
సాక్షి, కాకినాడ జిల్లా: టీటీడీ ఛైర్మన్ వాఖ్యలు బాధ్యతారాహిత్యం అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని.. టీటీడీ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయాలు, ప్రచార ఆర్భాటాలు తప్పా దేన్ని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
‘‘లడ్డూలో కల్తీ జరిగిందని సాక్షాత్తూ వెంటేశ్వరస్వామిని రాజకీయానికి వాడుకున్నారు. టీటీడీ నిర్లక్ష్యానికి ఏడుగురు భక్తుల నిండు ప్రాణాలు బలైపోయాయి. పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోతే.. కనీసం ఒక్క నిముషం మృతుల కోసం చంద్రబాబు బాధపడిన సందర్భం లేదు. టీడీడీ ఛైర్మన్ వాఖ్యలు బాధ్యతారాహిత్యం. తొక్కిసలాటకు తప్పు వెంకటేశ్వర స్వామీదా?
..తొక్కిసలాటకు బాధ్యత ఎవరూ తీసుకుంటారు.?. ఇప్పటికైన ప్రజల ముందుకు వచ్చి.. దేవుడు ముందు తప్పు తమదేనని లెంపలేసుకోండి. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎంతసేపూ జగన్‌పై విష ప్రచారం.. రెడ్ బుక్ రాజ్యంగం అంటూ పాలనను గాలికి వదిలేశారు’’ అని కన్నబాబు ధ్వజమెత్తారు.

Comments
Please login to add a commentAdd a comment