management
-
Sunita Williams అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
ఋతుక్రమం లేదా పీరియడ్స్‌ను భరించడం, ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఉండటం సాధారణ మహిళలు లేదా అమ్మాయిలకే చాలా కష్టం. ముఖ్యంగా ఉద్యోగినులు, విద్యార్థినులకు ఇది ఇంకా కష్టం. మూడు రోజుల శారీరక బాధలతోపాటు, డ్రెస్‌కు ఏదైనా మరకలు ఉన్నాయా చూడవే బాబూ.. అని తోటి ఫ్రెండ్స్‌ను అడగడం మొదలు, ప్యాడ్ మార్చుకోవడానికి రిమైండర్లను సెట్ చేసుకోవడం, పగలు వినియోగానికి ఒక రకం, రాత్రి వినియోగానికి మరో రకం ప్యాడ్స్‌ను ఎంచుకోవడం, మంచంపైన దుప్పటికి మరకలైతే, అమ్మ తిడుతుందేమోనన్న భయం వరకు ఇలా చాలానే ఉంటాయి. ఆకాశమే హద్దు అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతరిక్షంలో కూడా అడుగు పెట్టారు. మరి అంతరిక్షంలో మహిళా వ్యోమగాములకు పీరియడ్స్ వస్తాయా? వస్తే ఎలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలో చిక్కుకున్న నాసా( NASA) వ్యోమగామి సునీతా విలియం (Sunita Williams) బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. కేవలం ఎనిమిది రోజులు అనుకున్న ఈ ప్రయాణం తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరి సునీతా విలియమ్స్ లాంటి మహిళలు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్‌ను ఎలా మేనేజ్ చేశారు అనేది సందేహం కలుగక మానదు. గ్లాస్ సీలింగ్స్‌ను బ్రేక్ చేస్తూ మహిళలు అంతరిక్షం వెళ్లాలనుకున్నపుడు వచ్చిన మొదటి సవాల్ ఇదే.హార్మోన్ల మార్పులు, సూక్ష్మ గురుత్వాకర్షణ (Microgravity) ప్రభావాలు చర్చకు వచ్చాయి. మార్గదర్శక మహిళా వ్యోమగాములలో ఒకరైన రియా సెడాన్, అసలు ఇది సమస్యే కాదని వాదించారు. అలా మహిళలు సాహసయాత్రకు పూనుకున్నారు.Astronaut Periods: అలా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ వాలెంటినా తెరేష్కోవా. ఇది 1963లో జరిగింది. అప్పటి నుండి మరో 99 మంది ఆమె అడుగుజాడలనుఅనుసరించి అతరిక్షంలోకి ప్రయాణించారు. అయితే పీరియడ్స్ విషయంలో రేకెత్తిన అన్ని ఆందోళనలకు, ఊహాగానాలకు విరుద్ధంగా మహిళా వ్యోమగాములకు అంతరిక్షంలో కూడా సాధారణంగానే పీరియడ్స్ వస్తాయి. ఋతుస్రావం భూమిపై ఉన్నట్లే సాధారణంగా పనిచేస్తుంది. వారు భూమిపై ఉన్న మాదిరిగానే ప్రామాణిక శానిటరీ, పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగిస్తారు , అవి అంతరిక్షంలో ప్రభావవంతంగా ఉంటాయి కూడా.చదవండి : ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టుమహిళల అంతరిక్ష యాత్రలో ఉన్నపుడు పీరియడ్స్ సమస్యలొస్తాయని రక్తం గాల్లో తేలుతుందని, హార్మోన్ల సమస్య వస్తుందని భయపడ్డారు. స్త్రీలు ఋతుస్రావం కావాలని ఆపితే తప్ప, ఈ ప్రక్రియ అంతరిక్షంలో సాధారణంగా జరుగుతుందని వాస్తవ అనుభవాల ద్వారా తేలింది. అయితే పీరియడ్స్ వాయిదా వేసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది. మహిళా వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్లూ నెలసరిని వాయిదా వేసుకుంటారు. పీరియడ్స్ రాకుండా హార్మోన్ల మాత్రలు(Birth control pills) వంటి గర్భనిరోధకాల (Hormonal contraceptives)ను ఎంచుకుంటారు. అయితే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని సైంటిస్టుల మాట. పైగా అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు స్త్రీపురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భనిరోధక మాత్రల్లోని ఈస్ట్రోజెన్ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని అంటున్నారు. అంతేకాదు ఎక్కువ కాలం అంతరిక్ష ప్రయాణాలకు వీటిని రికమెండ్ చేస్తున్నారు. తద్వారా శానిటరీ ప్యాడ్స్ వాడకం, నీరు ఆదా అవుతాయి. శుభ్రత కూడా సులభవుతుంది. అలా కాని పక్షంలో నెలసరిని ఆపకూడదు అనుకుంటే, భూమిపై ఎలా మేనేజ్ చేస్తారో, అంతరిక్షంలోనూ అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే పరిమితంగా లభించే నీరు, తక్కువ స్టోరేజీ స్పేస్ కారణంగా వ్యోమగాములు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సలాం మీకు!అయితే పీరియడ్స్ నిర్వహణలో మహిళా వ్యోమగాముల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. శ్యానిటరీ ఉత్పత్తుల అదనపు భారం, అలాగే భార రహిత స్థితిలో శ్యానిటరీ ఉత్పత్తులు మార్చుకోవడం అతి పెద్ద సవాలు అనడంలో ఎలాంటి సందేహంలేదు. దీనికి తోడు మూత్రాన్నే రీసైకిల్ చేసుకొని తాగే పరిస్థితులున్న రోదసిలో నీటి కొరత ఎంత సమస్యో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి అంతరిక్షంలోకి అడుగుపెట్టి, ఎన్నో విజయవంతమైన ప్రయోగాలకు, పరిశోధనలకు మూలమవుతున్న మహిళా వ్యోమగాములకు సలాం! ఇదీ చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్
-
కోపాన్ని దిగమింగినవాడే సిసలైన శూరుడు
కోపం మానవుల ఆగర్భ శతృవు. అది అనేక అనర్ధాలకు హేతువు. కోపం అభివృధ్ధి నిరోధకం. కోపంలో మనిషి తనపై తాను అదుపును కోల్పోతాడు. కోపంలో మనిషి దుర్భాషలాడతాడు. కొట్లాటకు దిగుతాడు. భార్యా బిడ్డలపై చేయి చేసుకుంటాడు. అసభ్య పదజాలం ప్రయోగిస్తాడు. చిన్నాపెద్దా వయోభేదాన్ని కూడా పాటించడు. కోపంలో మనిషి ఎవరి మాటా వినే పరిస్థితిలో ఉండడు. హత్యలు చేయవచ్చు. ఆత్మహత్యకూ పాల్పడవచ్చు. కోపస్థితిలో సరైన నిర్ణయం తీసుకోలేడు. క్షణికావేశానికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. రెప్పపాటులో చేసే ఆ చిన్న తప్పువల్ల జీవిత కాలానికి సరిపడా చేదు అనుభవాలు మిగిలినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.అసలు ఒకటనేమిటి? నేడు సమాజంలో జరుగుతున్న అనేక అనర్ధాలకు కోపమే కారణమంటే అతిశయోక్తికాదు. మరి ఈ కోపమనే శత్రువును పారద్రోలాలంటే ఏం చెయ్యాలి? దీనికి దైవప్రవక్త ముహమ్మద్ (స) ఒక ఉపాయం చెప్పారు. కోపం వచ్చినప్పుడు నియంత్రించుకోవాలంటే, మనిషి తాను ఉన్నచోటునుండి పక్కకు జరగాలి. అంటే ఆ చోటును వదిలేయాలి. నిలబడి ఉంటే కూర్చోవాలి. కూర్చొని ఉంటే పడుకోవాలి. ఇలా చేయడంవల్ల కోపం అదుపులోకొస్తుంది. అంతకూ ఇంకా కోపం తగ్గకపోతే, వజూ చేయాలి. అంటే నియమబద్ధంగా చేతులూ, ముఖమూ, కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే, ఆగ్రహం షైతాన్ ప్రేరణ వల్ల కలుగుతుంది. షైతాన్ సృజన అగ్నితో జరిగింది. అగ్ని నీటితో ఆరుతుంది. కనుక షైతాన్ ప్రేరణతో కలిగిన ఆగ్రహం చల్లారాలంటే నీటిని ఉపయోగించాలి. వజూచేయాలి. ఇలాచేస్తే తప్పకుండా కోపం మటుమాయమవుతుంది.వాస్తవానికి, కోపం రావడమన్నది మానవ సహజమే. మానవమాత్రులెవరూ దీనికి అతీతులు కాదు. కాని కోపంలో విచక్షణ కోల్పోకపోవడమే గొప్పతనం. కోపానికి లోనై జుట్టుపీక్కోవడం, చిర్రుబుర్రు లాడడం, అయిందానికీ, కానిదానికి ఎవరిపైబడితే వారిపై విరుచుకుపడడం, చేతిలో ఏముంటే అది విసిరి కొట్టడం, నోటికొచ్చినంత మాట్లాడడం, బూతులు లంకించుకోవడం ఇవన్నీ ఉన్మాదపు చేష్టలు. మానవ ఔన్యత్యానికి ఏ మాత్రం శోభించని లక్షణాలు. అసలు ఏకోశానా ఇది వీరత్వమూకాదు, ధీరత్వమూకాదు. మానవత్వమూ కాదు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ (స)’కుస్తీలో ప్రత్యర్ధిని మట్టికరిపించే వాడు వీరుడు కాదు. తనకు కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోకుండా నిగ్రహించుకున్నవాడే అసలైన వీరుడు, శూరుడు’.అన్నారు.ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వికనుక, కోపం మానవ సహజమే అయినప్పటికీ, దానిపై అదుపుకలిగిఉండాలి. విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా ప్రవర్తించకూడదు. తాను కోపగించుకొని, కస్సుబుస్సులాడి ఏం సాధించగలనని ఆలోచించ గలగాలి. అందరికంటే బలవంతుడు దైవం ఉన్నాడని, ఏదో ఒకరోజు ఆయన ముందు హాజరు కావలసిందేనని, ఆయన అందరి మనోస్థితులూ తెలిసిన సర్వజ్ఞాని అని తెలుసుకొని, విచక్షణాజ్ఞానంతో మసలుకుంటే ఎటువంటి అనర్ధాలూ ఉండవు. కోపానికి దూరంగా ఉంటే జీవితమంతా సంతోషమే. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
-
రిటైర్మెంట్ డిప్రెషన్ డేంజర్ బెల్స్ : ఏం చేయాలి?!
రిటైర్మెంట్, పదవీ విరమణ తరువాతి జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా గడపొచ్చని దాదాపు అందరూ భావిస్తారు. నిజానికి ఇది అవసరం కూడా. కానీ ఇండియాలో పదవీ విరమణ తరువాత చాలా మందిని డిప్రెషన్ బాధిస్తోందట. శూన్యత, ఒంటరితనం, నేను ఎందుకూ పనికి రానా? అనే ఆందోళన క్లినికల్ డిప్రెషన్‌కు దారితీస్తోందని సమాచారం. దీన్నే రిటైర్మెంట్ డిప్రెషన్ అంటున్నారు. ఒకప్పుడు చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండేవారు కూడా రిటైర్మెంట్ తరువాత చాలా స్వల్ప భావోద్వేగాలను కూడా తట్టుకోలేక పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మరి దీన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?రిటైర్మెంట్ డిప్రెషన్‌కి అనేక సమస్యలు, సవాళ్ల వల్ల ఏర్పడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, మనవలు, మనవరాళ్లతో కాలం గడుపుతూ, ఉన్న చిన్నకొద్దిపాటి, వ్యవసాయాన్ని, గొడ్డూ, గోదా సంరక్షణ, లేదా వ్యాపారం నిర్వహణతోపాటు సమాజంలో అందరూ సామూహికంగా కలిసి ఉండటం లాంటి వల్ల పదవీ విరమణ ద్వారా వచ్చిన ఆకస్మిక మార్పులను సర్దుబాటు చేసుకునేలా ఉండేవి. అయితే ఉద్యోగ విరమణ తరువాత వయసుతో వచ్చే సమస్యలతోపాటు, ఉద్యోగ రీత్యా పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉండటంతో విచారం, ఆందోళన, నిస్సహాయత వారిని చుట్టుముడుతోంది. అయితే సరైన ప్రణాళిక, నిపుణుల సలహాతో వీటన్నింటినుంచి బయటపడవచ్చు అంటున్నారు మానసిక వైద్యులు. రిటైర్మెంట్ డిప్రెషన్‌ను ఎలా గుర్తించాలిఅలసట, ఏ పనీ చేయాలని అనిపించకపోవడం, నిస్సత్తువగా, విచారంగా అనిపించడం, ఒంటరివాళ్లమనే ఆందోళన లాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ నిష్థా జైన్. అలాగే ఆ ఉద్యోగం తప్ప మరే హాబీలు లేకపోవటం కూడా రిటైర్మెంట్ డిప్రెషన్‌కు ప్రధాన కారణమంటారు.ఉద్యోగ విరమణ తరువాత ప్రతీ నెలా వచ్చే జీతం రాదు కేవలం పెన్షన్మీదే ఆధారపడాలి. దీంతో ఆర్థికంగా ఎలా అందోళన మొదలవుతుంది.(పెన్షన్ సరిపడా వచ్చేవారి పరిస్థితి వేరు) ఆరోగ్య సమస్యలు , ఒంటరితనం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. వీటికి తోడు రక్తపోటు, మధుమేహం, మతిమరుపులాంటివి కూడా మరింత ఆజ్యం పోస్తాయి. దీంతో స్వేచ్ఛగా, రిలాక్స్‌గా ఉండాల్సిన వారిలోనిరాశ ఏర్పడుతుంది. పాత జీవితాన్ని కోల్పోయా మనే బాధ, ఒత్తిడి పెరుగుతాయి. రోజంతా ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయనే ఆందోళన చెందుతారని చెబుతున్నారు మానసిక వైద్యులుమరి ఏం చేయాలి? పదవీ విరమణ చేయడానికి ముందే ఆలోచనాత్మక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, దినచర్యలు, అభిరుచులు , రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి? ఆర్థిక అవసరాల నిమిత్తం ఏం చేయాలి లాంటి యాక్షన్ ప్లాన్ కచ్చితంగా ఉండాలి. పలు సామాజిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పర్చుకోవాలి. అంతకుముందే ఏదైనా వ్యాధి ఉంటే క్రమం తప్పకుండా మందులు వాడటం, వైద్య పరీక్షలపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, నడక లాంటి వ్యాయామాలు చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. చక్కటి పుస్తకాలను చదవాలి. అనుభవాలను పంచుకోవడానికి, ఒంటరితనాన్నిబయటపడటానికి సపోర్ట్ గ్రూపుల్లో చేరాలి. అందరితనూ కలిసిపోయేందుకు ప్రయత్నించాలి.వీలైనన్ని సార్లు ఆధ్యాత్మిక , లేదా పర్యాటకు ప్రదేశాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో మరింత దగ్గరగా వ్యవహరించాలి. కుమార్తెలు, కోడళ్లు, కొడుకులపట్ల విశాల దృక్పథంతో వ్యవహరించాలి. పరస్పరం మనసు విప్పి, మాట్లాడుకోవాలి. చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. మనకువచ్చిన విద్యను వారికి నేర్పించవచ్చు. అపార్టమెంట్లలోని పిల్లలకు చెస్, పెయింటింగ్, ఇలా ఏదో ఒకటి నేర్పిస్తూ వాళ్లతో సమయం గడపాలి.అన్నింటికంటే ముఖ్యంగా పరిస్థితులను అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని పదవీ విరమణ అనేది ఒక ముఖ్యమైన జీవిత మార్పు అని గమనించి ముందుకు సాగిపోవాలి. -
హై రిస్క్ ప్రెగ్నెన్సీ?!
నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. రెండో నెల. తొలి చూలు. బరువు 110 కేజీలు ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఊబకాయం ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అలా కాకుండా ఏమి చెయ్యాలి. కొన్ని మందులు రాశారు. అవి వాడొచ్చా? – మనీషా, బెంగళూరుకాళ్లల్లోని డీప్ వీన్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే చాన్స్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ)అంటారు. ఈ క్లాట్ కనుక రక్తనాళాల్లోకి వెళ్తే చాలా ప్రమాదం. ఇవి కొంతమందికి ఊపిరితిత్తులు, గుండెలోకీ మూవ్ అవుతుంటాయి. బ్లడ్ థిక్ కావడం వల్ల ఈ క్లాట్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమందిలో ఇతరత్రా మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నెమ్మదిగా రక్తప్రసరణ జరుగుతుంది. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే, రక్తం చిక్కనవుతుంది. జనరల్ సర్జరీ తర్వాత కూడా శరీరంలో ఈ ప్రోటీన్స్ పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా.. కొంతమందికి ప్రెగ్నెన్సీ తొలి వారల్లోనే బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అధిక బరువు అంటే, బాడీ మాస్ ఇండెక్స్ 35 లేదా అంతకంటే ఎక్కువ, వయసు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, వ్యక్తిగతæ లేదా ఫ్యామిలీ హిస్టరీలో బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్ ఉన్నవారు, ఏపీఎల్ఏ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నవారు, సివియర్ వెరికోస్ వీన్స్ ఉన్నవారు, బెడ్ రెస్ట్‌లో ఉన్నవారికి ఈ రిస్క్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు కాలులో నొప్పి , వాపు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పి వంటివి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ని కలవాలి. లంగ్ స్కాన్, లోయర్ లింబ్ డాప్లర్ స్కాన్ ద్వారా క్లాట్స్ని కనిపెడ్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించి.. కాళ్లల్లో క్లాట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఒకే చోట కూర్చోకుండా, గంటకు ఒకసారి అయిదు నిమిషాలు వాకింగ్ చేయాలి. మంచం మీద పడుకున్నప్పుడు కూడా మోకాళ్లు, కాళ్లు కదుపుతూ ఉండాలి. తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. రిస్క్ జోన్లోఉన్నవారికి వీటితో పాటు రిస్క్ అసెస్మెంట్ చేసి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ లాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ థిన్ కావడానికి ఏ్ఛp్చటజీn జీn్జ్ఛఛ్టిజీౌnటఅనేవి ఉంటాయి. డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారు. డైలీ తీసుకోవాలి. వీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. వీటి వలన బ్లడ్ క్లాట్ రిస్క్ బాగా తగ్గుతుంది. ఇవి గర్భస్థ శిశువుకేమీ ప్రమాదం కలిగించవు. -
స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత.. 200 మంది ఉద్యోగుల అష్టదిగ్బంధనం
సాక్షి,విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వందలాది స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల్ని.. కాంట్రాక్ట్ ఉద్యోగులు అడ్డుకున్నారు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్లైన్ గేటు పాసులను నిలిపివేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించారు.స్టీల్‌ప్లాంట్‌లో అర్ధరాత్రి రాత్రి వరకు నిరసన చేపట్టారు. ఈడీ వర్క్స్ బిల్డింగ్‌లో సుమారు 200 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కార్మికులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నట్లు హెచ్చరించారు. మరోవైపు మా పొట్టకొట్టొద్దని 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంపై ఆందోళన చేస్తున్నా.. కూటమి నేతలు స్పందించలేదని వాపోతున్నారు. -
సాక్షి రిపోర్టర్ పై..గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాడి
-
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆన్లైన్ వేదికగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్పై వెబినార్ నిర్వహించింది. జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవాలి..? మనం ఆలోచించే తీరు ఎలా ఉండాలి..? మానసిక ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలి..? అనే అంశాలపై ఈ వెబినార్‌లో చర్చించారు. ప్రముఖ వైద్యురాలు మీనా చింతపల్లి ఈ వెబినార్‌లో మైండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన అనేక కీలక అంశాలు వివరించారు. ముఖ్యంగా ఆటిజం బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి..? వారికి ఎలాంటి మానసిక మద్దతు అందించాలి..? చిన్నప్పటి నుంచి పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఎలా వ్యవహారించాలి అనే విషయాలపై విలువైన సూచనలు చేశారు. ఈ వెబినార్‌కి అనుసంధానకర్తగా వెంకట్ మంత్రి వ్యవహారించారు. నాట్స్ మాజీ ఛైర్ పర్సన్ అరుణ గంటి ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. జీవితంలో ఒత్తిడులను అధిగమించడం.. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం విలువైన సూచనలు చేసిన మీనా చింతపల్లికి నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అత్యంత కీలకమైన విషయమని దీనిపై అవగాహన కల్పించిన మీనా చింతపల్లికి నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!) -
గుట్ట గుట్టలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు : ఈ పాపంలో మనం కూడా!
మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి కాలుష్య భూతం. ముఖ్యంగా భూమి మీద గుట్టలుగుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై కీలక సర్వే మరింత ఆందోళన రేపుతోంది. ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయని తాజా రిపోర్టులో వెల్లడైంది. ప్రపంచంలో ఈ ఏడాది ఉత్పత్తి అయిన 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో దాదాపు 7 కోట్ల టన్నులను ప్రపంచ దేశాలు శుద్ధి చేయకుండా వదిలివేశాయని ‘ఈఏ ఎర్త్ యాక్షన్’ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి చేటు కలుగుతోంది. ఇది ప్రపంచానికే పెను సవాల్‌గా మారింది. భూగోళానికి మరింత ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలపై చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతూనే ఉన్నారు. తాజా ఎర్త్ యాక్షన్ సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తంగా పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో సగానికి పైగా అంటే దాదాపు 60 శాతం వ్యర్థాలకు కారణం కేవలం 12 దేశాలేనని తేలింది. ఈ జాబితాలో భారత దేశం పేరు కూడా ఉండటం గమనార్హం.అయితే, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు తక్కువని చెప్పింది. కెనడాలోని ఒట్టావాలో ఐక్యరాజ్యసమితి ఇంటర్‌గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ (INC) నాల్గవ సమావేశానికి ముందు ఈ రిపోర్ట్ వెలుగులోకిచ్చింది. అమెరికా, చైనా, భారత్ సహా ఈ జాబితాలో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్థాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండినేషియా, టర్కీ, వియత్నాం దేశాలున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో శుద్ధి చేయని ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాల్లో మూడోవంతు, చైనా వ్యర్థాల్లో ఐదో వంతు కన్నా తక్కువే. ప్లాస్టిక్ మిస్ మేనేజ్మెంట్లో చైనా టాప్‌లో ఉందని పేర్కొంది. తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. -
బరితెగించిన ‘భాష్యం’!
అనంతపురం ఎడ్యుకేషన్: ‘భాష్యం’ విద్యా సంస్థలు బరితెగించాయి. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష్యం విద్యా సంస్థలకు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల ఖర్చుల కోసమంటూ ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను వేధిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజులు చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నా భాష్యం యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఫీజులు చెల్లిస్తేనే బడికి పంపాలంటూ హుకుం జారీ చేస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో భాష్యం స్కూల్ ఉంది. అధినేత ఎన్నికల ఖర్చులకు డబ్బులు అవసరమని పై నుంచి ఆదేశాలు రావడంతో ఫీజుల కోసం సిబ్బంది విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఫీజు చెల్లిస్తేనే మీ పిల్లలను బడికి పంపండి.. లేకుంటే పంపొద్దు అని తల్లిదండ్రులకు కరాఖండీగా చెప్పేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన 1–9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల ప్రారంభానికి ముందు ఫీజు చెల్లించిన వారినే పరీక్షలకు అనుమతిస్తామని భాష్యం యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో చాలామంది తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు మొత్తాన్ని చెల్లించారు. ఉన్నట్టుండి ఒత్తిడి చేయడంతో మరికొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా పిల్లల నిర్బంధం పూర్తి ఫీజు చెల్లించలేదనే నెపంతో పది రోజుల క్రితం అనంతపురం భాష్యం స్కూల్లో దాదాపు 50 మంది విద్యార్థులను రోజంతా సిబ్బంది ఒక గదిలో నిర్బంధించారు. తరగతుల్లో కూర్చోబెట్టకుండా వారందరినీ ఒక గదిలో కూర్చోబెట్టారు. అదికూడా బెంచీలపై కాకుండా నేలపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారు. సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక వారిని ఇళ్లకు పంపడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గోడు చెప్పుకున్నారు. దీంతో మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను నిలదీశారు. పాఠశాల ఇన్చార్జ్ అనిల్‌కుమార్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ యాజమాన్యం నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని, తామేమీ చేయలేమని విద్యార్థుల తల్లిదండ్రులకు తేలి్చచెప్పారు. ఎవరితోనైనా చెప్పుకోండి.. ముందు ఫీజు కట్టండని చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తిరగబడ్డారు. సమస్య పెద్దదయ్యే పరిస్థితి కనిపించడంతో కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 12లోపు అందరూ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపాల్ సూచించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే భాష్యం పాఠశాలల యాజమాన్యం చేస్తున్న అరాచకాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. -
‘ఇదే మా సంస్థ గొప్పతనం’.. ఒక్క ఫోటోతో అబాసుపాలైన దిగ్గజ కంపెనీ సీఈవో
ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ వివాదంలో చిక్కుకున్నారు. తమ కంపెనీ వర్క్ కల్చర్‌పై గొప్పలు చెప్పారు. ఆపై అబాసు పాలయ్యారు? బాడీ మసాజ్ చేయించుకునే సమయంలో కూడా మేనేజ్మెంట్ సమావేశానికి హాజరయ్యేందుకు వీలు కల్పిస్తుందంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఫెర్నాండేజ్ షర్ట్ లేకుండా ఓ వైపు మసాజ్ చేయించుకుంటూ మరోవైపు ఆఫీస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం మనం చూడొచ్చు. వారంలో పని ఒత్తిడి, వెరానిటా యోసెఫిన్ సలహా మేరకు మసాజ్ చేయించుకుంటున్నాని క్యాప్షన్ ఇచ్చారు. మసాజ్ చేయించుకునేందుకు అనుమతి ఉందని.. ఇండోనేషియా, ఎయిర్ ఏషియా కల్చర్ ఇష్టపడతానని చెప్పారు. ఆఫోటోపై నెటిజన్స్ మండి పడుతున్నారు. పలువురు నెటిజన్లు ఇలాంటి చర్యల వల్ల ఎయిర్ ఏసియా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. వెంటనే ఫెర్నాండేజ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంటే.. సంస్థ గొప్పతనం గురించి ఇలా వివరించడం సరైంది కాదని అంటున్నారు. మొత్తానికి ఈ ఫోటోలు ఏవియేషన్ విభాగంలో కాక రేపుతుండగా.. ఈ ఫోటోలు ఫెర్నాండెజ్ షేర్ చేశారా? లేదంటే ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఇలా ఫోటోల్ని మార్ఫింగ్ చేసి లింక్డిన్లో పోస్ట్ చేశారా? అని తెలియాల్సి ఉంది. -
ఆలయ నిర్వహణలో ప్రపంచానికే టీటీడీ దిక్సూచి
తిరుమల: ఆలయ నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 30 దేశాలకు చెందిన వివిధ హిందూ దేవాలయాల నిర్వాహకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ కల్పిస్తున్న వసతులు, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆలయ నిర్వహణకు సంబంధించి అరగంట పాటు ధర్మారెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఆహూతులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ యాత్రికులకు శ్రీవారి దర్శనం, వసతి, తలనీలాలు, లడ్డూల తయారీ తదితర అంశాల్లో టీటీడీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. సమర్థ నిర్వహణ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఆలయాలు పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలని, భక్తులకు సులభంగా దర్శనం, చక్కటి వసతులు కల్పించాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యం, అన్నదానం, వేద సంస్కృతి పరిరక్షణ తదితర కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను టీటీడీ పెద్దఎత్తున చేస్తోందని చెప్పారు. స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి దేశాల తరహాలో తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ ఉందన్నారు. పురాతన ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు పురాతన ఆలయాల పునరుద్ధరణకు, మతమార్పిడులను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్టును ప్రారంభించామని ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 170 పురాతన ఆలయాల పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. భక్తులు దాదాపు రూ. 900 కోట్లు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేశారని, ఇప్పటివరకు రూ. 330 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఏడాదిన్నర కిందట ప్రారంభించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో 1,600కు పైగా గుండె శస్త్రచికిత్సలు, నాలుగు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. చిన్నపిల్లలకు కార్డియాలజీతో పాటు ఇతర విభాగాలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు. టీటీడీ విశిష్ట సేవలు టీటీడీ ఆధ్వర్యంలో 71 ఆలయాలు, 11 ట్రస్టులు, 14 ఆసుపత్రులు, 35 విద్యాసంస్థలు, 9 వేద పాఠశాలలు, నాలుగు గోశాలలు, 300 కళ్యాణ మండపాలు, 10 ధార్మిక సంస్థలు, నాలుగు భాషల్లో శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్, అనాథ పిల్లల కోసం బాలమందిరం, రెండు మ్యూజియంలు ఉన్నాయని ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే తోటి భక్తులకు సేవలందించేందుకు 2000 సంవత్సరంలో శ్రీవారి సేవా విభాగాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు 14 లక్షల మంది సేవకులు నమోదయ్యారని తెలిపారు. శ్రీవారికి నైవేద్యం కోసం గోఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తున్నామని తెలిపారు. కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి శ్రీనివాస కళ్యాణం, వేంకటేశ్వర వైభవోత్సవాలు, గుడికో గోమాత కార్యక్రమం, విషూచిక మహామంత్రంతో పారాయణాలు ప్రపంచ భక్తుల దృష్టిని ఏ విధంగా ఆకర్షించాయో వివరించారు. టీటీడీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తన ప్రసంగంలో శ్రీవాణి ట్రస్ట్ సేవలపై ప్రశంసలు కురిపించారు. వెనుకబడిన ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణను పెద్దఎత్తున చేపట్టినందుకు టీటీడీని కొనియాడారు. టీటీడీ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను ఆయన ప్రస్తుతించారు. అనంతరం ఈవో ధర్మారెడ్డిని సమ్మేళనం చైర్మన్ ప్రసాద్ మినేష్ లాడ్, టెంపుల్స్ కనెక్ట్ వ్యవస్థాపకులు గిరీష్ కులకర్ణి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్బీఐ కొత్త తరం డేటా వేర్‌హౌస్ - ముందుగా వారికే..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ తాజాగా కొత్త తరం డేటా వేర్‌హౌస్ అయిన సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను (సీఐఎంఎస్–సిమ్స్)ను ఆవిష్కరించింది. ముందుగా కమర్షియల్ బ్యాంకులు దీనికి రిపోర్టింగ్ చేయడం మొదలుపెడతాయని, ఆ తర్వాత అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకూ దీన్ని వర్తింపచేస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో 17వ స్టాటిస్టిక్స్ డే నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ప్రజలకు మరింత డేటాను అందుబాటులో ఉంచడంతో పాటు ఇతర యూజర్లు ఆన్లైన్లో గణాంకాలపరమైన విశ్లేషణ చేపట్టేందుకు కూడా కొత్త సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుందని దాస్ చెప్పారు. -
ఆ సమస్యలను సాధారణీకరించే నిర్వహణకు చైనా పిలుపు!
చైనా అంతర్జాతీయ సరిహద్దులో విభేదాలను సాధారణీకరించే నిర్వహణకు పిలుపుచ్చింది. గాల్వన్ ఘటన నేపథ్యంలో ఇరుదేశాల రక్షణమంత్రుల మొదటి సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన బలమైన సందేశం తదనంతరం చైనా జనరల్ లీ షాంగ్ఫూ ఇలా వ్యాఖ్యానించారు. ఈ మేరకు చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో.. ఇరుపక్షాలు దీర్ఘకాలికి దృక్పథాన్ని తీసుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలలో సరిహద్దు సమస్యను తగిన స్థానంలో ఉంచాలి. సరిహద్దు పరిస్థితిని సాధారణీకరించే నిర్వహణకు ప్రోత్సహించాలి అని పేర్కొంది. ఐతే ఇది భారత్‌కు ఆమోదయోగ్యం కాదు. సరిహద్దు పరిస్థితి రెండు దేశాల మధ్య బంధాల విస్తరణతో ముడిపడి ఉందని భారత్ స్పష్టం చేసింది. కానీ చైనా భారత్‌తో విభేదాల కంటే సాధారణ ప్రయోజనాలనే పంచకుంటుందని తెలిపింది. ఇరు పక్షాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర అభివృద్ధిని, సమగ్ర దీర్ఘకాలికి వ్యూహాత్మక కోణం నుంచి చూడాలని చైనా నొక్కి చెబుతోంది. తద్వారా ప్రపంచానికి వివేకం, బలాన్ని సంయుక్తంగా అందించాలని చైనా పేర్కొంది. ఇదిలా ఉండగా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా ఇరు పక్షుల మంత్రుల సమావేశం తర్వాత భారత్ తన ప్రకటనలో భారత్ చైనా మధ్య సంబంధాల అభివృద్ధి శాంతి ప్రాబల్యంపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పషం చేశారు. సరహద్దు సమస్యలు ద్వైపాక్షిక ఒప్పందాలకు, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒప్పందాల ఉల్లంఘన ద్వైపాక్షిక సంబంధాల మొత్తం ప్రాతిపదికన క్షీణింపచేస్తుందని హెచ్చరించారు. సరిహద్దులను విడదీయడంతో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. చైనా మాత్రం సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని ఇరు పక్షాల సైనికు దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాయని చెబుతోంది. అందువల్ల పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేలా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామని అందుకు సహకరించండి అని చైన పేర్కొనడం గమనార్హం. (చదవండి: నా కూతురు కారణంగానే అతను ప్రధాని అయ్యారు! సుధామూర్తి) -
బిల్‌గేట్స్‌తో సమావేశం వండర్ఫుల్! కోవిడ్ నిర్వహణపై ప్రశంసల జల్లు!
భారతదేశ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ దేశా రాజధానిలోని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. అంతేగాదు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వార్‌రూమ్‌ని సైతం సందర్శించారు బిల్‌గేట్స్. వాస్తవానికి దీన్ని కోవిడ్ సమయంలో నేషనల్ పబ్లిక్ హెల్త్ అబ్జర్వేటరీ పేరుతో వార్ రూమ్‌ని రూపొందించారు. మన్సుఖ్తో జరిగిన సమావేశంలో బిల్‌గేట్స్ కోవిడ్ నిర్వహణ, టీకా డ్రైవ్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వంటి డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలుసుకుని ప్రశంసించారు. అలాగే ఆ సమావేశంలో బారత్ జీ20 ఆరోగ్య ప్రాధాన్యతలు, పీఎం భారతీయ జనౌషధి పరియోజన ఈ సంజీవని గురించి కూడా ఆరోగ్య మంత్రి మన్సుఖ్ బిల్‌గేట్స్‌తో చర్చించారు. ఈ మేరకు ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా ట్విట్టర్ వేదికగా బిల్‌గేట్స్‌తో జరిగిన సమావేశం వండర్ఫుల్ అంటూ ఈవిషయాన్ని వెల్లడించారు. కాగా, బిల్‌గేట్స్ గతవారం తన బ్లాగ్‌లో భారత పర్యటన గురించి తెలియజేశారు. బ్లాగులో ఆయన..నేను వచ్చేవారం భారతదేశానికి వెళ్తున్నాను. చాల ఏళ్లుగా అక్కడ చాలా సమయం గడిపినప్పటికీ..మరుగదొడ్లను తనిఖీ చేయడం నుంచి భారతదేశంలోని పేద, వెనుకబడిన కులాలు నివశించే గ్రామాన్ని సందర్శించడం వరకు ప్రతిదీ చేస్తున్నాను. కోవిడ్‌కి ముందు నుంచి కూడా భారత్‌ని సందర్శించ లేకపోయాను. అక్కడ ఎంత వరకు పురోగతి సాధించిందో తెలుసుకునేంతం వరకు వేచి ఉండలేను అని రాసుకొచ్చారు. అలాగే భారతదేశాన్ని కొనయాడారు. భారతదేశం భవిష్యత్తుపై మంచి ఆశను కలిగిస్తుందన్నారు. ప్రపంచం పలు సంక్షోభాలతో అతలాకుతలం అయిపోతున్నప్పటికీ.. భారత్ మాత్రం ఎంత పెద్ద సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించగలదని నిరూపించిందన్నారు. (చదవండి: చైనాపై ఒత్తిడి తెచ్చేలా..రంగం సిద్ధం చేస్తున్న అమెరికా!) -
ముగిసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం
-
తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,825 కోట్ల జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ఘన, ద్రవ వ్యర్థాలు శుద్ధిచేయడంలో విఫలమైందంటూ తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రధాన ధర్మాసనం రూ.3,825 కోట్ల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1996లో దేశంలోని పలు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణ సరిగాలేదంటూ పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్జీటీకి బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాలు, 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య కారకాలు, ఇసుక అక్రమ మైనింగ్‌లపై చర్యలు తీసుకోవాలని సంస్థ కోరింది. జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయడంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను వివరణ కోరింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణకు సంతృప్తి చెందని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘1824 ఎంఎల్డీ లిక్విడ్ వేస్ట్/సీవేజీ నిర్వహణలో అంతరాలకు గానూ రూ.3,648 కోట్లు, సాలిడ్ వేస్ట్ నిర్వహణలో వైఫల్యానికి గానూ రూ.177 కోట్లు కలిపి మొత్తం రూ.3,825 కోట్లు పరిహారంగా చెల్లించాలి. రెండు నెలల్లో ప్రత్యేక ఖాతాలో ఆ మొత్తం డిపాజిట్ చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం పునరుద్ధరణ చర్యలకు వినియోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాముల నుంచి నిధుల సేకరణ చేసుకోవచ్చు. పునరుద్ధరణ ప్రణాళికలు అన్ని జిల్లాలు/నగరాలు/పట్టణాలు/ గ్రామాల్లో మరింత సమయానుకూలంగా ఒకేసారి అమలు చేయాలి. ఉల్లంఘనలు కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అమలు పర్యవేక్షణ నిమిత్తం సాంకేతిక నిపుణుల బృందంతో సీనియర్ నోడల్ స్థాయి సెక్రటరీని వెంటనే నియమించాలి. ఆరునెలల తర్వాత పురోగతిని ఎన్జీటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ ద్వారా పంపాలి. సీపీసీబీ ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలి’’ అని ఎన్జీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదీ చదవండి: జేఈఈ పేపర్ లీక్ కేసు: రష్యన్ వ్యక్తి అరెస్టు -
గాడి తప్పిన గురుకులం! ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడిన వాస్తవాలు
జ్వరంతో బాధపడుతున్న ఈ విద్యార్థి పేరు విజయ్‌కుమార్. ఆసిఫాబాద్‌లోని జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా ఆస్పత్రికి తీసుకెళ్లలేదని.. హాస్టల్లోనే ట్యాబ్లెట్లు ఇస్తున్నారని చెబుతున్నాడు. తనతోపాటు మరో నలుగురూ జ్వరంతో బాధపడుతున్నారని అంటున్నాడు. ఇలా పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఈ హాస్టల్లో ఏఎన్ఎంలు దిక్కులేరు. రాత్రిపూట తరగతి గదుల్లోనే నిద్రిస్తున్నామని.. మరుగుదొడ్లకు సెప్టిక్ ట్యాంక్ లేక పక్కనే ఉన్న మురికికాల్వ దుర్గంధం వెదజల్లుతోందని విద్యార్థులు వాపోతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కిక్కిరిసి ఉన్న మెస్ గది ఇది. ఇందులో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదే పాఠశాల భవనంలో ఉన్న మెదక్ డిగ్రీ బాలికల గురుకుల కళాశాలలో మరో 840 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. గురుకుల పాఠశాల విద్యార్థులు తరగతి గదిలోనే బస చేయాల్సి వస్తోంది. విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, భోజనానికి లైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంక్షేమ గురుకులాలు గాడి తప్పాయి. నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సదుపాయాలు సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. పారిశుధ్యలోపం కారణంగా అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికే చాలా గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం కారణంగా ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలిసింది. మరోవైపు కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా గురుకులాల్లో విద్యార్థులు అనారోగ్యాల బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘సాక్షి’అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన భోజన వసతులు అందించేందుకు 267 ఎస్సీ, 162 ఎస్టీ, 292 బీసీ, 206 మైనారిటీ, 35 విద్యాశాఖ గురుకులాలను ఏర్పాటు చేసింది. ఒక్కో గురుకులంలో 480 మంది చొప్పున.. మొత్తం 4,61,760 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొదట్లో గురుకులాలు బాగానే సాగినా తర్వాత గాడితప్పాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల విద్యార్థుల హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. పరిశుభ్రత మచ్చుకైనా కానరావడం లేదని.. అధికారులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏ గురుకులంలో చూసినా ఇదే దుస్థితి ►నల్లగొండ ఎస్‌ఎల్‌బీసీలోని అనుముల ఎస్సీ బాలుర గురుకులంలో 480 మంది ఉన్నారు. వారిలో చాలా మంది జ్వరాల బారినపడి ఇళ్లకు వెళ్లినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అన్నం ముద్దగా ఉంటోందని, పురుగులు వస్తున్నాయని, నీళ్ల చారు, పలుచని మజ్జిగతో భోజనం పెడుతున్నారని వాపోతున్నారు. ఉదయం పెట్టే ఉప్మాలోనూ పురుగులు వస్తున్నాయని అంటున్నారు. హాస్టల్ పక్కన రేకుల షెడ్డు కింద అంతా భోజనం చేస్తున్నామని.. చీకట్లో వడ్డిస్తుండటంతో దోమలు, పురుగులు పడుతున్నాయని వాపోతున్నారు. ►నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోంది. అందులోనే హాస్టల్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో 482 మంది బాలికలు ఉన్నారు. భవనం పక్కన రేకుల షెడ్డులో కిచెన్, భోజనశాల ఉన్నాయి. మెస్ హాల్ పక్కనే మురికి కాల్వ ఉంది. దుర్వాసన, దోమల బెడదతో విద్యార్థినులు తరచూ రోగాల పాలవుతున్నారు. సమీపంలో పొలాలు ఉండటం, ప్రహరీ లేకపోవడంతో విష పురుగులు, పందులు హాస్టల్లోకి వస్తున్నాయి. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గురుకులాలు అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గతంలో పార్ట్‌టైం ఏఎన్ఎంలు పనిచేసేవారు. గిరిజనశాఖ ఇటీవల వారిని తొలగించడంతో విద్యార్థులకు జ్వరమొస్తే చూసే దిక్కులేకుండా పోయింది. సరైన భోజనం పెట్టకపోవడం, అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం బారినపడుతున్నామని పలు పాఠశాలల్లోని విద్యార్థినులు వాపోతున్నారు. ►కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని బోర్నపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల చుట్టూ చెట్లు, పొదలతో అపరిశుభ్రంగా ఉంది. మరుగుదొడ్ల వద్ద విద్యుద్దీపాలు లేకపోవడంతో రాత్రిపూట విద్యార్థులు భయపడుతున్నారు. ►రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారన్న వార్తలు వస్తుండటంతో.. ఆందోళనకు గురైన పలువురు తల్లిదండ్రులు కరీ ంనగర్ పట్టణ శివార్లలోని బొమ్మకల్ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలకు వచ్చారు. కొందరు విద్యార్థుల ఆరోగ్యాన్ని వాకబు చేసి వెళ్లగా.. మరికొందరు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం కనిపించింది. ►జనగామ జిల్లా జఫర్‌గఢ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో డ్రైనేజీ నీరు పాఠశాల ఆవరణలోనే నిలుస్తోంది. తాగునీటి పైపులైన్లు కూడా లీకవుతున్నాయి. ►మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలంలోని గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లోని బాత్రూం, మరుగుదొడ్లకు తలుపులు సరిగా లేవని వాపోతున్నారు. తరగతి గదుల్లో ఐదు ఫ్యాన్లు ఉంటే నాలుగు పనిచేయడం లేదని.. దోమల బెడద ఎక్కువైందని అంటున్నారు. హాస్టల్ చుట్టూ పొదలు పెరిగాయని, ఇప్పటికే మూడుసార్లు హాస్టల్లోకి పాములు వచ్చాయని విద్యార్థులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ జ్యోతిబాపూలే గురుకుల హాస్టల్లో డోర్లు సరిగ్గా లేని మరుగుదొడ్లు. భయంతో అడ్మిషన్ రద్దు చేసుకుని తీసుకెళ్తున్నా.. మా కొడుకు సిద్ధార్థను బొమ్మకల్ గురుకుల పాఠశాలలో సీఈసీ మొదటి సంవత్సరంలో చేర్పించాను. కానీ ఇక్కడ వసతులు సరిగా లేవని, భోజనం మంచిగా లేదని మా కొడుకు ఫోన్ చేసి చెప్పడంతో అడ్మిషన్ రద్దు చేసుకొని తీసుకెళ్తున్నాను. ప్రైవేట్ కాలేజీలో చేర్పించి చదివిస్తాను. – గంగాచారి, విద్యార్థి తండ్రి, కరీంనగర్ -
సారీ బాస్.. ఇలా అయితే కష్టం! కంపెనీలకు గుడ్ బై అంటున్న ఉద్యోగులు!!
ఇటీవల కాలంలో ఉద్యోగులు ఒక సంస్థను వీడి మరో సంస్థలో చేరడం (ఆట్రిషన్ రేట్) విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు నిరుద్యోగ సమస్య పీడిస్తున్నా.. ఉద్యోగాల్లో ఉన్న వారు మేనేజ్మెంట్ పట్ల సౌకర్యంగా ఫీలవకపోతే సంస్థలను వీడేందుకు వెనుకడాటం లేదు. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలైతే దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయాల్సి వస్తోంది. దీనికి వ్యతిరేకంగా లేబర్ ఆఫీసుల చుట్టు తిరగాల్సి వస్తోంది. సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించే ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా కార్పొరేట్ సెక్టార్ ఎదుర్కొంటున్న సీరియస్ సమస్యను ఈసారి లేవనెత్తారు. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో ద్వారా ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. వర్క్‌ఫోర్స్‌కి సంబంధించి ఇండియాలో మూడు రెవల్యూషన్స్ వచ్చాయని. ఒక్కో రెవల్యూషన్ అప్పుడు వర్క్‌ఫోర్స్ పనితీరు ఎలా ఉందో, వాళ్లు ఏం ఆశిస్తున్నారనే అంశాలను ఈ వీడియోలో సవివరంగా చర్చించారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవంతో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో ఎన్ని గంటలైనా పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండేవారు. యజమానులు కొట్టినా తిట్టినా పడేవారు. అవకాశాలు తక్కువగా ఉండటంతో ఎన్నో ఇబ్బందుల నడుమ ఆరోజుల్లో ఉద్యోగులు పని చేయాల్సి వచ్చేది. వేరే జాబ్ దొరికే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండేవారు తప్పితే సంస్థలను వీడాలనే ఆలోచనే వచ్చేది కాద ఆ తరం వారికి. ఉపాధి కల్పించే సంస్థ పట్ల ప్రేమాభిమానాల కంటే భయమే ఎక్కువగా ఉండేది. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ 90వ దశకం తర్వాత క్రమంగా ఐటీ రంగం పుంజుకోవడం మొదలైంది. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ వచ్చాక ఐటీ కంపెనీలు వచ్చాయి. ఈ తరుణంలో వచ్చిన వర్క్‌ఫోర్స్ కనీస అవసరాల కోసం కాకుండా మెరుగైన జీవితం (స్టాండర్డ్ లైఫ్‌స్టైల్) లక్ష్యంగా పని చేయడం మొదలైంది. వీళ్లకు కార్ ఈఎంఐ, హౌజ్ ఈఎంఐ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేవి ప్రధాన సమస్యలు. అవకాశం ఉంటే వేరే చోటుకి వెళ్లేందుకు ఆలోచించేవారు. ఎక్కువ శాతం సంస్థను వీడేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ సంస్థ పట్ల భయం అనేది పోయింది. అయితే పని చేసే సంస్థ పట్ల నమ్మకం ఉండేది. సోషల్ రెవల్యూషన్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం సోషల్ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగులు ఉద్యోగ భద్రత , స్టాండర్డ్ లైఫ్ వంటి బెంచ్‌మార్క్‌లను దాటి పోయారు. ఇప్పటి వర్క్‌ఫోర్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని కోరుకుంటున్నారు. ఈ క్వాలిటీ అనేది పని, పని ప్రదేశం, యాజమాన్యం ప్రవర్తన వంటివి కోరుకుంటున్నారు. క్వాలిటీలో ఏ మాత్రం తేడా వచ్చిన కంపెనీ వదిలి వెళ్లేందుకు వెనుకాడటం లేదు. ఉద్యోగాలిచ్చే సంస్థల పట్ల భయం, నమ్మకం వంటివాటికి ఇక్కడ చోటు లేదు. పరస్పర గౌరవం, ఆదరణ ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. చిన్న చూపు తగదు ఏ సంస్థ అయినే సరే ఉద్యోగం ఇచ్చామనో, మంచి జీతం ఇస్తున్నామనే భావనలో ఉంటే ఆ కంపెనీలు ఉద్యోగుల వలస అనే సమస్యను ఎదర్కోక తప్పదని హార్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ తరం వర్క్‌ఫోర్స్ ఉద్యోగ భద్రత, మంచి జీతంతో పాటు క్వాలిటీ ఆఫ్ వర్క్‌ను కూడా కోరుకుంటున్నారు. పనితీరును గమనించి ప్రోత్సహకాలు అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సరైన సమయంలో వేతనాల పెంపు ఉండాలంటున్నారు. అవి లేకుంటే అదే కంపెనీలో ఉండేందుకు రెడీగా ఉండటం లేదు. కాబట్టి ఉద్యోగ, భద్రత జీతం ఇస్తున్నామని ఇంకే కావాలని ఆలోచించే కంపెనీలను వదిలి వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఉద్యోగుల విషయంలో జాగ్రత్త మెసలుకోవాలంటే యాజమాన్యాలకు సూచన చేశారు. An interesting explanation as to why people are resigning from their jobs and what it takes to retain employees pic.twitter.com/3mQmwGL8hX — Harsh Goenka (@hvgoenka) June 22, 2022 చదవండి: మహ్మద్ రఫీ పాటనే స్ఫూర్తిగా.. వేల కోట్లకు అధిపతిగా.. -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
-
వర్క్‌ఫ్రం హోం వద్దంటే ఎలా?
కరోనా కష్ట కాలం వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం అనేది కామన్ అయిపోయింది. కానీ అంతకు ముందు అత్యవసర పని ఉన్నా, ఆపత్కాలం వచ్చినా ఇంటి నుంచి పని అంటే యాజమన్యాలు ఒప్పుకునేవి కావు. పని జరగడం కంటే పాలసీలే ముఖ్యం అన్నట్టుగా కర్ర పెత్తనం చలాయించేవి. ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించిన విషయాలను ఓ ఉద్యోగి @బౌసర్డేంజర్ యూజర్ నేమ్‌తో రెడ్డిట్‌లో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. బౌసర్డేంజర్ అనే రెడ్డిట్ యూజర్ నేమ్ కలిగిన వ్యక్తి అమెరికాలోని ఓ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పని చేసేవాడు. అతడు నివసిస్తున్న ఇంటి నుంచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కి కనీసం గంట ప్రయాణం. ఎప్పటిలాగే ఒక రోజు ప్లాంటుకు వెళ్లేందుకు రెడీ అవగా.. బయట దట్టమైన మంచు కురుస్తోంది. కారుతో సహా రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. వర్క్ ఫ్రం హోం చేస్తాను మంచు వల్ల ఆఫీసుకు రాలేకపోతున్న విషయాన్ని వెంటనే ప్లాంటులో తన సూపర్ వైజర్కి ఈమెయిల్ ద్వారా తెలిపాడా ఉద్యోగి.. ఆ మెయిల్లో బయట మంచు తీవ్రంగా కురుస్తోందని, ప్రయాణం చేసేందుకు వీలుగా బయట పరిస్థితులు లేవని, కాబట్టి ఈ రోజు నేను ప్లాంటుకు వచ్చి స్వయంగా చేయదగ్గ పనులు కూడా లేనందున వర్క్ ఫ్రం హోంకి అనుమతి ఇవ్వాలని కోరాడు. తనకు అప్పగించిన పేపర్ వర్క్‌ని ఇంటి దగ్గరే ఉంటూ ల్యాప్‌ట్యాప్‌లో పూర్తి చేసి పంపిస్తానంటూ వివరించాడు. మన పాలసీ అది కాదు ఉద్యోగి నుంచి వచ్చిన ఈమెయిల్‌కి సూపర్వైజర్ స్పందిస్తూ.. ఒక ఉద్యోగిగా ఆఫీస్‌కు రావడం నీ బాధ్యత, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పని చేస్తామంటూ కుదరదు. ఆఫీసుకు వస్తున్నందుకే నీకు జీతం చెల్లిస్తోంది. కంపెనీ పాలసీ ఇదే విషయం చెబుతుంది. ఏదో కారణం చెప్పి ఆఫీసుకు రానంటే ఎలా.. అయినా నీవు చెప్పినంత దారుణంగా బయట పరిస్థితులు లేవు. నేను ఆఫీసులోనే ఉన్నారు. నువ్వు రావడమే మంచిది. నీకు రావడం వీలు కాని పక్షంలో నిరంభ్యతరంగా సెలవు తీసుకోవచ్చు. కానీ వర్క్ ఫ్రం హోం చేస్తానంటూ కోరడం సంస్థ పాలసీలకు విరుద్ధం. కాబట్టి నీ రిక్వెస్ట్‌ను ఆమోదించడం లేదంటూ బదులిచ్చాడు. చేయగలిగిందేం లేదు సూపర్వైజర్ వర్క్ ఫ్రం హోంకి అంగీకరించకపోవడంతో... వెంటనే బటయకు వచ్చి చూస్తే ఊహించనదాని కంటే మంచు ఎక్కువగా ఉంది. అతి కష్టం మీద సమీపంలో ఉన్న స్టోరుకి వెళ్లి మంచును తొలగించే వస్తువులను తీసుకుని వచ్చి ఇంటి ప్రాంగణం శుభ్రం చేసుకునే పనిలో మునిగిపోయాడు. ఆ తర్వాత మంచు కురిసే సమయంలో వేడివేడి స్నాక్స్ తింటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇంటి దగ్గరయినా పని చేయ్ ప్లీజ్ ఇంతలో సూపర్ వైజర్ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఆఫీసకు వస్తున్నావా ? లేదా అంటూ ప్రశ్నించాడు. దానికి బదులుగా ‘ బయట మంచు ఎక్కువగా ఉంది. నేను సంస్థ పాలసీ రూల్స్‌ను పాటిస్తూ ఈ రోజు సెలవు తీసుకున్నాను. కాబట్టి ఆఫీసుకు రావరడం లేదంటూ బదులిచ్చాడు. వెంటనే ఆఫీసుకు రానక్కర్లేదు అర్జంటుగా చేయాల్సిన పేపర్ వర్క్ ఉంది. నువ్వు ఇంటి దగ్గరి నుంచైనా ఆ పని చేసి త్వరగా పంపించు అంటూ రిక్వెస్ట్ చేశాడా సూపర్వైజర్. ఇప్పుడు పాలసీలో భాగం పై అధికారి కోరినట్టు సంస్థ అవసరాలకు తగ్గట్టుగా సెలవు రోజున కూడా ఇంటి దగ్గర పని చేసినట్టు ఆ ఉద్యోగి తెలిపాడు. ఈ ఘటన 2018లో జరిగింది. కరోనాకి ముందు వర్క్ ఫ్రం హోం అంటే యజమాన్యాలు సహించేవి కావు. ఇంట్లో ఏ పని చేయకుండా ఉంటారనే అపోహా ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వర్క్ ఫ్రం హోం అనేది కామన్‌గా మారింది. చాలా సంస్థలు ఇప్పడు వర్క్ ఫ్రంహోంను తమ పాలసీలో భాగంగా చేశాయి. కేవలం రెండేళ్లలోనే ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. చదవండి: ఐటీ కంపెనీ 'యాక్షన్ స్టెప్' బంపరాఫర్, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోవచ్చు! -
మేనేజ్మెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి అత్యంత దారుణంగా, అప్రజాస్వామికంగా, అమానవీయంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర క్రియాశీలకంగా ఉండాలి. కానీ అది విశృంఖలంగా మారిన పుడు సమస్యలు జటిలం అవు తాయి. అధికారంలో ఉన్నవారు తీసుకొనే నిర్ణయాలను ప్రతిపక్షం ప్రశ్నించవచ్చు, ప్రశ్నించాలి కూడా! కానీ, ప్రతిపక్షం అదేపనిగా ప్రభుత్వం తీసుకొనే ప్రతి చర్య ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందంటూ ఏకపక్షంగా తీర్పులివ్వడం, వాటిపై శ్రుతి మించిన ఆందోళనలు చేయడం; ప్రజలను కుల, మత, ప్రాంత ప్రాతిపదికన రెచ్చగొట్టడం ఏ విధంగా సమంజసం? జరగని తప్పులు జరిగాయని, అడ్డగోలుగా దోచు కొంటున్నారని, రాష్ట్రం దివాళా తీసిందని... ఇలా రకరకా లుగా దుష్ప్రచారం సాగిస్తూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగుదేశం చేస్తున్న యాగీ వల్ల... ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు అధికారకాంక్షను అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షం బాధ్యత ఏమిటంటే, ఏదైనా ఒక అంశాన్ని తీసుకొంటే.. దానిని ఒకస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలలో చర్చ జరిగేందుకు ఆస్కారం ఇవ్వాలి. దానిపై మంచి చెడుల్ని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ, నేడు రాష్ట్రంలో జరుగు తున్నదేమిటి? ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడమే! ప్రతి పథకంలో అవినీతి ఉందని దుష్ప్రచారం చేయడమే! చంద్రబాబు ఒక్కడికే పాలన చేతనవుతుందని, ఆయనొ క్కడే రాజకీయ వ్యవస్థలో ‘సుద్దపూస’ అనే ప్రచారాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా అదేపనిగా సాగిస్తోంది. బాబు 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఎవరికి తెలియదు? (చదవండి: రంధ్రాన్వేషణే... ప్రతిపక్షం పనా?) చంద్రబాబు తన జీవితంలో మేనేజ్మెంట్ పాలిటిక్స్ నడిపారే తప్ప కేసీఆర్ మాదిరిగా, మమతా బెనర్జీ లాగా పోరాటాలు చేశారా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి లాగా ప్రజల్ని మెప్పించి అధికారంలోకి వచ్చారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ మీద యుద్ధం చేస్తానన్న చంద్రబాబు ఆనాడు ఏం చేశారు? తనకున్న పలుకుడిని ఉపయోగించి ఢిల్లీలోని ఆంధ్రభవన్‌కు కొంతమంది జాతీయ పార్టీల నేతలను పిలిపించుకొని ఓ సభ పెట్టి, వారితో మోదీపై విమర్శలు చేయించారు. నల్ల బెలూన్లు ఎగరేశారు. దానిని పోరాటం అనగలమా? ఈవీఎంలను మోదీ హ్యాక్ చేయించి అడ్డదారుల్లో విజయం సాధిస్తున్నారని తీవ్రమైన ఆరోపణ చేయడమే కాక... దానిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని బాబు సవాళ్లు విసరడం ఎవరు మర్చి పోగలరు? ఏమయిందా న్యాయ పోరాటం? మోదీ తిరిగి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చారు కనుక భయ పడ్డారా? కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో కలిసి మోదీ నియంతృత్వం మీద పోరాటం చేస్తానని రాహుల్‌గాంధీ నివాసం ‘10 జన్‌పథ్’ ముందు నిలబడి జాతీయ మీడియా సాక్షిగా శపథం చేశారు కదా? ఏమైంది? 2019 ఎన్నికల తర్వాత తటస్థవైఖరి అని ఎందుకు వెనక్కి తగ్గినట్లు? తను దేశంలో లేని సమయంలో తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు... బీజేపీలో విలీనం అయిన పుడు చంద్రబాబు ఏమని ప్రకటించారు? న్యాయ పోరాటం చేస్తానన్నారు కదా! సుప్రీం కోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? తెలుగుదేశం రాజ్యసభాపక్షం మొత్తం బీజేపీ రాజ్యసభాపక్షంలో విలీనం అయినట్లు రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్యనాయుడు అధికారికంగా ప్రకటించిన తర్వాత... తెలుగుదేశం తరఫున సభ్యుడిగా కనక మేడల రవీంద్రకుమార్ ఎలా కొనసాగుతున్నట్లు? ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెబుతారు? (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) చంద్రబాబు చేసే పోరాటాలన్నీ చాటుమాటు వ్యవహారాలే. సొంత మీడియాను అడ్డుపెట్టుకొని, ఇతర పార్టీలలో తన ప్రయోజనాలను కాపాడే వ్యక్తులతో కలిసి ఆడే డ్రామాలే ఆయన సాగించే పోరాటాలు. చంద్రబాబు అనుసరించే ‘మోడస్ ఆపరేండీ’ ఎలా ఉంటుందంటే... సీఎం వైఎస్ జగన్ మీదనో లేక ప్రభుత్వం తీసుకున్న ఏదైనా ఒక నిర్ణయానికి వ్యతిరేకంగానో... తన సొంత మీడియాలో ముందుగా వార్తలు రాయిస్తారు. ఆ వార్తలను ఆధారంగా చేసుకొని ముందుగా ఇతర పార్టీలవారితో విమర్శలు, ఆరోపణలు చేయిస్తారు. ఆ పార్టీల వారి విమర్శలకు బలం ఎక్కువని, వాటిని ప్రజలు తేలిగ్గా నమ్ముతారన్నది బాబు దురాలోచన. ఆ తర్వాతనే తన పార్టీ వారిని రంగంలోకి దించుతారు. అలాగే తన మీడియాను, సామాజిక మాధ్యమాలను వారికి వెన్నుదన్నుగా మోహరిస్తారు. రాష్ట్రంలో ఏదో జరగరానిది జరిగిపోయినట్లు కలరింగ్ ఇస్తారు. అదే సమయంలో చంద్రబాబును దూరం చేసుకొని ప్రజలు ఘోరమైన తప్పిదం చేశారంటూ ఇంకోవైపు నుండి మరోరకమైన ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం కోసం ఫ్లెక్సీలు ఇతరత్రా ప్రచార సామగ్రిని రాష్ట్ర కార్యాలయం నుండే పంపుతారు. ఈ కార్యక్రమాల నిర్వహణ సామాన్య పార్టీ నేతల వల్ల సాధ్యం కాదు కనుక... భూతద్దం వేసి ఎవరు డబ్బు బాగా ఖర్చు పెడతారో కనిపెడతారు. వారిని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తారు. సదరు నాయకులు పార్టీ టిక్కెట్లు తమకే వస్తాయన్న ఆశతో... కోట్లు తగలేసుకొంటారు. చివరికొచ్చే సరికి ఇంకా బిగ్ ఫిష్‌ల కోసం చంద్రబాబు ఎదురు చూస్తుంటారు. చంద్రబాబు దైనందిన రాజకీయ జీవితంలో ఇదంతా ఓ భాగం. ఆయనకు వ్యక్తుల పట్ల మమకారం ఉండదు. వ్యవస్థల పట్ల గౌరవం ఉండదు. ప్రతిదీ రాజకీయమే! అధికారపక్షంలో బలంగా గొంతుక విన్పించే కొడాలి నాని వంటి వారిని టార్గెట్ చేయడానికి కారణం ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బ తీయాలన్న కుటిల వ్యూహమే. గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీ తేల్చిందట. పార్టీ పరంగా... ప్రత్యర్థి పార్టీ మీద కమిటీ వేయడం ఏమిటి? ఆ కమిటీ ఏమి తేలుస్తుందో ప్రజలు అర్థం చేసుకోరా? ఆయన చేసే ప్రతి పనీ ఇలాగే ఉంటుంది. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో తగిన విధంగా ఆయనకు గుణపాఠం చెబుతారు. - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
లాభాల రోడ్డెక్కిన ఓలా.. ఈసారి లాభం ఎంతంటే?
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్న ట్యాక్సీ సేవల సంస్థ ఓలా తొలిసారిగా నిర్వహణ లాభాలు ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ల అమలుతో ఆదాయం క్షీణించినప్పటికీ స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 90 కోట్లు లాభం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం సంస్థ రూ. 610 కోట్ల నష్టం ప్రకటించింది. తాజాగా ఆదాయం 65 శాతం క్షీణించి రూ. 690 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం నష్టం రూ. 1,715 కోట్ల నుంచి రూ. 1,326 కోట్లకు తగ్గింది. ఓలా మాతృ సంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ ఈ విషయాలు వెల్లడించింది. ఫుడ్ డెలివరీ, ఆర్థిక సేవల వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్న ఏఎన్ఐ కన్సాలిడేటెడ్ ఆదాయంలో .. సింహభాగం వాటా ట్యాక్సీ సేవల విభాగానిదే ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏఎన్ఐ టెక్నాలజీస్ ఆదాయం 63 శాతం క్షీణించి రూ. 983 కోట్లకు తగ్గగా, నిర్వహణ నష్టం రూ. 429 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడంపై కంపెనీ మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. 2020–21లో 1 కోటి మంది దాకా కొత్త యూజర్లు చేరారని, మరిన్ని కొత్త నగరాలకు కార్యకలాపాలు విస్తరిస్తున్నామని, కొత్త ఉత్పత్తులను రూపొందిస్తున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ఇటీవలే ప్రకటించారు. ఐపీవో ద్వారా 1–15 బిలియన్ డాలర్ల (రూ. 7,324–10,985 కోట్లు) నిధులు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. దీనికి సంబంధించి డిసెంబర్ త్రైమాసికంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసే అవకాశం ఉంది. -
ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి
విశాఖపట్నం: ఎయిడెడ్ స్కూల్స్ యాజమాన్యంతో ఆదివారం మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో.. మొత్తంగా 89 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయని, వాటిలో 69 పాఠశాలల యాజమాన్యాలు విలీనం చేసేందుకు ముందుకొచ్చాయని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడి లేదని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా, విద్యార్థుల చదువులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చదవండి: ‘ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పి?’ -
రూ.36.74 లక్షల కోట్లకు చేరిన మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ వైపు మరింత మంది ఇన్వెస్టర్లు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.36.74లక్షల కోట్లకు చేరాయి. 2020 సెప్టెంబర్ నాటికి ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.27.6 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 33 శాతం వృద్ధి చెందినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) వచ్చే నెలవారీ పెట్టుబడులు మొదటిసారి రూ.10,000 కోట్లను దాటినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి సాధనాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. సిప్ ఖాతాల్లో వృద్ధి.. సిప్ ఖాతాల సంఖ్య ఆగస్ట్ చివరికి 4,32,44,048గా ఉంటే.. సెప్టెంబర్ ఆఖరుకు 4,48,97,602 కోట్లకు పెరిగాయి. సిప్ రూపంలో సెప్టెంబర్‌లో నికరంగా రూ.10,315 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం మీద సిప్ ఖాతాలకు సంబంధించి నిర్వహణ ఆస్తులు రూ.5,44,976 కోట్లకు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్ల ఆస్తులు మొత్తం పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల్లో 48.23 శాతానికి చేరి.. రూ.17,72,049 కోట్లుగా ఉన్నాయి. -
మహిళా మేనేజ్మెంట్ పొజిషన్లలో, పట్టణాలకంటే గ్రామీణ మహిళల హవా
న్యూఢిల్లీ: సీనియర్, మధ్యస్థాయి మేనేజ్మెంట్ పొజిషన్ల(ఉద్యోగాల)లో పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్వో) ఒక నివేదికలో పేర్కొంది. 2019–20 ఏడాదికిగాను మేనేజ్మెంట్ స్థాయి సిబ్బంది మొత్తంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళల సంఖ్య 21.5 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. ఇదే సమయంలో పట్టణాలలో ఈ సంఖ్య 16.5 శాతమేనని తెలియజేసింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం మొత్తం సీనియర్, మధ్యస్థాయి మేనేజ్మెంట్ సిబ్బందిలో పట్టణాలు, గ్రామాలలో కలిపి మహిళా వర్కర్ల నిష్పత్తి 18.8 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. 2019 జులై– 2020 జూన్ మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను రూపొందించింది. చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే -
తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!?
ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది చిన్న చిన్న అనారోగ్యాలకు చికిత్స కోసం ఇప్పటికీ సంప్రదాయ మూలికలపైనే ఆధారపడుతున్నారు. ఇంటి తోటలో వీటిని పెంచడం వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి సృజనాత్మకమైన సంతృప్తి. మరోటి ఇంట్లో సంప్రదాయ వ్యాధుల చికిత్స. ఈసారి హోం గార్డెనింగ్‌లో భాగంగా ఇంటి తోటలోనే పెంచే ఔషధ మొక్కల గురించి తెలుసుకొని, వాటి పెంపకాన్ని ఆచరణలో పెట్టేయండి. ఈ మొక్కలకు ఎలాంటి మట్టి కావాలి, ఎంత నీరు పోయాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకోండి. అనేక ఉపయోగాల అలోవెరా కలబంద అనేక వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది. కలబంద రసం చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచుతుంది. జీర్ణకోశ సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. దోమ వంటి ఇతర కీటకాల కాటులో నొప్పి, మంటను తగ్గిస్తుంది. కలబందను కుండీలలో పెంచుకోవచ్చు. సూర్యకాంతి బాగుండాలి. తక్కువ నీరే అవసరం పడుతుంది. రెండు నెలలకు ఒకసారి కాస్తంత ఆవుపేడను ఎరువు గా వేస్తే సరిపోతుంది. తిప్పతీగ గిలోయ్ అనే ఈ తీగ ఆకు గంట ఆకారంలో ఉంటుంది. ఈ ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కాలేయం, మూత్రపిండాల సమస్యలను నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, మధుమేహానికి ఉపయోగపడుతుంది. దీనికి అమితమై శ్రద్ధ అవసరం లేదు. పెద్ద కుండీల్లో లేదా కుండలో మట్టి పోసి, నాటితే చాలు. సులభంగా పెరుగుతుంది. నిమ్మగడ్డి యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, తలనొప్పి సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియ మెరుగుకు సహాయపడుతుంది. ఈ గడ్డి మొక్కను వెడల్పాటి కుండీలలో పెంచుకోవచ్చు. దీనికి నీళ్లు ఎక్కువ అవసరం. కుండీ మట్టిపై భాగంలో ఇసుక పోయాలి. అప్పుడు అదనంగా నీళ్లు ఉన్నా త్వరగా ఇంకిపోతాయి. సరస్వతి ఆకు మండుకాపర్ణి, బ్రాహ్మి మొక్కగానూ పేరున్న సరస్వతి ఆకు అధిక ఒత్తిడి, అధిక రక్తపోటు, ఇతర మానసిక వ్యాధులను నయం చేయడానికి తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ మొక్కకు ఒక భాగం మట్టి, ఒక భాగం ఇసుక, రెండు భాగాలు సేంద్రీయ ఎరువుల మిశ్రమం ఉండాలి. రోజూ నీళ్లు పోయాలి. అశ్వగంధ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక వ్యాధులకు ప్రయోజనకారి. ఈ మొక్కలో ఆకులు, కాండం, వేళ్లు కూడా చికిత్సలో ఉపయోగపడతాయి. కుండీలలో సులభంగా పెంచగల చిన్న మొక్క. ఎక్కువ నీళ్లు అవసరం లేదు. వర్షాకాలం అసలే జలుబు కాలం. దాంతోపాటే దగ్గు, తుమ్ములు. కరోనా కాలం కూడా కావడం తో ఈ తరహా అనారోగ్యం మనల్ని భయపెడుతుంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగించే ప్రకృతి ఔషధ వరాలు గల మొక్కలు మన ఇంట్లోనే ఉంటే ఆందోళన కొంత తగ్గుతుంది. -
మా ఫీజులిచ్చేయండి..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లకు కూడా తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ‘హాస్టళ్ల నుంచి మీ పిల్లలను తీసుకెళ్లండి..’అని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పంపించేస్తున్నాయి. అయితే హాస్టళ్ల ఫీజులు పూర్తిగా చెల్లించిన తల్లిదండ్రులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు కట్టి నెలైనా గడవక ముందే హాస్టళ్లు మూతపడిన నేపథ్యంలో తమకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కొందరు, వచ్చే సంవత్సరానికి సర్దుబాబు చేయాలని కొందరు కోరుతున్నారు. మార్చి నెలలోనే అధికంగా చేరికలు కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యక్ష బోధనను ప్రారంభించింది. ఫిబ్రవరిలోనే ప్రారంభమైనప్పటికీ మార్చి నెలలోనే ఎక్కువమంది హాస్టళ్లలో చేరారు. జేఈఈ మెయిన్ రెండో పరీక్ష అనంతరం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాస్టళ్లలో వచ్చి చేరారు. పాఠశాలల హాస్టళ్లు మొదలుకుని అన్ని కళాశాలల హాస్టళ్లలో 4.5 లక్షల మంది వరకు విద్యార్థులు చేరినట్లు అంచనా. రాష్ట్రంలో 1,584 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా, 574 కాలేజీలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. ఇవి ప్రత్యక్ష బోధన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా విద్యార్థులను హాస్టళ్లలో చేర్చుకున్నాయి. ఇక 10,900 వరకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా వేయి వరకు విద్యా సంస్థలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. వాటిల్లోనూ ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులను తల్లిదండ్రులు హాస్టళ్లలో చేర్పించారు. మరోవైపు రాష్ట్రంలోని 250 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు కూడా హాస్టళ్లను ప్రారంభించాయి. ఆయా కాలేజీ ల్లోని సుమారు 40 వేల మందికి పైగా విద్యార్థులు హాస్టల్ ఫీజులు చెల్లించారు. మిగిలిన 3, 4 నెలల కాలానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు యాజమాన్యాలు వసూలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం చొరవ తీసుకోవాలిఅయితే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థులు సైతం వైరస్ బారిన పడుతుండటంతో ప్రభుత్వం విద్యాసంస్థలు, హాస్టళ్లు మూసేయాలని ఆదేశించింది. అయితే చాలామంది తల్లిదండ్రులు ఫీజులు చెల్లించి నెల రోజులైనా గడవక ముందే, ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి చేర్పించిన కొందరు తల్లిదండ్రులు తమ స్వస్థలాలకు చేరారో లేదో.. హాస్టళ్లు మూతపడటంతో సమస్య ఏర్పడింది. పిల్లల చదువు కోసం అప్పులు చేసి మరీ ఫీజులు పూర్తిగా చెల్లించామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులకు చెల్లించిన ఫీజులను వెనక్కి ఇప్పించాలని, మిగతా విద్యార్థులకు సంబంధించిన ఫీజులను వెనక్కి ఇచ్చేలా లేదా వచ్చే విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కరోనా : మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లకు మహీంద్రా షాక్
సాక్షి,ముంబై: దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా వందలమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీ షాక్ ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ మూడు వందలమంది మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది. ముఖ్యంగా మహీంద్రా మొబిలిటీ సర్వీసెస్ అధ్యక్షుడు గ్రూప్ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు వీఎస్ పార్థసారధి సహా పలువురు సీనియర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో ఉన్నారు. మహీంద్రా వ్యాపార ప్రణాళిక విభాగాధిపతి ప్రహ్లాద రావు ,ఇతర సీనియర్ స్థాయి అధికారులు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఎంఅండ్ఎం అధికారిక ధృవీకరణ ఏదీ ప్రస్తుతానికి లేదు. వాహనాల విక్రయాల్లో క్షీణత నేపథ్యంలో మహీంద్రా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమలో మందగమనానికి తోడు కరోనా వైరస్, లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ప్రస్తుతానికి ఆటో, వ్యవసాయ విభాగానికి మాత్రమే పరిమితమైన ఈ కోతలు మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి కూడా పాకనుందనే ఆందోళన నెలకొంది. మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అమ్మకాలలో 27.52 శాతం క్షీణించింది. పరిశ్రమల పరిమాణం 13.2 శాతం తగ్గింది. అయితే ఫిబ్రవరిలో ప్రయాణీకుల వాహన రిటైల్ అమ్మకాలు 10.6శాతం పెరగగా, ద్విచక్ర వాహన విక్రయాలు 16.08 శాతం తగ్గాయి. టాటా యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశంలో మూడింట ఒకవంతు సిబ్బందిని తొలగించిన సంగతి తెలిసిందే. -
విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్
సాక్షి, ముంబై : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ లో అమ్మకాలతో వినియోగదారులకు ఆకట్టుకోవడమే కాదు.. విద్యార్థులకు కూడా శుభవార్త తెలిపింది. దేశంలోని టైర్ 2 సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నెల16న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాల్లో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ తాజాగా ప్రకటించిన ‘లాంచ్‌ప్యాడ్’ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం 45 రోజులు ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు సప్లయి చెయిన్ మేనేజ్మెంట్లో నైపుణ్యాన్ని పొందవచ్చు. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు) ఈ-కామర్స్ ఇండస్ట్రీలో కస్టమర్లకు సరుకులు డెలివరీ ప్రాసెస్‌ను, క్లిష్టమైన నైపుణ్యాలను విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా తెలుసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి సంక్షోభం మధ్య కీలకంగామారిన ఇకామర్స్ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి లాంచ్‌ప్యాడ్ రూపొందించామనీ, దీర్ఘకాలంలో మంచి అర్హత కలిగిన, బాగా శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన నిపుణులతో తమ సప్లయ్ చెయిన్ వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. (వివాదంలో ఫ్లిప్‌కార్ట్ : క్షమాపణలు) ఫ్లిప్‌కార్ట్ ఇందుకోసం 21 ప్రాంతాల్లోని పలు విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తోంది. వాటిలో తెలంగాణలోని మేడ్చల్, మహారాష్ట్రలోని భివాండి, హర్యానాలోని బినోలా, ఉలుబేరియా, డంకుని (పశ్చిమబెంగాల్), కర్నాటకలోని మలూర్ వంటి ప్రాంతాలున్నాయి. సప్లయి చెయిన్ మేనేజ్మెంట్ గురించి ఫ్లిప్‌కార్ట్ స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యా సేతు యాప్, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ లాంటి సంబంధిత కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటిస్తామని విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు యువ విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. గత ఏడాది ప్రారంభించిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో 'ది బిగ్ బిలియన్ డేస్ 2019' సందర్భంగా దేశవ్యాప్తంగా 2 వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు శిక్షణ పొందారని గుర్తు చేశారు. -
సగం పడకలపై చర్చలూ సగమే!
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఆస్పత్రుల్లోని కరోనా పడకల్లో సగం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంలో విధివిధానాల ఖరారుకు యాజమాన్యాలతో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ జరిపిన చర్చలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడ్డాయి. శనివారం మరోసారి సమావేశమై తుది నిర్ణయానికి రావాలని అధికారులు, యాజమాన్యాల ప్రతి నిధులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు వస్తుండటంతో సగం పడకలను స్వాధీనం చేసుకోవాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయడానికి ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రెండు గంటలపాటు చర్చించినా ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోయారు. రూ.4 లక్షలకు మించొద్దు...: ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పడకల ఫీజులు గతంలో కేటాయించినట్లుగానే ఉంటాయి. అంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లోని సాధారణ వార్డులో చికిత్సకు రూ.4 వేలు, ఐసీయూలో రూ.7,500, వెంటిలేటర్ మీద పెడితే రూ.9 వేలు రోజుకు వసూలు చేయాలన్న నిబంధన యథావిధిగానే ఉంటాయి. అయితే పీపీఈ కిట్లు, సాధారణంగా ఇచ్చే మందులు, అత్యవసరమైన అధిక ధర కలిగిన మందులు వాడితే ఎంత తీసుకోవాలన్న దానిపైనే సందిగ్ధత నెలకొందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీనిపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించాయి. సీటీ స్కాన్లు ఎన్ని చేస్తున్నారు? కొందరికి డయాలసిస్ చేయాల్సి వస్తే ఎంత అవుతుంది? ప్రొటోకాల్ అమలులో అయ్యే ఖర్చు ఎంత? వివిధ రకాల టెస్టులకు అవుతున్న ఖర్చు ఎంత? దాదాపు నెలకుపైగా చికిత్సలు చేస్తున్నందున అవుతున్న వాస్తవ ఖర్చు వివరాలతో ప్రతిపాదన తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కార్పొరేట్ ఆస్పత్రులను కోరాయి. ఎంత సీరియస్ కేసు అయినా 14 రోజులకు గరిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు మించి వసూలు చేయకూడదని సర్కారు భావిస్తోంది. ఆ ప్రకారం సాధారణ కరోనా కేసులకు రూ.లక్షన్నర, ఆక్సిజన్ పడకలపైకి వెళితే రూ.2 లక్షలు, వెంటిలేటర్‌పైకి వెళితే రూ.3 లక్షలు, ఒకవేళ ఇంకా సీరియస్ అయి ఒకట్రెండు రోజులు ఉంచాల్సి వస్తే రూ.4 లక్షలు కావొచ్చని.. ఏది ఏమైనా సీలింగ్ రూ.4 లక్షలకు మించి ఉండకూడదని సర్కారు కార్పొరేట్లకు తేల్చిచెప్పింది. ఇవి కేవలం కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తాయని, వీటిపై నిర్ణయం తీసుకున్నాక మిగిలిన ఇతర ప్రైవేటు ఆస్పత్రులను మరో రెండు మూడు రోజుల్లో పిలిచి వాటితోనూ చర్చిస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంకా తక్కువ ఫీజులనే ఖరారు చేస్తామని చెబుతున్నాయి. ఇదిలావుంటే ఇక ప్రైవేట్, కార్పొరేట్లు తాము సొంతంగా నింపుకునే సగం పడకల ఫీజులు వాటి ఇష్టానికే వదిలేస్తారని అంటున్నారు. ఒకవేళ అలా వదిలేస్తే ఒకేచోట రెండు ఫీజుల్లో భారీ తేడాతో కొందరు రోగులు కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. దీనిపై విధివిధానాల్లో స్పష్టత రానుంది. -
ఆస్పత్రుల యాజమాన్యాలతో గవర్నర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ కానున్నారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆస్పత్రుల పని తీరు, చికిత్స అందిస్తున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అయితే తమకు ప్రభుత్వం విధించిన చార్జీలు సరిపోవడం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిన యాజమాన్యాలు విన్నవించాయి. చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వం చార్జీలు పెంచడంతో పాటు బెడ్స్ పరిమితిని పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరనున్నాయి. (చదవండి: సర్కారు, గవర్నర్.. ఓ కరోనా) -
కరోనా మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటు
సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారు లు ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. అడుగడుగునా నిబంధనలు విధిస్తూ గుంటూరు నగరంతో పాటు అన్ని ప్రాంతాలను అష్టదిగ్బంధం చేశారు. రెడ్‌జోన్ ఏరియాల్లో రాకపోకలను నియంత్రించా రు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, కూర గాయలు, పండ్లను ఇంటి ముంగిటకే చేర్చే ఏర్పా ట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ని బంధనలు సడలించినా రెడ్‌జోన్ ప్రాంతాల్లో మా త్రం కఠిన ఆంక్షలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ టీమ్‌ల ద్వారా శాంపిళ్ల సేకరణ ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో పాటు, విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్‌లోనే ఉండాలని, అవసరమైన వైద్య సేవలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కరోనా అనుమానితులను క్వారంటైన్ సెంటర్లకు తరలించి మొబైల్ టీమ్‌ల ద్వారా శాంపిళ్లు సేకరిస్తున్నారు. గుంటూరు నగరంలో అణువణువునా రెండు ఫైర్ ఇంజిన్లు, ప్రత్యేక యంత్రాల ద్వారా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. గుంటూరులో కేసులు పెరుగుతున్న దృష్ట్యా నగరంలోకి రాకపోకలను నిలిపి వేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, అడిషనల్ డీజీ కృపానంద త్రిపాఠి, ఐజీ ప్రభాకరరావు, అర్బన్, రూరల్ ఎస్పీ విజయరావులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటు జిల్లాలో ఇప్పటికే 30 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా కరోనా మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఆప్రాంతంలో ఉన్న పెద్దలు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయనున్నారు. కరోనా వ్యాప్తి జరుగకుండా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలను కమిటీల ద్వారా వివరించి ఆ ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 471 శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లకు పంపగా అందులో 30 పాజిటివ్‌గా వచ్చాయి. 377 నెగిటివ్ వచ్చాయి. మిగిలిన ఫలితాలు రావాల్సి ఉంది. ప్రైవేటు వైద్యులు, నర్సులు సహకరించాలి ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులు, అందులో పనిచేసే నర్సులు, పారామెడికల్ సిబ్బందిని అత్యవసర సరీ్వసుల కిందకు తెచ్చింది. ప్రైవేటు వైద్యులు, నర్సులు విధులకు గైర్హాజరైతే వారి లైసెన్సులు రద్దు చేస్తాం. ఎస్మాను ప్రయోగిస్తాం. దీంతో వారు ప్రాక్టీస్ చేసుకోవడంతోపాటు, ఉద్యోగం చేసుకునే అవకాశం కోల్పోతారు. కాబట్టి ప్రైవేటు వైద్యులు, నర్సులు, సిబ్బంది ప్రభుత్వానికి సహకరించాలి. దీంతో పాటు కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యవంతం చేయడంతోపాటు, అక్కడ మెరుగైన చర్యలు తీసుకునే దిశగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నాం. లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నాం. – ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, జిల్లా కలెక్టర్, గుంటూరు నేడు గుంటూరులో సంపూర్ణ లాక్డౌన్ సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో సోమవారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు గుంటూరు రేండ్ ఐజీ ప్రభాకర్‌రావు చెప్పారు. బ్యాంకులు, రైల్వే, ఇతర కార్యాలయాలకు వెళ్లే వారిని ఉదయం 10 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలోనే అనుమతిస్తామన్నారు. జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసినట్టు సాక్షికి చెప్పారు. కరోనా పాజిటివ్ నమోదైన వారి నుంచి లోకల్ కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భద్రత మరింత పెంచామన్నారు. నగరానికి నాలుగు ఏపీఎస్పీ బెటాలియన్లు కేటాయించామన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, గతనెల 17వ తేదీ దురంతో, 20వ తేదీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వారు ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. -
మహీంద్రా మేనేజ్మెంట్లో భారీ మార్పులు
న్యూఢిల్లీ: వ్యవసాయోత్పత్తుల నుంచి ఐటీ దాకా వివిధ రంగాల్లో విస్తరించిన మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) టాప్ మేనేజ్మెంట్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి ఆనంద్ మహీంద్రా (64) తప్పుకోనున్నారు. 2020 ఏప్రిల్ 1 తర్వాత నుంచి నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం పవన్ కుమార్ గోయెంకా మరోసారి మేనేజింగ్ డైరెక్టరుగా నియమితులయ్యారు. అలాగే, 2020 ఏప్రిల్ 1 నుంచి ఏడాది పాటు ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈవో) బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. అటు పైన గోయెంకా పదవీ విరమణ అనంతరం 2021 ఏప్రిల్ 1 నుంచి అనీష్ షా .. ఎండీ, సీఈవోగా ఉంటారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో పాటు సమీప భవిష్యత్‌లో చేపట్టే ఇతరత్రా ప్రాజెక్టులు సజావుగా అమలయ్యేలా చూసేందుకు ప్రత్యేకంగా సీఈవో పదవిని ఏర్పాటు చేసినట్లు ఎంఅండ్ఎం తెలిపింది. ఇంకా కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయని, డిసెంబర్ 23న వాటిని వెల్లడించనున్నామని పేర్కొంది. కీలక నియామకాలకూ సంబంధించి కంపెనీలో అంతర్గత సిబ్బందితో పాటు బైటివారినీ ఇంటర్వ్యూ చేసినట్లు గవర్నెన్స్, నామినేషన్ కమిటీ (జీఎన్‌ఆర్‌సీ) చైర్మన్ ఎంఎం మురుగప్పన్ తెలిపారు. కొత్త నాయకత్వం..మహీంద్రా విలువలను కాపాడుతూ, సంస్థను ముందుకు తీసుకెళ్లగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘సంస్థను ముందుకు నడిపించగలిగే సత్తా గల సమర్ధులకు ఎంఅండ్ఎంలో కొదవేమీ లేదనడానికి ఇది నిదర్శనం. ఆయా బాధ్యతల్లో నియమితులైన వారు కంపెనీ సంస్కృతి, విలువలు, మెరుగైన నిర్వహణ ప్రమాణాలు కొనసాగించగలరు. కొత్త పాత్రలో మహీంద్రా గ్రూప్ విలువలకు కస్టోడియన్‌గా, షేర్‌హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షకుడిగానూ వ్యవహరిస్తాను. అంతర్గత ఆడిట్ ఇకపైనా నాకే రిపోర్ట్ చేస్తుంది. బోర్డు పర్యవేక్షణ నా సారథ్యంలోనే ఉంటుంది’ అని తాజా మార్పులపై ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఆనంద్ సారథ్యంలో భారీ విస్తరణ.. దాదాపు 20.7 బిలియన్ డాలర్ల గ్రూప్‌గా ఎదిగిన ఎంఅండ్ఎం గ్రూప్‌నకు ఆనంద్ మహీంద్రా మేనమామ కేశుభ్ మహీంద్రా సుమారు 45 ఏళ్ల పాటు సారథ్యం వహించారు. 2012 ఆగస్టులో ఆయన చైర్మన్ హోదా నుంచి తప్పుకోవడంతో ఆనంద్ మహీంద్రా ఆ బాధ్యతలు చేపట్టారు. ఆనంద్ నేతృత్వంలో ఎంఅండ్ఎం గ్రూప్ దేశ, విదేశాల్లో.. ఆటోమొబైల్స్, వ్యవసాయం, ఐటీ, ఏరోస్పేస్ తదితర అనేక రంగాల్లో దూకుడుగా విస్తరించింది. పలు కంపెనీల కొనుగోళ్లలో కూడా ఆనంద్ కీలకపాత్ర పోషించారు. దేశీయంగా సత్యం కంప్యూటర్ సర్వీసెస్, రెవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ మొదలుకుని సాంగ్యాంగ్ మోటార్స్, ప్యూజో మోటార్‌సైకిల్స్, గిప్స్‌ల్యాండ్ ఏరోనాటిక్స్ తదితర అంతర్జాతీయ సంస్థలను ఎంఅండ్ఎం కొనుగోలు చేసింది. సీఈవోగా కూడా బాధ్యతలు చేపట్టనున్న పవన్ గోయెంకా .. ఎంఅండ్ఎంలో అంచెలంచెలుగా ఎదిగారు. కొత్త బాధ్యతల్లో... ► ప్రస్తుతం గ్రూప్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ విభాగం)గా ఉన్న అనీష్ షా.. ఇకపై డిప్యూటీ ఎండీగాను, గ్రూప్ సీఎఫ్‌వోగాను వ్యవహరిస్తారు. ప్రస్తుత సీఎఫ్‌వో వీఎస్ పార్థసారథి ఇకపై.. మహీంద్రా లాజిస్టిక్స్, ఆటో మొబిలిటీ సర్వీసెస్‌ను కలిపి ఏర్పాటు చేసే మొబిలిటీ సేవల విభాగానికి సారథ్యం వహిస్తారు. ► ప్రస్తుతం వ్యవసాయ పరికరాల విభాగం ప్రెసిడెంట్‌గా ఉన్న రాజేష్ జెజూరికర్.. ఇక మీదట ఎంఅండ్ఎం బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా (ఆటో, వ్యవసాయ విభాగాలు) చేరతారు. ► టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాని.. 2020 ఏప్రిల్ 1 నుంచి గ్రూప్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా చేరతారు. ► 2020 ఏప్రిల్ 1న పదవీ విరమణ చేయనున్న గ్రూప్ ప్రెసిడెంట్ రాజీవ్ దూబే.. ఆ తర్వాత నుంచి నాన్–ఎగ్జిక్యూటివ్, సలహాదారు హోదాలో కొనసాగుతారు. -
జీవ జలం.. హాలాహలం
తెట్టెలు కట్టిన మురుగు.. గుట్టలుగా పోగుబడిన వ్యర్థాలు.. చూస్తేనే ‘జల’దరింప చేసేలా ఉన్న ఇది మురుగు కాలువ కాదు. జీవనది గోదావరి. మంచి ర్యాల పట్టణం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని గృహ, పారిశ్రామిక వ్యర్థ జలమంతా రాళ్లవాగు ద్వారా నేరుగా వచ్చి గోదావరిలో ఇలా కలుస్తోంది. నీటిలో బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) స్థాయి లీటరుకు 3 మిల్లీగ్రాములు మించితే ప్రమాదకరంగా భావిస్తారు. అయితే, గోదావరిలో బీఓడీ స్థాయి 4 నుంచి 9 మిల్లీగ్రాముల వరకు ఉందంటే.. ఈ జీవనవాహిని ఎంతటి కాలుష్య కాసారంగా మారిపోతోందో అర్థం చేసుకోవచ్చు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయినిలుగా ఉన్న నదీమ తల్లులు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నా యి. నిత్యం వేల గ్యాలన్ల మురుగునీరు, టన్నుల కొద్దీ చెత్త, పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామ, పట్టణ ప్రాంతాల నుంచి శుద్ధి చేయని మురుగును నదిలోకి వదిలేస్తుండటం, ప్లాస్టిక్ వంటి ఘన వ్యర్థాల కారణంగా వందల కిలోమీటర్ల మేర గోదావరి, కృష్ణా నదులు కలుషితమవుతున్నాయి. దీంతో నదుల్లో ఉండాల్సిన స్థాయి కన్నా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయి, ఆ నీరు తాగడానికి, స్నానం చేసేందుకే కాదు కనీసం జలచరాలు కూడా బతకలేని పరిస్థితిని తీసుకొస్తున్నాయి. అత్యంత ప్రమాదకరంగా గోదావరి.. బాసర నుంచి భద్రాచలం వరకు 500 కి.మీ.ల మేర ప్రయాణిస్తున్న గోదావరిలో 4 ఉపనదులు, మరిన్ని నాలాలు కలుస్తున్నాయి. నది పరీవాహకంలోని 19 ప్రధాన పట్టణాల నుంచి గోదావరిలో అవ్యవస్థీకృత వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు వచ్చి చేరుతోంది. బాసర వద్ద గోదావరిలోకి మహారాష్ట్రలోని పరిశ్రమల ద్వారా, భద్రాచలం వద్ద ఐటీసీ కాగితపు పరిశ్రమల ద్వారా వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయి. భద్రాచలంలో మురుగునీటి శుద్ధి కేంద్రం లేకపోవడంతో ఆ నీరంతా బూర్గంపహాడ్ వద్ద నదిలో కలుస్తోంది. మంచిర్యాల పట్టణ మురుగునీరు రాళ్లవాగు ద్వారా, ధర్మపురి పుణ్యక్షేత్రం వద్ద నాలాల ద్వారా మురుగు గోదావరిలోకి వస్తోంది. మొత్తంగా 54 పరివాహక పట్టణాల్లోని మురుగు కాల్వల ద్వారా గోదావరిలోకి వచ్చి చేరుతున్నట్లు ఇదివరకే గుర్తించారు. ఈ పరివాహక పట్టణాల్లో 22.57 లక్షల మేర జనాభా ఉండగా ఇక్కడ రోజుకు 249.81 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) మేర నీరు వినియోగిస్తుండగా అందులో 200 ఎంఎల్డీ మురుగు నదిలో చేరుతోంది. రోజుకు 6.75 లక్షల కేజీల ఘన వ్యర్థాలు నదిలో చేరుతుండటం మరింత సమస్యగా మారుతోంది. దీనికి తోడు పరీవాహకం వెంట ఉన్న 244 పరిశ్రమల ద్వారా 8,825 కేఎల్డీల వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి. దీంతో నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్ (డీఓ) పరిమాణం క్రమంగా తగ్గుతోంది. డీఓ పరిణామం లీటర్‌కు కనీసం 4 మిల్లీగ్రాములు ఉండాలి. కానీ ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక నీటిలో బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) లీటర్‌కు 3 మిల్లీగ్రాములు మించొద్దని నిబంధనలు ఉన్నా.. ప్రస్తుతం నదిలో బీవోడీ స్థాయి 4 నుంచి 9 మిల్లీగ్రాములు/లీ వరకు ఉంది. దీంతో నదిలోని నీరు తాగేందుకు కానీ, స్నానాలకు కానీ వాడేందుకు పనికి రావు. డీవో తగ్గేకొద్దీ బీఓడీ పెరుగుతూ వస్తోంది. గోదావరికి ఉపనది అయిన మంజీరాలోనూ బీఓడీ స్థాయి ఏకంగా 5 ఎంజీ/లీ నుంచి 26ఎంజీ/లీటర్‌గా ఉందని నివేదికలు చెబుతున్నాయి. నక్కవాగులో సైతం బీఏడీ శాతం ఏకంగా 26 ఎంజీ/లీటర్‌గా నమోదైంది. ఇక వరంగల్ నుంచి సోమన్‌పల్లి వరకు ఉన్న మానేరులోనూ 6–20ఎంజీ/లీటర్‌గా బీఓడీ నమోదు కావడం గమనార్హం. ఇవే పరిస్థితులు కొనసాగితే మున్ముందు జలచరాలకు తీవ్ర గడ్డు పరిస్థితులు తలెత్తడంతో పాటు సాగు అవసరాలను తీర్చడం ఇబ్బందికరంగా పరిణమించనుంది. కృష్ణాలోనూ అదేతీరు.. కృష్ణా నదీ, దాని ఉపనదుల్లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తంగడి మొదలు వడపల్లి వరకు ఉన్న కృష్ణా పరివాహకంలో బీఓడీ స్థాయి 5–నుంచి 7మి.గ్రా/లీ.గా నమోదవ్వగా, మూసీలో అయితే ఏకంగా 4మి.గ్రా/ లీ నుంచి 60మి.గ్రా/లీటర్‌గా ఉంది. కర్నూలు తుంగభద్ర నది ద్వారా ఎగువ నుంచి కాలుష్య రసాయనాలు కృష్ణాలో కలుస్తున్నాయి. దీంతో పాటు కృష్ణా పరివాహకం వెంట ఉన్న కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల, నల్లగొండ వంటి పట్టణాల ద్వారా వస్తున్న మురుగు కారణంగా కృష్ణానది కాలుష్యం బారిన పడుతోంది. అడ్డుకట్ట ఎలా వేయాలంటే.. నదీజలాలు కలుషితం కాకుండా ఉండాలంటే ఏమేం చేయాలో జాతీయ హరిత ట్రిబ్యునల్ రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. అవి.. – కాలుష్య నివారణకు పారిశ్రామిక, గృహ సంబంధ వ్యర్థాలను నియంత్రించడంతో పాటు, శుద్ధి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – ఎక్కువగా మురుగు ఉత్పత్తికి కారణమవుతున్న పట్టణాలు, గ్రామాలను గుర్తించి ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి. – ఎన్టీపీసీ, టీఎస్జెన్కోలు ఉన్న ప్రాంతాల్లో కర్మాగారాల నుంచి వెలువడే బూడిద నియంత్రణకు సరైన యాంత్రీకరణ ఉండాలి. – ప్రతి ఆస్పత్రిలో తక్కువ వ్యయంతో దాని ఆవరణలోనే ఎస్టీపీలు ఏర్పాటు చేయించాలి. – నది పరీవాహకంలోని పరిశ్రమలన్నీ భూగర్భ జల వనరులశాఖ అనుమతిలేనిదే వ్యర్థాలు విడుదల చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రక్షాళనకు కేంద్రం చొరవ దేశవ్యాప్తంగా అత్యంత కలుషితమైనవిగా గుర్తించిన 13 నదుల్లో కృష్ణా, గోదావరి ఉండటంతో గంగానది మాదిరిగా వీటినీ ప్రక్షాళన చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా అనంత్ 1, అవిరల్ధార, నిర్మల్ ధార పేర్లలో కార్యక్రమాలను చేపట్టిన కేంద్రం, రాష్ట్ర అటవీశాఖ సహకారంతో కృష్ణా, గోదావరి నదుల పునరుజ్జీవానికి ప్రయత్నా లు ముమ్మరం చేసింది. తొలి ప్రయత్నంలో భాగంగా నదుల ప్రస్తుత స్థితి, పరివాహక ప్రాంత పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమైంది. కృష్ణా, గోదావరి నదులకు 2 వైపులా 5 కి.మీ. మేర, వాటి ఉపనదుల పరిధిలో ఇరువైపులా 2 కి.మీ. మేర మొక్కలు నాటేందుకు సన్నద్ధమవుతోంది. నదీ పరివాహకాల్లో చెట్లు నాట డం, కోతను నియంత్రించడం, ఇసుక తవ్వకాలను నిషేధించడం వంటివి చేపట్టనుంది. -
ఆర్టీసీ కార్మికులతో యాజమాన్యం చర్చలు
సాక్షి, విజయవాడ : ఆర్టీసీ యాజమాన్యం, కార్మికులు మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 13 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆర్టీసీ ఎండీ విదేశీ పర్యటన కారణంగా అధికారులు ఈ చర్చలో పాల్గొన్నారు. ప్రధానంగా 18 డిమాండ్లను నెరవేర్చాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. చర్చలు విఫలమైతే తాము సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. కాగా, తమ పోరాటం ఆర్టీసీ యాజమాన్యం మీదే కానీ.. ప్రభుత్వంపైన కాదని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఆర్టీసీని ఆదుకుంటామని చెప్పి గత ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలే సమ్మెకు కారణమని, కార్మిక సంఘాలతో సంబంధాలు లేకుండా, గుర్తింపు సంఘంతో చర్చలు లేకుండా ఎండీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ఆదుకుంటారనే నమ్మకం ఉందని తెలిపారు. -
విలువైన విమానాలను మూలన పడేశారు..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా అధికారులకు భారత వాణిజ్య పైలట్ల సంఘం (ఐసీపీఏ) రాసిన లేఖ ఆలోచన రేకెత్తిస్తోంది. ఎయిర్‌లైన్స్ విమానాల నిర్వహణపై వారు ఆసక్తికర అంశాలను లేఖలో లేవనెత్తారు. సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ321 విమానాల్లో 40 శాతం విమానాలను గ్రౌండ్‌కే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. ఏ 319 ఎయిర్‌క్రాఫ్ట్ కీలక రూట్లలో అధిక సీటింగ్ సామర్ధ్యం ఉన్న క్రమంలో మెరుగైన ఆదాయ వనరుగా ఉన్నప్పటికీ వాటిలో చాలా వరకూ ఖాళీగా ఉంచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ 25,000 కోట్ల విలువైన విమానాలను వాడకుండా పడేయడంతో ప్రతిరోజూ సంస్థకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.సంస్థకు చెందిన 22 ఎయిర్‌బస్ ఏ 319 విమానాలకు గాను నాలుగు విమానాలు రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా లేవని పేర్కొంది. ఇక 15 బోయింగ్ 777-300 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు గాను 5 విమానాలు హ్యాంగర్‌కే పరిమితమయ్యాయని తెలిపింది. విడిభాగాల కొరతతో ఎయిర్ ఇండియా విమానాల్లో దాదాపు 23 శాతం విమానాలు ఆపరేషన్స్‌కు దూరంగా ఉన్నాయని పేర్కొంది. ఈ విమానాలు ఎందుకు ఇన్ని రోజులుగా గ్రౌండ్‌కే పరిమితమయ్యాయని మేనేజ్మెంట్ను పైలట్లు నిలదీశారు. ఖర్చును నియంత్రించుకోవడంలో యాజమాన్యం విఫలమైందా అని ప్రశ్నించారు. ఎయిర్ ఇండియా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో పైలట్లు రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఎయిర్ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకే ప్రభుత్వం దృష్టిసారించిందని, పూర్తిగా సంస్థను వదిలించుకోవాలనే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పునరుద్ఘాటించారు. -
రెస్టారెంట్లో దారుణం.. వర్కర్స్‌ని రూమ్‌లో బంధించి
సాక్షి, మంచిర్యాల : పట్టణంలోని ఓ రెస్టారెంట్లో దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ యాజమాన్యం అక్కడ పనిచేస్తున్న కుకింగ్ మాస్టర్స్, వేటర్స్‌ను గదుల్లో బంధించి చిత్రహింసలకు గురి చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల పట్టణం హైటెక్ కాలనీ సమీపంలోని టేబుల్7 రెస్టారెంట్లో పనిచేస్తున్న మొత్తం 11మందిని మూడు గదుల్లో బంధించి యాజమాన్యం విచక్షణా రహితంగా చితకబాదింది. రెస్టారెంట్ ఓనర్ ప్రవీణ్‌కు వీడియో కాల్లో చిత్రహింసల దృశ్యాలను చూపిస్తూ యాజమాన్యం కిరాతకంగా వ్యవహరించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులు 100కు డయల్ చేయటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని రక్షించారు. అయితే పనివాళ్లను చిత్రహింసలకు గురిచేయటానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. -
ఫేస్బుక్ టీంలో తొలిసారి భారీ మార్పులు
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ మేనేజ్మెంట్లో దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా సంస్థ తొలిసారిగా మేనేజ్మెంట్ టీంలో భారీ మార్పులు చేర్పులు చేసింది. దాదాపు 12మందికిపైగా ఎగ్జిక్యూటివ్‌ల పదవలుల్లో మార్పులు చేసింది. ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్స్‌ను మూడు యూనిట్లుగా విడదీసింది. ముఖ్యంగా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలురేపిన డేటా గోప్యతా కుంభకోణం తరువాత నాయకత్వ బృందంలో మార్పులు చేసినట్టు ఫేస్బుక్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ యాప్ లాంటి ప్రధాన విభాగాలకు కొత్త వారిని నియమించింది. ముఖ్యంగా బ్లాక్‌చెయిన్ టూల్‌ను తిరిగి లాంచ్ చేసింది. ఈ వివరాలను ఫేస్బుక్ మంగళవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. మార్చి నెలలో కొన్ని లక్షలమంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ ఈచర్య చేపట్టింది. సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మునుపటిలాగానే సీఈవోగా కొనసాగుతారు. ఇక సీఈవో తర్వాత రెండవ అతి కీలకమైన ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ సాండ్బర్గ్ ఉంటారు. జుకర్‌బర్గ్ సర్కిల్లో దీర్ఘకాల సభ్యుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న క్రిస్ కాక్స్‌కు సంస్థ ప్రమోషన్ ఇచ్చింది. ఇకపై క్రిస్ ఫేస్బుక్ యాప్, స్మార్ట్‌ఫోన్‌సేవలు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ యాప్‌లకు ప్రధాన ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తారు. మరో ఎగ్జిక్యూటివ్ జేవియర్ ఆలివాన్ భద్రతా , "సోషల్ ప్రొడక్ట్ సర్వీసెస్" విభాగ నిర్వహణ బాధ్యతలను చేపడతారు. బిట్కాయిన్లకోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని పునరుద్ధరించింది. మెసెంజర్ చాట్ యాప్‌కు చెందిన డేవిడ్ మార్కస్ దీనికి నాయకత్వం వహిస్తారు. న్యూస్ ఫీడ్ మాజీ హెడ్ ఆడమ్ మోస్సేరిని ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు (కెప్టెన్ కెవిన్ వీల్ స్థానంలో) నియమించింది. వాట్సాప్ కో ఫౌండర్ జాన్ కోమ్ రాజీనామా అనంతరం అతని స్థానంలో క్రిస్ డేనియల్స్‌ను నియమించింది. అలాగే ఒబామా మాజీ పరిపాలన అధికారి, క్రేన్మేర్ గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన జెఫ్ జింట్స్ను ఫేస్బుక్ బోర్డులోకి చేర్చుకుంది. -
ఈ సారైనా.. వచ్చేనా?
రాజంపేట: రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటుపై ఆశలు నెమ్మదిగా ఆవిరవుతున్నాయి. స్టీమ్ ఇంజిన్‌లోకోషెడ్‌ను పాలకలకు చూపిస్తూ రైల్వేపరంగా నందలూరుకు ఉన్న ప్రాముఖ్యతను తెలియచేసేందుకు స్ధానిక నేతలకు ఉపయోగపడింది. ఇక అదికూడా రైల్వే యాజమాన్యం లేకుండా చేసింది. వందేళ్ల కిందటి స్టీమ్లోకోషెడ్ బ్రిటీషు రైల్వేపాలకుల చరిత్రకు ఇన్నాళ్లు ఆనవాళ్లుగా నిలిచింది. ఇప్పుడు ఈ షెడ్‌ను రైల్వే స్క్రాప్ కింద వేలం పెట్టి తొలిగించేసింది.ఈ షెడ్ ఉంటే నందలూరు రైల్వేపరిశ్రమ ఏర్పాటు ప్రస్తావన కొనసాగుతూనే ఉంటుందనే భావనతో తొలగించినట్లు ఉందని ఉద్యమకారులు పెదవివిరిస్తున్నారు. ఫలించని పోరాటలు.. ఉద్యమాలు నందలూరు రైల్వేకేంద్రంలో 1880 ప్రాంతంలో బ్రిటీషు రైల్వేపాలకులు స్టీమ్ ఇంజిన్‌లోకోషెడ్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచి చెన్నై, గుంతకల్ వరకు రైలింజన్లతో ప్యాసింజరు, గూడ్స్‌రైళ్లను నడిపించేవారు. వందలాది క్వార్టర్స్, నివాసగృహాలతో వైభవంగా వెలుగొందింది నందలూరు. కాలానుగుణంగా ఆధునికసాంకేతికలో మార్పులు రావడంతో డీజల్, కరెంటు రైలింజన్లు రావడంతో షెడ్డ్లో ఉన్న 20 బొగ్గు ఇంజన్లను స్క్రాప్ కింద వేలంవేశారు. నందలూరుకు పూర్వవైభవం తీసుకురావాలని పదేళ్ల కిందట అన్ని రాజకీయపక్షాలకు చెందిన నాయకులు రైల్వే ఐక్య పోరాటసమితిగా ఏర్పడ్డారు. 70రోజుల పాటు రిలేదీక్షలు, రాస్తారోకోలు, చేశారు. యూపీఏ ప్రభుత్వహయాంలో రైల్వేమంత్రి లాలుప్రసాద్ వద్దకు వెళ్లారు. ఆయన లోక్‌సభలో వ్యాగిన్ రిపేరువర్క్‌షాపు లేదా ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ పెడతామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజకీయదిగ్గజాలు నందలూరును సందర్శించారు. తమ ప్ర«భుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా రైల్వేపరిశ్రమను తీసుకొస్తామని హామీలు ఇచ్చారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు వెంకయ్యనాయుడు, పురందేశ్వరి, కేంద్రమంత్రులు సందర్శించివెళ్లారు. సర్వే, స్ధలనివేదికలు బుట్టదా ఖాలా అయ్యాయి. ఎంపీ మిథున్‌రెడ్డి అలుపెరగని కృషి.. నందలూరుకు పూర్వవైభవం తీసుకురావాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తన శక్తిమేరకు కృషిచేస్తూనే ఉన్నారు. అనేక మార్లు రైల్వేమంత్రులను కలిసి వినతులు సమర్పించారు. సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు, తమ ప్రాంతా లకు రైల్వేపరిశ్రమను తీసుకెళ్లేం దుకు జరుగుతున్న పరిణామాల్లోనే నందలూరుకు రైల్వేపరిశ్రమ రాని వ్వకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఇంటర్న్‌షిప్ కెరీర్‌కు తొలిమెట్టు..
ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో తప్పనిసరిగా మారిన జాబ్ రెడీ స్కిల్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, రియల్ టైం ఎక్స్‌పీరియన్స్‌ను అందించేదే ఇంటర్న్‌షిప్. దీనివల్ల ఇటు విద్యార్థులు, అటు కంపెనీలకు మేలు చేకూరుతుంది. ఒక అభ్యర్థి కంపెనీలో ఇంటర్న్‌గా చేరిన తర్వాత అతని పనితీరు, యాటిట్యూడ్ నచ్చితేనే రిక్రూట్ చేసుకునే వెసులుబాటు కంపెనీలకు; పని, కంపెనీ వర్క్ కల్చర్ నప్పుతుందనుకుంటేనే ఉద్యోగంలో చేరే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది. విద్యార్థుల్లో జాబ్‌రెడీ స్కిల్స్ పెంపొందించుకోవడంతోపాటు, ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడం.. వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందడానికి ఇంటర్న్‌షిప్ ఉపకరిస్తుంది. మేనేజ్మెంట్ నిపుణులకు అకడమిక్స్ పరంగా క్లాస్‌రూంలో బోధించిన అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించగలిగే అవకాశం కల్పిస్తుంది ఇంటర్న్షిప్స్. ఎంబీఏ విద్యార్థులకు మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఇంటర్న్షిప్స్ అవకాశాలు విస్తృతం. ఇంటర్న్‌షిప్ ప్రధాన ఉద్దేశం.. కోర్సు సమయంలోనే నిర్దిష్ట వ్యవధిలో ఓ కంపెనీలో పని చేయడం. ఇంటర్న్‌షిప్ సమయంలో సంస్థలు విద్యార్థుల అకడమిక్ నేపథ్యానికి అనుగుణంగా ఏదైనా విభాగంలో నియమించుకుంటాయి. కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థికి సదరు విభాగంలోని టీంలో ఇంటర్న్ ట్రైనీగా అవకాశం కల్పిస్తాయి. ఆ టీంకు కంపెనీ ఇచ్చిన అసైన్‌మెంట్‌లో పాల్పంచుకునే అవకాశం ఇంటర్న్ ట్రైనీలకు లభిస్తుంది. దాంతో విద్యార్థులకు తమ అకడమిక్ నేపథ్యానికి సరితూనే ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకునే వీలు లభిస్తోంది. ఇంటర్న్షిప్స్ కేవలం ఫైనల్ ఇయర్లోనే కాదు.. కాలేజీలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా చేసుకోవచ్చు. ప్లేస్‌మెంట్స్ ద్వారానే ఎంబీఏ విద్యార్థులకు వాస్తవ నైపుణ్యాలు ఉండడం లేదు. అధికశాతం మందిలో ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల్లో మారుతున్న అవసరాలకు తగ్గట్లు పనిచేయడానికి పూర్తిస్తాయి సామర్థ్యం లేదు. తాజాగా వివిధ నివేదికలు వెలువరిచిన సమాచారం ఇది. మరోవైపు ఐఐఎంలు వంటి ప్రముఖ బీస్కూల్స్‌లో కోర్సు పూర్తిచేస్తే లక్షల్లోనే ప్యాకేజీలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) లాంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చేరే విద్యార్థులు భారీ వేతనాలతో కేరీర్ ప్రారంభిస్తుంటే.. స్థానిక కాలేజీల్లో చేరే విద్యార్థులు ఉద్యోగాల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థలు పేరున్న కాలేజీల నుంచే విద్యార్థులను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. కొంతమందికి ఇంటర్న్‌షిప్ పేరుతో ఆఫర్ లెటర్లు ఇచ్చి, తర్వాత స్వల్ప కాలవ్యవధిలో పనితీరు నచ్చితే భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. మరి కొంతమందికి నేరుగా ఆఫర్ లెటర్లు జారీ చేస్తుంది. మొత్తమ్మీద టాప్ కంపెనీలు తమతో టచ్‌లో ఉండే ఇన్స్టిట్యూట్లకు వెళ్లి వారికి అవసరమైన, మెరుగైన మానవ వనరులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇంటర్నెట్ ఆయుధంగా టాప్ ఇన్స్టిట్యూట్ల్లోకి కంపెనీలు రిక్రూట్మెంట్ కోసం వస్తున్నాయి.. సరే మిగతా కాలేజీల్లో చదివే విద్యార్థుల పరిస్థితి ఏంటి? వీరికి టాప్ కంపెనీల్లో అవకాశాలు రావా? అంటే.. కొంత కష్టమే అయినా అసాధ్యమైతే కాదని అంటున్నారు నిపుణులు. ఎప్పటికప్పుడు సంబంధిత కంపెనీల వెబ్సైట్లను చూస్తూ ఖాళీలు ఏర్పడినప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్న్‌షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్స్ చేయాలనుకునే అభ్యర్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకోవడానికి ఇంటర్నెట్ సరైన మార్గం అంటున్నారు. దీనిద్వారా టాప్ కంపెనీలు మొదలు స్టార్టప్ కంపెనీలు పోస్ట్ చేసే ఖాళీల గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జాబ్‌పోర్టల్స్ విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ వెతిక పెట్టడంలో ముందుంటున్నాయి. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మేనేజ్మెంట్ విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా, దాని నేపథ్యానికి సరితూగే సంస్థలు, విభాగాల్లో ఇంటర్న్‌షిప్ కోసం ప్రయత్నించాలి. ఇంటర్న్‌షిప్ ద్వారా రియల్ టైం నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్‌తోపాటు డెసిషన్ మేకింగ్, అనలిటికల్ స్కిల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. కంపెనీలకు ఎదురవుతున్న సమస్యలు, వాటికి ఆ రంగంలోని నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు తెలుసుకునే వీలు లభిస్తుంది. ఇంటర్న్‌షిప్‌లో ఇలా రియల్ టైం ఎక్స్పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్‌తోపాటు ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థుల పనితీరు కూడా కెరీర్‌కు చక్కటి మార్గం వేస్తుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో సదరు టీం మెంబర్‌గా చొరవ, అంకిత భావం, నేర్చుకునే తత్వం, బృందంతో కలిసి పనిచేసే నైపుణ్యంతో చక్కగా వ్యవహరిస్తే సంస్థ యాజమాన్యం నుంచి ఆఫర్ లెటర్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఐఐఎంలు, ప్రముఖ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ పేరిట ఈ సంస్కృతి ఇప్పటికే ఉంది. ఇంటర్న్‌షిప్ వ్యవధి కొద్ది రోజులే ఉన్నప్పటికీ.. విద్యార్థులకు బంగారు అవకాశమిది. ఇంటర్న్‌గా అభ్యర్థులను కంపెనీ ప్రతినిధులు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులకు ఆర్థిక సహకారం కూడా అందిస్తారు. కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ తర్వాత ఉద్యోగం ఆఫర్ చేసినా, చేయకున్నా రికమెండ్ చేస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. ఇవి భవిష్యత్తు ఉద్యోగాన్వేషణలో కీలకంగా ఉంటాయి. కాలేజీల పాత్ర కీలకం మేనేజ్మెంట్ విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ తీసుకురావడంలో ఆయా కాలేజీల పాత్ర కీలకం. సదరు కాలేజీకి ఉండే ఇండస్ట్రీ రిలేషన్‌షిప్స్‌తో కంపెనీలు కాలేజీ విజిట్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో ఇంటర్న్షిప్స్ కోసం ప్రయత్నించాలి. కోర్సులో చేరినప్పటి నుంచి ఈ దిశగా ప్రయత్నించాలి. ఫైనలియర్ విద్యార్థులు నవంబర్, డిసెంబర్ కల్లా దరఖాస్తు చేసుకోవాలి. పెరిగిన విద్యార్థుల సంఖ్య దృష్ట్యా అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. సీరియస్‌గా ప్రయత్నించే వారే అవకాశాలను అందిపుచ్చుకోగలరు. ప్రస్తుతం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రిటైల్ ఇండస్ట్రీల్లో మెరుగైన ఇంటర్న్ అవకాశాలు ఉన్నాయి. -
నిలిచిపోయిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రైవేటు డిగ్రీ కాలేజీలు తమ సెంటర్లలో పరీక్షలను బాయ్‌కాట్ చేయడంతో పరీక్షలు నిలిచిపోయాయి. సీబీసీఎస్ సెమిస్టర్స్ విధానంతో డిగ్రీ, పీజీ యాజమాన్యాలపై 30 శాతం అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ ఫీజులు పెరగకపోవడంతో సకాలంలో తమకు రీయింబర్స్మెంట్ అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు పెరిగే వరకు ఆన్లైన్ అడ్మిషన్లలో పాల్గొనబోం అని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. -
బిల్లులేవీ..
► భారంగా సీజనల్ హాస్టళ్ల నిర్వహణ ► జిల్లాలోని 14 మండలాల్లో 65 ఏర్పాటు ► జనవరి నుంచి విడుదల కాని బిల్లులు ► హాస్టళ్ల నిర్వహణకు అష్టకష్టాలు ► గౌరవ వేతనానికీ నోచుకోని సిబ్బంది బేస్తవారిపేట: ప్రభుత్వం వలస కూలీల పిల్లలకు విద్యలో ఎటువంటి ఆటంకం కలుగకూడదని సీజనల్ హాస్టల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరిలో సీజనల్ హాస్టల్స్ ప్రారంభించారు. మూడు నెలలు దాటినా ఒక్క రూపాయి బిల్లు మంజూరు చేయకపోవడంతో నిర్వాహకులు హాస్టల్స్ నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కోసం దూరప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు ఎక్కువగా ఉండే జిల్లాలోని బేస్తవారిపేట, చీమకుర్తి, దొనకొండ, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, కొత్తపట్నం, మార్కాపురం, పర్చూరు, పుల్లలచెరువు, పెద్దారవీడు, తర్లుపాడు, త్రిపురాంతకం, వై.పాలెం మండలాల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హాస్టల్స్ ప్రారంభించారు. 14 మండలాల్లో 27 ఎన్జీవోలు హాస్టల్స్ నిర్వహణ చేపట్టారు. జిల్లాలోని 65 హాస్టల్స్‌లో 3153 మంది విద్యార్థులకు వసతి కల్పించారు. జనవరి నుంచి హాస్టల్ బిల్లులు విడుదల చేయలేదు. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంది. 50 మంది విద్యార్థులున్న సెంటర్‌కు నెలకు రూ.32,500 ప్రకారం మూడు నెలలకు రూ.97,500 చెల్లించాల్సి ఉంది. ఒక్కో స్వచ్ఛంద సంస్థ రెండు నుంచి ఐదు హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. లక్షల్లో అప్పులు పేరుకుపోవడంతో హాస్టల్స్ నిర్వహణపై నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోతే హాస్టల్స్ నిర్వహించలేక మూతపడే పరిస్థితి నెలకొందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో హాస్టల్‌కు ఒక ఉపాధ్యాయుడు, ఒక కేర్ టేకర్, ఇద్దరు వంట మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఉపాధ్యాయుడికి, కేర్ టేకర్‌కు రూ.3 వేల గౌరవ వేతనం, వంట చేసేవాళ్లకు ఇద్దరికి రూ.3 వేలు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. మూడు నెలలుగా గౌరవ వేతనం మంజూరు చేయలేదు. కష్టపడి పనిచేసినా వచ్చే అరకొర వేతనం సకాలంలో మంజూరు చేయకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదు బేస్తవారిపేట మండలంలోని గంటాపురం, ఎంపీ చెరువు గ్రామాల్లో సీజనల్ హాస్టల్స్ నిర్వహిస్తున్నాం. రెండు హాస్టల్స్‌కు రూ.1.70 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో హాస్టల్స్ నిర్వహణ ఎలా చేయాలి. రేషన్ షాపుల్లో అప్పులు పేరుకుపోతున్నాయి. – కె.నిర్మలాబాయి, హోత్స్ స్వచ్ఛంద సంస్థ, బేస్తవారిపేట మూడు నెలల నుంచి వేతనం లేదు జనవరి నెల నుంచి హాస్టల్లో వంట చేస్తున్నాను. ప్రభుత్వం ఒక్క నెలకు కూడా గౌరవ వేతనం విడుదల చేయలేదు. ఇచ్చే అరకొర వేతనం కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. – తిరుపతమ్మ, వంట మనిషి -
అత్యుత్తమ బిజినెస్ యూనివర్సిటీ ఇదే..
బిజినెస్, మెనేజ్మెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విశ్వవిద్యాలయాలను ఆధారంగా చేసుకుని క్యూఎస్ ప్రొడ్యూజెస్ అనే విద్యా సంస్థ ప్రతి సంవత్సరం ర్యాంకింగ్ ఇస్తుంది. 2016కి సంబంధించి అత్యుత్తమ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌ని విడుదలచేసింది. ఈ ఏడాది హార్వర్డ్ యూనివర్సిటీ మెదటి స్థానంలో నిలిచింది. ర్యాంకుల ప్రకారం..మిగిలిన యూనివర్సిటీల వివరాలు.. 1. హార్వర్డ్ యూనివర్సిటీ 2. లండన్ బిజినెస్ స్కూల్ 3. ఐఎన్ఎస్ఈఏడీ 4. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 5. పెన్సిల్వేనియా యూనివర్సిటీ 6. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 7. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ 8. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ 9. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ 10. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ 11. యూనివర్సిటీ కమర్షియల్స్ లుయిగి బొక్కొని 12. ఎచ్ఈసీ ప్యారీస్ 13. కోపెన్హాగన్ బిజినెస్ స్కూల్ 14. నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ 15. నేషనల్ యూనివర్సిటీ అఫ్ సింగపూర్ 16. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ 17. న్యూయార్క్ యూనివర్సిటీ 18. యూనివర్సిటీ ఆఫ్ చికాగో 19. కొలంబియా యూనివర్సిటీ -
జిల్లాలో 418 సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ యూనిట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ శాస్త్రి కడియం (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 418 యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ శాస్త్రి తెలిపారు. మండలంలోని దుళ్ల పంచాయతీలో నిర్మిస్తున్న యూనిట్‌ను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 118 యూనిట్లు మంజూరు కాగా, 51 యూనిట్లు వర్మికంపోస్టును ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. నెలాఖరుకు మిగిలిన వాటిలో కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. యూనిట్లు విజయవంతంగా నడవాలంటే ప్రజల సహకారంతో ఎంతో అవసరమన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు అవసరమైన చెత్తబుట్టలను ఎవరికి వారు కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా గానీ, ఆయా గ్రామాల్లోని దాతల సహకారంతో గానీ సమకూర్చుకోవచ్చునన్నారు. పంచాయతీ నిధులతో కొనుగోలు చేసి ఆ సొమ్మును ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందని చెప్పారు. ఈ మూడు పద్ధతుల్లో ఏది వీలుంటే దాని ద్వారా చెత్తసేకరణ బుట్టలు సమకూర్చేందుకు ఆయా పంచాయతీలు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఉపాధి పథకం సిబ్బంది నాగేశ్వరరావు, సర్పంచి గుర్రపు సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
నివాసితులకు ‘రాజ్యాంగం’
దాన్ని పాటిస్తేనే కమ్యూనిటీలకు అందం సాక్షి, హైదరాబాద్: కొన్ని అపార్ట్మెంట్లను చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా అవి నిత్యనూతనంగా ఉంటాయి. మరి అపార్ట్మెంట్ అందంగా కనిపించాలంటే నిర్వహణ సక్రమంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఫ్లాట్ల విలువ గణనీయంగా పడిపోతుందని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే సక్రమ నిర్వహణతోనే విలువ రెట్టింపవుతుందని సూచిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం, ఒక్కో ప్రాంతం, విద్యాబుద్ధులు, వేషభాషలు, ఆలోచనా విధానం, మనస్తత్వం.. ఇలా ప్రతి అంశంలోనూ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కో నిర్మాణం మినీ భారతంను తలపిస్తున్న నేపథ్యంలో భవన పటిష్టత కోసం అందరూ ప్రయత్నించాలి. ఎవరికి వారే తమకెందుకులే అని భావించినా తీరిక లేదని తప్పించుకోవడానికి ప్రయత్నించినా నష్టం అందరి మీద పడుతుంది. అపార్ట్మెంట్ కళావిహీనంగా తయారవుతుంది. కాబట్టి సంఘం నియమ నిబంధనల్ని ఏర్పాటు చేసేటప్పుడు అధిక శాతం మంది దృష్టిసారించాలి. అతిక్రమిస్తే శిక్షార్హులే.. ⇔ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొన్నవారంతా సంఘంగా ఏర్పడాలనేది అపార్ట్మెంట్ చట్టంలోని మొదటి నిబంధన. దీన్ని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలి. బిల్డర్ ప్రతిపాదించకున్నా సభ్యులే కలసి సంఘం గా ఏర్పడి నియమ నిబంధనలు (బైలాస్) రూపొందించుకోవాలి. వీటిని అందరూ గౌరవించాలి. అతిక్రమించిన వారు చట్టప్రకారం శిక్షార్హులవుతారు కూడా. ⇔ బిల్డర్ చేసే ఆలస్యానికి విసిగిపోయి.. ఆయా అపార్ట్మెంట్లోని మిగతా పనులన్నీ బిల్డర్ చేత పూర్తి చేయడానికి ప్రత్యేక సంఘంగా ఏర్పడాలి. బిల్డర్ మీద ఒత్తిడి తెచ్చి పనుల్ని పూర్తి చేయడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మున్సిపల్ ప్లాన్ ప్రకారం నిర్మితమైన ఒక అపార్ట్మెంట్లో రెండు సొసైటీలు ఉండకూడదు. ఒక సొసైటీని గరిష్టంగా ఆరేళ్ల దాకా కాలపరిమితిని పెట్టకోవచ్చు. ప్రతి సంఘం కూడా మినిట్స్ పుస్తకాన్ని నిర్వహించాలి. కొత్తగా ఎన్నికైన సంఘానికి పాత కమిటీ సభ్యులూ అకౌంట్స్ పుస్తకాలు, ఆస్తుల జాబితాను తప్పకుండా అందజేయాలి. లేకపోతే చట్ట ప్రకారం పాత సభ్యుల మీద చర్యలు తీసుకోవచ్చు. నిర్వహణ రుసుము పక్కా.. ⇔ నిర్వహణలో లోపం రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నిర్వహణ రుసుమును గడువులోగా చెల్లించాలి. కమిటీ సభ్యులు దేనికెంత ఖర్చవుతుందో పక్కాగా లెక్కలు వేసుకొని నెలసరి నిర్వహణ రుసుమును నిర్ణయించాలి. తీవ్ర కసరత్తులు జరిపాకే ఒక నిర్ణయానికి రావాలి. నివాసితులందరిని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి విషయాన్ని క్షుణ్ణంగా వివరించాలి. సభ్యులంతా కూర్చొని రాగద్వేషాలకు తావివ్వకుండా అపార్ట్మెంట్ పటిష్టతను దృష్టిలో పెట్టుకొని అంతిమ నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒకవేళ నిర్వహణ రుసుమును పెంచాల్సి వస్తే నివాసితులు తొందరపడకుండా కమిటీ సభ్యులు చెప్పే కారణాలను విశ్లేషించాలి. అవసరమైతే ప్రత్యామ్నాయాలను సూచించాలి. అంతేతప్ప కమిటీ సమావేశంలో వితండవాదం చేస్తే నష్టపోయేది అపార్ట్మెంట్లో నివసించే గృహ యజమానులే. ⇔ నెలసరి నిర్వహణ రుసుమును చెల్లించని వారిపై ఎలాంటి చర్యలు చేపట్టాలో సంఘం నిబంధనల్లో రాసుకోవాలి. నిర్వహణ రుసుము కట్టనివారి మౌలిక సదుపాయాలు రద్దు చేసే అధికారం సంఘానికి ఉంటుందని అందరూ గుర్తుంచుకోవాలి. నిర్వహణ సూత్రాలివే.. ⇔ ఫ్లాట్ల సంఖ్యను బట్టి సంఘంలో ఎంతమంది సభ్యులుండాలనే విషయంలో ముందు స్పష్టత రావాలి. 50 కంటే తక్కువ ఫ్లాట్లుంటే అది కూడా ఒకే బ్లాక్ మాదిరిగా ఉంటే సంఘంలో ఐదారుగురు కీలక సభ్యులుండొచ్చు. కాకపోతే బిల్డర్లు, పలు నిర్మాణాల్ని టవర్లు లేదా బ్లాకుల మాదిరిగా నిర్మిస్తుంటారు. ఒక్కో బ్లాకు నుంచి సంఘంలో ప్రాతిని«థ్యం వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ⇔ కొనుగోలుదారుల నుంచి బిల్డర్ ముందే కార్పస్ ఫండ్ వసూలు చేస్తాడు. ఏ సంఘమైనా నిర్వహణలో ఇబ్బందులు ఎదురుకావొద్దంటే కార్పస్ ఫండ్‌ను దేనికోసం వినియోగించాలి? ఏయే అవసరాలకు వాడకూడదనే అంశంలో స్పష్టంగా రాతకోతలుండాలి. బిల్డర్ అందజేసే కార్పస్ ఫండ్‌ను బ్యాంక్‌లో జమ చేసే ముందు ఏయే బ్యాంక్ అధిక వడ్డీనిస్తుంది? అత్యవసరాల్లో మెరుగైన సేవలను అందిస్తుందా? అనే అంశాన్ని పరిశీలించాలి. నాలుగైదు బ్యాంకులను కలసి వివరాలను సేకరించి అంతిమ నిర్ణయం తీసుకోవాలి. సొమ్మును ఎన్నేళ్ల పాటు బ్యాంకుల్లో కదలకుండా ఉంచాలి? ఒకవేళ తీయాల్సి వస్తే ఏయే సందర్భాల్లో ఆయా సొమ్మును వినియోగించకూడదు? వంటి విషయాలకు సంబంధించి నియమ నిబంధనల్లో స్పష్టంగా రాసుకోవాలి. లేకపోతే నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులొచ్చినా కష్టమే. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేçహాలుమాకు రాయండి. realty@sakshi.com -
మోటార్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
కడప అర్బన్ : మోటార్ల చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప నగరం రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ధర్మతేజ ఐటీఐలో గత నెలలో గుర్తు తెలియని వ్యక్తులు ఆరు మోటార్లను దోచుకెళ్లారని అప్పట్లో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రిమ్స్ సీఐ మోహన్‌ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐలు హేమాద్రి, రామాంజనేయులు తమ సిబ్బందితో నిందితులు వెంకట కృష్ణ, పీర్‌బాషాలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 98 వేలు విలువైన మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. -
నేడు గోదావరి నది బోర్దు సమావేశం
-
సందడిగా స్నాతకోత్సవం
బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీలో శుక్రవారం 22వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.ప్రగతి లీడర్ షిప్ వైస్ చైర్మన్ అరుణ్ వకుల్ ముఖ్య అతిథిగా హాజరై పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా అరుణ్ వకుల్ మాట్లాడుతూ.. జీవిత ప్రయాణంలో ఐదు ముఖ్య సూత్రలు గుర్తుంచుకోవాలని సూచించారు.సేవ, మంచి ఉద్దేశ్యం,కార్యాచరణ, సృజనాత్మకత, ఉత్సాహం అనే సూత్రాలను తమ చేతి ఐదు వేళ్లుగా భావించాలన్నారు. ఈ ఐదు వేళ్లు కలిగిన చేయి జీవితంపై అవగాహన అనే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుందన్నారు. మొత్తం 161 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. కాలేజీ ప్రైసిడెంట్ డిఎన్ .రావు తదితరులు పాల్గొన్నారు. – జగద్గిరిగుట్ట -
అగ్రి కోర్సు.. ఫార్సు!
కర్నూలులో అనుమతి లేని కాలేజీ – అగ్రి బీఎస్సీ పేరిట విద్యార్థులకు వల – యూజీసీ గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు – నకిలీ వర్సిటీ అనుమతి పత్రంతో చెలామణి – వేలాది రూపాయల ఫీజు వసూలు – కళ్లు తెరవని విద్యా శాఖ అసలే ఉద్యోగాల్లేక యువత నిరాశ నిస్పృహల్లో ఉంది. ఇదే అదనుగా ఓ కళాశాల యాజమాన్యం వ్యవసాయాధికారి అయ్యే అవకాశం అంటూ ప్రచారానికి తెరతీసింది. అగ్రి బీఎస్సీ కోర్సు పేరిట విద్యార్థులకు ఎర వేస్తోంది. వాస్తవానికి ఎలాంటి అనుమతి లేకపోయినా యాజమాన్యం నిరుద్యోగుల ఆశలతో వ్యాపారం మొదలుపెట్టింది. జిల్లా కేంద్రంలోనే సాగుతున్న ఈ వ్యవహారం విద్యా శాఖ అధికారుల కళ్లుగప్పి సాగుతుందంటే అనుమానమే. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఆయూష్ హాస్పిటల్ పక్కన ఏర్పాటైన ఓ ప్రై వేట్ కాలేజీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. తప్పుడు అనుమతులతో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు పేరిట అడ్మిషన్లు చేస్తూ భారీగా ఫీజు వసూలు చేస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నుంచి ఇంకా అనుమతి లభించని యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామనే ఓ అగ్రిమెంట్ కాపీతో విద్యార్థులను మోసగిస్తోంది. సులభంగా అగ్రి బీఎస్సీ సీటు వస్తుందనే ఆశతో కొద్ది మంది విద్యార్థులు ఇప్పటికే వేలాది రూపాయలు చెల్లించి అడ్మిషన్లు కూడా తీసుకుంటున్నారు. త్వరలో తరగతులను కూడా ప్రారంభిస్తామని యాజమాన్యం నమ్మ బలుకుతోంది. యూజీసీ నుంచి అనుమతి లేని రాజస్తాన్‌లోని సంఘానియా యూనివర్సిటీతో కుదుర్చుకున్నామని చెబుతున్న నాలుగు పేజీల ఒప్పంద లేఖను పట్టుకుని ఏకంగా కాలేజీనే నడుపుతోంది. అనుమతి లేదంటూ హైదరాబాద్ నుంచి తన్ని తరిమేసిన కళాశాల కర్నూలులో దుకాణం పెట్టి విద్యార్థులను మోసగించేందుకు సిద్ధమయింది. యూనివర్సిటీకే దిక్కు లేదు.. వాస్తవానికి ఏదైనా యూనివర్సిటీ కోర్సును ప్రారంభించాలంటే మొదట సదరు యూనివర్సిటీకి యూజీసీ నుంచి అనుమతి ఉండాలి. ఆ యూనివర్సిటీలోని కోర్సులకు కూడా యూజీసీ అనుమతి తప్పనిసరి. అయితే, ఇక్కడ కర్నూలులో ఉన్న కాలేజీ రాజస్తాన్‌లోని సంఘానియా యూనివర్సిటీ అనుమతితో అగ్రి బీఎస్సీ కోర్సును ప్రవేశపెట్టామని చెబుతోంది. వాస్తవానికి రాజస్తాన్ రాష్ట్రం ఝుంఝుంను లోని సంఘానియా యూనివక్సిటీకి కూడా యూజీసీ గుర్తింపు లభించలేదు. అంతేకాకుండా యూజీసీ నిపుణుల కమిటీ మరింత సమాచారం కోరింది. ఈ సమాచారాన్ని సదరు యూనివర్సిటీ సమర్పించలేకపోయింది. దీంతో యూజీసీ నిపుణుల కమిటీ కాస్తా ఈ యూనివర్సిటీని ఇప్పటివరకు సందర్శించలేదు. మరోవైపు సింఘానియా యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టంగా ప్రకటించారు. ఇలాంటి నకిలీ వర్సిటీలతో ఒప్పందం చేసుకున్నామంటూ కొన్ని కాలేజీలు కూడా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అందులో గ్రీన్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, సుందర్‌నగర్ కాలనీ, సంజీవరెడ్డినగర్ కాలనీ మెయిన్‌రోడ్, హైదరాబాద్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. అక్కడ బిచానా ఎత్తేసిన ఈ ఇన్స్టిట్యూట్ కాస్తా ఇప్పుడు కర్నూలు నగరంలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు ఫీజుల రూపంలో కాలేజీ యాజమాన్యం వసూలు చేసింది. ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేదు.. వాస్తవానికి వ్యవసాయశాఖలో అగ్రి బీఎస్సీ చదివితే అగ్రికల్చర్ ఆఫీసర్(ఏఓ)గా ఉద్యోగం వస్తుంది. అయితే, ఈ విధంగా ఉద్యోగం రావాలంటే కచ్చితంగా అగ్రి బీఎస్సీ చదివిన కాలేజీ కాస్తా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) నుంచి అనుమతి పొంది ఉండాలి. ఇక్కడ కర్నూలులో ఉన్న ఈ కాలేజీకి ఐసీఏఆర్ నుంచి ఎలాంటి అనుమతి లేదు. అంటే వ్యవసాయశాఖలో ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేదన్నమాట. అయినప్పటికీ ఉద్యోగాలు వస్తాయంటూ కాలేజీ యాజమాన్యం విద్యార్థులను మోసం చేస్తోంది. పైగా ఐసీఏఆర్ అనుమతి పొందిన సిలబస్‌నే తాము బోధిస్తామని ప్రకటనలు ఇస్తోంది. ఇవేవీ తెలియని అమాయక విద్యార్థులు కాలేజీ యాజమాన్యం మోసపూరిత మాటలతో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి విద్యాశాఖ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. -
కేశినేని ట్రావెల్స్ నిర్లక్ష్యం...
-
బెట్ట పరిస్థితుల్లో పంటల యాజమాన్యం
జేడీఏ విజయనిర్మల సూచనలు సిరిపురం (వైరా) : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయశాఖ జేడీఏ విజయనిర్మల సిరిపురం గ్రామంలో శనివారం పత్తి, మిరప, కంది తదితర పంటలను పరిశీలించారు. బెట్ట పరిస్థితుల్లో పంటల యజమాన్యం గురించి రైతులకు వివరించారు. lపత్తిలో రసం పీల్చే పురుగు అత్యధికంగా ఉందన్నారు. నివారణ చర్యల్లో భాగంగా కాండం పూత పూయాలని తెలిపారు. పత్తిలో పచ్చదోమ, తామర పురుగు నివారణకు మోనోక్రొటోఫాస్ 1.5 మి.లీ, ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటితో కలిపి ఆకు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాలన్నారు. lవర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పైర్లపై పొటాషియం నైట్రేట్‌ను లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. ఇలా చేస్తే పంటలకు కొద్దికాలం వరకు ఇబ్బందులుండవన్నారు. రైతులు వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని తెలిపారు. జేడీఏ వెంట ఏడీఏ శోభన్‌బాబు, ఏఓ ఎన్.అన్నపూర్ణ, ఏఈఓ ఎం. బాలకృష్ణ, సర్పంచ్ రామారావు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలకు రూ.722 కోట్లు
గాంధీనగర్ : రాష్ట్రంలో ఈ ఏడాది అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణకు రూ.722 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు రాష్ట్ర గనులు, మహిళా శిశుసంక్షేమశాఖామంత్రి పీతల సుజాత చెప్పారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం కళావేదిక వద్ద స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన మహిళా, శిశువులకు పౌష్టికాహారంపై అవగాహన ప్రదర్శనశాలను గురువారం ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 14లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తుంటే మన రాష్ట్రంలో 48వేల 770 కేంద్రాలు, 6837 మినీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. వాటిలో లక్షా 4వేల మంది కార్యకర్తలు మహిళా శిశువులకు సేవలందిస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనానికి రూ.750 కోట్లు ఈ ఏడాది ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి రూ. 750కోట్లు ఖర్చుచేస్తుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో తొలుత బాలలసేవే– పుష్కర సేవ, ఆహారం– పోషణ విస్తరణ కేంద్రం, సమతుల ఆహారం వంటి ప్రదర్శనలు ప్రారంభిస్తూ కార్యకర్తలను వివరాలడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పిండివంటలను, చిరుతిళ్లను రుచిచూసి పరిశీలించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి జి జయలక్ష్మీ, ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి, కమిషనర్ ఐ. సామ్యూల్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యపై జాతీయ సెమినార్
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్‌సెల్ (ఐక్యూఏసీ) ఆధ్వర్యంలో ‘క్వాలిటీ ఎడ్యుకేషన్– ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై ఈనెల 18, 19వ తేదీల్లో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ ఎం.అరుణ తెలిపారు. సెమినార్‌కు సంబంధించిన ప్రతిష్టాత్మక నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్(నాక్) ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన సెమినార్ బ్రోచర్‌ను శుక్రవారం వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పి.సాంబయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. సెమినార్లో అర్థవంతమైన చర్చలు జరగాలని సూచించారు. ఉన్నత విద్య, నాణ్యత ప్రమాణాలు, 21వ శతాబ్దపు అవసరాలు లాంటి అంశాలపై చర్చలు విస్తృతంగా జరగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ కె.రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి రవికుమార్ ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో కీలక భూమిక పోషించే నిర్వహణ కమిటీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి రవికుమార్ అన్నారు. గురువారం ఖమ్మం డైట్ కళాశాలలో ఎంఈఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త ఎస్‌ఎంసీల ఎన్నికలు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించాలని, 23వ తేదీలోగా జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో నివేదిక అందచేయాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా ఎన్నికలు నిర్వహించాలని, మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, మధిర డిప్యూటీ ఈఓలు బస్వారావు, రాములు, ఇన్చార్జ్ సీఎంఓ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ శేషగిరి, ఇన్చార్జ్ ఏఎంవో సుధాకర్, సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానంగా కేజీబీవీల నిర్వహణ
ఏప్రిల్ నుంచి రూపాయి కూడా మంజూరుకు నోచుకోని వైనం మూడు నెలలలుగా ఎస్ఓలు, సిబ్బందికి జీతాల్లేవ్ ఎనిమిది నెలలుగా విద్యార్థులకు అందని ఉపకారవేతనం అనంతపురం ఎడ్యుకేషన్ : అనాథలు, చదువుకుంటూ మధ్యలో బడిమానేసిన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) నిర్వహణ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. మూన్నెళ్లుగా నిర్వహణకు పైసా కూడా విడుదల చేయకపోవడంతో ప్రత్యేకాధికారుల(ఎస్ఓలు) కష్టాలు వర్ణణాతీతం. నిత్యావసర సరుకులు టెండరుదారులు సరఫరా చేస్తుండగా, రోజువారి అవసరమయ్యే కూరగాయలు, అకుకూరలు, పాలు తదితర వాటి కొనుగోలుకు పలు ఇబ్బందులు పడుతున్నారు. నెలంతా ఖర్చు చేసి నెలతర్వాతైనా బిల్లులు వస్తాయంటే అవీ ఇవ్వడం లేదని ఎస్ఓలు వాపోతున్నారు. వీటికి తోడు కరెంటు బిల్లులు చెల్లించలేక, గ్యాస్ సిలిండర్ల కొనుగోలు చేయలేక దిక్కులు చూస్తున్నారు. ఈ రెండింటికీ నెలకు దాదాపు రూ. 25 వేలు దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కరెంటు బిల్లు ఆలస్యమైతే అపరాధ రుసుం పడుతోంది. సిలిండర్లకు డబ్బు చెల్లించకపోతే ఇవ్వడం లేదు. బిల్లులు పెండింగ్ కారణంగా మెనూ అమలు గాలికి వదిలేస్తున్నారు. మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో మొన్నటిదాకా 36 కేజీబీవీలు ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో నడుస్తుండగా, 18 కేజీబీవీలు ఏపీఆర్ఐఈ సొసైటీ కింద, 5 కేజీబీవీలు గిరిజన సంక్షేమశాఖ, 3 కేజీబీవీలు సాంఘిక సంక్షేమశాఖ కింద పని చేసేవి. అయితే గత నెలలో అన్నీ ఒకే గొడుగుకిందకి చేరాయి. వీటిల్లో సుమారు 12 వేల మంది దాకా విద్యార్థినులు చదువుతున్నారు. మూడు నెలలుగా అవస్థలు కేజీబీవీల నిర్వహణ ఇక్కట్లు ఇలా ఉంటే.. మరోవైపు మూడు నెలలుగా వారికి జీతాలు మంజూరు కాలేదు. ఎస్ఓలు మొదలుకుని సీఆర్టీలు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఏప్రిల్, జూన్, జూలై నెలల జీతాలు రాలేదు. నిర్వహణ బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు మాజీతాలు కూడా ఇవ్వకుండా పెండింగ్ పడుతున్నారని కొందరు ఎస్ఓలు వాపోతున్నారు. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఓ కేజీబీవీ ఉద్యోగిని వాపోయింది. సబ్బులూ కొనలేదంటున్న విద్యార్థినులు ఉపకారవేతనం రాక విద్యార్థినులు అగచాట్లు పడుతున్నారు. నెల కాదు రెన్నెళ్లు కాదు ఏకంగా ఎనిమిది నెలలుగా విద్యార్థినులకు ఉపకార వేతనం అందలేదు. వ్యక్తిగత అవసరాల కోసం నెలకు ఒక్కో విద్యార్థినికి రూ. 100 ఇవ్వాల్సి ఉంది. నవంబర్ నుంచి ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సబ్బులు, నూనె, ఇతర వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వస్తువులను కొనడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బడి ఎన్నికల జడి
సర్కారీ స్కూళ్లలో ఎస్ఎంసీ ఎన్నికలు మూడేళ్ల తర్వాత నిర్వహణ ఈ నెల 10లోగా ఎన్నికలు పూర్తి పాఠశాలల బలోపేతానికి ఊతం కొన్నిచోట్ల ఎన్నికలకు రాజకీయ రంగు పాపన్నపేట:ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలకు నగారా మోగింది. మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 10లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకోసం సర్వశిక్ష అభియాన్ పరిధిలోకి వచ్చే 8వ తరగతి వరకు ఎస్‌ఎంసీల ఏర్పాటుకు ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ ఎన్నికలు కొన్నిచోట్ల రాజకీయ రంగును పులుముకునే వాతావరణం కనిపిస్తుంది. మెదక్ జిల్లాలో 2,940 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల మెరుగుకు ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించే లక్ష్యంతో 2013లో ఎస్ఎంసీలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచి, కనీస మౌలిక సౌకర్యాలను కల్పిస్తూ.. మూతబడుతున్న పాఠశాలను బతికించుకునేందుకు ప్రజల సహకారం తప్పనిసరి అనేది ఇందులోని ఉద్దేశం. ఎస్ఎంసీలకు రాజకీయ రంగు.. సేవాభావంతో బడులను గుడులుగా మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తోడ్పడాల్సిన ఎస్ఎంసీలు రాజకీయ రంగును పులుముకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో ఇలాంటి వాతావరణం స్పష్టంగా కనిపించింది. పలుచోట్ల రాజకీయ ప్రాతిపదికన అభ్యర్థులు ఎస్ఎంసీ ఎన్నికల రంగంలోకి దిగారు. కొన్నిచోట్ల ఘర్షణలు చెలరేగడంతో ఎన్నికలే వాయిదా వేసి తిరిగి నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. పాపన్నపేట మండలం కొడుపాకలో ఎస్ఎంసీ చైర్మన్ పదవి కోసం ఓ అభ్యర్థి సుమారు రూ.25 వేలు ఖర్చు చేసి, విందు వినోదాలతో పోషకులను ఆకట్టుకొని చైర్మన్ పదవిని పొందారన్న ఆరోపణలున్నాయి. అవి కూడా పార్టీ ప్రాతిపదికన కైవసం చేసుకునేందుకు సంబంధిత పార్టీల నాయకులు తాజా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కాంట్రాక్టుల ఆశలో కాసుల వేట సాధారణంగా పాఠశాలకు మంజూరయ్యే అదనపు గదులు, టాయిలెట్లు, వంటషెడ్లు తదితర నిర్మాణ బాధ్యతలను ఖరారు చేసే అధికారం ఎస్‌ఎంసీలకే ఉంటుంది. ఫలితంగా నిర్మాణ కాంట్రాక్టు తామే పొందితే నాలుగు పైసలు వెనకేసుకోవచ్చనే ఆశతో కూడా చాలామంది ఎన్నికల రంగంలోకి చాలామంది దిగుతున్నారు. ఎన్నిక ఇలా.. సర్వశిక్షా అభియాన్ పరిధిలోకి వచ్చే 1 నుండి 8వ తరగతి వరకు ఎస్ఎంసీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పాఠశాల ప్రదానోపాధ్యాయుని ఆధ్వర్యంలో పోషకులను సమావేశ పరిచి ఎన్నికలు నిర్వహించాలి.ఈ నెల 10లోగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఎస్ఎంసీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి తరగతి నుండి ముగ్గురు పోషకులను సభ్యులుగా ఎన్నుకోవాలి. ఈ ముగ్గురిలో ఇద్దరు మహిళలై ఉండాలి. ఇందులో సామాజికంగా వెనుకబడిన అభ్యర్థులు ఒకరు (ఎస్సీ, ఎస్టీ, ఆర్ఫన్స్, వలస జీవులు, వీధిబాలలు, వికలాంగులు, హెచ్ఐవి బాధిత వర్గాలు), మరొకరు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు (వార్షికాదాయం రూ.60వేల లోపు ఉన్న బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలు), ఇంకొకరు జనరల్ కేటగిరి అభర్థులై ఉండాలి. తరగతికి ముగ్గురు మెంబర్లు ఎన్నికైన తర్వాత వారంతా కలసి అందులో నుండి ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా సామాజికంగా వెనుకబడిన వారై ఉండాలి. మరొకరు మహిళ అయి ఉండాలి. ఎక్స్అఫీషియో సభ్యుల ఎన్నిక.. - పాఠశాల ప్రదానోపాధ్యాయులు మెంబర్ ఆఫ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. - అదే పాఠశాలకు చెందిన మరో టీచర్‌ను ఎంఈఓ మెంబర్‌గా నియమిస్తారు. - వీరితో పాటు పాఠశాల పరిధిలోకి వచ్చే వార్డు మెంబర్, అంగన్వాడి, ఏఎన్ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సభ్యులుగా ఉంటారు. కో ఆప్టెడ్ మెంబర్లు ఇలా.. పాఠశాలకు ఉపయోగపడే విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఫిలాసఫర్స్లో ఇద్దరు వ్యక్తులను కో ఆప్టెడ్ మెంబర్లుగా నియమిస్తారు. సర్పంచ్‌లు ఎస్ఎంసీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. -
వానా కాలం మాయా జాలం
యథేచ్ఛగా వ్యర్థ జలాల విడుదల కలుషితమవుతున్న నీటి వనరులు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి వ్యాధుల బారిన పడుతున్న జనం పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి మామూలుగానే పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థ జలాలను విచ్చలవిడిగా జనం మీదికి వదిలేస్తుంటాయి. ఇక వానా కాలం వస్తే పండగే.. వర్షపు నీటితో కలిసి పారిశ్రామిక వ్యర్థాలను, నీళ్లను యథేచ్ఛగా వదిలేయడం మరింత సులభమవుతుంది. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదిదే.. పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలతో పరిసర ప్రాంతాల్లోని కుంటలు, పొలాలు నిండిపోతున్నాయి. జనం గగ్గోలు పెడుతున్నా వినే నాథుడే లేడు. పై నుంచి పొగ.. కింద నుంచి నీళ్లు వదులుతూ పరిశ్రమలు జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. కాలుష్య నియంత్రణ మండలి వానా కాలం మాయా జాలంపరిశ్రమల తీరుకళ్లు మూసుకుంటోంది. కాలుష్య జలాలతో పచ్చని చేలు బీడుగా మారుతున్నాయి. పరిశ్రమల తీరు ఉదాహరణకు జిన్నారం పరిధిలో ఉన్న పరిశ్రమల సమీపంలో వెయ్యి అడుగుల లోతుకు తవ్వినా పసుపు పచ్చని నీళ్లు వస్తున్నాయంటే.. వ్యర్థ జలాలు ఈ ప్రాంతంలో ఎంతగా భూమిలోకి ఇంకిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా, పటాన్చెరు, శివ్వంపేట, కొండాపూర్, పుల్కల్, జహీరాబాద్ ప్రాంతాలు సైతం పారిశ్రామిక కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. -
మే 20న ప్రైవేటు మెడికల్ సెట్
♦ 35 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ♦ నేడు టీఎస్ ఎం-సెట్-ఏసీ-2016 నోటిఫికేషన్ విడుదల ♦ నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ♦ ఆన్లైన్లో పరీక్ష ♦ తెలంగాణలో 5, ఏపీలో 4 చోట్ల ప్రాంతీయ పరీక్షా కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో(ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రథమ సంవత్సరం) 2016-17 విద్యా సంవత్సరంలో 35 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి మే 20న ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష(టీఎస్ ఎం-సెట్-ఏసీ-2016) నిర్వహించేందుకు తెలంగాణ ప్రైవేటు మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ పరీక్ష తెలంగాణ ఉన్నత విద్యామండలి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పరీక్ష తేదీతోపాటు ప్రాంతీయ పరీక్షా కేంద్రాలను సోమవారం అధికారులు ఖరారు చేశారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ బి.కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ఖరారు చేశారు. నోటిఫికేషన్‌ను ఈ నెల 5(మంగళవారం)న జారీ చేసి, దరఖాస్తులను స్వీరించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను (www.tgmedco.com) ఏర్పాటు చేశారు. దరఖాస్తు ఫీజును రూ. 2 వేలుగా నిర్ణయించారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటేtsmedcet@gmail.com మెయిల్ ఐడీకి పంపించి, తగిన సమాచారం పొందవచ్చని అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని ఐదు ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాంతాల్లో పరీక్షల ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. గత ఏడాది ఈ పరీక్షకు 6,600 మంది హాజరు కాగా, ఈసారి 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని కాళోజీ హెల్త్ వర్సిటీ, హైదరాబాద్-జేఎన్టీయూ నేతృత్వంలో రూపొందిస్తారు. ప్రవేశ పరీక్ష, ప్రవేశాల కౌన్సెలింగ్ ఉన్నత విద్యా మండలి, కాళోజీ హెల్త్ వర్సిటీ నేతృత్వంలో జరుగుతాయి. ఇదీ షెడ్యూల్... ఏప్రిల్ 5: నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 5: దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఏప్రిల్ 27: దరఖాస్తుల గడువు ముగింపు మే 13: హాల్ టికెట్ల డౌన్లోడ్ మే 20: ప్రవేశ పరీక్ష మే 21: ప్రశ్నపత్రం, ప్రాథమిక కీ విడుదల మే 24 వరకు: అభ్యంతరాల స్వీకరణ మే 30: ర్యాంకింగ్, మెరిట్ లిస్టు, ఫైనల్ కీ విడుదల అర్హత పరీక్ష మార్కుల అప్లోడ్: ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాక. ప్రవేశాల కౌన్సెలింగ్: షెడ్యూల్ తరువాత జారీ చేస్తారు. ఇవీ ప్రాంతీయ పరీక్షా కేంద్రాలు ► తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్. ► ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు. -
ఉత్సవాల ఊసేది
కాకతీయ వేడుకలకు వీడని గ్రహణం ఏడాది కాలంగా వాయిదా అమలు కాని సీఎం హామీ {పత్యేక రాష్ట్రంలోనూ భంగపాటేనా.. కాకతీయ ఉత్సవాలు నిర్లక్ష్యపు నీడలో మగ్గుతున్నాయి. వీటి నిర్వహణకు ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన చేదు అనుభవాలే తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలు సైతం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఏడాది కాలంగా కాకతీయ ఉత్సవాల నిర్వహణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. - సాక్షి, హన్మకొండ కాకతీయ ఉత్సవాల నిర్వహణపై గత పాలకులు మొదటి నుంచీ తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. మొదట 2012 నవ ంబర్‌లో ఉత్సవాలు ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు. కానీ అప్పటి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేదు. దీంతో 2012 డిసెంబర్‌కు వాయిదా వేశారు. ప్రారంభోత్సవాలకు కోటి రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. కొసరి..కొసరి అరకొర నిధులే విడుదల చేయగా, వాటితోనే ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యూక కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో 2015 ఫిబ్రవరిలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించేందుకు అప్పటి కలెక్టర్ జి.కిషన్ జనవరిలో షెడ్యూల్ ప్రకటించారు. కేసీఆర్ అసంతృప్తి.. 2015 జనవరిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరంగల్‌లో మూడు రోజుల పాటు బస చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, పలు హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. కాకతీయ ఉత్సవాల నిర్వహణపై జిల్లా యంత్రాంగం ప్రకటించిన షెడ్యూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళ్లాక ఉన్నతాధికారులతో చర్చించి వివరాలు వెల్లడిస్తామని, కాకతీయ ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఏడాది గడిచినా ఉలుకూ పలుకూ లేదు. కాకతీయ వైభవాన్ని చాటే అవకాశం.. 2012 డిసెంబర్ నుంచి ఏడాది పాటు నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా కాకతీయుల కళా వైభవాన్ని నలుదిశలా చాటే అవకాశం కలిగింది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయపసేనాని రచించిన నృత్యరత్నావళి సంస్కృత గ్రంధాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. కాకతీయుల చరిత్ర, కట్టడాలకు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని కల్పించేందుకు కాకతీయ డైనాస్టీ పేరుతో ముద్రించిన కాఫీ టేబుల్ బుక్ అందుబాటులోకి వచ్చింది. కాకతీయుల ఇంజనీరింగ్ ప్రతిభపై న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహించారు. కాకతీయుల చరిత్ర, కట్టడాలకు సంబంధించి 20కి పైగా పుస్తకాలు కొత్తగా వెలువడ్డాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న పలు పనులు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే హన్మకొండలో హారిత కాకతీయ పేరుతో త్రీస్టార్ హోటల్ ప్రారంభమైంది. రూ.5 కోట్లతో ఖిలావరంగల్‌లో సౌండ్ అండ్ లైట్షో, గణపురం కోటగుళ్లలో రూ. 65 లక్షల వ్యయంతో పర్యాటకులకు వసతి సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. లక్నవరంలో లేక్ కాటేజీలు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ ఫెస్టివల్‌కు గుర్తుగా కాజీపేట వడ్డేపల్లి చెరువుపై పైలాన్ నిర్మాణం, కాకతీయుల విశిష్టతను తెలిపే సావనీర్ వంటివి ఆవిష్కృతమయ్యాయి. -
గాంధీ ఆస్పత్రిలో గవర్నర్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి పనిచేస్తున్న తీరుపట్ల రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ పేషెంట్ వార్డులో సౌకర్యాల లేమి ఉందని, ఎందుకు రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఆయన ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, అత్యవసర వార్డులో కలియతిరిగి అక్కడ రోగులకు అందుతున్న చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ కేవీ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సౌకర్యాలు లేమి గురించి మంత్రి లక్ష్మారెడ్డితో గవర్నర్ ఫోన్లో మాట్లాడారు. భవిష్యత్ లో కూడా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని ఆస్పత్రి సిబ్బందికి చెప్పారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. -
అధినేతకు అక్షరాల విజ్ఞప్తి
కొత్త ఏడాది 2016 కానుకగా కాబోలు నిజాం చక్కెర కర్మాగారం కార్మికులకు ‘లాకౌట్’ బహుమానం ప్రకటించింది యాజమాన్యం. కొత్త రాష్ట్రంలో కార్మిక విధానంగా పరిగణించాలని కాబోలు ఈ సంకేతం! మాంధ్ర పాలనలో ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా వేల కోట్ల ఆస్తులను సుమారు ఎనిమిది కోట్లకే ధారాదత్తం చేశారు. పనిచేసిన మూడు వేల మంది కార్మికులలో స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో, బలవంతపు తొలగింపుతో, రాచి రంపాన పెట్టి మూడు వందల మందికి కుదించి కన్నీళ్ల ఉప్పుటేరుల్ని పారించారు. చేసేదిలేక సుమారు డెబ్బై మంది కార్మికులు బలవంతపు మరణాలు పొందారు. అనారోగ్యాలతో, బెంగలతో కుళ్ళి కుళ్ళి మరణించినవారి ప్రేతాత్మలు నిజామాబాదు జిల్లాలో నడయాడుతున్నాయి. లాభాల్లో నడిచే కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టి ఆ కర్మాగారం కూకటివేళ్ళతో ముక్కలు ముక్కలుగా అమ్ముకు తినాలని ప్రైవేటీకరణ ప్రణాళికల జాతర మొదలైంది. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కార్మికులందరూ ఉత్సాహంగా పోరాటంలో పాల్గొని తమ వంతు కృషి చేశారు. కాని సమస్య ఇంకా జటిలం అవుతోంది. అంతరించే అంచులలో కర్మాగారమే కాదు, కార్మికులే కాదు, తెలంగాణ వాదుల కలలు కూడా కల్లలయ్యే మతలబు ఏదో జరుగుతోంది. అనేక మాసాల నుండి ఎంతోమంది నిరాహార దీక్షలు చేస్తున్నా తెలంగాణ లోకం కిమ్మనకుండా ఉండడం వారిని బాధిస్తోంది. కొందరు ప్రజాతంత్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగవలసి ఉంది. సుదీర్ఘ న్యాయ పోరాటంలో తీర్పులు కార్మిక పక్షం ఉన్నా- కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వం దన్ను కనుపిస్తున్నా- ఉద్యమ కాలంలో కేసీఆర్ గర్జన ఇంకా అందరి చెవుల్లో మారుమోగుతునే ఉంది. రాబోయే తెలంగాణా ప్రభుత్వం చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని మునుపటి వైభవం తెస్తుందని - మిగిలిన కార్మికుల ప్రాణాలు కాపాడకుండా ఆతరువాత కర్మాగారం స్వాధీనం చేసుకుంటే ఏం లాభం? 22 డిసెంబర్ 2015 నాడు అర్ధరాత్రి రహస్యంగా కంపెనీ ‘లాకౌట్’ ప్రకటించి విభ్రాంతికి గురి చేసింది. ఆసియాకే గర్వకారణంగా ఉన్న తీపి తేనెతుట్టలో పొగలేచింది. అది తెలంగాణ అంతటా కమ్ముతోంది. ఈ సందర్భంగా- యాగాగ్నికి ఆహుతైన వాటిలో కార్మికుల బతుకులు లేవని తెలిస్తే బాగుండు. యాగ ఫలితం కొంతైనా వెచ్చించి తెలంగాణ కడుపు చిచ్చుని చల్లార్చగలిగితే మేలు. అయ్యా! ప్రియతమ అధినేతా! ఎవరి మాటని మీరు పట్టించుకోకండి. వినకండి. మీరు మాట్లాడిన మాటలనే ఓసారి గుర్తు తెచ్చుకోండి! ఒక ఆశ్వాసనకి ఇంతకన్నా మించిన మంచి సమయం మరోటి లేదు! ఒక మీ స్పందన కోసం తెలంగాణ వేచి ఉంది. దేశమే ఊపిరి బిగబట్టి చూస్తున్నది. (నేడు నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని దీక్షా శిబిరానికి వెళ్ళి, పీల్చి పిప్పి చేసిన చక్కెర కర్మాగారం కార్మికులని అక్షరాల దన్నుతో పలకరించాలని బయలుదేరిన సందర్భంగా) - తెలంగాణ రచయితల వేదిక -
400 ఏళ్లనాటి దురాచారానికి చరమగీతం
డెహ్రాడూన్: సుమారు నాలుగు వందల ఏళ్లనాటి దురాచారానికి చరమగీతం పాడింది. దేవాలయల్లో దళితులు, మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ డెహ్రాడూన్‌లోని ఓ ప్రసిద్ధ ఆలయం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం జౌన్సర్ బవర్ ఏరియాలోని పరుశురాం దేవాలయ అధికారులు ప్రజలందరూ ఆలయంలోకి అడుగు పెట్టొచ్చని తీర్మానించారు. భవిష్యత్తులో ఆలయ ప్రవేశానికి అందరికి అనుమతి ఉంటుందని ప్రకటించింది. దీనితోపాటుగా దేవాలయ ఆవరణలో జంతు బలులను నిషేధించడం విశేషం. తాము గత 13 ఏళ్ల నుంచి ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని దళిత నాయకుడు దౌలత్ కున్వర్ చెప్పారు. పరశురామ్ ఆలయం నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం చాలా ప్రగతిశీలమైందన్నారు. దేవాలయ అధికారులు నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన ఇతర దేవాలయాలు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడం చాలా అవసరమని కమిటీ చైర్మన్ జవహర్ సింగ్ చౌహాన్ చెప్పారు. తమ ప్రాంతంలో అక్షరాస్యత రేటు గణనీయంగా పెరిగిందన్నారు. ఫలితంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. పురోగతి మార్గంలో పయనిస్తున్నారని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ మార్పును ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కాగా కేరళ లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళా భక్తుల నిషేధంపై వివాదం కొనసాగుతుంటే మరోవైపు ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ ఆలయం దేవాలయ పరిపాలనా అధికారులు నిర్ణయాన్ని పలువురు దళిత మేధావులు ప్రశంసించారు. -
‘గ్రేటర్’పై హైడ్రామా
-
అధికారుల వేధింపులు తాళలేక
కార్మికుడి మృతి మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళం వేసిన కార్మికులు ఇన్చార్జి కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు చైర్పర్సన్ హామీతో ఆందోళన విరమణ సంగారెడ్డి మున్సిపాలిటీ: అధికారుల వేధింపుల తాళలేకనే కాంట్రాక్ట్ కార్మికుడు కల్వకుంట కుమార్(32) మృతి చెందాడని, అందుకు బాధ్యుడైన ఇన్చార్జి కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం 9 గంటలకే కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపాలిటీకి చేరుకున్నారు. రెండు నెలల క్రితం విధులకు సమయానికి హాజరు కాలేదని ఇన్చార్జి కమిషనర్ మధు ఇచ్చిన నివేదిక ఆధారంగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కల్వకుంట కుమార్(32)ను కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. అయితే కుమార్‌పైనే అతడి కుటుంబం ఆధారపడి ఉందని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది. అయినా అతడిని విధుల్లోకి తీసుకోలేదు. గురువారం సైతం కుమార్ రాజంపేట పంప్‌హౌస్‌కు వచ్చిన జిల్లా అధికారిని కలిసి తనను విధుల్లోకి తీసుకోవాలని కోరాడు. తాను మున్సిపాలిటీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేనని సదరు అధికారి సమాధానం ఇచ్చారు. దీంతో కుమార్ అక్కడి నుంచి ఆవేదనగా తిరిగి ఇంటికి వెళ్లాడు. రాత్రి చాతిలో నొప్పి వస్తోందని కుమార్ తెలపడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్ అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు కమిషనర్ వేధింపుల వల్లే కుమార్ మృతి చెందాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు 4గంటల పాటు కార్యాలయ ప్రధాన గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చెర్‌పర్సన్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకొని మృతి చెందిన కుమార్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ కార్మికుడు కుమార్ మృతికి కారణమైన జిల్లా పరిషత్ సీఈవో, ఇన్చార్జి కమిషనర్‌పై మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుమార్ దహన సంస్కారాల కోసం చైర్పర్సన్ విజయలక్ష్మి రూ.10వేలు అందజేశారు. కార్మికులు ఆందోళన చేస్తున్నా ఇన్చార్జి కమిషనర్ రాకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్చార్జి కమిషనర్‌పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
నిమ్స్ వైద్యుల వినూత్న నిరసన
- గాంధీజీ చిత్రపటానికి గులాబీల సమర్పణ - యాజమాన్యానికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకోలు పంజగుట్ట: నిమ్స్‌కు నష్టం వాటిల్లే చర్యలు తీసుకోకుండా, ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడేలా యాజమాన్యానికి బుద్ధిని ప్రసాదించాలని నిమ్స్ ఆసుపత్రి ఫ్యాకల్టీ అసోసియేషన్ మంగళవారం ఆసుపత్రిలోని గాంధీ చిత్రపటానికి గులాబీలు సమర్పించి వేడుకుంది. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ చేపట్టిన ఆందోళన మంగళవారం 2వ రోజుకు చేరింది. వైద్యులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి, గాంధీ చిత్రపటం వద్ద గులాబీలు ఉంచి తమ సమస్యలు పరిష్కరించేలా నిమ్స్ యాజమాన్యానికి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం డెరైక్టర్ నరేంద్రనాథ్‌కు గులాబీలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. పదోన్నతులు పాతవిధానంలోనే కొనసాగించాలని కోరారు. వైద్యులు రోగులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మాత్రమే నిరసన వ్యక్తంచేసి అనంతరం ఓపీ రోగులకు సేవలందించారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీభూషన్‌రాజు మాట్లాడుతూ... ఆసుపత్రిలోని ఫ్యాకల్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పదోన్నతులపై ఉన్నతాధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో మాదిరిగానే ప్రొఫెసర్లకు పదోన్నతి కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నిమ్స్ యాజమాన్యానికి ఇచ్చిన 72 గంటల సమయం మంగళవారంతో పూర్తవుతుందని, బుధవారం సాయంత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. -
చేష్టలుడిగి... చేతులెత్తేశారు!
తాగునీటి సౌకర్యం కూడా లేదు ట్రాఫిక్ నిర్వహణ అధ్వానం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ భక్తజనం రాజమండ్రి: ‘వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం.. పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహిస్తున్నాం. భక్తుల సేవలకే తొలి ప్రాధాన్యం.. వారి రక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నాం’ గడిచిన రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టిన ప్రచారమిది. ఇంతా చేస్తే పుష్కర ఆరంభం రోజే ప్రభుత్వం.. అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. కళ్లముందు విషాద ఘటన జరిగితే ఏం జరిగిందో కూడా తెలియని.. ఎలా స్పందించాలో కూడా అర్థంకాని, చేతకాని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. పుష్కరఘాట్ ప్రమాద నివారణలోనే కాదు.. భక్తులు ఘాట్ల వద్దకు చేరుకునే ఏర్పాట్లు చేయడంలో, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న చర్యల్లో, భక్తులకు తాగునీరు, వైద్యసేవలు, మరుగుదొడ్ల నిర్వహణ... ఇలా ప్రతీ విషయంలోనూ ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ప్రణాళికా రాహిత్యం, శ్రద్ధ శూన్యం....: గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం నాలుగు నెలులుగా సన్నాహాలు చేస్తోంది. పుష్కర నిర్వహణకు రూ.వందల కోట్లు కేటాయించింది. అయితే పనులు ఆలస్యంగా ఆరంభించడం, సకాలంలో పూర్తి చేయకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం పుష్కరాలను ఆది నుంచి వివాదాస్పదం చేసింది. భక్తుల భద్రతా చర్యల విషయంలోనూ పూర్తిగా విఫలమైంది. రాజమండ్రి నగరంపై దృష్టి పెట్టినా.. ఇక్కడే ఆశించిన స్థాయిలో పనులు పూర్తి చేయలేదు. పుష్కరాలు ఆరంభమైన మంగళవారమూ రోడ్ల నిర్మాణ పనులు చేస్తుండడం, పార్కింగ్ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేస్తుండడం గమనార్హం. చివరకు తాగునీరు అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది.దీనితో భక్తులు దాహంతో అలమటించి పోయారు. గుక్కెడు నీటి కోసం పాన్‌షాపుల వద్ద మంచినీటి వాటర్ బాటిళ్ల వద్ద క్యూకట్టారు. పుష్కర స్నానం కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి రావడం, దీనికితోడు సూర్యభగవానుడి ప్రతాపం తోడుకావడంతో భక్తులు చుక్కనీటి కోసం ఆర్రులు చాచారు. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానం...: రాజమండ్రి నగరంలో పుష్కర యాత్రికుల కోసం 1,155 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వీటిని చివరి రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటికి అవసరమైన నీరు సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇవి అధ్వానంగా మారి భక్తులు వినియోగించేందుకు పనికిరాకుండా పోయాయి. చాలామంది పుష్కర భక్తులు పుష్కరఘాట్, కోటిలింగాల ఘాట్‌కు వెళ్లే వీధుల్లో బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. -
అన్నదాత కడుపుమండింది..
- చెరకు పంటను పశువులకు మేతగా వేసిన రైతు - ఫ్యాక్టరీకి చెరకు తరలించి ఏడునెలలైనా అందని బిల్లులు - మెదక్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామంలో సంఘటన మెదక్ రూరల్: ఏడాది కింద పండించిన చెరకు ఫ్యాక్టరీకి తరలించిన ఆ అన్నదాతకు ఏడు నెలలు గడిచినా యాజమాన్యం బిల్లులు చెల్లించలేదు. సాగుచేసిన చెరకు పంటకు ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. భవిష్యత్తులో చెరకు ఫ్యాక్టరీ నడుస్తుందో లేదో అనే ఆందోళన. దీంతో ఆ అన్నదాత పండించిన చెరకు పంటను పశువుల మేతగా వేశాడు. ఈ సంఘటన మెదక్ మండలం గాజిరెడ్డిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సాపరవి గత ఏడాది మూడెకరాల్లో చెరకు పంట సాగుచేశాడు. పంటను ఫ్యాక్టరీకి తరలించిన రవికి యాజమాన్యం రూ.60వేలు ఇవ్వాల్సి ఉండగా అందులో రూ.40వేలను మాత్రమే చెల్లించింది. మరో రూ.20వేలు ఇవ్వాల్సి ఉన్నా నేటికి చెల్లించలేదు. ఫ్యాక్టరికి చెరకు తరలించి ఏడునెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో రైతు రవి ఆవేదనకు గురయ్యాడు. ప్రస్తుతం మూడెకరాల్లో చెరకు పంట మోడం అలాగే ఉంది. కాగా నేటికీ పంటను ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోక పోవడంతో కడుపు మండిన రైతు చేనులోకి పశువులను తోలి మేపించాడు. జిల్లాలోని వేలాది మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. అనంతరం రవి విలేకరులతో మాట్లాడుతూ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం చెప్పి ఏడాది గడుస్తున్నా స్వాధీనం చేసుకోనందునే తనలాంటి రైతులకు ఈ పరిస్థితి ఎదురైందన్నారు. -
గుంటూరులో జూట్ మిల్లు లాకౌట్
-
పుష్కరాల నిర్వహణపై రగడ
-
వర్షంలోనూ సడలని సంకల్పం
సీతానగరం, బొబ్బిలి: ఎన్సీఎస్ చక్కెర కర్మాగార యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్నదాతల సంకల్పం జోరు వానలోనూ సడలలేదు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ శనివారం ఉదయం కర్మాగారం ముందు మహాధర్నా చేపట్టారు. ఇంతలో బొబ్బిలి డీఎస్పీ బీవీ.రమణమూర్తి యాజమాన్యంతో మాట్లాడించడంతో సంతృప్తి చెంది ఆందోళనను విరమించారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదీ సంగతి.. గత రెండు సీజన్లకు సంబంధించి ఎన్సీఎస్ యాజమాన్యం 18 కోట్ల రూపాయల మేర బకాయి ఉండడంతో అన్నదాతలు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో అప్పులు చేయలేక చెరకు బకాయిల కోసం పోరాటం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టేందుకు పెద్దసంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఒకవైపు వర్షంలో తడిసి ముద్దవుతున్నా, మరో వైపు అధిక సంఖ్యలో పోలీసులు మోహరించినా వెనుకంజ వేయలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మహాధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సమస్యపై యాజమాన్యానికి వినతి ఇవ్వాలని వారు సూచించారు. దీంతో ఏపీ చెరకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ రైతులనుద్దేశించి మాట్లాడుతూ శుక్రవారం బొబ్బిలిలో యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశంలో కోటి రూపాయలు చె ల్లిస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ధర్నాకు వచ్చినవారికి ఆ సొమ్ము చెల్లిస్తే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యేలోగా పార్వతీపురం ఏఎస్పీ సిద్ధార్థ కౌశిల్, బొబ్బిలి డీఎస్పీ బీవీ.రమణమూర్తి వచ్చి మొత్తం పరిస్థితిని రైతులకు వివరించారు. యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎండీ నాగేశ్వరరావు, డైరక్టరు శ్రీనివాసులను తీసుకువచ్చారు. మహాధర్నాకు వచ్చిన రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చెల్లింపులు చేస్తామని, జూలై 15 నాటికి బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లిస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. భారీ బందోబస్తు ఏర్పాటు మహాధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్ఐ, ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియోగించారు. ఎన్సీఎస్ సుగర్స్ ఎండీ నాగేశ్వరరావు, డెరైక్టర్లకు భారీ భద్రత కల్పించారు. పోలీసులు వలయంగా ఏర్పడి నలుగురు రైతు ప్రతినిధులనే లోపలకు పంపి చర్చలు జరిపించారు. పాతబొబ్బిలి జంక్షను వద్ద కూడా భారీగా పోలీసులను ఉంచారు. -
భలే మంచి బేరం!
శ్రీకాకుళం : అడుగడుగునా వ్యాపారం... అదే ప్రైవేటు విద్యాసంస్థల ధ్యేయం. చదువుకునే పుస్తకాల నుంచి వేసుకునే దుస్తుల వరకూ... వాడుకునే షూస్నుంచీ... ధరించే టై వరకూ ఏటా కొనుగోలు చేయిస్తూ... తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఒక సంవత్సరం తీసుకునే యూనిఫాంను రెండో ఏడాదీ వాడుకోవడంవల్ల వారి ధ్యేయం నెరవేరడం లేదో... ఏమో... యూనిఫాం సైతం ఏటా మార్చేస్తున్నారు. బట్టల దుకాణాలకు వ్యాపారం పెంచి తద్వారా వచ్చే కమీషన్‌ను నొక్కేస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తరచూ యూనిఫాం మార్చేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు ఏటా మార్చేస్తుండగా ఇంకొన్ని రెండు మూడేళ్లకోసారి మార్చేస్తున్నారు. బట్టల దుకాణ యజమానులు కమీషన్ ఆశచూపి కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఎరవేస్తున్నారు. ఒక్కో యూనిఫాంకు కనీసం రూ. 500 వరకు వెచ్చించాలి. ప్రతి విద్యార్థికి కచ్చితంగా రెండు యూనిఫాంలు ఉంటేగానీ సర్దుబాటుకాదు. ఈ లెక్కన ప్రతి తల్లిదండ్రీ ఏడాదికో... రెండేళ్లకో రూ. 1000 వరకు వెచ్చించాలి. అదే ఇద్దరు పిల్లలైతే రెండువేలు ఖర్చుపెట్టాలి. ఇది తల్లిదండ్రులకు భారమైనా షాపు యజమానులు ఇచ్చే రూ. 100 కమీషన్‌కు కొన్ని విద్యాసంస్థలు కక్కుర్తిపడి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి. కొన్నేళ్లక్రితం వరకు పాఠశాలల యూనిఫాంను పదేళ్లకో పదిహేనేళ్లకో మార్చేవారు. ఇటువంటి విధానాలకు తిలోదకాలిచ్చి దానిని కూడా వ్యాపారంగా మార్చేశారు. గతంలో విద్యార్థులు వారికి నచ్చే షాపులో యూనిఫాం కొనుగోలు చేసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా యాజమాన్యాలు సూచించిన షాపుల్లోనే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మరో రకమైన సమస్య ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాం సమస్య మరోలా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే యూనిఫాం రాజీవ్ విద్యా మిషన్ ద్వారా సరఫరా చేస్తున్నారు. తొమ్మిది, పది తరగతులవారు ఎనిమి దో తరగతిలో ఇచ్చిన యూనిఫాంనే వేసుకోవాలి. ఇలా వ్యత్యాసం ఎందు కు చూపిస్తున్నారన్నది ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. గత ఏడాదికి సంబంధించి నాలుగైదు మండలాల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాం అందలేదు. జిల్లా అధికారులు వీటిపై దృష్టిసా రించాల్సి ఉంది. -
మొక్కజొన్న అమ్మకాల పర్యవేక్షణకు కమిటీ
హైదరాబాద్: 2014- 15 ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న అమ్మకాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శని వారం ఉత్తర్వులిచ్చింది. పౌర సరఫరాల కమిషనర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, ఆర్థికశాఖ, ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖ నుంచి పలు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మొక్కజొన్న నిల్వల నాణ్య త, ధరలు, అమ్మకాలను పర్యవేక్షిస్తుంది. -
సాగర్‌డ్యాం నిర్వహణలో నిర్లక్ష్యం
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు అన్నపూర్ణగా వెలుగొందుతున్న ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు. వేల కార్మికుల శ్రమశక్తితో నిర్మితమై, తెలుగు ప్రజలను కరవు రక్కసి కబంధహస్తాల నుంచి కాపాడిన అద్భుత కట్టడం. 22 లక్షల ఎకరాలకు సాగు నీరు, పలు పట్టణాలు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తూ, విద్యుదుత్పాదనతో వెలుగులీనుతున్న మానవ నిర్మిత మహాసాగరం..నేడు అధికారుల నిర్లక్ష్యానికి గురికావడం క్షోభను కలిగిస్తోంది. విజయపురిసౌత్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ. కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కాగితాల్లో చూపుతున్నా డ్యాం నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. డ్యాం రక్షణకు ఏర్పాటు చేసిన గోడలు పగిలి అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. ఇరువైపులా పేర్చిన రాతి బండలు పక్కకు కదిలాయి. డ్యాంపై రోడ్డుకు ఇరువైపులా వేసిన కేబుల్‌పై గతంలో సిమెంట్ ప్లేట్లు అమర్చారు. కాలగర్భంలో సిమెంటు ప్లేట్లు శిథిలమై పోగా అక్కడక్కడా పరిచిన నాపరాళ్లూ లేక కొన్ని చోట్ల కేబుల్ దర్శనమిస్తోంది. సాగర్ డ్యాం అంతర్భాగం నుంచి వచ్చే ఊట నీటిని తొలగించడానికి 250కి పైగా రంధ్రాలు ఉన్నాయి. నీటి కారణంగా ఈ రంధ్రాలు కాల్షియంతో మూసుకుపోతున్నాయి. ఈ కాల్షియం తొలగించడానికి టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. ఈ పనుల్లో భాగంగా డ్యాం పునాదుల్లో డ్రిల్లింగ్ చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. రంధ్రాల సమస్య మాత్రం అలానే ఉండిపోయింది. డ్యాం పటిష్టతలో కీలక పాత్ర వహించిన ఎర్త్‌డ్యాం నిర్వహణ పట్ల కూడా అధికారుల చిత్తశుద్ధి కరువయ్యంది. ఇరవై ఏళ్ల కిందట కుడివైపు ఎర్త్ డ్యాంకు క్యావిటీ(సన్నపాటి రంధ్రం) ఏర్పడింది. దాని అంతు చిక్కక అధికారులు కుడివైపు ఎర్త్ డ్యాంకు పేర్చిన రివిట్‌మెంటు రాళ్లను కిలోమీటరు మేర పెకిలించారు. క్యావిటీ దొరకకపోవడంతో ఆ పనిని అలానే వదిలివేశారు. నేటికీ చెదిరిన రాళ్లు దర్శనమిస్తున్నాయి. ఎర్త్ డ్యాంల రోడ్లకు ఇరువైపులా ఉన్న గోడలపై ప్రత్యేకంగా డిజైన్చేసి పరిచిన రాళ్లు కూలేదశలో ఉన్నాయి. సాగర్ అందాలను ఇనుమడింపజేసే విధంగా ఏర్పాటు చేసిన లైట్లు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. డ్యాం భద్రత కోసం కుడి, ఎడమ ప్రధాన డ్యాంలపై లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన రిమోట్ కంట్రోల్‌తో నడిచే గేట్లు పనిచేయడం లేదు. ఎస్పీఎఫ్ సిబ్బంది వాహనాలు డ్యాం మీదకు వచ్చినప్పుడు చేతులతో పక్కకు నెడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు డ్యాం నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని పలువురు ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం
మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఎంప్లాయబిలిటీ, జాబ్ రెడీ స్కిల్స్ అందించడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం. ఫ్యాకల్టీ మార్గనిర్దేశానికి తోడు విద్యార్థులు కూడా అంకిత భావంతో శ్రమిస్తే విజయాలు సొంతమవుతాయి. అకడమిక్ కోర్సులనేవి అవకాశాలకు ఒక ప్లాట్‌ఫామ్ లాంటివి. ఆ సర్టిఫికెట్‌తోనే కెరీర్ సొంతమవ్వాలనే భావన వీడాలి అంటున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- తిరుచిరాపల్లి (త్రిచీ) డెరైక్టర్ ప్రొఫెసర్ వై.ప్రఫుల్ల అగ్నిహోత్రి. మేనేజ్మెంట్ విభాగంలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన ఆయనకు పరిశ్రమలో, అకడమిక్స్‌లో 26 ఏళ్లకు పైగా అనుభవముంది. 2011 నుంచి ఐఐఎం- త్రిచీ డెరైక్టర్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ అగ్నిహోత్రితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. గెస్ట్ కాలమ్ ఇంటరాక్టివ్ మెథడ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి ప్రస్తుతం మన మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అధిక శాతం థియరీ బేస్డ్గా ఉంది. దీనికి బదులుగా ఇంటరాక్టివ్ మెథడ్స్‌ను అమలు చేయాలి. తద్వారా విద్యార్థులకు పుస్తకాల్లోని సిద్ధాంతాల పరిజ్ఞానంతోపాటు వాటిని ప్రాక్టికల్‌గా అన్వయించే స్కిల్స్ సొంతమవుతాయి. నేటి కార్పొరేట్ ప్రపంచంలో రాణించాలంటే.. విద్యార్థులకు జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే క్లిష్టమైన సంఘటనలకు ఎలాంటి పరిష్కారాలు కనుగొనాలనే విషయంలో అవగాహన అవసరం. విదేశాలకు.. మనకు తేడా ఇదే మనదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ సహా పలు బి-స్కూల్స్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తోంది. ఇవి విదేశాల్లోని ఇన్స్టిట్యూట్లకు దీటుగా పోటీపడుతున్నాయి. కానీ వీటి సంఖ్య వేళ్ల మీద లెక్కించదగ్గ స్థాయిలోనే ఉంది. దేశంలో వందల సంఖ్యలో ఉన్న బి-స్కూల్స్ సైతం అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే.. ఇటు అధ్యాపకుల్లో, అటు విద్యార్థుల్లో రీసెర్చ్ ఓరియెంటేషన్ పెరగాలి. విదేశాల్లోని బి-స్కూల్స్‌కు, మన బి-స్కూల్స్‌కు మధ్య ప్రధాన తేడా రీసెర్చ విషయంలోనే! కాబట్టి మనం కూడా రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట వేస్తే మన బిజినెస్ స్కూల్స్ నాణ్యత కూడా మెరుగవుతుంది. ఫ్యాకల్టీ సభ్యుల దృక్పథమూ మారాలి నేటి మేనేజ్మెంట్ విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా రాణించాలంటే తరగతి గది నుంచే మార్పులు తీసుకురావాలి. ఈ క్రమంలో ముందుగా ఫ్యాకల్టీ దృక్పథంలో మార్పు రావాలి. గంట లేదా గంటన్నర సమయంలో ఉండే లెక్చర్‌ను ముగించడంతోనే తమ బాధ్యత పూర్తయిందని అధ్యాపకులు భావించకూడదు. విద్యార్థులకు సిలబస్ అంశాలను బోధించడంతోపాటు వారికి ఆదర్శంగా ఉండాలి. మెంటార్‌గా వ్యవహరించాలి. తరగతిలో విద్యార్థులకు వారి బలాలు- బలహీనతల ఆధారంగా వారు రాణించాల్సిన అంశాలు, పొందాల్సిన నైపుణ్యాలపై అవగాహన కల్పించాలి. ఐఐఎంల విస్తరణ.. పరిగణించాల్సిన అంశాలు దేశంలో ఐఐఎంలు, ఐఐటీలను విస్తరించాలనే నిర్ణయం మంచిదే. కొత్త క్యాంపస్ ఏర్పాటు- మనుగడ విషయంలో అత్యంత ప్రధానమైన అంశం క్యాంపస్‌ను ఏర్పాటు చేయదలచుకున్న ప్రదేశం లేదా ప్రాంతం. ఆ ప్రాంతంలో లభించే మౌలిక సదుపాయాలు, సామాజిక పరిస్థితులు, ఆ ప్రాంతానికున్న గుర్తింపు వంటి అంశాలను కూడా పరిశీలించాలి. అప్పుడే అత్యున్నత స్థాయి ఇన్స్టిట్యూట్ రూపకల్పన సాధ్యమవుతుంది. కొత్త ఫ్యాకల్టీ ఆసక్తి చూపడంలోనూ క్యాంపస్ భౌగోళిక స్వరూపం ఎంతో కీలకం. కేవలం భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎందరో ఫ్యాకల్టీ వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. బోధన విధానంలోనూ మార్పులు రావాలి బోధన పరంగానూ ఫ్యాకల్టీ సభ్యులు కొత్త మార్పులు, విధానాలు అమలు చేయాలి. ప్రస్తుత అవసరాలు, వాస్తవ పరిస్థితుల కోణంలో విశ్లేషిస్తే.. బోధనలో ఎంక్వైరీ మెథడాలజీని ప్రవేశ పెట్టాలి. దీనివల్ల విద్యార్థుల్లో గ్రాహణ శక్తి, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగవుతాయి. దాంతోపాటు కేస్ స్టడీస్, సిమ్యులేషన్ గేమ్స్, ప్రాజెక్ట్స్ తదితర బోధన పద్ధతులు పాటిస్తే విద్యార్థులకు నిజమైన పరిజ్ఞానం లభిస్తుంది. ఇండస్ట్రీ- అకడమిక్ కొలాబరేషన్‌కు మార్గాలు ఇటీవల కాలంలో చాలామంది విద్యావేత్తలు అత్యంత ఆవశ్యకంగా పేర్కొంటున్న అంశం.. ఇండస్ట్రీ- అకడమిక్ కొలాబరేషన్. దీనివల్ల విద్యార్థులకు మరింత నైపుణ్యం లభిస్తుందనే మాట వాస్తవం. అయితే, వీటిపై ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌కు అవగాహన ఉన్నప్ప టికీ.. మరెన్నో విద్యాసంస్థలకు సరైన మార్గం తెలియడం లేదు. పరిశ్రమ నిపుణులను గెస్ట్ ఫ్యాకల్టీగా పిలవడం.. కరిక్యులం రూపకల్పనలో వారిని సంప్రదించడం.. సంయుక్తంగా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం.. తదితర మార్గాల ద్వారా ఇండస్ట్రీ- అకడమిక్ కొలాబరేషన్‌ను బలోపేతం చేసుకోవచ్చు. అదే విధంగా అకడమిక్ కోణంలో ఇతర ఇన్స్టిట్యూట్లతో ఎక్స్ఛేంజ్ ఒప్పందా లు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులతోపాటు ఫ్యాకల్టీకి కూడా తాజా పరిణామాలపై విస్తృత అవగాహన లభిస్తుంది. ఆలోచనలతోపాటు.. తపన కూడా ఉండాలి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. ఇటీవల కాలంలో విస్తృత ప్రచారం పొందు తోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఔత్సాహికులు లక్ష్యం చేరుకునేందుకు అకడమిక్ స్థాయి నుంచే ఎన్నో మార్గాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలదొక్కుకోవాలంటే.. మంచి బిజినెస్ ఐడియాతోపాటు సాధించాలనే తపన, సవాళ్లను స్వీకరించే మానసిక సంసిద్ధత అవసరం. ఇది ఒక ప్లాట్‌ఫామ్ అనే భావించాలి భవిష్యత్తు అవకాశాల కోణంలో మేనేజ్మెంట్ కోర్సులను.. కేవలం ప్లాట్‌ఫామ్‌లుగా, మార్గాలుగానే భావించాలి. కోర్సులో చేరగానే కార్పొరేట్ కొలువు సొంతం అవుతుందనుకోకూడదు. సబ్జెక్ట్ నాలెడ్జ్‌కు కష్టించేతత్వం, అంకితభావం, సానుకూల దృక్పథం వంటివి ఉంటే చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. వృత్తి జీవితంలో వివిధ దశల్లో విజయాలు సాధించేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే క్లాస్ రూం నుంచే వీటిని అందిపుచ్చుకునేలా కృషి చేయా లి. విద్యార్థులకైనా, ఔత్సాహికులకైనా ఇదే నా సలహా!! -
మో‘డల్’..!
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో మోడల్‌స్కూళ్ల నిర్వాహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పాఠశాలలు కనీస సదుపాయాలకు నోచుకోక కూనరిల్లుతున్నాయి. ఇంగ్లిష్ మీడియంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించే సరికి తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. విద్యార్థులు కూడా చేరేందుకు ఆసక్తిచూపారు. తీరా ప్రారంభ మయ్యాక అసలు విషయం బోధపడింది. ప్రస్తుతం మోడల్‌స్కూళ్ల నిర్వహణ తీరును చూసి నిరాశచెందుతున్నారు. విద్యాపరంగా వెనుకబడిన జిల్లాపట్ల ప్రత్యేకశ్రద్ధ చూపుతామని ప్రభుత్వాలు హామీలు గుప్పిస్తున్నా.. ఆచరణలో అమలుకావడం లేదు. మోడల్‌స్కూళ్ల నిర్వహణలో కూడా ఇదే తేటతెల్లమైంది. జిల్లాలో 64 మండలాలకు మొదటి, రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు 47స్కూళ్లు మంజూరయ్యాయి. అయితే వీటిలో కోస్గి, వెల్దండ, ధన్వాడ, కొత్తకోట, కోడేర్, పెబ్బేర్, ఖిల్లాఘనపూర్ మండలాల్లో మాత్రమే తరగతులు ప్రారంభమైనా..హాస్టల్ వసతిలేదు. దీంతో విద్యార్థులు స్వస్థలాల నుంచి రావడమో లేక అద్దెగదులు తీసుకునో చదువులు సాగిస్తున్నారు. ఇక మిగతా 40 స్కూళ్ల పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే చందంగా మారింది. అచ్చంపేట, ఆమనగల్లు, అమ్రాబాద్, దామరగిద్ద, దేవరకద్ర, దౌల్తాబాద్, ఫరూఖ్‌నగర్, అయిజ, మద్దూరు, మాగనూరు, మహబూబ్‌నగర్, మక్తల్, పాన్‌గల్, పెద్దకొత్తపల్లి, తాడూర్, ఊట్కూరు, వనపర్తి మండలాల్లో స్కూలు నిర్మాణం కోసం కనీసం స్థలాన్ని కూడా సేకరించలేదు. పిల్లలున్నా.. పంతుళ్లు లేరాయే? కొత్తగా ఏర్పాటుచేసిన మోడల్స్కూళ్లలో విద్యార్థులు భారీసంఖ్యలో చేరారు. ఒక్కోతరగతిలో ప్రభుత్వ నిర్దే శం మేరకు 80 మంది విద్యార్థులు చేరారు. ఉపాధ్యాయ ల కొరత కారణంగా తరగతులు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఏడు స్కూ ళ్లలో రెండింటికీ పూర్తిస్థాయి ప్రిన్సిపాల్స్ లేరు. అధ్యాపకుల విషయానికొస్తే మంజూరైన వాటిలో సగం వరకు ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ఏడు స్కూళ్లకు పీజీటీ, టీజీ టీ మొత్తం 140 పోస్టులు మంజూరుకాగా, అందులో 67 ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా చూస్తే తెలుగు 13, ఇంగ్లిషు 16, హిందీ 6, గణితం 14, సైన్స్ 10, సోషల్ 8 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు కూడా చదువుప ట్ల నిరాశ చెందుతున్నారు. తరగతులు సక్రమంగా సాగకపోవడంతో చాలామంది విద్యార్థులు టీసీలు తీసుకుని ఇంటిబాట పడుతున్నారు. ఇటీవల వెల్దండ మోడల్ స్కూల్ నుంచి నలుగురు విద్యార్థులు టీసీ తీసుకువెళ్లా రు. మిగతా స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థులు వెళ్లిపోగా మిగిలిన ఖాళీలను ఎలా భర్తీచేయాలో తెలియక రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ ఏ) అధికారులకు అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. -
పల్లెకు రాని వెలుగు
నెల్లూరు (దర్గామిట్ట): ‘ఆర్టీసీ బస్సు ఎక్కండి. సురక్షిత ప్రయాణం చేయండి. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకండి. ప్రమాదాల బారిన పడకండి. పేదల కోసమే ఆర్టీసీ బస్సు. మారుమూల గ్రామాలకు సైతం బస్సులు నడుపుతాం’ అంటూ ఆర్టీసీ యాజమాన్యం నిత్యం పలికే సూక్తులివి. వీటి అమల్లో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికీ 102 గ్రామాల ప్రజలు పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణానికి నోచుకోలేదు. నష్టాల పేరుతో పల్లెవెలుగు బస్సులను రద్దు చేస్తున్నారు. రోజురోజుకూ బస్సుల సౌకర్యం లేని గ్రామా లు పెరుగుతున్నాయి. బస్సులు లేకపోవడంతో గ్రామీణులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల కట్టడి తమ పని కాదన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 360 మార్గాల్లో సేవలు జిల్లాలో మొత్తం 10 డిపోలున్నాయి. అన్ని రకాల బస్సులు కలిపి 859 వరకు ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీకి చెందినవి 756, అద్దెకు నడుపుతున్నవి 103 బస్సులున్నాయి. దాదాపు 360 మార్గాల్లో తిరుగుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. జిల్లాలో గరుడ, ఇంద్ర, మేఘదూత్, సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నాయి. 462 పల్లెవెలుగు బస్సులు జిల్లా వ్యాప్తంగా దాదాపు 462 పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా 102 గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు అందుబాటులో లేవు. జిల్లాలో దాదాపు 1200 గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1090 గ్రామాలకు బస్సులు తిప్పుతున్నారు. ఇంకా 102 గ్రామాలకు బస్సులు నడపడం లేదని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణం జిల్లాలో చాలా గ్రామాలకు రోడ్డు సరిగా ఉన్నప్పటికీ అధికారులు బస్సులు తిప్పడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బస్సులు ఎక్కకపోవడంతో నష్టాలు వస్తున్న కారణంగా బస్సులు తిప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో గ్రామీణులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సులు నోచుకోని కొన్ని గ్రామాలు ఉదయగిరి నుంచి కిష్టంపల్లి మీదుగా అర్లపడిగ, బిజ్జంపల్లి, అప్పసముద్రం తదితర గ్రామాలకు బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు సైతం ప్రైవేటు వాహనాల్లో వెళ్లకతప్పని స్థితి. గూడూరు నుంచి చెర్లోపల్లి, కుడితిపల్లి, కాగితాలపూరు, లక్ష్మీనరసాపురం తదితర గ్రామాలకు బస్సులు నడవడం లేదు. నెల్లూరు నుంచి కసుమూరు మీదుగు వెళ్లే కందలపాడు బస్సును రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నెల్లూరు నుంచి అల్లూరు మీదుగా గోగులపల్లికి వెళ్లే బస్సును ఇటీవల నష్టాల పేరుతో రద్దు చేశారు. కొడవలూరు మండలం యల్లాయపాలెం, రామన్నపాలెం, మానేగుంటపాడు, రెడ్డిపాలెం, ఆలూరు తదితర గ్రామాలకు బస్సులు నడవడం లేదు. ప్రైవేటు వాహనాలకు ప్రోత్సాహం కొందరు ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేటు వాహనాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నగరానికి దగ్గరగా ఉన్న గ్రామాలకు ఎక్కువగా ప్రవేటు బస్సులు, ఆటోలు, మాక్సీక్యాబ్ తదితర వాహనాలు తిరుగుతున్నాయి. వారితో లాలూచి పడి ప్రైవేటు వాహనాలు వెళ్లిన తర్వాత ఆర్టీసీ బస్సులు నడుపుతూ వారి నుంచి కొంత మొత్తాన్ని అందుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నష్టాలు వస్తున్నాయి : చంద్రశేఖర్, డిప్యూటీ సీటీఎం కొన్ని గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నాయి. అయితే అక్కడి ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి నష్టం వస్తోంది. మరికొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆ మార్గంలో బస్సులు తిప్పడం లేదు. -
ఇండస్ట్రీ రెడీ... బీ-స్కూల్స్ కరిక్యులమ్
మేనేజ్మెంట్... ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఎవర్గ్రీన్ కోర్సు. సంప్రదాయ కోర్సుల నుంచి ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థుల వరకూ.. ఎంబీఏలో చేరడమే చాలామంది లక్ష్యం. కార్పొరేట్ కంపెనీలు మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుండడమే ఇందుకు కారణం. మరోవైపు కంపెనీల అవసరాలకు అనుగుణంగా.. నైపుణ్యాలు అందించే విధంగా ప్రస్తుత బీ-స్కూల్స్ కరిక్యులమ్ ఉందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. పరిశ్రమ ఆశించిన విధంగా కరిక్యులమ్ ఉండకపోవడంతో కోర్సు-జాబ్ మధ్య అంతరం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను ప్రస్తుత అవసరాలకనుగుణంగా రూపొందించే ప్రక్రియకు సిటీలోని ఐఎస్బీ, ఐపీఈ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ, ఐఎంటీ, ఎన్ఐఎంఎస్ తదితర బీ-స్కూల్స్ శ్రీకారం చుట్టాయి. దేశంలోని అధిక శాతం బీ-స్కూల్స్ జాబ్ మార్కెట్ డిమాండ్ మేరకు తమ విద్యార్థుల్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే దిశగా కోర్సుల్లో మార్పులు చేస్తున్నాయి. ఎంప్లాయర్స్తోపాటు మారిన పని సంస్కృతికనుగుణంగా (బిజినెస్ ఎన్విరాన్మెంట్) సరిగ్గా సరిపోయే కోర్సులను తిరిగి రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. 2015 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన సిలబస్‌ను అమల్లోకి తీసుకురానున్నాయి. ఇందులో ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంభాషణ చాతుర్యం.. గత కార్పొరేట్ వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకోవడం.. చైనా వంటి కీలక మార్కెట్లను అవగాహన చేసుకునే సామర్థ్యం.. స్టార్ట్అప్లను ప్రారంభించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడం.. ఆర్థిక రంగంలో కొత్తగా వస్తున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం.. పెట్టుబడి దారుల ఆసక్తిని అధ్యయనం చేయడం.. సంస్థను సమర్థంగా నిర్వహించడం.. రిటెన్ కమ్యూనికేషన్‌పై పట్టు సాధించేందుకు దోహదపడే అంశాలకు చోటు కల్పిస్తున్నాయి. తద్వారా విద్యార్థి కోర్సు పూర్తయ్యే నాటికి ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ సొంతం చేసుకునేలా సిలబస్‌ను రూపొందిస్తున్నాయి. సిటీ బీ స్కూల్స్‌లో... హైదరాబాద్‌లోని ఐఎస్బీ, ఐపీఈ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీల మేనేజ్మెంట్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. వీటిల్లో ఐఎస్బీ, ఐపీఈల్లో 2015 విద్యాసంవత్సరం నుంచి సిలబస్‌లో కొన్ని మార్పులు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో మేనేజ్మెంట్ కోర్సుల సిలబస్‌ను 2010 విద్యాసంవత్సరంలో మార్చారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మార్పులపై ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. యూజీసీ అనుమతితో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంతో కోర్సులను ఎలక్టివ్ సబ్జెక్టులుగా ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మిగతా ఇన్స్టిట్యూట్లకు భిన్నంగా ఐఎస్బీ ఐదు సంవత్సరాలకోసారి కరిక్యులమ్‌లో మార్పులు చేస్తోంది. అవసరాలకనుగుణంగా ఎప్పటికప్పుడూ నూతన కోర్సులను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లో ఉన్న 763 మంది విద్యార్థుల కోసం కొత్తగా రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అనే నూతన కోర్సును రూపొందించింది. సందర్భానుసారంగా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవరచుకోవడం.. అవసరమైన సమయంలో కఠినంగా వ్యవహరించడం.. సమర్థవంతంగా నిర్వహణ వ్యవహారాలను నిర్వర్తించడం.. వంటి నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ ఇన్స్టిట్యూట్ ఏడాది వ్యవధి గల మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అంతేకాకుండా బిజినెస్ కమ్యూనికేషన్ కోర్సును కూడా నిర్వహిస్తోంది. వెర్బల్, రిటెన్ కమ్యూనికేషన్ పరంగా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది. మొత్తం మీద వ్యక్తిగత పనితీరును మెరుగుపరుచు కోవడంతోపాటు సహోద్యోగులతో ప్రభావవంతమైన సమన్వయం చేసుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ మరో వినూత్న ఆలోచన కూడా చేస్తోంది. కొత్త సబ్జెక్ట్‌లను బోధించడానికి విదేశీ ఫ్యాకల్టీలను నియమించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ‘‘కరిక్యులమ్‌లో 24 అంశాలున్నాయి. గ్లోబల్ మార్కెటింగ్ అవసరాలకు తగినట్లుగా సిలబస్‌లో మార్పు చేశాం. పోటీ వాతావరణానికి దీటుగా మార్కెట్ ఇంజనీరింగ్, సర్వీసెస్-గ్లోబల్ మార్కెటింగ్, రిటైల్ సెక్టార్ వంటి సబ్జెక్టులు ఇప్పటి మార్కెట్‌కు తగినట్లుగా రూపొందిస్తున్నాం’’ అని ఓయూ మేనేజ్మెంట్ డీన్ కృష్ణారెడ్డి చెప్పారు. స్వదేశీ, విదేశీ పెట్టుబడులు, బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్‌మార్కెట్ వంటి అంశాల్లో ఎప్పుడూ నూతనత్వం చోటుచేసుకుంటుంది. వ్యాపార లావాదేవీల్లో పెనుమార్పులుంటాయి. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ ఉన్నప్పుడే.. సబ్జెక్టు నిపుణులు బయటకు వస్తారు. కాబట్టి సిలబస్‌లో మార్పు చేయడం చాలా అవసరం అంటున్నారు కృష్ణారెడ్డి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ)-హైదరాబాద్ విద్యార్థుల ఆకాంక్షలను తీర్చేందుకు ఐఎంటీ-హైదరాబాద్ పీజీడీఎం ప్రోగ్రామ్స్‌లో భాగంగా వివిధ ఎలక్టివ్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఇష్టమైన ఐచ్ఛికాంశాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను విద్యార్థులకు కల్పించింది. ఒక విభాగంలో పూర్తి పట్టు సాధించాలనుకునేవారు దానికి సంబంధించి కనీసం ఐదు ఎలక్టివ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగిలినవి ఏదైనా ఇతర విభాగంనుంచి ఎంచుకోవచ్చు. కనీసం 15 మంది విద్యార్థులు ముందుకొస్తే వారికి ఎలక్టివ్ కోర్సును ఆఫర్ చేస్తారు. ఐఎంటీ సంప్రదాయ ఫంక్షనల్ స్పెషలైజేషన్లతోపాటు బిజినెస్ ఎనలిటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి ప్రత్యేక విభాగాల్లో కెరీర్ ఓరియెంటెడ్ ఎలక్టివ్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి కెరీర్ ఓరియెంటెడ్ ఎలక్టివ్‌లను మరికొన్ని ప్రవేశపెట్టాలని ఐఎంటీ యోచిస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-బెంగళూరు దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌ల్లో ఒకటైన.. ఐఐఎం-బెంగళూరు కొత్తగా పబ్లిక్ పాలసీ కోర్సును ప్రారంభించింది. హెల్త్ కేర్ ఎకనామిక్స్, బిజినెస్ చైన్స్ ఇందులోని ఐచ్ఛికాంశాలు (ఎలెక్టివ్స్). ఈ కోర్సు రెండో సంవత్సరంలో 23 ఐచ్ఛికాంశాలు ఉన్నాయి. ఫ్యాకల్టీ, విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు ప్రతిపాదించిన స్పెషలైజేషన్స్‌కు ఈ 23 ఐచ్ఛికాంశాల్లో చోటు కల్పించడం ఈ కోర్సు ప్రత్యేకత. కార్పొరేట్ వైఫల్యాలు, ఆర్థిక రంగంలో ఆసియా దేశాలు దూసుకుపోతున్న అంశాలను నేపథ్యంగా తీసుకుని పబ్లిక్ పాలసీ/కార్పొరేట్ స్ట్రాటజీ ప్రొఫెసర్లు ఈ కోర్సును బోధిస్తారు. అంతేకాకుండా ఈ ఇన్స్టిట్యూట్ ప్రస్తుత సంవత్సరం నుంచి జర్మన్ లాంగ్వేజ్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ ఇన్స్టిట్యూట్ అందజేసే నాన్-క్రెడిట్ కోర్సులను ఐచ్ఛికాంశాలు (ఎలెక్టివ్స్)గా వ్యవహరిస్తారు. వీటిని ద్వితీయ సంవత్సరంలో స్పెషలైజేషన్స్‌లో భాగంగా ఆఫర్ చేస్తారు. నైపుణ్యాలు పెంచుకోవాలి సిలబస్‌లో కొత్తగా వచ్చే మార్పులు ఏవిధంగా ఉన్నా.. మేనేజ్మెంట్ కోర్సుల విషయంలో విద్యావేత్తల అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. కేస్ స్టడీస్ కంటే వాస్తవిక పరిస్థితులను అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తే ఈ కోర్సులు మరింత ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో విద్యార్థులు కూడా జాబ్ ఆఫర్ల గురించి ఆలోచించకుండా.. కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడే నిజ జీవిత నైపుణ్యాలను పెంచుకోవడం ఉత్తమమనే సలహా ఇస్తున్నారు. వ్యాపార కళతో మేనేజ్మెంట్ విద్య ‘‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్(ఐపీఈ).. పీజీడీఎం కోర్సుల సిలబస్‌ను వ్యాపార రంగానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నాం. ఈ విద్యాసంవత్సరం బిజినెస్ ఎనలిటిక్స్, బిగ్ డేటా ఎనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాం. బిజినెస్ ఎథిక్స్, పబ్లిక్ పాలసీ వంటి సబ్జెక్టులను కోర్ కోర్సుల్లో చేర్చాం. ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను సబ్జెక్టుగా చేర్చడం ద్వారా మార్కెట్లో నూతనత్వంతోనే వ్యాపారం వృద్ధి చెందుతుందనే తాజా ట్రెండ్‌పై అవగాహన కల్పించనున్నాం. అంతర్జాతీయ మేనేజ్మెంట్ స్కూల్స్‌లో మాదిరిగా కాఫెతీరియా ప్రోగ్రాం ద్వారా క్యాంపస్‌లోకి రాగానే స్పెషల్ కోర్సులను ఎంచుకునే సౌలభ్యం కల్పిస్తున్నాం’’ -ప్రొఫెసర్ మిశ్రా, డెరైక్టర్, ఐపీఈ -
మహిళలు.. మనీ రాణులు
మహిళలు వంటింటికే పరిమితమన్న మాటలకు కాలం చెల్లి చాలా రోజులయ్యింది. ఆర్థిక రంగం నుంచి అంతరిక్షం దాకా అన్నింటిలోనూ వారు దూసుకెళ్లిపోతున్నారు. ప్రపంచస్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల్లో వన్ మ్యాన్ షో .. సారీ.. వన్ ఉమన్ షో నడిపించేస్తున్నారు. పురుషాధిక్య రంగాల్లో కూడా ఆధిపత్యాన్ని చాటుతున్నారు. దేశంలోనే అతి పెద్ద బ్యాంకులైన ఎస్బీఐ (అరుంధతి భట్టాచార్య), ఐసీఐసీఐ బ్యాంకు (చందా కొచర్), యాక్సిస్ (శిఖా శర్మ) బ్యాంకులకు సారథ్యం వహిస్తున్నది మహిళలే. అంతర్జాతీయంగా సాఫ్ట్‌డ్రింక్స్ దిగ్గజం పెప్సీకి (ఇంద్రా నూయి), ఇంటర్నెట్ దిగ్గజం యాహూకి (మెరిస్సా మెయర్) నేతృత్వం వహిస్తున్నది వారే. వీరికి ఇంతటి విజయాలెలా సాధ్యమయ్యాయి.. వీటి వెనుక రహస్యాలేమిటి.. మనీ మ్యాటర్స్‌లో పురుషాధిక్యతను అధిగమించగలగడంలో మహిళల ప్రత్యేకతలేమిటీ? వీటిపైనే ఈ వారం ధనం కథనం. టైమ్ కావొచ్చు, మనీ కావొచ్చు.. మేనేజ్మెంట్ విషయంలో మహిళలే నంబర్‌వన్. అందుకే, మిగతా విషయాలెలా ఉన్నా ఇంటి ఖర్చుల మేనేజ్మెంటు బాధ్యతలు వారికి అప్పగిస్తుంటారు. పెద్దగా దృష్టి పెట్టం గానీ.. రిస్కులు తీసుకోవడం నుంచి లక్ష్యాలు సాధించడం దాకా మహిళల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని.. లక్ష్యం నిర్దేశించుకోవడం.. లక్ష్యాలు నిర్దేశించుకోవడం, సాధించడంలో మహిళలు మేటి. అత్యధిక శాతం మహిళలు ఇంటిలోనైనా ఆఫీసులోనైనా.. ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంపైనా, సాధించడంపైనా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అందుకే, స్కూలు స్థాయి నుంచి యూనివర్సిటీల దాకా టాపర్స్‌లో ఎక్కువశాతం వారే. లక్ష్య సాధనపై దృష్టి కారణంగానే కెరియర్లో కూడా మగవారి కన్నా కాస్త వేగంగా ముందుకెళ్లగలుగుతారు. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకోవడమనేది విజయంతో పాటు కాస్త సమయం ఆదా చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. విద్య ఎంపికలో.. చదువుకు సంబంధించి కోర్సులను ఎంచుకోవడంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమకు అనుకూలమైనవి, తాము అన్ని విధాలా రాణించేందుకు అవకాశాలు ఉన్న రంగాలను ఎంచుకుంటూ ఉంటారు. మేనేజ్మెంట్, మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ కోర్సులు వారికి ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌గా ఉంటుంటాయి. ఒక టి, రెండు మార్కులు పోయినా పర్లేదులే అని అబ్బాయిలు లైట్‌గా తీసుకున్నా.. అమ్మాయిలు మాత్రం ఆ ఒక్క మార్కు కూడా పోకూడదని సీరియస్‌గానే తీసుకుంటుంటారు. సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. సెల్ఫ్-హెల్ప్.. ఇంటి పనుల విషయంలో చూడండి. పిల్లల డైపర్లు మార్చడం నుంచి నిత్యావసరాలు కొనుక్కుని తెచ్చుకోవడం, బిల్లులు కట్టేసేయడం దాకా అన్ని విషయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వంతంగానే చక్కబెట్టుకుంటుంటారు మహిళలు. వారు సెల్ఫ్-హెల్ప్‌కి ప్రాధాన్యమిస్తారు. భర్తకో, కుటుంబ సభ్యులకో, స్నేహితులకో పని అప్పజెప్పి.. వారు చేసే దాకా ఎదురుచూస్తూ కూర్చుని సమయం వృదా చేసుకోవడం కన్నా సొంతంగా పనులు పూర్తి చేసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇతరులకు అప్పజెబితే తమలాగా శ్రద్ధగా చేస్తారో లేదోనన్న సందేహం కూడా దీనికి కొంత కారణం. ఎందుకంటే..మహిళలు పర్ఫెక్షనిస్టులు కూడా. రోజువారీ రికార్డు.. ఆర్థిక విషయాలు ఇంటికి సంబంధించినవైనా.. ఆఫీసుకు సంబంధించినవైనా.. మహిళలు రికార్డు పాటించడంలో పక్కాగా ఉండేందుకు ఇష్టపడతారు. ప్రతీ పైసాకి వారి దగ్గర లెక్క ఉంటుంది. ఇది మగవారికి కాస్త చాదస్తంగా అనిపించినా.. నెల తిరిగేసరికి జమాఖర్చుల పక్కా రికార్డు చూస్తే మరి మాట్లాడటానికి ఉండదు. నేర్చుకోవడానికి ప్రాధాన్యం.. మహిళలు సాధ్యమైనంత వరకూ తప్పులకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ చేసినా దాన్నుంచి నేర్చు కుంటారు. ఒకసారి చేసిన మిస్టేక్‌ను మరోసారి చేయరు. ఏదైనా డీల్‌తో లాభం వచ్చిందంటే.. మరింత అధిక టార్గెట్లతో మరోసారి ప్రయత్నిస్తారు. అదే నష్టం వస్తే.. దాన్ని పాఠంగా తీసుకుని మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడతారు. ప్లాన్ బీ.. ఒక ప్లాన్ వర్కవుట్ కాకపోతే.. మరొకటి..ఇలా ప్రతిదానికీ మహిళల దగ్గర ప్లాన్ బి అంటూ ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ సరిగ్గా లేకపోయినా.. నచ్చినవి కొనేందుకు సరిపడేంత డబ్బు చేతిలో లేకపోయినా.. అప్పటికప్పుడు ఏదో ఒకటి అరేంజ్ చేసేయగలరు వారు. సందర్భం ఏదైనా సరే వారి దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ఆఖరు నిమిషంలో కూడా మార్పులు, చేర్పులను సమర్థంగా చేయగలరు. అప్పులు.. సాధ్యమైనంత వరకూ అప్పు ఊసే ఉండకుండా చూసుకోవడానికి మహిళలు మొగ్గు చూపుతుంటారు. కుటుంబసభ్యులో, స్నేహితులో ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుని కొనుక్కోవడం కన్నా.. చేతిలో ఉన్నప్పుడే కొనుక్కునేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే మహిళలు అప్పుల బారిన పడటం కూడా చాలా తక్కువే. ఎలాంటి పరిస్థితినైనా మేనేజ్ చేసేయగల పుష్కలమైన మేనేజ్మెంట్ నైపుణ్యాలు, ఆఖరు నిమిషంలో కూడా దేన్నయినా సెట్ రైట్ చేయగలిగే సామర్థ్యాలు ఉండటమే ఇందుకు కారణం. రిస్కుకి రెడీ.. మిగతావారు మనకి రిస్కు ఎందుకులే అనుకున్న వాటిని కూడా జంకకుండా చేపట్టగలిగే ధైర్యం మహిళల సొంతం. రిస్కు తీసుకున్నా.. విజయాలు సాధించిన వారి ఉదంతాలు కోకొల్లలు. నష్టపోవాల్సి వస్తుందన్న భయం కన్నా.. విజయంపై ఆశావహంగా ఉండగలగడం, నేర్పుగా వ్యవహరించగలగడం ఇందుకు కారణం. పైగా.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమర్థత కలిగి ఉండటం మరో కారణం. మనీ మేనేజ్మెంట్.. కీలకమైన డబ్బు సంగతికొస్తే.. ఎక్కడ, దేనిపై, ఎంత ఖర్చు చేయాలన్న దానిపై మహిళలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం కన్నా.. దీర్ఘకాలిక అవసరాల కోసం డబ్బును పొదుపు చేయడానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఆదాయం కన్నా ఖర్చుల లిస్టు తక్కువగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంటి విషయంలోనైనా ఆఫీసు విషయంలోనైనా అవసరమనుకున్న వాటిపై తప్ప మిగతా వాటిపై ఖర్చు చేసేందుకు ఇష్టపడరు. మనీ మేనేజ్మెంట్లో వారి సామర్థ్యం ఇందుకు ఉపయోగపడుతుంది. -
అంత ‘అటాచ్మెంట్’ వద్దు
ఖైరతాబాద్ రైల్వే గేటును ఢీకొన్న వాహనం విరిగిపడిన గేటు కొత్తది అమర్చిన పోలీసులు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఖైరతాబాద్: ఖైరతాబాద్ రైల్వే గేటు వద్ద బుధవారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే గేటు వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు ఇటీవల రైల్వే పోలీసులు చర్యలు చేపట్టారు. గేటు వేసిన సమయంలో రాకపోకలు సాగనివ్వకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాలి నడకన వెళ్లే వారికీ అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా... బుధవారం మధ్యాహ్నం రైలు వెళ్లగానే గేటును తీశారు. ఆ సవ యంలో ఖైరతాబాద్ నుంచి సాదాన్ కళాశాల వైపు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని డ్రైవర్ బాల్‌రాజ్ హడావుడిగా ముందుకు కదిలించాడు. కుడి వైపు నుంచి దాటాల్సిన వాహనాన్ని హడావుడిగా ఎడమ వైపునకు మళ్లించాడు. దీంతో డీసీఎం వెనుక భాగం గేటును బలంగా తాకింది. ఒక్కసారిగా గేటు విరిగి పక్కకు పడిపోయింది. ఆ పక్కనే ఉన్న గేట్ జామ్ (ఇనుప బారికేడ్లపై) విరిగిన గేటు పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఖైరతాబాద్ వినాయకుని వైపు వెళ్తున్న వాహనాలు అక్కడే నిలిచి ఉన్నాయి. గేట్ జామ్ లేకపోయి ఉంటే వాహనదారుల తలపై గేటు పడి, ప్రమాదం జరిగి ఉండేది. అదృష్టవశాత్తూ గేట్జామ్ పైన అది పడడంతో ముప్పు తప్పింది. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గేటు విరిగిన విషయాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వాహనదారులను పట్టాలపై నుంచి తొలగించి, ప్రత్యామ్నాయంగా మరో గేటును అమర్చారు. ఈ సంఘటనతో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. గతంలో పలుమార్లు గేటు విరిగిన సంఘటనల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మరో గేటును సిద్ధంగా ఉంచారు. దీన్ని వెంటనే అమర్చడంతో రైళ్ల రాకపోకలకు తక్షణమే పునరుద్ధరించగలిగామని సిబ్బంది తెలిపారు. ఇరువైపులా అక్రమ నిర్మాణాలు రైల్వేగేటుకు ఇరువైపులా అక్రమ నిర్మాణాల కారణంగా అక్కడి స్థలం ఇరుకుగా మారింది. గేటు వేసిన సమయంలో మనుషులు కూడా నిలబడేందుకు వీలులేకుండా తోపుడుబండ్లు, ఇతర సామగ్రిని కొందరు అడ్డుగా పెట్టారు. ఇలాంటి బండ్లను, కట్టడాలను తొలగిస్తే గేటు వద్ద రాకపోకలకు సులువుగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించరూ ఖైరతాబాద్ రైల్వేగేటు మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత ర ద్దీగా ఉండే ఈ క్రాసింగ్ వద్ద నిత్యం 108 సార్లు రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వేగేటు వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని ఎన్నిసార్లు విన్నవించుకన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఖైరతాబాద్ రైల్వే క్రాసింగ్ వద్ద సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
మేనేజ్మెంట్ కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు
సాగునీరు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు సామాజిక అడవులతో భూగర్భజలాల పెంపు చలసాని శ్రీనివాస్ కురబలకోట: మంచి అవకాశాలు పొందడానికి మేనేజ్మెంట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర మేధావుల, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన కురబలకోట మండలంలోని విశ్వం ప్రాంగణంలో ఉన్న విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కళాశాల (ఎస్విటీఎం)లో ఎంబీఏ విద్యార్థులకు అతిథి ఉపన్యాసమిచ్చారు. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో మేనేజ్‌మెంట్‌ది కీలకపాత్రగా మారిందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. సమయస్ఫూర్తి, విభిన్న ఆలోచనలు, సృజనాత్మకత తప్పనిసరి అన్నారు. వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిదన్నారు. విశిష్ట వ్యక్తిత్వంతో మనిషి మహనీయుడు కావచ్చన్నారు. ఎంబీఏ అంటే నేడు క్రేజీ పెరుగుతోందన్నారు. కష్టించేతత్వం, మారుతున్న పరిణామాలను అంచనా వేయడం, కంపెనీల వర్తమాన పరిస్థితులను పసిగట్టగలగాలని చెప్పారు. దీనికి తోడు ఎప్పటికప్పుడు ఓర్పు, ఆపై నేర్పుతో ముందుకు సాగాలన్నారు. పర్యాటక కారిడార్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వారసత్వ సంపద గొప్పది మనకు ఎంతో గొప్ప వారసత్వ సంపద ఉందని, వివిధ రంగాల్లో తెలుగువారు సత్తా చాటారని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజినీరుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొం దారన్నారు. చదువు సంధ్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై విద్యార్థులు దృష్టి సారిం చాలన్నారు. ఇకపోతే రాష్ర్ట విభజన అప్రజాస్వామికంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాయలసీమ కోరితే నష్టపోయేది సీమ వాసులేనన్నది గుర్తుంచుకోవాలన్నారు. సాగునీరు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిరాశను కల్గిస్తోందన్నారు. రూ. 17 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉందన్నారు. రాయలసీమకు పోలవరం వరప్రసాదిని అన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల కు నికర జలాలను కేటాయించాలన్నారు. విద్యు త్ పంపిణీలో కూడా సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందన్నారు. సీమ ప్రాంతంలో సామాజి క అడవుల పెంపకం భూగర్భ జలాలకు దోహదపడుతుందని ఆయన అన్నారు. మదనపల్లె ఏరి యా అభివృద్ది సంస్థ సలహాదారు దేవరబురుజు శేఖర్‌రెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి నూర్మహమ్మ ద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె విరమణ
-
విద్యుత్ సమ్మె విరమణ
చర్చలు సఫలం 27.5 శాతం ఐఆర్, మూడు ఇంక్రిమెంట్లకు ఓకే కాంట్రాక్టు ఉద్యోగులకూ నెలాఖరుకు పది శాతం ఐఆర్ {పభుత్వ అనుమతి తీసుకుంటామని యాజమాన్యం హామీ అర్ధరాత్రి నుంచే విధుల్లోకి వెళుతున్నట్లు జేఏసీ ప్రకటన నేటి మధ్యాహ్నానికి ఉత్పత్తి పునరుద్ధరణ! హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించారు. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలించాయి. ఉద్యోగుల డిమాండ్ మేరకు 27.5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్), మూడు ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. అయితే అంతిమంగా ఈ అంశాలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మళ్లీ చర్చించి.. అందుకు అనుగుణంగా పీఆర్సీ అమలు చేస్తామని హామీనిచ్చింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సీతారామిరెడ్డి, కన్వీనర్ సుధాకర్‌రావు సోమవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు. వాస్తవానికి కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ విషయంపై చర్చల్లో మధ్యాహ్నం నుంచి స్తబ్ధత ఏర్పడింది. కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలపై ట్రాన్స్‌కో జేఎండీ రమేష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదు. ఈ నెలాఖరు నాటికి ఇది అందుతుందని, ఆ తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని యాజమాన్యం తొలుత పేర్కొంది. ఇందులో భాగంగానే ఈ కమిటీ మంగళవా రం భేటీ అవుతోందని తెలిపింది. అయితే తర్వాత సాగిన చర్చల్లో మాత్రం.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఈ నెలాఖరులోగానే కాంట్రాక్టు ఉద్యోగులకు పది శాతం ఐఆర్ ఇచ్చేందుకు సిద్ధమని యాజమాన్యం కాస్త స్పష్టతనిచ్చింది. దీంతో శాంతించిన జేఏసీ నేతలు సమ్మె ను విరమిస్తున్నట్టు, సోమవారం అర్ధరాత్రి నుంచే విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ చర్చల్లో ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందా, జేఎండీ రమేష్, జెన్కో ఎండీ విజయానంద్, సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నుంచి కో-చైర్మన్ మోహన్‌రెడ్డి, జేఏసీ నేతలు ఎం. గోపాల్, వెంకన్నగౌడ్, ప్రసాద్, కిరణ్, చంద్రుడు, భానుప్రకాశ్ చర్చలు జరిపారు. కాంట్రాక్టు సిబ్బంది ఆందోళన రెగ్యులర్ ఉద్యోగులతో పాటు తమకూ ఐఆర్ ఇ వ్వాల్సిందేనని చర్చల సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు పట్టుబట్టారు. చర్చలకు వేదికైన విద్యు త్ సౌధ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని, తమకూ వేతన సవరణ జరగకుండా సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకవైపు జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ ఇస్తున్నారని, తమకివ్వడంలో అభ్యంతరం ఏమిటని యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చే విధానం విద్యుత్ సంస్థల్లో మొదటి నుంచి లేదని.. ఇప్పుడు తాము దీనిపై నిర్ణయం తీసుకోలేమని కొత్తగా ఏర్ప డే ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని యాజ మాన్యం తొలుత పేర్కొంది. ఈ నేపథ్యంలో చర్చల్లో మధ్యాహ్నం నుంచి స్తబ్దత ఏర్పడింది. చివరకు ప్రభుత్వం అనుమతి తీసుకుని ఈ నెలాఖరుకే పది శాతం ఐఆర్ ఇస్తామని యాజమాన్యం పేర్కొనడం తో చర్చలు సఫలమయ్యాయి. కా నీ, కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రం విరమణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతినివ్వకపోతే తమ పరిస్థితేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాగదీసే వ్యవహారమని మండిపడ్డారు. పరిశ్రమలకు పూర్తిగా పవర్ కట్! విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఉత్పత్తి 11వేల నుంచి 6 వేల మెగావాట్లకు పడిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలకు విద్యుత్ కోతలను అమలు చేశారు. సోమవారం పరిశ్రమలకు ఒక్క యూనిట్ కూడా సరఫరా కాలేదు. అలాగే వ్యవసాయానికీ పూర్తిగా కోత విధించారు. ఇక ఆదివారం గ్రామా లు, పట్టణాలకే పరిమితమైన కోతలు సోమవారం హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, వరంగల్లోనూ అమలు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలతో జనం ఇక్కట్లు పడ్డారు. ఉక్కపోత, దోమల బెడదతో అగచాట్లు పడ్డారు. దీంతో కొన్ని సబ్స్టేషన్లపై ప్రజలు దాడులు చేశారు. అన్నీ మూతలే... ఉద్యోగుల సమ్మె వల్ల జెన్కోకు చెందిన పలు విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీపీ, ఆర్టీఎస్, మాచ్‌ఖండ్, సీలేరు బేసిన్లో మినహా అన్ని విద్యుత్ ప్లాంట్లల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. జెన్కోకు చెందిన అన్ని థర్మల్ ప్లాంట్లలో కలిపి మొత్తం 4,980 మెగావాట్ల ఉత్పత్తి ఆగింది. అయితే, సోమవారం రాత్రికి ఉద్యోగులు విధుల్లో చేరినప్పటికీ థర్మల్ కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. -
ఇంటర్లో గ్రూప్ ఎంపిక ఇలా..
ఇంటర్మీడియెట్.. ప్రతి విద్యార్థి జీవితంలో కీలక దశ.ఈ దశలో ఎంచుకున్న గ్రూపు ఆధారంగానే భవిష్యత్తు కెరీర్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. క్రేజీ కెరీర్స్‌గా పేరొందిన ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ప్రవేశించాలన్నా.. ఆయా రంగాల్లో నిష్ణాతులుగా మారి ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నా.. పునాది ఇంటర్మీడియెట్‌లో ఎంపిక చేసుకున్న గ్రూప్‌లే! అందుకే ఈ గ్రూప్‌ల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. పదో తరగతి ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్‌లో విద్యార్థులు ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి.. ఏ నైపుణ్యాలున్న విద్యార్థులకు ఏ గ్రూప్ సరిపోతుంది?! ఏ గ్రూప్ ఎంచుకుంటే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి.. తదితర అంశాలపై నిపుణుల విశ్లేషణ.. వాట్ ఆఫ్టర్ టెన్త్?! ఇంటర్మీడియెట్.. ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్..! ఇంకేముంది.. అయితే ఎంపీసీ.. లేకపోతే బైపీసీ.. నేటి విద్యార్థి లోకంలో, వారి తల్లిదండ్రుల్లో స్థిరపడిపోయిన అభిప్రాయం. ఈ రెండు గ్రూపుల్లో చేరితే భవిష్యత్తులో సత్వర ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఇంజనీరింగ్ లేదా మెడికల్ ప్రొఫెషన్లో స్థిరపడొచ్చని నిశ్చితాభిప్రాయం! అయితే.. ఇంటర్మీడియెట్‌లో గ్రూప్ ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు నిపుణులు. కేవలం కోర్సులకున్న క్రేజ్‌నే దృష్టిలో పెట్టుకుని గ్రూప్‌ల ఎంపిక సరికాదని సూచిస్తున్నారు. విద్యార్థుల సహజ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా గ్రూప్‌ను ఎంచుకుంటే.. ప్రస్తుతం అనేక అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అన్ని గ్రూపులకు ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలున్నాయని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియెట్‌లో ఉన్న గ్రూప్‌లు.. వాటిలో రాణించేందుకు కావాల్సిన అకడెమిక్, పర్సనల్ స్కిల్స్.. ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లు ప్రధానాంశాలుగా ఉండే ఎంపీసీ గ్రూప్‌లో చేరే విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థుల్లో దాదాపు 35 నుంచి 40 శాతం మధ్యలో ఉంటోంది. ఈ గ్రూప్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఎంసెట్‌లో అర్హత సాధించి.. భవిష్యత్తులో ఇంజనీరింగ్ కోర్సులో అడుగుపెట్టొచ్చు. ఈ గ్రూప్‌లో చేరే విద్యార్థులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఎన్నో కాన్సెప్ట్‌లు, థియరీస్, ఫార్ములాలతో ఉండే ఈ గ్రూప్‌లో అకడెమిక్‌గా రాణించాలంటే.. గంటలకొద్దీ ప్రాక్టీస్ చేయగల నేర్పు, ఓర్పు ఎంతో అవసరం. అదేవిధంగా హార్డ్‌వర్క్‌తోపాటు స్మార్ట్‌వర్క్ తోడైతేనే ఇందులో రాణించడం సులువవుతుంది. వీటితోపాటు సూక్ష్మగ్రాహ్యక శక్తి, మెమొరీ స్కిల్స్ అత్యంత ప్రధానం. ప్రాక్టికల్ అప్రోచ్ బాగా ఉన్న విద్యార్థులే ఈ గ్రూప్‌లో రాణించగలరు. అప్పుడే ఎంపీసీ గ్రూప్‌తో ఆశించిన ఫలితాలు సాధ్యం. కోర్సు పూర్తయ్యాక ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌తోపాటు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ వంటి పోటీ పరీక్షలకు కూడా అర్హత లభిస్తుంది. కేవలం ఇంజనీరింగ్ కోర్సులే కాకుండా.. డిగ్రీ స్థాయిలో బీఎస్సీలోనూ పలు వినూత్న కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఉన్నత విద్యనభ్యసించి మంచి కెరీర్ సొంతం చేసుకోవచ్చు. బైపీసీ.. ఆసక్తితోనే అడుగులు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ తర్వాత విద్యార్థులు ఎక్కువగా చేరుతున్న కోర్సు బైపీసీ. భవిష్యత్తులో మెడికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్‌లో కెరీర్‌కు ఈ కోర్సు ఎంతో దోహదపడుతుంది. అయితే, ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు సహజమైన ఆసక్తి ఉంటేనే అడుగుపెట్టడం మంచిది. ముఖ్యంగా పరిసరాల అధ్యయనం, ఆయా జీవరాసులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత బైపీసీ గ్రూప్ విద్యార్థులకు చాలా అవసరం. అకడెమిక్‌గా.. ఎంపీసీతో పోల్చితే ప్రాక్టికల్ అప్రోచ్ కోణంలోనూ సునిశిత పరిశీలన కీలక పాత్ర పోషిస్తుంది. నిరంతర అధ్యయనం, నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించే నేర్పు కూడా కావాలి. బైపీసీలో జీవసంబంధ అంశాలపై పరిజ్ఞానం పెంచుకుంటేనే అకడెమిక్‌గా ముందుండటం వీలవుతుంది. ఈ పరిజ్ఞానానికి ముఖ్య సాధనాలు ప్రాక్టికల్స్ మాత్రమే. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను లేబొరేటరీల్లో ప్రాక్టికల్‌గా అన్వయించడం నిరంతర ప్రక్రియ. కేవలం థియరాటికల్ అప్రోచ్‌తో ముందుకెళ్లొచ్చు అనే అభిప్రాయం ఏ మాత్రం సరికాదు. ఈ దృక్పథం మార్కులు తెచ్చిపెట్టేందుకు దోహదపడినప్పటికీ.. భవిష్యత్తులో కెరీర్‌పరంగా అవసరమైన నైపుణ్యాలు అందించలేదు. బైపీసీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. బైపీసీ పూర్తిచేస్తే కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సులే కాకుండా.. మరెన్నో కొత్త కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ వంటి కొత్త కాంబినేషన్లు ఉన్నాయి. వీటిద్వారా భవిష్యత్తులో మెడికల్ అనుబంధ రంగాలైన హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు, ఫార్మాస్యూటికల్ సంస్థల్లో అడుగుపెట్టొచ్చు. సీఈసీ- విశ్లేషణ నైపుణ్యాలు సీఈసీ.. కెరీర్ పరంగా కామర్స్, మేనేజ్మెంట్ రంగాల్లో భవిష్యత్తుకు పునాది. ఇటీవల కాలంలో క్రమేణా విద్యార్థి లోకంలో క్రేజ్ పెరుగుతున్న కోర్సు. అంకెలు, గణాంకాలు, దత్తాంశాలు నిండి ఉండే ఈ గ్రూప్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఆయా అంశాల విశ్లేషణ, విశదీకరణ నైపుణ్యాలు ఉండాలి. నిర్దిష్ట గణాంకాల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలు రూపొందించే నైపుణ్యం.. కంప్యూటేషన్ స్కిల్స్ ఈ కోర్సు ఔత్సాహికులకు చాలా అవసరం. అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అకౌంట్స్, కామర్స్ వంటి సబ్జెక్టులకు సంబంధించి అప్లికేషన్ ఓరియెంటేషన్ అప్రోచ్ కూడా ఉండాలి. సైన్స్ గ్రూప్‌లతో పోల్చితే ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్ ఉండవు. అయితే నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందేందుకు విద్యార్థులు స్వయంగా ప్రయత్నించాలి. అప్పుడే ఈ కోర్సుల్లో రాణించగలరు. సీఈసీ పూర్తి చేసిన విద్యార్థులు అటు మేనేజ్మెంట్, ఇటు కామర్స్ సంబంధిత రంగాల్లో కెరీర్స్ సొంతం చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతోనే చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), ఐసీడబ్ల్యుఏ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫౌండేషన్ దశలో అడుగుపెట్టొచ్చు. సీఈసీ అర్హతగా బీకాం పూర్తిచేయొచ్చు. తర్వాత ఐసెట్, క్యాట్, ఎక్స్‌ఏటీ వంటి ప్రవేశ పరీక్షలు రాసి ప్రముఖ సంస్థలలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. హెచ్ఈసీ.. సామాజిక అవగాహన సామాజిక - ఆర్థిక అంశాలపై అవగాహన, పరిశీలన నైపుణ్యాలున్న విద్యార్థులకు కచ్చితంగా సరిపడే కోర్సు హెచ్ఈసీ. అంతేకాకుండా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మరింత కలిసొచ్చే కోర్సు ఇది. సమాజంలో నిత్యం ప్రతిబింబించే అంశాలైన ఆర్థిక, రాజకీయ అంశాలు, చరిత్ర సంబంధిత విషయాలతో కూడి ఉండే ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు అకడెమిక్‌గా సునిశిత పరిశీలన శక్తి అవసరమవుతుంది. విస్తృత స్థాయిలో ఉండే అంశాల నుంచి అవసరమైన మేర మాత్రమే గ్రహించగల నైపుణ్యాలు, నిర్దిష్ట అంశం నేపథ్యంపై అవగాహన, అదే అంశానికి సంబంధించి సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయగల సామర్థ్యం కూడా ఈ కోర్సు ఔత్సాహికులకు ఎంతో అవసరం. కెరీర్ పరంగా ప్రభుత్వ విభాగంలో ఆయా ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు హెచ్ఈసీలో పరిజ్ఞానం ఎంతో తోడ్పడుతుంది. హెచ్ఈసీ పూర్తి చేసి బీఏలో అడుగుపెడితే.. ఆ కోర్సు అర్హతగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు సులువుగా సన్నద్ధం కావచ్చు. అంతేకాకుండా బీఏ స్థాయిలో ఇప్పుడు కొత్తగా ఆవిష్కృతమవుతున్న కాంబినేషన్ల ఆధారంగా ప్రైవేటు రంగంలోనూ సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ వర్క్, సోషియాలజీ, పబ్లిక్ పాలసీ తదితర గ్రూప్ సబ్జెక్ట్‌లు చదివిన వారికి కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల్లో కొలువులు ఖాయమవుతున్నాయి. ఎంపీసీ, సీఈసీ సమ్మేళనంగా ఎంఈసీ ఇటీవల కాలంలో ఆదరణ పొందుతున్న గ్రూప్.. ఎంఈసీ. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉండే ఈ గ్రూప్.. భవిష్యత్తులో కామర్స్ విభాగంలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు బాగా కలిసొస్తున్న కోర్సు. ఒకే సమయంలో మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్, డేటా అనాలిసిస్ నైపుణ్యాలు అందించే ఈ కోర్సు సీఏ, ఐసీడబ్ల్యుఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు చక్కటి పునాది. అయితే ఈ గ్రూప్ ఔత్సాహికులకు అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్ ప్రధానంగా అవసరమైన సహజ లక్షణాలు. సమయ నిబంధనలు లేకుండా కష్టించే తత్వం, నిరంతర అధ్యయనం చేయగల నేర్పు కూడా అవసరం. ఇవి ఉంటేనే ఈ కోర్సులో రాణించగలరు. భవిష్యత్తు పరంగా ఎంఈసీ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులతోపాటు డిగ్రీ స్థాయిలో బీకాంలో ప్రవేశించొచ్చు. సీఈసీ విద్యార్థులకు లభించే అవకాశాలన్నీ వీరికి లభిస్తాయి. గ్రూప్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులు. సదరు గ్రూప్‌లో ఉండే సబ్జెక్ట్‌లు, వాటిలోని ప్రాథమిక అంశాలపై అవగాహన స్థాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు.. ఎంపిక చేసుకోనున్న గ్రూప్ ద్వారా లభించే అవకాశాల విశ్లేషణ. సదరు గ్రూప్‌నకు సంబంధించిన రంగంలో ప్రస్తుత ఉపాధి అవకాశాలు. వాస్తవానికి పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్థాయిలో విశ్లేషణలు చేసుకునే మానసిక పరిపక్వత ఉండదు. దాంతో తల్లిదండ్రులే పిల్లల ఆసక్తుల ఆధారంగా వీటిని చేపట్టాలని నిపుణుల సలహా. ఈ ఆసక్తిని పిల్లల వ్యవహార శైలి ద్వారా గమనించొచ్చని సూచిస్తున్నారు. నిపుణుల సలహా సైన్స్ కోర్సుల్లో చేరే వారికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం ఇంటర్మీడియెట్‌లో సైన్స్, మ్యాథమెటిక్స్ గ్రూప్స్‌లో చేరే విద్యార్థులకు మిగతా గ్రూప్‌లతో పోల్చితే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. అవి.. ప్రాక్టికల్ స్కిల్స్, అప్లికేషన్ ఓరియెంటేషన్. లేబొరేటరీల్లో గడిపేందుకు ఆసక్తి, ఓర్పు వంటి సహజ లక్షణాలు అవసరం. ఇవి ఉంటేనే ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో రాణించి.. భవిష్యత్తులో సమున్నత స్థానాలు అధిరోహించొచ్చు. ఎంపీసీ, బైపీసీ అంటే.. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులకు మాత్రమే పునాది అని భావించొద్దు. ఇప్పుడు అప్లైడ్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, అగ్రికల్చర్, వెటర్నరీ సెన్సైస్‌లోనూ ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలతో ఈ రంగాల్లో పరిశోధనలు చేసి ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. - డాక్టర్॥సి.వి.ఎల్.ఎన్. మూర్తి, ప్రిన్సిపాల్, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, నాగార్జునసాగర్. కొలువులు ఖాయం చేసే కామర్స్ ఇంటర్మీడియెట్‌లో సీఈసీ గ్రూప్ ఎంపిక ద్వారా భవిష్యత్తులో కామర్స్ విభాగంలో ఉజ్వల భవిష్యత్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ కోర్సుల పట్ల పెరుగుతున్న క్రేజ్, పబ్లిసిటీ ఆధారంగా చాలామంది విద్యార్థులు వీటిలో అడుగుపెట్టేందుకు సీఈసీని ఎంపిక చేసుకుంటున్నారు. ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సులభమే. కానీ ఈ కోర్సు అర్హతగా ప్రవేశం పొందే ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించాలంటే గంటలకొద్దీ శ్రమించగల ఓర్పు, నిరంతరం మార్పుచేర్పులు జరుగుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలపై అవగాహన అవసరం. ఈ స్కిల్స్ లేక అనేకమంది విద్యార్థులు ఆయా ప్రొఫెషనల్ కోర్సుల మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. అందువల్ల కేవలం క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా.. ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా భవిష్యత్తు లక్ష్యాలకు సరితూగే కోర్సులను ఎంచుకోవాలి. - టి.ఎల్.ఎన్. స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్, హైదరాబాద్ ప్రధానంగా ప్రాక్టికల్ అప్రోచ్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మ్యాథ్స్, సైన్స్ మాత్రమే కాకుండా.. ఆర్ట్స్, హ్యుమానిటీస్ వరకు అన్ని విభాగాల్లో ప్రాక్టికల్ అప్రోచ్, అప్లికేషన్ ఓరియెంటేషన్లు కీలకంగా మారుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఏ గ్రూప్‌లో చేరాలనుకున్నప్పటికీ సంబంధిత సబ్జెక్టుల్లో నేర్చుకున్న అంశాలను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించే నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. చదివే ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో బేరీజు వేసే తులనాత్మక అవగాహన కూడా ఎంతో అవసరం. ఈ నైపుణ్యాలు ఏ అంశంలో ఎక్కువగా ఉన్నాయో స్వీయ విశ్లేషణ చేసుకుని ఆ గ్రూప్‌ను ఎంచుకోవడం భవిష్యత్తులో లాభిస్తుంది. సైన్స్ గ్రూప్‌ల విషయానికొస్తే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు కూడా ఇప్పటివరకు తమ పిల్లలు ఆసక్తి చూపిన అంశాలేంటో గమనించి దానికి అనుగుణంగా ప్రోత్సహించాలి. - కె. శరత్ చంద్ర, కో-ఫౌండర్, బటర్‌ఫ్లై ఫీల్డ్స్ ఇన్‌స్టంట్‌గా కాదు.. ఇంట్రెస్ట్ ఆధారంగా ఇంటర్మీడియెట్ గ్రూప్ ఎంపికలో.. ఆయా కోర్సుల ద్వారా లభించే ఉద్యోగావకాశాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. సహజ ఆసక్తికి కూడా పెద్దపీట వేయాలి. అప్పుడే కెరీర్ గమ్యం దిశగా సరైన అడుగులు పడతాయి. కెరీర్ అంటే.. కేవలం ఇంజనీరింగ్, మెడికల్ అనే అపోహను వీడాలి. నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా కెరీర్‌పరంగా బహుముఖ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటికీ పునాది ఇంటర్మీడియెట్‌లో ఎంచుకున్న గ్రూప్ మాత్రమే. కాబట్టి సుదీర్ఘ ప్రణాళిక, వ్యూహాలతో గ్రూప్‌ను ఎంచుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల దృక్పథమూ మారాలి. తమ పిల్లల సహజ ఆసక్తులు ఏంటో గుర్తించి.. అందుకు తగ్గ కోర్సులను ఎంచుకునే దిశగా ప్రోత్సహించాలి. అప్పుడు ఎలాంటి గ్రూప్ అయినా.. కోర్సు అయినా భవిష్యత్తులో చక్కటి అవకాశాలు లభిస్తాయి. - ఎం. రామకృష్ణ, ఎండీ, జడ్‌సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్ -
తుది జట్టును మార్చరా?
మిర్పూర్: అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్ నామమాత్రమే అయినప్పటికీ తుది జట్టులో మార్పులు ఎందుకు చేయలేదని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొత్తవారికి అవకాశం ఇస్తే జట్టులోని పాత ఆటగాళ్ల స్థానాలకు ముప్పు వస్తుందని టీమ్ మేనేజ్మెంట్ భయపడుతోందన్నారు. ‘రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు రాణిస్తే వేరే వాళ్లకు ఇబ్బందులు తప్పవు. అందుకే మేనేజ్మెంట్ మార్పులు చేసేందుకు అలసత్వం ప్రదర్శిస్తోంది. ఎలా ఆడినా సరే జట్టులో మాత్రం చోటు ఉండాల్సిందేనని కొంత మంది ఆటగాళ్లు భావిస్తున్నారు. పుజారా పరుగులు చేసినా, పాండే వికెట్లు తీసినా.. మేనేజ్మెంట్ ఫేవరెట్ బ్యాట్స్‌మన్, బౌలర్లను తప్పించాల్సి వస్తుంది. అందుకే మార్పులకు భయపడుతున్నారు’ అని ఈ మాజీ కెప్టెన్ విమర్శించారు. భారత జట్టు నిర్ణయాలను అవగాహన చేసుకోవడం చాలా కష్టమన్నారు. నిజాయితీగా చెప్పాలంటే వాళ్ల నిర్ణయాలు తికమకపెడుతున్నాయన్నారు. విశ్రాంతి ఇవ్వాలి... నాన్ స్టాప్‌గా క్రికెట్ ఆడుతున్న కొంత మంది ఆటగాళ్లకు టి20 ప్రపంచకప్‌కు ముందు కాస్త విశ్రాంతి ఇవ్వాలని గవాస్కర్ సూచించారు. రిజర్వ్ బెంచ్‌కు అవకాశాలు ఇవ్వకుంటే వాళ్లు ఇంకెప్పుడు ఆడతారని ప్రశ్నించారు. ‘ఈశ్వర్ పాండే న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. జింబాబ్వే టూర్లో రెండు మ్యాచ్‌లు ఆడిన పుజారాకు ఆ తర్వాత అవకాశమే ఇవ్వలేదు’ అని గవాస్కర్ అన్నారు. మరోవైపు జట్టులో మార్పులు చేయకపోవడాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి సమర్థించుకున్నాడు. ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసం పెరగాలంటే ఒకే రకమైన టీమ్ ఉండటం మంచిదన్నాడు. సంధి కాలాన్ని ఎదుర్కొంటున్న వన్డే జట్టు ఆసియా కప్‌లో పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందని చెప్పాడు. -
మేనేజ్మెంట్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు
1. మేనేజ్మెంట్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఎంవీపీకాలనీ/వెంకోజీపాలెం, మేనేజ్మెంట్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రాయూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు పే ర్కొన్నారు. ఎంవీపీకాలనీ సమత డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో సాక్షి దినపత్రిక, కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ వి ద్యపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మేనేజ్ మెం ట్కోర్సులతో పలు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. దేశ, విదేశీ సంస్థల్లో మేనేజ్మెంట్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీసిపోకుండా మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్నవారు కూడా మంచి వేతనాలు పొందుతున్నారని తెలిపారు. సమత కళాశాల లో మేనేజ్మెంట్విద్యార్థులకు నాణ్యమైన విద్య అం దిస్తున్నారని కొనియాడారు. సమత డి గ్రీ, పీజీ కళాశాల డెరైక్టర్ బి.మురళీకృష్ణ, అధ్యాపకు లు, పలు మేనేజ్మెంట్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
వారు....సర్వ భక్షకులు!
జంఝావతి ప్రాజెక్టు డ్యాం సైట్లో రూ.లక్షలు విలువ చేసే చెట్లు మాయం పట్ట్టించుకోని అధికారులు భూ ఆక్రమణలు జరుగుతున్నా కళ్లు మూసుకుంటున్న వైనం కిటికీలు, ద్వారబంధాలు పోతే పోలీసులకు ఫిర్యాదుచేసిన అధికారులు మాయమైన కంటైనర్, జీఐ పైపులపై విచారణ ఎందుకు చేపట్టరు? జంఝావతి జలాశయ పథకం ఇంజినీరింగ్ విభాగంలో కొందరు సర్వభక్షకులుగా మారారు. రబ్బర్డ్యామ్కు చెందిన సామగ్రిని, కంటైనర్, ఐజీ పైపులు, పాడైన గృహాల కిటికీలు, ద్వార బంధాలు ఇలా ఒకటేమిటి దొరినవాటిని దొరికినట్టు చుట్టేసిన వారు.. చెట్లను కూడా భక్షించారని సమాచారం. దీంతో పాటు భూ ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు కళ్లుమూసుకుని కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి వెనుక రాజకీయ నేతల హస్తం కూడా ఉంది. పార్వతీపురం, న్యూస్‌లైన్: జంఝావతి ప్రాజెక్టు డ్యాం సైట్లో వేలాది రూపాయల విలువైన చింత, మామిడి, కొబ్బరి, సపోటా చెట్లు మాయమయ్యాయి. సుమారు 30 ఏళ్ల క్రితం వేసిన చె ట్లను జేసీబీతో కూల్చి మాయం చేసినట్టు తెలిసింది. అయినా ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఓ అధికారి అండదండలతోనే ఇదంతా జరుగుతున్నట్లు కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుల అండదండలు, ఉన్నతాధికారుల మద్దతు ఉండడడం వల్లే ఇంత ధైర్యంగా ఒక్కొక్కటీ మాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యాలయంలో రబ్బరు డ్యామ్ నిర్మా ణం కోసం ఆస్ట్రియా శాస్త్రవేత్తలు వినియోగించిన సుమారు రూ. 40 లక్షల విలువచేసే కంటైనర్, జీఐ పైపులు 2013 జూలైలో మాయమైనా ఇంతవరకూ శాఖాపరంగా ఎలాంటి విచారణ చేపట్టలేదు. దీంతో ఏంచేసినా పరవాలేదులే అన్న ధీమాకు అక్కడి సిబ్బంది చేరుకున్నారు. అందినకాడికి దోచుకోడానికి అలవాటుపడ్డారు. కొంతమంది ఇంటి దొంగలే దర్జాగా స్వాహా చేసేస్తున్నారు. అంతేకుండా ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి గత కొన్నేళ్లుగా అవినీతి రాజ్యమేలుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. 2010లో జంఝావతి కాలువల్లో పూడికలు తీయకుండా నే పనులు జరిగినట్లు రూ. 50 లక్షలు డ్రా చేశారు. వీటికి సంబంధించిన మెజర్‌మెంటు బుక్‌లను అప్పట్లో డీఈఈగా పనిచేసిన వ్యక్తి మాయం చేశారు. దీనిపై కేసు నడుస్తున్నప్పటికీ నేటికీ విచారణ చేపట్టలేదు. అంతేకాకుండా 1975లో జంఝావతి డ్యాం నిర్మాణం కోసం వినియోగించే వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోసేందు కు సుమారు అర ఎకరా స్థలంలో పెట్రోల్ బంకును ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ స్థలం కూడా ఆక్రమణలకు గురయ్యింది. దీని వెనుక పర్యవేక్షణాధికారి అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. తవ్వుకుంటూ పోతే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత జరిగినా పట్టించుకోని పర్యవేక్షణాధికారి ఈ కార్యాలయానికి సంబంధించి తలుపులు, ద్వార బందాలు పోయినట్లు మాత్రం కొమరాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాని లక్షల రూపాయలు విలుచేసే సామగ్రి దొంగల పాలైనా ఇటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గానీ, శాఖాపరమైన దర్యాప్తు గానీ చేయకపోవడం విచారకరం. దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లు మాయం కాలేదు ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో చెట్లు మాయంపై వివరణ కోరగా అటువంటిదేమీ లేదని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఒక చెట్టు పడిపోయింది తప్ప, ఎవరూ చెట్లను నరికి తీసుకుపోలే దని చెప్పారు. -
ఉద్యోగులపై జీవీకే మాల్ యాజమాన్యం దాష్టికం
-
డీఎడ్ కళాశాలల్లో ‘మేనేజ్మెంట్’ దోపిడీ
=మేనేజ్మెంట్ సీట్ల పేరుతో వసూళ్లు =సీటు ఖరీదు రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలు నర్సీపట్నం, న్యూస్‌లైన్: డీఎడ్‌కు పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కన్వీనర్ కోటా పక్కన పెడితే మేనేజ్మెంట్ సీట్ల పేరుతో కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నాయి. అధిక మొత్తంలో గుంజుతుండటంతో పేద విద్యార్థులు డీఎడ్‌కు దూరమవుతున్నారు. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించడంతో విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. డీఎడ్‌కు ఇంటర్మీడియట్ అర్హతగా పరిగణించడంతో ఎక్కువమంది ఈ కోర్సుపై మక్కువ చూపిస్తున్నారు. బీఈడీతో పోలిస్తే డీఎడ్ కళాశాలలు తక్కువ స్థాయిలో ఉండటంతో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో కళాశాలల యాజమాన్యాలు సీట్ల భర్తీ విషయంలో కృత్రిమ కొరతను సృష్టిస్తూ విద్యార్థుల నుంచి భారీగా గుంజుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 17 కళాశాలల్లో ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క కళాశాలలో 50 సీట్లకు ప్రభుత్వం పరిమితం చేసింది. వీటిలో కన్వీనర్ కోటాగా 40, మిగిలిన వాటిని మేనేజ్మెంట్ సీట్లుగా భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్కూల్ అసిస్టెంట్లతో పోలిస్తే ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఏజెన్సీలో పోస్టులు సైతం ఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించడంతో వీరిలో ఎక్కువ మంది ఈ కోర్సులపై మొగ్గు చూపుతున్నారు. కన్వీనర్ కోటా విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఏటా విద్యార్థుల నుంచి రూ.12,500 వరకు వసూలు చేస్తున్నారు. మేనేజ్మెంట్ కోటా విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. నర్సీపట్నంలోనే రెండు ప్రయివేటు కళాశాలలున్నా, చుట్టుపక్కల విద్యార్థులకు తగ్గట్టు సీట్లు లేకపోవడంతో అధిక డిమాండ్ ఉంది. దీనిపై విద్యాశాఖాధికారులు దృష్టి సారించి మేనేజ్మెంట్ సీట్ల వసూళ్లపై నియంత్రణ విధించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఎన్డీఎస్ఎల్ ఖాయిలా?
సాక్షి, నిజామాబాద్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్.. చంద్రబాబు ధారాదత్తం చేసిన ఈ ఫ్యాక్టరీని దక్కించుకున్న యాజమాన్యం తాజా గా మరో ఎత్తుగడ వేస్తోందా? తమ ఫ్యాక్టరీని ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్పిం చి ప్రభుత్వం వచ్చే ప్రయోజనాలను కొట్టేసేం దుకు పావులు కదుపుతోందా..? పన్నుల మినహయింపులు, ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందేందుకు కిరణ్ సర్కారుపై ‘తమ దైనశైలి’ లో ఒత్తిడి తెస్తోందా? రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న తాజా పరిణామాలను లోతుగా పరిశీలి స్తే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరున్న ఈ ఫ్యా క్టరీని 2002లో చంద్రబాబు ప్రైవేటుకు ధారాదత్తం చేశారు. తెలంగాణ వారసత్వ సంపదగా నిలుస్తున్న ఈ కర్మాగారానికి బోధన్‌లో ప్రధాన యూనిట్ ఉండ గా, మెదక్ జిల్లా అంబోజీపేట్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిల్లో ఒక్కో యూనిట్ చొప్పున ఉన్నాయి. పస్తుత రోజుల్లో సుమారు రూ. 500 నుంచి వెయ్యి కోట్ల ఆస్తిపాస్తులు కలిగిన ఈ కర్మాగారాన్ని చంద్రబాబు నామమాత్ర మొత్తానికి ప్రైవేటీకరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ దీన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం శాసన సభాసంఘాన్ని వేశారు. ఇప్పుడు కిరణ్ సర్కారు మాత్రం ఎన్డీఎస్ఎల్ యాజమాన్యానికే మేలు చేకూర్చేలా చర్యలు చేపడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్డీఎస్ఎల్ను బీఐ ఎఫ్ఆర్ (పరిశ్రమల పునర్ వ్యవస్థీకరణ బోర్డు) పరిధిలోకి చేర్చేందుకు కిరణ్ సర్కారు నిర్ణయం తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశం మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినేట్ సమావేశంలో చర్చకొచ్చింది. బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వస్తే ప్రయోజనాలు.. ఏదైనా కర్మాగారం బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వస్తే దాని కి ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు అందుతాయి. వ్యాట్ వంటి పన్నుల నుంచి తాత్కాలికంగానైనా మినహాయింపులుంటాయి. అదేవిధంగా విద్యు త్ చార్జిల్లో రాయితీలు పొందవచ్చు. వీటితో పాటు గా ఈ బోర్డు నుంచి ప్రత్యేక రుణాలు పొందడమే కాకుండా, వడ్డీ రాయితీలుంటాయి. ఈ ప్రయోజనాలను పొందేందుకు ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఈ కర్మాగారాన్ని నడపడంతో నష్టాల పాలవుతున్నామని ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పించిందని రైతులు ఆరోపిస్తున్నారు. చెరుకు సాగు విస్తీర్ణం కూడా తగ్గిందని సర్కారు నివేదిక ఇచ్చిందని, విస్తీర్ణం తగ్గడానికి యాజమాన్యం ధోరణే కారణమని రైతులు వాపోతున్నారు. రైతుల ప్రయోజనాలు, ఈ ఫ్యాక్టరీ నిర్వహణ, కార్మికుల పరిస్థితులు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. క్రషింగ్‌పై రైతుల్లో ఆందోళన ఎన్డీఎస్ఎల్ను ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్చితే ఈ కర్మాగారాన్ని మూసివేస్తారని చెరుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీ బీఐఎఫ్ఆర్ పరిధిలో వస్తే లాకౌట్ అయ్యే అవకాశాలు లేవని కేన్ కమిషన్ ఉన్నతాధికారులు పేర్కొం టున్నారు. వాస్తవానికి ఈ సీజనులో నవంబర్ 28 నుంచే చెరుకు క్రషింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ యాజమాన్యం ఈనెల రెండుకు వాయిదా వేసింది. అయినా క్రషింగ్ ప్రారంభం కాకపోవడం తో రైతులు ఆందోళన బాట పట్టారు. గత గురువారం బోధన్ బంద్ నిర్వహించారు. చివరకు శనివా రం నుంచి ఫ్యాక్టరీ అధికారులు క్రషింగ్‌ను ప్రారంభించారు. -
తుఫాన్ల తాకిడికి కుదేలవుతున్న మత్స్యకారులు