Kurasala Kannababu Sensational Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు మార్క్‌ పథకం ఒక్కటి చెప్పగలరా?: కన్నబాబు

Apr 5 2023 7:42 PM | Updated on Apr 5 2023 8:24 PM

Kurasala Kannababu Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు, లోకేష్‌ ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని, చంద్రబాబు తన మార్క్‌ పథకం ఒక్కటి చెప్పగలరా అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు.

సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు, లోకేష్‌ ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని, చంద్రబాబు తన మార్క్‌ పథకం ఒక్కటి చెప్పగలరా అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 స్థానాల్లో పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నాడు. ఎల్లో మీడియా మోసినంత కాలం చంద్రబాబు ఆటలు సాగుతాయి. చంద్రబాబు మీడియాను నమ్మితే జగన్‌ ప్రజలను నమ్ముకున్నారు.

‘‘కాంగ్రెస్‌ హయాంలో మద్య నిషేధంపై ఈనాడే ఉద్యమం చేయించింది. చంద్రబాబు సీఎం అయిన వెంటనే మద్య నిషేధం ఎత్తివేశారు. దీనికి కర్త, కర్మ రామోజీనే’’ అంటూ దుయ్యబట్టారు. పవన్ చెప్పినట్లు ప్రజలు వైఎస్సార్‌సీపీ విముక్తి ఏపీని కోరుకోవడం లేదు. వైఎస్సార్‌సీపీ సహిత ఏపీని కోరుకుంటున్నారు. 2019 లో వైఎస్ జగన్ సీఎం ఎప్పటికి కాడని పవన్ వ్యాఖ్యలు చేశారు. కానీ ఏపీ సీఎం జగనే అని ప్రజలు 151 స్ధానాల్లో గెలిపించారు’’ అని కన్నబాబు అన్నారు.
చదవండి: పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే.. అక్కడ ఏం జరిగింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement