kurasala kannababu
-
తరాలు మారుతున్నా చంద్రబాబు విజన్ లో ఎటువంటి మార్పు లేదు: కన్నబాబు
-
జనాలను మభ్యపెట్టేందుకే బాబు ‘విజన్’
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన విజన్–2047 జనాలను మభ్యపెట్టేందుకేనని, ఆ విషయంలో ఆయన ఘనుడని మాజీమంత్రి వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన విజన్–2047 పేదల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. గతంలో విజన్–2020 ప్రవేశపెట్టినప్పుడే కమ్యూనిస్టులు ‘విజన్–2020.. చంద్రబాబు 420’గా.. వరల్డ్ బ్యాంకు జీతగాడుగా పిలిచేవారు. ఇప్పటికీ ఆయన విజన్‌లో ఎలాంటి మార్పూలేదు. విజన్–2047 గురించి మాట్లాడే ముందు 2024 పరిపాలన విధానంపై ఆయన ఆలోచించాలి. విజన్ అనేది పేదవాడికి సహాయం చేయడానికి ఉండాలి.కానీ.. చంద్రబాబు ఒక్క రూపాయి అయినా సహాయం చేశారా? రైతులకు రూ.20 వేలు పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా ఊసేలేదు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆయన 2014లో రుణమాపీ చేయకుండా రైతులను మోసం చేశారు. చంద్రబాబు 1998లో రూ.2 కోట్ల 50 లక్షలతో మెకాన్సీ సంస్థ ద్వారా విజన్ డాక్యుమెంట్ తయారుచేయించారు. అందులో.. అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేసి యూజర్ ఛార్జీలు వసూలుచేయమని ఉంది. మెడికల్ సీట్లు వద్దనడమే బాబు విజన్..జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలకు అనుమతిచ్చి ఐదింటిని పూర్తిచేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్‌పరం చేస్తున్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాయడం చంద్రబాబు విజన్. అలాగే, వలంటీర్లు, బేవరేజ్ కార్పొరేషన్ సిబ్బందినీ తొలగించి వారిని రోడ్డున పడేశారు. సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నా కొంతమందికే సంపద కలుగుతోంది. అమరావతికి రూ.15వేల కోట్ల అప్పు దొరకిందన్న అనందం తప్ప పేదవాడికి పది రూపాయలు సహాయం చేశామన్న సంతోషంలేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి కిందస్థాయి అధికారుల వరకు అందరినీ వేధిస్తున్నారు.ఈ ఏడు నెలల కాలంలో రూ.70 వేల కోట్ల అప్పుచేయగా.. ప్రజలకు ఏంచేశామో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులతో రిమాండ్‌కు తరలిస్తున్నారు. కానీ, జగన్మోహాన్రెడ్డి మీద మీరు ఎన్ని పోస్టులైన పెట్టొచ్చా? మీ మాటలకు, చేతలకు పొంతనలేదు. ఉచిత ఇసుక ఎక్కడా అమలుకావడంలేదు. ఇలా ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు?ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ అరెస్టు..అల్లు అర్జున్ అరెస్టు నూటికి నూరుశాతం ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సా«ధింపులా ఉంది. నాలుగు రోజులు జైలులో ఉంచాలని చూసినట్లుగా ఉంది. తొక్కిసలాట సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదా? ఈ విషయంలో ఏపీలో ఒక చట్టం, తెలంగాణాలో ఒక చట్టం అమలవుతోంది. గత గోదావరి పుష్కరాల్లో 29 మంది తొక్కిసలాటలో చనిపోతే ఆనాడు చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం కనబడలేదు. అప్పుడాయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి. -
చంద్రబాబు విజన్ పేదల పాలిట శాపం: కన్నబాబు
సాక్షి, కాకినాడ: సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన తాజా విజన్-2047 ఆచరణకు పనికి రాని ఒక డ్రామా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఒక స్వయం ప్రకటిత విజనరీ అని, గతంలో ఆయన ప్రకటించిన రెండు విజన్లలోని లక్ష్యాలను ఏ మేరకు సాకారం చేశారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విజన్ అంటేనే పేదవారి విధ్వంసంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కొత్తసీసాలో... పాతసారాగతంలో చంద్రబాబు రెండుసార్లు విజన్ డాక్యుమెంట్లను రిలీజ్ చేశాడు. ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశాడు. ఈ దేశంలో తానే ఒక గొప్ప విజనరీగా భ్రమపడే చంద్రబాబు, ప్రజలను కూడా తన పబ్లిసిటీ స్టంట్లతో భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగానే ఈ తాజా విజన్ 2047 డాక్యుమెంట్. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కొత్త సీసాలో పాత సారా.1995-2004 మధ్య, 2014-19 మధ్య సీఎంగా చంద్రబాబు ప్రకటించిన రెండు విజన్లలో ఒక్క లక్ష్యాన్ని అయినా సాధించిన దాఖలాలే లేవు. చంద్రబాబు తాజాగా విజన్-2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. రెండు మూడు రోజుల నుంచి మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైనే ప్రచారం చేసుకుంటున్నాడు. జనాలను మభ్యపెట్టడం ఎలా అనే అంశంపై చంద్రబాబు పుస్తకం రాస్తే, ఈ ప్రపంచంలోనే అత్యధికంగా అది అమ్ముడు పోతుంది. ప్రజలకు ఏం కావాలనేది ఆయనకు అక్కరలేదు. కానీ వారిని భ్రమల్లో ఉంచడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం ఎవరికీ లేదు. దానిలో భాగమే ఈ తాజా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ'విజన్-2020 చంద్రబాబు-420'చంద్రబాబు గతంలో రిలీజ్ చేసిన విజన్-2020, విజన్-2029 అనే డాక్యుమెంట్ డ్రామాలు ప్రజలను ఎలా మోసం చేశాయో కమ్యూనిస్ట్‌లు ఆనాడే ప్రజలకు గుర్తు చేశారు. గతంలో ఆయన ప్రకటించిన డాక్యుమెంట్లను అధ్యయనం చేసిన కమ్యూనిస్ట్ లు విజన్-2020 చంద్రబాబు-420 అనే నినాదం కూడా చేసేవారు. అప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు విజన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఆనాడు ఎలా ఆలోచించాడో, నేడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు విజన్-2047 అంటూ కొత్త రాగాన్ని ఆలపిస్తే, కూటమిలోని భాగస్వాములు దానికి తప్పెట్లు, తాళాలతో ఆయన చాలా గొప్పనాయకుడు, వంద ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించాలని కీర్తిస్తున్నారు.