steel plant
-
విశాఖ ఉక్కు కార్మికులకు కేంద్రమంత్రి కుమారస్వామి షాక్
-
కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ
-
YSRCP ప్రభుత్వ చర్యల వల్లే ఆగిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని సెయిల్ విలీనం చేయాలని డిమాండ్
-
అప్పటిదాకా బాబు, పవన్‌లను నమ్మం: విశాఖ ఉక్కు కార్మికులు
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా అటు కేంద్రం నాన్చుతోంది. మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగబోదంటూ తెర వెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ‘‘విశాఖ ఉక్కుకు ప్యాకేజీ’’ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.ప్యాకేజీ అనేది కంటి తుడుపు చర్య. అది శాశ్వత పరిష్కారం ఎంత మాత్రం కాదు. ఇచ్చిన ప్యాకేజీ రెండు మూడు నెలలకు మించి సరిపోదు. ప్యాకేజీలతో ఒరిగేదేం లేదు. స్టీల్ ప్లాంట్(Steel Plant) బతకాలంటే సెయిల్ లో విలీనం ఒక్కటే మార్గమని సూచిస్తున్నాయి. అలాగే.. స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనుల కేటాయించాలన్న డిమాండ్‌ను మరోసారి ప్రస్తావించాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Steel Plant Privatization) జరగదని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగదని హామీ ఇస్తేనే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నమ్ముతాం అని కార్మికులు చెబుతుండడం గమనార్హం.సాక్షి టీవీతో ఉక్కు పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ.. ముడి సరుకు కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్యాకేజీతో కొత్తగా స్టీల్ ప్లాంట్ కు ఒరిగేది లేదు. కార్పొరేట్ల ఒత్తిడి మేరకే..ప్యాకేజి ప్రకటించారు. ప్యాకేజీ మొత్తం బకాయిలకే పోతుంది... శాశ్వత పరిష్కారం చూపే వరకూ మా పోరాటం ఆగదు. ప్రజల్లో మమ్మల్ని చులకన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతీసారి డబ్బులు ఇవ్వలేమని చంద్రబాబు చెప్పారు. మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు విలీనం చెయ్యండి. మాకు అప్పు అవసరం లేదు. ఉన్న అప్పులను ఈక్విటీగా మార్చాలి. సెయిల్ లో విలీనం ఒక్కటే పరిష్కార మార్గం. అలాగే సొంత గనులు కేటాయించాలి అని ఉక్కు పోరాట కమిటీ నేతలు అంటున్నారు. -
నాలుగు నెలలుగా జీతాలు లేవని ఆందోళన చేస్తున్న ఉక్కు కార్మికులు
-
జగన్ డిమాండ్లు వినిపించే దమ్ము బాబు, పవన్‌కు ఉందా ?
-
AP: ఉక్కు ఉద్యమంపై ఉక్కుపాదం
విశాఖ సాక్షి: విశాఖ ఉక్కు కార్మికులు చేపట్టిన నిరాహా దీక్షను భగ్నం చేయాలనే యోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. వారిపై ఉక్కు పాదం మోపేందుకు సమాయత్తమైంది. దీనిలో భాగంగా వారి సెలవుల్ని రద్దు చేయాలని చూస్తోంది. శాంతి భద్రతల పేరుతో నిరాహార దీక్ష చేపట్టిన కార్మికుల సెలులు రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపుతోంది. ఇలా మెయిల్స్ పంపడంపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. శాంతి భద్రతలకు ఉక్కు కార్మికులకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తోంది.నిరాహార దీక్ష ప్రారంభంఉక్కు కార్మికుల నిరాహార దీక్ష ప్రారంభమైంది. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మికులు 36 గంటల పాటు నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఈ దీక్ష సందర్భంగా విశాఖ ఉక్కుపై ప్రధాని సానుకూల ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రధాని మోదీని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు అపాయిట్మెంట్ అడిగారు. అయితే, ఆ అపాయిట్మెంట్పై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. -
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా? : MLC కవిత
-
Vizag Steel Plant: మంత్రి కుమారస్వామిని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కలిశారు.
-
PM Modi AP Tour: మోదీ విశాఖ టూర్ ..
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
గాజువాక: విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని విజ్ఞప్తి చేశారు.సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాని మోదీ తన విశాఖ పర్యటనలో సానుకూల నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సాగుతున్న ఉద్యమానికి రాష్ట్ర అభివృద్ధితోపాటు ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్
-
YSRCP అండగా ఉంటుంది: గుడివాడ అమర్నాథ్
-
ఈనెల 29న విశాఖ రానున్న ప్రధాని మోదీ
-
రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
-
స్టీల్ ప్లాంట్ రన్ చేసే విషయంలో లోపాలున్నాయి : పవన్ కల్యాణ్
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళన
-
Vijay Sai Reddy: చంద్రబాబు చేతులెత్తేశారు
-
స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 12 మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. స్థానిక అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు.మెక్సికో నగరానికి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలోని అక్లోజ్టోక్లో ఈ పేలుడు సంభవించినట్లు త్లాక్స్‌కాలా స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కార్మికుల నుండి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం కరిగిన ఉక్కు.. నీటి పరిధిలోకి రావడంతో పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. బాధిత కుటుంబాలను త్లాక్స్కలా గవర్నర్ లోరెనా క్యూల్లార్ పరామర్శించారు. ఈ ఉదంతం దర్యాప్తు పూర్తయ్యేంతవరకూ ప్లాంట్‌ను మూసివేయనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది? -
మోడీని బాగా పొగిడారు.. స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు అడగలేదు
-
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వామపక్షాలు ఆందోళన
-
స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత.. 200 మంది ఉద్యోగుల అష్టదిగ్బంధనం
సాక్షి,విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వందలాది స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల్ని.. కాంట్రాక్ట్ ఉద్యోగులు అడ్డుకున్నారు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్లైన్ గేటు పాసులను నిలిపివేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించారు.స్టీల్‌ప్లాంట్‌లో అర్ధరాత్రి రాత్రి వరకు నిరసన చేపట్టారు. ఈడీ వర్క్స్ బిల్డింగ్‌లో సుమారు 200 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కార్మికులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నట్లు హెచ్చరించారు. మరోవైపు మా పొట్టకొట్టొద్దని 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంపై ఆందోళన చేస్తున్నా.. కూటమి నేతలు స్పందించలేదని వాపోతున్నారు. -
స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో గందరగోళం..
-
యాజమాన్యానికి షాకిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
-
యాజమాన్యానికి షాకిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
సాక్షి,విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఉద్యోగులు షాకిచ్చారు. 500 మంది ఉద్యోగుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నం చేసింది. ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను పంపుతున్నట్లు సర్య్కులర్ జారీ చేసింది. దీంతో పాటు ఉద్యోగుల ఇంటర్వ్యూలు కోసం 4 బృందాలు ఏర్పాటు చేసింది.కానీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లేందుకు ముందుకు రాలేదు. యాజమాన్యం నిర్వహించిన ఇంటర్వ్యూలకు కనీసం 20 మంది ఉద్యోగులు కూడా హాజరు కాలేదు. అయితే, ప్లాంట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే గొడవలు జరుగుతాయని చెప్పి ప్రైవేట్ హోటల్స్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించడం కొసమెరుపుచదవండి : మీకో దణ్ణం చంద్రబాబు : ఆర్కే రోజా -
లాభాల్లో ఉన్నా అమ్మేశారు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. కార్మిక, ఉద్యోగ సంఘాల ఆందోళనలను పట్టించుకోకుండా ఉక్కు పరిశ్రమను ›ప్రైవేట్‌పరం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూతబడినా, ఆస్తులను వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ చేపట్టినా, కొత్త ఆర్డర్లు తీసుకోకుండా నియంత్రిస్తున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు శాఖ ఆధ్వర్యంలో లాభాల్లో ఉన్న ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్ (ఎఫ్ఎస్ఎన్ఎల్) విక్రయానికి పూనుకుంది. ఈమేరకు జపాన్ సంస్థతో ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. లాభాల్లో ఉన్న సంస్థను..నష్టాల నెపంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధమైన కేంద్రం లాభాల్లో ఉన్న ఎఫ్ఎస్ఎన్ఎల్ సంస్థను సైతం విడిచిపెట్టడం లేదు. లాభాల్లో ఉండటమే కాకుండా రెండేళ్ల పాటు రూ.1,000 కోట్లు ఆర్డర్ ఉన్న సంస్థను ప్రైవేట్‌కు అప్పగించడం విస్మయానికి గురిచేస్తోంది. ఉక్కు శా«ఖ ఆధ్వర్యంలో భిలాయ్ ప్రధాన కేంద్రంగా 1979లో ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా 10 యూనిట్లు కలిగిన ఈ సంస్థలో 445 మంది శాశ్వత ఉద్యోగులు, 2,500 మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, ఇస్కో బర్న్‌పూర్, దుర్గాపూర్, రూర్కెలా, భిలాయ్, నగర్నార్, సేలం, బొకారో స్టీల్ప్లాంట్లతో పాటు హైదరాబాద్‌లోని మిథాని, హరిద్వార్‌లోని బీహెచ్ఈఎల్లో ఈ యూనిట్లు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎన్ఎల్ ఆ సంస్థలలోని స్క్రాప్‌ను సేకరించి వాటి అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసి అందిస్తుంది.రూ.320 కోట్లకు జపాన్ కంపెనీకి విక్రయంఏడాదికి రూ.వంద కోట్ల లాభంతో పాటు డిపాజిట్లు, నిల్వలు భారీగా ఉన్న ఎఫ్ఎస్ఎన్ఎల్ను కేంద్రం కారుచౌకగా జపాన్‌కు చెందిన మెసర్స్ కొనోయ్కి ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ సంస్ధకు రూ.320 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం చేసుకుంది. లాభాలను ఆర్జిస్తున్న సంస్థను విక్రయించడమే కాకుండా కారుచౌకగా ప్రైవేట్‌కు అప్పగించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. స్టీల్‌ప్లాంట్‌ను కూడా కారుచౌకగా ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్న ఆరోపణలకు ఇది బలం చేకూరుస్తోంది.న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న ఉద్యోగులుకేంద్ర నిర్ణయం పట్ల ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. పరిశ్రమలను అమ్ముకుంటూ పోతున్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని తప్పబడుతున్నారు. నష్టాలను అధిగమించడానికి రూ.2 వేల కోట్లు అడ్వాన్సు రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.రూ.వెయ్యి కోట్ల ఆర్డర్ ఉన్నా..ఎఫ్ఎస్ఎన్ఎల్ ఏడాదికి రూ.100 కోట్లు లాభం ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు రూ.175 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.36 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. రాబోయే రెండేళ్లకు రూ.1000 కోట్ల ఆర్డర్ కూడా ఉంది. ఈ సంస్థకు స్టీల్ ప్లాంట్ నుంచి రూ.80 కోట్లు, ఇతర ప్లాంట్ల నుంచి రూ.30 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. ఇంత ఆర్థిక పరిపుష్టి కలిగిన సంస్థపై కేంద్రం కన్ను పడింది. 2016లో ఎఫ్ఎస్ఎన్ఎల్ను ప్రైవేటుపరం చేయాలని ఆలోచన చేయడంతో సంస్ధ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు.దుర్మార్గ చర్యమూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో సేవలు అందిస్తున్న కంపెనీని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గం. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఈ సంస్థను అమ్మేస్తున్నారు. దీనివల్ల వేలాది మందికి అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. –పి.రాములు, అధ్యక్షుడు, ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయీస్ యూనియన్ లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్మేస్తారుఫెర్రోస్క్రాప్ ఏటా లాభాలు ఆర్జిస్తోంది. పలు ఆర్డర్లు ఉన్నాయి. నగదు నిల్వలున్నాయి. కేవలం రూ.320 కోట్లు కోసం ఇలా చేయడం వెనుక కుట్ర ఉంది. దీనిపై ఆందోళన కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – ఎం.అమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయిస్ యూనియన్ -
ప్రైవేటీకరణ వైపు స్టీల్ ప్లాంట్ నిజాలు బయటపెట్టిన CMD
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్.. బాబు యూటర్న్
-
ఈ టైంలో చంద్రబాబు కనిపిస్తే.. రెచ్చిపోయిన కేఏ పాల్
-
కార్మికులను చర్చలకు పిలిచి ఢిల్లీ వెళ్లిపోయిన స్టీల్స్టాంట్ సీఎండీ
-
సెంటిమెంట్ కుదరదు.
-
జనసేన నేత బొలిశెట్టికి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు వార్నింగ్
-
జనసేన నేత వ్యాఖ్యలను ఖండించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు
-
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన జనసేన నేత బొలిశెట్టి
-
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం, సాక్షి: కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయాలని చూస్తున్నారని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సోమవారం ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘స్టీల్ ప్లాంట్‌ను ఎలా అమ్మేయాలా అని చూస్తున్న వారిలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది కార్మిక సంఘాల నేతలే. ఏదో ఒక యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఈ నెల 19న పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు కార్మిక సంఘాల నేతలు వెళ్తున్నారని తెలిసి ఇలా స్పందిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2021లో అమిత్‌షా వద్దకు పవన్ కల్యాణ్ వెళ్లి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ ఉక్కు సెంటిమెంట్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లారని, ఆ సమయానికి స్టీల్‌ప్లాంట్‌లో ఒక్క ఉద్యమం కూడా మొదలవలేదని పేర్కొన్నారు.ప్రైవేటీకరణ ఆగిపోతే ఎక్కడ పవన్‌కు క్రెడిట్ వచ్చేస్తుందోనని ఈ నాయకులు దుకాణాలు తెరిచారని ఎద్దేవా చేశారు. ఉక్కు నిర్వాసితుల్ని పక్కనపెట్టి కార్మిక సంఘాలు పెద్ద టెంట్ పెట్టుకుని తూతూమంత్రంగా ఉద్యమాన్ని నడిపారని ఆక్షేపించారు. అక్టోబర్ 2021లో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేస్తే.. అప్పటి ప్రభుత్వానికి, విజయసాయిరెడ్డికి, బొత్సకు ఎవరికీ పట్టలేదన్నారు. పవన్ కల్యాణ్ నిరాహార దీక్షకు కార్మిక సంఘాల నేతలు ఎవరూ ముందుకురాలేదని, వీరంతా ప్రైవేటీకరణకు పూర్తిగా సహకరించిన వారేనని ఆరోపించారు. 10 ఫిబ్రవరి 2021న ప్రైవేటీకరణ ప్రకటన దశలోనే @PawanKalyan గారు డిల్లీ వెళ్లి కేంద్రంలో అధికారులను, కేంద్ర హోం మంత్రి @AmitShah గారిని కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం 32మంది ప్రాణత్యాగం వల్ల వచ్చిందని దీని వెనుక తెలుగు ప్రజల సెంటిమెంటు ఉందని కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ పరిశ్రమల నుండి… pic.twitter.com/c9BCRVidbO— Bolisetty Satyanarayana (@bolisetti_satya) September 16, 2024అప్పటి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఊరుకుందన్నారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, ఒత్తిడి తీసుకొస్తే అప్పుడే ఫలితం వచ్చేదన్నారు. వైఎస్సార్సీపీ నేతలు తామే ఇన్నాళ్లూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపినట్టు చెబుతున్నారని, వారి హయాంలోనే చాపకింద నీరులా ప్రైవేటీకరణ ప్రక్రియ అంతా జరిగిందని వ్యాఖ్యానించారు. నాయకులందర్నీ చాచిపెట్టి కొట్టాలి పవన్‌ను కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాలు మెడకు చుట్టి కొట్టినట్టు.. యూనియన్ నాయకులందర్నీ చాచిపెట్టి కొట్టాలంటూ బొలిశెట్టి పరుష పదజాలాన్ని వాడారు. జనసేన వెంట ఆనాడు రమ్మంటే ఎవరూ రాలేదని, తాళి కట్టించుకోవడం ఒకడితో.. సంసారం మరొకడితో అన్నట్టు కొంతమంది యూనియన్ నాయకుల్ని వెధవలంటూ ధ్వజమెత్తారు. పవన్‌తోపాటు, సీఎం చంద్రబాబును సమన్వయం చేసుకుంటూ అన్ని పార్టీలు కలిసి నిలబడితే తప్ప స్టీల్‌ప్లాంట్‌ను నిలబెట్టుకోలేమని పేర్కొన్నారు.పవన్‌ను కలవాలని పోరాట కమిటీ నిర్ణయం ఉక్కు నగరం: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు సోమవారం జరిగిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భేటీలో నిర్ణయించారు. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు ఉక్కు ఉద్యోగులు సగం రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు. సమావేశంలో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కేఎస్ఎన్ రావు, అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు, జి.గణపతిరెడ్డి, రామ్మోహన్కుమార్, కామేష్, వరసాల శ్రీనివాసరావు, శ్రీనివాసనాయుడు, సురేష్ పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ, టీడీపీ డబుల్ గేమ్..
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి మా పార్టీ దేనికైనా సిద్ధం
-
స్టీల్ ప్లాంట్ కోసం మహాధర్నా
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అతి పెద్ద ద్రోహం
విశాఖ సిటీ : ‘భయపడినంతా అయింది. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్–3ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతుకోయడమే. తెలుగు జాతికిది అతిపెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు ఇచి్చన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి’.. అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఆయన ఇంకా ఏం పేర్కొన్నారంటే.. కేంద్రంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నా.. స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది. ఏమాత్రం పట్టింపు ఉన్నా.. చంద్రబాబు తక్షణం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ స్టీల్‌ను కంటికి రెప్పలా కాపాడారు. మూత వేయడమే పరిష్కారం కాదని ఆయన అనేకసార్లు చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలోగానీ, ఎన్ఎండీసీలో గానీ విలీనంచేసి, ఇనుప ఖనిజ గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చని సూచించారు. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సాహసం చేస్తోందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు, ఆయన వైఖరే కారణం అనడంలో సందేహంలేదు. విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రాజీనామా చేసి పోరాటానికి సిద్ధంకావాలి.ఉత్తరాంధ్ర తలను నరకడంగా భావించే ఈ దుర్మార్గాన్ని ప్రజలంతా ఎండగట్టాలి. చంద్రబాబు ప్రజా సంపదను అమ్మకానికి పెడుతుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి విశాఖ స్టీల్‌ను రక్షించే దాకా పోరాటం సాగిస్తుంది. వైజాగ్ స్టీల్ అనేది రాష్ట్ర ప్రజల ఉద్వేగాలు, ఆత్మగౌరవంతో ముడిపడినది. ఇప్పుడు పోరాడకపోతే వైజాగ్ స్టీల్ అనే రాష్ట్ర గౌరవ చిహ్నం శాశ్వతంగా కనుమరుగైపోతుంది. -
ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ
సాక్షి,విశాఖపట్నం : విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఎఫ్ 1ను మూసేసిన ప్లాంట్ అధికారులు.. తాజాగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్లాంట్‌లోని వరుస పరిణామలపై అటు ఉద్యోగులు.. ఇటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నిలిపివేసి.. కేవలం ఒక బ్లాస్ట్ ఫర్నేస్‌లో కార్యకలాపాలు నిర్వహించడంపై కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..ఉద్యోగుల జీతాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని వాపోతున్నారు.ఇప్పటి వరకు రెండు బ్లాస్ట్ ఫర్నెస్ లు నడిపితే అరకొరగా ఉత్పత్తి.. ఇకపై ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ తోనే ఉత్పత్తితో కేవలం నెలకు రూ. వెయ్యి కోట్లు మాత్రమే రాబడి వస్తుందని, ఇలా అయితే ప్లాంట్ నిర్వహణ అసాధ్యమని స్టీల్ ప్లాంట్ కమిటీ సంఘాలు నేతలు చెబుతున్నారు. -
ప్రైవేటీకరణ ఆపండి.. సీపీఐ భారీ ర్యాలీ
-
బాబుకు అమరావతి పై ఉన్న శ్రద్ధ స్టీల్ ప్లాంట్ పై లేదు..
-
విశాఖ స్టీల్ వద్ద ఉద్రిక్తత
-
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ, కార్మిక సంఘాల నేతల మధ్య సమావేశం
-
కూటమి మోసం.. స్టీల్ ప్లాంట్ లో మొదలైన ఉద్యమం
-
చంద్రబాబుకు కార్మికుల డెడ్ లైన్..
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ప్రారంభించిన ఎన్డీయే సర్కారు
-
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
-
కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆశీల్మెట్టలోని కేఏ పాల్ కన్వెన్షన్ హాల్ ఆవరణలో ఆయన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ నాయకులు కేంద్రానికి బానిసలుగా మారారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ కోసం 16 వేల మంది భూదానాలు, 32 మంది ప్రాణాలర్పించారన్నారు. లక్షల కోట్లు లాభాలు తెస్తూ.. రూ.8 లక్షల కోట్లు విలువైన స్టీల్‌ప్లాంట్‌ను రూ.4 వేల కోట్లకు అదానీకి కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దీనిపై కోర్టులో కేసు వేసినట్టు తెలిపారు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ ఇప్పుడు యువతను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాని మోదీ, చంద్రబాబే కారణమని విమర్శించారు. తెలుగు ప్రజలందరూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్లు, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా తాను రూ.4 వేల కోట్లు, తరువాత రూ.40 వేల కోట్లు ఇచ్చి స్టీల్‌ప్లాంట్‌ను నడిపిస్తానన్నారు. స్టీల్‌ప్లాంట్ ద్వారా ఏడాదికి లక్ష కోట్లు లాభం చూపిస్తానన్నారు. ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు పది లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని పాల్ చెప్పారు. ఇంత పెద్ద స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం దారుణమన్నారు. కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరం, స్మార్ట్ సిటీ, రెండు కోట్ల ఉపాధి లేకుండా పోయాయని ఆరోపించారు. రాష్ట్రం అప్పులు భారం తీర్చే సత్తా స్టీల్‌ప్లాంట్‌కు మాత్రమే ఉందన్నారు. యువతి, యువకులు, ప్రజలు తరలివస్తే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. -
రూ 650 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ కు మౌలిక వసతులు
-
విశాఖ ‘గ్రీన్’ప్లాంట్
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిసరాలు ప్రత్యేక వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్లాంట్ స్థలంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి రహదారికి ఇరువైపులా ఉండే పరిసరాలను చూస్తే విశాఖ నగరంలో ఉన్నామా లేక మరెక్కడైనా ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే వేడిని చల్లార్చేలా వాతావరణ సమతుల్యత కోసం తీసుకుంటున్న చర్యల వల్ల నగరంంలో కంటే స్టీల్‌ప్లాంట్ ప్రాంతంలో 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో దేశంలోనే పర్యావరణ హిత ప్లాంట్‌గా ఖ్యాతి గాంచింది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్టీల్ ప్లాంట్ గ్రీన్ ప్లాంట్‌గా ఎలా మారిందన్నదానిపై ప్రత్యేక కథనం.. ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో.. స్టీల్‌ప్లాంట్ ప్రారంభం నుంచి పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం స్టీల్‌ప్లాంట్ ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో మొదటి దశలో టన్ను స్టీల్ ఉత్పత్తికి ఒకటి చొప్పున మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని మూడు మిలియన్ చెట్లు నాటి ఆదర్శంగా నిలిచింది. ప్లాంట్ మొదటి దశలో హరిత వనాల పెంపునకు రూ.360 కోట్లు వ్యయం చేయగా.. విస్తరణ యూనిట్లలో మొక్కల పెంపునకు రూ.1,150 కోట్లు వ్యయం చేస్తున్నారు. నిబంధనల మేరకు పరిశ్రమలోని 33 శాతం గ్రీన్ బెల్ట్‌కు వినియోగించాల్సి ఉండగా.. స్టీల్‌ప్లాంట్ ఆ రికార్డును అధిగమించి 2,600 హెక్టార్లలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేసింది. 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యం ప్రస్తుతం జరుగుతున్న 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తికి అనుగుణంగా 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్ ముందుకు సాగుతోంది. 2023 మే నెల నాటికి 5.51 మిలియన్ మొక్కలు నాటారు. తుపానులు, సునామి వంటి ఉప ద్రవాలను తట్టుకునేలా సుమారు 24 లక్షల కాజురీనా మొక్కలు నాటారు. కాలుష్యాన్ని నివారించేందుకు 18 లక్షలు ఏఏ ఫోర్మిస్, మామిడి, కొబ్బరి, జీడి, జామ, వేప, సుబాబుల్, సపోటా, రావి, మర్రి, టేకు మొక్కలు నాటారు. అదేవిధంగా 2.50 లక్షల యూకలిప్టస్ మొక్కలు నాటారు. బయోడీజిల్‌ను ప్రోత్సహించేందుకు సుమారు 4.50 లక్షలు పాల్మైరా, పొంగామియా, జట్రోపా మొక్కలు నాటారు. పర్యావరణంతో పాటు సంస్థకు ఆదాయం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. లక్షలాది మొక్కలను నాటడం ద్వారా నగరంలోని పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా సంస్థకు లక్షలాది రూపాయలు ఆదాయం కూడా లభిస్తోంది. సంస్థపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఆదాయం సమకూరుస్తున్నాం. – వీఎల్పీ లాల్, డీజీఎం, ఆగ్రో ఫారెస్ట్ విభాగం నగర కాలుష్యాన్నీ తగ్గించేలా.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన గ్రీన్ విశాఖ ప్రాజెక్ట్‌లో 4.50 లక్షల మొక్కలు నాటేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ముందుకొచ్చింది. 2012–19 మధ్యకాలంలో 4.50 లక్షలు మొక్కలు నాటి నగర పర్యావరణానికి సహకారం అందించారు. కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ (సీఈఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా 2019–23 వ్యవధిలో వివిధ ఫల జాతులకు చెందిన 55 వేల మొక్కలు నాటారు. 2020లో నగరంలోని ఐఐఎం క్యాంపస్‌లో గ్రీనరీ పెంపునకు రూ.40 లక్షలు అందజేశారు. సీఈఆర్లో భాగంగా స్టీల్‌ప్లాంట్ పరిసర గ్రామాల్లోని రైతులకు సుమారు 75 వేల జామ, మామిడి, సపోటా, కొబ్బరి మొక్కలు అందజేశారు. -
స్టీల్ ప్లాంట్ EOIకు ముగిసిన గడువు
-
స్టీల్ ప్లాంట్ కార్మికులతో చర్చలు జరిపిన ఏకైక సీఎం వైఎస్ జగన్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకు అనూహ్య స్పందన
-
కేంద్రంపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆగ్రహం.. సింహాచలానికి పాదయాత్ర..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై 24 గంటల్లో మాట మార్చిన కేంద్ర ప్రభుత్వం తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. ఉద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. వీరికి వైఎస్సార్సీపీ శ్రేణులు మద్దతిచ్చాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కోరుతున్నారు. చదవండి: చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి.. మహిళలకు విద్యుత్ షాక్.. పట్టించుకోలేదని ఆగ్రహం.. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. పూర్తి సామర్థం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియపైనే ఫోకస్ పెట్టామన్నారు. వీటిపై యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. బిడ్‌లో టీఎస్ సర్కార్ పాల్గొనడం ఎత్తుగడ మాత్రమేనని ఫగ్గన్ సింగ్ అన్నారు. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు -
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో చుట్టుపక్కల అనుబంధ రంగాల అభివృద్ధి : సీఎం వైఎస్ జగన్
-
వైఎస్సార్: సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
-
వైఎస్సార్ జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
Updates: ► ముగిసిన సీఎం జగన్, వైఎస్సార్ జిల్లా పర్యటన. కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం, ఆపై గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ► పులివెందుల మండలం నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ అతిథిగా హాజరయ్యారు. దేవుడి దయతో మనకు మంచి రోజులు: సీఎం జగన్ దేవుడి దయతో వైఎస్సార్ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. ఎప్పట్నుంచో కలలుగన్న స్వప్నం ఈ స్టీల్‌ప్లాంట్. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కలలుగన్నారు. వైఎస్సార్ మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు. ‘‘రూ.8,800 కోట్లతో 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాంట్ రావడం కోసం కష్టాపడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. స్టీల్ ప్లాంట్‌వస్తే ఈ ప్రాంతం స్టీల్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటి సరఫరా అవుతుంది. తొలి విడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది’’ అని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ చూపిన బాటలో సీఎం జగన్: సజ్జన్ జిందాల్ మహానేత వైఎస్సార్ తనకు మంచి మిత్రులు, గురువు అని సజ్జన్ జిందాల్ అన్నారు. ఏపీకి సంబంధించి వైఎస్సార్ ఎన్నో విషయాలు చెప్పారన్నారు. సీఎం జగన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని సజ్జన్ జిందాల్ అన్నారు. వైఎస్సార్ కన్న కలను సీఎం జగన్ నెరవేర్చారు: మంత్రి అమర్నాథ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టించారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిపై కొందరు కుయుక్తులు పన్నారన్నారు. వైఎస్సార్ కన్న కలను సీఎం జగన్ నెరవేర్చారని, వైఎస్సార్ జిల్లా కూడా ఉక్కు నగరంగా మారబోతుందని మంత్రి అమర్నాథ్ అన్నారు. ప్రజల కల సాకారం.. గర్వంగా ఉంది: ఎంపీ అవినాష్‌రెడ్డి.. రాయలసీమ ప్రజల కల సాకారమవుతోందని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను జగనన్న ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. వేల మందికి ఉపాధి దొరుకుతుండటం గర్వంగా ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగనుందని, స్టీల్ ప్లాంట్ ద్వారా జిల్లా ముఖచిత్రం మారబోతుందని అవినాష్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ రోజు శుభదినం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి రాష్ట్ర చరిత్రలోనే ఈ రోజు శుభదినమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ కృషితో జిల్లా ప్రజల కల నెరవేరుతుందన్నారు. సాక్షి,అమరావతి: వైఎస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. అనంతరం స్టీల్‌ప్లాంట్ నమూనాను సీఎం పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. పులివెందుల ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మూలి బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చిరకాల స్వప్నం నెరవేరే రోజు ►రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే రోజు ఆసన్నమైంది. కడప సిగలో మరో కలికితురాయి వచ్చి చేరుతోంది. తన రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలిచిన ప్రాంతం శాశ్వత అభివృద్ధి చెందాలనే సంకల్పం మొగ్గ తొడుగుతోంది. నిరుద్యోగాన్ని పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు. తొలివిడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద భూమి పూజ చేశారు. ►కడప గడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని విభజన చట్టంలో పొందుపర్చారు. తద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంకల్పించారు. అలాగే అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభిస్తుందని భావించారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. అయితే ఎన్నికలకు ముందు 2018లో ఓ పునాది రాయితో చంద్రబాబు సర్కార్ సరిపెట్టింది. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ నిర్మించాలనే ఆశయాన్ని భుజానికెత్తుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. కాగా 2020 ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలమైంది. ప్రజలు బతుకు జీవుడా అంటూ తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండేళ్ల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగడం వల్ల తక్షణ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారిందని నిపుణులు వివరిస్తున్నారు. జేఎస్‌డబ్ల్యు స్టీల్స్ లిమిటెడ్చే భూమి పూజ.. చెప్పిన మాట ప్రకారం జేఎస్‌డబ్లు్య స్టీల్స్ లిమిటెడ్ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబర్లో జిల్లా పర్యటన సందర్భంగా జేఎస్‌డబ్లు్య స్టీల్స్ లిమిటెడ్ ద్వారా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 751 ద్వారా ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్ టన్నులు (10లక్షల టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జేఎస్‌డబ్లు్య సిద్ధమైంది. అందుకోసం ఫేజ్–1లో రూ.3,300 కోట్లు వెచ్చించి, 36 నెలల కాలపరిమితిలో ఫేజ్–1 పనులు పూర్తి కానున్నాయి. తొలివిడత ప్లాంట్‌లో వైర్ రాడ్స్, బార్ మిల్స్ ఉత్పత్తి చేయనున్నారు. మరో రూ.5,500 కోట్లతో ఫేజ్–2 నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఫేజ్–2 సైతం మార్చి 31, 2029 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు వెచ్చిస్తోంది. నాలుగులేన్ల రహదారి, రైల్వే కనెక్టివిటీ, నీటి వసతి కోసం పైపు లైన్ ఏర్పాటు, నిల్వ చేసుకునేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, విద్యుత్ సరఫరా, కాంపౌండ్ వాల్, భవన సముదాయం నిర్మించనున్నారు. అందులోభాగంగా ఎన్‌హెచ్–67 నుంచి ముద్దనూరు టు జమ్మలమడుగు రోడ్డుకు అనుసంధానంగా రూ.145.3 కోట్ల తో 12 కిలోమీటర్లు నాలుగు లేన్ల రహదారి నిర్మించనున్నారు. అలాగే ఎర్రగుంట్ల టు ప్రొద్దుటూరు రైల్వేలైన్ నుంచి రూ.323.5 కోట్లతో 9.4 కిలో మీటర్లు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టనున్నారు. మైలవరం జలాశయం నుంచి 2 టీఎంసీల నీరు సరఫరా చేయనున్నారు. అందుకోసం 15 కిలోమీటర్లు పైపులైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే విద్యుత్ సరఫరాకు కావాల్సిన చర్యలు పూర్తి అయ్యాయి. రూ.76.42 కోట్లతో 27 కిలోమీటర్ల మేరకు విద్యుత్ లైన్ ఏర్పాటు, 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘బయ్యారం స్టీల్’పై కేసీఆర్‌వి అబద్ధాలు: సంజయ్
సాక్షి, హైదరాబాద్ /ఖైరతాబాద్: బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో అబద్ధాలు చెప్పి మోసం చేసినందుకు ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇటీవల డీజీపీ ఆఫీస్ ముట్టడిలో గాయపడ్డ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ను సోమవారం గ్లోబల్ ఆసుపత్రిలో సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బయ్యారంపై డీపీఆర్ ఇవ్వాలన్న తమ లేఖకు మూడున్నరేళ్లుగా స్పందనే లేదని కేంద్రం స్పష్టం చేసినందున ఇప్పుడు కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ‘బడ్జెట్ ఫైల్‌కు మూడురోజులుగా గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడం లేదని కోర్టుకెక్కిన కేసీఆర్... ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఫైల్‌ను ఏళ్ల తరబడి అసెంబ్లీ స్పీకర్ పెండింగ్‌లో పెడితే ఎందుకు మాట్లాడటం లేదు?’అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో సర్పంచ్‌లు కూడా ఆత్మహత్యలు చేసు కునే దుస్థితి ఏర్పడిందన్నారు. కాగా, కేసీఆర్ కుటుంబసభ్యులు తాము నిజాం రాజులమనిæ అనుకుంటున్నారని, వారు ఏ ప్రాంతానికి వెళ్లినా ముందస్తు అరెస్టులు చేయిస్తున్నారని సంజయ్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. మంగళవారం మంత్రి కేటీఆర్ కమలాపూర్ పర్యటన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోని బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన రొమాంటిక్ జంట.. రెండు గంటల్లోనే!
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్ రహదారిలో ఓ జంట పట్టపగలు రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు మరో యువతిని బైక్ ట్యాంక్‌పై కూర్చొపెట్టుకుని రయ్రయ్ అంటూ దూసుకుపోయారు. ఈ దృశ్యాలను పక్కనే కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. దీంతో పట్టపగలు బరితెగించిన ఈ యువజంట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో గాజువాక సమీప ప్రాంతాలకు చెందిన బైక్ నడిపిన అజయ్ కుమార్, యువతిని సంఘటన జరిగిన రెండు గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు స్టీల్ ప్లాంట్ సీఐ వి శ్రీనివాస్‌రావు తెలిపారు. యువకుడి బైక్ సీజ్ చేశామని, న్యూసెన్స్, ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’ -
ఏపీలో రూ.350 కోట్లతో ఆర్జాస్ స్టీల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగంలో ఉన్న ఆర్జాస్ స్టీల్ (గతంలో జెర్డావ్ స్టీల్) రెండు ప్లాంట్లను విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్లాంటు సామర్థ్యాన్ని 25–30 శాతం పెంచుతోంది. ఇందుకోసం రూ.350 కోట్లు పెట్టుబడి చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులు. నాణ్యతను మెరుగుపరిచేందుకు జర్మనీ నుంచి కాక్స్ సైజింగ్ బ్లాక్‌తోపాటు కాయిల్ రూపంలో ప్రత్యేక స్టీల్ ఉత్పత్తికై గ్యారెట్ కాయిలర్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త స్టవ్‌ల స్థాపనతోసహా స్టీల్ శుద్ధి సామర్థ్యం పెంచుతున్నారు. అలాగే పంజాబ్‌లోని మండి గోవింద్ఘర్ ప్లాంటు వార్షిక సామర్థ్యం ప్రస్తుతం ఒక లక్ష టన్నులు. దీనికి రూ.260 కోట్ల వ్యయంతో 60–70 శాతం సామర్థ్యం జోడిస్తున్నారు. మొత్తం ఈ రెండు ప్లాంట్లకుగాను రూ.610 కోట్ల పెట్టుబడి చేస్తుండగా.. సామర్థ్యం 5.5 లక్షల టన్నులకు చేరనుంది. 2025 నాటికి ఈ విస్తరణ పూర్తి అవుతుందని ఆర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తి వెల్లడించారు. వాహన రంగానికి అవసరమైన ప్రత్యేక స్టీల్ రెండు ప్లాంట్లలోనూ తయారవుతోంది. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలకు వీటిని కంపెనీ సరఫరా చేస్తోంది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
విశాఖలో ఉక్కు ఉద్యమం ప్రజా వేదిక..
-
బ్లూ స్టీల్ తయారీపై దృష్టి
చెన్నై: బ్లూ స్టీల్‌ను తయారు చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు నగరానికి చెందిన సుమంగళ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ రాజేంద్రన్ సబానాయగం తెలిపారు. శనివారం నగరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడున్నర దశాబ్దాలుగా ఉక్కు తయారీలో ప్రత్యేకతను చాటుకుంటున్నామని అన్నారు. పుదుచ్చేరిలోని తమ ప్లాంట్‌లో బ్లూ స్టీల్‌ను తయారు చేయడానికి ఆధునిక స్క్రాప్ ష్రెడర్, థర్మో మెకానికల్ ట్రీట్మెంట్ ఫినిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఇందు కోసం రూ.25 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.679 కోట్లు టర్నోవర్ నమోదు చేశామని.. ఈ ఏడాది రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరనున్నట్లు వివరించారు. సంస్థ ప్రెసిడెంట్ అశ్విన్ పాల్గొన్నారు. చదవండి: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఈ బెల్టు ట్రై చేయండి, వెంటనే ఉపశమనం! -
భద్రావతి స్టీలు ప్లాంటుకు బిడ్లు కరువు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ సెయిల్‌కు చెందిన భద్రావతి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రభుత్వం ఉప సంహరించింది. తగినంత స్థాయిలో బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తం కాకపోవడమే ఇందుకు కారణం. కర్ణాటకలోని భద్రావతిలో ఉన్న విశ్వేశ్వరాయ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంటు (వీఐఎస్‌పీ)లో సెయిల్‌కి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించేందుకు 2019 జులైలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించారు. దీనికి స్పందనగా పలు ఈవోఐలు వచ్చాయని, సంస్థ వివరాలను బిడ్డర్లు మదింపు కూడా చేశారని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపం వెల్లడించింది. అయినప్పటికీ ఈ విషయంలో ముందుకెళ్లేందుకు అవసరమైనంత స్థాయిలో బిడ్డర్లు ఆసక్తి చూపలేదని పేర్కొంది. దీంతో ప్రత్యామ్నాయ మెకానిజం (సాధికారిక మంత్రుల బృందం) ఆమోదం మేరకు ఈవోఐని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దీపం వివరించింది. -
కొత్త స్టీల్ ప్లాంట్లు లేనట్టే: ఎన్ఎండీసీ
న్యూఢిల్లీ: కొత్త ఉక్కు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు లేనట్టేనని మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేవ్ తెలిపారు. ఖనిజాల అన్వేషణపైనే దృష్టిసారిస్తామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్మాణంలో ఉన్న 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను వ్యూహాత్మక కొనుగోలుదారుకు విక్రయించిన తర్వాత ఎన్ఎండీసీ ఉక్కు రంగంలో తన ఆసక్తిని కొనసాగిస్తుందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఇనుము ధాతువు ఉత్పత్తి 2030 నాటికి 100 మిలియన్ టన్నుల స్థాయికి చేర్చాలన్నది సంస్థ లక్ష్యం. 2021–22లో 42 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది. అంత క్రితం ఏడాదిలో ఇది 34 మిలియన్ టన్నులు. ఎన్ఎండీసీ భారత్‌తోపాటు ప్రపంచ స్థాయిలో బలమైన మైనింగ్ కంపెనీగా తన స్థానాన్ని పెంపొందించుకుంటుంది. స్టీల్ అనేది కంపెనీ ప్రాధాన్యత కాదు. నాగర్నార్ స్టీల్ ప్లాంట్ విలీనం ప్రస్తుత త్రైమాసికంలోనే కార్యరూపం దాల్చనుంది. స్టీల్ ప్లాంటులో కార్యకలాపాలు సెప్టెంబర్ చివరినాటికి ప్రారంభం అవుతాయి’ అని వివరించారు. -
నాగర్నార్ స్టీల్‌విడదీతకు ఓకే
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎన్ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నార్ స్టీల్ ప్లాంటు(ఎన్ఎస్పీ)ను విడదీసేందుకు వాటాదారులు, రుణదాతలు అనుమతించినట్లు కంపెనీ సీఎండీ సుమిత్ దేవ్ తాజాగా వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా స్టీల్ శాఖ ఎన్ఎండీసీ వాటాదారులు, రుణదాతలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. తద్వారా ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీ విడదీతకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలియజేశారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు దగ్గర్లోగల నాగర్నార్లో ఎన్ఎండీసీ 3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూ. 23,140 కోట్ల అంచనా వ్యయాలతో 1,980 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంటును నెలకొల్పుతోంది. 2020 అక్టోబర్‌లో ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విడదీసేందుకు కేం్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఎన్ఎస్పీ ప్రత్యేక కంపెనీగా విడివడనుంది. తదుపరి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికిగల పూర్తి వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుకి విక్రయించనున్నారు. -
ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీ విడదీత
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఎన్ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నర్ స్టీల్ ప్లాంటు(ఎన్ఎస్పీ)ను విడదీసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్టీల్ శాఖ తాజాగా వెల్లడించింది. విలీన ప్రక్రియను వేగవంతం చేసే బాటలో కంపెనీకి చెందిన వాటాదారులు, రుణదాతలతో నేడు(7న) సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్ఎస్పీని పూర్తిస్థాయిలో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్రం ఉన్నట్లు ఒక అధికారిక ప్రతిలో స్టీల్ శాఖ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ సమీపంలో 3 మిలియన్ టన్నుల వార్షిక(ఎంటీపీఏ) సామర్థ్యంతో ఎన్ఎస్పీ ఏర్పాటవుతోంది. 1,980 ఎకరాలలో యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకు రూ. 23,140 కోట్లు వెచ్చిస్తున్నట్లు అంచనా. ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విడదీసేందుకు 2020 అక్టోబర్‌లో కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. తద్వారా కంపెనీలో కేంద్రానికున్న మొత్తం వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుడికి విక్రయించనుంది. మంగళవారం నిర్వహించనున్న సమావేశాలకు స్టీల్ శాఖ అదనపు కార్యదర్శి రాశికా చౌబే అధ్యక్షత వహించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం నీరసించి రూ. 125 వద్ద ముగిసింది. -
Ukraine Crisis: యుద్ధం ముగిసింది.. రష్యా సంచలన ప్రకటన
లండన్: ఉక్రెయిన్‌లోని జైటోమిర్ ప్రాంతంలో భారీ సంఖ్యలో పశ్చిమ దేశాల ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సైన్యం శనివారం ప్రకటించింది. సముద్ర ఉపరితలం నుంచి ప్రయోగించే క్యాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్లతో ఆ ఆయుధాలను అగ్నికి ఆహుతి చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతోపాటు యూరప్ దేశాల నుంచి ఈ ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరాయని వెల్లడించింది. డోన్బాస్లో రష్యా సేనలను ఎదుర్కొనడానికే వీటిని ఉక్రెయిన్ సిద్ధం చేసుకుందని తెలిపింది. పలుచోట్ల ఉక్రెయిన్ సైనిక పోస్టులను ధ్వంసం చేశామనిపేర్కొంది. ఫిన్లాండ్కు రష్యా గ్యాస్ నిలిపివేత హెల్సింకీ: నాటో కూటమిలో చేరేందుకు ఉత్సాహంగా అడుగులు ముందుకేస్తున్న ఫిన్లాండ్కు రష్యా గట్టి షాకిచ్చింది. శనివారం ఫిన్లాండ్కు గ్యాస్ ఎగుమతులను నిలిపివేసింది. దీంతో రష్యా నుంచి ఫిన్లాండ్కు గత 50 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న గ్యాస్ సరఫరా ఆగిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7 గంటలకు రష్యా నుంచి సహజ వాయువు సరఫరా నిలిచిపోయినట్లు ఫిన్లాండ్ ప్రభుత్వ రంగంలోని గాసూమ్ గ్యాస్ కంపెనీ ప్రకటించింది. తమ దేశం నుంచి గ్యాస్ దిగుమతి చేసుకొనే దేశాలన్నీ డాలర్లలో కాకుండా రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్ చేశారు. కానీ, ఫిన్లాండ్నిరాకరించింది. ఫిన్లాండ్కు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని రష్యా ఇప్పటికే నిర్ణయించుకుంది. రష్యాతో ఫిన్లాండ్కు 1,340 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నాటోలో చేరాలన్న ఫిన్లాండ్ ఆకాంక్షను రష్యా వ్యతిరేకిస్తోంది. ‘40 బిలియన్ డాలర్ల’ బిల్లుపై బైడెన్ సంతకం రష్యా దాడుల వల్ల సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు అమెరికా అందించనున్న 40 మిలియన్ డాలర్లకు పైగా సాయానికి సంబంధించిన బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ శనివారం సంతకం చేశారు. సియోల్‌లో పర్యటిస్తున్న బైడెన్ వద్దకు బిల్లు కాపీని అధికారులు విమానంలో అమెరికా నుంచి ఆగమేఘాలపై తీసుకొచ్చారు. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయే అవకాశం లేదని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అమెరికా సర్కారు ఉక్రెయిన్‌కు ఇప్పటికే 13.6 బిలియన్ డాలర్ల సాయం అందించింది. కొత్త బిల్లులో భాగంగా 20 బిలియన్ డాలర్ల తోడ్పాటును సైనిక, ఆయుధ రూపంలో ఇవ్వనుంది. రష్యా దాడులను ఉక్రెయిన్ దళాలు సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ సాయం దోహదపడనుందని అమెరికా భావిస్తోంది. అలాగే 8 బిలియన్ డాలర్ల సాధారణ సాయం, ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు 5 బిలియన్ డాలర్లు, శరణార్థుల కోసం బిలియన్ డాలర్లను ఇవ్వనుంది. మాపై అత్యాచారాలు ఆపండి: కేన్స్ ఫెస్టివల్లో మహిళ అర్ధనగ్న నిరసన ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో శుక్రవారం సాయంత్రం అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల దాష్టీకాలను వ్యతిరేకిస్తూ ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. రెడ్‌కార్పెట్‌పైకి చేరుకోగానే ఒంటిపై బట్టలు విప్పేసింది. తన శరీరంపై ఉక్రెయిన్ జాతీయ పతాకం పెయింటింగ్‌తోపాటు ‘మాపై అత్యాచారాలు ఆపండి’ అని రాసి ఉన్న ఆక్షరాలను ప్రదర్శించింది. మహిళ శరీరంపై కేవలం ఎరుపు రంగు లో దుస్తులు మాత్రమే ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఫిలిం ఫెస్టివల్లో స్వల్ప అంతరాయం కలిగింది. ⚡️🇷🇸 #Serbia imposed sanctions against #Belarus The country joined the #EU on the issue of restrictions due to the war in #Ukraine. The sanctions are directed against the financial and transport system of Belarus. pic.twitter.com/bmDyiTRxfj — NEXTA (@nexta_tv) May 20, 2022 ఇది కూడా చదవండి: దుస్తులు విప్పేసి ఉక్రెయిన్ మహిళ నిరసన.. వీడియో వైరల్ -
Russia-Ukraine war: తూర్పున దాడి ఉధృతం
ఇర్పిన్: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్‌వైపు మరలించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు కీలకమైన పరిశ్రమలున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని రష్యా భావిస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో రష్యా కాల్పులు అధికమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మారియుపోల్‌లో ఇప్పటికీ ఉంటున్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ నగరంలోని స్టీల్‌ప్లాంట్‌పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో ఐరాస చీఫ్ గుటెరస్ పర్యటన కొనసాగుతోంది. యుద్ధంలో అధిక మూల్యం చెల్లించేది చివరకు సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధనేరాల గురించి మాట్లాడాల్సివస్తే, అసలు యుద్ధమే నేరమని చెప్పాలన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగిస్తామని బల్గేరియా కొత్త ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో పేలుళ్లు జరిగాయని రష్యా తెలిపింది. పోరు కొనసాగించేందుకు తమకు మరిన్ని ఆయుధాలందించాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరింది. నాటో సాయం 800 కోట్ల డాలర్లు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు దాదాపు 800 కోట్ల డాలర్ల సాయం అందించాయని నాటో చీఫ్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాటోలో చేరాలనుకుంటే ఫిన్లాండ్, స్వీడన్‌ను సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. రష్యాతో యుద్ధం సంవత్సరాలు కొనసాగినా, తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. కొత్త శతాబ్దిలో యుద్ధాలు ఆమోదయోగ్యం కావని ఐరాస చీఫ్ గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధంలో నేరాలపై ఐసీసీతో విచారణకు తాను మద్దతిస్తానన్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను ఆదివారం రష్యా తీవ్రతరం చేసింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లో పేలుడు పదార్థాలు, మందుగుండు పౌడర్ తయారీ కంపెనీపై అత్యాధునిక మిసైళ్లు ప్రయోగించినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. ఖర్కీవ్ ప్రాంతంలోని బర్వింకోవ్, నోవా ద్మిత్రివ్కా, ఇవనివ్కా, హుతలరివ్కా, వెల్యికాల్లో పలు ఆయుధాగారాలపైనా భారీగా దాడులు చేసినట్టు వివరించారు. 26 ఉక్రెయిన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. మారియుపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై గగనతల దాడులకు దిగింది. తూర్పున డోన్బాస్లో లుహాన్స్క్ ప్రాంతంలోని పొపాస్నా, సివెరోడొనెట్స్క్, డొనెట్స్క్ ప్రాంతంలోని కురఖీవ్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమ డోన్బాస్లోని ద్నిప్రోలోనూ బాంబు దాడులు జరిగాయి. చెడుపై అంతిమంగా మంచి గెలిచి తీరుతుందని, ఈ వాస్తవం రష్యాకు త్వరలో తెలిసొస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. మరణాన్ని జీవనం, చీకటిని వెలుతురు అధిగమిస్తాయని దేశ ప్రజలకిచ్చిన ఈస్టర్ సందేశంలో చెప్పారు. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్‌లతో భేటీ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి
-
ఉక్రెయిన్‌కు ఊహించని షాక్.. కోలుకోలేని దెబ్బకొట్టిన పుతిన్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. 25 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో పుతిన్ సేనల ధాటికి ఉక్రెయిన్ విలవిలాడుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ఇప్పటికే భారీగా నష్టపోయింది. ఉక్రెయిన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దాడుల కారణంగా పలు నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉక్రేనీయులు నిరాశ్రయులయ్యారు. తాజాగా భీకర దాడుల్లో ఉక్రెయిన్‌లోని అజోవ్స్తాల్లో ఉన్న అతిపెద్ద ఐరన్, స్టీల్ ప్లాంట్ ధ్వంసమైంది. ఇది యూరప్‌లోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్. ఈ ఘటనలో ఉక్రెయిన్‌కు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆ దేశ ఎంపీ లీసియా వ్యాసిలెన్కో ట్విట్టర్ వేదికగా తెలిపారు. స్టీల్ ప్లాంట్ ధ్వంసమైన కారణంగా పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నట్టు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మెటిన్‌వెస్ట్ గ్రూప్‌కు చెందిన అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్, ఉక్రెయిన్‌లోని అత్యంత ధనవంతుడైన రినాట్ అఖ్మెటోవ్ ఆధీనంలో ఉంది. మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను రష్యా దళాలు ధ్వంసం చేయడంపై అజోవ్‌స్టాల్ డైరెక్టర్ జనరల్ ఎన్వర్ స్కిటిష్విలి స్పందిస్తూ.. తాము నగరానికి తిరిగి వచ్చిన తర్వాత ఉక్కు కర్మాగారాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. అయితే దాడుల వల్ల ఉక్కు పరిశ్రమకు ఎంత నష్టం వాటిల్లిందో వెల్లడించలేదు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించినప్పుడే పర్యావరణం దెబ్బతినకుండా ఉక్కు పరిశ్రమలో జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. #Mariupol #Azovstal One of the biggest metallurgic plants in #Europe destroyed. The economic losses for #Ukraine are huge. The environment is devastated #StopRussiaNOW pic.twitter.com/4GMbkYb0es — Lesia Vasylenko (@lesiavasylenko) March 19, 2022 మరోవైపు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కివ్, మరియుపోల్ సహా పలు ప్రధాన నగరాలపై రష్యన్ బలగాలు మరింత విరుచుకుపడుతున్నాయి. కాగా, మరియుపోల్‌లోని ఆర్ట్ స్కూల్‌పై రష్యా దళాలు బాంబు దాడి చేశాయని, అక్కడ దాదాపు 400 మంది నివాసితులు ఆశ్రయం పొందారని సిటీ కౌన్సిల్ ఆదివారం తెలిపింది. ఈ దాడుల్లో భవనం ధ్వంసమైందని, శిథిలాల కింద బాధితులు ఉన్నారని కౌన్సిల్ పేర్కొన్నప్పటికీ, శనివారం జరిగిన దాడిలో ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. తాజాగా 18 నగరాలపై రష్యా సైనం దాడులు జరుపవచ్చనే సమాచారంలో ఉక్రెయిన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. -
ఉక్కు హామీకి తుప్పు పట్టిందా..!
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కిన బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణం హామీని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెడుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. నిండు పార్లమెంట్లో ఒప్పుకున్న నిర్ణయాన్ని మోదీ సర్కారు తుంగలో తొక్కుతోందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన విభజన హామీ ప్రకారం ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’అని గుర్తు చేశారు. ఉక్కు కర్మాగారం విష యంలో కేంద్రం వైఖరిని ఎండగడుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్‌కు కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఉసురు తీసిన కేంద్రం.. బయ్యారంలో మొదలుకాకుండానే ఉక్కును తుప్పుగా చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్లాంట్ ఏర్పాటులో తాము భాగమవుతామన్నా స్పందించట్లేదని మండిపడ్డారు. పీఎంకు, కేంద్ర మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా.. దేశంలోని ఇనుప ఖనిజ నిల్వల్లో 11 శాతం బయ్యారంలోనే ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. సుమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు బయ్యారంలో ఉన్నాయన్న ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)’సర్వే నివేదికను ప్రస్తావిస్తూ నాణ్యమైన ఐరన్ ఓర్ బయ్యారంలో లేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. బయ్యారంలో లేకపోతే అక్కడి నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్లాలో గనులు కేటాయించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడి నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ రవాణాకు ఓ స్లర్రి పైపులైన్ లేదా రైల్వే లైన్ వేస్తే సరిపోతుందని ప్రధాని మోదీని కలిసి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఖనిజ రవాణా వ్యయంలో భాగమయ్యేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉన్నట్టు హమీ ఇచ్చినా మోదీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. తానూ పలు మార్లు కేంద్ర మంత్రులను కలసి ప్లాంట్ కోసం ప్రయత్నం చేసినా స్పందన రాలేదని విమర్శించారు. పెల్లెటైజేషన్ ప్లాంటైనా పెట్టాలని కోరాం ఛత్తీస్‌గఢ్ నుంచి బయ్యారం ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు 2016లోనే ఎన్ఎండీసీ అంగీకరించిందని కేటీఆర్ గుర్తు చేశారు. మెటలర్జికల్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ (మేకాన్) సంస్థ ఖమ్మం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసి పెల్లెటైజేషన్ ప్లాంట్, స్క్రాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సానుకూల నివేదిక ఇచ్చిందన్నారు. ఎన్ఎండీసీ, సింగరేణి కాలరీస్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సానుకూలంగా ఉన్నా కేంద్రం మాత్రం ప్లాంట్ ఏర్పాటును పక్కనబెడుతోందని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రస్తుతం వీలు కాకుంటే తాత్కాలికంగా పెల్లెటైజేషన్ ప్లాంట్ పెట్టి స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కేంద్రాన్ని కోరామన్నారు. కిషన్‌రెడ్డి.. ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదంటారా? ఉక్కు పరిశ్రమపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనతో పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రానిది ‘తుక్కు సంకల్పమే’నని తేలిపోయిందని కేటీఆర్ విమర్శించారు. స్టీల్ ఫ్యాక్టరీని సాధించాల్సిన కేంద్ర మంత్రే ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని చేతులేత్తేయడం సిగ్గుచేటన్నారు. కిషన్ రెడ్డి మాటలు వ్యక్తిగతమా లేక కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమా తెలపాలని డిమాండ్ చేశారు. ప్లాంట్‌తో తమకు ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న వేలాది మంది గిరిజన, అదివాసీ యువకుల ఆశలకు కిషన్‌రెడ్డి ఉరేశారని విమర్శించారు. సెయిల్ ఆధ్వర్యంలోని పాత ప్లాంట్లకు రూ. 71వేల కోట్లు ‘బయ్యారం ప్లాంట్ గురించి పట్టించుకోని కేంద్రం.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యంలోని రూర్కెలా, బర్న్‌పూర్, దుర్గాపూర్ బొకారో, సాలెం ప్లాంట్ల విస్తరణ, ఆధునికీకరణ, గనుల కోసం దాదాపు రూ. 71 వేల కోట్లను ఖర్చు చేసింది. పాత కర్మాగారాల ఆధునికీకరణ ఆహ్వానించదగ్గదే అయినా.. రూ. వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశాక సెయిల్‌ను అప్పనంగా అమ్మేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’అని కేటీఆర్ ఆరోపించారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన సెగలు
-
పోస్కోతో అదానీ గ్రూప్ జత
న్యూఢిల్లీ: స్టీల్, పునరుత్పాదక ఇంధన విభాగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు వీలుగా దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై రెండు సంస్థల ప్రతినిధులూ సంతకాలు చేశారు. ఎంవోయూ ద్వారా రానున్న కాలంలో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే అవకాశమున్నట్లు అదానీ గ్రూప్ ఈ సందర్భంగా వెల్లడించింది. గుజరాత్‌లోని ముంద్రాలో కొత్తగా పర్యావరణ అనుకూల స్టీల్ ప్లాంటు ఏర్పాటు, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, లాజిస్టిక్స్ తదితర రంగాలలో వ్యాపార అవకాశాల అన్వేషణలో పరస్పర సహకారం వంటి అంశాలపై తప్పనిసరికాని ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. కర్బనాల తగ్గింపు అవసరాల రీత్యా వివిధ రంగాలలో పెట్టుబడులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా సహకారం, సాంకేతికత, ఆర్థిక అంశాలతోపాటు రెండు కంపెనీలకూ ఉన్న నిర్వహణ సామర్థ్యం తదితరాలలో పరస్పర సహకారానికున్న అవకాశాలను పరిశీలించనున్నట్లు వివరించింది. అదానీ గ్రూప్ ఇటీవల పెట్రోకెమికల్స్, హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు, స్టీల్ తయారీలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన నేపథ్యంలో తాజా ఎంవోయూకు ప్రాధాన్యత ఏర్పడింది! బలాల వినియోగం పోస్కో, అదానీ గ్రూప్లకుగల పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన కట్టుబాట్ల కొనసాగింపునకు అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్ తదితరాలను వినియోగించుకునే యోచనలో ఉన్నాయి. స్టీల్, పర్యావరణహిత బిజినెస్‌లలో రెండు సంస్థల మధ్య గొప్ప సమన్వయానికి వీలున్నట్లు పోస్కో సీఈవో జియోంగ్ వూ చోయ్ పేర్కొన్నారు. తమ రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం దేశీ తయారీ రంగ వృద్ధికి సహకరించగలదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలియజేశారు. -
‘విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయలేను’
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయలేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. ప్రజలే ముందుండి పోరాటం చేయాలని, తాను వెనుక ఉంటానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ‘గతంలో తాను పోరాటం చేస్తే ఎవరూ మద్దతు ఇవ్వలేదు. పోరాటం చేయడం వల్లనే కేంద్రంలో ఉన్న పెద్దలకు శత్రువునయ్యా. ప్రజలే పోరాటం చేయాలి.. వారి వెనుక నేను నిలబడతా’ అని దాటవేత ధోరణి ప్రదర్శించారు. చదవండి: ‘రాజకీయ లబ్ధికోసమే కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు’ -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గతంలో పవన్ కళ్యాణ్ స్పందన