సాక్షి,విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వందలాది స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల్ని.. కాంట్రాక్ట్ ఉద్యోగులు అడ్డుకున్నారు.
స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్‌లైన్ గేటు పాసులను నిలిపివేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించారు.
స్టీల్‌ప్లాంట్‌లో అర్ధరాత్రి రాత్రి వరకు నిరసన చేపట్టారు. ఈడీ వర్క్స్ బిల్డింగ్‌లో సుమారు 200 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కార్మికులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నట్లు హెచ్చరించారు.
మరోవైపు మా పొట్టకొట్టొద్దని 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంపై ఆందోళన చేస్తున్నా.. కూటమి నేతలు స్పందించలేదని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment