సాక్షి, తాడేపల్లి: డెయిరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అమూల్ ప్రాజెక్ట్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లాలో 'అమూల్ పాల వెల్లువ' ప్రాజెక్ట్‌ను వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. అమూల్ ద్వారా ఇప్పటికే 400 గ్రామాల్లో పాలసేకరణను చేపట్టామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 180 గ్రామాల్లో పాలసేకరణకు శ్రీకారం చుట్టామని.. చిత్తూరు జిల్లాలో మరో 170 గ్రామాల్లో పాలసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.
‘‘అమూల్ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అమూల్ ఒక సహకార సంస్థ.. అక్కచెల్లెమ్మలే వాటాదారులు. అమూల్‌తో ఒప్పందం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. అమూల్ సంస్థ లాభాలను పాడి రైతులకే తిరిగి చెల్లిస్తున్నారని’’ సీఎం పేర్కొన్నారు.
చదవండి:
104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్ జగన్
దేశంలోనే కడప బెటాలియన్‌కు ప్రత్యేక స్థానం
Comments
Please login to add a commentAdd a comment