civil supplies
-
ధాన్యం దారి మళ్లితే ఉపేక్షించం.. రైస్ మిల్లర్లకు డీఎస్ చౌహాన్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం దారి మళ్లితే ఉపేక్షించేది లేదని.. చర్యలు కఠినంగా ఉంటాయంటూ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ వార్నింగ్ ఇచ్చారు. రైస్ మిల్లర్ల వద్దకు చేరిన ధాన్యం నిల్వలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజులలోనే 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో సర్కార్ పారదర్శకంగా వ్యహరిస్తుందని తెలిపారు.ధాన్యం దారి మళ్లింపునకు అవకాశం ఉండబోదని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తోపాటు ఆయా జిల్లాల అసోసియేషన్లు ప్రభుత్వానికి ఇప్పటికే హామీ ఇచ్చాయన్నారు. కొందరు రైస్ మిల్లర్లు మాత్రం అవకతవకలకు పాల్పడుతూ దారి మళ్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లర్లు ఉత్తమ పనితీరు కనబరుస్తున్నారని చెప్పారు. -
సరుకులు లేవు..సమన్వయం లేదు
ఆరురోజులుగా విజయవాడ అతలాకుతలమవుతోంది. లెక్కలేనన్ని మరణాలు... అంతులేనంత నష్టం.. ఐదు లక్షల మంది ప్రజల జీవితాలు తల్లకిందులైపోయాయి.. ఇంతజరుగుతుంటే వరద నిండిన వీధుల్లో ముఖ్యమంత్రి రోడ్‌షోలు, తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా జేసీబీల్లో మంత్రుల ఊరేగింపులే తప్ప బాధితులకు రవ్వంత ఉపశమనం కలిగించలేకపోయారు. సరుకులు పంచుతున్నామని ప్రచారం చేయడంతో శుక్రవారం జనం ఆశగా ఎదురుచూశారు.. యథాప్రకారం అదీ లేదు... ఇక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు.. వీధిలో చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకోవడం చూసి జనం విస్తుపోయారు..సాక్షి, అమరావతి: వరద సహాయక కార్యక్రమాల్లో చంద్రబాబు సర్కారు తీరు అజిత్ సింగ్ నగర్ వంతెన సాక్షిగా నవ్వుల పాలైంది. శుక్రవారం ఏరియల్ వ్యూ ముగించుకున్న తర్వాత అజిత్‌సింగ్‌నగర్‌లో నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీయడంతో ఆయన పక్కనే ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ వైపు తిరిగారు. ‘ఈ రోజు అటు నిత్యావసర సరుకులు పంచలేకపోయారు.. ఇటు ఆహారం అందించలేకపోయారు... అక్కడ ఉన్న ముసలాయన నా గతి ఏంటి? అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి..’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఈ రోజు ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు. ఎందుకంటే వారికి ఆహారం అందలేదు. కడుపులో ఎంతో కొంత పడితే వారు కష్టాన్ని మర్చిపోతారు. మనం వ్యవహరిస్తున్నది మనుషులతో.. యంత్రాలతో కాదు’ అని అన్నారు. ‘అప్పటి వరకు పాజిటివ్‌గా ఉన్న ప్రజలు కూడా ఇలాంటప్పుడు ఎక్కువ నెగిటివ్‌గా బయటకొస్తారు. ఈ రోజు ఇక్కడ అదే జరిగింది’ అని అన్నారు. ఈ రోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని సీఎం అడగ్గా.. ఇప్పటి వరకు 9,000 పంపిణీ చేశామని, సాయంత్రానికి 15,000 చేస్తామని వీరపాండియన్ తెలిపారు. అంటే మనం పెట్టుకున్న 80,000 లక్ష్యంలో కనీసం 20 శాతం కూడా చేయలేదా? అని సీఎం నిలదీశారు. మధ్యలో కలగ చేసుకున్న మంత్రి నాదెండ్ల ఈ మొత్తం తప్పును పురపాలక శాఖ మంత్రి నారాయణ మీద తోసేశారు. సరుకుల పంపిణీ కోసం నారాయణ ట్రాక్టర్లను పంపిస్తామన్నారని, మా రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకులు పంపిణీ మొదలు పెట్టడంతో ఆలస్యం అయ్యిందన్నారు. ‘సర్.. నేను మీకు ఫిర్యాదు చేయడం లేదు కానీ.. సరుకుల పంపిణీ నీకు సంబంధం లేదు.. నేను, మనోజ్ చూసుకుంటామని మంత్రి నారాయణ గురువారం రాత్రి ఫోన్ చేశారు’ అని నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు చెప్పారు. ఇలా నాదెండ్ల అసలు విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు. వెంటనే వీరపాండియన్‌తో మంత్రులుగా మేం పాలసీలు మాత్రమే ఇస్తాం. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఏమి చేయాలో అది చేయండి అంటూ వ్యాన్ ఎక్కి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన ప్రజలు ఇదేం ప్రభుత్వమంటూ నవ్వుకున్నారు. మరికొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. -
ప్రజా‘వాణి’ వినిపించదా?
సాక్షి, హైదరాబాద్: ఇబ్బంది ఏదైనా, పరిష్కార వేదిక ఏదైనా.. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు మాత్రం పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. భూసంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యల అర్జీలు పేరుకుపోతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ వర్గాలు పరిష్కరించినవి 30శాతం కూడా దాటలేదు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు 13,513 దరఖాస్తులు రాగా.. అందులో పరిష్కారమైనవి 3,147 దరఖాస్తులు మాత్రమే. మిగతా 10,366 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు వెళ్లే దరఖాస్తుల్లో ఎక్కువశాతం ధరణి సంబంధిత సమస్యలే ఉంటాయని.. కొన్నిచోట్ల పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేవలం విచారణతోనే సరి! ప్రజావాణి కింద వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా ధరణికి సంబంధించినవే ఉంటున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ధరణి పోర్టల్‌లో తమకు వచ్చిన లాగిన్ల ఆధారంగా సదరు దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి రిపోర్టు పంపించే అధికారం మాత్రమే తమకు ఉందని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఈ దరఖాస్తులను విచారించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా లేరని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థ ఇంకా కోలుకోలేదని అంటున్నారు. మండలంలో ఉన్న ఒకరిద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లే (ఆర్ఐలే) ఈ దరఖాస్తులన్నింటినీ విచారించాల్సి వస్తోందని చెప్తున్నారు. విచారణ అనంతరం రిపోర్టులను పంపినా పైస్థాయిలో పరిష్కారం కావడం లేదని.. కొన్ని దరఖాస్తులు పరిష్కారమైనా ఆన్లైన్లో అప్డేట్ కావడం లేదని వివరిస్తున్నారు. తహసీల్దార్ల స్థాయిలోనే చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. పైస్థాయికి పంపిన వాటిని కలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అక్కడా ఆగిపోతున్నాయని అంటున్నారు. నాలుగు జిల్లాల్లోనే కాస్త మెరుగు.. ‘సీఎం ప్రజావాణి’ దరఖాస్తుల గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో మాత్రమే పరిష్కార కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. జగిత్యాల, కరీంనగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 80శాతానికిపైగా దరఖాస్తులను పరిష్కరించారు. ఆరు జిల్లాలు వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, భువనగిరి జిల్లాల్లో అయితే 100శాతం దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆ జిల్లాల్లో ఒక్క రెవెన్యూ అర్జీ కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. మిగతా జిల్లాల్లో మొక్కుబడిగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార కార్యక్రమం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కూడా దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉండటం రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తతకు అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. వారానికి వెయ్యి దాకా దరఖాస్తులు రాష్ట్రస్థాయిలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వెయ్యి వరకు దరఖాస్తులు వస్తున్నాయి. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. గత శుక్రవారం 494 దరఖాస్తులురాగా.. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 125, హౌసింగ్ 43, పౌరసరఫరాల శాఖ 71, హోంశాఖ 45, పంచాయతీరాజ్ శాఖ 47, ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
రైతులకు మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయం, పౌరసరఫరాల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీదిరి అప్పరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీ నాగిరెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాల కృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్, ఉద్యానవన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ శ్రీధర్,ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ►ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి ►ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలి ►ఎప్పటిలానే మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలి ►పీడీఎస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలి ►మిల్లెట్ల వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై కరపత్రాలతో అవగాహన కల్పించాలి ►ఈ ఏడాది రెండో విడత రైతు భరోసాకు సిద్ధం కావాలి ►ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి ►చేయూత కింద మహిళలకోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగించాలి ►బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలి చదవండి: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ దేశానికే ఆదర్శం -
పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్’ X ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లపై విజిలెన్స్ దాడులు, రేషన్ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారాయి. మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్ దాడులు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్‌మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు. అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్’ తనిఖీలు చేశారని సంస్థ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్ఎస్ పాయింట్లకు విజిలెన్స్ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఆర్ఓ భవనానికి బ్రేక్ సికింద్రాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్లో పనిచేసిన ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. 11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్ అడ్వయిజర్ తరహాలో జిల్లాకో లీగల్ అడ్వయిజర్‌ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది. మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల ఆరోపణలు ఇదే సమయంలో ‘సార్’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. -
‘సీఎం కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు’
సాక్షి,పశ్చిమగోదావరి:పారిశ్రామిక విధానం, గొప్ప ముఖ్యమంత్రి ఉన్నారన్న భరోసాతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కారుమూరి స్పందిస్తూ.. దేశంలో అతి పెద్ద రెండో తీరప్రాంతం మన రాష్ట్రంలో ఉండడం.. దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో చేస్తోన్న కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులే పెట్టుబడిదారులను ఏపీ వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఊహించని రీతిలో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. చంద్రబాబు లాగా మసిపూసి మారేడు కాయ చేయడం లేదని, ఆయన హయాంలో లాగా హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసే సిబ్బందికి సూట్లు, కోట్లు తగిలించి దొంగ ఒప్పందాలు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అంబానీ,ఆదానీ,అపాచీ మిట్టల్, జెఎస్డబ్ల్యు, జిఎంఆర్ తదితర బడా పారిశ్రామిక వేత్తలు వాస్తవ ఒప్పందాలు జరిగాయని చెప్పుకొచ్చారు. భావి తరాలకు చక్కని విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగాల కోసం సీఎం జగన్ బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు. -
స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి
-
అంతా ముందస్తు ప్రణాళికతోనే! రూ.35 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం
కోదాడ: రూ.35 కోట్ల కస్టంమిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మాయం చేసిన కేసులో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన మిల్లర్.. అంతా ముందస్తు ప్రణాళికతోనే పకడ్బందీగా పని కానిచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మూడు, నాలుగు నెలలుగా దశలవారీగా మిల్లు నుంచి ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. నాలుగు నెలలుగా అధికారులు మిల్లులో ధాన్యం తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. పౌరసరఫరాల అధికారులు మిల్లర్‌తో కుమ్మక్కు కాకుంటే అది సాధ్యపడదని, దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మిల్లు సామగ్రి కూడా అమ్మకం?: మిల్లులో సీఎంఆర్ ధాన్యం మాయం చేసిన మిల్లర్, లోపల ఉన్న విలువైన యంత్ర సామగ్రిని కూడా దా దాపు రూ.3 కోట్లకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. మి ల్లంతా ఖాళీ అయిందని, ప్రస్తుతం ఉత్తి షెడ్డు మాత్ర మే ఉందని గ్రామస్తులు చెపుతున్నారు. దానికే అధికారులు తాళం, సీలు వేసి నిఘా పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. ఈ మిల్లర్ తన స్వగ్రా మం మేళ్లచెరువు మండలం రేవూరులో గతంలో ధాన్యం కోనుగోలు చేసి, రైతులను మోసగించి ఐపీ పెట్టి కాపుగల్లుకు వచ్చాడని గ్రామస్తులు వెల్లడించారు. బ్యాంక్ తనఖాలో మిల్లు ఆస్తులు! కాపుగల్లు రైస్ మిల్లర్ కోదాడలోని ఓ జాతీయ బ్యాంక్ నుంచి మిల్లు మీద దాదాపు 3 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం మిల్లు ఆస్తులను మొత్తం బ్యాంక్‌కు తనఖా పెట్టాడు. దీంతో ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్యాంక్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పౌరసరఫరాల విభాగం అధికారులు ఆ మిల్లర్‌పై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించినా అక్కడ ఏమీ దొరకదని అంటున్నారు. మిల్లర్ కోసం గాలింపు.. రూ.35 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం చేసిన కేసులో మిల్లర్ ఆచూకీ కోసం కోదాడ రూరల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. మిల్లులో పనిచేసే వారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వారి నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం దొరకడం లేదని తెలుస్తోంది. మిల్లర్ కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అతను ఇచ్చి న సమాచారంతో పోలీసులు హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు వెళ్లగా, పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని మిల్లర్ అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెనుదిరిగి వచ్చినట్లు సమాచారం. -
మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..
సాక్షి, గన్నవరం/విజయవాడస్పోర్ట్స్/చిట్టినగర్: విజయవాడ వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలో నివసించే పిళ్లా వెంకటరాజేంద్ర గతంలో సివిల్ సప్లయీస్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశాడు. పలు మోసాలకు పాల్పడటంతో ఉద్యోగంలో నుంచి తీసేశారు. జల్సాలకు అలవాటుపడిన అతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరతీశాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసేసిన సివిల్ సప్లయీస్లోనే డెప్యూటీ కలెక్టర్‌గా నకలీ ఐడీ కార్డు సృష్టించాడు. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించాడు. రూ.లక్షల్లో నగదు, ఐఫోన్లు, ఖరీదైన గృహోపకరణాలను సమకూర్చుకున్నాడు. మాయమాటలతో బురిడీ పిళ్లా వెంకటరాజేంద్ర మూడేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తన చేతిలో ఉన్నారని, తన మాట వారి వద్ద వేదవాక్కని నమ్మిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్ట్ ఇప్పించడం చిటికెలో పనంటూ గొప్పలుపోతాడు. ఉద్యోగం కోసం వచ్చిన వారితో ఐ–ఫోన్ కొనిపించుకుంటాడు. ఆ తరువాత నుంచి ఒక్కో విడతలో రూ.2 లక్షల చొప్పున రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తాడు. ఉద్యోగం, కాంట్రాక్టు రాలేదని నిలదీసిన బాధితులను పోలీసుల పేర్లు చెప్పి బెదిరిస్తాడు. కొంత మంది బాధితులకు పోలీసుల పేరుతో ఫోన్ చేయించి బెదిరించిన ఘటనలూ ఉన్నాయి. అతని చేతిలో మోసపోయిన వారిలో సామాన్య ప్రజలతోపాటు కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారని సమాచారం. చదవండి: (కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు) ఎలా పట్టుబడ్డాడంటే.. గన్నవరం సొసైటీ పేటకు చెందిన యామర్తి అరవింద్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ ఏడాది జూన్‌లో అతనికి పిళ్లా వెంకటరాజేంద్ర పరిచయమయ్యాడు. తాను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పౌర సరఫరాల శాఖలో డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నట్లు రాజేంద్ర నమ్మబలికాడు. తమ శాఖలో ఒక టెండర్‌తో పాటు స్టోర్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని అరవింద్‌కు మాయమాటలు చెప్పాడు. వీటి నిమిత్తం ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి అరవింద్ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. అనంతరం పలు దఫాలుగా అరవింద్ నుంచి డిపాజిట్లు, అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా మరో రూ.5.49 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా అరవింద్‌తో రూ.73 వేల విలువైన ఐఫోన్, రూ.36 వేల విలువైన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయించి రాజేంద్ర తీసుకున్నాడు. అయితే తాను చెల్లించిన డబ్బులకు రాజేంద్ర ఎటువంటి రశీదులూ ఇవ్వకపోవడం, కొన్ని రోజులుగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అరవింద్‌కు అనుమానం వచ్చింది. గతంలో రాజేంద్ర చూపించిన డెప్యూటీ కలెక్టర్ ఐడీ కార్డు ఫొటో ఆధారంగా విజయవాడలోని ఆతని ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఈ నేపథ్యంలో మరో రూ.1.50 లక్షలు కావాలంటూ ఫోన్‌చేసిన రాజేంద్రను నమ్మకంగా గన్నవరం పిలిపించి పోలీసులకు అప్పగించారు. రాజేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహాలో రాజేంద్ర కృష్ణా, గుంటూరు జిల్లాలో పలువురిని మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. విజయవాడ చిట్టినగర్‌లో నివాసం ఉంటున్న ఓ పురోహితుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు వసూలు చేశాడని తెలిసింది. నగర పోలీస్‌కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లకు రాజేంద్ర బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 14 మంది బాధితులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. -
AP: ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాన్ని ఖండించిన పౌరసరఫరాల శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై–7) కింద నవంబర్ నుంచి జనవరి వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఉచిత బియ్యం ఊసెత్తరేం’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. రేషన్ డోర్ డెలివరీ విధానం ద్వారా ఇంటి వద్దకే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం పంపిణీచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. చదవండి: చిన్న పరిశ్రమలతో లక్షలాది ఉద్యోగాలు.. ఎంఎస్ఎంఈలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహం అయితే, కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవై కింద నాన్–సార్టెక్స్ బియ్యాన్ని మాత్రమే ఇస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి నాన్ సార్టెక్స్ నిల్వలు లేనందున మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా అందించాలని, అక్టోబర్ నుంచి కాకుండా నవంబర్ నుంచి పంపిణీ చేసేలా అనుమతించాలంటూ ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం రాష్ట్రానికి 3.24 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని ఎఫ్‌సీఐని ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ నుంచి జిల్లాల్లోని మండల స్టాక్ పాయింట్లకు బియ్యం రవాణా జరుగుతోందన్నారు. వచ్చేనెల నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారుల్లోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నట్లు ఆయన వివరించారు. గతంలో బియ్యం ఇవ్వని కేంద్రం.. ఇక ఆరో విడత ఉచిత బియ్యం పంపిణీని ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు కేంద్ర పొడిగించగా రాష్ట్రానికి అవసరమైన బియ్యం పంపిణీని విస్మరించిందన్నారు. నాన్ సార్టెక్స్ నిల్వలు లేనందున, అందుబాటులో ఉన్న సార్టెక్స్ బియ్యం కేవలం రెగ్యులర్ పీడీఎస్‌లో పంపిణీ చేసేందుకు సరిపోతాయని, ఎఫ్‌సీఐ నుంచి బియ్యం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వమే నాన్ సార్టెక్స్ బియ్యాన్ని సొంతంగా సేకరించి ఆగస్టు, సెపె్టంబర్లో పంపిణీ చేసిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆరు విడతల్లో 25 నెలల పాటు ఉచిత బియ్యం ఇస్తే.. రాష్ట్రం సొంతంగా 19 నెలల పాటు మానవతా దృక్పథంతో కేంద్రంతో సమానంగా స్టేట్ కార్డుదారులకు కూడా బియ్యాన్ని అందించిందన్నారు. ఇందుకోసం ఏకంగా రూ.5,700 కోట్లు ఖర్చుచేసిందని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీ ఇలా.. రాష్ట్రంలో 4.23 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉంటే కేంద్రం కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే ప్రతినెలా బియ్యం అందిస్తోందని అరుణ్‌కుమార్ తెలిపారు. మిగిలిన కార్డులకు రాష్ట్రమే సొంతంగా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీలోనూ కేంద్రం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే బియ్యాన్ని కేటాయిస్తోందన్నారు. ఇందులో భాగంగా గతంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుల మేరకు తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో మినహా ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 1.67 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరితో పాటు మిగిలిన జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు, 24.60 లక్షల మంది అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు, ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో అక్కడి లబ్ధిదారులకు ఉచిత రేషన్‌ను అందజేయనున్నట్లు అరుణ్‌కుమార్ వివరించారు. -
విచారణ విధులకు డుమ్మా.. ఎందుకు చెప్మా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొత్తూరు పౌర సరఫరాల గోదాంలో జరిగిన అక్రమాలను ఆ శాఖ సీరియస్‌గా తీసుకుంది. రూ.కోటికిపైగా సరుకులు పక్కదారి పట్టిన వైనంపై ఉన్నత స్థాయి విచారణకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ మూడు నెలలుగా పర్యవేక్షణ లేదు. ఎవరూ భౌతిక తనిఖీలు చేపట్టిన దాఖలా కనిపించలేదు. దీంతో సరుకులు పక్కదారి పట్టాయి. ఈ మొత్తం వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రంగంలోకి దిగింది. ఈ గుట్టు రట్టు చేసేందుకు నెల్లూరులో పనిచేస్తున్న విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన ఈ నెల 20న జిల్లాకు రానున్నారు. సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్ రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని ఇప్పటికే ఆదేశించారు. చదవండి: కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా నిబంధనలు ఇవీ.. ♦రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు, వసతి గృహాల కోసం పౌరసరఫరాల సంస్థకు చెందిన ప్రైవేటు గోడౌన్లో సరుకులు ఉంచుతారు. ♦ప్రతి నెలా మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. వచ్చిన నిల్వలు, సంబంధిత సరఫరా ఏజెన్సీలకు వెళ్లిన సరుకులు, ఇంకా మిగిలి ఉన్న నిల్వలపై ప్రతి నెలా చివర భౌతిక తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ♦తనిఖీలో గుర్తించిన విషయాలపై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌కు నివేదిక అందించాలి. ♦ఆ నివేదిక సవ్యంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. వెలుగులోకి ఆసక్తికర విషయాలు.. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్‌ను ఏప్రిల్ నెలలో తనిఖీ చేసేందుకు ఏఎస్ఓ వంశీని నియమించారు. అయితే ఆయనకు ట్రాన్స్ఫర్ కావడంతో తనిఖీలు చేయలేదు. మే నెలలో తనిఖీ చేసేందుకు ఏఎం అకౌంట్స్ జ్యోతిని నియమించారు. ఆమె కూడా అనారోగ్యం కారణం చూపి తనిఖీలకు వెళ్లలేదు. జూన్‌లో తనిఖీ చేసేందుకు ఏప్రిల్‌లో నియమించిన ఏఎస్ఓ వంశీనే మళ్లీ నియమించారు. బదిలీ కారణంతో ఆ నెలలో కూడా తనిఖీలకు వెళ్లలేదు. ఈయన మొదటిసారి తనిఖీ చేయకపోయినా రెండోసారి మళ్లీ ఆయననే తనిఖీ చేయాలని ఆదేశించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తనిఖీ చేయకుండా సాకులు చెప్పడం వెనుక కారణాలేంటి..? అన్న అనుమానాలూ బలపడుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలా చేసిన తనిఖీలకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదిక వచ్చిందా? లేదా? అన్నది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డీఎం కార్యాలయం చూసుకోవాలి. దీన్ని బట్టి ఏ నెల ఏం జరిగిందో ఒక అవగాహనకు వస్తారు. కానీ, ఇక్కడ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తనిఖీలు జరిగాయో లేదో, ఫిజికల్ విజిట్ నివేదికలొచ్చాయో లేదా అన్నది ఏ ఒక్కరూ గుర్తించలేదు. జూలై నెల వస్తే గానీ ఈ విషయం బయటపడలేదు. ఈలోపే అక్రమాలు జరిగిపోయాయి. అయితే ఇదంతా పథకం ప్రకారం జరిగిందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. రామ్మోహన్‌పై చర్యలు.. భారీగా సరుకులు మాయమైన ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి, గ్రేడ్ 3 టెక్నికల్ అసిస్టెంట్ ఈ.రామ్మోహనరావును ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు అక్కడ పనిచేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డును కూడా విధుల నుంచి తొలగించారు. సరుకుల మాయంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. దానితో పాటు సస్పెండైన రామ్మోహన్‌రావుపై చార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఏడు రోజుల సమయం ఇచ్చారు. ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తదుపరి ఏం చేయాలన్నదానిపై సివిల్ సప్లై అధికారులు ఆలోచిస్తున్నారు. కుమ్మక్కయిందెవరు.. సరుకులు మాయమైన తర్వాత విచారణ చేస్తున్న కొద్దీ చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిగా ఉన్న రామ్మోహన్ ఆ గోడౌన్ తాళం వాచ్‌మెన్‌కు ఇచ్చేసి రెగ్యులర్‌గా విధులకు హాజరు కాలేదని తెలిసింది. వాచ్‌మెన్‌పైనే ఆ పాయింట్ ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో 198.706 మెట్రిక్ టన్నుల బరువైన 3,982 బస్తాలు(50 కిలోలవి) బియ్యం, 176 బస్తాలు (50 కిలోలు) పంచదార, 148 పామాయిల్ ప్యాకెట్లు, 420బస్తాల(50కిలోలవి) కందిపప్పు మాయమయ్యాయి. దీంతో ఎవరెవరు కుమ్మక్కయ్యారు? దీంట్లో ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి, వాచ్‌మెన్‌తో పాటు ఇంకెవరు ఉన్నారనే దానిపై ఆరా తీయాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందంటే ఈ ఇద్దరే కాదు మరికొంతమంది ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 20న జిల్లాకు ప్రత్యేక అధికారి.. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారిని ఉన్నతాధికారులు నియమించారు. ఈ నెల 20న జిల్లాకు వస్తున్నారు. రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని సమాచారం ఇచ్చారు. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌చార్జీగా పనిచేసిన రామ్మోహన్‌రావును సస్పెండ్ చేయడమే కాకుండా చార్జెస్ కూడా ఫ్రేమ్ చేశాం. దానిపై వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. – బి.జయంతి, డిస్ట్రిక్ట్ మేనేజర్, జిల్లా పౌరసరఫరా సంస్థ -
షావుకార్ల కక్కుర్తి!
