
వ్యవసాయం, పౌరసరఫరాల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు.
సాక్షి, అమరావతి: వ్యవసాయం, పౌరసరఫరాల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీదిరి అప్పరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీ నాగిరెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాల కృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్, ఉద్యానవన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ శ్రీధర్,ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
►ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి
►ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలి
►ఎప్పటిలానే మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలి
►పీడీఎస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలి
►మిల్లెట్ల వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై కరపత్రాలతో అవగాహన కల్పించాలి
►ఈ ఏడాది రెండో విడత రైతు భరోసాకు సిద్ధం కావాలి
►ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి
►చేయూత కింద మహిళలకోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగించాలి
►బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలి