సేవల్లో అలసత్వం వద్దు: సీఎం జగన్‌ | CM Jagan Review Meeting On Civil Supplies, Grain Collection at Tadepalli | Sakshi
Sakshi News home page

సేవల్లో అలసత్వం వద్దు: సీఎం జగన్‌

Published Mon, Dec 20 2021 12:03 PM | Last Updated on Mon, Dec 20 2021 4:12 PM

CM Jagan Review Meeting On Civil Supplies, Grain Collection at Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తాన క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్‌పీ ధర లభించాలన్నారు. రైతులందరికీ ఎంఎస్‌పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆ దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..:

రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు
ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదు
తరచుగా రైతులతో ఇంటరాక్ట్‌ అవ్వాలి
రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవు
రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం:
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు
కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి:
ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదు
ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేసేలా చూడాలి
దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది:

కొనుగోలు కోసం ఆర్బీకేలో ఐదుగురు సిబ్బంది
ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలి
టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలి
ప్రతి ఆర్బీకేలో కూడా కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి
వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి.. వారితో ఇంటరాక్ట్‌ అయ్యి.. కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి
గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలి 
వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు:

21 రోజులలోగా పేమెంట్స్‌...
ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలి  : సీఎం ఆదేశం

అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండి: సీఎం
ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారా? లేదా? చూడండి
కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరుపై పరిశీలన చేయండి
వీటిన్నింటిపైనా మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండి
తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లండి

ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్‌
పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్‌ను పెట్టాలని సీఎం ఆదేశం
ఆ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశం
క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలని సీఎం ఆదేశం
దీనివల్ల సమస్యల తీవ్రతతో పాటు పరిష్కార మార్గాలు లభిస్తాయన్న సీఎం
రైతులతో ఇంటరాక్షన్, నిరంతర చర్చలు అధికారులు జరపాలని సీఎం ఆదేశం
జిల్లాల్లో ఉన్న జేసీలనుంచి కూడా పంటలకొనుగోలుపై నిరంతర ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్న సీఎం

సీసీఆర్సీ కార్డ్స్‌పై మరింత అవగాహన
సీసీఆర్సీ కార్డ్స్‌ ( క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్స్‌)లపై అవగాహన నిరంతరం కల్పించాలన్న సీఎం
సీసీఆర్సీ కార్డ్స్‌ వల్ల రైతుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదన్న విషయాన్ని వారికి చెప్పాలి

రోజుకు సగటున ధాన్యం కొనుగోలు 42,237 మెట్రిక్‌టన్నులకు చేరిందన్న అధికారులు
రానున్న రోజుల్లో మరింత ఉద్ధృతంగా కొనుగోళ్లు జరుగుతాయన్న అధికారులు

ప్రత్యామ్నాయ సాగు – ప్రోత్సాహం
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేలా వారిలో అవగాహన కల్పించండి: సీఎం
ఇలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్‌ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి
ప్రత్యామ్నాయ పంటలు పండించేలా కార్యాచరణ సిద్ధంచేయండి
ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్న విషయాన్ని రైతులకు తెలియజేయండి
రైతులకు మంచి ఆదాయాలు కల్పన దిశగా చర్యలు తీసుకోవాలి: అధికారులకు సీఎం నిర్దేశం

ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని), సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధనరెడ్డి, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ ఎం గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పీ ఎస్‌ ప్రద్యుమ్న,  సివిల్‌ సఫ్లైస్‌ డైరెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, సివిల్‌ సఫ్లైస్‌ ఎండీ జీ వీరపాండ్యన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: (పారిశ్రామిక విప్లవం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement