janasena chief
-
ఆ సర్వే పవన్‌కు షాకిచ్చిందా?.. పొత్తులపై కొత్త డ్రామా అందుకేనా?
వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన పవన్ నేడు సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయమని ఎందుకు మాట్లాడారు.? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా అందరినీ ఏకం చేస్తానని శపథం చేసిన పవన్ నేడు పొత్తులకు ఇంకా సమయం ఉందని ఎందుకు పేర్కొన్నారు.? పొత్తుల కోసం అవసరమైతే బీజేపీ పెద్దలను ఒప్పించి తీరుతానని చెప్పిన పవన్ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలా, పోత్తులతో ముందుకు వెళ్లాలా అనేది తరువాత మాట్లాడుకునే అంశమని ఎందుకు ప్రస్తావించారు? పొత్తులపై రోజుకో మాట మాట్లాడుతూ జనసేన నాయకులను, కేడర్‌ను ఉద్దేశపూర్వకంగా పవన్ ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు.? వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యం అంటూ బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఊగిపోతూ తెగ మాట్లాడేవారు. దీని కోసం రాష్ట్రంలో ఉన్న పార్టీలు కలిసి ముందుకు రావాలని, ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ టీడీపీకి జనసేనకి మధ్య పొత్తు ఉంటుందనే సంకేతాలను పంపించారు. టీడీపీ, జనసేనే కాదు బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లేలా బీజేపీ జాతీయ పెద్దలను కూడా ఒప్పిస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం పదవిపై చంద్రబాబుతో జరిగిన ఒప్పందాన్ని కూడా పవన్ కళ్యాణ్ బయటపెట్టేసారు. తనకు సీఎం అయ్యే అర్హత లేదని, పొత్తుల్లో భాగంగా సీఎం అభ్యర్థి చంద్రబాబునేనని పవన్ కళ్యాణ్, ఈ సందర్భంగా తన మనసులో మాటను బయిట పెట్టారు.. సీఎం పదవి పొందాలంటే దానికి తగ్గట్టు సీట్లు ఉండాలని, అ సీట్లు తన దగ్గర లేవని స్పష్టం చేశారు.. సీఎం పదవి పొందేందుకు, అందుకు కావలసిన ఎమ్మెల్యేలు సంఖ్యా బలం తన దగ్గర లేనప్పుడు తాను ఎలా సీఎం అవుతాను అంటూ తిరిగి జనసేన నాయకులను, కార్యకర్తలను ప్రశ్నించారు.. రెండు పార్టీల పొత్తులో భాగంగా సీఎం అభ్యర్థి చంద్రబాబునేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చదవండి: అన్నా లెజెనెవా ఎవరు? పవన్‌కు ఎలా పరిచయమయ్యారు? దీంతో ఒక్కసారిగా జనసేన పార్టీలో కలకలం రేగింది.. జనసేన నాయకులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు.. పవన్ సీఎం అవ్వాలని ఆశించిన కాపుల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తీరుపై ఆగ్ర ఆవేశాలు వ్యక్తం అయ్యాయి.. నువ్వు సీఎం కాలేనప్పుడు నీకు ఓటు వేయడం ఎందుకని, నీకు వేసే ఓటు కూడా దండగని మండిపడ్డారు.. చంద్రబాబును సీఎం చేయడం కోసం తమను బలి పశువులను చేయ వద్దని పవన్ కళ్యాణ్‌కు హితవు పలికారు.. కాపు నాయకుడైన వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మద్దతు పలుకుతారు అనే చర్చ జనసేన పార్టీలోనూ కాపుల్లోనూ మొదలయ్యింది.. పవన్ కళ్యాణ్ తీరుతో విసిగిపోయిన జనసేన శ్రేణులు, కాపులు జనసేన సభలకు సమావేశాలకు మొహం చాటేస్తున్నారు.. నీ ప్యాకేజీ కోసం, నీ అవసరాల కోసం కాపులందరి నీ బలి పశువులను చేస్తావా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. తాను సీఎంను కానంటూ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అంతర్గతంగా సర్వే చేయించారనే టాక్ జనసేన వర్గాల్లో నడుస్తోంది. ఈ సర్వేలో నివేదికలు పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే విధంగా బయటపడినట్లు తెలుస్తోంది. తాను సీఎంను కాదు చంద్రబాబు సీఎం అవుతారంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానుల్లోనూ, పవన్ ను అభిమానించే కాపుల్లో వ్యతిరేకత మొదలైందనే విషయం బయటపడింది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను అభిమానించే యువతలో ఆగ్ర ఆవేశాలు వ్యక్తమయ్యాయి.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో అయితే జనసేనకు ఓటు వేయడానికి చాలామంది అసహ్యించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రజల నాడి ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు చంద్రబాబు కూడా అనేక సర్వేలు చేయించారనే ప్రచారం జరుగుతుంది.. టీడీపీ చేయించిన సర్వేల్లో కూడా పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.. ఇప్పుడు కాపులు జనసేన శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు, వారి దృష్టి మరలచేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరో కొత్త డ్రామాకు తెరలేపారనే చర్చ టీడీపీ, జనసేనలో వినిపిస్తోంది. పవన్ తీరుపై వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడం కోసం అధ్యయనం తర్వాతే పొత్తులు గురించి చర్చ అంటూ పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చిలక పలుకులు పలికిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. సమయం వచ్చినప్పుడు పొత్తులు గురించి ప్రస్తావన ఉంటుందని చెబుతున్నారే తప్ప ఎక్కడ కూడా జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని కానీ 175 కు 175 స్థానాల్లో జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థులు బరిలో ఉంటారని కానీ పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వడం లేదు.. జనసేన కార్యకర్తలో నాయకుల నుంచి ఆగ్రహ ఆవేశాల నుంచి దృష్టి మరల్చడం కోసమే పవన్ కళ్యాణ్ కొత్తగా సమగ్ర అధ్యయనం తరువాతే పొత్తుల చర్చ అంటూ వారిని తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: రాజకీయం అంటే వెబ్ సిరీస్ కాదు: పవన్‌పై మంత్రి అమర్నాథ్ ఫైర్ జనసేన నాయకులు కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ సృష్టించి పవన్ కళ్యాణ్ పై ఉన్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడం కోసమే పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.. బయటికి పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నా అంతర్గతంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పటికే సీట్లు పంపకానికి సంబంధించి కూడా చర్చలు పూర్తయ్యాయని వాదన కూడా వినిపిస్తోంది. -స్వామి నాయుడు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, విశాఖపట్నం -
వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే!
ఏపీ రాజకీయాల సరళి మారి పోబోతున్నట్టుగా కనిపిస్తోంది. పొత్తులు పెట్టుకోక పోతే ఓడటం ఖాయం అన్న నిర్ధారణకు వచ్చిన టీడీపీ, జనసేనతో పొత్తులకు దిగుతు న్నది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో 42 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ కేవలం 16 సీట్లే గెలుచుకుంది. 1998లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీకి పరాభవం తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే, టీడీపీ కేవలం 12 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానా లను గెలుచుకొని ఏపీలో తన పట్టు నిలబెట్టుకొంది. టీడీపీతో పొత్తు పెట్టుకోక ముందు కూడా ఏపీలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉందన్నది లోక్‌సభ ఎన్నికల్లోనే రుజువయ్యింది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజ యాలతో చంద్రబాబు కన్ను బీజేపీపై పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏపీలో సొంతంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడం, నాటి ప్రధాని వాజ్ పేయిపై ప్రజల్లో సానుకూలత వంటి అంశాలను తనకు అనుకూలంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. అందుకే 1999లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టి అనూహ్య విజయాలను టీడీపీ పొందింది. అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ–టీడీపీ జోడీ అద్భుత విజయాలను అందుకొంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ 180 అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే, బీజేపీ 12 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందింది. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ 29 స్థానాల్లో విజయం సాధిస్తే, కాంగ్రెస్ 5 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఏపీలో 7 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. టీడీపీకి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీలో అధి కారం లభించడంతోపాటుగా ఎంపీ స్థానాలను గణనీ యంగా గెలుచుకోగలిగింది. అయితే ఆ తర్వాత చంద్ర బాబు, ఢిల్లీ పెద్దలతో సాగించిన రాజకీయం మనందరం చూశాం. ఇక 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే వెళ్లి చంద్రబాబు తాను మునగడమే కాకుండా బీజేపీనీ దెబ్బతీశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ 5 ఎంపీ స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ 29 స్థానాల్లో విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ 5 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. ఒక్కమాటలో చెప్పాలంటే 1999 ఎన్నికల ఫలితాలు 2004లో రివర్స్ అయ్యాయి. అలిపిరి దాడిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవడం కోసం చంద్రబాబు ఆడిన రాజకీయ జూదంలో బీజేపీ బలిపశువయ్యింది. 2009 ఎన్నికల్లో బీజేపీకి హ్యాండిచ్చి ‘మహా కూటమి’కట్టి.. బాబు ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో కలిసినా ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బకు చంద్రబాబు మరోసారి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోవడం, ఏపీకి మాత్రమే టీడీపీ పరిమితమైన పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు, బీజేపీతో జట్టుకట్టి ఏపీలో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. అంతే కాదు... తెలంగాణలోనూ ఆ పార్టీ మంచి ఫలితాలను రాబట్టింది. ఏపీలో టీడీపీ 102 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణలోనూ టీడీపీ 15 చోట్ల విజయం సాధిస్తే, బీజేపీ కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏపీలో అధికారాన్ని అందుకున్న చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత ఎన్డీఏకు గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో చిత్తు చిత్తయ్యారు. ఇక ఏపీలో ఎలాంటి ఫలితం వచ్చిందో మనందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల్లో జనసేనాని పవన్ మద్దతివ్వడంతోపాటు, మోదీ పాపులారిటీ కూడా టీడీపీ విజయా నికి దోహదపడ్డాయి. కానీ 2019లో సొంతంగా బరి లోకి దిగిన చంద్రబాబు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్ని కల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నారు. చదవండి: ఓటమిలో టీడీపీ రికార్డు.. 50 నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ పరాజయం! ఇక జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ఒక్కో ఎన్ని కలో ఒక్కో రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ–బీజేపీకి మద్దతి చ్చిన పవన్ కల్యాణ్, 2019 ఎన్నికల్లో బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో చిత్తయ్యారు. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటులోనే ఆ పార్టీ విజయం సాధించింది. తాను బరిలో నిలిచిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. ఎన్నిక్లలో ఓటమి తర్వాత బీజేపీతో జట్టు కట్టిన పవన్, మళ్లీ ఎన్నికలు రాబోతుండడంతో చంద్రబాబుపై ప్రేమ ఒలకబోస్తు న్నారు. ఒక్క ప్రజాశాంతి పార్టీతో తప్పించి, రాష్ట్రంలోని అన్ని పార్టీలతో జనసేన పొత్తులు కుదుర్చుకుందన్నది గతం స్పష్టం చేస్తోంది. ఓవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే... పవన్ తాజాగా చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలో ఏపీలో వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తోంది బీజేపీ. పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకులు -
చంద్రబాబు మార్క్ పథకం ఒక్కటి చెప్పగలరా?: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు, లోకేష్ ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని, చంద్రబాబు తన మార్క్ పథకం ఒక్కటి చెప్పగలరా అంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 స్థానాల్లో పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నాడు. ఎల్లో మీడియా మోసినంత కాలం చంద్రబాబు ఆటలు సాగుతాయి. చంద్రబాబు మీడియాను నమ్మితే జగన్ ప్రజలను నమ్ముకున్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో మద్య నిషేధంపై ఈనాడే ఉద్యమం చేయించింది. చంద్రబాబు సీఎం అయిన వెంటనే మద్య నిషేధం ఎత్తివేశారు. దీనికి కర్త, కర్మ రామోజీనే’’ అంటూ దుయ్యబట్టారు. పవన్ చెప్పినట్లు ప్రజలు వైఎస్సార్సీపీ విముక్తి ఏపీని కోరుకోవడం లేదు. వైఎస్సార్సీపీ సహిత ఏపీని కోరుకుంటున్నారు. 2019 లో వైఎస్ జగన్ సీఎం ఎప్పటికి కాడని పవన్ వ్యాఖ్యలు చేశారు. కానీ ఏపీ సీఎం జగనే అని ప్రజలు 151 స్ధానాల్లో గెలిపించారు’’ అని కన్నబాబు అన్నారు. చదవండి: పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే.. అక్కడ ఏం జరిగింది? -
దివాళాకోరు రాజకీయం అంటే ఇదే!. పవన్ అప్పుడు ఏం చేశారు?
మచిలీపట్నం వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం నాడు చేసిన ప్రసంగం పూర్తిగా డొల్లతనంతో వైరుద్ధ్యాల పుట్టగా సాగిపోయింది. 10 ఏళ్ల పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం వెగటు కలిగించే ఓ ప్రహసనం. ఈ పదేళ్లలో తను చేసిన పొరపాట్లు ఏమిటో, తన వైఫల్యాలకు కారణాలేమిటో కనీసమాత్రంగా కూడా చెప్పకపోగా ఓట్లు వేయనందుకు ప్రజల్ని తప్పు పట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 2014లో ‘జనసేన’ను స్థాపించి బేషరతుగా బీజేపీ, తెలుగుదేశంతో కలిసి ప్రచారం చేసి, ఆ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దోహదపడ్డారు పవన్. 2018 మార్చి 14న ఆ రెండు పార్టీలకు ‘రాం రాం’ పలికి వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు కుదుర్చుకొని ఎన్ని కలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వైఫల్యా లనూ, నారా లోకేష్ పాల్పడిన అవినీతినీ ప్రతి సభలో ఎండ గట్టారు. అయితే, ప్రజలు పవన్ కల్యాణ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే పోటీ చేసిన రెండుచోట్లా అవమానకరమైన రీతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో అనేక వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఆ వర్గాలు వైఎస్సార్సీపీకి చేరువై, వైఎస్ జగన్మోహన్రెడ్డికి పట్టం గట్టారు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజ కీయంగా బలపడ్డాయి. దీంతో, వెనుకబడిన వర్గాలు, కాపులు తిరిగి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే పరిస్థితులు లేక పోవడంతో, కాపులను వైఎస్సార్సీపీ నుంచి వేరు చేసి వారిని తెలుగుదేశం పార్టీ వైపు నడిపించడం అనే వ్యూహంతో గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలోనే, కులాలను కలుపుతానంటూ పవన్ ఓ చిత్రమైన పల్లవిని వినిపిస్తున్నారు. కులాలను కలపడం ఏమిటి? కొన్ని కొన్ని ప్రాంతాలతో రాజకీయ పరంగానో, సామాజిక పరంగానో కొన్ని కులాల మధ్య అపోహలు ఏర్పడటం సహజం. కానీ, అవి తాత్కాలికంగానే ఉంటాయి తప్ప కులపరంగా ప్రజలు విడిపోయి ఘర్షణలు పడే పరిస్థితి ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి పరిస్థితి ఇప్పుడే కాదు గత 2 దశాబ్దాలు పైబడి ఎన్నడూ లేదు. పాలకులు అన్ని కులాల్నీ సమానంగా ఆదరించినపుడు కులాల మధ్య అంతరాలు ఏర్పడవు. జగన్ పాలనలో ‘కులాల కుంపట్లు’ లేనే లేవు. ఇది ఒక వర్గం మీడియా కావాలని చేస్తున్న దుష్ప్రచారం. కాపులు, బలిజలు తను ఎంత చెబితే అంత అన్నట్లుగా పవన్ కల్యాణ్ భావించడం విడ్డూరం. కాపులు, బలిజల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేశారు? చిరంజీవి ప్రజారాజ్యంపై కుల ముద్ర వేసిందెవరు? చిరంజీవి, అల్లు అరవింద్‌లు పార్టీ టిక్కెట్లు అమ్ముకొంటూ వేల కోట్లు సంపాదించారన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజారాజ్యం విజయావకాశాలను దెబ్బతీసిన పార్టీతో, వ్యక్తులతో పవన్ కల్యాణ్ అంటకాగితే కాపులు, బలిజలు హర్షిస్తారా? కులాల్ని కలపాలంటే ముందుగా ఎవరైతే తమది గొప్ప కులమని, తమ బ్లడ్ ప్రత్యేకమైనదంటూ నోరు జారారో... వారిచేత మిగతా కులాలకు క్షమాపణలు చెప్పించగలగాలి. అందరిలో ప్రవహించేది ఒకటే రక్తం అని వారికి గడ్డి పెట్టాలి. ఎన్టీ రామారావు గానీ, డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ తెలుగునాట కుల రాజకీయాలు చేయలేదు. వారికి కులం రంగు పులమాలని అప్పట్లో కొందరు ప్రయత్నించినా, తమ ఉన్నత వ్యక్తిత్వాలతో, అన్ని వర్గాల ప్రజల పట్ల సమాదరణతో వారు కులాలకు అతీతంగా ఉన్నతమైన నాయ కులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ కోవలోనే నేడు వైఎస్ జగన్ తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. చట్టసభల గడప ముఖం తెలియని అనేక బడుగు వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందువల్ల, భవిష్యత్తులో ఆయన గెలుపు నల్లేరు మీద బండి ప్రయాణంలా సాగిపోతుందని గ్రహించినవారు.. తెలివిగా పవన్‌ను ముందుకు నెట్టి కులాల మధ్య కుంపట్లు రాజేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే తన గెలుపు కూడా కష్టం అని 2019 ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠంతో పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జత కట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ కారణంగానే తమ పార్టీని విస్తరించడం లేదు. సీనియర్ నేతలెవరైనా వచ్చి తమ పార్టీలో చేరతారేమోననే అనుమానంతో తనకు నచ్చిన ఓ నాయకుడికి నంబర్ 2 స్థానం కల్పించి ముందు పెట్టుకున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు టిక్కెట్లు ఇవ్వకపోయినా, వారి నుంచి పెద్దగా ప్రతిఘటన రాదు కనుక ఓ 15–20 సీట్ల మేరకు ఎన్నికల పొత్తుల్లో భాగంగా తీసుకొంటే సరి పోతుందనే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తన వ్యూహాల్ని, ప్రణాళికలను, ఎత్తుగడల్ని ప్రజలు అర్థం చేసుకొని ఎక్కడ తనను నలుగురిలో ఎండగడతారేమోననే అనుమానంతో.. ‘అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓట్లు చీల నివ్వను’ అంటూ ఓ సరికొత్త నేరేటివ్‌ను గత కొంత కాలంగా విన్పిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఓటమి చెందిన చంద్రబాబు ఈ నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ తను చేసిన తప్పుల్ని ఒప్పుకోలేదు. కించపరిచిన బీసీలు, ఎస్సీలను క్షమాపణ కోరలేదు. కాపునేత ముద్రగడ పద్మనాభాన్నీ, ఆయన కుటుంబ సభ్యులనూ అవమానించిన తీరుకు బాధనూ వ్యక్తం చేయలేదు. తమ పాలనలో రైతులకూ, వెనుకబడిన వర్గాలకూ అన్యాయం జరిగిందని ఒప్పుకోలేదు. అయినప్పటికీ.. పవన్‌కు తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే, పవన్ కల్యాణ్ మర్మం తెలియని చేగొండి హరిరామ జోగయ్య వంటి కాపు కుల ప్రముఖులు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలనీ, చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లాలనీ తమ మనసులోని మాటగా చెబుతున్నారు. కానీ, ఇప్పటికే పవన్–చంద్రబాబుల మధ్య ఎంఓయూలు కుదిరిపోయాయన్న నిజాన్ని వారు ఎప్పటికి గ్రహిస్తారు?! సినిమాలకు, రాజకీయాలకు గల తేడాను గ్రహించకుండా రాజకీయాలలో సైతం సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి పరిమితం అయ్యారు పవన్. తనకు కులం, మతం, ప్రాంతం లేదంటారు. మరోవైపు కులాల ప్రస్తావన తీసుకువస్తారు. పైగా, ఆయనకు డబ్బు మీద మోజు లేదట. డబ్బు అవసరం లేదట. రోజుకు 2 కోట్లు సంపాదిస్తానని చెప్తారు. ఇంకోవైపు నెలనెలా ఈఎంఐలు కడుతున్నట్లు చెప్పారు. ఈ వైరుద్ధ్యాలు ఏమిటో ఎవరికీ అర్థం కాదు. పవన్ కల్యాణ్‌కు పెద్దగా చదువు లేదు. కానీ పుస్తకాలు బాగా చదివాననీ, ఎంతో విజ్ఞానవంతుణ్ణనీ చెప్పుకుంటారు. రాజకీయాల్లో రాణించడానికి చదువే ప్రామాణికం కాదు. కామన్సెన్స్ ముఖ్యం. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమని పవన్ చేసే హితబోధలో హేతుబద్ధత కనిపిస్తుందా? ఏ ఒక్క కులం కూడా సమూహంగా ఆలోచించదు. సమూహంగా వ్యవహరించదు. అందుకు కాపు కులస్థులు మినహాయింపేమీ కాదు. ప్రజలు తమ తమ స్థానిక స్థితిగతులను అనుసరించి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంలో నిర్ణయాలు తీసుకొంటారు. ఎవరైతే మంచి పరిపాలన అందిస్తారో వారిలో ప్రజలు కులాన్ని చూడరు. ఇది చరిత్ర చెప్పే సత్యం. పవన్ కల్యాణ్‌కు ఈ వాస్తవాలు ఎవరు చెబుతారు? ప్రజలు స్థిరమైన వ్యక్తిత్వం లేనివారిని, ఎప్పటికప్పుడు మాటలు మార్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. అందువల్ల పవన్ కల్యాణ్ గంపగుత్తగా కాపుల్నీ, బలిజల్నీ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం వేరొక పార్టీకి బదలాయించాలని చేసే ప్రయత్నాలు విఫలం కాకతప్పదు. పవన్ కల్యాణ్ చేసే దివాళాకోరు కుల రాజకీయాల్ని ఏ వర్గమూ హర్షించదు, సహించదు. సి. రామచంద్రయ్య, వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
సినిమాల్లో గబ్బర్ సింగ్.. రాజకీయాల్లో రబ్బర్ సింగ్: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సైకోకు పరాకాష్టగా మారారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆదివారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘జనం రాకపోవడంతో రోడ్లపై సభలు పెడుతున్నారు. చంద్రబాబు, పవన్‌కు పదవులే ముఖ్యం. 2 చోట్ల ఓడిన పవన్‌ను చూసి ఎవరూ భయపడరు. పవన్ సినిమాల్లోనే గబ్బర్ సింగ్.. రాజకీయాల్లో రబ్బర్ సింగ్’’ అని రోజా ఎద్దేవా చేశారు. ‘‘పవన్ ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడు. నన్ను డైమండ్ రాణి అన్నారు.. నేను నిజంగా రాణినే. ఇంట్లో, రాజకీయంగా, నటిగా నన్ను నేను నిరూపించుకుని రాణిలా ఉన్నాను. మరోసారి పవన్ నా గురించి మాట్లాడితే బాగుండదు. చిరంజీవికి నాకు ఎలాంటి గొడవలు లేవు’’ అని మంత్రి రోజా స్పష్టం చేశారు. ‘‘సీఎం జగన్ అన్ని రంగాలలో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నారు. అందుకే అన్నీ పార్టీలు గుంపులుగా వస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ 175 సాధిస్తారు. సింహం సింగిల్‌గానే వస్తుంది’’ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చదవండి: కొడాలి నాని వల్లే నేనీ స్థాయిలో ఉన్నా: వివి వినాయక్ -
పవన్ కల్యాణ్‌కు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని 175 సీట్లలో ఒంటరిగా చేస్తానని చెప్పే దమ్ము పవన్ కల్యాణ్‌కు ఉందా? అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. శ్రీకాకుళం యువశక్తి సభలో జనసేనాని చేసిన ప్రసంగంపై సాక్షి టీవీతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లాది తీవ్రంగా స్పందించారు. ‘‘పవన్ యువశక్తి సభలో అసభ్యంగా మాట్లాడాడు. సీఎం జగన్‌ను విమర్శించే అర్హత అసలు పవన్‌కు ఉందా?. సజ్జల , మంత్రుల గురించి మాట్లాడే స్థాయి ఉందా?.. బాంచన్ దొర అంటూ చంద్రబాబు కాళ్ల దగ్గర చేరావు. ఊడిగం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చావు’ అని మల్లాది మండిపడ్డారు. ‘పవన్ కల్యాణ్‌కు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది. ఎవడితో ఉంటావో తెలియని నువ్వు.. ఎవరితో పోరాటం చేస్తావు?. జనసేన , వీర మహిళలను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టాడు. తన సభకు వచ్చిన అభిమానులను , జనసేన శ్రేణులను పవన్ అవమానిస్తూ వస్తున్నాడు. రెండు చోట్ల ఓడిపోయింది నిజం కాదా?. మంత్రి రోజా మాట్లాడిన మాటల్లో తప్పేముంది?’ అని ఎమ్మెల్యే మల్లాది మండిపడ్డారు. ‘సీఎం జగన్‌ను విమర్శించడమంటే.. ఆంధ్రరాష్ట్ర ప్రజలను అవమానపరచడమే. రాష్ట్ర విభజన సమయంలో కూడా నువ్వు రాజకీయాల్లోనే ఉన్నావ్ కదా. మరి అప్పుడెందుకు చంద్రబాబుకు మద్దతిచ్చావు?. సభలు సమావేశాల్లో తిట్టడం కాదు.. విడివిడిగా వస్తారో అంతా కలిసి వస్తారో 2024లో చూసుకుందాం అని ఎమ్మెల్యే మల్లాది, పవన్‌కు సవాల్ విసిరారు. -
చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అశ్చర్యకరమైనది కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాబుకు బీటీమ్ లాంటి పార్టీ జనసేన అని అన్నారు. ‘‘వీరిద్దరూ కలిసే వస్తారని మేం ముందే చెప్పాం. వారి చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదు. తెలుగుదేశం పరిరక్షణ కోసమే వారి చర్చలు. టీడీపీ, జనసేనలు వేర్వేరుగా ఎప్పుడూ లేవు’’ అని మంత్రి అన్నారు. ‘‘11 మంది మరణాలపై మాట్లాడకపోడం దారుణం. మరణాలకు పోలీసులు కుట్ర చేశారంటూ బుద్ధిలేని ఆరోపణలు. బీజేపీతో ఉంటూ చంద్రబాబుతో కలవడానికి పవన్‌కు సిగ్గులేదా?. చంద్రబాబుతో కలవడానికి బీజేపీ రూట్ మ్యాప్ ఇచ్చిందా?. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్‌ను కదపలేరు. ఈ పార్టీలు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. ప్రజల ప్రాణాల పరిరక్షణ కోసమే జీవో నంబర్ 1 తీసుకువచ్చాం. నిబంధనల ప్రకారం ఎవరైనా సభలు నిర్వహించుకోవచ్చు’’ అని మంత్రి అంబటి అన్నారు. చదవండి: జీ హుజుర్.. చంద్రబాబుతో పవన్ భేటీ అందుకే.. -
‘సంక్రాంతి మామూళ్ల కోసమే దత్త తండ్రి ఇంటికి దత్త పుత్రుడు’
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి మామూళ్ల కోసం దత్త తండ్రి ఇంటికి దత్తు పుత్రుడు వెళ్లాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకు సీట్లతో మ్యాజిగ్ ఫిగర్ ఎలా చేరుకుంటారని ప్రశ్నించారు. అమాయకపు జనసేన కార్యకర్తలను పవన్ అమ్మకానికి పెట్టాడని అమర్నాథ్ దుయ్యబట్టారు. వీరిద్దరూ కలిసిన ఏమి ఒరగదు: స్పీకర్ తమ్మినేని ‘‘చంద్రబాబు అయినా పార్టీ మూసేసి పవన్ కల్యాణ్ పార్టీలో కలిపేయాలి, పవన్ కల్యాణ్ అయినా తన పార్టీ మూసేసి చంద్రబాబు పార్టీలో కలిసిపోవాలి’’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీపై స్పందిస్తూ వీరిద్దరి కలయికను కొట్టిపారేశారు. వీరిద్దరూ కలిసిన ఏమి ఒరగదన్నారు. జనం జగన్ వెంట ఉన్నారని స్పీకర్ స్పష్టం చేశారు. -
యువ గళమా.. నారా గరళమా? మంత్రి రోజా ఫైర్
సాక్షి,తిరుపతి: టీడీపీ నేత నారా లోకేష్ ‘యువ గళం’ పేరుతో చేపట్టబోయే యాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. అది యువ గళమా లేక నారా గరళమా? అంటూ ఎద్దేవా చేశారు. కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్నవారు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని నిలదీశారామె. తిరుపతి పర్యటనలో భాగంగా బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి రోజా. టీడీపీకి ప్రతిపక్ష అర్హత కూడా లేదని విమర్శించారు మంత్రి రోజా. లోకేష్ దొంగదారిలో మంత్రి అయ్యాడు. నారా ఫ్యామిలీ ఏపీని అప్పుల్లో ముంచెత్తిందని విమర్శించారు. ‘ఏ రోజు ఏ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్.. ఇవాళ అన్‌స్టాపబుల్ షోకి వెళ్ళాడు. చంద్రబాబు వెళ్ళిన తర్వాత ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్ళాడు. అలగా జనం, సంకర జాతి వంటి పచ్చి బూతులు తిట్టిన బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షోకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం ఎంతకైనా దిగజారుతాడు. జనసేన కార్యకర్తలతో బీజేపీ, టీడీపీ జెండాలు మోయిస్తున్నారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ప్రజలకు మంచి చేసే జగన్మోహన్రెడ్డి వెంట నడవండి. ప్రతిపక్షాలు.. కోడి గుడ్డుపై ఈకలు పీకే పని చేయకండంటూ హితబోధ చేశారామె. అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. టీడీపీ హయాంలో 30 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే..వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 62లక్షల మందికి సంక్షేమ పథకాలు ఇస్తోంది. రెండున్నర లక్షల మందికి అదనంగా జనవరి నెలలో ఇస్తున్నారు అని మంత్రి రోజా తెలిపారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నాడు: మంత్రి అంబటి ఫైర్ -
పవన్‌కు తెలిసిందల్లా బాబుకు చెంచాగిరీ చేయడమే: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై మండిపడ్డారు ఏపీ మంత్రి జోగి రమేష్. పవన్‌ను నమ్మితే జనసేన శ్రేణులు నట్టేట మునగడం ఖాయమని పేర్కొన్నారు. ఆయనకు తెలిసిందల్లా చంద్రబాబుకు చెంచాగిరీ చేయడమేనని దుయ్యబట్టారు. సోమవారం మీడియా సమావేశంలో పవన్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు మంత్రి జోగి రమేశ్. ‘పవన్ విజిటింగ్ వీసా మీద వచ్చి ఏదో వాగిపోయాడు. 175 సీట్లలో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా? జెండా, అజెండా, సిద్ధాంతం లేని వ్యక్తి పవన్. ఆయనను నమ్మితే జనసేన శ్రేణులు నట్టేట మునగడం ఖాయం. పవన్‌కు తెలిసిందల్లా చంద్రబాబుకు చెంచాగిరీ చేయడమే. నోటికొచ్చినట్లు మాట్లాడటం, రెచ్చగొట్టడమే పవన్‌కు తెలుసు. హింసను ప్రేరేపించే వ్యక్తి పవన్ కల్యాణ్ ’ అని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. ఇదీ చదవండి: ‘చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బయటపడింది’ -
పొలిటికల్ కామెంట్ : టీడీపీతో పొత్తుకోసం బీజేపీని బెదిరిస్తున్న పవన్
-
బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీకి వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడుతున్నారా? అన్న సందేహం ఆయన ఇటీవల చేస్తోన్న వ్యాఖ్యలతో వస్తోంది. ఆయన మెల్లగా మళ్లీ తన మనసులో మాట చెబుతున్నట్లుగా ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయను, ఇది నా నేల, నా రాష్ట్రం, ఇక్కడే తేల్చుకుంటా. మా యుద్దాలకు బీజేపీ మద్దతు అడగను, నేనే యుద్ధం చేస్తా.. అంటూ ఆయన చేసిన ప్రసంగంపై కొంత దృష్టి పెట్టాల్సిందే. విశాఖలో ప్రధానమంత్రి మోదీతో జరిగిన చర్చల సారాంశం ఇంతవరకు పవన్ వెల్లడించలేదు. ఆయన ఆ రోజు ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత డల్‌గా పెట్టిన ముఖ కవళికలను బట్టి అంతా అనుకున్నదేమిటంటే పవన్ కల్యాణ్ వేసిన ఎత్తు పారలేదని, టీడీపీతో కలిసి పోటీ చేయాలని బీజేపీని ఒప్పించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని భావించారు. ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. వైసీపీని దెబ్బకొట్టడానికి ప్రధానికి చెప్పి చేయం అని చెప్పడం ద్వారా తమకు సొంత ఆలోచనలు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లయింది. పైగా ఆయన చేసే యుద్ధానికి బీజేపీ మద్దతు అడగరట. తానే యుద్ధం చేస్తారట. నిజంగానే ఆయనకు అంత బలం ఉందా? టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇలా బీజేపీని బెదిరిస్తున్నారా? ఎటుపోయింది రోడ్ మ్యాప్.? బీజేపీకి వెన్నుపోటు అన్న విషయం గురించి ఎందుకు ఇంతగా చర్చించుకోవాలంటే 2019 ఎన్నికలలో పవన్ కల్యాణ్ వామపక్షాలు, బీఎస్పీలతో కూటమి కట్టి ఘోర పరాజయం చవిచూశాక, ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడుకుని మరీ ఆ పార్టీతో జతకట్టారు. బీజేపీ నేతలు కూడా ఒకటి, రెండు రోజులు వెయిట్ చేయించి, తదుపరి తమ అంగీకారం తెలిపారు. ఆ తర్వాత బీజేపీ వారిని రోడ్ మ్యాప్ అడుగుతున్నట్లు పవన్ కల్యాణే స్వయంగా చెప్పారు. ఆ రోడ్ మాప్ ఏమైందో తెలియదు. తాజాగా బీజేపీ మద్దతు అడగను అని అనడం ద్వారా అవసరమైతే ఆ పార్టీ పొత్తు నుంచి తప్పుకుంటానని పవన్ బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. తమను దారుణంగా అవమానించిన తెలుగుదేశంతో జత కలిసే ప్రసక్తి లేదని మోదీ స్పష్టం చేయడంతో ఏమి చేయాలో తెలియక కొన్నాళ్ల పాటు పవన్ మౌనం దాల్చారు. కానీ ఇప్పుడు తన సహజ శైలికి అనుగుణంగా మళ్లీ మాట మార్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు చెప్పిన డైలాగ్‌లు ఏమయ్యాయి? గతంలో కాపుల గురించి కాని, అమరావతి రాజధాని గురించి కాని, ఇలా అనేక అంశాలలో ఆయన ఎక్కడ ఏ మాట అవసరమైతే అది మాట్లాడి నిలకడలేని వ్యక్తిగా ప్రజల దృష్టిలో చులకన అయ్యారు. అంతదాకా ఎందుకు! తనకు పరిటాల రవి గుండు కొట్టించినట్లు టీడీపీ ఆఫీస్ నుంచే ప్రచారం చేశారని బాధపడ్డ ఆయన అదే పార్టీతో కలవడానికి ఏ రకంగాను ఫీల్ కాలేదు. ఓట్లు చీలనివ్వకూడదంటూ టీడీపీ, బీజేపీలతో కలిసి ఒక ఆప్షన్‌ను ప్రకటించిన పవన్ కల్యాణ్, మోదీ సమావేశం తర్వాత తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అని అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా మళ్లీ ఓట్లు చీలనివ్వరాదని అంటున్నారు. తూర్పు కాపుల సమావేశంలో మాట్లాడుతూ ఒకవైపు వైసీపీని ఓడించాలని చెబుతూ మరో వైపు ఓట్లు చీలకుండా తనకు వేయండి అని ఒక మాట, లేదా మరో పార్టీకి వేయండి అని అనడం ద్వారా పరోక్షంగా టీడీపీకి వేయాలని కోరుతున్నట్లు అనిపించింది. ఇంత అలవోకగా అబద్దాలా? కొద్ది రోజుల క్రితం ప్రజాస్వామ్య రక్షణ వేదిక అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రకటన చేసిన పవన్ కల్యాణ్ దాని గురించి మాట్లాడడం లేదు. ఇప్పటం గ్రామంలో ప్రహరీ గోడలు కూల్చితే ఇళ్లు కూల్చారని ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకటికాదు. నిలకడ లేకపోవడమే కాదు.. అసత్యాలు చెప్పడానికి కూడా వెనుకాడడం లేదంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికలలో వైసీపీని గద్దె దించుతామని భీకర ప్రకటనలను గట్టిగా అరచి చెబితే జనం అంతా మారిపోతారా? ఆయనను నమ్ముతారా? వైసిపి భూస్వాముల గడపలను కూల్చుతారట. రౌడీసేన కాదు.. విప్లవ సేన అని ఆయన వైసిపికి జవాబు ఇవ్వడం వినడానికి బాగానే ఉన్నా, అసలు విప్లవం చేసేదెవ్వరు? ఆయన వెంట నిలిచేది ఎవ్వరు? ఆ మాటలకు అర్థాలు వేరులే.! 2019 ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందిన పవన్ కల్యాణ్ ఇప్పుడు కనీసం తను అయినా గెలవాలని తంటాలు పడుతున్నారు. అందుకోసం టీడీపీ స్నేహం ఏమైనా ఉపయోగపడుతుందా అన్న ఆలోచన ఆయనది. ఆ మాట పైకి చెప్పలేని నిస్సహాయ స్థితి. అందుకే సినిమా డైలాగులు చెప్పినట్లు విప్లవం అంటే వచ్చేస్తుందా? మరో వైపు ఆయన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కూడా తను ఎలాగైనా ఈసారి అసెంబ్లీకి రావాలని, అందుకు టీడీపీ సహకారం అవసరమని అటువైపు గుంజుతున్నారని చెబుతున్నారు. విశేషం ఏమిటంటే జనసేనలో వీరిద్దరు నేతలు తప్ప, మరొకరి పేరే పెద్దగా వినిపించదు. ఎవరి ఫేస్ కనిపించదు. అలాంటి పార్టీ విప్లవం సృష్టిస్తుందట. వారాంతపు షూటింగ్ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి నాలుగు డైలాగులు అరచి చెబితే విప్లవం వచ్చేటట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతగా లబలబ కొట్టుకుంటున్నారు. తాను అసెంబ్లీకి వెళ్లాలంటే టీడీపీని గెలిపించాలని జాలిగా ప్రజలను అడుగుతారు. ఆయనతో జతకట్టాలని ఉబలాటపడుతున్న పవన్ కల్యాణ్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేయకపోతే మరో సారి భంగపాటు తప్పకపోవచ్చు. బీజేపీ మద్ధతుండి ఇప్పటివరకు ఏం చేశాడని..? ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, రాజకీయాలపై ఎంతటి ఏహ్యబావం ఏర్పడిందో ఆయన మాటల బట్టి అర్ధం అవుతుంది. అదే సమయంలో తన సోదరుడు పవన్ కల్యాణ్ రాజకీయాలు చేయగలరని, అనుకున్నది సాధిస్తారని అన్నారు. అందులో వాస్తవికత ఉందో, లేక ఏదో మాట వరసకు అన్నట్లుగా ఉందో తెలియదు. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆయనను ఆకర్షించే యత్నం చేస్తోందని వార్తలు వస్తుంటే, ఈయనేమో బీజేపీ మద్దతు అడగను అంటున్నారు. అంతిమంగా ఏమి చేస్తారో బహుశా ఆయనకే తెలియకపోవచ్చు. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ మరీ దిగజారుడు రాజకీయాలు చేయకుండా ఉంటే కనీసం ఆ మాత్రం పరువైనా దక్కుతుందేమో! హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఊరేగుతున్న ఉన్మాదం
‘కామాతురాణాం న భయం న లజ్జ’ అన్నారు పెద్దలు. కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి సిగ్గు గానీ, భయం గానీ ఉండవని అర్థం. క్రోధంతో కళ్లు మూసుకుపోయిన వారి సంగతి కూడా అంతే! కక్షతోనూ, అసూయతోనూ, నిస్పృహ తోనూ కళ్లు మూసుకుపోయిన వారి పరిస్థితీ అంతే! అటువంటి దశలో ఉన్నవారు మాట్లాడే భాష సభ్యతా సంస్కారాల ఛందస్సును ధిక్కరిస్తుంది. ‘పోగాలము దాపురించినవారు దీప నిర్వాణ గంధమును ఆఘ్రాణించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని కనలేరు. మిత్రవాక్యాన్ని వినలేరు’ అనే సూక్తి మనకు ఉండనే ఉన్నది. దిగజారిన రాజకీయాలతో విసుగెత్తి ఒకాయన ‘పాలిటిక్స్ ఈజ్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ స్కౌండ్రల్’ అని వ్యాఖ్యానించారు. అట్లాగే పొలిటీషియన్లకు చిట్టచివరి అస్త్రం – సానుభూతి. అది కూడా విఫలమైనప్పుడు ఏం చేస్తారు? సంస్కారం అటకెక్కుతుంది. క్రోధం కళ్లను కప్పేస్తుంది. అసూయ, ద్వేషాలు వివేకాన్ని నిద్రపుచ్చుతాయి. కంఠస్వరం నుంచి కాలకేయుల భాష దూసుకొస్తుంది. ఉన్మాద స్థితి ఊరేగింపు తీస్తుంది. కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విపరీత ప్రవర్తన చూసి జనం విస్తుపోతున్నారు. ఈ పర్యటనను తెలుగుదేశం పార్టీ వారు ఒక వ్యూహం ప్రకారం చాలా శ్రద్ధగా డిజైన్ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు అధికార వికేంద్రీకరణను కోరుకోవడం లేదని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కూడా వారికి ఇష్టం లేదని ఈ పర్యటన ద్వారా లోకాన్ని భ్రమింపజేయాలని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కలిసి ఈ పథకాన్ని రచించాయి. ఆయన సభలు జన సందోహంతో కిక్కిరిసినట్టు కనిపించేలా కొన్ని వీధి కూడళ్లను ఎంపిక చేశాయి. ఆ కూడళ్లలోకి నాలుగైదు వేల మందిని సమీకరిస్తే పెద్దఎత్తున జనం పాల్గొ న్నట్టు కనిపిస్తుంది. ఆమాత్రం సమీకరణకు కూడా పార్టీ బలం చాలకపోవడంతో దిన వేతనంపై ఎక్కువమంది సాధారణ ప్రజలను సమీకరించారు. వారిలో కొందరిని మిద్దెలపైకి ఎక్కించారు. ఈమధ్యకాలంలో జనసందోహానికి మొహంవాచి ఉన్న అధినేత డూప్ జనాన్ని చూసి పరవశించిపోయారు. ఆ పరవశం కారణంగా రాజకీయాల్లో చిట్టచివరిగా వాడవలసిన సానుభూతి ఆయుధాన్ని యథాలాపంగా వాడిపారేశారు. ‘మీరు ఓట్లు వేసి గెలిపించకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయ’ని బేలగా వాపోయారు. ఈ చివరి ఆయుధానికి స్పందనగా ‘నో... నో’ అని జనం హోరెత్తుతారని బహుశా ఆయన ఆశించి ఉండవచ్చు. ‘మీకు ఇవి చివరి ఎన్నికలు కావు, మళ్లీ మళ్లీ మీరే గెలుస్తారు’ అనే సమాధానాలు వారి నుంచి ఊహించి ఉండవచ్చు. జాతీయస్థాయి నినాదాల టైప్‌లో ‘జబ్ తక్ సూరజ్, చాంద్ రహేగా తబ్ తక్ ఆంధ్రామే బాబు రహేగా’ అంటారని కూడా స్వప్నించి ఉండవచ్చు. లాలూ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్జేడీ కార్యకర్తలు ఈ జాతీయ నినాదాన్ని లోకలైజ్ చేశారు. ‘జబ్ తక్ రహేగా సమోసామే ఆలూ... తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ’ అనేవారు. అటువంటి సృజనా త్మకతతో మనవాళ్లు కూడా మిరపకాయ బజ్జీలో మిర్చీ దాగినంతకాలం, ఉప్మాలో ఉల్లిపాయ వేగినంతకాలం బాబు రాజకీయాల్లో ఉంటారనే నినాదాలు వినిపిస్తారని ఆశించిన వారికి నిరుత్సాహమే మిగిలింది. సభికుల్లో అధికులు పేటీఎమ్ బ్యాచ్ కనుక ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. కొద్దిమంది కార్యకర్తల కేరింతలు క్లైమాక్స్ సన్నివేశాన్ని రక్తి కట్టించలేకపోయాయి. ఆ విధంగా ఆఖరి బాణం విఫలమైంది. ఆ తర్వాత? చివరకు మిగిలేది ఉక్రోషమే! ఆఖరి రోజు కర్నూలు పట్టణంలో బాబులోని ఉక్రోషం బయటకొచ్చింది. పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అక్కడికి కొంచెం దూరంలో నిలబడి విద్యార్థులు, లాయర్లతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కర్నూలులో న్యాయ రాజధానికి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. వారిని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని గట్టిగా చెబుతూ పార్టీ కార్యకర్తలు కూడా అనాలని వారిని బలవంతపెట్టారు. దీంతో మరింత బిగ్గరగా జేఏసీ సభ్యులు బాబుకు నిరసన తెలిపారు. సీనియర్ మోస్ట్ రాజకీయ వేత్త వెంటనే రెచ్చిపోయారు. ‘కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విపరీత ప్రవర్తన చూసి జనం విస్తుపోతున్నారు. ఈ పర్యటనను తెలుగుదేశం పార్టీ వారు ఒక వ్యూహం ప్రకారం చాలా శ్రద్ధగా డిజైన్ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు అధికార వికేంద్రీకరణను కోరుకోవడం లేదని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కూడా వారికి ఇష్టం లేదని ఈ పర్యటన ద్వారా లోకాన్ని భ్రమింపజేయాలని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కలిసి ఈ పథకాన్ని రచించాయి. ఆయన సభలు జన సందోహంతో కిక్కిరిసినట్టు కనిపించేలా కొన్ని వీధి కూడళ్లను ఎంపిక చేశాయి. ఆ కూడళ్లలోకి నాలుగైదు వేల మందిని సమీకరిస్తే పెద్దఎత్తున జనం పాల్గొన్నట్టు కనిపిస్తుంది. ఆమాత్రం సమీకరణకు కూడా పార్టీ బలం చాలకపోవడంతో దిన వేతనంపై ఎక్కువ మంది సాధారణ ప్రజలను సమీకరించారు. వారిలో కొందరిని మిద్దెలపైకి ఎక్కించారు. ఈమధ్యకాలంలో జనసందోహానికి మొహంవాచి ఉన్న అధినేత డూప్ జనాన్ని చూసి పరవశించిపోయారు. ఆ పరవశం కారణంగా రాజకీయాల్లో చిట్టచివరిగా వాడవలసిన సానుభూతి ఆయుధాన్ని యథాలాపంగా వాడిపారేశారు. ‘మీరు ఓట్లు వేసి గెలిపించకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయ’ని బేలగా వాపోయారు. ఈ చివరి ఆయుధానికి స్పందనగా ‘నో... నో’ అని జనం హోరెత్తుతారని బహుశా ఆయన ఆశించి ఉండవచ్చు. ‘మీకు ఇవి చివరి ఎన్నికలు కావు, మళ్లీ మళ్లీ మీరే గెలుస్తారు’ అనే సమాధానాలు వారి నుంచి ఊహించి ఉండవచ్చు. జాతీయస్థాయి నినాదాల టైప్‌లో ‘జబ్ తక్ సూరజ్, చాంద్ రహేగా తబ్ తక్ ఆంధ్రామే బాబు రహేగా’ అంటారని కూడా స్వప్నించి ఉండవచ్చు.’ లాయర్లు, విద్యార్థుల మీద బాబు నోటి వెంట అనర్ఘరత్నాలు రాలడం మొదలైంది. ‘‘పనికిమాలిన వ్యక్తుల్లారా... నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా... రేయ్ వాణ్ణి తన్ను.. రేయ్ రారా చూపిస్తా... మా ఆఫీసుకే వస్తార్రా మీరు... ఎంత ధైర్యంరా మీకు... ధైర్యముంటే రాండ్రా గాడిద ల్లారా... బోడినాకొడుకులు తామాషాలాడతారా... రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమి కొట్టిస్తా... గుడ్డలిప్పదీసి కొట్టిస్తా..’’ ఇలా లాఠీ లేకుండా నోటి తుంపర్లతోనే ఆయన ఛార్జ్ చేశారు. ఈ వాక్ప్రవాహంలో కొసమెరుపు ఏమిటంటే కక్కాల్సినంత అసభ్యాన్నంతా వెళ్లగక్కుతూనే ఆయన సభ్యతను కూడా అడ్డం పెట్టుకున్నారు. ‘నన్ను రెచ్చగొట్టకండి. రెచ్చగొట్టిన వాళ్లంతా పతనమయ్యారు. నాకు వస్తున్న కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అదీ నా సభ్యత’ అని చెప్పుకున్నారు. ఈ సభ్యత బాణం పవన్ కల్యాణ్ మీద కావచ్చని సోషల్ మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈమధ్యనే పవన్ కల్యాణ్ ఒక సభలో ఆవేశంతో ఊగిపోతూ చెప్పు తీసి చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. బాబు తన తాజా వ్యాఖ్యానం ద్వారా పవన్‌కు సభ్యత లేదని చెప్పదలుచు కున్నారా? అదే నిజమైతే ఆయనకు ఎందుకింత కోపం వచ్చింది? లోగుట్టు తెలిసిన పెరుమాళ్లే దీనికి సమాధానం చెప్పాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చంద్రబాబునాయుడులో పెరుగుతున్న అసహనాన్నీ, నిస్పృహనూ అర్థం చేసుకోవచ్చు. అనుభవం కారణంగా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంతో ఇంతో అంచనా వేయగలరనే అనుకోవాలి. అలా అంచనా వేయగలిగిన స్థితిలోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదనే విషయం అర్థమయ్యే ఉండాలి. అర్థం కాలేదు, తాము గెలవగలమనే భ్రాంతిలోనే నిజంగా ఉన్నాడంటే ‘కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’ అనే వాక్యాన్ని అక్షరాల నమ్ముతున్న అమాయకుడై ఉండాలి. ఆయన అమాయకుడు కాదు, గుండెలు తీసిన మొనగాడనే విషయం లోకోత్తర వ్యావహారికం. కనుక అసలు విషయం ఆయనకు తెలుసనే అనుకోవాలి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడం దాదాపు అసాధ్యమన్న భావన ఎందుకు ఏర్పడింది? దానికి కారణా లున్నాయి. గడచిన ఎన్నికల్లో ఆ పార్టీకి 50 శాతం ఓట్లు వచ్చాయి. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన పేదల అనుకూల విధానాలు, సాధించిన బలహీనవర్గాల సాధికారత, విద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ మద్దతుదార్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. తమ గోబెల్స్ ప్రచారం ఫలితంగా అధికార పార్టీ ఓట్లలో రెండు మూడు శాతం ఓట్లను తగ్గించ గలమనే నమ్మకంతో ఎల్లో మీడియా – తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. ఒకవేళ అదే నిజమని నమ్మినా, అధికార పార్టీకి పేదవర్గాల నుంచి కొత్తగా జమ కానున్న ఓట్లతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి తగ్గని ఓట్ల బ్యాలెన్స్‌తో ఉన్న అధికార పార్టీని ఓడించేదెట్లా? రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదనే సామెత కూడా ఒకటున్నది. ఏవైనా అద్భుతాలు జరిగితే?... ఏమో... గుర్రం ఎగరావచ్చు అనే ఆశ ఏదో ఎల్లో కూటమిలో ఎక్కడో మిణుకు మిణుకుమంటూ ఉండేది. సదరు మిణుగురు ఆశను సాకారం చేసుకోవడానికి చాలాకాలం నుంచే ఎల్లో కూటమి ఒక ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయడం మొదలుపెట్టింది. ఇందులో మొదటిది – సుడిగాలి మాదిరిగా సాగించే గోబెల్స్ ప్రచారంతో వైసీపీ మద్దతు ఓట్లను తగ్గించడం! రెండోది – కుడి నుంచి ఎడమకూ, ఎడమ నుంచి కుడికీ సమస్త పార్టీలనూ, రథ గజ తురగ పదాతి శ్రేణులన్నింటినీ తమకు అనుకూలంగా ఏకం చేసుకోవడం! ఈమధ్య పవన్ కల్యాణ్‌ను పరామర్శించినప్పుడు చంద్రబాబు ఉద్ఘాటించిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యత’ అనే పిలుపులోని పరమార్థం ఇదే! ఈ ఐక్యతలో ముందుగా జనసేనను కూటమిలో కలుపుకోవాలి. జనసేన గాలంతో బీజేపీ చేపను పట్టేయాలి. ఆ తర్వాత ఎలాగోలా కమ్యూనిస్టులను పట్టేయాలి. బీజేపీ ఉన్న కూటమిలోకి కమ్యూనిస్టులు ఎట్లా వస్తారు? ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ కోసం వస్తారు. సీపీఐ నాయకుల్లో కొందరు చంద్ర బాబు పట్ల తమ వ్యామోహాన్ని బహిరంగంగానే ప్రదర్శించడం తెలిసిందే. వారి ద్వారా సీపీఎంకూ లైన్ వేయాలి. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యత’లో ముందుగా జనసేనను కూటమిలో కలుపుకోవాలి. జనసేన గాలంతో బీజేపీ చేపను పట్టేయాలి. ఆ తర్వాత ఎలాగోలా కమ్యూనిస్టులను పట్టేయాలి. బీజేపీ ఉన్న కూటమిలోకి కమ్యూనిస్టులు ఎట్లా వస్తారు? ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ కోసం వస్తారు. సీపీఐ నాయకుల్లో కొందరు చంద్రబాబు పట్ల తమ వ్యామోహాన్ని బహిరంగంగానే ప్రదర్శించడం తెలిసిందే. వారి ద్వారా సీపీఎంకూ లైన్ వేయాలి. ఇంకా ఎక్కడన్నా చిన్నా చితకా పార్టీలుంటే వాటికీ వల వేయాలి. ‘నోటా’ ఓట్లు, చెల్లని ఓట్లతో కూటమి కట్టడానికి ఏవైనా ఉపాయాలున్నాయేమో ఆలోచించాలి... ఇట్లా సాగుతున్న ఎల్లో కూటమి ఆలోచనా స్రవంతికి ఎక్కడో బ్రేక్ పడ్డట్టుగా కనిపిస్తున్నది. మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ పర్యటన వార్తలను ఎల్లో మీడియా పూర్తిగా తగ్గించివేసిందని సోము వీర్రాజు అధిక్షే పించారు. చంద్రబాబేమో పవన్‌కు సభ్యత లేదన్నట్టు పరోక్షంగా బాంబులు విసురుతున్నారు. ఏం జరుగు తున్నదో? ఎల్లో కూటమి ప్రవచిస్తున్న ‘ప్రజాస్వామ్యం’ కోసం ఐక్యతా కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడిందా? లేక టీడీపీ – జనసేనల మధ్య తాత్కాలిక వియోగమే సంభవించిందా? తేలడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ, మళ్లీ ఆట మొదలుపెట్టాలి. ఈలోగా పుణ్యకాలం గడిచిపోవచ్చు. మరోపక్కన గోబెల్స్ ప్రచారం మునుపటి మాదిరిగా ప్రభావం చూపుతున్నట్టు లేదు. ’ ఇంకా ఎక్కడన్నా చిన్నా చితకా పార్టీలుంటే వాటికీ వల వేయాలి. ‘నోటా’ ఓట్లు, చెల్లని ఓట్లతో కూటమి కట్టడానికి ఏవైనా ఉపాయాలున్నాయేమో ఆలో చించాలి... ఇట్లా సాగుతున్న ఎల్లో కూటమి ఆలోచనా స్రవంతికి ఎక్కడో బ్రేక్ పడ్డట్టుగా కనిపిస్తున్నది. మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ పర్యటన వార్తలను ఎల్లో మీడియా పూర్తిగా తగ్గించివేసిందని సోము వీర్రాజు అధిక్షేపించారు. చంద్రబాబేమో పవన్‌కు సభ్యత లేదన్నట్టు పరోక్షంగా బాంబులు విసురుతున్నారు. ఏం జరుగు తున్నదో? ఎల్లో కూటమి ప్రవచిస్తున్న ‘ప్రజాస్వామ్యం’ కోసం ఐక్యతా కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడిందా? లేక టీడీపీ – జనసేనల మధ్య తాత్కాలిక వియోగమే సంభవిం చిందా? తేలడానికి కొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇది తాత్కాలిక వియోగమే అయినా, మళ్లీ ఆట మొదలుపెట్టడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ఈలోగా పుణ్య కాలం గడిచి పోవచ్చు. మరో పక్కన గోబెల్స్ ప్రచారం మునుపటి మాదిరిగా ప్రభావం చూపుతున్నట్టు లేదు. ఒక్కో బోగస్ కథనాన్ని వంద సార్లు అచ్చొత్తినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేప థ్యంలో చంద్రబాబు నిర్వహించిన కర్నూలు తరహా యాత్రలు రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో కూడా చేపట్టవచ్చు. ఉరుములు మెరుపులతో కూడిన రెచ్చగొట్టే తుంపర్లు మరిన్ని రాలవచ్చు. ఇది రాజకీయ వాతావరణ హెచ్చరిక. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్మాదపు మేఘాలు ఆవరించకుండా ఉండుగాక! వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com -
పవన్ కల్యాణ్ పై మండిపడుతున్న గుంకలాం ఇళ్ళ లబ్ధిదారులు
-
జగనన్న కాలనీలపై జనసేన ఓవర్ యాక్షన్ చేస్తోంది : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
-
అన్ని తెలుసమ్మా పవనూ.. పవన్ కు క్లాస్ పీకిన ప్రధాని మోదీ..
-
బాబుతో కలిసి ఉన్మాదిలా మారిన పవన్: మంత్రి అంబటి
సాక్షి, తాడేపల్లి: ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ ఉన్మాదిలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బాలి అన్న ఒక్క మాట ఆయనలోని ఫ్రస్టేషన్‌ను బయటపెడుతోందన్నారు. ఈనాడు రాతలను పట్టుకుని చంద్రబాబు సలహాతో ఇప్పటం వచ్చి రంకెలు వేసి వెళ్ళారని ద్వజమెత్తారు మంత్రి. పవన్ కల్యాణ్ సభకు స్థలం ఇవ్వడం వల్లే తొలగింపులు జరిగాయనటం పూర్తిగా అవాస్తవమని, సభ పెట్టకముందే గత ఫిబ్రవరిలోనే మార్కింగ్ చేశారని స్పష్టం చేశారు. ‘చంద్రబాబుతో కలిసినప్పటి నుంచి పవన్ కల్యాణ్ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. ఏ విగ్రహాలను తొలగించలేదు. ఒక్క ఇల్లు కూడా ఎక్కడా పడగొట్టకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విస్తరణ దేశంలో ఎక్కడా జరగలేదా?, అది రెక్కీ కాదు అని పోలీసులు చెప్పారు. ఇప్పటం ఒక ప్రశాంతమైన గ్రామం, అక్కడ చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుపై రాయి వేయటం, పవన్‌పై రెక్కీ అనేవన్నీ అవాస్తవం. పవన్ రాజకీయాలకు పనికి వచ్చే మనిషి కాదు. పవన్ ఫ్యాన్స్‌కి నా మనవి.. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదవద్దు. ఇప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తానని ఇచ్చావా?, పవన్‌ను నమ్మి వెళితే జీవితాంతం బాధపడతారు. అబద్దం చెప్పినా అతికినట్లు ఉండాలని తెలుసుకోండి. నేను ఛాలెంజ్ విసురుతున్నా.. ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు.’ అని పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఇదీ చదవండి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొలిటికల్ టూరిస్టులు: కొడాలి నాని -
ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్: మంత్రి రోజా
సాక్షి, గుంటూరు: లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్ అయితే లక్ష్యం లేకుండా పవన్ కల్యాణ్ దిగజారి పోతున్నాడని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చదువు ఒక్కటే ముఖ్యం కాదని.. క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు మంత్రి రోజా. క్రిీడల వల్ల ఆరోగ్యం, ఆనందం వస్తుందన్నారు. ఎన్ని కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు, ఎంత మంది నిందించినా విజయం ద్వారా సమాధానం చెప్పాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనటం ద్వారా దేశం తరుపున ఆడే గొప్ప అవకాశం లభిస్తుందని, అందుకోసం కృష్టి చేయాలని చెప్పారు. ‘నేను ఎన్నో అవమానాలు ఎదురైన వెనుదిరగకుండా ముందుకు వెళ్ళాను. ఆట ఏది అయిన మన లక్ష్యం సెక్సెస్‌పై మాత్రమే ఉండాలి. సీఎం వైఎస్ జగన్ చూసినన్ని అవమానాలు ఎవరు చూసి ఉండరు. కానీ 151 సీట్లల్లో విజయంతో అందరికి సమాధానం చెప్పారు. లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్ అయితే లక్ష్యం లేకుండా దిగజారి పోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్. హ్యాండ్ బాల్ ఆడే 22 మంది మెరికలాంటి యువకులకు శాప్ తరుపున అన్నివిధాల శిక్షణ ఇస్తున్నాము. శాప్‌కి సపోర్ట్ చేస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతలు. ’ అని తెలిపారు మంత్రి రోజా. క్రీడల్లో కష్టపడుతున్న ఆటగాళ్లకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు మంత్రి రోజా. రాబోయే సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ‘జగనన్న క్రీడా సంబరాలు’ పేరుతో రూ.50 లక్షల నగదు బహుమతితో క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర క్రీడాకారులు పట్టుదలతో నేషనల్ నుంచి ఒలింపిక్స్ వరకు వెళ్లాలని, క్రీడల్లో కష్టపడితే ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి తెలిపారు. ఇదీ చదవండి: నిపుణులు ఎంత చెప్పినా చంద్రబాబు వినలేదు: స్పీకర్ తమ్మినేని -
KSR కామెంట్ : రాజకీయాల్లో బహుపాత్రలు పోషిస్తున్న పవన్ కళ్యాణ్
-
‘అలా’ అనకూడదంటే ఎలా?
తనను ‘అలా’ పిలవొద్దని ఆగ్రహానికి గురైన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఎక్కువమంది నోళ్లలో ‘అలా’నే నానిపోయే పరిస్థితి తెచ్చు కున్నారు. మామూలుగా మాట్లాడినా పవన్ ఆవేశంగానే మాట్లాడినట్టు ఉంటుంది. ఇక ఆవేశంగా మాట్లాడితే బ్యాలెన్స్ తప్పినట్టే కనబడుతుంది. ఆ క్రమంలోనే ‘చెప్పు’కోలేని మాటలదాకా వెళ్లిపోయారు. తిరిగి చెప్పించుకునే స్థితి తెచ్చుకున్నారు. పోనీ తాను ‘అలా’ కాదని అంత గట్టిగా సమర్థించుకున్న పవన్ తీరా చేసింది ఏమిటంటే, చంద్రబాబు పక్కన ‘అలా’ అనుకునేట్టుగానే నిలబడటం. పార్టీ మీటింగ్‌లో పవన్ ఎందుకు అంత ఆవేశం కనబరిచారు? తదుపరి ఎందుకు చంద్రబాబు వద్ద అంతలా లొంగిపోయి వ్యవహరించారన్న ప్రశ్నలకు జనసేన అభిమానుల దగ్గర కూడా సమాధానాలు లేవు. చదవండి: టీడీపీ స్పాన్సర్డ్.. ఫేక్ యాత్ర అసలు ‘లోగుట్టు’ ఇదే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భలే కౌంటర్ ఇచ్చారు. ఎక్కడా ప్రత్యర్థుల పేర్లను అనవసరంగా తీయకుండా, తాను చెప్పదలచు కున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా ఎవరికి తగలాలో వారికి తగి లేలా సమాధానం ఇచ్చారు. ఒకరకంగా తన రిప్లైతో ప్రత్యర్థుల మాడును పగలగొట్టినంత పని చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ఉపన్యాసాలను పోల్చి చూస్తే ఎంతో తేడా కనిపిస్తుంది. చంద్రబాబు ఒకదానితో మరొకదానికి లింక్ లేకుండా మాట్లాడేవారు. జగన్ ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడదలిస్తే దాని పైనే కేంద్రీకరిస్తారు. పవన్ తెలివితక్కువతనాన్ని జగన్ బాగా ఎక్స్పోజ్ చేసినట్లు అర్థం అవుతుంది. తాను ప్రజల మేలు కోసం మూడు రాజధానులు అంటుంటే, ఒకాయన మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రజ లకు సూచిస్తున్నారని జగన్ అవనిగడ్డలో జరిగిన సభలో పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే ఆ ప్రాంతంలో జగన్ మాట్లాడుతుంటే వచ్చిన స్పందన కూడా విశేషమైనదే. దీనిని బట్టే పవన్ కల్యాణ్ ఎంతలా ప్రజలలో పలుచన అయింది తెలుస్తుంది. ఎవరైనా నాయకుడు ప్రజలకు మంచి చెబుతారా? లేక మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని చెబుతారా అని జగన్ ప్రజలను ప్రశ్నిం చారు. అందరూ అలా చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటని అడి గారు. దత్తపుత్రుడు, దత్తతండ్రి అంతా కూటమి కట్టి ‘మీ బిడ్డనైన నాపైకి’ యుద్ధానికి వస్తున్నారనీ, దుష్టచతుష్టయంలో భాగంగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నాయనీ అన్నారు. వచ్చే 19 నెలలు ఈ దుష్ట చతుష్టయంతో యుద్ధాన్ని ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. సుమారు 35 వేల ఎకరాల భూమిని రైతుల పరం చేస్తూ పట్టాలను పంపిణీ చేసిన కార్యక్రమంలో తొలుత తమ ప్రభుత్వం రైతులకు చేస్తున్న సేవలను వివరించిన తర్వాత, ఏపీ ముఖ్యమంత్రి రాజకీయ అంశాలు మాట్లాడారు. నిజంగానే పవన్ కల్యాణ్ తెలివితక్కువగా మాట్లాడి పెళ్లిళ్ల గోలలో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. నిజానికి ఈ మధ్యకాలంలో పవన్‌పై వైసీపీ నేతలు పెద్దగా విమర్శలు చేయలేదు. విశాఖలో జరిగిన ఘటనల తర్వాత పవన్ మంగళగిరి పార్టీ కార్యకర్తల సమా వేశంలో రెచ్చిపోయి మాట్లాడారు. ఆ క్రమంలో బేలెన్స్ తప్పారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని అనడమే కాకుండా, చెప్పు కూడా చూపించడం అందరినీ విస్తుపరిచింది. ఒక పార్టీ అధి నేతగా ఉన్న వ్యక్తి ఎవరూ ఇలా గతంలో వ్యవహరించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయా నేతలపై పలుమార్లు దూషణ లకు దిగినా, చెప్పులు చూపించేవరకు వెళ్లలేదు. ఎవరి సలహాయో తెలియదు కానీ, ప్రజల దృష్టిలో ఈయన రాజకీయాలకు పనికి రారేమో అన్న భావన కల్పించారనిపిస్తుంది. రాజకీయంగా ప్యాకేజీ తీసుకుంటున్నాడని ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పడం తప్పు కాదు. ఆయన తన ఆదాయ వివరాలు, తనకు వచ్చే డొనేషన్లు తదితర అంశాలు వెల్లడించారు. అంతటితో ఆగితే సరి పోయేది. అలాకాకుండా చెప్పు చూపడం, బూతులకు తెగబడడం... ఇవన్నీ పార్టీ హార్డ్‌కోర్ కార్యకర్తలకు కాస్త జోష్ తెప్పించి ఉండవచ్చు. కానీ జన సామాన్యంలో మాత్రం బాగా నెగిటివ్ అయింది. పోనీ అదే ఆవేశంతో పవన్ ఉండిపోయారా అంటే అదేమీ లేదు. ఆ తర్వాత కాసేపటికి నోవాటెల్ హోటల్‌కు వెళ్లడం, అక్కడకు వ్యూహాత్మకంగా చంద్రబాబు రావడం, ఇద్దరూ కలిసి మాట్లాడుకుని మీడియా ముందుకు రావడం, ఆ సందర్భంగా చంద్రబాబు పక్కన పవన్ చేతులు కట్టుకుని నిలబడి ఉన్న సన్నివేశాలు చూసిన తర్వాత ఆయన హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కూడా తీరని ఆవేదనకు గురయ్యారు. సహజంగానే వైసీపీ నేతలు పవన్ నోవాటెల్ హోటల్లో చంద్ర బాబును కలవడం, ప్యాకేజీ కాక మరేమిటని ప్రశ్నించారు. మూడు పెళ్ళిళ్ల అంశాన్ని కూడా ప్రస్తావించి, పవన్ ఒకరిని పెళ్ళి చేసుకుని, మరొకరితో సహజీవనం చేయడం చెల్లుతుందా అంటూ ఎద్దేవా చేశారు. ఈ మొత్తం ప్రహసనంలో పవన్ కల్యాణ్ పూర్తిగా నష్టపోతే, చంద్రబాబు నాయుడు ఆయన్ని బకరా చేసి వాడుకున్నారన్న అభి ప్రాయం కలుగుతుంది. మరోవైపు వీరిద్దరు కలవడం ద్వారా జగన్ ఎంత బలంగా ఉన్నది చెప్పకనే చెప్పారు. ఒంటరిగా పోటీచేస్తే టీడీపీ గెలుపు దాపులోకి కూడా రాదన్న భయం చంద్రబాబును వెంటాడు తోందన్న భావన ఏర్పడింది. అది తెలుగుదేశం పార్టీకి కలిగిన డామేజీ. మరో వైపు ముఖ్యమంత్రి చాలా హుందాగా తన ప్రసంగాన్ని సాగించడమే కాకుండా, ప్రత్యర్థులను తుత్తునియలు చేసేవిధంగా, జాతీయ నేతల స్థాయి ప్రమాణాల్లో ప్రసంగించి ప్రజలను ఈ తతంగంపై ఆలోచించేలా చేయగలిగారు. మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావించాలి. పవన్ కల్యాణ్ ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో సహజీవనం చేశారన్న విమర్శలను కూడా ఎదుర్కుంటున్నారు. సరిగ్గా అదే ధోరణిలో ఆయన రాజ కీయంగా కూడా చేశారనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్నారు. టీడీపీతో కలవడానికి బీజేపీ ససేమిరా అంటోంది. అలాంటి పరిస్థితిలో బీజేపీతో విడాకులు తీసుకోకుండానే, టీడీపీతో కలిసి ఒక ప్రజాస్వామ్య వేదిక ఏర్పాటు చేస్తామనడం కూడా బీజేపీతో పెళ్లి అయితే, టీడీపీతో రాజకీయ సహజీవనం అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. ఇది పవన్ తెలివిగా చేశారని ఎవరూ భావించలేక పోతున్నారు. ఆయన కాపు సామాజిక వర్గ ఓట్లపైన ఎక్కువ ఆధార పడాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ఓట్ల మద్దతు తమకు కలిస్తే అది మరికాస్త ఉపయోగమని చంద్రబాబు ఆశ. పోనీ పవన్ నిజంగానే కాపుల పక్షాన పూర్తిగా నిలబడ్డారా అంటే అలానూ లేరు. టీడీపీ హయాంలో కాపుల రిజర్వేషన్ ఆందోళన సాగుతున్నప్పుడు వారికి రిజర్వేషన్లు ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా అవమానించినా పవన్ నోరు తెరవలేదు. ముద్రగడను చంద్రబాబు హయాంలో పోలీసులు కనీసం పాదయాత్ర చేయడానికి కూడా అనుమతించలేదు. అయినా ఇప్పుడు చంద్రబాబులో ఆయనకు పెద్ద ప్రజాస్వామికవాది కనిపిస్తున్నారు. ఇక చంద్రబాబు తీరు కూడా అలాగే ఉంది. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జనసేన పార్టీ కార్యకర్తలు ఏపీ మంత్రులపై దాడులకు తెగబడితే, కనీసం ఖండించలేని చంద్రబాబు దాడులు చేసినవారిని అరెస్టు చేస్తే అక్రమం అని చెప్పి ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేతకు అన్న చందంగా, ఎలాగోలా జనసేనను తన ట్రాప్‌లో వేసుకుని రాజకీయం చేయాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారు. ఆ ఉచ్చులో పవన్ పడినట్లు గానే కనిపిస్తుంది. ఫలితంగా జనసేనకు ఏ పదో పరకో సీట్లు ఇచ్చి, తన వెంట తిప్పుకోవాలన్నది ఆయన వ్యూహం కావచ్చు. కొద్దికాలం క్రితం తాము త్యాగాలకు సిద్ధంగా లేమనీ, ఒకవేళ పొత్తు కుదిరితే సీఎం పోస్టుకు పట్టుబడతామనీ సంకేతాలు ఇచ్చిన పవన్ ఇప్పుడు జారీ పోయినట్లే ఉంది. ఒంటరిగా పోటీచేస్తే వైసీపీని ఓడించలేమన్న భయంతోనే టీడీపీ ఈ రకమైన వ్యూహాలు పన్నుతోంది. టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసినా వైసీపీకి ఢోకా లేదని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ నేత సునీల్ దేవ్‌ధర్ తమతోనే జనసేన ఉంటుందనీ, అవినీతి టీడీపీతో పొత్తు లేదనీ అంటున్నారు. ముందుగా పవన్ ఈ పంచాయతీని తేల్చుకోవల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రజల మద్దతు జగన్‌కు ఉన్నంతకాలం ఎన్ని పార్టీలు కలిసినా ఆయనను ఏమి చేయలేరన్నది ప్రజావాణిగా ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
‘డ్రామాలు చేసున్న వారంతా పట్టుబడ్డారు’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రైతుల పేరుతో బినామీ యాత్ర చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెరిఫికేషన్‌లో 70 మంది మాత్రమే అసలు రైతులని తేలిందని, డ్రామాలు చేస్తున్న వారంతా పట్టుబడ్డారన్నారు. చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట.. ‘‘అమరావతి ఉద్యమం కలుషితమైన ఉద్యమం. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కచ్చితంగా జరిగింది. విశాఖ ప్రపంచ నగరం. అమరావతిలా గ్రాఫిక్స్ కాదు. వెనుకబాటుతనాన్ని పారద్రోలడం కోసమే ఉత్తరాంధ్రకు రాజధాని. విశాఖ రాజధాని ఏర్పాటుకు తోడ్పడాలని, న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కోరుతున్నా’’ అని తమ్మినేని అన్నారు. రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు పవన్ కల్యాణ్‌కు లేవు. ఓ నాయకుడు చెప్పు పట్టుకుని స్టేజ్ మీద చూపడమేంటి?’’ అని స్పీకర్ ప్రశ్నించారు. -
అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట..
తెలుగుదేశం, జనసేనలు కలిసి పనిచేయడానికి అడుగు ముందుకు పడింది. ఊహించిన విధంగానే ఈ వ్యవహారం సాగుతున్నా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం వద్ద పెట్టడానికి సిద్ధం అయినట్లు అనిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తెలివైన వారేనని అంగీకరించాలి. తాను త్యాగం చేయడానికి సిద్ధంగా లేనని, ఎప్పుడూ మేమే త్యాగం చేయాలా అన్న పవన్ కల్యాణ్‌ను తన దారిలోకి తెచ్చుకున్నట్లే కనిపిస్తుంది. కాకపోతే పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్‌కు వెళ్లి ఆయన ఇగో సాటిస్పై చేసినట్లు కనిపించారు. చదవండి: అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్ కల్యాణ్‌కు అర్థమవుతుందా? అసలు ఆట తన చేతిలోకి వస్తున్నప్పుడు ఇలా తగ్గితే తనకు పోయేదేముందిలే అని భావన చంద్రబాబుకు ఉండవచ్చు. 2014లో కూడా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరిన ఘట్టం గుర్తుకు చేసుకుంటే, ఇప్పుడు అది మరోసారి రిపీట్ అయినట్లు ఉంది. కాకపోతే 2014లో పవన్ కల్యాణ్ అసలు పోటీలోనే లేకుండా టీడీపీ, చంద్రబాబు సేవలో తరించారు. ఆనాటి పరిస్థితులు వారికి కలిసి వచ్చాయి. తదుపరి పవన్ కల్యాణ్‌ను కరివేపాకు మాదిరి పక్కనబెట్టేశారు. కాకపోతే అప్పడప్పుడు ప్రత్యేక విమానాలలో రప్పించుకుని మాట్లాడి పంపిస్తుండేవారు. ఇదే ప్యాకేజీ స్టార్ అన్న విమర్శకు ఆస్కారం ఇచ్చింది. ఒకసారి అమరావతి రాజధాని రైతుల భూముల సమీకరణ విషయంలో ఏర్పడిన వివాదంలో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలకు వెళ్లి రైతుల తరపున పెద్ద స్పీచ్ ఇచ్చారు. తదుపరి ఆయన హైదరాబాద్‌లో చంద్రబాబును కలవగానే మొత్తం మారిపోయారని అంటారు. ఆ తర్వాత కొంతకాలం టీడీపీకి దూరం అయినట్లే అనిపించింది. కొన్నిసార్లు చంద్రబాబు, లోకేష్‌ల అవినీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన తల్లిని టీడీపీ వారు అవమానించారని బాధపడ్డారు. అంతేకాదు. గతంలో పరిటాల రవి తనకు గుండు కొట్టించినట్లు టీడీపీ ఆఫీస్ నుంచే ఫోన్లు వెళ్లాయని కూడా ఆయన ఆవేదన చెందారు. దాంతో టీడీపీతో ఆయన ఇక సంబంధాలు పెట్టుకోరేమోలే అని ఆయన అభిమానులు అనుకున్నారు. కాని 2019 శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కల్యాణ్ వామపక్షాలు, బీఎస్పీలతో పొత్తు పెట్టుకోవడం, చంద్రబాబు ఎవరికి టిక్కెట్లు ఇవ్వమంటే వారికి టిక్కెట్లు ఇవ్వడం చేశారన్న దృష్టాంతాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో టీడీపీ అధికారం కోల్పోగా, జనసేన పూర్తిగా పరాజయం చెందింది. చివరికి పవన్ కల్యాణే రెండు చోట్ల ఓడిపోయారు. ఆ వెంటనే వామపక్షాలకు గుడ్ బై చెప్పి డిల్లీ వెళ్లి బీజేపీని బతిలమాడుకుని మరీ పొత్తు పెట్టుకున్నారు. అయినా జనసేన, బీజేపీల మధ్య పొత్తు పెద్ద సీరియస్‌గా సాగలేదు. అదే సమయంలో చంద్రబాబుతో పరోక్ష సంబంధాలు నెరపుతూ వచ్చారు. చివరికి కొంతకాలం క్రితం ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీలు ఒకటి కావాలని ఆయన ఆకాంక్షించారు. విన్నవారికి ఇది ఆశ్చర్యం అనిపించినా, ఆయన అసలు అంతరంగం తెలిసిన వారికి చిత్రమనిపించలేదు. కాని తదుపరి మరో సందర్భంలో ఒక కండిషన్ పెట్టారు. తనకు ముఖ్యమంత్రి పోస్టు ఇవ్వాలని, అప్పుడే టీడీపీతో పొత్తు సాధ్యమని సంకేతాలు పంపించారు. అయినా పవన్ కల్యాణ్ బలహీనత బాగా తెలిపిన చంద్రబాబు దానిని అసలు పట్టించుకోలేదు. తత్పలితంగా పవన్ కల్యాణ్ తానే తగ్గి చివరికి ఎలాంటి షరతులు లేకుండా చంద్రబాబు వద్ద సరెండర్ అయినట్లుగా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. తన సోదరుడు చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ వద్ద మర్యాద పూర్వకంగా కూర్చున్న విషయాన్ని కూడా వివాదాస్పదం చేసిన పవన్ కల్యాణ్, తాను మాత్రం చంద్రబాబు పక్కన నిలబడి అత్యంత విధేయత ప్రదర్శిస్తూ చేతులు కట్టుకుని నిలబడి ఉన్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏ సందర్భంలో కలిశారు?. విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ మంత్రులపైన జనసేన కార్యకర్తలు దాడులకు తెగబడిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం, పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్లో నిందితులు ఆశ్రయం పొందడం, వారిని పట్టుకుని పోలీసులు అరెస్టు చేయడం, ఆ క్రమంలో పవన్‌కు నోటీసులు ఇవ్వడం వంటివి జరిగాయి. సాధారణంగా ఎక్కడైనా దాడులకు గురైన వారికి సంఘీభావం చెబుతారు. లేదా సానుభూతిగా ఒక ప్రకటన చేస్తారు. కాని చంద్రబాబు.. దాడులకు పాల్పడ్డ జనసేన వారికి మద్దతుగా పవన్‌ను కలిశారు. విశాఖలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి పవన్ కల్యాణ్ చేసిన కృషిని మెచ్చుకోవడానికి ఆయన కలిశారు. ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం అంతకుముందు పవన్ కల్యాణ్ తన పార్టీ మీటింగ్‌లో నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడడం హైలెట్ అని చెప్పాలి. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని చెప్పు చూపడం, కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని చెప్పడం, ఇలా చిత్రవిచిత్రమైనబూతులతో ఆయన ఆవేశం నటిస్తూ మాట్లాడారు. ఆ వెంటనే చంద్రబాబు వెళ్లి పవన్‌ను కలవడం.. ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగినట్లు స్పష్టంగానే బోధపడుతుంది. వీరిద్దరూ ప్రజాస్వామ్యం కోసం కలిశారట. దాడులు చేయడమే ప్రజాస్వామ్యమని వీరు కొత్త నిర్వచనం చెబుతున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ను విశాఖ ఎయిర్ పోర్టులోనే ఆపేసి, వెనక్కి పంపించిన చంద్రబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటూ గొంతు చించుకుంటున్నారు. విశాఖ కాండిల్ ర్యాలీకి రావాలనుకున్న జనసేన కార్యకర్తలకు కూడా టీడీపీ ప్రభుత్వం అదే విధంగా ట్రీట్ మెంట్ ఇచ్చింది.. అయినా పవన్ కళ్యాణ్ తన అవమానాలన్నిటిని దిగమింగుకుని చంద్రబాబుతో మళ్లీ స్నేహం చేయడానికి ముందుకు వచ్చారంటే ఏమనుకోవాలి. అందుకే వైసీపీ నేతలు ఈయనను ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తుంటారు. పవన్ చెప్పుతీస్తే, ఆల్ రెడీ గాజువాక, భీమవరంలలో పవన్‌కు ప్రజలు చెప్పులు చూపించి పంపించారని, వైసీపీ ఎద్దేవా చేసింది. తాము వంద సార్లు ప్యాకేజీ స్టార్ అంటామని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా, ఎన్ని సీట్లను టీడీపీ జనసేనకు కేటాయిస్తుందన్నది చర్చనీయాంశంగా ఉంది. సుమారు 25 నుంచి ముప్పైవరకు టిక్కెట్లు ఇవ్వవచ్చని, బీజేపీ కూడా ఒకవేళ ఈ కూటమిలో కలిస్తే వారికి ఒక పది సీట్లు ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. కాని బీజేపీ ఇందుకు సిద్ధంగా లేదని అంటున్నారు. గెలిస్తే పెత్తనం టీడీపీదేనని పవన్ కల్యాణ్ ఒప్పుకున్న తర్వాతే చంద్రబాబు ఈ నాటకాన్ని నడిపించి ఉండాలి. చంద్రబాబు లక్ష్యం ఎలాగైనా వైసీపీని దెబ్బతీయడం అయితే, పవన్ కల్యాణ్ లక్ష్యం ఎలాగైనా తాను ఒక్కడినైనా ఈసారి ఎమ్మెల్యే కావాలన్నది కావచ్చు. అయినా జగన్ స్కీములు, వివిధ కార్యక్రమాల ముందు ఈ కూటమి నిలుస్తుందా అన్నది సందేహమే. విడివిడిగా పోటీచేస్తే జగన్‌ను ఓడించడం అసాధ్యమన్న అభిప్రాయానికి చంద్రబాబు రావడంతోనే మరోసారి పవన్ కల్యాణ్‌ను తన ట్రాప్‌లో వేసుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ఇందులో చంద్రబాబు తప్పు ఉందని అనలేం. ఆయన తన స్టైల్ లో రాజకీయం చేస్తుంటే, పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబుకు సరెండర్ అయి జనసేన కార్యకర్తలు మరోసారి టీడీపీకి సేవ చేయించేందుకు సిద్ధపడుతున్నారన్నమాట. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోం. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభవం చవి చూశాం. పవన్ కల్యాణ్‌కు రోడ్డు మ్యాప్ అంశంపై మేము అంతర్గతంగా చర్చించుకుంటామని సునీల్ దేవధర్ అన్నారు. చదవండి: ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర: మంత్రి అంబటి -
అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్ కల్యాణ్‌కు అర్థమవుతుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి రాజకీయం చేస్తున్నారో ఆయన పార్టీ వారికే అర్థం కాదు. పార్టీ క్యాడర్‌కు కాకపోతే, ఆయనకైనా అర్థం అవుతుందా అన్న అనుమానం వస్తుంటుంది. కాకపోతే ఒక సినీ నటుడు కనుక, ఆయన ఏమి మాట్లాడినా మీడియా కవరేజి వస్తుంటుంది. అదే ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ అని చెప్పాలి. దానికి తోడు టీడీపీ మీడియా ఆయనకు అండగా ఉంటుంది. వారం, పది రోజులకోసారి ఆయన ఏదో ఒక విషయంపై స్పందిస్తుంటారు. దానిపై వైసీపీ మంత్రులు, నేతలు రియాక్ట్ అవుతుంటారు. ఆ రకంగా ఆయన రాజకీయంగా జనంలో ఉన్నట్లు సంతృప్తి చెందవచ్చు. అంతకు మించి ఆయన చేస్తున్న ట్వీట్లకు గాని, అప్పడప్పుడు మంగళగిరి వెళ్లి చేసే ప్రసంగాలకు కాని పెద్ద విలువ ఉండడం లేదు. చదవండి: ఈ మూడేళ్లలో ఎన్నడైనా ఆ విషయాలను పవన్ చెప్పారా? ఆయన తన సొంత ఆలోచనలతో ఇవేవి చేయకపోవడం వల్లే ఈ దుస్థితిలో ఉన్నారని అనుకోవచ్చు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు చూడండి.. విశాఖలో గర్జన సభను విమర్శిస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ అసలు ఆ విషయంలో విశాఖపట్నాన్ని ఎందుకు రాజధానిగా వద్దనుకుంటున్నది మాత్రం ఆయన వివరించినట్లు కనిపించలేదు. కేవలం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై ఎప్పటిమాదిరి చేసే రొడ్డకొట్టుడు విమర్శలు తప్ప సృజనాత్మక, నిర్మాణాత్మకత, కొత్తదనం కొరవడ్డాయి. దేనికి గర్జనలు? మూడు రాజధానులతో అభివృద్ది జరుగుతుందా? ఒక హైకోర్టు, కొన్ని ఆఫీస్‌లు ఆయా చోట్ల పెడితే అభివృద్దా అని ఆయన ప్రశ్నించారు. ఇది ఆయనకు వచ్చిన సందేహమో,లేక ఎవరైనా అడగమంటే అడిగారో తెలియదు. కాని ఇదే పవన్ కల్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం అన్ని ఆఫీస్ లు ఒక్క అమరావతిలోనే ఎందుకు పెడతారని ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?. ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?. రుషి కొండను విధ్వంసం చేసి భవనం నిర్మిస్తున్నందుకా? మత్సకారులు వలసలు వెళుతున్నందుకా? దసపల్లా భూములను కొల్లగొడుతున్నందుకా.. అంటూ ఏవేవో ట్వీట్లు పెట్టారు. వీటిలో ఎదైనా ఒక్కటైనా కొత్త విషయం ఉందా? రోజూ తెలుగుదేశం పార్టీవారు చేస్తున్న విమర్శలనే ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం మీడియా ముఖ్యంగా ఈనాడు రోజూ రాసే ఏడుపుగొట్టు వార్తల ఆధారంగానే ఈ ట్వీట్లు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. మూడు రాజధానులతో రాష్ట్రం ఎందుకు అధోగతి పాలవుతుందో వివరించాలి కదా? అది నిజమే అయితే గతంలో ఆయనే కర్నూలు వెళ్లి, విశాఖ వెళ్లి అవి రాజధానులు కావాలని ఎందుకు అన్నారు?. అసెంబ్లీలో ప్రభుత్వ భూమి ముప్పై వేల ఎకరాలు ఉండాలన్న జగన్ వ్యాఖ్యలను ఎందుకు వక్రీకరిస్తున్నారు? అయినా విశాఖపట్నం రాజధాని అంటే గొప్ప సంగతి అవుతుందా? లేక అమరావతిలోని నాలుగు పల్లెటూళ్లు రాజధాని అంటే గొప్ప విషయం అవుతుందా? అసలు ఎందుకు విశాఖను వ్యతిరేకిస్తున్నది వారికైనా తెలుసా? ఎమ్మెల్యేలు, ఎంపీల బలం ఉంటే అది రాజకీయంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. రాష్ట్రానికి ఆర్థిక బలం చేకూరడానికి అనేక ఇతర ప్యాక్టర్లు పనిచేస్తాయి. రెండేళ్ల పాటు కరోనా సమస్యను ఎదుర్కున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపలేదు. స్కూళ్లు బాగు చేయడం ఆగలేదు. ఆస్పత్రులను మెరుగుపర్చడం నిలపలేదు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటును ఆపేయలేదు. సుమారు ముప్పైపైగా స్కీంలను ఈ ప్రభుత్వం అమలు చేసిన విషయం పవన్ కల్యాణ్‌కు తెలియకపోతే రాజకీయంగా ఆయన జ్ఞానం అలా ఉందని అనుకోవాలి. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొద్ది రోజుల క్రితం ఉన్నవి, లేనివి కలిపి అప్పులపై ఒక సోది ప్రకటన చేశారు. దానిని ఖండిస్తూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక పెద్ద ప్రకటనే విడుదల చేశారు. నిత్యం అసత్యాలతో జనాన్ని ప్రభావితం చేయడానికి తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా పనిచేస్తున్నాయి. వారికి కొనసాగింపుగానే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు తప్ప ఒక్కటి కూడా అర్ధవంతంగా లేదు. నిజంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అప్పులు చేయవలసిన అవసరం లేదని పవన్ కల్యాణ్ భావిస్తే, అందుకు ఆధార సహితంగా ప్రకటన చేసి ఉండవచ్చు. మధ్య నిషేధంపై ఆయన విమర్శ చేయవచ్చు. కాని తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పగలరా? మత్స్యకారులు గుజరాత్ తదితర రాష్ట్రాల తీర ప్రాంతాలకు వలస వెళ్లడం ఇప్పుడే కొత్తగా జరుగుతోందా? ఇంతకాలం ఎందుకు ఫిషింగ్ హార్జర్లు నిర్మించలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక కదా, నాలుగు కొత్త ఓడరేవులు, పది ఫిషింగ్ హార్జర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నది?. రుషికొండపై గతంలో కూడా భవనాలు ఉన్నాయి కదా.. అయినా టీడీపీ మీడియా దుష్ప్రచారం చేస్తోంది కనుక, దానికి భాజాభజాయింపు చేయడానికి పవన్ కల్యాణ్ కూడా ట్వీట్లు చేశారు. దసపల్ల భూముల గురించి అంతే. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అంటారా? వద్దని అంటారా? అన్నిటిలోను వేలు పెట్టి ఏదో ఒకటి కెలకాలన్న ఆలోచన తప్ప, తన పార్టీ అభివృద్దికి ఏమి చేయాలన్న సంకల్పం ఆయనలో కనిపించదు. పవన్ ఏకరువు పెట్టిన వైఫల్యాలలో వాస్తవాలు ఉన్నాయని అనుకుందాం. మరి వీటిని సరి చేయడానికి ఏమి చేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి కదా?. స్కూళ్లనాడు-నేడు నిలిపివేయమంటారా? అమ్మ ఒడి స్కీమ్ ఎత్తివేయమంటారా?. మద్య నిషేధం విషయంలో పవన్‌కు స్పష్టత ఉన్నదా? విశాఖ కార్యనిర్వాహక రాజధాని కావాలని అక్కడి ప్రజల ఆకాంక్ష. అందుకోసం అక్కడ గర్జన కార్యక్రమం జరుగుతుంటే పవన్‌కు వచ్చిన నొప్పి ఏమిటి. తనను విశాఖలో భాగమైన గాజువాక నుంచి ఘోరంగా ఓడించారన్న దుగ్దతో విశాఖను రాజధానిగా వద్దని ఆయన చెబుతున్నారా? ఒకవేళ జగన్ వైజాగ్‌ను విశాఖను రాజధాని చేయగలిగితే, దానిని మార్చివేసి అమరావతి పల్లెటూళ్లకే రాజధానిని తీసుకు వెళతామని పవన్ చెప్పగలరా? పోనీ పవన్ అమరావతిలో లక్షల కోట్లు వ్యయం చేసి, అక్కడివారికి మాత్రమే రియల్ ఎస్టేట్ ప్రయోజనం కల్పించాలని డిమాండ్ చేస్తారా? రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా కోటీశ్వరులకు, టీడీపీ వారికి మాత్రమే ఆర్దిక ప్రయోజనం కలగాలని పవన్ కూడా డిమాండ్ చేస్తారా? లేక తనకు అన్ని విధాల ఉపయోగపడే లింగమనేని రమేష్ వంటివారికి రియల్ ఎస్టేట్ ద్వారా ఆర్దిక ప్రయోజనం కలిగించాలని బహిరంగంగా కోరగలరా?. నిజంగానే రైతులు ఎవరైనా ఈ ప్రక్రియలో ఎక్కడైనా నష్టపోతే వారికి సాయం చేయడం తప్పుకాదు. పాదయాత్రలకే లక్షలు, కోట్లు ఖర్చు చేయగలిగిన స్థితిమంతులకు తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు మద్దతు ఇచ్చాయంటే వాటి స్వభావమే అంత అని సరిపెట్టుకోవచ్చు. కాని పేదల పక్షపాతిగా చెప్పుకునే సీపీఐ వంటి పక్షాలు కూడా టీడీపీకి తోక పార్టీలుగా మారి ఆ పాదయాత్రకు మద్దతు ఇవ్వడం కాలమహిమ కాక మరేమిటి అవుతుంది. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు జోగి రమేష్, రోజా వంటివారు బాగానే స్పందించారు. బహిరంగ చర్చకు రావాలని రమేష్ అంటే, ఉత్తరాంధ్రలో గతంలో వలసలు ఉన్నప్పుడు పవన్ ఏమి చేశారని రోజా అడిగారు. మరో మంత్రి అంబటి రాంబాబు అయితే ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకు గర్జన అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ రకంగా వైసీపీ నుంచి పవన్ స్పందన పొందగలిగారు. బహుశా 2024 వరకు పవన్ వ్యాఖ్యలకు ఎంతో కొంత స్పందించవలసి ఉంటుందేమో!. తదుపరి ఏదో ఒకటి తేలిపోతుంది. స్థూలంగా చెప్పాలంటే ఇన్నేళ్ల రాజకీయం తర్వాత కూడా పవన్ కల్యాణ్ స్వయం ప్రకాశితం కాకపోవడమే జనసేన విషాదం అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
జనసేన కాదు ..గూండా సేన : వెల్లంపల్లి