బీఎండబ్ల్యూ, టయోటా, ఫార్చునర్, ఫోర్డ్స్, ఫోక్స్‌వ్యాగన్ తదితర విలాసవంతమైన కార్లు కలిగి ఉన్న కుటుంబాల వద్ద అంత్యోదయ, బీపీఎల్ రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలు అనేక ఏళ్లుగా ప్రతినెల నిరుపేదలకు అందించే ఉచిత బియ్యం, రాగులు, జొన్నలు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. విలాసవంతమైన కార్లు కలిగి నిబంధనలకు విరుద్ధంగా బీపీఎల్, అంత్యోదయ కార్డులతో బియ్యం తీసుకుంటున్న 12 వేల కుటుంబాలతో పాటు మరో 3.30 లక్షల కుటుంబాల రేషన్‌కార్డులను ఆహార పౌరసరçఫరాల శాఖ రదు చేసింది. బనశంకరి: రాష్ట్రంలో రేషన్‌కార్డులు పొందిన వేలాదికుటుంబాలు వైట్‌బోర్డు కారు ఉన్నట్లు ఆహార పౌరసరఫరాలశాఖకు సందేహం వచ్చింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖను ఆశ్రయించిన పౌరసరఫరాల శాఖ... రేషన్‌కార్డులు కలిగి ఉన్న కుటుంబాలు కారు కొనుగోలు చేసి రిస్ట్రేషన్ చేయించిన వారి సమాచారం అందించాలని కోరింది. రవాణాశాఖ అందించిన సమాచారంతో రేషన్‌కార్డులకు అనుసంధానమైన ఆధార్‌కార్డును పరిశీలించగా 12,584 కుటుంబాలు కార్లు కలిగి ఉన్నప్పటికీ బీపీఎల్, అంత్యోదయ కార్డులను తీసుకున్నట్లు వెలుగుచూసింది. అందులో కలబుర్గిలో ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ, బెంగళూరు గ్రామాంతర, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, కలబుర్గిలో టయోటా, ఫార్చునర్, చామరాజనగరలో ఫోర్డు, మండ్యలో ఎంజీ మోటార్, హాసనలో ఫోక్స్‌వ్యాగన్, చిక్కమగళూరులో మహింద్రజీప్ కలిగిన కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకున్నామని ఆహార పౌరసరఫరాలశాఖ తెలిపింది. కార్లు కలిగిన కార్డుదారుల సంఖ్య కార్లు కలిగిన కుటుంబాలు బీపీఎల్, అంత్యోదయ రేషన్‌కార్డులు తీసుకున్న వారి సమాచారం జిల్లాల వారిగా సేకరించారు. కలబుర్గిలో 2114, చిక్కమంగళూరులో 1912, బెంగళూరు1312, రామనగర 922, ఉత్తరకన్నడ 553, యాదగిరి 517,శివమొగ్గ 522, బీదర్ 554, బెంగళూరుగ్రామాంతర 547,బెంగళూరు పశి్చమ 485, తుమకూరు 307,చిక్కబళ్లాపుర 296,హావేరి 220, బాగల్కోటె 216,విజయపుర 214,బెంగళూరు ఉత్తర 201, మండ్య 137,దక్షిణకన్నడ 130, బళ్లారి 67, బెంగళూరు తూర్పు 89, చిత్రదుర్గ 43, దావణగెరె 62, ధారవాడ 15, గదగ 15, హాసన 86, కొడగు 21, కోలారు 65, కొప్పళ 29, మైసూరు 123, రాయచూరు 39, ఉడుపి 42 మంది నిబంధనలకు వ్యతిరేకంగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల వద్ద రేషన్ కార్డులు: మానవవనరుల శాఖ నిర్వహణ వ్యవస్థ(హెచ్ఆర్ఎంఎస్) ఆయా శాఖల నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ మండలి, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల సమాచారం సేకరించింది. వారి ఆధార్‌కార్డులను పరిశీలించగా 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి రేషన్ కార్డులు తీసుకున్నట్లు తేలింది. వీరికి నోటీస్ జారీచేసి జరిమానా చెల్లించాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. జిల్లాల వారీగా రద్దైన కార్డులు నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థ్దికంగా నిరుపేదలమని తీసుకున్న 3,30,024 రేషన్‌కార్డులను పౌరసరఫరాలశాఖ రద్దు చేసింది. వీటిలో అంత్యోదయ 21,679, బీపీఎల్ 3,08,345 బీపీఎల్‌కార్డులు ఉన్నాయి. కొన్ని కార్డులను ఏపీఎల్ గా మార్చారు. అత్యధిక రేషన్‌కార్డులు రద్దుకాబడిన జిల్లాల సమాచారం ఆధారంగా బెంగళూరు 34,705, విజయపుర 28,735, కలబుర్గి 16,945,బెళగావి 16,765, రాయచూరు 16,693, చిత్రదుర్గ 16,537 రేషన్‌కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలశాఖ తెలిపింది. (చదవండి: ప్రేమించలేదని గొంతు కోసుకున్నాడు) -
మళ్లీ రేషన్ కార్డుపై ఉచిత బియ్యం.. యూనిట్‌కు 10 కిలోల పంపిణీ
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా యూనిట్‌కు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ కానుంది. ఈ నెల ఐదు నుంచి ఉచిత బియ్యం కోటా పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ మధ్యలో రెండు నెలలు నిలిచిపోగా, గత నెల చివర్లో నెల సరి కోటాతో సంబంధం లేకుండా యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున ఉచితంగా అదించారు. ఈ నెలలో మాత్రం పాత పద్ధతిలోనే యూనిట్‌కు పది కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. కార్డులో ఎన్ని యూనిట్లుంటే అన్ని పదికిలోల చొప్పన పంపిణీ చేస్తారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా నెలసరి ఉచిత కోటా ఈ నెల 29 వరకు డ్రా చేసుకోవచ్చు. గత రెండేళ్ల నుంచి.. కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఉచిత కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. ఉచితం బియ్యం పథకం కాలపరిమితి మార్చి కోటాతో ముగియడంతో కేంద్రం మరోసారి సెప్టెంబర్ వరకు పథకాన్ని పొడగించింది. అయితే ప్రభుత్వ చౌకధరల దుకణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్‌న్ నెలల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ సాధ్యం కాలేదు. రూపాయి కిలో చొప్పున అందించారు. అయితే గత నెల చివర్లో మాత్రం నెలసరి కోటా పంపిణి గడువు ముగియగానే యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున అందించింది. ఈ నెలలో మాత్రం పది కిలోల చొప్పున పంపిణీ చేయనుంది. చదవండి: పట్టు బిగించండి.. రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం -
మిల్లుల్లోని ధాన్యంపై ఎఫ్‌సీఐకి అధికారం ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చిన్నచిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్‌సీఐ లేఖ రాయడంతోనే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు ఎఫ్‌సీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ఎఫ్‌సీఐ తీరును తప్పు బట్టారు. మిల్లుల్లోని వడ్లు, బియ్యంపై ఎఫ్‌సీఐ కి ఏం అధికారముందని ప్రశ్నించారు. రాష్ట్రం లోని రైస్ మిల్లుల్లో వడ్లు, బియ్యం నిల్వలపై ఎఫ్‌సీ ఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి చెప్పారు. సీఎం ఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చిన తరువాతే వారికి అధికారం వస్తుం దని పేర్కొన్నారు. తనిఖీ ల్లో తేడాలు వచ్చినా చర్యలు తీసుకో లేదని ఆరో పణలు చేస్తున్నారని, మార్చిలో ఆరు జిల్లాల్లోని 40 మిల్లులు తనిఖీ చేస్తే 4,53,896 బ్యాగులు లేవని చెప్పారని, రెండో మారు అవే మిల్లుల్లో తనిఖీ చేస్తే 10 మిల్లుల్లో మాత్రమే తేడా ఉందని అన్నారని పేర్కొన్నారు. ఒక్క గింజ తేడా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకో దని, మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమి నల్ కేసులు పెట్టిందని తెలిపారు. మరో రెండు మిల్లుల్లో మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని, మిగతా ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవా లని కలెక్టర్లకు లేఖలు రాశామని చెప్పారు. రెండో దశలో 63 మిల్లుల్లో తే డా.. అని ఎఫ్‌సీఐ అధికారులు జూన్ 4న లేఖ రాశారని, దాన్ని కలెక్టర్లకు పంపి పరిశీలించ మని ఆదేశించినట్లు వెల్లడించారు. జూన్ నుంచి నవంబర్ వరకు ఉచిత బియ్యం.. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యా న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేయ డం లేదని ఎఫ్‌సీఐ చేసిన వ్యాఖ్యలు అర్థర హితమని మంత్రి గంగుల పేర్కొన్నారు. సాం కేతిక కార ణాల వల్ల 2 నెలలు ఉచిత బియ్యం సరఫరాలో ఆలస్యం అయిందని, ఈ జూన్ నుంచి యథాతథంగా సరఫరా చేస్తు న్నామని చెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి కేంద్రంతో పాటు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చా మని, తద్వారా ప్రభుత్వంపై 8 నెలల పాటు రూ.980 కోట్ల భారం పడిందని తెలిపారు. ఇక 2021 జూన్ నుంచి ఏప్రిల్ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని వివరించారు. 2022 మార్చిలో.. ఏప్రిల్ నుంచి ఆరు నెలల పాటు ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం లేఖ రాసిందని, తదనుగుణంగా మూడో దశ కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించిన ప్పటికీ సేకరణ, ఇతర కారణాల వల్ల పంపిణీ ఆలస్యం అయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 90,46,000 కార్డుల్లో కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత అందరికీ ఉచితబియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ జూన్ నుంచి తెల్ల రేషన్‌కార్డు దారులందరికీ రూ.436 కోట్ల భారాన్ని భరించి నవంబర్ వరకు ఆరు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 11 కేజీల చొప్పున ఉచితబియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు చెప్పామని, స్టాక్ ఉండి కూడా ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే బంకులపై చర్యలు తీసుకొం టామని గంగుల హెచ్చరించారు. . -
నూనెలు అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాలు, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. వంటనూనెల ధరల నియంత్రణపై మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టించి వంట నూనెలను అధిక రేట్లకు విక్రయించినా, పరిమితికి మించి నిల్వలు ఉంచినా బైండోవర్ కేసులు నమో దు చేయాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ దందా పై నిరంతరం నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు వ్యాపా ర దుకాణాలు, నూనె తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రణాళిక ప్రకారం రైతుబజా రులు, మున్సిపల్ మార్కెట్లలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి, బయటి ధరల కంటే తక్కువకు వంటనూనెలను అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా మండలాల వారీగా నూనె ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల న్నారు. సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెల వాడకాన్ని ప్రోత్సహించాలి పామ్ ఆయిల్ దిగుమతులపై ఆంక్షలున్న నేపథ్యంలో సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెల వాడకం వైపు ప్రజలను ప్రోత్సహించాలని మంత్రి కారుమూరి సూచించారు. ఆ నూనెలను ఆయిల్ ఫెడ్ ద్వారా విక్రయించడంతో పాటు కనోల ఆయిల్ (ఆవనూనె) అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించి, సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. బ్లాక్ మార్కెట్, కల్తీ నూనెల విషయంలో ఇప్పటి వరకు 76 కేసులు నమోదు చేశామని, 22,598 క్వింటాళ్ల నూనెలను జప్తు చేశామని మంత్రి వివరించారు. వీటిల్లో కేసులు పరిష్కరించిన బ్రాండ్లను తిరిగి మార్కెట్లోకి విడుదల చేసినట్టు చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ శంకబ్రత బాగ్చి, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ కిశోర్‌కుమార్, రైతుబజార్ సీఈవో శ్రీనివాస రావు, ఏపీ ఆయిల్ ఫెడ్ ఎండీ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
‘వలంటీర్లు సీఎం జగన్ గుండెల్లో ఉన్నారు’
తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): పేదలు గడప దాటకుండా సంక్షేమం వారి గడపకు చేర్చేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థ తెచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలో వలంటీర్లకు సేవారత్న, మిత్ర, వజ్ర పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హాజరైన కారుమూరి.. మీడియాతో మాట్లాడారు. పేదలు గడప దాటకుండా సంక్షేమం వారి గడపకే చేర్చేలా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వలంటీర్లు సీఎం జగన్ గుండెల్లో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మావాళ్ళకే చేయండి.. మావాళ్లనే చూడండి అని కలెక్టర్ల మీటింగ్ లో చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు భేదం లేకుండా సంక్షేమం అందరికీ అందాలని చెప్పారు. మండపాక గ్రామంలో టీడీపీ హయాంలో కోటి 8 లక్షల రూపాయిలు మాత్రమే ఖర్చు చేశారు.మండపాక గ్రామంలో వై యస్ ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక 11 కోట్ల 81 లక్షల రూపాయిలు ఖర్చు చేశాము. రెండున్నర ఏళ్లలో మేము రూ. 7,109 కోట్ల తణుకు మండలానికి ఖర్చు చేశాము. 346 ఎకరాలు సేకరించి 18 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. దేశంలోని ముఖ్యమంత్రులు మన పాలనవైపు చూస్తున్నారు. 70 శాతం బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు క్యాబినెట్ లో స్థానం కల్పించారు’ అని కారుమూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విష్ణు చరణ్, జేసీ మురళీ, శెట్టి బలిజ కార్పోరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
సేవల్లో అలసత్వం వద్దు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తాన క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్పీ ధర లభించాలన్నారు. రైతులందరికీ ఎంఎస్పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆ దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..: ♦రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు ♦ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదు ♦తరచుగా రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలి ♦రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవు ♦రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం: ♦ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు ♦కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి: ♦ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదు ♦ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేసేలా చూడాలి ♦దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది: ♦కొనుగోలు కోసం ఆర్బీకేలో ఐదుగురు సిబ్బంది ♦ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలి ♦టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలి ♦ప్రతి ఆర్బీకేలో కూడా కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి ♦వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి.. వారితో ఇంటరాక్ట్ అయ్యి.. కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి ♦గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలి ♦వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు: 21 రోజులలోగా పేమెంట్స్... ♦ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలి : సీఎం ఆదేశం ♦అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండి: సీఎం ♦ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారా? లేదా? చూడండి ♦కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరుపై పరిశీలన చేయండి ♦వీటిన్నింటిపైనా మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండి ♦తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లండి ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్ ♦పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్‌ను పెట్టాలని సీఎం ఆదేశం ♦ఆ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశం ♦క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలని సీఎం ఆదేశం ♦దీనివల్ల సమస్యల తీవ్రతతో పాటు పరిష్కార మార్గాలు లభిస్తాయన్న సీఎం ♦రైతులతో ఇంటరాక్షన్, నిరంతర చర్చలు అధికారులు జరపాలని సీఎం ఆదేశం ♦జిల్లాల్లో ఉన్న జేసీలనుంచి కూడా పంటలకొనుగోలుపై నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్న సీఎం సీసీఆర్సీ కార్డ్స్‌పై మరింత అవగాహన ♦సీసీఆర్సీ కార్డ్స్ ( క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్)లపై అవగాహన నిరంతరం కల్పించాలన్న సీఎం ♦సీసీఆర్సీ కార్డ్స్ వల్ల రైతుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదన్న విషయాన్ని వారికి చెప్పాలి ♦రోజుకు సగటున ధాన్యం కొనుగోలు 42,237 మెట్రిక్‌టన్నులకు చేరిందన్న అధికారులు ♦రానున్న రోజుల్లో మరింత ఉద్ధృతంగా కొనుగోళ్లు జరుగుతాయన్న అధికారులు ప్రత్యామ్నాయ సాగు – ప్రోత్సాహం ♦రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేలా వారిలో అవగాహన కల్పించండి: సీఎం ♦ఇలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి ♦ప్రత్యామ్నాయ పంటలు పండించేలా కార్యాచరణ సిద్ధంచేయండి ♦ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్న విషయాన్ని రైతులకు తెలియజేయండి ♦రైతులకు మంచి ఆదాయాలు కల్పన దిశగా చర్యలు తీసుకోవాలి: అధికారులకు సీఎం నిర్దేశం ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధనరెడ్డి, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీ ఎస్ ప్రద్యుమ్న, సివిల్ సఫ్లైస్ డైరెక్టర్ ఎస్ డిల్లీరావు, సివిల్ సఫ్లైస్ ఎండీ జీ వీరపాండ్యన్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (పారిశ్రామిక విప్లవం) -
దొంగకు తాళాలు ఇచ్చిన అధికారులు
తాడేపల్లిరూరల్: సివిల్ సప్లయీస్ అధికారులు దొంగ చేతికి తాళాలు ఇచ్చి చేతులు దులుపుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... ఈనెల 7వ తేదీన తాడేపల్లి రూరల్ ప్రాంతంలోని ఇప్పటం శివారుల్లో రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోకి పంచర్ అయ్యింది. ఆటోలో ఉన్న రేషన్ బియ్యాన్ని సగం వరకు దించి ముళ్ల పొదల్లో పెట్టి పంచర్ వేసుకుంటున్నారు. ఆ సమయంలో పొలాలకు వెళుతున్న గ్రామస్తులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు సంఘటనా స్ధలానికి వెళ్లి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముళ్ల పొదల్లో ఉన్న బియ్యాన్ని ఆటోలోకి ఎక్కించి ఇప్పటం గ్రామంలో భద్రపరిచారు. ఈ సంఘటనపై వీఆర్వో సివిల్ సప్లయీస్ డీటీకి అదేరోజు సమాచారం ఇచ్చారు. ఇప్పటి వరకు ఆటోపైగానీ, ఆటోలో బియ్యాన్ని తరలిస్తున్న వారిపై గానీ ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఆటోలో ఉన్న రేషన్ బియ్యాన్ని దగ్గరలో ఉన్న రేషన్ షాపులో ఉంచి ఆటోను మాత్రం మూడు రోజుల అనంతరం వడ్లపూడిలోని ఒక రైస్‌మిల్లుకు తరలించారు. గతంలో ఇదే రైస్‌మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి పలుమార్లు కేసులు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లుకు ఆటోను పంపండం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధంకావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆటో యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవని, అలా చేయకుండా మంగళగిరి సివిల్ సప్లయీస్ అధికారులు ఆటోను రైస్‌మిల్లులో భద్రపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
నూనె మిల్లులపై దాడులు
నరసరావుపేట/తెనాలి రూరల్/భవానీపురం (విజయవాడ పశ్చిమ)/గుంటూరు (మెడికల్): ఆహార పదార్థాల కల్తీలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలోను, విజయవాడలోను ప్రత్యేక బృందాలు బుధవారం దాడులు జరిపాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని నూనె మిల్లులపై ఆహార కల్తీ నియంత్రణ శాఖ, పౌర సరఫరాలు, తూనికల, కొలతల శాఖల అధికారులు బుధవారం దాడులు జరిపారు. కొబ్బరి, వేరుశనగ, సన్‌ప్లవర్ ఆయిల్స్‌ను రీ ప్యాకింగ్ చేస్తున్న మిల్లుల్లో రూ.4.51,665 విలువైన 3,152 లీటర్ల ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేసి, ఏడు శాంపిళ్లను సేకరించినట్టు ఆహార కల్తీ నియంత్రణ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ షేక్ గౌస్‌మొహిద్దీన్ తెలిపారు. కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఆహార వివిధ శాఖల అధికారులతో ఆరు బృందాలుగా ఏర్పడి ఆయిల్ మిల్లులపై నిర్వహించామని ఆయన చెప్పారు. సత్తెనపల్లి రోడ్డులోని కనకదుర్గ ఇండస్ట్రీస్‌లో రూ.77,765 విలువ చేసే 480 లీటర్ల వేరుశనగ నూనె ప్యాకెట్లను, కోటప్పకొండ రోడ్డులోని వెంకటలక్ష్మి ట్రేడర్స్ మిల్లులో రూ.3,28,900 విలువైన 2,192 లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను, హోం గాయత్రి ఇండస్ట్రీస్‌లో హెల్దీ ఆయిల్ కమ్ హెల్దీ లైఫ్ అని రాసిన రూ.45 వేల విలువైన 480 లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. సత్తెనపల్లి రోడ్డులోని బొడ్డు నాగేశ్వరరావుకు చెందిన ధనలక్ష్మి నీమ్ ఆయిల్ మిల్లు, దివ్య నాగసాయి ఆయిల్ మిల్లులో వేరుశనగ నూనె, ఆంజనేయ ట్రేడింగ్ కంపెనీలో కొబ్బరినూనె శాంపిల్స్ సేకరించామన్నారు. నూనె తయారీ కేంద్రాలపై కేసులు ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తెనాలిలోని నూనె తయారీ కేంద్రాలపై బుధవారం దాడులు నిర్వహించారు. గంగానమ్మపేటలోని శ్రీనివాస ఆయిల్ అండ్ ప్రొవిజన్స్ సంస్థపైన, పూజ అండ్ నంది దీపారాధన తైలం తయారీ సంస్థపైనా కేసు నమోదు చేశారు. విజయవాడలో కొనసాగిన దాడులు విజయవాడ నగరంలో చేపట్టిన దాడులు బుధవారం కూడా కొనసాగాయి. భవానీపురం గాం«దీ»ొమ్మ రోడ్‌లోని వెంకటదుర్గ, మహేశ్వరి డాల్ మిల్స్‌పై ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. రెండు మిల్లులలో రూ.3 లక్షల విలువైన పెసరపప్పు బస్తాలను సీజ్ చేసి నమూనాలను సేకరించారు. మహాత్మాగాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని రాకేష్ ట్రేడర్స్ ఆయిల్ కంపెనీ రాయలసీమ నుంచి దిగుమతి చేసుకున్న విడి నూనెను, నూనె ప్యాకెట్ల నమూనాలను సేకరించారు. భవానీపురం ఐరన్ యార్డ్‌లో పప్పు ధాన్యాల నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. దాల్ మిల్స్‌లోని పెసరపప్పులో నిషేధిత రంగు కలుపుతున్నట్టు గుర్తించామన్నారు. కల్తీ చేసే వారిపై చర్యలు తప్పవు.. నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఆహారం .. హాహాకారం’, ‘బయో మాయా’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై స్పందించిన కలెక్టర్ సివిల్ సప్లైస్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ వివేక్‌యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్ సప్లైస్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతలు, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. రెస్టారెంట్లలో మాంసం కల్తీ ఎక్కువగా జరుగుతోందని, మునిసిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కల్తీ పురుగు మందులు, విత్తనాలు విక్రయించకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. -