ప్రజాశ్రేయస్సుకు దూరంగా చంద్రబాబు విజన్2024లో ప్రజలు చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేయాలి, వారి అవసరాలు ఏమిటీ అని ఆలోచించకుండా విజన్ 2020లో ఏం చెప్పారో ఇప్పుడు 2047 విజన్లోనూ అవే చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. కానీ ఈ రాష్ట్రంలో నేటికీ తాగునీరు అందని గ్రామాలు, విద్య, వైద్యం, రహదారులు, కరెంట్, కనీస సదుపాయాలు లేని పల్లెలు ఉన్నాయంటే అత్యధిక కాలం సీఎంగా చేసిన చంద్రబాబుకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇది ఎలాంటి విజన్? కనీస అవసరాలు తీర్చే విజన్ లేకుండా, తనకు తానే భ్రమల్లోకి వెళ్ళి ప్రజలను కూడా భ్రమల్లోకి నెట్టడం సమంజసమా? విజన్ 2020 తరువాత రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి 2.4 శాతం నుంచి 0.29 శాతానికి పడిపోయింది, రాష్ట్ర జీడీపీ ఏకంగా 5 శాతం లోపే నమోదు అయిన విషయం వాస్తవం కాదా?సూపర్ సిక్స్ హామీల అమలుపై మీ ప్రణాళిక ఏదీ?వరుసగా విజన్ లను ప్రకటిస్తున్న చంద్రబాబుకు ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు మాత్రం గుర్తుకు రావడం లేదు. సూపర్ సిక్స్ అని ఇచ్చిన హామీల్లో ఒక్క పథకంలోనూ ఒక్క రూపాయి పేదలకు సాయం చేయకుండా గాలికి వదిలేశారు. రైతులను ఆదుకోవాలనే విజన్ అంతకన్నా లేదు. 2014 కి ముందు మీరు ఇచ్చిన రైతు రుణమాఫీని అమలు చేయకుండా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. వ్యవసాయమే దండుగ అనే విధంగా పాలన సాగించారు. నేడు మళ్ళీ సీఎంగా అధికారంలోకి రావడానికి రైతులకు రూ.20 వేల సాయం అంటూ హామీ ఇచ్చారు. దానిని కూడా ఆరునెలలైన అమలు చేయడం లేదు. ఉన్న ఉచిత పంటల బీమాను కూడా ఎత్తేశారు ధాన్యం కొనుగోళ్ళు చేయడం లేదు, గిట్టుబాటు ధర కల్పించడం లేదు. నిలువునా రైతులను దగా చేస్తున్న మీరు విజన్ 2047లో రైతులను ఉద్దరిస్తానని చెబుతుంటే, ప్రజలు నవ్వుకుంటున్నారు.విద్య-వైద్య రంగాలపై చంద్రబాబు విజన్ అధ్వాన్నంఈ రోజు మాకు కడుపు నిండా అన్నం పెట్టాలని పేదలు కోరుతుంటే... 2047లో పరవాణ్ణం పెడతానని చంద్రబాబు ఊరిస్తున్నాడు. పేదరికం వల్ల ఇబ్బంది పడకూడదని ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ సీఎంగా ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలను తీసుకువచ్చారు. విద్యా, వైద్యరంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించారు. అదే ఒరవడిని సీఎంగా వైఎస్ జగన్ మరింత ముందుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఫీజురీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయడం లేదు. జగన్ సీఎం అయ్యే వరకు పాఠశాలలకు సరిపడిన భవనాలు లేవు, పిల్లలు కూర్చునేందుకు బెంచీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడుకునేందుకు టాయిలెట్లు లేవు, కనీసం చాక్ పీస్ లు కూడా లేవు.పాఠశాలలను తీర్చిదిద్దాలనే విజన్ ఏనాడైనా చంద్రబాబుకు ఉందా? విద్యను, వైద్య రంగాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే ప్రాజెక్ట్‌లను తీసుకు రాకుండా, తాను విజనరీని అని చంద్రబాబు ఎలా చెప్పుకుంటారు? కాకినాడ జనరల్ ఆసుపత్రిలో సరిపడా ఇన్సులిన్ లేదు. ఇది మీ ప్రభుత్వ పరిస్థితి. మేం వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో గ్రామస్థాయిలో సరిపడినన్ని మందులతో ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తే, చంద్రబాబు సీఎం కాగానే దానికి మంగళం పాడారు. అటువంటి మీరు విజన్ ద్వారా అభివృద్ధిని, సంతోషాన్ని ఇస్తానని చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.విజన్-2020 ద్వారా ప్రైవేటీకరణకు పెద్దపీట వేశారు1998లో చంద్రబాబు ప్రభుత్వం మెకన్సీ అనే విదేశీ కన్సల్టెన్సీకి దాదాపు రూ.2.5 కోట్లు చెల్లించి విజన్ 2020 రూపొందించుకున్నారు. దీనిని చూసి ప్రపంచంలోని నిపుణులు ఆశ్చర్య పోయారు. చంద్రబాబు ప్రపంచంలోని ప్రముఖుల ప్రశంసలు కావాలనే ఆలోచనతో నేను సీఎంను కాదు, సీఈఓను అని ప్రకటించుకున్నారు. మెకన్సీ చేసిన విజన్-2020 డాక్యుమెంట్ చూస్తే విద్యా, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేసి, ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని ప్రతిపాదించారు. అంటే ప్రజలకు ఉచితంగా విద్యా, వైద్యంను అందించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుని, ప్రైవేటువారికి ఇవ్వాలనే లక్ష్యం మీకు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ఇదేనా మీ విజన్? స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి మెరుగైన వైద్యాన్ని ఉచితంగా పేదలకు చేరువ చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ ద్వారా పేదలకు కూడా ఉన్నత విద్యను అందించారు. ఇది కాదా నిజమైన విజన్ అంటే?ప్రజాభాగస్వామ్యం లేని విజన్ ఇదిచంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్ లో ప్రజాభాగస్వామ్యం ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలోని మేధావులు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారా? రైతులు, ప్రజల ముందు పెట్టి వారి అభిప్రాయాలు కోరారా? దీనిపై ఎక్కడైనా చర్చకు పెట్టారా? చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులకు చెందిన ఎన్జీఓ సంస్థలతో ఈ విజన్ తయారు చేయించారు. అంతేకానీ నిజంగా ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఎటువంటి లక్ష్యాలు ఉండాలి అనే ఆలోచనలు దీనిలో లేవు. గతంలో విజన్ 2020 ప్రకటించిన తరువాత 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు.విద్యుత్ రేట్లను పెంచడం, అడిగిన రైతులపై కాల్పులు చేయించారు. ఆనాడే కమ్యూనిస్ట్ లు చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ ఒక బిరుదు ఇచ్చారు. ఇప్పుడ మళ్ళీ విజన్ 2047 అంటున్నాడు. పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి ఒక్క పోర్ట్ అయినా కట్టాడా? ఒక ఫిషింగ్ హార్బర్ కట్టాడా? తెచ్చిన ఒక కాకినాడ సీపోర్ట్ ఎడిబి రుణంతో నిర్మించి, తర్వాత తనకు కావాల్సిన వారికి దారాదత్తం చేశారు. జగన్ గారు 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి, అందులో 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు పన్నాగాలు పన్నుతున్నాడు. మాకు మెడికల్ కాలేజీ సీట్లువద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబుది విజనా? వైద్యవిద్య ఈ రాష్ట్రంలో బలపడాలన్న లక్ష్యంతో పనిచేసిన వైఎస్ జగన్‌ది విజనా?చంద్రబాబు విజన్ పేదవారి పాలిట శాపంవైఎస్ జగన్ గ్రామస్థాయిలోకి పాలన వెళ్ళాలని వాలంటీర్లు, సచివాలయాలను తీసుకువస్తే, వాటిని నిర్వీర్యం చేసిన చంద్రబాబుది ఎటువంటి విజన్? 2020 డాక్యుమెంట్ లో ఏ లక్ష్యాలను సాధించారు? 2047లో పదిసూత్రాలు అంటున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకువెడితే నవ్వుతారు. పండిన ధాన్యానికి గిట్టుబాటుధర కల్పించలేని మీరు సెకండరీ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నారు. పేదరికాన్ని తగ్గించడానికా, పెంచడానికా మీ విజన్? జగన్ గారు అమ్మ ఒడి, ఆసరా, చేయూత ఇలా సంక్షేమ పథకాలను అయలు చేస్తే, మీరు మాత్రం వాటిని పక్కకుపెట్టారు.వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం, ఉన్న ఉద్యోగాలను తీసేయడం ఇది చంద్రబాబు విజన్. సంపద సృష్టి ఎవరికోసం చేస్తున్నారు. మీ కోసం సంపదను మీరే సృష్టించుకుంటున్నారు. అంతేకానీ ప్రజలకు సంపదను సృష్టించే ప్రయత్నం చేయడం లేదు. పైగా వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా రూ.15వేల కోట్లు ప్రజలపై భారం వేయడాన్ని సంపద సృష్టి అంటారా? ఈ రోజు పంచాయతీల్లో పన్నులను పెంచి ప్రజలపై భారం వేయబోతున్నారు.14 ఏళ్లు చంద్రబాబు పాలనలో రెవెన్యూ లోటుఎంతో విజన్ ఉన్న చంద్రబాబు తన పాలన 14 ఏళ్ళలో ప్రతిఏటా రెవెన్యూ లోటుతోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ఇన్ని సంవత్సరాల పాటు రెవెన్యూ లోటు మరే ప్రభుత్వంలోనూ లేదు. ఇదేనా మీ పాలనా సామర్థ్యం? కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒక ఐఎఎస్ అధికారి వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15వేల కోట్లు రుణం మంజూరయ్యింది. దీనిలో 3700 కోట్లు ముందే వచ్చేస్తుంది, దీనితో అమరావతిలో పనులు వెంటనే ప్రారంభించవచ్చు అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. రూ.15 వేల కోట్ల అప్పు దొరికిందని ఆనందిస్తున్నారే కానీ, పేదలకు పదిరూపాయలు ఖర్చు చేయడంలో ఉన్న ఆనందాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులను సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు. మీ ప్రభుత్వంలో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులపై బెదరింపులు, వేధింపులే. కలెక్టర్ లను బెదిరిస్తున్నారు. సెన్సేషనలిజంను ఈ ప్రభుత్వం నమ్ముకుంది. తిరుపతి లడ్డూ, కాకినాడ పోర్ట్, రేషన్ బియ్యం ఇలా ఏదో ఒక అంశాన్ని తీసుకుని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువెళ్లడం, దానిపై ప్రజలకు అబద్దాలు చెబుతూ మభ్య పెట్టడంను ఒక వ్యూహంగా అమలు చేస్తున్నారు. మంచి జరిగితే మాదే అంటున్నారు. సరిగా జరగకపోతే అధికారుల వైఫల్యం అంటారా?చంద్రబాబు మాటలకు.. చేతలకు పొంతన లేదుఅధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల్లో రూ.70 వేల కోట్లు అప్పులు తెచ్చారు. దానిలో కనీసం ఇంత మొత్తం మా హామీల కోసం ప్రజలకు ఖర్చు చేశామని చెప్పుకునే పరిస్థితి లేదు. వైయస్ఆర్ సిపి కార్యకర్తలపైనా, సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపైనా తప్పుడు కేసులు పెడుతున్నారు. జగన్ గారిని విమర్శించే వారిపై ఫిర్యాదు చేసినా మీ ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం కేసు కూడా రిజిస్టర్ చేయడం లేదు. ఇదేనా మీ రూల్ ఆఫ్ లా. కూటమి ప్రభుత్వంలో తప్పు చేసే నాయకులపై చర్యలు తీసుకోకుండా, వారిని కాపాడుకుంటున్నారు. స్టేజీపై మీ మాటలకు, చేతలకు పొంతన లేదు. అలాంటి మీరు ప్రకటించే విజన్ ఎంత వరకు ఆచరణాత్మకంగా ఉంటుంది?2047 వరకు మీరే అధికారంలో ఉంటారా?విజన్ 2047 వరకు అధికారంలో మీరు ఉంటారా? ఈ రోజు ప్రజలకు ఏం కావాలో చూడండి. తరువాత కలలు కనండి. ప్రణాళికలతోనే సరిపెట్టకూడదు, అమలు కూడా చూడాలి. అయిదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. దీనిపై మీ ప్రణాళిక ఏమిటో బయటపెట్టండి. కనీసం మీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వార్షికోత్సవంలో అయినా వెల్లడించండి. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీకి దిక్కులేదు, విజన్ 2047 అంటున్నారు. ఇదంతా డ్రామా కాదా?సినీహీరో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్రసినీహీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపులో భాగంగానే జరిగింది. శుక్రవారంనాడు అరెస్ట్ చేసి జైలుకు పంపి కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా ఉండే కుట్ర దీనిలో ఉంది. ఆయన వెళ్ళిన థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, మరో బాలుడు గాయపడటం బాధాకరం. అయితే ఈ సంఘటనకు తెలంగాణ పోలీస్ వైఫల్యం లేదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం లేదా? అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంలో మీరు చూపించిన శ్రద్ద మీ యంత్రాంగం వైఫల్యంపైఎందుకు చూపడం లేదని ప్రశ్నిస్తున్నాం.రాజమండ్రి తొక్కిసలాటకు చంద్రబాబును బాధ్యుడిని చేయలేదేగతంలో ప్రమాదవశాత్తు జరిగిన తొక్కిసలాటల్లో చాలా ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటనలను అడ్డం పెట్టుకుని కక్షసాధించే విధంగా చర్యలు తీసుకుంటే ఆనాడు రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన ఘటనలో చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండేవారు కాదా? ఆ ఘటనలో 27 మంది చనిపోయారు. కనీసం నా వల్ల తప్పు జరిగిందనే పశ్చాత్తాపం కూడా చంద్రబాబు వెల్లడించలేదు. ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదు.అసలు ఆ సంఘటనకు ఎవరూ బాధ్యులే లేరా? అంతేకాదు గత ఎన్నికల్లో గుంటూరులో చంద్రబాబు సభలో చీరెలు పంచడానికి వెడితే తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. కందుకూరులో ఒక ఇరుకు సందులో జనం కనిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సభ పెడితే కాలువలో పడి ఎనిమిది మంది మరణించారు. దీనికి బాధ్యుడిని చేస్తూ చంద్రబాబును అరెస్ట్ చేయలేదు. దేశ వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. ఈ ఘటనల్లో ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? ఇవి ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలు, వీటిని తమకు గిట్టని వారికి వ్యతిరేకంగా తప్పుడు కేసులు బనాయించే సందర్భాలుగా మలుచుకోవడం బాధాకరం.తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే ఇదిఅల్లు అర్జున్ హీరో నటించిన సినిమా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకుంది. ఆయన ఒక థియేటర్ కు వస్తున్నాడు అంటే పోలీసులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. మామూలు వస్త్రాలయాల ప్రారంభోత్సవాలకు సినిమా నటులు వస్తున్నారంటేనే రోడ్లు బ్లాక్ అయిపోతుంటాయి. సినీ నటులపై ప్రజల్లో క్రేజ్ ఉంది. అటువంటి సందర్భంలో ముందు జాగ్రత్తగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావాలి. తొక్కిసలాట జరగకుండా బందోబస్త్ ఏర్పాటు చేయాలి.దానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించినట్లు కనిపిస్తోంది. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. చట్ట ప్రకారం అరెస్ట్ చేసే ముందు అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారా, ముందస్తు విచారణకు పిలిచారా? ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేసినట్లు కాదా? దీనిని మాజీ సీఎం జగన్ గారు తీవ్రంగా ఖండించారు. జాతీయ మీడియా కూడా ఇది తప్పు అని చెబుతోంది. కేంద్రంలోని మంత్రులు కూడా దీనిని ఖండించారు.సెన్సెషనలిజం కోసమే పాలకుల చర్యలుఅల్లు అర్జున్ అరెస్ట్ ను సెన్సేషనలిజం కోసమే చేసినట్లు కనిపిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు. అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్, ఇక్కడ సోషల్ మీడియా యాక్టివీస్ట్ ల అరెస్ట్ లు ఒకేరకంగా సాగుతున్నాయి. ఈ విధానాలు సరైనవి కావు. -
తరాలు మారుతున్న చంద్రబాబు విజన్‌లో ఎలాంటి మార్పు లేదు
-
బాబుని ఏకిపారేసిన కన్నబాబు
-
యనమల లేఖ పై విచారణ జరిపించండి.. సెజ్ రైతుల పక్షాన మేము నిలబడతాం
-
బాబును బాహుబలిగా చూపించేందుకు ఎల్లో మీడియా తాపత్రయం
-
కేవీ రావుపై పవన్ చేసిన ఆరోపణలు మరిచిపోయారా?: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: పాలనలో తన వైఫల్యాలను, బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాకినాడ ఎస్ఇజెడ్ భూములపై ఈనాడు పత్రిక దిగజారిపోయి రోత రాతలు రాసిందని ధ్వజమెత్తారు.కాకినాడ ఎస్ఇజెడ్ భూములపై కుట్రపూరితంగా చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న ఈనాడు పత్రిక అసత్యాలు, అభూతకల్పనలతో వైఎస్ జగన్‌పైన బుదరచల్లేందుకు ప్రయత్నించాయని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్ఇజెడ్ కు భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులకు, వారి భూములను తిరిగి ఇప్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని కన్నబాబు అన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..2003లో తొండింగి మండలంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కొంత ప్రభుత్వ, మరికొంత అసైన్డ్ భూములను ఎపిఐఐసికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. తర్వాత కాలంలో ఎస్ఇజెడ్ కు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు వ్యతిరేకించారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో కాలుష్య కారక పరిశ్రమలను ఇక్కడకు రానివ్వను, రైతుల భూములను తిరిగి వారికి అప్పగిస్తానంటూ హామీలు గుప్పించారు. భూపోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా 2012లో ఏకంగా ఏరువాకలో సైతం పాల్గొన్నారు.ప్రతిపక్ష నేతగా వ్యతిరేకించారు.. సీఎం కాగానే రైతులపై దాష్టీకం2014లో అధికారంలోకి రాగానే గతంలో తాను ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరిచిపోయారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించారు. తమ భూములను దున్నుకునేందుకు వెళ్ళిన రైతులపై చంద్రబాబు పోలీసులను ప్రయోగించారు. పలువురిని అరెస్ట్ చేసి, రాజమండ్రి జైలుకు తరించారు. వారితో బాత్రూంలు కడిగించి, పలు రకాలుగా వేధించారు. కనీసం 2013 నాటి భూసేకరణ చట్టం కింద అయినా పరిహారం ఇవ్వాలన్న రైతుల కోరికను చంద్రబాబు నిరాకరించారు.తొమ్మిది గ్రామాలను కబళించేందుకు తెగబడిన చంద్రబాబు సర్కార్ ఎస్ఇజెడ్ కు భూములను బలవంతంగా కట్టబెట్టేందుకు ఏకంగా తొమ్మిది గ్రామాలను ఖాళీ చేయించాలని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామాల్లో గ్రామసభల ద్వారా ఎస్ఇజెడ్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తారనే భయంతో ఆనాడు పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న నారా లోకేష్ 73, 74 అధికారణ కింద పంచాయతీలకు ఉన్న హక్కులను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతులు వేరే వారికి భూములు అమ్ముకోకుండా ఉండేందుకు ఏకంగా వారి భూములను చంద్రబాబు ప్రభుత్వం నిషేద భూముల జాబితాలో పెట్టి పైశాచిక ఆనందం పొందింది.పాదయాత్రలో వైఎస్ జగన్‌కు తమ గోడు వెళ్లబోసుకున్న రైతులుపాదయాత్రలో భాగంగా జగన్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎస్ఇజెడ్ భూముల బాధిత రైతులు ఆయనను కలిశారు. ఆనాడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాను. వారి బాధలను విన్న జగన్ గారు ప్రతిపక్ష నేతగా పిఠాపురం సభలో ఒక హామీ ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు సంబంధించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని వాగ్ధానం చేశారు. అధికారంలోకి రాగానే దీనిపై నా నేతృత్వంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులతో పలుసార్లు చర్చలు జరిపింది. అనంతరం 2021లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాం. దాని ప్రకారం ఎస్ఇజెడ్కు రిజిస్టర్ చేయకుండా ఉన్న 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చేయాలని, స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆరు గ్రామాలను తరలించాలనే ప్రతిపాదనను విరమించాలని, శ్రీరాంపురం, బండిపేట, ఉమ్మడివారికోడు, రావివారికోడు, రామరాఘవాపురం, తాటివారిపాలెం గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని కమిటీ సిఫార్స్ చేసింది. అంతకు ముందు భూసేకరణలో భాగంగా స్మశానాలు, పాఠశాలలు, సామాజిక స్థలాలను కూడా తీసుకున్నారు. సేకరించిన శ్మశాన భూములను అప్పగించాలని, 2180 ఎకరాల రైతుల భూమిని నిషేదిత జాబితా 22ఎ నుంచి తొలగించాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిఫార్స్ చేశాం. వీటిని జగన్ గారి నేతృత్వంలో కేబినెట్ ఆమోదించింది.వేగంగా రైతులకు తిరిగి భూములు ఇప్పించేందుకు కృషిసీఎంగా వైఎస్ జగన్ ఎస్ఇజెడ్ బాధిత రైతుల కష్టాలను తీర్చేందుకు సత్వర చర్యలు తీసుకున్నారు. ఎసిఇజెడ్ కోసం కోనా గ్రామానికి సంబంధించి 657 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఇచ్చిన రైతులకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, దివీస్ కోసం కేటాయించిన భూములకు కూడా అదనంగా అయిదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానికంగా ఉన్న హెచరీలకు భద్రత కల్పించాలని, స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రభుత్వం సూచించింది. కేంద్ర నోటిఫికేషన్ పరిధిలో ఎస్ఇజెడ్ అనేది ఉంటుంది. దీనిని కేంద్రం నోటిఫికేషన్ నుంచి తొలగించాలనే ఉద్దేశంతో అధికారులు కేంద్రంతో సంప్రదించి సర్వే నెంబర్ల వారీగా భూములను ఉపసంహరింపచేశారు. దాదాపు నాలుగు వందల ఎకరాల వరకు విత్ డ్రా చేయించారు. భూ యాజమాన్య, వారసత్వ సమస్యలను కూడా సమగ్రంగా పరిశీలించి రైతులకు రిజిస్టర్ చేయించాలని కూడా సిఫారస్ చేశాం.రైతులకు మేలు చేసిన వైఎస్ జగన్‌పై ఈనాడు బురదదేశంలోనే మరెవ్వరూ రైతుల కోసం ఇంతగా చేయలేదు. ఎస్ఇజెడ్ కోసం బలవంతంగా చేస్తున్న భూసేకరణను నిలువరించి, రైతులకు భూములను తిరిగి ఇప్పించిన ఘనత సీఎంగా ఆనాడు వైఎస్ జగన్‌కే దక్కుతుంది. బాధిత రైతుల బాధలు తీర్చేందుకు ఆనాడు కన్నబాబు కమిటీ ఇంత కృషి చేస్తే.. రైతులను మోసం చేశారు అంటూ ఈనాడు పత్రిక తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటు. రైతులు తమకు తిరిగి దక్కిన భూమిని వారి అవసరాల కోసం ఇతరులకు అమ్ముకున్నారు.దాడిశెట్టి రాజా, పిఠాపురంకు చెందిన కొందరు ఈ భూములను కొనుగోలు చేసి ఉంటారు. అంతమాత్రాన రైతులను బెదిరించి భూములను లాక్కున్నారంటూ బుదరచల్లుతారా? రైతులకు మార్కెట్ రేటు ప్రకారం డబ్బు ఇచ్చిన తరువాత కొనుగోలు చేయడం కూడా అక్రమమే అవుతుందా? రైతుల భూములను బలవంతంగా గుంజుకున్న చంద్రబాబు ఈనాడు దృష్టిలో గొప్ప నాయకుడు. రైతుల బాధను చూసి వారికి అండగా నిలిచిన జగన్ గారు మాత్రం రైతులకు అన్యాయం చేసినట్లుగా ఈనాడు చిత్రీకరించడం వారి దిగజారుడుతనంకు నిదర్శనం.కాకినాడ డీప్ సీ పోర్ట్ పైనా చంద్రబాబు మార్క్ కుటిల రాజకీయంకాకినాడ సీ పోర్ట్ లో రెండు కంపెనీల మధ్య వాటాల కొనుగోలును చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి లావేదేవీలు ఎప్పుడూ జరగలేదా? కేవీ రావును బెదరించి వాటాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అలా అయితే మొత్తం వాటాలు తీసుకునేవారు కాదా? కేవలం 41 శాతం తీసుకుని, మిగిలినవి కెవి రావు చేతుల్లోనే ఉంచుతారా? నేటికీ కేవీ రావు చేతుల్లోనే సీపోర్ట్ యాజమాన్యం ఉంది. అజమాయిషీ వారిదే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటప్పుడు బలవంతంగా వాటాలు గుంజుకున్నారని ఎందుకు కేవీరావు ఆనాడు ఫిర్యాదు చేయలేదు.కేవీరావుకు సీపోర్ట్ కట్టబెట్టడంలో చంద్రబాబు కుట్రకాకినాడ సీపోర్ట్ ను సైతం చంద్రబాబు కుట్రపూరితంగానే కేవీ రావుకు దక్కేలా చేశాడు. 1997లో ప్రభుత్వ సొమ్ముతో నిర్మించి దాన్ని బ్యాక్ డోర్ ద్వారా కేవీరావుకు చంద్రబాబు అప్పనంగా అప్పగించేశారు. సీపోర్ట్ నిర్వహణకు ముందుగా విదేశీ కంపెనీలను తీసుకువచ్చి, కేవీరావు సంస్థలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత విదేశీ సంస్థలను వెళ్ళగొట్టి, మొత్తం కేవీ రావు సంస్థలకే దారాదత్తం చేశారు.యాంకరేజీ పోర్ట్ ను మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తుంటే, సీపోర్ట్ మాత్రం కేవీరావు సంస్థకు ఇవ్వడం వెనుక చంద్రబాబు స్వప్రయోజనాలు ఉన్నాయి. సినిమా రంగానికి చెందిన కేవీ రావుకు పోర్ట్ వ్యాపారాల్లో ఎటువంటి అనుభవం లేదు. అటువంటి వ్యక్తితో ఇప్పుడు చంద్రబాబు బలవంతంగా వాటాలు తీసుకున్నారు అని ఫిర్యాదు చేయిస్తున్నాడు. బలవంతగా తీసుకుంటే… మైనర్ వాటా తీసుకుంటారా? పైగా వాటాలు అమ్ముకుని, దానికి డబ్బులు తీసుకుని, ఆడబ్బును వేరేచోట పెట్టబుడి దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు కట్టుకథ అల్లి, తప్పుడు కేసులు పెడితే ప్రజలు నమ్ముతారా? పోర్టును కొట్టేయడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది.పెట్టబడులకు, కట్టుకథలకు పుట్టిన విష పుత్రికలు అన్న శ్రీశ్రీ మాటలను ఈనాడు పత్రిక గుర్తు చేస్తోంది. కాకినాడ యాంకరేజీ పోర్ట్ నుంచి ఎక్కువగా బియ్యం ఎగుమతి అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్‌లు ఈ పోర్ట్ ను తనిఖీ చేసిన తరువాత అరబిందో సంస్థ డీప్ సీ పోర్ట్ లో వాటాలు తీసుకున్న తరువాత నుంచే పీడీఎస్ బియ్యంను ఇక్కడి నుంచి అక్రమంగా రవాణా చేయడం ఎక్కువైందని ప్రకటనలు చేశారు. డీప్ సీ పోర్ట్ యాజమాన్యం కేవీ రావు చేతుల్లోనే ఉంది. ఆయన సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు.రాష్ట్రంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు తెలుగుదేశం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు. ఇవ్వన్నీనిజాలు అయితే, వైఎస్ఆర్ సిపిపై బుదరచల్లేలా వారు అబద్దాలు మాట్లాడటం, దానికి ఈనాడు పత్రిక బాకా ఊదడం దారుణం. 2019లో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఏం మాట్లాడారో మరిచిపోయారా? కేవీ రావు అనే వ్యక్తి వచ్చిన తరువాతే కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ బియ్యం రవాణా పెరిగిపోయిందని ఆనాడు పవన్ ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉండటం వల్ల అరబిందో వాటాలు తీసుకున్న తరువాత అంటూ మాట మారుస్తున్నాడు. -
సీజ్ చేసిన బియ్యం మళ్ళీ బయటకు ఎలా వచ్చాయి.. పవన్ బండారం బయటపెట్టిన కన్నబాబు
-
‘కలెక్టర్ వెళ్లిన షిప్‌లోకి పవన్‌ను ఎందుకు వెళ్లనివ్వలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: దొంగ సొత్తు దొరికినప్పుడు ఎందుకు ఆపలేదు?.. సీజ్ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ చేశారంటూ కూటమి సర్కార్‌ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘పవన్ ఆవేదన గమనించాను. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతోంది. పోర్టుకు వస్తానంటే ఆరు నెలలు నుంచి ఆపేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టారు. సివిల్ సప్లయి శాఖ మంత్రి తనిఖీలు చేసి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు...సివిల్ సప్లయి శాఖ నుండి పోర్డు వద్ద రెండు చెక్ పోస్టులు పెట్టారు. సివిల్ సప్లయి ఛైర్మన్ తోట సుధీర్ కూడా రేషన్ బియ్యం లారీలను పట్టుకున్నట్లు చూశాను. గతంలో మంత్రి మనోహర్ పట్టుకున్న బియ్యమే.. మళ్లీ బిజీ ఇచ్చి బియ్యాన్ని విడుదల చేశారు. బియ్యాన్ని విడుదల చేసినప్పుడు సివిల్ సప్లయి శాఖ షరతులు ఏంటి అని అడుగుతున్నాను. సివిల్ సప్లయి చెక్ పోస్టులు దాటి ఈ బియ్యం పోర్టులోకి ఎలా వెళ్లాయి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘బియ్యం ఉన్న షిప్‌లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనీయడం లేదని పవన్ అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ను ఎవరూ ఆపి ఉంటారని సామాన్యులలో ప్రశ్నలు తలెత్తున్నాయి. డిప్యూటీ సీఎం పై స్ధాయిలో వ్యక్తే పవన్‌ను షిప్పులోకి ఎక్కకుండా ఆపారా?. అక్రమాలు జరుగుతున్న పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనిదే?. కాకినాడ పోర్టు దేశ భద్రతకు ముప్పు ఉందని పవన్ ఆందోళన చెందారు. ఒకవేళ కసాబ్ లాంటి వాళ్లు వస్తే తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదే కదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘కలెక్టర్ వెళ్లిన షిప్పులోకి డిప్యూటీ సీఎంను ఎందుకు ఆపారు? ఎవరూ ఆదేశాల మేరకు ఆపి ఉంటారు. ఇప్పటీకి రేషన్ బియ్యం దందా జరుగుతుందని ఎల్లో మీడియాలోనే వస్తుంది? దానిని అడ్డుకోవాలి. సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పవన్ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పవన్ దేశ భద్రత కోసం మాట్లాడారు.. దానికి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. సివిల్ సప్లయి శాఖ చాలా పటిష్టం అవ్వాల్సిన అవసరం ఉంది. ..ఇవాళ పేపర్ చూస్తే షాక్ కొట్టింది.. బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ. విద్యుత్ ఛార్జీలతో చంద్రబాబు ప్రజలను బాదేశారు. యూనిట్ మీద రూ.2.19 పైసలు అదనపు భారాన్ని వేశారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రజల మీద భారం వేసి జగన్ సంపద సృష్టించలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికలకు మందు అనేక సభల్లో చంద్రబాబు చెప్పారు. ఇది చంద్రబాబు పర్మినెట్ స్టేట్మెంట్. ఐదు నెలల్లో మాట మార్చేశారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
అధికారం శాశ్వతం కాదు.. కూటమికి వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక
తూర్పుగోదావరి: ఏపీలో కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు వైఎస్సార్సీపీ నేతలు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు బెయిల్ మంజూరైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శ్రీకాంత్ విడుదలయ్యారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కోసం వైఎస్సార్సీపీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఇప్పటి కంటే వడ్డీతో సహా కూటమి నేతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు. పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో నాయకులు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అడిగినందుకే కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ పేరుతో ఎన్నికల ముందు బెదిరించి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయటం దారుణం. ఒకవైపు హింసాత్మక చర్యలు ఉండవంటూనే మరోవైపు హింసాత్మక చర్యలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు.రామచంద్రపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ..‘మాజీ మంత్రి పైన అతని కుమారుడి పైన కేసులు పెడతామని మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో మంత్రి బహిరంగంగా చెప్పాలి. ఎన్నికల అఫిడవిట్లో మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అడగడం తప్పా?. ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో ఆలోచించండి అంటూ హితవు పలికారు. -
గ్రామీణ రోడ్లకు టోల్ టాక్స్ వసూలు చేయడం సంపద సృష్టినా..?
-
చంద్రబాబు వాలంటీర్లను మోసం చేశాడు: Kannababu
-
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు
-
చంద్రబాబు మంత్రం దండం..కన్నబాబు సెటైర్లు
-
మంత్రి పయ్యావుల కేశవ్ కి కన్నబాబు అదిరిపోయే కౌంటర్
-
అబద్ధాలు ఆపు చంద్రబాబూ..అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారు
-
అబద్ధాలు ఆపండి.. అసలు నిజాలివే చంద్రబాబూ: కన్నబాబు
సాక్షి తాడేపల్లి: మేము ఏదో విధ్వంసం చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని.. చంద్రబాబు అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ హయాంలో రిసోర్స్ ఫండ్ 10,500 కోట్లు సాధించామని తెలిపారు. పయ్యావుల కేశవ్ సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్ కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని జగన్ ఆపలేదు. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించారు. రాష్ట్రాన్ని వైఎస్ జగన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో జీడీపీ వృద్ధి చెందింది. రాష్ట్ర జీడీపీ 4.83 శాతానికి వృద్ధి చెందింది.ఆనాడు చంద్రబాబు దాదాపు రూ.41 వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ కట్టారు.’’ అని కన్నబాబు వివరించారు.చంద్రబాబు మార్కెటింగ్ స్కిల్స్ ఊహకందని రీతిలో పెరిగిపోయాయి. ప్రజల మెదళ్లోకి విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తే దాన్ని ఆర్థిక ఉగ్రవాదం అంటున్నారు. వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తే తన సొంత పనుల కోసం వెళ్లినట్టు అంట. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే రాష్ట్ర అభివృద్ధి కోసమట. చంద్రబాబుకు అధిష్టానం ఢిల్లీలో ఉంది. అందుకే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. విభజన చట్టం ప్రకారం రూ.17 వేల కోట్లు ఏపీకి రావాలి. కానీ చంద్రబాబు తెచ్చింది రూ.3,900 వేల కోట్లు మాత్రమే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రూ.10,500 వేల కోట్లు నిధులు తెచ్చారు. మరి చంద్రబాబు గొప్పా? వైఎస్ జగన్ గొప్పా?. కరోనాని సమర్థవంతంగా జగన్ ఎదుర్కొన్నారు..ప్రజలకు సంక్షేమ పథకాలను ఆపకుండా అందించారు. జీడీపీలో మన రాష్ట్ర షేర్ 4.47 నుంచి 4.83కు పెరిగింది. మెరుగైన ఫలితాలు వైఎస్ జగన్ సాధించగలిగారు. చంద్రబాబు రూ.42,183 వేల కోట్ల బకాయి పెట్టి పోతే జగన్ ఆ అప్పులన్నీ తీర్చారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని కూడా జగన్ పర్యవేక్షణ చేశారు. రక్తహీనత రాకుండా చూసేందుకు మంచి భోజనం పెట్టారు. చంద్రబాబు అంతకుమించి పెడితే సంతోషిస్తాం. ఎఫ్.ఆర్.బీఎం. లిమిట్స్ దాటి అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆయన చేసిన ఆ అధిక అప్పులను కూడా జగన్ చెల్లించాల్సి వచ్చింది. చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఒక బ్రహ్మపదార్థం. రూ. 14 లక్షల కోట్లు మా హయాంలో అప్పులు చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారు...బడ్జెట్లో రూ.6 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు చెప్పారు. ఇప్పుడు రూ.9 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు చంద్రబాబు చెప్తున్నారు. అంటే అసెంబ్లీలో చెప్పిన రూ.6 లక్షల కోట్ల అప్పుల మాట అబద్ధమా?. ఈ ఐదు నెలల కాలంలో చంద్రబాబు రూ.50 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఆ సొమ్ముతో ఏ ఒక్క సంక్షేమ పథకాన్నైనా ఎందుకు అమలు చేయలేదు?. ఆ నిధులన్నీ ఏం చేశారు?. 2014-19 మధ్యలో రైతురుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశారు. రూ.83 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా రూ.13 వేల కోట్లు విదిల్చారు. చంద్రబాబు ఏం చేయకుండా చేసినట్టు గొప్పగా చెప్పుకుంటారు. మేము ఎన్నో చేసినా చెప్పుకోలేకపోయాం..సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి వారి ఎఫ్ఐఆర్లను ఆన్లైన్లో ఎందుకు పెట్టటం లేదు?. ఈ ఐదు నెలల్లోనే చంద్రబాబు అనేక జీవోలను రహస్యంగా ఎందుకు ఉంచారు?. విజయమ్మ రాసిన లేఖను సైతం ఫేక్ లెటర్ అంటూ టీడీపీ అధికార ట్విట్టర్లో పెట్టారు. పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలి. వారు నిజాయితీగా ఉంటే వైఎస్సార్సీపీ మహిళా నేతలపై పోస్టులు పెట్టినవారిని అరెస్టు చేయాలి. గోదావరి జిల్లాలో రూ.6 వేలకు దొరికే ఇసుక ఇప్పుడు రూ.16 వేలకు చేరింది. పోలవరం ఎత్తు తగ్గించటానికి కారణ ఏంటో ప్రజలకు చెప్పాలి. ఆ ప్రాజెక్టును బ్యారేజీలాగా మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. పోలవరం అనగానే గుర్తొచ్చేది వైఎస్సార్. ఆయన లెగసీని జగన్ కంటిన్యూ చేశారు...చంద్రబాబు తెచ్చిన లిక్కర్‌ను చూసి మందుబాబులు తిడుతున్నారు. రూ.99 లకు ఇస్తున్న లిక్కర్ ఇతర రాష్ట్రాల్లో రూ.80లకే దొరుకుతుంది. వైన్ షాపులు తీసుకున్నవారు సైతం ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు మోసం చేయని వర్గం అంటూ ఏమీ లేదు. కక్షసాధింపునకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ మారిపోయింది. శాంతిభద్రతలు ఫెయిల్ అయ్యాయని కూటమి పెద్దలే అంటున్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి కూడా ఇలాగే అక్రమ కేసులు పెట్టారు. మహిళలను సైతం వేధింపులకు గురి చేశారు. జగన్ వచ్చాకే ఆ కేసులను రద్దు చేశారు. వైఎస్ జగన్‌పై నీచంగా పోస్టులు పెడితే పోలీసులకు కనపడటం లేదా?. ఎన్ని పన్నాగాలు వేసినా, ఎత్తుగడలు వేసినా ఫలించవు. ప్రజల మైండ్‌ను డైవర్ట్ చేయలేరు. ఈ డైవర్షన్ రాజకీయాలు మానేసి ప్రజలకు మేలు చేయాలి’’ అని కన్నబాబు డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు సిక్సర్ కొడితే లబ్ధిదారులు డకౌట్ అయినట్లుగా బడ్జెట్’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు సిక్సర్ కొడితే లబ్ధిదారులు డకౌట్ అయినట్లుగా బడ్జెట్ ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అలవిగాని అంకెలతో బడ్జెట్ నింపారన్నారు.సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలుకాని అంకెల గారెడీ. సూపర్ సిక్స్, సంక్షేమానికి కేటాయింపులు లేవు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లా ఉంది. వాస్తవ బడ్జెట్ కాదు.. గ్రాఫిక్ బడ్జెట్. అమరావతి ఊపిరి పీల్చుకో అని ఓ పత్రిక రాసింది. అమరావతి ఊపిరి పీల్చుకో అని రాశారు కాని.. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో అని రాయలేదు. దీని కన్నా దిగజారుడు ఇంకోకటి ఉంటుందా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.సూపర్ సిక్స్ క్లీన్ బౌల్డ్: వెల్లంపల్లివిజయవాడ: సూపర్ సిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఒక పాచిపోయిన లడ్డూ బడ్జెట్.. వైఎస్ జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేశాడని కూటమి నేతలు పదే పదే మాట్లాడారు. కానీ వాస్తవం ఏంటో బడ్జెట్లో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.. అప్పులు 6 లక్షల కోట్లు కూడా లేవు. తల్లికి వందనం, రైతు భరోసాకు అరకొర కేటాయింపులే చేశారు. దేశ చరిత్రలో 5 నెలలు తర్వాత బడ్జెట్ పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది’’ అని వెల్లంపల్లి అన్నారు. -
బాబు పబ్లిసిటీ ఈవెంట్
సాక్షి, అమరావతి: విజయవాడ – శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసుల వ్యవహారం చూస్తుంటే అమరావతి చుట్టూ అద్భుతాలు జరిగిపోతున్నాయని ప్రజలను నమ్మించడానికే తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. దేశంలో పలు చోట్ల విఫలమైన ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు సరికొత్త ‘షో’కు తెర తీశారన్నారు.‘అసలు ఆవ గింజంత అయితే కొసరు గుమ్మడికాయంత’ అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార పిచ్చి పీక్‌లోకి వెళ్లిందని దెప్పి పొడిచారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని గ్రాఫిక్స్ లాగే సీప్లేన్ ప్రాజెక్టు కూడా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే ప్రభుత్వం తెరపైకి తెచి్చందని స్పష్టమవుతోందన్నారు. శ్రీశైలంకు సీప్లేన్ సర్వీసుల సాధ్యాసాధ్యాలపై ఎటువంటి సర్వే నిర్వహించలేదని, ఎటువంటి పర్యావరణ అనుమతులూ లేవని చెప్పారు. కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా సీప్లేన్ సేవలు విఫలమయ్యాయని తెలిపారు. -
పచ్చ పార్టీలో పచ్చి అబద్ధాలు
-
ఆత్మహత్యకు యత్నించిన మహిళను పరామర్శించిన కన్నబాబు
-
టీడీపీ అరాచకాలపై కన్నబాబు ఫైర్
-
సాక్షిపై కేసు.. కన్నబాబు రియాక్షన్
-
‘పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా?’
సాక్షి, కాకినాడ జిల్లా: పత్రికా స్వేచ్చ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా? అంటూ మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీకి మద్దతు పలికే పత్రికలకే స్వేచ్చ ఉంటుందా? అని ప్రశ్నించారు.రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్ర్యంలో మీడియా కూడా ఉంది. సాక్షిలో రాసింది ఏమైనా కట్టుకథనా?. సీఎం చంద్రబాబు సమీక్షలో అధికారులు ఇచ్చిన నివేదిక మీదనే వార్త రాశారు. సాక్షి ఎడిటర్‌పై కేసు కచ్చితంగా కల్పితమే. కూటమీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాక్షి టీవితో పాటుగా మరికొన్ని ఛానెల్ ప్రసారాలను నిలిపివేశారు. సాక్షి ప్రసారాలు ఆపేసి.. సాక్షి పత్రికపై కేసులు పెట్టి ఏలాంటి సందేశం ఇస్తున్నారు.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.మీ పథకాలను అమలు చేయడం మాని.. కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. మీ ప్రజాప్రతినిధులు ఏలా ప్రవర్తిస్తున్నారో చూశారా?. చంద్రబాబుకు ఇవేమి కనిపించవు. తక్షణమే సాక్షి పత్రికపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలి’’ అని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.‘సాక్షి’పై తప్పుడు కేసులు ఖండిస్తున్నాం: సీపీఎంవిశాఖపట్నం: సాక్షి ఎడిటర్ మురళిపై పెట్టిన తప్పుడు కేసులను సీపీఎం నేతలు ఖండించారు. వెంటనే తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నియంతృత్వం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మీడియా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని.. మీడియాలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం సమీక్ష చేసుకోవాలన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం మంచి పద్ధతి కాదని సీపీఎం నేతలు హితవు పలికారు.