సాక్షి, కాకినాడ జిల్లా: పత్రికా స్వేచ్చ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా? అంటూ మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీకి మద్దతు పలికే పత్రికలకే స్వేచ్చ ఉంటుందా? అని ప్రశ్నించారు.
రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్ర్యంలో మీడియా కూడా ఉంది. సాక్షిలో రాసింది ఏమైనా కట్టుకథనా?. సీఎం చంద్రబాబు సమీక్షలో అధికారులు ఇచ్చిన నివేదిక మీదనే వార్త రాశారు. సాక్షి ఎడిటర్‌పై కేసు కచ్చితంగా కల్పితమే. కూటమీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాక్షి టీవితో పాటుగా మరికొన్ని ఛానెల్ ప్రసారాలను నిలిపివేశారు. సాక్షి ప్రసారాలు ఆపేసి.. సాక్షి పత్రికపై కేసులు పెట్టి ఏలాంటి సందేశం ఇస్తున్నారు.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.
మీ పథకాలను అమలు చేయడం మాని.. కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. మీ ప్రజాప్రతినిధులు ఏలా ప్రవర్తిస్తున్నారో చూశారా?. చంద్రబాబుకు ఇవేమి కనిపించవు. తక్షణమే సాక్షి పత్రికపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలి’’ అని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.
‘సాక్షి’పై తప్పుడు కేసులు ఖండిస్తున్నాం: సీపీఎం
విశాఖపట్నం: సాక్షి ఎడిటర్ మురళిపై పెట్టిన తప్పుడు కేసులను సీపీఎం నేతలు ఖండించారు. వెంటనే తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నియంతృత్వం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మీడియా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని.. మీడియాలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం సమీక్ష చేసుకోవాలన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం మంచి పద్ధతి కాదని సీపీఎం నేతలు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment