ఇంటర్న్‌షిప్‌ కెరీర్‌కు తొలిమెట్టు.. | first step to an internship career | Sakshi
Sakshi News home page

ఇంటర్న్‌షిప్‌ కెరీర్‌కు తొలిమెట్టు..

Published Tue, Jul 11 2017 12:07 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఇంటర్న్‌షిప్‌ కెరీర్‌కు తొలిమెట్టు.. - Sakshi

ఇంటర్న్‌షిప్‌ కెరీర్‌కు తొలిమెట్టు..

ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో తప్పనిసరిగా మారిన జాబ్‌ రెడీ స్కిల్స్, ప్రాక్టికల్‌ ఎక్స్‌పోజర్, రియల్‌ టైం ఎక్స్‌పీరియన్స్‌ను అందించేదే ఇంటర్న్‌షిప్‌. దీనివల్ల ఇటు విద్యార్థులు, అటు కంపెనీలకు మేలు చేకూరుతుంది. ఒక అభ్యర్థి కంపెనీలో ఇంటర్న్‌గా చేరిన తర్వాత అతని పనితీరు, యాటిట్యూడ్‌ నచ్చితేనే రిక్రూట్‌ చేసుకునే వెసులుబాటు కంపెనీలకు; పని, కంపెనీ వర్క్‌ కల్చర్‌ నప్పుతుందనుకుంటేనే ఉద్యోగంలో చేరే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది.

విద్యార్థుల్లో జాబ్‌రెడీ స్కిల్స్‌ పెంపొందించుకోవడంతోపాటు, ప్రాక్టికల్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవడం.. వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందడానికి ఇంటర్న్‌షిప్‌ ఉపకరిస్తుంది.  

మేనేజ్‌మెంట్‌ నిపుణులకు అకడమిక్స్‌ పరంగా క్లాస్‌రూంలో బోధించిన అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించగలిగే అవకాశం కల్పిస్తుంది ఇంటర్న్‌షిప్స్‌. ఎంబీఏ విద్యార్థులకు మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఆపరేషన్స్‌ వంటి విభాగాల్లో ఇంటర్న్‌షిప్స్‌ అవకాశాలు విస్తృతం. ఇంటర్న్‌షిప్‌ ప్రధాన ఉద్దేశం.. కోర్సు సమయంలోనే నిర్దిష్ట వ్యవధిలో ఓ కంపెనీలో పని చేయడం.

 ఇంటర్న్‌షిప్‌ సమయంలో సంస్థలు విద్యార్థుల అకడమిక్‌ నేపథ్యానికి అనుగుణంగా ఏదైనా విభాగంలో నియమించుకుంటాయి. కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థికి సదరు విభాగంలోని టీంలో ఇంటర్న్‌ ట్రైనీగా అవకాశం కల్పిస్తాయి. ఆ టీంకు కంపెనీ ఇచ్చిన అసైన్‌మెంట్‌లో పాల్పంచుకునే అవకాశం ఇంటర్న్‌ ట్రైనీలకు లభిస్తుంది. దాంతో విద్యార్థులకు తమ అకడమిక్‌ నేపథ్యానికి సరితూనే ప్రాక్టికల్‌ నైపుణ్యాలు సొంతం చేసుకునే వీలు లభిస్తోంది. ఇంటర్న్‌షిప్స్‌ కేవలం ఫైనల్‌ ఇయర్‌లోనే కాదు.. కాలేజీలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా చేసుకోవచ్చు.

ప్లేస్‌మెంట్స్‌ ద్వారానే
ఎంబీఏ విద్యార్థులకు వాస్తవ నైపుణ్యాలు ఉండడం లేదు. అధికశాతం మందిలో ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీల్లో మారుతున్న అవసరాలకు తగ్గట్లు పనిచేయడానికి పూర్తిస్తాయి సామర్థ్యం లేదు. తాజాగా వివిధ నివేదికలు వెలువరిచిన సమాచారం ఇది. మరోవైపు ఐఐఎంలు వంటి ప్రముఖ బీస్కూల్స్‌లో కోర్సు పూర్తిచేస్తే లక్షల్లోనే ప్యాకేజీలు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) లాంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చేరే విద్యార్థులు భారీ వేతనాలతో కేరీర్‌ ప్రారంభిస్తుంటే.. స్థానిక  కాలేజీల్లో చేరే విద్యార్థులు ఉద్యోగాల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర సంస్థలు పేరున్న కాలేజీల నుంచే విద్యార్థులను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. కొంతమందికి ఇంటర్న్‌షిప్‌ పేరుతో ఆఫర్‌ లెటర్లు ఇచ్చి, తర్వాత స్వల్ప కాలవ్యవధిలో పనితీరు నచ్చితే భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. మరి కొంతమందికి నేరుగా ఆఫర్‌ లెటర్లు జారీ చేస్తుంది. మొత్తమ్మీద టాప్‌ కంపెనీలు తమతో టచ్‌లో ఉండే ఇన్‌స్టిట్యూట్లకు వెళ్లి వారికి అవసరమైన, మెరుగైన మానవ వనరులను రిక్రూట్‌ చేసుకుంటున్నాయి.

ఇంటర్నెట్‌ ఆయుధంగా
టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లోకి కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ కోసం వస్తున్నాయి.. సరే మిగతా కాలేజీల్లో చదివే విద్యార్థుల పరిస్థితి ఏంటి? వీరికి టాప్‌ కంపెనీల్లో అవకాశాలు రావా? అంటే.. కొంత కష్టమే అయినా అసాధ్యమైతే కాదని అంటున్నారు నిపుణులు. ఎప్పటికప్పుడు సంబంధిత కంపెనీల వెబ్‌సైట్లను చూస్తూ ఖాళీలు ఏర్పడినప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్న్‌షిప్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్స్‌ చేయాలనుకునే అభ్యర్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకోవడానికి ఇంటర్నెట్‌ సరైన మార్గం అంటున్నారు. దీనిద్వారా టాప్‌ కంపెనీలు మొదలు స్టార్టప్‌ కంపెనీలు పోస్ట్‌ చేసే ఖాళీల గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జాబ్‌పోర్టల్స్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్‌ వెతిక పెట్టడంలో  ముందుంటున్నాయి.

డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌
మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌ ఆధారంగా, దాని నేపథ్యానికి సరితూగే సంస్థలు, విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రయత్నించాలి. ఇంటర్న్‌షిప్‌ ద్వారా రియల్‌ టైం నాలెడ్జ్, ప్రాక్టికల్‌ ఎక్స్‌పోజర్‌తోపాటు డెసిషన్‌ మేకింగ్, అనలిటికల్‌ స్కిల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. కంపెనీలకు ఎదురవుతున్న సమస్యలు, వాటికి ఆ రంగంలోని నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు తెలుసుకునే వీలు లభిస్తుంది.
 
ఇంటర్న్‌షిప్‌లో ఇలా

రియల్‌ టైం ఎక్స్‌పోజర్, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌తోపాటు ఇంటర్న్‌షిప్‌ సమయంలో విద్యార్థుల పనితీరు కూడా కెరీర్‌కు చక్కటి మార్గం వేస్తుంది.  ఇంటర్న్‌షిప్‌ సమయంలో సదరు టీం మెంబర్‌గా చొరవ, అంకిత భావం, నేర్చుకునే తత్వం, బృందంతో కలిసి పనిచేసే నైపుణ్యంతో చక్కగా వ్యవహరిస్తే సంస్థ యాజమాన్యం నుంచి ఆఫర్‌ లెటర్‌ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఐఐఎంలు, ప్రముఖ ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ పేరిట ఈ సంస్కృతి ఇప్పటికే ఉంది. ఇంటర్న్‌షిప్‌ వ్యవధి కొద్ది రోజులే ఉన్నప్పటికీ.. విద్యార్థులకు బంగారు అవకాశమిది. ఇంటర్న్‌గా అభ్యర్థులను కంపెనీ ప్రతినిధులు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. ఇంటర్న్‌షిప్‌ సమయంలో అభ్యర్థులకు ఆర్థిక సహకారం కూడా అందిస్తారు. కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ తర్వాత ఉద్యోగం ఆఫర్‌ చేసినా, చేయకున్నా రికమెండ్‌ చేస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. ఇవి భవిష్యత్తు ఉద్యోగాన్వేషణలో కీలకంగా ఉంటాయి.

కాలేజీల పాత్ర కీలకం
మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్‌ తీసుకురావడంలో ఆయా కాలేజీల పాత్ర కీలకం. సదరు కాలేజీకి ఉండే ఇండస్ట్రీ రిలేషన్‌షిప్స్‌తో కంపెనీలు కాలేజీ విజిట్‌ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో ఇంటర్న్‌షిప్స్‌ కోసం ప్రయత్నించాలి. కోర్సులో చేరినప్పటి నుంచి ఈ దిశగా ప్రయత్నించాలి. ఫైనలియర్‌ విద్యార్థులు నవంబర్, డిసెంబర్‌ కల్లా దరఖాస్తు చేసుకోవాలి. పెరిగిన విద్యార్థుల సంఖ్య దృష్ట్యా అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. సీరియస్‌గా ప్రయత్నించే వారే అవకాశాలను అందిపుచ్చుకోగలరు. ప్రస్తుతం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రిటైల్‌ ఇండస్ట్రీల్లో మెరుగైన ఇంటర్న్‌ అవకాశాలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement