![పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సీవీ ఆనంద్](/styles/webp/s3/article_images/2017/09/4/51471380395_625x300.jpg.webp?itok=8-Z1F3GH)
పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సీవీ ఆనంద్
తొలిసారి ఓ ఐపీఎస్ అధికారికి బాధ్యతలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా ఓ ఐపీఎస్ అధికారిని నియమించడం ఇదే తొలిసారి. పౌర సరఫరాల విభాగంలో ప్రతి ఏటా రూ. 300 కోట్లకు పైగా విలువైన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని, వివిధ సరుకుల కొనుగోలులో భారీగా అవినీతి జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
దీంతో పోలీసు, రెవెన్యూ విభాగంతో సంయుక్తంగా సీవీ ఆనంద్ సారథ్యంలో స్పెషల్ ఆపరేషన్ బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ విభాగానికి ఐపీఎస్ అధికారినే నియమించడం సరైందని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవలే సివిల్ సప్లయిస్ కమిషనర్‌గా ఉన్న రజత్‌కుమార్‌ను కార్మిక ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.