తెలంగాణలో నాణ్యమైన బియ్యానికి.. చెల్లిన 'నూకలు'
►కింద ఫొటోలో బియ్యం చెరుగుతున్న మహిళ పేరు కవిత. మెదక్ జిల్లా రేగోడ్ మండలం సంగమేశ్వర తండాకు చెందిన ఆమె కుటుంబానికి నెలకు 12 కిలోల రేషన్ బియ్యం వస్తాయి. ఈసారి కూడా ఎప్పట్లాగే డీలర్ వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకుంది. కానీ సంచి విప్పితే సగం దాకా నూకలే. జల్లెడ పట్టి చూస్తే.. 12 కిలోల బియ్యంలో నాలుగున్నర కిలోల నూకలు వచ్చాయి. ►ఇదే జిల్లా చిన్నశంకరం పేట మండలం రుద్రారానికి చెందిన శివలింగం లింగయ్య కుటుంబానికి ప్రతి నెలా 30 కిలోల రేషన్ వస్తుంది. ఈ నెల వచ్చిన బియ్యాన్ని జల్లెడ పడితే పది కిలోల దాకా నూకలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. బియ్యంలో గరిష్టంగా 20–25 శాతం వరకు నూకలు ఉండొచ్చు. కానీ పేదలకు అందుతున్న రేషన్ బియ్యంలో ఏకంగా 40–45 శాతం వరకు నూకలు ఉంటున్నాయి. సాక్షి, మెదక్(ఆదిలాబాద్/మహబూబ్‌నగర్) : రూపాయికే కిలో బియ్యం.. నాణ్యమైన బియ్యం.. రాష్ట్రంలో నిరుపేదల కడుపు నింపేందుకు అమలవుతున్న ప్రతిష్టాత్మక పథకం. లక్ష్యం అదుర్స్! కానీ పథకం అమల్లోనే పందికొక్కులు చొరబడ్డాయి. ప్రజలకు చేరాల్సిన మేలు రకం (ఫైన్ వెరైటీ) బియ్యం దారితప్పి విదేశాలు, పక్క రాష్ట్రాలకు తరలుతుండగా.. నిరుపేదలకేమో 40–45 శాతం వరకు నూకలే ఉన్న బియ్యం సరఫరా అవుతున్నాయి. కొన్ని నెలలుగా ఇలా నూకల బియ్యం నిరుపేదలకు సరఫరా అవుతున్న వైనంపై ‘సాక్షి’పరిశోధన చేపట్టింది. మార్చి నెలలో రేషన్ షాపుల ద్వారా మెదక్, ఆదిలాబాద్, జోగులాంబ, నారాయణపేట జిల్లాల్లో సరఫరా చేసిన బియ్యాన్ని పరిశీలించింది. ఇటీవల పలువురు లబ్ధిదారులు రేషన్ షాపుల నుంచి తెచ్చుకున్న బియ్యాన్ని కొలత వేయించి, జల్లెడ పట్టించి.. నూకలను వేరుచేసి చూసింది. దాదాపు అన్నిచోట్ల కూడా ప్రభుత్వం గరిష్టంగా నిర్దేశించిన 25శాతం (కిలోకు పావు కిలో) కంటే మించి.. ఏకంగా నలభై, నలభై ఐదు శాతం వరకు నూకలు ఉన్నట్టు గుర్తించింది. దీనికి కారణమెవరు? కొందరు మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై నిరుపేదలకు నాణ్యతలేని, నూకల బియ్యం అంటగడుతున్నట్టు ‘సాక్షి’పరిశీలనలో వెల్లడైంది. వాస్తవానికి మిల్లర్లు ఎఫ్‌సీఐ/పౌర సరఫరాల శాఖ పంపిన ధాన్యాన్నే మిల్లింగ్ చేసి అలా వచ్చిన బియ్యాన్ని తిరిగి ఇవ్వాలి. కానీ కొందరు మిల్లర్లు మంచి ధాన్యాన్ని తాము వాడేసుకుంటున్నారు. తాము బయట నేరుగా తక్కువ ధరకు కొన్న తడిసిన, నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు పంపుతున్నారు. అందుకే బియ్యంలో నాణ్యత తక్కువగా, నూకలు ఎక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది. అక్రమాలకు తోడ్పడుతున్నదెవరు? మిల్లర్లకు ధాన్యాన్ని పంపి.. తిరిగి బియ్యాన్ని తీసుకోవడాన్ని ‘కస్టమ్ మిల్లింగ్’అంటారు. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు చార్జీలు చెల్లిస్తుంది. ఇలా ధాన్యాన్ని పంపి, మిల్లింగ్ అయ్యాక బియ్యాన్ని తిరిగి తీసుకునే క్రమంలో.. అధికారులు నాలుగు స్టేజీల్లో నాణ్యతను పరిశీలించాలి. కానీ కొందరు ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి మిల్లర్లకు సహకరిస్తున్నారు. ప్రతి స్టేజీలో ఓ రేటు మాట్లాడుకుని వదిలేస్తున్నారు. దీంతో నాణ్యత లేని బియ్యం గోదాములకు, అక్కడి నుంచి రేష¯Œ షాపులకు చేరుతున్నాయి. మంచి బియ్యం ఎక్కడికి పోతున్నాయి? నాణ్యతలేని, నూకల బియ్యాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్న మిల్లర్లు.. ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన మంచి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని క్వింటాల్ రూ.2,500 నుంచి రూ.2,600 రేటుతో.. ఏపీలోని పెద్దాపురం, కాకినాడ కేంద్రంగా చైనా, వియత్నాం, దుబాయ్, థాయ్‌లాండ్, పలు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఈ సీజన్లో ఇప్పటికే పది లక్షల టన్నుల బియ్యం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అయినట్టు అంచనా. ఇందులో చాలావరకు కస్టమ్ మిల్లింగ్ కోసం ఎఫ్‌సీఐ పంపిన ధాన్యం నుంచి వచ్చిన బియ్యమే ఉండటం గమనార్హం. కాకినాడ పోర్టులో షిప్పులోకి బియ్యం లోడింగ్ (ఫైల్) కస్టమ్ మిల్లింగ్ ధాన్యం మాయం.. బియ్యం ఇవ్వలేదు.. శనివారం పెద్దపల్లి జిల్లాలోని ఒక రైస్‌మిల్లులో బియ్యం మిల్లింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో ఐకేపీ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి ధాన్యం కొంటుంది. ఆ ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి.. ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున తిరిగి అందజేయాలి. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు క్వింటాల్ బాయిల్డ్ రైస్‌కు రూ.50 చొప్పున, ముడి బియ్యానికి రూ.30 చొప్పున చార్జీలు చెల్లిస్తుంది. పారాబాయిల్డ్ బియ్యమైతే గరిష్టంగా నూకలు 16 శాతం, డిస్కలర్ (రంగుమారిన) 5 శాతం, డ్యామేజ్ 4 శాతంలోపు ఉండాలి. ముడి బియ్యమైతే గరిష్టంగా నూకలు 25 శాతం, డిస్కలర్ 5, డ్యామేజ్ 5 శాతంలోపు ఉండాలి. వానాకాలం ధాన్యాన్ని ఏటా మార్చి 31 లోపు.. యాసంగి ధాన్యాన్ని సెప్టెంబర్ 31లోపు మర ఆడించి బియ్యం తిరిగివ్వాలి. కానీ మిల్లర్లు ఓ సీజన్‌కు సంబంధించిన బియ్యాన్ని మరో సీజన్లో ఇస్తున్నారు. ఈ గ్యాప్‌లోనే అక్రమాలకు పాల్పడుతున్నారు. వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మిర్యాలగూడ, నిజామాబాద్ జిల్లాల్లో ఈ దందా భారీ స్థాయిలోనే నడుస్తోంది. ఇప్పుడు కూడా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాల్లో మిల్లర్లు గత వేసవిలో తీసుకున్న ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని ఇంకా సర్కారుకు ఇవ్వలేదు. అంటే ముడి ధాన్యంగానీ, బియ్యంగానీ రైస్ మిల్లులు, గోదాముల్లోనే ఉండాలి. కానీ ఆయా ప్రాంతాల్లోని రైస్ మిల్లులు, గోదాములను ‘సాక్షి’పరిశీలించగా.. ఎక్కడా సీఎంఆర్ ధాన్యంగానీ, బియ్యం నిల్వలు గానీ లేవు. అంటే మిల్లర్లు ఇప్పటికే అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టు అర్థమవుతోంది. చాలా చోట్ల ఇదే తీరు.. ►జోగులాంబ గద్వాల జిల్లా రాజోలికి చెందిన రాములమ్మ కుటుంబానికి నెలకు 24 కిలోల రేషన్ బియ్యం వస్తుంది. ఇటీవల వచ్చిన బియ్యాన్ని జల్లెడ పడితే ఆరు కిలోలపైన నూకలు వచ్చాయి. ►ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో నివసించే శాతల నాగమ్మ కుటుంబానికి ప్రతినెలా 35 కిలోల రేషన్ బియ్యం అందుతుంది. ఈ నెల తీసుకున్న బియ్యం చెరిగితే ఎనిమిది కిలోల దాకా నూకలు వచ్చాయి. ►మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన సర్గం మల్లమ్మ తనకు వచ్చిన 12 కిలోల బియ్యాన్ని చెరిగితే నాలుగు కిలోలకుపైగా నూకలు వచ్చాయి. ఇలాగైతే ఎలా అని ఆమె వాపోయింది. ►మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరుకు చెందిన పాలకుల లక్ష్మి రేషన్ బియ్యం తీరుపై మండిపడింది. ‘గత నెలలో వచ్చిన బియ్యం ముక్కవాసన వచ్చాయి. ఈసారి వచ్చిన బియ్యంలో నూకలే ఎక్కువగా ఉన్నాయి’అని వాపోయింది. సగం నూకలే.. అన్నం ముద్ద అవుతోంది రేషన్ షాపులో మంచి బియ్యం ఇస్తున్నారని సంతోషించినం. బియ్యం జల్లెడ పట్టి చూశాక ఉన్న సంతోషం పోయింది. సగం నూకలే ఉన్నాయి. వండిన అన్నం మెత్తగా ముద్దగా అవుతోంది. దొడ్డు బియ్యమే నయం అనిపిస్తున్నది. డీలర్‌ను అడిగితే గోదాం నుంచే బియ్యం అట్లా వస్తున్నయని చెప్తున్నడు. – స్వరూప, రేషన్ లబ్ధిదారు, చిలప్‌చెడ్, మెదక్ ఒక్కోసారి సగానికి సగం నూకలే.. 3 నెలల నుంచి బియ్యం ఒక్కో సంచిలో ఒక్కో రకం వస్తున్నాయి. ఒక్కోసారి సగానికి సగం నూకలు వస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న బియ్యంలో మరీ ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారులు గొడవ పడుతున్నారు. సముదాయించలేక తలపట్టుకోవాల్సి వస్తోంది. – నర్సింహులు, డీలర్, రుద్రారం, చిన్నశంకరంపేట, మెదక్ -
అనంతపురంలో కరపత్రాల కలకలం
అనంతపురం అర్బన్: పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. సంస్థ డీఎం డమ్మీగా మారారంటూ కొందరు ముద్రించిన కరపత్రాలు బయటకు రావడం కలకలం రేపింది. ప్రధానంగా అసిస్టెంట్ మేనేజర్ (ఏఎం)ని టార్గెట్ చేస్తూ కరపత్రంలో ఆరోపణలు సంధించారు. జిల్లా మేనేజర్ పేరుకే అధికారిగా అంటూ... కార్యాలయంలో పెత్తనం పూర్తిగా అసిస్టెంట్ మేనేజర్‌దే అంటూ విమర్శలు చేశారు. గతంలో ఆయన పనిచేసిన చోట ఉద్యోగులతో ఏ విధంగా వ్యవహరించారనేది చెబుతూ... ఇక్కడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు అంటూ... ఇలా పలు ఆరోపణలతో కూడిన కరపత్రం బయటికి రావడం కార్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా రోజులుగా ఉద్యోగుల మధ్య విభేధాలు సంస్థ ఉద్యోగుల్లో ఏడాది కాలంగా విబేధాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అవి తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా కరపత్రాలు ముద్రించే వరకు వచ్చాయి. ఇటీవల కాలంలో సంస్థలోని కొందరు ఉద్యోగులు, అధికారులపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. పర్సంటేజీ కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారని, ఉద్యోగులపై కొందరు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడి వ్యవహారాలపై దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. కాగా, కరపత్రం విషయాన్ని సంస్థ జిల్లా మేనేజర్ మోహన్‌బాబు దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. మాది ఈ ప్రాంతం కాదు.. ఒకటి రెండేళ్లు ఉండి వెళ్లిపోతాం..అంటూ ముభావంగా ఉండిపోయారు. -
6 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ
-
ఏపీ: ఐదు రోజుల్లోనే కొత్త రేషన్‌కార్డు..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరింత పకడ్బందీగా రేషన్ కార్డులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి కొత్త దరఖాస్తులకు రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. (4 నెలల ముందుగానే వైఎస్సార్ వాహన మిత్ర) రేషన్ డోర్ డెలివరీలో భాగంగా కార్డుదారులకు బియ్యం సంచుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి 10,15 కిలోల చొప్పున సంచులను అందిస్తామన్నారు.ఒక్కో సంచీ తయారీకి రూ.25 ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు కోన శశిధర్ తెలిపారు. (బీసీలకు ‘పథకాల’ పంట) -
3600 మందికి ఉద్యోగాలు : గంగుల
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్‌పై ఉన్న అభిమానంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్ అని.. అందుకే నలుగురితో పాటు మరొకరికి క్యాబినెట్ హోదా పదవి ఇచ్చినందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. తొలి విడతలో మంత్రి పదవి ఆశించానని.. రెండో విడతలో అవకాశం రావడంతో తన జీవితకాలంలో రక్తం ధారపోసి పార్టీ కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ గంగుల విలేకరులతో మాట్లాడుతూ...తనకు కేటాయించిన పౌర సరఫరాల శాఖను నెంబర్ వన్‌గా చేస్తానని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మంచి ఫలితాలు రాబట్టేలా సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశా.. ‘కరీంనగర్లో వరుసగా గెలిచిన చరిత్ర ఏ నాయకుడికి లేదు. ఆ అదృష్టం నాకు దక్కింది. నగర ప్రజలకు రుణపడి ఉంటా. మచ్చలేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశాను. నావల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తా. సంతృప్తిని ఇచ్చే శాఖ ఇచ్చారు. కాబట్టి సీఎం కేసీఆర్ ముఖంలో అనునిత్యం నవ్వు కనిపించేలా పనిచేస్తా. టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కేసీఆర్ స్పూర్తితో.. టీడీపీలో తెలంగాణ వాదాన్ని వినిపించి పార్టీని వీడిన మొదటి ఎమ్మెల్యే నేను. కేసీఆర్‌ను చూస్తే ముఖ్యమంత్రిలాగా కనిపించడు.. ఓ డిక్షనరీగా కనిపిస్తాడు. గొప్ప మానవతావాది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి. 2018లో ఆయన బొమ్మతో గెలిచాము. రేపు ఏ ఎన్నికలు జరిగినా కేసీఆర్ బొమ్మతోనే గెలుస్తాం’ అని గంగుల పేర్కొన్నారు. ఇక తన నియోజకవర్గం గురించి మాట్లాడుతూ...‘కరీంనగర్లో స్మార్ట్ సిటి పనులు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. స్మార్ట్ సిటి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దే. నగరంలో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. రెట్టింపు అభివృద్ధి చేస్తాం. దసరాకు ఐటీ టవర్ కంప్లీట్ చేసి, 3600 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. బిజినెస్ సెంటర్‌గా, పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌ను నెంబర్ వన్ చేస్తాం. గత పాలకులకు ఇవన్నీ ఎందుకు కనిపించలేదు. పార్టీ లైన్లో కార్యకర్తలు పనిచేయాలని కోరుతున్నా. మానేర్ రివర్ ఫ్రంట్ రూ. 506 కోట్లకు జీవో ఇచ్చారు. ఈసారి అదే ఎమౌంట్ ఈ బడ్జెట్లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కరీంనగర్లో మెడికల్ కాలేజీ కోసం కేంద్రం నుంచి ప్రయత్నిస్తున్నాం. నా శాఖలపై త్వరలో పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుంటా. నాణ్యత లోపించినా, అవినీతి పనులకు పాల్పడినా సీరియస్ యాక్షన్ తప్పదు అని మంత్రి గంగుల హెచ్చరించారు. -
పౌరసరఫరాల శాఖ పనితీరుపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష