
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయలేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. ప్రజలే ముందుండి పోరాటం చేయాలని, తాను వెనుక ఉంటానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ‘గతంలో తాను పోరాటం చేస్తే ఎవరూ మద్దతు ఇవ్వలేదు. పోరాటం చేయడం వల్లనే కేంద్రంలో ఉన్న పెద్దలకు శత్రువునయ్యా. ప్రజలే పోరాటం చేయాలి.. వారి వెనుక నేను నిలబడతా’ అని దాటవేత ధోరణి ప్రదర్శించారు.
చదవండి: ‘రాజకీయ లబ్ధికోసమే కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు’