the electric charge
-
మూడు రోజులే
నేటి నుంచి శీతాకాల సమావేశాలు పది రోజులకు ప్రతిపక్షాల పట్టు స్పీకర్ నిరాకరణ సాక్షి, చెన్నై: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్ని కేవలం మూడు రోజు లకే పరిమితం చేశారు. గురువారం సంతాపాలతో సరిపెట్టేందుకు నిర్ణయించారు. మిగిలిన రెండు రోజుల్లో సభను మమా... అనిపించేందుకు సీఎం ఓ పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. అయితే, సభను పది రోజులైనా నిర్వహించాలని డీఎంకేతో పాటుగా ప్రతి పక్షాలన్నీ పట్టుబట్టినా, స్పీకర్ ధనపాల్ నిరాకరించారు. మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడడంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. జయలలిత అడుగు జాడల్లో నడుస్తున్న సీఎం ఓ పన్నీరు సెల్వం తన నేతృత్వంలో తొలి సమావేశాన్ని మమా అనిపించే దిశగా వ్యూహ రచన చే శారు. రాష్ర్టంలో ప్రజా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఎక్కడి పథకాలు అక్కడే అన్న చం దంగా మారాయి. పాలన అధ్వానంగా మారిందన్న ఆరోపణ లు వస్తున్నాయి. పాల స్కాం, గ్రానైట్ స్కాం, గుడ్డు స్కాం ఇలా రోజుకో స్కాం వెలుగులోకి వస్తున్నాయి. పాల ధర పెంపు, విద్యుత్ చార్జీల వడ్డన ఇలా అనేకానే క రకాలుగా ప్రజ ల నడ్డి విరిగే విధంగా ధరల మోత మోగుతోంది. వీటన్నింటి పై చర్చకు ప్రతిపక్షాలు వ్యూహ రచనల్లో పడ్డాయి. ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. వీరి చర్యల్ని సీఎం పన్నీరు సెల్వం ఎలా ఎదుర్కొంటారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, ప్రతిపక్షాల వ్యూహాలకు కళ్లెం వేసే దిశ గా సభను కేవలం మూడు రోజులకు పరిమితం చేస్తూ సీఎం పన్నీరు సెల్వం నిర్ణయించడం ప్రతి పక్షాల్ని విస్మయంలో పడేసింది. మూడు రోజులే : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో తేదీ నుంచి ఆరంభమవుతాయని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడికి అస్త్రాలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అయితే, వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం పన్నీరు సెల్వం సభను మూడు రోజులకు పరిమితం చేశారు. ఇందులో ఓ రోజు సంతాపానికి సరిపోతుంది. బుధవారం అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం అయింది. మంత్రి నత్తం విశ్వనాథన్, డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి విజయరామన్, విప్ మనోహరన్, డీఎంకే తరపున ఎమ్మెల్యే చక్రపాణి, డీఎండీకే తరపున చంద్రకుమార్, సీపీఎం తరపున సౌందరరాజన్, ఎంఎంకే తరపున జవహరుల్లా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో సభను కనీసం పది రోజులు నిర్వహించాలని డీఎంకేతోపాటుగా ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టాయి. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం సభా వ్యవహారాల కమిటీ చర్చించి సభను మూడు రోజులు నిర్వహించేందుకు నిర్ణయించింది. గురువారం ఉదయం 10 గంటలకు సభను ప్రారంభిస్తూ, సంతాప తీర్మానాలకు పరిమితం చేశారు. శుక్రవారం 2014-15కు గాను ఆదాయ, వ్యయాలకు సంబంధించి అనుబంధ బడ్జెట్‌ను దాఖలు చేస్తారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సభ సోమవారం పునః ప్రారంభం అవుతుంది. ఆ రోజున అనుబంధ బడ్జెట్‌పై చర్చ, వివిధ ముసాయిదాలకు ఆమోదంతో సభను మమా అనిపించేందుకు నిర్ణయించారు. ఆగ్రహం: ప్రభుత్వ తీరుపై డీఎంకే, డీఎండీకేలు తీవ్ర ఆగ్రహా న్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాలన కుంటు పడిందని, బినామీ ప్రభుత్వం పుణ్యమా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని డీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. డీఎండీకే సభ్యులైతే, సభకు రావాలా..? వద్దా..? అన్న మీమాంసలో పడ్డారు. మూడు రోజులకు సభను పరిమితం చేసిన దృష్ట్యా, తమ అధ్యక్షుడు విజయకాంత్‌తో చర్చించినానంతరం సభకు వచ్చేది లేనిది ప్రకటిస్తామని పేర్కొనడం గమనార్హం. ఇక, పీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, ఎంఎంకే, సీపీఐలు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టాయి. సభను మమా అనిపించడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వ్యూహం : సభను మూడు రోజులకు పరిమితం చేసినా, ఈ సమయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు డీఎంకే వ్యూహా లను రచించింది. పన్నీరు సెల్వం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కార్యాచరణను కరుణానిధి రచించారు. ఉదయం అన్నా అరివాలయంలో కరుణానిధి నేతృత్వంలో డీఎంకే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఇందులో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన విధానాలు, లేవనెత్తాల్సిన అంశాలు, ప్రజా పక్షాన నిలబడే రీతిలో ప్రభుత్వాన్ని ఢీ కొట్టే అస్త్రాలను ఎంపిక చేసుకున్నారు. -
విద్యుత్ పథకానికి ‘వంద’నాలు
4.5 లక్షల కుటుంబాలకు మేలు వైఎస్ జగన్ ప్రకటనపై హర్షాతిరేకాలు ప్రతి నెలా జిల్లాకు రూ.22.50 కోట్లు ఆదా ఒక్కో కుటుంబానికి రూ.500 వరకు లబ్ధి పెద్దాయన్ని గుర్తుచేసుకుంటున్న పేదలు విద్యుత్ బిల్లుల భారాలను మోయలేక.. కరెంటును పొదుపుగా వాడుకుంటూ నానా అవస్థలు పడుతున్న ప్రజానీకానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. 150 యూనిట్ల విద్యుత్ వాడుకున్న ఇంటికి కేవలం వంద రూపాయలే వసూలుచేస్తామంటూ విజయనగరం జిల్లా సాలూరులో మంగళవారం ఆయన చెప్పినప్పటినుంచి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మండుటెండల్లో చల్లని పన్నీటి జల్లులాంటి మాటలు చెప్పారని జననేతకు జేజేలు పలుకుతున్నారు. సాక్షి, విజయవాడ : విద్యుత్ వైర్లను తాకితే షాక్కొడతాయని తెలుసు.. కానీ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బిల్లుల్ని చూస్తేనే జనాలు షాక్‌కు గురయ్యారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు. ఆయన తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు చార్జీలను ఎడాపెడా వడ్డించారు. విద్యుత్ చార్జీలకుతోడు సర్‌చార్జీలు కూడా కలిపిన బిల్లుచూసి వినియోగదారుల గుండెలు గుభేల్మంటున్నాయి. ఈ నేపథ్యంలో పేదలకు వస్తున్న విద్యుత్ బిల్లులను చూసి చలించి పోయిన జగన్మోహన్రెడ్డి ‘వంద రూపాయలకే 150 యూనిట్ల విద్యుత్ పథకం’ ప్రకటించడం హర్షణీయమని జిల్లావాసులు అంటున్నారు. ఇది ఎగువ మధ్యతరగతి వర్గాల వరకు బాగా ఉపయోగపడుతుందని విద్యుత్‌సంస్థల అధికారులు చెబుతున్నారు. లబ్ధి పొందేది ఎలా.. జిల్లాలో 10.79 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారుగా 4.5 లక్షల కనెక్షన్లు నెలకు 150 యూనిట్ల లోపే విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ వినియోగదారులు నెలకు రూ.600 వరకు విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టనున్న పథకం వల్ల ఒక్కో కుటుంబానికి నెలకు రూ.500 వరకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది. విద్యుత్ బిల్లు ఇలా... విద్యుత్ మండలి మొదటి 250 యూనిట్లు వాడుకునేవారిపైనే కరెంటు చార్జీల భారం ఎక్కువగా మోపింది. ఆ తరువాత స్లాబ్‌లపై పెరిగే రేటుతో తక్కువగానే ఉంటుంది. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన 150 యూనిట్లకు ప్రస్తుతం ఉన్న టారిఫ్ ప్రకారం చార్జీలు ఈ విధంగా ఉంటాయి. యూనిట్లకు రూ.2.60 చొప్పున రూ.130 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.3.25 చొప్పున రూ.162.50 101 నుంచి 150 యూనిట్ల వరకు రూ.4.80 చొప్పున రూ.240 వసూలు చేస్తారు. ఈ లెక్కన విద్యుత్ బిల్లు రూ. 532.50 వస్తుంది. దీనిపై మీటర్ అద్దె సర్వీస్ చార్జీ, విద్యుత్ సర్‌చార్జీలు కలుపుకొంటే సుమారు రూ.600 అవుతుందని ఎస్పీడీసీఎల్ అధికారులే చెబుతున్నారు. ఈ విధంగా జిల్లాలో ఉన్న 4.5లక్షల విద్యుత్ వినియోగదారులు ప్రతినెల రూ.27 కోట్లు ఎస్పీడీసీఎల్కు చెల్లిస్తున్నారు. ఈ బిల్లు చెల్లించకపోతే వచ్చే నెలలో అదనంగా మరో రూ.100 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కాగా జగన్మోహన్రెడ్డి ఆలోచన ప్రకారం పథకమే అమలు చేస్తే రూ.100 కడితే సరిపోతుంది. దీనివల్ల కేవలం రూ.4.50 కోట్లు మాత్రమే ఖజానాకు ఆదాయం రాగా పేద, మధ్య తరగతి ప్రజలకు నెలకు రూ.22.50 కోట్ల వరకు రాయితీ వస్తుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ భారాన్ని భరించేందుకు సిద్ధమని వైఎస్ జగన్ చేసిన ప్రకటన విన్న ప్రజలు.. ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచని రాజన్నను గుర్తుచేసుకుంటూ నీరాజనం పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలను మోసగించిన కాంగ్రెస్.. నెలకు 50 యూనిట్లులోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అనేకమంది పేదలు కేవలం ఒక్కబల్బు వాడుకుని 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్నారు. ఇప్పుడు వారి కుల ధ్రువీకరణపత్రాలు విద్యుత్ శాఖకు ఇస్తేనే రాయితీ ఇస్తామని ప్రకటించడంతో ఎస్సీ,ఎస్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత్రాలు ఇవ్వని వారి నుంచి పాత బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.