివాలయంలో కరుణానిధి నేతృత్వంలో డీఎంకే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఇందులో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన విధానాలు, లేవనెత్తాల్సిన అంశాలు, ప్రజా పక్షాన నిలబడే రీతిలో ప్రభుత్వాన్ని ఢీ కొట్టే అస్త్రాలను ఎంపిక చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement